డా॥చేవులపల్లి రామానుజరావు
గ్రంథావళి
ప్రధాన సంపాదకులు
డా॥ సి.నారాయణరెడ్డి
అధ్యక్షులు, తెలంగాణ సారస్వత పరిషత్తు
సంపాదకులు
డా.జె.చెన్నయ్య
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ సారస్వత పరిషత్తు
ప్రచురణ
తెలంగాణ సారస్వత పరిషత్తు
తిలక్‌రోడ్, అబిడ్స్
హైదరాబాద్ - 500001
ఫోన్ : 040-24753724
DR.DEVULAPALLI RAMANUJARAO GRANDHAVALI
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారి ఆర్థిక సహాయంతో ప్రచురితం
First Edition: August 2017
© Telangana Saraswatha Parishath
Copies : 1000
Price : 300/-
For Copies
Telangana Saraswatha Parishat
Tilak Road,Abids,
Hyderabad - 500001
Ph : 040-24753724
DTP : Lakshmi Srinivas
9885021639
Printed at
Sai Likhita Printers
Khairatabad, Hyderabad
Ph : 040- 65545979
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్
డాక్టర్ సి.నారాయణరెడ్డి, ఎంఏ. ౫...
అధ్యక్షులు
తెలంగాణ సారస్వత పరిషత్తు
తిలక్‌రోడ్, హైదరాబాదు - 500 001.
ఫోన్ : (ఆ) 24753724
అవతారిక
తెలంగాణలో తెలుగు భాషా సంస్కృతుల పరిపోషణకు వ్యాప్తికి, వికాసానికి
జీవిత పర్యంతం దక్షతతో అవిరళంగా కృషి చేసిన చిరస్మరణీయులు డా॥ దేవులపల్లి
రామానుజరావుగారు. న్యాయ శాస్త్రంలో పట్టభద్రులైనప్పటికీ న్యాయవాద వృత్తిగాని,
ఆనాడు సులభంగా లభించే ఉన్నత ప్రభుత్వాంగ పదవిగాని చేపట్టకుండా ఈ రంగాల
పురోభివృద్ధికి అంకితమైన అసాధారణ వ్యక్తి ఆయన. విద్య, గ్రంథాలయాలు,
సహకారం, పత్రికారచన, రాజకీయాలు వంటి రంగాలకు కూడా సేవలందించి
నప్పటికినీ తెలుగు భాషా సాహిత్య కళా సంస్కృతుల అభ్యుదయానికే ఆయన
అత్యంత ప్రాధాన్యమిచ్చినారు.
డా॥ రామానుజరావుగారు ఉత్తమ వ్యాసకర్త, కవి, పత్రికా రచయిత. “శోభి
సంపాదకులుగా, “గోలకొండ పత్రిక సంపాదకీయవర్గ సభ్యులుగా, ఆయన రచనలు
ఉన్నత ప్రమాణాలు సంతరించుకుని అందరి అభిమానాలు చూరగొన్నవి. సుదీర్హ
సాహితీ ప్రస్థానంలో కేవలం సుమారు 20 (గ్రంథాలు మాత్రమే రచించినారు.
స్వయంగా రచనలు చేయటం తగ్గించుకుని భాషా సాహిత్య సంస్థల నిర్వహణలో
కాలాన్ని కర్పూరం చేసి ఎందరో సాహితీవేత్తల రచనలకు ఆయన వెలుగుచూపినారు.
ఆయన సాహిత్య వ్యాసాలు, జానపద విజ్ఞానం, జీవిత చరిత్ర, సాంస్కృతిక
పునరుజ్జీవనం, జాతీయోద్యమం వంటి ప్రధానాంశాలతో సప్రమాణంగా తమ పరిమిత
గ్రంథాలను రూపొందించినారు.
తెలుగుభాషా సాహిత్య కళాసంస్కృతుల వికాసాభ్యుదయాలకై కృషి చేసే అగ్రేసర
సంస్థగా నిలిచిన తెలంగాణ సారస్వత పరిషత్తు 1943లో రూపుదిద్దుకున్న దశ
నుంచి డా॥ రామానుజరావుగారు దానిని బహుముఖీనంగా విస్తృతపరిచి తెలుగు
పరీక్షలు, బోధన, గ్రంథ ప్రచురణ, సాంస్కృతిక కార్యక్రమ నిర్వహణలతో దానిని
ఆదర్శవేదికగా తీర్చిదిద్దినారు.
1917 ఆగస్టు 25న వరంగల్ జిల్లా బొల్లికుంటలో జన్మించిన డా. రామానుజరావు
గారి శతజయంతిని సారస్వత పరిషత్తు సంవత్సరం పొడవునా ఘనంగా నిర్వహిస్తున్నది.
తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. 25.08.2017న
శతజయంతి పరిపూర్తి ఉత్సవంలో ఆయనపైన ప్రచురించిన ప్రత్యేక సంచిక
విడుదలవుతుంది. ఆనాటి కార్యక్రమంలో వరిషత్తు ప్రాంగణంలో డా!
రామానుజరావుగారి కాంస్య విగ్రహావిష్మరణ ప్రత్యేకాంశం.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన చారిత్రక ఘట్టాన్ని పురస్మరించుకుని
తెలంగాణ వైభవోన్నతికి దర్చణంగా తేజరిల్లే 15 ప్రత్యేక గ్రంథాలను పరిషత్తు ఇప్పటికే
ప్రచురించింది. డా॥ రామానుజరావు 'యాభై సంవత్సరాల జ్ఞాపకాలు’ గ్రంథం వీటిలో
ఒకటి. శతజయంతి సందర్భంగా అలబ్ధమైన ఆయన ఎనిమిది లఘు గ్రంథాలను
సంకలనం చేసి 'డా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి పేరుతో ఒక బృహధద్దంథం
ప్రచురించినాము. ఈ సంకలనంలో చేర్చినవి :
హైదరాబాదులో స్వాతంత్ర్యోద్యమము (సమీక్ష్య;
మన కళాసంపద - సాహిత్యము (వ్యాససంపుటి);
భక్తి తత్త్వకవులు - సామాజిక భూమిక (ప్రసంగ వ్యాసం);
సారస్వత నవనీతము (వ్యాససంపుటి);
పచ్చతోరణము (ఖండకావ్య సంపుటి);
వ్యాస మంజూష (వ్యాస సంపుటి);
భారత స్వాతంత్ర్యానికి పూర్వం తెలుగులో పత్రికా రచన (ప్రసంగ వ్యాసం)
మన దేశం - తెలుగుసీమ (విశేషవ్యాసం).
ఈ కృతులలో డా॥ రామానుజరావుగారి విస్తృత విషయ పరిజ్ఞానం, భావుకత,
విశ్లేషణ పాటవం, శైలీసారళ్యం, అభివ్యక్తిగరిమ ప్రస్ఫుటమవుతాయి.
డా॥ దేవులపల్లి రామానుజరావు శతజయంతి సందర్భంగా పరిషత్తు
వెలువరించిన ఈ గ్రంథం సాహిత్యాభిమానులందరి మన్ననలను పొందగలదని
విశ్వసిస్తున్నాను. =
ముగా న్
(సి.నారాయణరెడ్డి)
హైదరాబాద్. అధ్యక్షులు
2017. తెలంగాణ సారస్వత పరిషత్తు
డా॥ జెచెన్నయ్య
ప్రధాన కార్యదర్శి
తెలంగాణ సారస్వత పరిషత్తు
తిలక్‌రోడ్, హైదరాబాదు - 500 001.
ఫోన్ : (ఆ) 24753724
తెలుగుభాషను, సాహిత్యాన్ని కళాసంస్కృతులను పరిరక్షించేందుకు, ఆయా
రంగాల్లో విశేషమైన కృషి చేస్తున్న వారిని ప్రోత్సహించేందుకు, గౌరవించేందుకు
గత ఏడు దశాబ్దాలుగా సారస్వతపరిషత్తు శక్తివంచనలేకుండా పాటుపడుతున్నది.
స్థాపించిన పెద్దలను, వారందించిన సందేశాన్ని స్మరించుకుంటూ వారి ఆశయాన్ని
కొనసాగిస్తున్నది. 1943 మే 26న ఏర్పడిన నిజాము రాష్ర్రాంధ్ర సారస్వత పరిషత్తు
కొంతకాలానికి ఆంధ్ర సారస్వత పరిషత్తుగా మారింది. ఇటీవలి కాలంలో తెలంగాణ
ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన సందర్భంలో ఇక్కడి ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ
ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరును తెలంగాణ సారస్వత పరిషత్తుగా మార్పు చేయడం
జరిగింది. తెలంగాణ భాషా సాంస్కృతిక అభ్యుదయం కోసం ప్రత్యేక కార్యక్రమాలు
నిర్వహించాలని నడుముకట్టింది పరిషత్తు. ఆ కోవలో ప్రత్యేక ప్రచురణలు సైతం
తెస్తున్నది. తెలంగాణ చరిత్ర, తెలంగాణ సాహిత్యచరిత్ర, సురవరం ప్రతాపరెడ్డి
వ్యాసాలు, తెలంగాణ గిరిజన భాషా సాహిత్యాలు, కుతుబ్‌షాహీల తెలుగు సాహిత్యసేవ
మొదలైన ప్రచురణల్ని వెలువరించింది.
తొలినాళ్ళలో పరిషత్తుకు మార్గనిర్దేశం చేసిన పెద్దలు సురవరం ప్రతాపరెడ్డి,
మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, బిదురు వెంకటశేషయ్య,
కాళోజి నారాయణరావు, లోకనంది శంకరనారాయణరావు వంటివారు స్మరణీయులు.
వారి కోవలో చెప్పుకోవలసిన మహనీయులు డా॥ దేవులపల్లి రామానుజరావు.
1946లో కార్యవర్గ సభ్యుడైంది మొదలు 1993లో కన్నుమూసేదాకా ఆయన తమ
యావచ్చక్తిని సారస్వత పరిషత్తు దీపాన్ని అఖండంగా వెలిగించడం కోసమే
వెచ్చించారు.రామానుజరావు 1917 ఆగస్టు 25న జన్మించారు. 2017 ఆగస్టు 25
నాటికి నూరేళ్ళు పూర్తవుతుంది. ఈ సందర్భం పరిషత్తుకు ప్రత్యేకమైంది. అందుకే
2016 ఆగస్టు 24న రామానుజరావు 99వ జయంత్యుత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా
ఘనంగా వారి శతజయంతి ఉత్సవాన్ని నిర్వహించాలని అధ్యక్షులు, జ్ఞానపీఠ
పురస్మారగ్రహీత డా.సి. నారాయణరెడ్డిగారి ఆధ్వర్యంలో సమావేశం నిర్ణయించింది.
ఆ నిర్ణయాన్ని అనుసరించి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.
రామానుజరావు జన్మస్థలమైన వరంగల్లులో శతజయంత్యుత్సవాలను ఘనంగా
జరిపాం. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాదుల్లో కార్యక్రమాలు జరిగాయి.
ఆదిలాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి జోగురామన్న సిద్ధిపేటలో జరిగిన
ఉత్సవంలో మంత్రి టి.హరీష్‌రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అంతటా
పెద్దతరమే గాకుండా నేటితరం ముఖ్యంగా భాషాసాహిత్యాల విద్యార్థులు, యువ
పరిశోధకులు సదస్సుల్లో పాల్గొన్నారు. సదస్సు పత్రాలను ప్రత్యేక సంచికగా
తీసుకొస్తున్నాం.
పరిషత్తు ప్రాంగణంలో డా. దేవులపల్లి రామానుజరావు విగ్రహం ప్రతిష్టించడానికి
ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామానుజరావు రచనల పునర్ముద్రణ కూడా మరొక
ముఖ్య కార్యక్రమం. కొన్ని రచనలు ఇంతకుముందే పరిషత్తు ముద్రించింది. అలబ్ధంగా
వున్న వాటిని ప్రస్తుతం “డా. దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి” పేరుతో ఒక
సంపుటిగా తీసుకొస్తున్నాం. రచనల పునర్ముద్రణ ఎంపిక సంఘం సభ్యులుగా
వ్యవహరించిన ప్రముఖ సాహితీవేత్తలు తెలంగాణ సారస్వతపరిషత్తు కార్యవర్గ సభ్యులు
ఆచార్య ఎస్వీ రామారావు, ఆచార్య రావికంటి వసునందన్‌గార్లకు, గ్రంథాలను
సాకల్యంగా చదివి తగిన సూచనలు అందించిన డా. శ్రీరంగాచార్యగారికి ధన్యవాదాలు.
ఈ సంపుటం సిద్ధమవుతున్న దశలో డా.దేవులపల్లి రామానుజరావు సతీమణి,
ఆయన వంటి ఒక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచిన మహాసాధ్వి శ్రీమతి తాయమ్మగారు
96వ ఏట స్వర్గస్థులైనారు. 1993లో డా.రామానుజరావుగారు కాలధర్మం చెందినారు.
అమ్మ ఇప్పటివరకూ ఆరోగ్యంగానే ఉంటూ అందరినీ ఆదరించినారు. ఆమెకు
పరిషత్తు శ్రద్ధాంజలి ఘటిస్తున్నది.
తెలుగు పాఠకలోకానికి అందిస్తున్న డా. దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
సంపుటిలో డా.రామానుజరావు రచించినవి హైదరాబాద్‌లో స్వాతంత్రోద్యమం, మన
కళాసంపద, సాహిత్యము, భక్తితత్త్వకవులు - సామాజిక భూమిక, సారస్వత
నవనీతము, పచ్చతోరణము, వ్యాసమంజూష, భారత స్వాతంత్ర్యానికి పూర్వం
తెలుగులో పత్రికారచన, మనదేశం తెలుగుసీమ ఉన్నాయి.
పరిషత్తు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక
శాఖ ఉదారంగా పది లక్షల రూపాయలు వార్షిక గ్రాంటు అందజేస్తుంది. ఈ ప్రత్యేక
ప్రచురణలు ఆ నిధులనుండే వెలువరిస్తున్నాము. ప్రభుత్వానికి కృతజ్ఞతలు
తెలియజేస్తున్నాము. 2
(డా॥ జె.చెన్నయ్య)
'ప్రధాన కార్యదర్శి
తెలంగాణ సారస్వత పరిషత్తు
గ్రంథసూచిక
పచ్చతోరణము (ఖండకావ్య సంపుటి)....
సారస్వత నవనీతము (వ్యాససంపుటి) ...
వ్యాస మంజూష (వ్యాస సంపుటి)... ౨ 281
భక్తి తత్వ్వకవులు - సామాజిక భూమిక (ప్రసంగ వ్యాసం) .. 347
మన కళాసంపద - సాహిత్యము (వ్యాస సంపుటి) ........... 365
హైదరాబాదులో స్వాతంత్ర్యోద్యమము (సమీక్షు................ 409
మన దేశం - తెలుగుసీమ (విశేష వ్యాసం).................... 429
భారత స్వాతంత్ర్యానికి పూర్వం తెలుగులో పత్రికా రచన
(ప్రసంగ వ్యాసం) .............౨౨౨౨ 447
పీచ్చతోరణము
(ఖండకావ్య సంపుటి)
ఐదో ముద్రణ
(తొలిముద్రణ : 1952)
1. ఆముక్తమాల్యద...........ంంంంంం
2. విజయానందుడు .
83. ఓరుగల్లు .... .24
4. ఎన్ని జన్మాలబంధమో ! .27
ర్. (ప్రేమ గీతములు
6: కాపు; కన్నం పమ ము నము జనవ 33
7. మహాత్ముడు... 0౭౭౭000౭0 34
&. బీదా Tn 37
9:౨ తోడికోడలు... స re 39
ఉపసేచని
“నవాదః కర్తవ్యః కవిభి రనవద్యే స్వవిషయే” అకలుషితములైన స్వవిషయములను
కవులు శోషింప చేయకుండుటయే కర్తవ్యము అని ఆనందవర్ధనుని ఉపదేశము.
ఆత్మీయభావన ప్రచోదించినట్లు అభినవ కవులు తమ తమ భణితి భాష్యములను
రచనలో నడిపారు. వారిలో శ్రీ రామానుజరావుగారు గణుతికెక్కిన యువకవి.
పచ్చతోరణము అంతా పచ్చగాలేదు. అక్కడక్కడ కట్టెజ్జని రేకులున్నవి. అకలంక
ధవళములైన పత్రపుష్పాదులును కలవు. కదంబ కల్పనలో ఇలాంటి మి(శ్రరూప
రామణీయకం తప్పదేమో! ఎందుకంటే, ఆయా వర్తమాన సంనివేశ సంపర్మాలనుబట్టి
కవికంఠము ఉన్ముక్తమై మోగింది. అంతే కాని, ఏకవస్తు విన్యస్తంగా కావ్యరచనకు
శ్రుతి కాలేదు. చూడండి, మచ్చుకు మూడు:
'పైడిబొమ్మవు కావటే పడతినీవు
ఏల కాంచనహారము లింక నీకు,
నాడు బంగారు లేడికై నాథునంపి
అనుభవింపదె సీతమ్మ వనటలెన్నా.
ఈ పద్యంలో చక్కని నర్మశృంగారం ఒలికింది. సహజ సౌందర్యానికీ
కృత్రిమాలంకారాలకూ - సలక్షణ రూపవతులైన సాధ్వీ జనమునకూ, ఇతరులకూ
గల భేదం సూచ్యార్థంగా అభివ్యంజితమైంది. ఇక ధ్వనిముఖంగా, తన యభిమతమునూ-
కప్పిపెట్టి గుప్తా గుప్తంగా తన కావ్యస్వరూపమును అందించీ అందించకుండా వదిలి
వేశారు. అలాగే -
చీరసింగారములుచేసి, సిగ్గువీడి
గొప్పపదవుల యందున గుల్కి కూయు
పురుషభామామణుల యింటి తరుణులందు
ఖడ్గతిక్కనభార్య లొక్కరును లేరు.
ఇది గాటైన కారము పెట్టిన గారెముక్కలాగా చవులూరుతున్నది. నేటి గొప్పవాడి
భోగసంపత్తు లిందు వర్ణితములు. అయితే, ఆ సంపద్భోగములు జాతికి అసహ్య
లజ్ఞాకరములుగా ఉన్నవని వ్యంగ్యార్థం ఫలిస్తున్నది. ఈ భావం చెప్పకుండా చెప్పారు.
అంతేకాదు, యైశ్వర్యమును వారు సమార్జించిన విధానమును కూడ
గర్జితమయినదనే సూచన అవివక్షితంగా వదలివేశారు. కాగా, ఈ సంపదా, భోగమూ,
వారి ఆభిజాత్యమును, అభిమానమును, ఆక్లీబ నిసర్గములగు సాహసశీలాది
జీవద్దుణములను, నమిలి తినివేసిందని గమ్యమాన మవుతున్నది. చివరకు ఖడ్గతిక్కన
కళత్ర ప్రసక్తిలో ఆంధ్ర కుటుంబములలో, కులాంగనలలో, ఈ పురుషభామామణుల
భోగభాగ్యములు జాతికే మాయనిమచ్చలాగా పరిణమించినవని ధ్వనింపచేశారు.
వ్యంగ్య భూమికలో తాడనము తీక్షణంగా ఉన్నా వాచికంలో ప్రసన్నత సడలలేదు.
ఇట్టి ప్రౌాఢరచనా చరణములు కావ్యాదులలో కాదాచిత్మంగా లభిస్తవి.
ఉడుకూ ఉద్వేజనం ఇలా కజకుగా ఉన్నా బీదకాపు సంపన్న హృదయం
చూడండి.
ఆ నంనివేశమూ-వరికరమూ కూడా-కానరాని కఠోర తవనతో
కనకనలాడుతున్నవి. పాషాణాలు కూడా ఆ ప్రత్యుష్కర్షకు మథిగి, కటిగి పోతున్నవి.
ఆకొన్నపక్షులు ఎండిన వరియెన్నులమీద వ్రాలినవి. గింజలు లేనందున అవి తినడాని
కేమీ లేకపోయింది. వాటి ఆకలి తీరలేదు. కరుణ కరుణమైన ఆ కఠిన దుర్దశకు
తన దారిద్యమే హేతువని పరితపిస్తాడు బీదకాపు. ఇతని హృదయంలో బీదతన
మున్నదా!
అలాగే 'సుజాతిలో అంతః కల్మషాలను కడిగివేసే కరుణరసము -
మంచుకొండమీద సెలయేటి శిశిర బుతూదకమువలె వణికించి స్తంభింపజేస్తున్నది.
“బిడ్డలు లేని బ్రతుకు లేబరముకాగా (ఒక) నిర్భాగ్యురాలు సంసారసుఖమే
వలదని నిర్వేదిస్తుంది. 'దేవీ! నాకిప్పుడు భిక్ష నీయవా” యని ప్రణతిచేసి మౌనము
పూనింది. కన్నులు మాటలాడినవి. నెల తప్పింది. నెల పొడిచినట్లు తొలిచూలొదవింది.
ఒక సాయంతనపువేళ, తటిపి బట్టెల పాలను, ద్రాక్ష పండ్లను తీసికొని ఆమె దేవికడకు
పోవుచుండగా... చిక్కి చివికియున్న (ఒక) రాకుమారుని దారిలో చూచింది.” అప్పటి
ఆమె మనో వాక్కాయాఖి వర్ణనం గుణోదాత్తంగా స్ఫురితమయింది. 'ఆలయము
వంకకు (అసలు) ముందునకే అడుగు పెట్టనేరక - ఇంటిలో చంటిబిడ్డను కూడా
విస్మరించింది - స్మృతిలేక పడియున్న వాని పెదవులలో పాలబొట్లు ఒక్కటొక్కటిగా
రాల్చింది. అతడు కన్ను లల్లన విప్పి, శిరము నెత్తి - ఇలా అన్నాడు: “మాతా! నే
నిప్పుడు (ప్రేమవృత్త మెటిగితిని. ఇక లోకమెల్ల నా కుటుంబమే యగును. మరుజన్మ
కలిగెనేని నీ కడుపున పుట్టగోరుదును. నాకిక (ప్రేమయే మతము.” (ఈ అనువాకము
కవివాక్య ఘటితమే.) ఇది కథాంశము. రసపోషణకు ఉపచారకములగు విభావానుభావ
యోజన మలా ఉంచుదము. అపత్యగ్రంథి మోక్షణమున గాని పూర్ణ ప్రేమావిష్కారము
కాదు అను ఉపదేశము వ్యంగ్యంగా భాసించినది. ఇదే కాంతా సమ్మితమైన
ఉపదేశమంటే.
తినబోయే వారికి రుచులు చెప్పడం తప్పేమో! కాని నేటి నాగరికుల విందులలో
శాకపాక పట్టికను ముందుపెట్టుట ఆచారం. అలాగే రామానుజరావుగారి పాకము
నుండి రెండుమూడు గిన్నెల రుచి చూపడానికి ముందు పెట్టాను. ఈ కవి కావ్యకృషి
వదలడం తెలంగాణపు తేనె మాగాణికి తీరని కొరత కాక తప్పదు. అయినా వేమన్న
అన్నట్లు “గంగగోవుపాలు గరిబెడైన' దొరికినవి. తనిసి తనియక విరమింతును.
- రాయప్రోలు సుబ్బారావు
పండితాభిప్రాయములు
పచ్చతోరణము ఎన్నటికిని పచ్చతోరణమేకాక పచ్చల తోరణము ఇటుల
మీరొనర్చు కబ్బపు విందులకు నాది పిలువని పేరంటము.
29.10.53 వేలూరి శివరామశాస్త్రిగారు
పచ్చతోరణము నిజముగా ఎప్పటికి కాంతి చెడనీ, పచ్చదనము మాయనీ,
నవ్యత పసివాడనీ పద్యాల పచ్చతోరణమే. ఓరుగల్లుమీద ఇది వర కెందరో వ్రాశారు.
అందరు వ్రాసినా మీ పద్యాలలో కొత్త పోకడలూ, హృద్యములైన భావములూ కనబడి,
మనస్సుకు ప్రమోదము కలిగిస్తూనే ఉన్నవి. “పురుష బామామణుల వంటి
తరుణులందు ఖడ్గ తిక్కన భార్య లొక్కరును లేరె?” ఎంత చక్కగా చెప్పారండీ! చాలా
రమ్యముగా ఉంది, నీరాజనము, సంక్రాంతి, అనార్మలీ, మూగబిడ్డ - ఒకటేమిటి,
అన్నీ అప్పుడే వికసించి పరిమళము వెదజల్లే మల్లె పూలలా వున్నాయి.
22.158 మల్లంపల్లి సోమశేఖరశర్మగారు
పచ్చతోరణం - ఇది చక్కని ఖండకావ్యముల తోరణం. సుమారు ఇరువది
రేకలు పూవులు గుదదిగూర్చబడ్డాయి ఈ తోరణంలో. ఆచార్య రాయప్రోలు
సుబ్బారావుగారి పరిచయ వాక్యం వుంది - తోరణం అందచందాలను లవమాత్రంగా
నిరూపించి పఠితలకు ఆసక్తిగలిగించేందుకు రామానుజరావుగారు సుప్రసిద్ధులగు
తెలంగాణా కవులు. స్వయంప్రకాశమైన (ప్రతిభగల కవిపుంగవులు, మృదువులైన
పదములతో ఒయ్యారముగా నడచింది మధురాతి మధురమైన వీరి కవితాకుమారి.
ఈ పచ్చతోరణములో అంతయు పచ్చయే కాద్యు వివిధ రంగుల పుష్పాలు,
వివిధములగు సువాసనలతో రసిక హృదయములకు ఆహ్లాదము కూర్చునది.
రసపిపాసులు చదివి ఆనందించండి.
14.02.53 కృష్ణాపత్రిక
IS
బహుముఖమైన ప్రజాహిత జీవితం సమకూర్చిన మహత్తరానుభూతితో, స్వభావ
మృదులమైన హృదయం వెలార్చిన రసావేశంతో శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు
తీర్చదిద్దిన కవితాసంపుటి ఈ “పచ్చతోరణం”. ఇది తెలుగునాటి వాకిటి పచ్చతోరణం
వలె 'అంతా పచ్చగా లేదు. అక్కడక్కడ కట్టెర్రని రేకులున్నవి; అకలంక ధవళములైన
పత్రపుష్పాదులును కలవు” శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారు తమ '“ఉపసేచనిలో
అన్నట్లు. ఆయా వర్తమాన సన్నివేశ సంపర్మాలను బట్టి కవి కంఠము ఉన్ముక్తమై
మోగింది.
6.02.54 కృష్ణాపత్రిక
మీ కవిత్వము మిక్కిలి సరళముగా సుందరముగా ఉన్నది. ఎట్టి గంభీరభావము
నైనను మీరు తేలికగా రెండు మాటలలో వ్యక్తము చేయగలరు. పలుకుబడియు
జాతీయమై, తెనుగుదనమును ప్రస్స్ఫుటము చేయుచున్నది.
31.12.52 పింగళి లక్ష్మీకాంతం
ప్రకాశకీయం
సమస్త కళలకు కేంద్రంగా రుద్రప్రతాపాలకు మూలంగా తెలుగు సాంస్కృతిక
వైభవాలకు పతాకంగా జీవన సౌందర్యానికి గుణాలయంగా కాకతీయ సామ్రాజ్యానికి
రాజధానిగా భాసించిన ఓరుగల్లు పురంలో జన్మించి సకల సౌభాగ్య విజ్ఞాన
యశోవల్లరులకు కేంద్రమై భాసించిన హైదరాబాదులో ఉన్నతిగాంచి మూడురకాల
ప్రభుత్వాల విధానాలు అనుభవించి ఆంధ్రభాషాభిమానం ప్రజ్వరిల్లగా ప్రతిష్టాత్మక
జీవితం గడిపిన 70 సంవత్సరాల యువకుడైన డా॥ శ్రీ దేవులపల్లి రామానుజరావు
గారిని ఎరుగని రాజనీతిజ్ఞులు - కవిపండితులు - కళాకారులు లేరన్నది తెలిసిన
సత్యమే పునరుక్తమవుతున్నందుకు మన్నించగోరుతున్నాను. సకలభారతస్థాయిలో
సమున్నతులైన హుమాయూన్ కబీర్ వంటి విద్యావేత్తలలోనేగాక సర్వప్రపంచ
స్థాయినందిన విజ్ఞానమూర్తులగు మార్తాండ బింబసద్భశుడైన సర్వేపల్లి రాధాకృష్ణ
పండితులు (భారత రాష్ట్రపతులు) రామానుజరావుగారి సేవలను ప్రశంసించిన
సంఘటనలు లోకం గమనించిన సంగతే.
తెలుగు-ఉరుదూ-ఇంగ్లీషు భాషలలో అనర్గళంగా మాట్లాడడమూ వేగంగా
వ్రాయడమూ నేర్చిన వస్తాదు. బి.ఎ.ఎల్.ఎల్.బి. అయినా కలహాలలో తలదూర్చని
న్యాయమూర్తి. నిష్కళంక సాహిత్యవేత్తగా ఆంధ్రసాహిత్య పరిషదుద్యాన మాలిగా
జ్ఞానమకరందాకృతిలో వెలుగుతున్న రామానుజరావుగారి పచ్చతోరణాన్ని మూడవ
ముద్రణగా మా శ్రీదేవి పబ్లికేషన్స్ వివిధ సాహిత్య సంస్థలు సన్మానించే లక్ష్యంలో
వీరు రచించిన అమూల్య గ్రంథాలను తిరిగి ముద్రింపచేయాలన్న నిర్ణయంలో
భాగంగా మా పబ్లికేషన్ ద్వారా ఈ “పచ్చతోరణం” ఖండకావ్యాన్ని నాలుగో ముద్రణగా
ప్రకటిస్తున్నాం.
డా॥ రామానుజరావుగారు మాకీ అవకాశం కలిగించారు. అందుకు మా
ధన్యవాదములు. సన్మాన సంఘానికి మా కృతజ్ఞతలు.
నీలా గిరిధర్, బి.కాం.
19.08.1991
16
ఆముక్తమాల్యద
అరుణ రేఖలు తూరుపు నందగింప
నప్పుడే స్నాన మొనరించి యతివయోర్తు
తెల్ల చీరను ధరియించి నల్లరైక
దొడిగి కొప్పున పూవులు ముడిచికొనుచు.
కర్ణాగ్రములం గుల్కు గన్నేరు పూవులు
తాటంక శోభతో తగవులాడ
సీమంతచుంబియౌ శ్రీచూర్ణ తిలకంబు
సౌందర్యగరిమతో సరసమాడ
గాలి సోంకుటచేత కదలెడు ముంగురుల్
కనుబొమ్మలం జీరి గౌంగిలింప
చిన్నారిమోమున సిగ్గుల మొగ్గలు
ఉయ్యాల జంపాల లూంగుచుండ
అంగకంబుల పరువంబు తొంగి చూడ
మలంగి యిటునటు తిలకించి తలుపు మూసి
నిలువుటద్దంబు కెదురుగా నిలిచియుండి,
పాలవెల్లిని విడివచ్చు పద్మపగిది.
చిలుకకొయ్యన విలసిల్లు నలరుదండ
అల్లనల్లన గ్రహియించి యజుతందాల్చి
ఆత్మ సౌందర్యము న్లాంచి అతిశయాన
మురిసిపోవుచు నుండెడు మూర్తమందు.
గ
వచ్చతోరణము
డా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
ధవళయజ్ఞోపవీతము ద్వాదశోర్థ్వ
పుండ్రములు బ్రహ్మతేజము పుక్మిలింప
వనితవదనంబు వెంటనే వాడిపోవ
వైష్ణవోత్తము డొక్కండు వచ్చి చూచి
కోపవేగాన మాటాడనోపండయ్యె
కనులు రెండును నిప్పులకణిక లయ్యె
సుదతి యది చూచి భీతిల్లి గదిని వీడి
వెలుపలకు బోవ నుంకించు వేళయందు.
అపరాధంబపచారమంచు నతం డయ్యబ్బాక్షి నీక్షించి నీ
చపలస్వాంతము నేమనందు నకటా శామంతికా దామముల్
అపురూపంబుగ గ్రుచ్చితాహరికి; నీవవ్వాని నేండిట్టులన్
అపరిగ్రాహ్యముగా నొనర్చితె తనూజా, యెంతదౌర్భాగ్యుడన్.
కోరికలపంట బంగారుకూంతురంచు
తలంపుపూవులదందను దాల్చి యుండి
దోసములదొంతివై నాదు నాస లెల్ల
త్రుంచివైతు వటంచు నే నెంచనైతి.
అనుచు నేమేమొ వచియించు నవసరాన
కన్ను గొలుకుల నశ్రువు లారి తళ్కు
చెక్కులను జార, వదనంబు చిన్నవోవ
మారు మాటాడనేర కా, మధురమూర్తి.
నిల్చి, యట నుండ నోపక నిర్గమించి
అనుగు చెల్లెలివలెం బెంచు నలరుందోట
కరుగునెడ పల్కె యెచటికే అక్క యనుచు
పంజరంబున రాచిల్క పసిడిమొల్క
18
వచ్చతోరణము
మాధవుసేవకై మాలిక లర్చింప
నోచనైతి నటంచు నొచ్చుకొనుచు
నెత్తురు లొల్మెడు నిండుమనంబుతో
తనయ పోయెడు చొప్పు తలంచి తలంచి
ఎన్నాళ్ళనుండియో యీరీతి యాముక్త
దామంబు లర్చించుతప్పుజేయ
యేమి దలంచెనో యిందీవరాక్షుండు
తెలియనైతి నటంచు దీనుం డగుచు
కారుమబ్బులు హృదయంపు గగనమందు
తరుముకొని రాంగ నమ్మౌని తాళలేక
శిరము వాలిచి మోమున చేయిజేర్చె;
దేవపూజకు వేళ యతిక్రమించె.
నెమ్మనంబున నిప్పులు నిండుకొనంగ
యేమి చేయంగవలయునో యెరుగ కపుడు
చిత్రపటమునుబోలె నాసీనుండయ్యె
తాటియాకులచాపపై ధరణిసురుండు.
చల్లని సోగచూపులును చక్కని చామనచాయరూపమున్
పల్లవ కోమలంబులగు పచ్చనిచెక్కుల జారుచెమ్మటల్
ఫుల్లనవారవిందములపొల్పు హసించెడు పాదయుగ్మమం
చల్లన మోయునందియలు, నందము జిందగ నప్పుడచ్చటన్.
కాంచినంతనె బిగియార కౌగిలింప
కోర్మితీంగలు కుసుమించి కనలు సాగ
రసిక సుకుమారమూర్తి శ్రీరంగనాథు
డెదుట కన్పట్టి యాతని కిట్టులనియె.
19
దాః దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
అనుదినంబును కోవెల కరుగుదెంచి
అలరు కాన్మల నిచ్చి మమ్మలరంజేయు
వాండ వీరీతి తేజంబు వాసి నేండు
మమ్ము మరచితి వేలొకో మౌనిచంద్ర?
తెలిసె భవదీయఖేదంబు తెరగు మాకు
బేలలందున మిక్కిలి బేల వీవు
ఇన్ని దినములనుండియు నెజుంగ వైతి
మాకు నీ సుత మంగళమధురమైత్రి.
అధిక భోగ్యంబు మాకు నీయనుంగుపుత్రి
తొలుత తనుదాల్చి యర్చించు నలరుదండ
కాన చింతింపమాను మో మౌనివర్య
ఆమె మా (ప్రేమవనములో నలరుచిల్మ !
తం
20
వచ్చతోరణము
విజయానందుడు
సాహితీసతితోడ సంసార మొనరించు
రసికాంధ్రరాజుల రాజసంబు
మగంటిమి దాల్చిన మగరూపమో యన
వెలుగొందు క్షత్రియ విక్రమంబు
తుచ్చభోగంబుల దూరంబు తొలగించి
దేశ హితంబుకై దివ్యదీక్ష
ఆత్మదేశంబుకై యసువుల నర్చించు
త్యాగశోభితకు నధర్మరక్తి
మేలిగొనము లవెన్నియో మేళవించి
ఆకృతిని దాల్చి నీమూర్తి నాశ్రయించె
కంకణంబును గట్టుక కదలుమయ్య,
తల్లి దాస్యంబు నెడబాప దక్షుడీవ!
మా యక్క చెల్లెండ్రు మంగళారతి బూని
నీరాజనంబులు నీ కొసంగ
హుంకార మొనరించి వెంకటప్పయతోడ
ఆంధ్రకేసరి నిన్ను ననుసరింప
మా యన్నదమ్ములు మరచి విద్వేషంబు
నీదు చల్లని నీడ నిల్చియుండ
విజయయాత్రకుబోవ వేదవాక్కుల నీకు
సాంబమూర్తి మహర్షి స్వస్తి చదువ
21
దా/ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
ఆంధ్రరాష్ట్రము గ్రహియించి యరుగుదెమ్ము
అల కురుక్షేతరణమున నతిశయించు
విజయునింబోలె శీఘ్రమే విజయ నీవు
తెనుంగుదేశంబు ఇక నీ యధీన మయ్యె !
ఉయ్యాల లూగుచు నొయ్యార మొలికించు
కలభాషిణిం జూడు కన్నులార
పరిమళమ్ములు చిమ్ము పారిజాతమునీడ
పరికించు మొగ మెత్తి భామసొగసు
ఆలింపు నరముల నాంధ్రరక్తము పొంగ
పాంచాలి పౌరుషభాషణాలు
పఠియింపు మొకసారి పాండవేయులమాత
సందేశమును మేను జలదరింప
గొల్ల భామలవలపుల వల్లభుండు
మురళి వాయింప చెవి యొగ్గి మురిసిపొమ్ము
తెలుంగు మేడల విలసిల్లు దీపకాంతి
కనుల మిరుమిట్లు గొలుపదే కనుము విజయ.
నవమల్లికాసతి నగుమోము తిలకించి
ముద్దాడకుండునే మోహనాంగి
మెరుపునెచ్చెలితోడ మేఘంబు విహరింప
పురివిప్పదే నెమ్మి పొలుపుమీర
మారామొనర్చెడు గారాబు కూంతురు
సంతసం బొందదే చంద్రు జూచి
నిగ నిగ మెరపలు పగడాలు ప్రసవించు
కవి కర్షకుండు కుప్పిగంతు లిడదె
22
వచ్చతోరణము
ఆంధ్రరాష్ట్రపుగద్దియ నధివసించి
విజయశంఖము పూరించి విక్రమింప
అనుసరింపక యుండునే, ఆంధ్రజాతి
విజయకన్యక విరిదండ వేయు నీకు.
23
దా॥ దేవులపల్లి రామానుజరావు (గ్రంథావళి
ఓరుగల్లు
కాబోలు నియ్యది కాకతీయ లొకప్పు
కరకు నెత్తుట కత్తి కడుగుచోటు
కాబోలు నీ ద్వారకల్యాణ వేదిక
అలికి ముగ్గులు పెట్టె తెలుగుపడుచు
కాబోలు నీ జీర్ణకమనీయసౌధాన
సుకుమార శిల్పము ల్పొంపు లొలికె
కాబోలు నీ వీధి కాపురం బొనరించె
పైడిమేడలలోన భాగ్యలక్ష్మి
ఇచటనే నిల్చి కాబోలు నిందుముఖులు
ఆయుధంబులు పూజించి యరుగుదెంచు
ఆంధ్రసేనకు కపురంపు టారతులను
ఇచ్చి వారలశౌర్యంబు మెచ్చినారు.
ఆంధ్రనగరీ యని అల్లారు ముద్దుగా
పిలిచె విద్యానాథు డెలమి నీమె
అల్లుని స్వేచ్చకై నెల్లూరినెజజాణ
పఠియించె నిచటనే భారతంబు
జాను తెనుంగున శైవప్రబంధము
ల్మొలకెత్తి యిచటనే మొగ్గదొడగె
సుందర మందార సుమదామ మొక్కటి
పోతన గ్రుచ్చె నీ పొలమునందు
ఆర్ధ హృదయాన నెందరో ఆంధ్రకవులు
ఆలపించిరి ఇచటనే ఆత్మగీతి
తలచినంతనె మే నెల్ల పులకరింతు
అక్కటా నాంటిశోభ యేమాయె నేడు?
24
వచ్చతోరణము
తిక్కనామాత్యుండు తెలుంగు దేశపురాజు
కలిసి మాటాడిన కొలువిదేమొ
అన్యదేశాధీశు లర్పించు కాన్మల
ఆ రాజు లిచటనే అందిరేమొ
కాటుకకన్నుల కావ్యకన్యక నాండు
పోతన నిచటనే పోల్చెనేమొ
పురికొల్పెనో యేమొ పూంబోండి యొక్కర్తు
రణరంగమున కేగ రమణు నిచట
అనుగుమిత్రునితోడుత నాంధ్రనగరి
వీధిగడియారపున్నోత వినియొకండు
పూటకూటింటి కల్లన బోయి ముదము
గులుక విందారగించిన స్థల మిదేమొ!
ఈ చెర్వుగట్టున నాచరించెనొ యేమొ
సహగమనంబును సాధ్వియోర్తు
ఆ కోటబురుజుపై నతిశయించెనొ యేమొ
ఆత్మదేశంబుకై ఆంధ్రుం డొకండు
తోడికోడండ్రతో తొయ్యలి యొక్కర్తు
పూజించె గౌరి నీ పొంతనేమొ
వేదశాస్త్రంబుల విడిది బ్రాహ్మణవీధి
చూడి కింపొనరించు చోటిదేమొ
ఎన్ని సంపదలుండిన నేమి ఫలము
చచ్చిపోయిన యొక బట్లై యిచ్చెనంట
పగిలిపోయిన కుండెడు పాలు మాకు
నిద్దురను వీడు తమ్ముండా, ప్రొద్దువోయె!
25
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
రత్నాలు వజ్రాలు రాసులుగా బోసి
అంగళ్ళ నిచటనే అమ్మినారు
పట్టు కంబళ్ళపై బంగారు నచ్చన
గాయల నాడిరి కాంత లిచట
ఉడుకురక్తము పొంగ హుంకార మొనరించి
అలరారె నిచట మా ఆంధ్రసేన
బంగారమును గూడ పండించి రంట మా
హాలికప్రవరు లీ ఆంధ్రభూమి
మా ప్రతాపనరేంద్రుని మానవతులు
వల్లభుని గూడి యిచ్చటి మల్లెతోంట
సిగ్గుతీవియ తొడగిన మొగ్గ లగుచు
తూగుటుయ్యెలలందున నూగిరంట!
26
వచ్చతోరణము
ఎన్ని జన్మాలబంధమో !
చిన్నిబంగారుచేతుల చెంబునెత్తి
ప్రొద్దుపొడుపున జనుదెంచి పూలచెట్ల
కిట్లు నీర్వోసి శ్రమియించె దీవు తల్లి
ఎన్ని జన్మాల బంధమో యెవరి కెజుక ?
చెట్లమీందనె యుండు నీ చిత్త మెపుడొ
పూలు వాడక ఆకులు రాలకుండ
వరము కోరగ మొన్న నీ వరిగితంట
శ్యామలాదేవి మందిర సముఖమునకు
తలిరుబిడ్డలం జూచిన, తల్లి కట్లు
ప్రాణములు లేచివచ్చును బాల, నీవు
ముందు పిల్లల తల్లివై మురియునపుడు
ఎంత ప్రేమించి పోషింతు వేమొ వారి ?
అన్నమును బెట్టెదంచును అమ్మ నిన్ను
పిలిచె ఆకలివేళయు తెలియవైతి
పరహితంబున తన్ను దామజచు టరయ
వెన్నతో నీకు బెట్టిన విద్య యేమొ !
ఏమొ వచియించుచుంటివి ఇంతసేపు
చాలు నిక నీదు మాటలు చాలు ననుచు
కిలకిలను నవ్వ దానిమ్మగింజ లచట
రాలె నను భ్రాంతి ఆ చిల్క వ్రాలె నేమొ !
27
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
ప్రేమ గీతములు
రస విధానంబొ యేమొ నీ రమ్యమూర్తి
చూచునపుడెల్ల నొక క్రొత్త సోయగంబు
మినుకు మను తారకలవోలె మెరయుచుండు
ఎచట బాంధ్యవమో మీకు యిగురుబోండి
కోసి తెచ్చితి వా పూలు కోరెదేని
కొప్పునన్ ధరియింపుమో కోమలాంగి!
వలదు మాకది; చాలు, నీ వదనసీమ
నవ్వుతీవలు విరబూచు పువ్వు లబల!
తలిరు కన్నియసొమ్ములు తస్కరించి
కులికినంతన యే మాయె? గోల వకట!
ఎన్నిరోజుల సంబర మీ సుఖంబు
ఎరువుసొమ్ములు గాకున్నె బరువుచేటు!
x ర ౮
ఎవరు లేరని కాంబోలు యెంచి నీవు
అద్దమున కెట్ట యెదుటన అట్టె నిలిచి
పాడితివి మోహనంబుగ ప్రణయగీతి
ముద్దు గొలిపెనొ చెలియ, నీ మోము నీకె!
మమ్ము జూచినయంతనె మధుర మంద
హాస మొనరించి సిగ్గున నవలకేగి
పాట నాపంగ మాఘోర పాపమేమొ
అర్హులము కామె నీ గాన మాలకింప?
28
వచ్చతోరణము
“అతివ మజియొక్కమాలు నీ యార్టగీతి'
అనుచు ప్రార్ధింప నీ వేమొ ఆగ్రహించి
“తీయమాటల సంతృప్తి జేయంజూతు
రెప్పుడును ఇంతె” యని పల్కెదింతి, నీవు-
పైండిబొమ్మవు గావె యో పడతి, నీవు?
ఏల కాంచన హారము లింక నీకు?
నాడు బంగరు లేడికై నాథు నంపి
అనుభవింపదె సీతమ్మ వనట లెన్నా?
x x X*
ఆలయద్వార వేదియం దడుగు వెట్ట
చెలియ యొక్కత చెక్కిలి చేయివైచి
ఏమొ వచియించు నంతకే నీ మొగంబు
మందహాస వికాసమై యంద మొల్కె
ఉపవసించుటనో యేమొ ఒప్పులొలుకు
వదన కుసుమంబు ఇసుమంత వాడువారి
కమ్మతావులె మా మీందం గ్రుమ్మరించు;
ఎన్ని నోములఫల మొకో యీ ప్రియంబు.
పసిడి పళ్ళెరమందున పారిజాత
పుష్పములు భక్తితోం గొనిపోవనేల
పరిమళింపవొ యవి నీదు శిరమునందు
జగతి నవ్వాని కందుకే జన్మ మబల !
జాను మరచితి నెచ్చెలీ, అలరు లిపుడు
దేవపూజకు కాంబోలు తెచ్చినావు
29
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
కాని యా దేవదేవు కవ్వానికన్న
హృదయపుష్పంబె మిక్కిలి ముదముగూర్చు.
న స. *
చూతు ప్రతి రోజు నీ ముద్దు సోయగంబు
కామకాంక్షలె నా యెద న్లలచివైచు
చిత్ర మీనాడు నీ మోము సిరిని చూచి
పూజ సేయగ యేలకో బుద్ధి పొడమె.
సకియ నినుం జూచినంతనే సరసమాడి
ఆజ్ఞ సేయుచు సేవల నాచరింప;
కలిగె కోరిక యేలనో కరముమోడ్చి
నీదు నాజ్ఞల నీ నాండు నిర్వహింప.
శ ర ౮
కలికి, నీ చక్కదనమున కలరి యేమొ
కోసిక్రుచ్చిన నిసుమంత కోపపడక
పరిమళంబులు వెదంజల్లి మురిసిపోవు
పూలమాలిక నిజముగా బేల గాదె?
పరమ సుకుమార మైన నీ కరము నెత్తి
తీగెలను వ్రేలు పూవుల ద్రెంచి కట్టి
తల్లిబిడ్డల నెడబాప ధర్మ మొక్కా ?
పిల్లల న్లనిపెంచవో బిసరుహాక్షి ?
ప్రకృతి సౌందర్యశోభల పాడుచేయ
పాప మది యే మొనర్చెనే భామ, నీకు ?
30
వచ్చతోరణము
తనదు సొమ్ముల నీ విట్లు తస్మరింప
చూడు మా తీవ కన్నీళ్ళు విడుచుచుండె !
ఎన్ని ప్రశ్చంబులడిగిన నేమి ఫలము
అలుక బూనితివో యేమొ పలుకవేమె ?
'పెదవి పగడంబు లల్లన కదలినంత
రమణి నీ నోటి ముత్యాలు రాలిపోవు.
శ ర ౮
కనుల కాటుక చెమ్మట న్లారుచుండె
కటికి జానేల పదములు కందిపోయె
వేణిభారము విరజారి వీడునేమొ
బిందె నొకమాటు దింపుమా సుందరాంగి.
గున్నగోరంటతోటలో వన్నె మీఅ
తోడి కన్నియలం గూడి యాడుకొనంగ
వలయు లేబ్రాయమందున వనిత యిట్లు
నీరు దోదెడుకర్మంబు నీకుబట్టై!
తమలపాకులు మలచినం గమలిపోవు
నీదు సుకుమారహస్తముల్ నీరు తోడి
కాయలను గాచె చూడుమా కాంత, యెట్లు
వలదు చాలింపు మిక చేదవలదు వలదు-
చీరజరియంచు మలినమై చెన్నుదొరంగె
నుదుట కుంకుమ తిలకంబు చెదరిపోయె
మంచి ముత్యాలహారము సంచలించె
తెగిపడునా యేమొ భద్రము తీగెబోడి!
31
డా॥ దేవులపల్లి రామానుజరావు (గ్రంథావళి
పగలు వెన్నెలగాసిన భానుబింబ
మేమి కోపించునో యని యెత్త వొక్కా?
అరిగి తరగునొ యేమొ నీ యలరుమోము
వంచి దాచితివేలనో మించుబోండి!
x x xXx
సొగసుగల వస్తువులు లేవా జగతిలోన?
కాంచి సంతస మందరో కన్నులార?
ఏల వాల్చితి నీ ముద్దు ఫాలతలము
దృష్టిదోషంబు తగులునో తోయజాక్షి?
మండు వేసంగి వైశాఖమాసమందు
భూసురోత్తములంబిల్చి పూలు పండ్లు
విసనకట్టలతోడుత నొసంగి నీవు
కట్టుకొను దెట్టిపుణ్యమో కాంత, చెపుమ.
మగని కొంగున ముడివేయ మనసుపడితొ?
పాలబుగ్గల ముద్దులబాల నెత్తి
ఊయెలల నూపి యుప్పొంగ నుత్సహింతొ?
మెలగగోరెదొ బంగారు మేడలందు
చెలియ ప్రతకాంక్ష యెట్టిదో చెప్పకీవు
చిలుకరించితి పెదవుల నలతినవ్వు
పలుకు బంగారమా? నీదు భావపేటి
దాచికొను తీయతలపుల దోంచుకోము!
శంక
32
వచ్చతోరణము
కాపు కన్నె
తరగిపోవునా యేమొ యీ ధాన్యమనుచు
చేను కావలి కాచెడి చిన్నదాన!
అలుక బూనకు మొక ప్రశ్న మడుగదలతు
చురుకు చూపుల తరువాతం జూతుగాని !
పాలుగారెడు లేజొన్న పంటగాంచి
'బ్రమసి చవిజూడ నరుదెంచు పక్షిగణము
జాళ్ళచే రువ్వి పోద్రోలి రవ్వజేసె
దింత నిర్ణయ యేలనే యిగురుంబోండి ?
పుణ్య పాపమ్ము లెజుంగని పులుగుకన్నె
నోటిముందటి ధాన్యంబు నుస్సురనగ
ఇన్నిసారుల నీరీతి నెత్తంగొట్ట
చేతు లెట్లాడెనో నీకు చెప్పవేమె ?
అందచందములం జూచి అరయనైతి
విసపుముద్దవు నీవని, వెళ్టికాదె !
తలపుటుంగరమందలి వజ మకట
నిలువునం దీయదే ప్రాణనిచయ మతివ ?
వ్యయ
33
దా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
మహాత్ముడు
హస్తమునం దాల్చి యా అహింసాయుధంబు
శాంతి సంగ్రామనాదము సలిపినంత
ధరణి కంపించె నల సభ్యతాజగంబు
సన్నిపాత ప్రలాపముల్ చాల చేసె-
కుక్కలవి యెన్ని మొరిగిన కుంటువడునె ?
గంధగజరాజ శేఖర గమనసరణి ?
ఆత్మలాభ పరాయణాలాపములను
ఆరిపోవునె ప్రజలలో అగ్నిసుంత?
తుచ్చసుఖములకై తల్లి స్వేచ్చ విక్ర
యింప సంసిద్ధులై కొందరేమొ కొన్ని
కూతలను గూసినంతనే కోలుపోరు
ప్రజల కలనైన స్వాతంత్ర్య భవ్యదీక్ష
ఎండ కన్నెరుగని యిందీవరాక్షులు
కాసెలు బిగియించి కదలినారు
విజ్ఞాన జగతిని విహరించు పండితు
లర్చింప నున్న వారాత్మ శక్తి
కూలినాలి యొనర్చి కుడుచు పెంబేదలు
నీ గొడ్గుఛాయల నిల్చినారు
సిరితోడ తులందూగు శ్రీమంతు లెందటో
త్యాగ సంసిద్భులై తరలినారు
34
వచ్చతోరణము
వేణుగోపాలుగానము విన్న గోపి
కల విధమ్మున మేనులు పులకరింప
అరుగుదెంచిరి ప్రజలు నిన్ననుసరింప
కలండు దేవుండు మనయందు కలండు కలండు
అలుక యెజుంగని నీవె నే డలిగితంట
ఎదురుకొనశక్తి గలవార లెవ్వరింక?
సత్యమగు నాగ్రహాగ్నిని సాహసించి
ఆర్బగా శక్యమౌనె అయ్యజునకైన?
పశుబలంబును పూజించి ప్రణుతిసేయు
జడులు తెలియుదు రెట్లహింసాబలంబు?
నక్క కేగగ శక్యమె నాక భూమి
కటిక గొడ్రా లెరుంగునే కడుపుతీపి?
పాశ్చాత్య సంస్కృతి ప్రాభవంబున గదా
మన పరిశ్రమలెల్ల మంటంగలిసె
పరదేశపాలనభాగ్యంబునన్గదా
మన విభేదంబులు ఘనములయ్యె
ఆంగ్లేయరాజ్యపు టండను మనవారు
పౌరుషం బెరుగని పందలైరి
పారతంత్ర్యముమెక్కు భారతీయులు నేండు
కూటికి గతిలేక కుములుచుంద్రు
ఇంక నెన్నాళ్ళు భరియింతు మీ విదేశ
పాలనము బుద్ధివచ్చెను చాలునింక
చెంపలను గొట్టుకొని చెంతం జేరినాము
నీదు సారథ్యసౌభాగ్య మాదరింప
35
డా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
సత్యమూర్తి మహాత్ముడౌ సంయమీంద్రు
చెజిలలో సిల్గులన్సెట్టు చేష్టితంబు
అనుభవింపకపోదురే, అనఘ నీదు
ఘోరశాపమున న్వారు కూలిపోరె.
విస్మరింపగ లేదు వీరబొబ్బిలియందు
పారిన నెత్తుటిధార లేము
మజివంగం దరమౌనె మజుజన్మ మందైన
పంజాబు హత్యలు పట్టపగలు
కండలు గదలియు మండదే హృదయంబు
తలచిన లాఠీల దండనంబు
సహియింపనేర్తుమే స్మరియింప నొకమాజు
చెరలలో వర్తించు తెరగులెల్ల
తెల్లవారల రాజ్యంబు తెల్లవాజు
దనుక ఆకలి దప్పుల దలపలేము
ఎవ్వరేమైన నంద్రు నీ కేమికొరత
ముందు నిలంబడి నడిపింపు మో మహాత్మ!
చీరసింగారములు జేసి సిగ్గు వీడి
గొప్ప పదవులయందున గుల్కి కూయు
పురుష భామామణుల యింటి తరుణులందు
ఖద్గతిక్కనభార్య లొక్కరును లేరె?
మలయ
36
వచ్చతోరణము
బీదకాపు
ఆజిపోయిన చెజువు కన్నార జూచి
పండువారిన తల పొల మెండబార
దీర్హనిశ్వాస మొక్కటి తీసి నిల్చి
నడువజాలని యొక కాపు పడుచువాడు.
నీరు ద్రావగ నొక లేగ నోరు దెరచి
చెరువుకడ కేగి జలములు దొరక కపుడు
బీదచూపులు తనుజూడ బేల యగుచు
కన్నులను నీరు గార్చె నా కాపుబిడ్డ.
“ఎన్నిమారులు వేండిన నీశ్వరునకు
కరుణ మా మీద నిసుమంత కలుగ దయ్యె
భావిజీవన ఫలమిట్లు భగ్నమయ్యె
కంచెయే చేను మేసిన కలదె దిక్కు?
పురుగు దిని నాశమయ్యె పునాసపంట
అజ్టులను సాచు ఫలములు అందవయ్యె
ఎవరు విందురు మా మొర లీ జగాన
నారు వోసిన వాడేల నీరు నిడండు ?
ఇప్పుడో యప్పుడో కోత కీ పొలాలు
అందునను నాశలన్నియు నంతరించె
ఈశ్వరుడు గూడ పేదల నీసడింప
ప్రోచు వా రెవ్వ రింక నీ భువిని వారి?”
37
దా దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
అనుచు నేమేమొ తలపోసి యడలుచుండ
వ్రాలె నొక రెండు పిట్ట లా వరులమీంద
కలుగ దొకగింజయైన యాకలిని దీర్చ
కటిక దారిద్యమింకను కలదె వేరు ?
బిట్టు విలపింప దలంచి యా బీదకాంపు
విఫలుడయ్యెను శోకంబు వెలికి రాక
కుమిలిపోవును తనలోన కుండి కుంది
ఎట్టు లింటికి పోయెనో యెరుగడయ్యె.
కాలు పెట్టినయంతనే కడపలోన
పరుగు పరుగున జనుదెంచి బాలయోర్తు
అన్నమును పెట్టలేదనే అమ్మ నేండు
ప్రకృతిపురుషుడు తను జూచి పరిహసింప.
మసిపాత గట్టిన మాణిక్యమో యన
మెరుగులు జిమ్ము నెమ్మేనితోడ
సిగ్గు పోవునా యంచు చినిగిపోయిన చీర
చక్కగా సవరించు శ్రద్ధతోడ
అకట నల్లాడు ననుగు మాతురునోట
చేపని పాలిండ్ల చెరగుతోడ
దీన స్వరూపియై తిరిపెము నెత్తుచు
కడపల దండాలు నిడుచునంత
అన్నమో రామచంద్రా యటంచు పల్కు
ద్వారవేదిక నిలుచున్న తరుణి నోర్తు
చూచి బిచ్చంబు నిడనైన నోచలేక
కూలబడె నట్లె యాతడు తాళలేక
38
వచ్చతోరణము
తోడికోడలు
పదియు నారేండ్లు నిండని పడుచుదనవు
కలిమి మోమున గల యొక్క కరుణమూర్తి
రెండుకన్నుల న(శ్రువు ల్నించుకొనగ
ఒంటిగా మల్లెశాలలో నొదిగియుండ -
కుదురు సవరించి కవ్వము పదిలపరచి
వెన్న దీసెడు యొక ప్రోడ వన్నెలాండి
కొంగు చేబూని గారాపుకొమరుం డపుడు
ప్రేమ ముప్పొంగ మిగుల మారాము సేయ -
రార, వరహాలమూట, బంగారుకొండ,
గోరుముద్దలు తినిపింతు రార తండ్రి,
అనుచు చిన్నారి కొడుకుతో నచటి కరిగి
సుందరీ శోకరూపంబుం జూచి నిల్చి -
మధుర భావంబు లెల్లను మరచి యంత
“ఏమి చేయుదు నయ్యయో యీమె కొరకు
జాతి గుండెలు గలుగు నా నీతిహీను
డెన్ని వాగ్జానములొ చేసి యిట్లొనర్చె !
ధనము కాసించి యాతండీ తరుణి నిపుడు
పరిణయం బాడకయె వీడి యరిగి వేరు
కాంతతో జేయుంచున్నాడు కాపురంబు
లోకు లరయంగ నిజముగా కాకులెకద !
39
డా/ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
ఈమె యపవిత్ర యని సంఘ మీసడింప
పీటవెట్టుదు నెవరికి పెండ్లియాడ ?
అడవిం గలియునొ యేమొ యీ యబల సొగసు
ఓర్చిరే సీత సౌభాగ్య ముర్విజనులు.
సాధ్వి యీ కన్య పెండ్లాడ సాహసింప
కామసంతృప్తియే నిజ (ప్రేమ యనెడు
భావముల కంజలించు నీ భారతీయ
యువకులందున నౌదార్య ముండునొక్కొ ?
చెలిమికత్తియ సుమతికి చెల్లె లౌట
సోదరిగ జూచుకొందు నీ సుదతి నేను
పిలువ అక్కయ్య యని యీమె ప్రీతితోడ
కొసరి పిలిపించుకొన నాకు కోర్కి కలుగు.
ఆడు తోబుట్టువులు లేనియట్టి కొరత
సుంత కలుగదు నా కీమె చెంత నుండ
ఒప్పులొలికెడు నీ బాల నొక్క యింటి
దాని జేసెడు భాగ్యంబు దాల్తు నొక్కొ ?
గౌరిం బూజించి మంగళవార వేళ
పెద్ద ముత్తెదులకు మొక్కి ప్రియులం గూడి
ఇరుగు పొరుగున బాలిక ల్మురియుచుండ
చిన్నవోవును ఈ కన్నె చెన్ను దొరగి.
మధుర వర్తనుందైన నా మజది మీంద
నిలిపెనంట యీమె పిననాండె నెమ్మనంబు
తండ్రి సమకట్టు పెండిలి తప్పిపోవ
రెంటికిం జెడిపోయిన రేవడయ్యె.
40
వచ్చతోరణము
అనుచుం దలపోయు చల్లన అరుగుదెంచి
కౌగిటను జేర్చి యా బాల కనులు దుడిచి
ఎంత సేపయ్యె చెల్లెలా! యిటకు వచ్చి
పిలువవైతివె యెందుకే బేలతనము ?
Ae rs
“పెరిగినా మొక్కటే యింటి బిడ్డలట్లు
అరమరలు సుంతయును గూట నెరుగ మెపుడు
నీ వెణుంగని విషయాలు నెలంత, నాకు
లేవు; నీ తోడు; నిజముగా లేవు సుమ్ము !
పెద్ద లేమందురో యని భీతి నొంద
తలను వంచను మలినమౌ వలపు ముందు
పెండ్లియాడుదు భవ్యమౌ (ప్రేమ కొరకు
సాధ్వి, నీ విచ్చు దీవన ల్ఫాలు మాకు.
పచ్చనాకును చేబూని బాస చేతు
విడువ నీమెను నే నెట్టి వేళయందు
కలుగ దిసుమంత కొరత యీ కలికి కీవు
తోడికోడలవై తోడునీడ వగుట.”
41
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
కస్తూరిదేవి
“స్వామి భవదీయ పదపద్మ సన్నిధాన
జీవముల బాసిపోదు నిశ్చింతతోడ
కాని నా కన్నుకొడుకుల కన్నులార
అరయ కొకమారులేదు నా కాత్మశాంతి -
మూడు దినులనుండియు ముద్దు సుతులు
నిలిచియున్నారు నా మనఃఫలకమందు
సేవగ్రామాన ఆనాటి దేవదాసు
తీయమాటలె చెవుల ప్రతిధ్వనించు.”
న xX ౮
అరుగుదెంచిరి ఆనాండు అనుంగుసుతులు
అమ్మ చరణాలు కన్నుల కద్దుకొనగ
పిల్లవాడంయి శిరముంచె తల్లి యొడిని
ముప్పదారేండ్ల కడగట్టు ముద్దుకొడుకు.
బరువు లెక్కిన హృదయాల పలుకలేక
మాతృదేవత కెదురుగా పుత్రులెల్ల
నిలిచియుండిన ఆ సాధ్వి పిలిచి యొకని
ప్రాణనాథుని పిలువగా బలపెనంత.
అరుగుదెంచిన మౌనీంద్రు నంక భాగ
మందు శిరముంచి యాతని హస్తయుగళి
మోమునం జేర్చి కన్నులు మూసికొనియె
తిరిగి యెన్నండు వానిని తెరవ ననుచు.
42
వచ్చతోరణము
పసుపుపాదాల కుంకుమ వదనమందు
నొప్పగా మేలిఖద్దరు టుడుపు దాల్చి
పూలచే గప్పబడియున్న పొలతి మేను
వింత తేజంబుతోడుత వెలుంగుచుండ
చేతులారగం బెంచిన చిన్న మనుమ
రాలు ఆ సాధ్వినిం జూచి అమ్మ నన్ను
ఏల పిలువవు కోపమే యెందు, కనిన
చూచువారల హృదయాలు చూర్ణ మయ్యె.
న
చితిని బేరిచి యామెను చేర్చి యందు
అగ్ని కాహుతిగాజేసి యచట నిల్వ
నేర కా దేవదాసుండు జారిపడుచు
గోలుగోలున నేడ్చెను కూంతురట్లు.
మండుచుండిన చితి నొక్కమాజుచూచి
ఆ మహాదేవ దేశాయి నందు జూచి
గోలు గోలున నేడ్చెడు కొడుకుం జూచి
అనదలై యున్న యాస్తుల నరసి యరసి
పిడుగు లొకవేయి నెత్తిన బడిననైన
సహజ గాంభీర్యభావము సడలనీక
చెక్కు చెదరని బాపు నిశ్చేష్టుడయ్యె
కనులరెంటను బాష్పము ల్లమ్మెనపుడు.
యక
43
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
సుజాత
కడిపెడు కొడుకులు గల యా
పడతులు మును చేసికొన్న భాగ్యం బేమో ?
కొడుకులు లే రని మనమున
కడు వగచెడు నా యకార్య కరణంబేమో ?
ప్రాణనాయకు నంకాన భాగ్యరాశి
మురిసి కన్నుల (ప్రేమంబు గురిసినట్లు
కలను గంటిని అక్కటా కల్ల యౌనె
లేబర మటంట బిడ్డలు లేని బ్రతుకు.
కడుపుతీపి యెజుంగని కాంత జన్మ
మేలకో తోడివారల హీననైతి
ప్రియుడు నా వంక జూపెడు ప్రేమ కింత
ఫలము నేరని వట్టి నిర్భాగ్యురాల !
అమ్మ అమ్మాయటంచు మా యక్కకొడుకు
తలంచి తన తల్లిగా నన్ను పిలిచినపుడు
పులకరించును నెమ్మేను పొటమరించి
మాతృపీఠం బటన్న సామాన్య మౌనె ?
తలంచు చీ రీతి ప్రాయంపుతరుణి యోర్తు
స్నాన మొనరించి చన్నీట జారు కురుల
ఆర్ధవసనాలతోడ దేవ్యాలయంబు
కరిగి బంధించి సుకుమార కరయుగంబు.
44
వచ్చతోరణము
సుగుణముల ప్రోవు శూరుడౌ సుతుని నీయం
కోరుచుంటిని వరమును కొంగు జాచి;
తల్లి! సంతానభాగ్యమే తనరదేని
సత్యము వచింతు; వలదు సంసారసుఖము
ఈయవా దేవి, భిక్ష నా కిప్పుడనుచు
పాద పద్మంబులకు భక్తి ప్రణతి జేసి
ఆణిముత్యాలతో వాని నందగించి
మౌనము న్ఫూన కన్నులు మాటలాడె.
xx ౮
నెలదప్పె కొన్ని నాళ్ళకు
నెల పొడిచినయట్లు నీరజాక్షికి నంతన్
తొలి చూ లొదవిన నలరుచు
నిలుపగరానట్లు పొంగె నెమ్మనమందున్
4 x ¥X*
అరుణుం డపరంజికరముల నప్పుడపుడె
కెంపుకాన్మలు జగతికి పంపి పంపి
అలసి విశ్రాంతి గైకొన నరుగుచుండు
ఆత్మ నలరించు నాటి సాయాహ్నవేళ.
అందాల నొసలిపై చిందులాడెడు కురుల్
చిక్కులు విడదీసి చేర్చి దువ్వి
పాలిచ్చి జోకొట్టి బాలభాగ్యంబును
పొత్తిళ్ళలో నిద్ర బోవంజేసి
పసుపుకాంతుల నీను పడుచు నెమ్మోముపై
కుంకుమ తిలకంబు కుదురుపబిచి
45
డా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
పట్టంచుచీరపై బంగరుపూవుల
నీలాంశుకంబును నీటుగుల్క
ఐదవతనంబు రూపొందు నబల యనగ
తరిపిబజ్టిల పాలును ద్రాక్షపండ్లు
తీసికొని పోవుచుండగ దేవికడకు
పచ్చిబాలెంతరాలు ఆ పరమసాధ్వి,
చిక్కి శల్యావశిప్పుడై చివికియున్న
తరుణుడౌ రాకుమారుని దారిలోన
చూచి కడు ఖిన్నయె యేమి తోచకపుడు
బొటబొట న్రాల్చి కన్నీటిబొట్లు రెండు -
ఆలయమువంక ముందున కడుగువెట్ట
నేర కే గతి నింటిలో నిముసమేని
విడువంజాలని బాలుని న్విస్మరించి
మరచె సకలంబు ఆ సాధ్వి మధురహృదయ.
చెట్టు లొసంగెండు నీడలో జీవ మొకటె
మిగిలి స్మృతి లేక పడియున్న మేదినీశు
వంక చెయి జాచి పెదవుల పాలబొట్లు
ఒక్కటొక్కటిగా రాల్చి యుపచరించె.
అమృతహస్తాల సేవించు నవసరాన
మరల జన్మము నెత్తినమాడ్కి నతండు
కన్ను లల్లన విప్పి యా కాంత నరసి
క్షీణకంఠాన నిట్లనె శిరము నెత్తి.
“జన్మ మెత్తితి తల్లిని జంపుకొణకుం
మందభాగ్యులు నేర్తు రే మాత్చదేవి
46
వచ్చతోరణము
స్తన్యసుధ గోలు భాగ్యంబు, జనని! యిలను
అధముండగు నన్ను నీ వెట్టు లాదరింతొ !
ప్రతిఫలాపేక్ష యావంత మతిని లేదు;
ప్రాణముల నిట్లు నేండు గాపాడినావు -
ఎరిగితి న్రేమవృత్త మే నిపుడు తల్లి !
చేయువాడను మానవసేవ యింక.
తల్లి లేనట్టివారికి తల్లివైన
నీదు చేతుల చలువయె నీడ గాగ
నా కుటుంబమె యౌ నింక లోకమెల్ల.
కలుగునో లేదొ మరుజన్మ కలిగెనేని
పొడమగోరుదు తల్లి నీ కడుపునందు
మోక్షమార్గంబు దెలియక మూఢవశత
నన్ను నను జ్ఞానడోలిక నూపినావు.
ఎట్లు దీర్తునొ నీ బుణంబే నెబుంగ
అందుకొనుమమ్మ పాదాభివందనంబు;
సేవ యిక చేతు మానవ శ్రేయమునకు;
మాత! నా కిక ప్రేమయే మతము సుమ్ము.
కులము, పొలిమేర, మత మను గోల బడక
దీన జనులను సేవించు దీక్ష నిచ్చి
ఆజ్ఞ యొసంగుము మా తల్లి అమ్మ యనుచు
పిలువ నొకమారు నిన్ను నే ప్రేమ మీ.”
శం
47
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
మూగబిడ్డ
ఇందు బింబపు టందము మందలించు
ఎనిమిదేడులు నిండని యనుగుసుతుడు
తూంగుటుయ్యెల శయనించి యూంగుచుండ
రత్నదీపంబు బోలిన రమణి యోర్తు -
అతివ దేహాని కద్దిన యట్లు దోంచు
పోకవన్నియ ఖద్దరు కోక గట్టి
పాలు చేపగ మలిచూలు బాల నపుడు
తొట్టియను దీసి యిడుకొనె తొడలమీద.
జామచెట్టుల చల్లని చాయలందు
చెల్లెలికి ప్రేమ పా లిచ్చుతల్లి జూచి
ఊగంజాలక వెంటనే యేగి తనదు
కరయుగమ్మున నామెను కౌగిలించె.
ముద్దులను మూటగట్టు నా మూంగబిడ్డ
లేతచెక్కిళ్ళ దాంగిలిమూంత లాడు
సొగసుగుంటల ముద్దాడె సుందరాంగి
రెప్ప వాల్చక కన్నుల నప్పగించి.
కోమలాంగికి కలిగిన కొరత యేమొ
అప్రయత్నముగా రాలె నశ్రుకణము
లేమి తలంచియొ బాలకుడామె కనులు
చీర చెరంగున దుడుచుచు చిన్నవోయె
Ca
48
వచ్చతోరణము
మూడు మాసాల తర్వాత మొదటిసారి
ఆలుబిడ్డల కెట్టులో ఆజ్ఞ దొరికె
కలసి మాటాడ వచ్చిరి గాన వారు
సత్వర మ్మాతనిం జూడ జైలు కడకు.
ముట్టితే మాసిపోయెడు మోహనాతి
మోహనంబైన పుత్రుని ముద్దు తనువు
కౌగిలింపగ జనకుండు కరము సాచి
ముద్దు లాడెడు నాటి యా మూర్తమందు
మూగతన మద్భుతంబుగ నేగె నెటకొ
తండ్రి యని పిల్చి గారాబుతనయు డపుడు
పొంకయై మెత్తనై యొప్పు నంకసీమ
మురిసె జనకుండు శిరమును మూర్మొనంగ.
ఆలుమగ లొండొరుల జూచి రశ్రుపూర్ణ
నేత్రముల హర్షవశమైన నెమ్మనంబు
లొక్క పెట్టున నుప్ప్బొంగె; ఓర్వలేక
కాలపరిమితి గడచిన గంట (మోంగె.
49
దా/ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
అనార్కలి
వలపు పన్నీటి కొలంకున జలక మాడ
దోరదానిమ్మ గింజల నారగించి
మోవి మోవిని జేర్చుచు ముద్దులాడు
కొదమ రాయంచ దంపతు ల్ములుకుచుండ-
జిలుగు వెలిపట్టు జరియంచు చీర దాల్చి
కురులు సవరించి కొప్పున విరులు దురిమి
ఆభరణ భూషితాంగియై అద్దమందు
తనదు మోమును వీక్షించి తరుణి నాండు-
ప్రొద్దు గ్రుంకెడు సమయాన పూలతోంట
కేగి యల్లన విహరించి యింపు లొలుకు
విరుల కొన్నింటి గ్రహియించి వేద్మతోడ
అల్లె చిత్రముగా నొక్క యలరుదండ.
వలపు తలంపులు మనమును కలచివైవ
ప్రాణనాయకు దివ్యరూపంబు కనుల
యెదుట సాక్షాత్మరింప నా యెమ్మెలాడి
యేమియును దోచ కట్టులే యొసగునపుడు-
పున్నమ వెన్నెలన్ పూంబోడి నిద్దంపు
చెక్కిళ్ళ చిక్కులౌ చికురపంక్తి
వేణితో స్నేహంబు విసిగి నేలను రాలు
పరిమళయుక్త ప్రసూన రాజి
50
వచ్చతోరణము
భావప్రపూర్ణ మో పడతి యెడందపై
అటు నిటు పరుగెత్తు హారసమితి
జగదేక సౌందర్య సంఫుల్ల వదనార
విందాన దోచు విచారముద్ర
తోంటలో చెట్ల చాటున తొంగి తొంగి
చూచి ఆపోక మతి చూచి ఆచలేక
ముందు కడు గిడి యాతం డమ్ముదిత యింత
లేసి కన్నులు చేతుల న్యూసి నిల్చి -
ఎవ్వరో చెప్పు మన్న నయ్యింతి యతని
హస్తయుగళంబు తనచేత నదిమి పోల్చి
నాదు ప్రాణంబె యని కండ్ల నట్లె తెరవ
ప్రణయవారధి నీందె నా పడుచు జంట.
పెండ్లి పందిరింబోలు నా పండ్ల చెట్ల
నీడ నాయమ యేమేమొ యాడు చతని
కంఠమున హారమును వైచి కౌంగిలింప
విధికి కన్నులు కుట్టె నా వేళయందు -
పుడమి కంపించునట్టుల నడుగు లిడుచు
ధరణిధవుం డెట్టులో యట కరుగుదెంచి
పండ్లు పటపట గొబుకుచు కండ్ల నిప్పు
లురల వచియించె నిట్టులు నుణుము వోలె-
కడుపు చెరపంగ బుట్టిన కొడుక వార !
కులము తక్కువ కులటతో కులుకు వార్త
లెవరు విన్నను నవ్వరే? యెంత సిగ్గు
అనుచు నాయమ చెజ నుంప నానతీయ-
51
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
వంచియుండిన శిరమును వంచినట్లె
నిలిపె నా బాల కన్నుల నీరు గార
దీర్హ నిశ్వాసముం బుచ్చి దిటవు పూని
జనకుతో వచియించెను తనయుం డిట్లు-
పరువు గల యింటం బుట్టుట పాప మేమొ
వలచి వలపించు చెలి పొందు కలుగదయ్యె
ఈవు మెడం గట్టు తరుణి నా కేల నింక
ఆభిజాత్యపు పాపమే యనుభవింతు !
చెజను బెట్టిన నేమాయె చెలిని నీవు
హృదయములు దూర మొనరింప నోపుదొక్కొ
జాతి తక్కువ యైనచో నీతికేమి?
కులము గలిగిన చాలునా గుణము వలదొ?
అస్మదీయ హృదబ్దాన నధివసించు
లక్ష్మియై విలసిల్లు నీ రమణి ధ్రువము !
ఆమె హృత్పద్మపీఠి నే నాశ్రయింతుు;
ఎట్లు విడందీతువో చూతు నింక మమ్ము.
ఘనులు కాంబోలు జగతిలో ధనికులెల్ల
కులము తక్కువ పేదలే కుమతు లటక!
రోవెలందుల పొందెప్టు రోత కాదు
పేదలను పెండ్లి యాడుటే పెద్ద తప్పు!
క్రూరమైన సమాజంబు కూలిపోదొ?
పాడు రాజ్యంబు నా కేల ప్రణయమూర్తి
సేవ లేకున్న నా కిదే సెల వొసంగు
మనుచు వెన్మకు దిరుగక యరిగె నతండు.
52
వచ్చతోరణము
తల మాయ నీయక వలువ మాయగనీని
ఢ్రద్ధ యదెల్లను సమసిపోయె
పరువంపు గరువంబు ప్రణయ ప్రసంగము
లడవిని బూచిన యలరు లయ్యె
సంగీత సాహిత్య సరస సంపద లెల్ల
అక్కరకును రాని యాప్తులైరి
సుందర హృదయాన సుకుమార భావముల్
పరమ శత్రుల వోలె బాధ పెట్టె
అతివ కాకలి దప్పులు అల్పమయ్యె
కనులు గుంటలు పడి మోము కళం దొరంగె
చిక్కె దేహము, కురులును చిక్కువడియె,
భామ నెరజవ్వనము భోగబాహ్య మయ్యె.
53
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
వీరపత్ని
విభుని రమణీయ మంగళ విగ్రహంబు
అద్దమున బోలె కన్నుల నాడుచుండె
మనసు నెమ్మేను తోడుత మత్సరించి
నిలువ నోపక ప్రాణేశు నెలవు కేగె.
“పన్నీరు చిలికించి ప్రాణేశు నెమ్మోము
సిరిని సేవించెడి మురిప మెపుడొ
వీర్య శౌర్యంబుల విడిదియై విలసిల్లు
పురుషాకృతిని జూచి పొంగు టెపుడొ
పెదవులల్లన విప్పి ప్రియమార నవ్విన
కన్నులు చల్లగా గాంచు టెపుడొ
కవన కల్యాణివే కల్కి నీవని పల్క
స్నేహరసంబును చేదు టెపుడొ
మూండు మూర్తుల నచ్చమౌ మొగలు రాజ
శేఖరుం జ్ఞప్తిదెచ్చెడు శ్రీ ముఖంబు
ప్రాణ ముండగ హృదయంపు బరువు దీఅ
అరసి మాటాడు సౌభాగ్య మమరదయ్యె.
మృత్యుదేవతకుం గూర్చు ముద్దుచెల్లి
చేతిలో జిక్కి కృశియించి చివికిపోయి
కొట్టుకొనుచుండె వేగాన గుండె లిపుడు
నోచుకొననైతి నాథునిం జూచుకొనగ.
వచ్చతోరణము
వెళ్టినై కాక నే నిట్లు విభ్రమింతు
అరయ స్వాతంత్యయోధులౌ నార్యవరులు
కలవరం బొందుదురె యెప్పు వలపుం గూర్చి;
ప్రేయసియె తప్ప ఇంకెందు (ప్రేమ లేదొ?
ఖిన్నయె శోక మొందెడు కన్నతల్లి
ఆర్తియే తప్ప నన్యంబు నరయలేక
దేశ స్వాతంత్ర్య వర్ధన దీక్ష దాల్చు
ప్రాణవిభు గూర్చి నే నేల పరితపింప ?
త్యాగమూర్తిని ప్రేమించు తరుణి కెపుడు
విరహమే కోరి గ్రహియించు వరము కాన
సహన మొనరింతు నీ వ్యధ సంతసించి;
నేను తల్లిని సేవింప నేరనైతి !
దేశస్వాతంత్ర్య దాహము దీర్చికొనక
కలుగునే ఆంకలియు దప్పి కలలనైన ?
మొండులై బండలౌ శిఖండులకు తప్ప
పురుష సింహుని నా విభు న్పోలు నరుకు
చక్కదనమును భాగ్యంబు జవ్వనంబు
కలుగు స్వాతంత్యదూతియౌ కమల నాండు
తనదు భర్తను విద్యుక్త ధర్మమెపుడు
వీడవలదని కేల్మోడ్చి వేండుకొనదె?
ప్రాణములు గూడం బాసెనా పరమసాధ్వి
పంజరంబున కృశియించు పక్షి పగిది
చిన్ని బిడ్డను ప్రాణేశు చేత బెట్టి
దేశ జనులకు దివ్యసందేశ మొసంగి
5్5్
దా దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
హృదయములు మేళవింపగ నొప్పుగాక
ఒక్కచోటనె దేహంబు లుండ నేల?
అరిగెదనుగాక యింక నే నమరపురికి
హృదయవిభు రాక నచ్చట నెదురు చూడ.
x శ ౮
పండువాణిన తాంబూల పత్రభంగి
వాలిపోయిన చెక్కిళ్ళ నీలవేణి
దూరమున నున్న దాసిని చేరంబిలిచి
అత్తరువుపెట్టె తెమ్మని యానతిచ్చె
భవ్యమై యొప్పు తన ప్రేమ పరిమళించు
రమణి దెచ్చిన సుందర రజతపేటి
అందుకొని భక్తి కన్నుల నద్దుకొనుచు
ప్రాణనాథుని కూరిమి ్రస్తుతించి -
క్షీణ స్వరమున నేమియొ చెప్పంబోయి
పలుకగా లేక యాయాసపడుచు నంత
శాశ్వతంబుగ నిద్రించె సాధ్విమిన్న
పొలుపు దొరంగిన చక్కని పూవు వోలె.
వచ్చతోరణము
అర్ధాంగి
చిన్నారి పొన్నారి చిట్టి చేతుల మేలి
గోరంట రసమును కుదురు పరచి
బంగారు రుచు లీను మంగళసూత్రము
భవ్యానురాగమ్ము ప్రతిఫలింప
ఇరుగు చెల్లెలిం గూడి పొరుగు నక్కయ్యతో
తీయని రాగాలు దీసి తీసి
జోలపాటలు పాడి సోదరీ పుత్రికన్
కదులు నుయ్యెలలోన నిదురబుచ్చి
మొల్లపాదుల నీర్వోసి మోహనాంగి
బొమ్మలకు మధ్య కుంకుమబొట్టు పెట్టి
కాన నడయాడు సర్వమంగళ విధాన
తిరుగు చీరీతి తలపోసె పెరటిలోన-
“పచ్చపచ్చగ ప్రియుం గూడి ముచ్చటాడి
కొన్ని నెలలాయె నింక నా వన్నైకాండు
తిరిగి వచ్చునో రాండొకో తెలియరాదు
ఇతరులకు నెట్లు చెప్పుదు నీ విధంబు?
స్వచ్చ స్వాతంత్ర్య దేశాన సంచరించు
కలిమి పూబోండి ముద్దు పుత్రులకు గాక
కూడుగుడ్డకు లేక అల్లాడుచుండు
బానిసల కేల ప్రేయసీ ప్రణయ కేళి !
57
డా/ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
కమ్మ కౌంగిట నను నొత్తి కాంతుడట్లు
వీడుకొనియెడు సమయాన వాడినట్టి
ధీరవచనాలు చెవుల ప్రతిధ్వనించి
కన్నులకుం గట్టు నాతని కమ్రమూర్తి.
ప్రాజ్య వసుంధరా భారమ్ము వహియించి
రాణించె నాండు రుద్రమ్మదేవి
పగరకు వెన్నిచ్చు మగనికి నొకసాధ్వి
పాడి కాదని చెప్పి పంపె ననికి
కత్తిని రుళిపించి కదనాంగణంబున
విక్రమింపదె యొక్క వీరపత్ని
చెడుత్రోవలను బోవు చిన్న తమ్ముని బిల్చి
ఆడుబిడ్డ యొకర్తు ఆజ్ఞ జేసె
పురుషులకుం దీసిపోవక తరుణులెపుడు
దేశ సౌభాగ్యవీధుల తిరిగినారు
ప్రాణనాయకు నాశీర్చలంబు కలుగ
ఏల సందేహమును చెంద నింక నాకు?
నన్ను నర్ధాంగిగా నాతం డెన్నుకొనుట
నేను సహధర్మ మిప్పుడు పూనవలయు”
అనుచు నా బాల తలపోయు నవసరాన
కొడుకు ముంగురులన్ దిద్దు పడంతి యోర్తు.
పసిండి బలపంబుతో వెండి పలక మీంద
ముత్తియంబుల సొంపును యెత్తిపొడుచు
ముద్దు లొలికెడు నక్షరాల్ దిద్దుకొనగ
రార నన్నుగన్న తండ్రి వే రార యనుచు.
58
వచ్చతోరణము
అడుగులో నడ్గు వైచుచు నరుగుదెంచి
అనుగుచెల్లెలి దిలకించి యనియె నిట్లు
భోజనము చేయ రావేమె ప్రొద్దువోయె
కొడుకు నీ పొత్తునను గాని కుడువడమ్మ !
అనిన చిరునవ్వుతో నామె యక్క వంక
ప్రేమదృక్కుల నీక్షించి పెదవి విప్ప
తోడబుట్టువు లేమొ మాట్లాడుకొనుచు
పొట్లపందిరి పొంతకు బోయి రపుడు
వలల
59
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
మోసము
“పుట్టనైతిని నేనొక పిట్టనగుచు
ఎట్టి బంధంబులును లేక యిచ్చవచ్చు
రీతి కాలంబు గడుపుదు రేయి పవలు
ఆట పాటల నా కేరు సాటి లేక.
వలదు ఈ పెండ్లి నా కంచు పలుకుటెట్లు
ఎన్ని విధముల యత్నించి యేమిఫలము
చంద్ర సుకుమార మా యోగి చక్కదనపు
మధురస్మృతి అయ్యయో యేల మరపురాదు.
ఉటుము విని సంభ్రమించు మయూరకాంత
సూర్యు వీక్షించి కమలమ్ము శోభజెందు
చంద్రునిం జూచి కలువయు శాంతింజెందు
సఖుని స్మరియించి నేనును సంతసింతు.
పిన్నతనముననుండియు ప్రేమమీర
కంటిలో పాపపోలిక గాచుచుండు
తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్ల
ఏల ప్రణయంబు ఇంక నా దేటి (బ్రతుకు!
అగ్నిసాక్షిగ పెండ్లాడు నతండె సుమ్ము
స్వామి, దైవంబు; భారత భామకంట!
హృదయ మింకొకవ్యక్తిపై నుంచుకొనుచు
మగని తిలకించు టెట్లొకో మొగము నెత్తి?
60
ఆత్మచోరునికై వట్టి యాస లేల?
రాజనగరాన పట్టపురాణి నగుచు
సంఘబంధాలతోడ నే చచ్చిపోదు !
పోవ రెందరు ఇట్టులీ భువిని ముందు?
చిలుక గోర్వంకలం బోలు చెలుల జంట
పూర్మజన్మాన నెడబాపబోలు నేను
వరుని వరియించుటే ఘోరపాప మయ్యె!
అన్ని పాపాలు స్రీలవే యౌనాయేమొ ?
బేలవై మన్మనము వీడ వేలనోయి?
అక్కటా నాకె స్వాతంత్ర్య మమరెనేని
అర్పణము సేయకుందునే ఆత్మసుమము !
దాసినై ధర్మబంధాల తగులుకొంటి.
ఆప్త బంధులముందు నతనితో నే నెట్లు
సాప్తపదీనంబు జరుపుదాన
అగ్నిసాక్షిగ నీవె యాత్మనాథుండ వంచు
శపథంబు నేరీతి సలుపుదాన
ప్రియమార నా భర్త బిగియారు కౌంగింట
జేర్చిన నేరీతి నోర్చుదాన
అర్థాంగి రమ్మంచు ననురాగమునం బిల్వ
యేమని యుత్తరం బిచ్చుదాన
ఎందులకు వచ్చె నచటి కా సుందరుండు
ఏల నా యోగి గానంబు నాలకింప
మనసువడి పిల్చి వీక్షించి మరులుగొంటి
జనకునకు నీ రహస్యాలు వినుచు టెట్లు?
x x x*
61
వచ్చతోరణము
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
శోభనమునాటిరాత్రి యా సుందరాంగి
ముసుగు మెల్లన సడలంచి భూపసుతుండు
మోహమున నక్కునం జేర్చి మోము జూడ
కాంతమోమున నిసుమంత కాంతి లేదు.
దినము నొక క్రొత్త కానుక దెచ్చి యిచ్చి
మిగుల ననురక్తుండౌ కూర్మిమగనిమీంద
ఎంత కర్మశహృదయయా నింతి యేని
నిలుప కెట్టుల దాచును నెమ్మనంబు.
గడచుచుండెను కాలంబు క్రమముగాను
ప్రాణప్రదముగ (ప్రేమించు భర్త నామె
తిరిగి ప్రేమింప మిగుల యత్నించుచుండి
వెలికి జూపుచునుండును వలపుకలిమి.
ప్రాణేశు కంఠాన ప్రసవమాలిక వైచి
వాడనీయకుమంచు వేడుకొనును
వెన్నెల రేలలో విభునితో నాబాల
ఆనందయాత్రల నాచరించు
అవనీశు డిసుమంత యాలస్య మొనరింప
నిర్ణయుండ వటంచు నిందసేయు
ప్రియుడు నెదురేగి ప్రేమగీతాలతో
స్వాగతంబని పల్కి సరస నిల్చు
కాని నాథుండు తను వీడి కడప దాంటి
అవ్వలికిం బోయినంతనే యామె కకట
మొదట (ప్రేమించు యోగియే యెదుటదోంచి
ఒక్క పెట్టున హృదయంబు నూపివైచు.
x శ ఈ
62
వచ్చతోరణము
భావ చోదిత రమ్యప్రభాతవేళ
కలికి సంపగిమొగ్గల కమ్మతావి
పవన డోలికలందున పరుగులెత్త
ఇప్పుడే వత్తమని పల్కి యిల్లు వీడి-
వివిధ చిత్రాలతోడుత వింతగొలుపు
సుందరంబగు తమ కళామందిరంబు
కరిగి యా జోడు భుజముల నొరసికొనుచు
కనియె నా చిత్రశాలను కన్నులార.
అభిమన్యు మజపించు నా బాలచంద్రుని
పడుచుపొంకము జూపు ప్రతిమ యొకటి
ఖద్గంబు చాలించు గణపతిదేవుని
వీర విహారంపు విగ్రహంబు
మంత్రి తిమ్మరుసుతో మంతనం బొనరించు
శ్రీకృష్ణరాయల చిత్రమొకటి
బల్లెంబు చేంబూని మల్లమ్మ తన నాథు
ననికిం బోవగ నాజ్ఞ నడుగు పటము
వేడిపలుకుల నాథుని వీడుకొలుపు
తిక్కయోధుని భార్యాప్రదీప్తమూర్తి
ఆదిగాగల వెన్నియో యంశములను
అరసి ప్రణమిల్లు ముందునకరిగి మరియు-
జగతి శాసింపంగ జాలు తిక్కనమంత్రి
గంభీరరూపంబు గాంచి యొక్క
కవిసార్వభౌముని కనకాభిషేకంబు
ప్రతిమకు భక్తితో ప్రణతిజేసి
63
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
పల్లకి రాయలు బట్టియెత్తగ నొప్పు
అల్లసాని కవీంద్రు కంజలించి
పోతన్న మొదలైన పూర్వకవీంద్రుల
చిత్రంబులకు మోల శిరమువంచి
మిగుల నుప్పొంగి మరియు నిమేసమందు
త్యాగరాయని దివ్యపాదాభివంద
నం బొనర్చెడు సుందర నాననంబు
అరసి నిల్వున నీరయ్యె నంబుజాక్ష్మి
కల్కి మోమున మార్చును గాంచి భర్త
చూచితివె యెప్పుడైన నీ సుందరాంగు
ననిన నేమాడవలయునో అరయలేక
కొంత తడ వట్లె నిల్చుండి కుందరదన-
ఎప్పుడో పాటపాడుచు నేగుదెంచె
మన వివాహంబునకు ముందు మాదు తోంట
కనిన నాతని మరిచూడ నభిలషింతు
వేమొ వచియింపుమని పల్కి మోము జూడ-
విద్యుదాఘాత మొందిన విధము నామె
ఒడలు నాపాదమస్తక మొక్కలిప్త
తనకు స్వాధీనము న్లాక తప్పిపోవ
కొయ్యబారెను అట్టులే కొంతసేపు.
చెలియ ప్రత్యుత్తరంబుకై నిలువ కతండు
అరిగె తత్‌క్షణమే; ఆమె యరయ దయ్యె
కాని యిటునటు దిలకించి కనులు విప్పి
విభుని గానక దిక్కులు వెదకుచుండ-
64
వచ్చతోరణము
అద్భుతంబుగ నా యోగి నరసి యచట
చూచు చట్టులె నిలుచుండె చోద్య మొంది
కొంత తడవేమొ యోచించి కోమలాంగి
ఎట్లు పోల్చినదో కాని యెరుగరాదు -
“చాలు నిక నీదు చిత్రాలు చాలు నాథ
ఇన్ని దినముల నుంచియు నిట్లు దాచి
నన్ను వేధించితివి నీకు న్యాయమగునె
ఎట్లు శిక్షింపవలయునో యిీవె చెప్పు.
కత్తిరించితి యోగివై చిత్తమీవు !
పతివి దేహంబునకె యైతి భర్త వగుచు;
మనసు నీయక యిన్నాళ్ళు తనువె యిస్తి;
నింత కన్నను శిక్ష నీ కేమి వలయు?
అన్నె పున్నెంబు లెజుంగని యబల నిట్లు
మోస మొనరించి నీ వేమి మూట గట్టి
నాండ వింక నేమి చేతునో చూడు నిన్ను”
అనుచు నాతని కౌగింట నదుముకొనియె.
(ఇందలి కథావృత్తము మున్నీ ప్రేమచంద్రుని రచనకు స్వేచ్భానుసరణము)
రంయక
65
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
నీరాజనము
దేశమే నీ వుపాసించు దేవ దేవి
అవని యంతయు (ప్రేమ మయంబు నీకు
మధుర మధురము తెనుగు నీ మాతృభాష
ధన్యుడవు నీవు నీ జన్మ ధన్యమయ్య !
భావకవితా ప్రపంచాన భామినులును
మాతృపీఠమునందు సమ్మాన లగుట
నీవు చూపు నుదాత్తమౌ నేర్చుగాన
అందుకొనుమయ్య మ ప్రీతి వందనంబు.
కళయు సౌందర్య మారాధకంబు నీకు
ప్రకృతి లావణ్యమో నీకు పరమప్రియము
కావ్యఫలముల నాంధ్రుల కాంక్షదీర
కోసియిత్తువు (ప్రేమతో కోవిదేంద్ర.
తెనుగునాండు నీది; తెనుగుబిడ్డవు నీవు
తెనుగటన్న నీకు తీపి మెండు
తెనుంగుకన్నె జడలం దీర్చి మక్కువతోడ
తెనుగుతోటలందు ద్రిప్పినావు.
సూరన సుకవితా సుందరసౌధాన
కావ్యసౌభాగ్యంబు గాంచినావు
శ్రీనాథకవిరాజు శృంగార వనములో
కుసుమాల దోసిళ్ళు గోసినావు
66
వచ్చతోరణము
తిక్కనామాత్యుని తీయమామిడిపండ్ల
మాధుర్యమున మేను మరచినావు
పోతనార్యుని సుధా పూతకావ్యంబున
ఆవేశ రత్నాల నడిగినావు
అంతియే కాక ఆంధ్రంబునందు నీవు
భావకవి లోకమునకు సంభావ్యుడవయి
త్రోవ జూపుదు కవికుమారులకు నేండు
రాయప్రోలు దానిమమీంది రామచిల్క !
67
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
సంక్రాంతి
చిగురు చెక్కిళ్ళ ముంగురు ల్చిక్కువడగ
మొల్ల చిరునవ్వు మోమున మొగ్గదొడుగ
అగరు తిలకంబు బొమ్మల నందగింప
చిలుకపలుకులు పలికెడు చిన్న చెల్లె.
“అన్న యెక్కడి కేగెదు నన్నుం జూడ
సకియ, సంక్రాంతి వచ్చెడు సమయ మయ్యె
క్రొత్తబొమ్మల నీవిప్పు దెత్తువేని
ఇచ్చెదను నీకు ముద్దుల నెన్నియేని,”
బాల సంక్రాంతి తోడుత మేలమాడి
వత్సరం బయ్యె నెచ్చెలి వచ్చునంట;
ఎప్పుడో యెప్పుడో యని యెదురుచూచు
ఈడుకన్నెలతో గూడి యాడుకొనంగ.
xx ౮
కుంకుమంబులు చల్లి గొబ్బిముద్దలు వెట్ట
పగడాల సొగసును పరిహసింప
పక్షివ్రాలినభంగి పసుపుమ్రుగ్గులు దీర్చ
పుష్యరాగంబుల పొలుపుమీర
రంగార దీర్చిన రంగవల్లిక గుంపు
కన్నెతీగలంవోలె వన్నె గుల్క
జడలోని పూవులు జారియుండినచోటు
ముత్యాలముగ్గుతో ముచ్చటాడ
68
వచ్చతోరణము
చీర కుచ్చిళ్ళు పదముల చిందులాడ
తెనుగువాకిండ్ల దిరిగెడు తీంగబోండ్లు
సరస సల్లాపములు సేయు సమయమందు
పుట్టినింటికి వచ్చెను పుష్యలక్ష్మి.
కాళ్ళ కడియాలు కరముల కంకణాలు
మధుర మధుర స్వనంబుల మాటలాడ
ఆంధ్రగ్భృహముల గారాబు టాడుబిడ్డ
వనిత సంక్రాంతి యల్లన వచ్చునపుడు.
గంప నెత్తినబెట్టి సొంపుగాం జూచుచు
జొన్న చేనున కేగు వన్నెలాండి
కొడవలి చేంబూని కులుకుచు కులుకుచు
కాశెగడ్డిని గోయు కాపుకన్నె
పసుపుచీరను దాల్చి బంతిపూవులమాల
లందంబుగా గ్రుచ్చు సుందరాంగి
కమ్మ సంపగితోంట చెమ్మచెక్కలనాడు
చిన్నారి పొన్నారి చెలులగుంపు
ఎదురుగా నేగి “ముద్దుల వదినె, రావె
మేనగోడండ్రు నిను జూడ మిరపతోంట
పొంత కనుపండు వొనరించు పొగడచెట్లు
విరులు గ్రహియించి తెచ్చెడు వేళ యయ్యె”-
అనుచు నాహ్వాన మొనరించు నవసరాన
ఎవరు పిలిచిరి చెల్లెలా యెందుకింత
సంబరంబుగ వచ్చు సంక్రాంతి యనుచు
తియ్యతీయగ పలికెడు తొయ్యలులును -
69
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
ఎన్ని దినములకే తల్లి నిన్నుజూడ
కనులు వాచెను రమ్మంచు కౌంగిలించి
మధుర సుధవాక్యముల నాడు మానవతులు -
ఉల్ల మలరంగ మా చిల్క తల్లి కిపుడు
పసుపు కుంకుమ లర్చించి పంపవలయు
ననుచు వచియించు నాప్తులు నలరుచుండ -
న రల ౮
ఇల్లు వెనకనె విలసిల్లు మల్లెతోంట
విరియబూచిన పూలతో వేడ్మసేయ
బీరపాదుల కొక్కింత దూరమందు
కొమ్మచిక్కుడు పందిరి న్లూరుచుండి -
జారు జడ నల్లుకొనుచున్న వారిజాక్షి
లలిత సుకుమార హృదయాన మొలక లెత్తు
తీయతలపులు మన కెట్లు తెలియుం గాని
నాతి పెదవుల చిరునవ్వు నాట్యమాడె.
పండుగకుం దెచ్చుకొన్నట్టి బెండపూవు
వన్నె చీరను ధరియించి వచ్చు పడంతి
నాగలిని దున్నుచుండిన నాథుకడకు
చద్ది గొనుపోవు నొక కాంపు ముద్దులాండి-
నడుము కొడ్డాణ మొక వింత పొలుపు గూర్చ
నిలువు టద్దంబు కెదురుగా నెలత యోర్తు
నగు మొగమ్మున కుంకుమ నద్దుకొనుచు
నోర చూపులం జూచు నొయ్యార మౌర !
70
వచ్చతోరణము
వంగతోటకు వలపట వనిత యోర్తు
దోసతీవెల పండ్లను గోసికొనుచు
యేలపాటలం బాదెడు నింపు చూచి
రసిక హృదయాలు సౌందర్య రాజ్యమేలు.
పశులమందను గాచెడు బాలుడొకండు
చింతకాయలు గోయగా చెట్టు నెక్కి
కోడె లొక కొన్ని వెంట రా గోగణంబు
జలక మాడగ నేగును చెజువునందు.
చిన్న లేగల యొడల్ చన్ను జేపగ నాకు
చొక్కంపు టావుల చక్కదనము
పచ్చని పచ్చికపట్టుల పవళించు
ప్రాయంపు టెద్దుల సోయగంబు
అంకెలు వైచుచు రంపిల్లి పోరాడు
కొమ్ములకోడెల క్రుమ్ములాట
ఆకుల గుడిసెకు అనతిదూరంబున
లీలగా విహరించు లేంగ సౌరు
అరసి తన కష్టసుఖముల మరచిపోయి
కందిచేనున నిలుచున్న కాపుంవాని
కోరమీసాల కొనలందు కోడెవయసు
ముద్దుపడుచుల హృదయాలు మోహపెట్టు
xx ఆ
సగము నలిగిన పూవులు సిగను గుల్మ
రజిత కంకణ కింకిణీ రవముతోడ
చల్లచేయుచు నుండెడి గొల్లపడుచు-
71
దా/ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
పిన్న తమ్ముడు తొట్టెలో ప్రీతితోడ
అడుకొనుచుండ నయిదేండ్ల యక్కయోర్తు
ఉయ్యెలను ఊంగుచుండెడి యొప్పు జూచి
మందహాసంబు జేసెడు మాతృదేవి -
కమల కావాసయోగ్యమౌ కనులనుండి
దివ్య విజ్ఞాన లతికలు తీంగవార
పురుష సూక్తంబు పఠియించు భూసురుండు
మకరలక్ష్మికి నెయ్యంపు సకులు కారె?
x x x*
అంపశయ్యను కొన్ని నాళ్ళధివసించి
కన్నులారగ నొకమారు కాంచి నిన్ను
ప్రాణములు వీడ దలంచె మా బ్రహ్మచారి
ఎంత ధన్యవె చెల్లెలా, యింతులందు |!
తొల
ళా
వచ్చతోరణము
కావురము
కన్నులను మూసి నిదురించు నన్ను నీదు
కాలి కడియాల చప్పుడు మేలుకొలిపె
దేవి, భవదీయ పద పద్మసేవ తప్ప
ఇతర మేమియు నిక నాకు ఇంపుకాదు.
చెలియ, యొకమారు నవ్వుము సెలవివార
నోట రాలెడు ముత్యాలు మూటగట్టి
దాచికొందును లుబ్బుండు ధనమువోలె
పద్యపేటిక లోపల పదిలపజిచి.
భీషణంబుగ జ్వలియించు ద్వేషవహ్నిి
జగతి రహియించుచుండెను సైపజాల
వీణ మీంటుచు బోవుదు విపినములకు
కవిత, కాంక్షించి నీ తోడ కాపురంబు.
73
డా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
ఉగాది |
మల్లికాకన్యక మలయానిలుని గాంచి
మురిపెంపు సిగ్గున మొగము వాల్చె |
వాసంతికాలక్ష్మి వదనంబు వీక్షించి |
కొదమకోయిల భావపదము పాడె
పచ్చికపై మంచు బరికించి యొక ముగ్ధ
ముత్యాల సరులంచు మోసపోయె |
నిగనిగలాడుచు చిగురించు తరువుల
తీగలు బిగియార గౌంగిలించె.
చిలుక గోర్వంకలం బోలు చెలుల జంట
వలపుతలంపులు ముమ్మారు మొలకలెత్తె
(కొత్తవర్షంబు జగమను కొమ్మ నెక్కి
మేలుకొలిపెడు నీ యుషఃకాలమందు.
74
తొలకరి
హృదయ ముప్పాంగగా నురిమినచో నీకు
పూజ యొనర్తుము పొన్న పూల
మిరుమిట్లు గొలుపగా మెరసిన నియ్యదే
అరటాకు దొన్నెలో యలరుదేనె
చెలువులు నిండించి స్వీకరింపుము కాన
దోరబండిన మేలి దోసపండ్లు
పైరులు చక్కగా పండిన నిత్తుము
పండుటాకులలోన పచ్చి వెన్న
ధాన్యలక్ష్మి ప్రసన్నమై తనరు కొకు
వరము వేడుదు జోడించి కరయుగంబు
వరుణ, మా వంకంజూడుము కరుణతోడ
శబలితంబైన యీ రమ్య సమయమందు.
75
వచ్చతోరణము
46
44
సారస్ప్‌త్
నవనీతము
ళ్
పీరిక
శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు తెనుగు పాఠక లోకమున కందించుచున్న
మరొక వ్యాస సంపుటియైన “సారస్వత నవనీతము”ను గురించి పరిచయము
చేయుటకు పూర్వము వారిని గురించి ఒకటి రెండు మాటలు చెప్పుట అవసరము.
హైదరాబాదు స్టేటులో తెనుగు కవులకు సంస్కృతాంధ్ర పండితులకు కొదువలేదు.
చక్కని కవిత్వము చెప్పగలవారు పలువురున్నారు. కాని యేదేని విషయముపై సరళ
వచనములో వ్యాసములు వ్రాసి తాము చెప్పనుద్దేశించిన విషయమును చదువరులకు
సులభ గ్రాహ్యము చేయగలవారి సంఖ్య చాల తక్కువయని చెప్పక తప్పదు. ఈ
లోటును పూర్తిచేయగల కొద్దిమంది సమర్భులలో శ్రీ రామానుజరావుగారు
చేరియున్నారు. విద్యార్థిగా నున్నప్పుడును అటు తరువాతను వారు పద్య రచన గావించి
నను ప్రస్తుత మావ్యవసాయముల నితరులకు వదలివేసి వ్యాసరచన యందు ప్రత్యేక
కృషిసలిపి సఫలులైనారు. తెలంగాణమందలి విమర్శకులలో వీరికి ప్రత్యేకగౌరవ
స్థానమున్నది. వీరి వ్యాసములను ప్రచురింపని తెనుగు పత్రికల సంఖ్య అతిస్వల్పము.
“సారస్వత నవనీతము”లో శ్రీరామానుజరావుగారు తామప్పుడప్పుడు
యావదాంధ్రమందలి వివిధ పత్రికలలో ప్రచురించిన కొన్ని వ్యాసములను,
సమీక్షలను, వ్యక్తి చిత్రణములను, కొన్ని సమావేశములలో చదివిన ఉపన్యాసములను
చేర్చినారు. స్రీల పాటలలోని కవిత్వము, 'ఆంధ్ర వాజయము-ప్రకృతి, 'వాబ్మయముపై
జాతీయోద్యమ ప్రభావము”, 'తెలంగాణము ఆంధ్రసారస్వత వికాసము”, అభ్యుదయ
యుగము అనునవి రచయిత వ్యాసరచనాశక్తిని తలియజేయుచున్నవి. తెలంగాణము-
ఆంధ్ర సారస్వత వికాసము అను వ్యాసము ద్వారా శ్రీరామానుజరావుగారు అఖిలాంధ్ర
ప్రజలకు తెలంగాణమునందు జరుగుచున్న సారస్వత కృషిని భాషాసేవకులను
పరిచయము జేసినారు.
“సారస్వత నవనీతము” శ్రీరామానుజరావుగారి ప్రధమ ప్రయత్నముకాదు
ఇదివరకు వెలువడిన వారి ప్రచురణల వలెనే “సారస్వత నవనీతము” కూడ
ప్రజాదరణను బడయగలదనుట నిస్సందేహము.
5.819565 నూకల నరోత్తమరెడ్డి
79
తొలిపలుకు
అప్పుడప్పుడు పత్రికలలో (1942 మరియు 1954 సంవత్సరముల మధ్య)
వ్రాసిన వ్యాసాల సంపుటీకరణ మీ పుస్తకము.
ఈ వ్యాసాలను యేరికూర్చి వున్తకరూవమున (ప్రకటించవలెనని
అభిప్రాయపడిన మిత్రులు శ్రీ పులిజాల హనుమంతరావు, శ్రీ గడియారము
రామకృష్ణశర్మగారలు. ఈ వ్యాసాలను సేకరించి వీనికి యీపుస్తక రూపమిచ్చిన
శ్రమను పూర్తిగా శ్రీ గడియారము రామకృష్ణశర్మగారు వహించిరి. ఈ పుస్తక
ప్రకటనమును హర్షించి ఆదరముతో పీఠిక వ్రాసిన ఆస్తులు గోలకొండ పత్రిక
సంపాదకులు మరియు ప్రస్తుతము ఆంధ్ర సారస్వత పరిషదధ్యక్షులు నగు శ్రీ నూకల
నరోత్తమరెడ్డిగారు.
ఈ మిత్రత్రయమునకు నాయందుగల (ప్రేమకు అక్షరమైన మధుర చిహ్నము
యీ గ్రంథము.
హైద్రాబాదు గ్రంథకర్త
మన్మథ వసంతము.
80
విషయసూచిక
సాహిత్య పర్యాలోకనము
సాహిత్యప్రగలి.. TR 83
lee eR SNe id 89
జానపద గేయములు...
స్రీలపాటలలోని కవిత్వము .............౨౨౨౨౨ లలల 102
సమీక్ష
ఆంధ్రవాజ్మయము - ప్రకృతి ....... 2౬22౬0022000౭ లలల 110
నవ్యసాహిత్యమున వీరకావ్యములు .. .. 128
క్షేతయ్య నాయకలు. ఏ Sep 135
వేయి పడగలు ts 140
మునిమాణిక్యంవారి కాంతం..........2.2౬ 22౬200000 148
సారస్వత వికాసము
వాబ్మయముపై జాతీయోద్యమ ్రభావము.................... 153
తెలంగాణము- ఆంధ్రసారస్వత వికాసము .................... 162
ఓరుగల్లు మండలమున సారస్వతసేవ......................... 188
నవ్యకవితా నీరాజనము ..
నవీయుగోదయము అ 205
ఖండ కావ్యములు............౭౭ 0220000000000 లలల 217
అభ్యుదయ యుగము......... 23౭22౬౬002౭౭౭ జలలలలలలలలలలలలలలలలం 235
సమాజము - రచయిత .
81
సారస్వతానుబంధము
రాధాకృష్ణపండితుడు .
సారస్వత మూర్తులు
కందుకూరి వీరేశలింగము పంతులు ............ 253
కొమజ్టాజు వేంకటలక్ష్మణరావు PWT SUSY రయ 255
చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు......................===. 258
గురజాడ అప్పారావు... స మమత 260
చెళ్ళపిళ్ళ వేంకటళాస్తి........................ 262
కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు............ 265
ముట్నూరి కృష్ణారావు ........౨౨౨౨౨౨ ౦౨౦౦౦౦౦౦౦౦ 0 ర00 లంట 267
కట్టమంచి రామలింగారెడ్డి.................ంంల 269
సురవరం ప్రతాపరెడ్డి... 271
ఉార్జి; బెర్నార్డ్ షప ుషు వంతం 274
మధురమూర్తి బాపిరాజు................0000000060000000 277
82
సాహిత్య పర్యాలోకనము
సాహిత్య ప్రగతి
సాహిత్య మనగానేమి? సాహిత్యము యొక్క ఉద్దేశమేమి? అనుప్రశ్నలు యీనాడు
సారస్వత రంగమున వాదోపవాదములను పురికొల్పుచున్నవి. కొందరు విద్వాంసులు
సాహిత్య దర్పణము, రస గంగాధరము, ధ్వన్యాలోకము, ప్రతాపరుద్రీయము మున్నగు
ప్రాచీన ఆలంకారిక గ్రంథముల నాంధ్రీకరించి పూర్వ సిద్ధాంతములను
పునరుద్దాటించుచున్నారు. పత్రికలయందు పుంఖానుపుంఖముగా వ్యాస పరంపరను
గుప్పించుచున్నారు. రేడియో చర్చలలో సిద్ధాంత రాద్ధాంతములను జేయుచున్నారు.
ఇంకొకవంక నవ్యులు నూతన వాదములను బయలుదేర దీయుచున్నారు. ఏ యొక
పక్షమువారు కూడ తమలో తాము ఏకాభిప్రాయులైయున్నట్లు కానరాదు.
ఈ విధముగా సాహితీ ప్రపంచమున భిన్న కక్షలు కలవు. నిజ మాలోచించినచో
ఇట్లుండుట సహజమే. కళా ప్రపంచమునందు ఒకే అభిప్రాయము రాజ్యముచేయుట
సాధ్యముకాదు. అది జీవకళకు చైతన్యమునకు నిదర్శనము కాదు. రణరంగమునందు
సేనానాయకుని ఆజ్ఞలను శిరసావహించు సైనికునివలె, సారస్వతోపాసకు లందరును
యేదో యొక ప్రత్యేక మతమును శిరసావహించుట సంభవము కాదు. సాహితీ
ప్రపంచమున అభిప్రాయ భేదములు వర్ధిల్లుట సహజము. ఈ యభిప్రాయ భేదములే
కళయొక్క సజీవత్వమునకు, మనోహరత్వమునకు నిదర్శనములని చెప్పుట సాహసము
కాజాలదు. సజీవత్వమే లేనిచో కావ్యములు టంకసాలలో తయారగు నాణెములవలె,
అచ్చు గ్రుద్దినట్లు ఒకదానివలె నింకొకటి యుండక తప్పదు. అవి యట్లుండుటయే
సంభవించినచో యీ కావ్య ప్రపంచపు మొగమునైన జూచువారుందురా!
సహృదయులు కాంక్షించునవి, నమూనాలు, నకళ్లుగావు- చైతన్యవంతము, ప్రతిభా
యుక్తమగు నిర్మాణమే నిజమైన సాహిత్యము.
ప్రపంచమున నివసించుచున్న అసంఖ్యాకులగు మానవులలో ఒకరిని
పోలినవారు మరియొక్కరుండుట మిక్కిలియరుదు. ఈ మానవ కోటియందు
సుందరాకారులును అనేకులుకలరు. కాని యా సౌందర్య శాలుల చక్కదన మంతయు
నొకే తెగకు చెందినది కాదు. సౌందర్యవంతులందరు ఒకరిని పోలి యింకొక
రుండకున్నను, అందరును మనోహరాకారులే యని యొప్పుకొనక తప్పదు.
మానవకోటియందు, స్ఫురద్రూపులందు, రూపసామ్య మంతగా లేకున్నను, యేదో
యొక విశేషము, ప్రత్యేక గుణము వీరియందు సామాన్యముగా గోచరించును. అట్లే
83
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
వాజ్మయ ప్రపంచమునందలి వివిధ కావ్యములందును ఏదో యొక సామాన్యగుణ
ముండుట స్వభావసిద్ధము.
ఈ సామాన్య గుణమునే రసము రామణీయకత యనియు చెప్పవచ్చును.
ఇదియే కావ్య మనోహరత్వమునకు కావ్యానందమునకు కారణము.
ఈ సామాన్య గుణమేమి? యను ప్రశ్నకు ఉత్తరము సాహిత్యమనగా నేమి?
యని ప్రశ్నించినప్పటికన్న, సాహిత్యము అవతరించుటకు కారణమేమి? యని
ప్రశ్నించినప్పుడు, మనకు యెక్కువ స్పష్టముగా సులభముగా నిర్వివాదముగా
లభించునేమో యని నాకు తోచుచున్నది. మధుమాసమునందు మావి చిగురులను
మేసి మత్తిల్లినప్పుడే కోకిల కూ యని కూయుచున్నది. మింటిపై మెరపు, మేఘములు
మేలమాడుకొనుచున్నప్పుడే నెమిలి నెచ్చెలి నృత్యమాడుచున్నది. కోకిలగానము వలె,
మయూర నృత్యమువలె, సాహిత్యము గూడ కవి కుమారుని హృదయము ఆర్జమైనప్పుడే
అవతరించుచున్నది. ప్రకృతి సౌందర్య దర్శనము వలన కవి హృదయము ఆగ్టము
కావచ్చును. దుస్సహ దుఃఖానుభవము వలన హృదయ తంత్రులు కదలవచ్చును.
గాఢమగు ప్రేమ, నిశ్చలమగు భక్తి భావములను ప్రేరేపింపవచ్చును. కాని భావ
'ప్రేరకమగు కారణము మాత్రము ఏదోయొకటి యుండక తప్పదు. హృదయములు
చలింపక, భావములు ప్రకోపింపక తెచ్చి పెట్టుకొన్న ఆవేశముచే కదలెడు కలమువలన
కలుగు ఫలితము సాహిత్య మెంత మాత్రమును కాజాలదు. అది శబ్దముల యొక్క
ఇంద్రజాలము కావచ్చును. మరేమైన గావచ్చును. ఏకాగ్రత, భావోద్వేగము లేనివాడు
కవి కాజాలడు. తాను చేయదలచిన కార్యమునకై ఆత్మార్బణము చేయ సమర్ధుడే
ఉత్తమ కావ్యనిర్మాత కాగలడు. జీవితమున తీవ్రతయున్నప్పుడే సాహిత్యశక్తి
సంభూతమగును. శుక్తిలో రాలిన స్వాతివాన చినుకులే ముత్యములై ముద్దుగొలుపును.
ప్రతిభావంతునికి గలిగిన వేడుక వేదనలే నవనవోన్మేషమగు కావ్యరచనకు
కారణములగును. భావార్ధతలేని బడుగులకు కలిగిన ఆవేశము అడవి గాచిన
వెన్నెలమాత్రమే. ఆవేశముచే శివముద్రొక్కుచు (ప్రేలినచో నది సాహిత్య మెన్నటికిని
కాజాలదు.
ఒకసారి నాట్యకళా ప్రపూర్ణుడగు తాడిపర్తి రాఘవాచార్యుడు “ప్రబలమగు
అంతరాత్మ ప్రేరణ లేక యెవ్వరును యేమియును చెప్పరాద”ని యీ యభిప్రాయమునే
మిక్కిలి చక్కగా వ్యక్తీకరించినాడు. ఒక మహాకావ్యములనే కాదు, అంతరాత్మ (ప్రేరణము
మహాకార్యములకు కూడ మిక్కిలి యవసరము. భారత భాగ్యవిధాతయగు మహాత్ముడు
84
సారస్వత నవనీతము
అంతరాత్మ ప్రేరణ కొసంగు ప్రాముఖ్యము అందరికి తెలిసినదే. ఉత్సాహమునకు,
ఉద్రేకమునకు భావములను ప్రేరేపించు ప్రభావము గలదు.
మనసుపై సమ్మెట పోటులు పడినప్పుడే హృదయమునకు తీవ్రమగు ఆఘాతము
కలిగినప్పుడే మహాకవి వాణి మధురవాణి యగుచున్నది. నిస్సీమమగు సౌఖ్యమునకన్న,
దుర్భరమగు వేదనయే ఒక విధముగా కవి హృదయము కదలించుటకు యెక్కువ
సమర్థమని చెప్పవచ్చును. హృదయమునందొక విధమగు ఆవేదన, పరితాపము
కలిగినప్పుడే సాహితీ సుందరి జగన్మోహినియె సాక్షాత్మరించుచున్నది. కావుననే మానవ
సంఘమునకు సాహిత్యమునకు అవినాభావ సంబంధమున్నదను సర్వజనాంగీ
కారముగు సిద్ధాంతము. కళోపాసకుని భావములు (ప్రేరేపించుటకు, ఆతని
హృదయము కందళించుటకు అతడు వస్తువుగా స్వీకరించుటకు సంఘమున కన్న
సర్వసంపన్నమైనది మరియొకటి లేదు. ప్రపంచమునందలి యుత్తమ సాహిత్యమెల్లను
సాంఘిక జీవనముతో సన్నిహిత సంబంధము కలిగియున్నది. ప్రియురాలి కమరత్వ
మొసంగిన కవులు, సంఘమునందలి యన్యాయముల నెదుర్శొని శ్రీకృష్ణజన్మస్థానము
నలంకరించి అచ్చట మహాగ్రంథములను రచించిన మహనీయులు రాజకీయాది
కార్యరంగములందు శూరులై, కావ్యరచయితలయి యొప్పిన చిత్తరంజన, గోవింద
వల్లభ మున్నీ ప్రభృతులవంటి రచయితలు ఆవేశముచే ప్రేరితులై సంఘమునందలి
తమ యనుభవములను పురస్మరించుకొనియే కావ్య రచనా ప్రయత్నమునకు కటిబద్దులై
కృత కృత్యులైనారు.
తీరని యావేదనచే కవిహృదయము కందళించునపుడే సారస్వత సలిల
ప్రవాహము జాలువారును. అప్పుడే కవిభానుడు,
“నన్నెవ్వ రాపలే రీ వేళ
నాధాటి కోర్వలే రీ వేళ
అని దుర్షిరీక్షుడై తేజరిల్లును.
ఆ నాడు ఆనంద పాత్రమున ప్రణయామృతము గ్రోలు క్రౌంచ మిధునమున
కెడబాటు కలిగించిన క్రూర నిషాదుని ఘోర కార్యమును గాంచి ఆదికవియగు
వాల్మీకి హృదయమునకు తీరని యావేదన కలిగినది. వాల్మీకి యంతరంగమున
రగులుకొనిన ఆవేదనాగ్నియే రామాయణ మహాకావ్యము. రామాయణమున
కాశ్రయమైనది మానవ సంఘము. సాహిత్యమున మానవ జీవిత ప్రాముఖ్యమును
గుర్తించిన ప్రథమ కవీంద్రుడు వాల్మీకియే. హృదయము కదలక మనసు క్షోభించక
85
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
సాహత్య సృష్టి గావించుట యసాధ్యమేమో! మహాకవి తిక్కనార్యునకు ఇట్టి వేదన
కలిగినందువలననే మహాభారత రచనకు కృతప్రయత్సుడైనాడు. ఆనాటి స్వప్నమున
పవిత్రమూర్తి యగు కొమ్మనామాత్యుడు దర్శనమొసంగి హరిహరనాథ సాక్షాత్మారము
ననుగ్రహింపజేసి భారత రచనకు శ్రీ కారము జుట్టించుట తిక్కనార్యునకు గలిగిన
భవ్యమగు నావేశముయొక్క ఫలితమే యనుట నిన్సంశయము. ఆతని
హృదయమునందు చెలరేగిన వేదనయొక్క పరిణామమే యీ స్వస్నమనుట తథ్యము.
భారతమునందలి ప్రతి పంక్తియును మానవ జీవిత విమర్శనమే. ఉద్యోగపర్వము
ఆ కాలపు రాజకీయ జీవితమునకు ప్రతిబింబమేమో! తిక్కనార్యుడు స్వయముగా
రాజనీతి కోవిదుడైన మంత్రి మాణిక్యుడు గదా!
పోతనాది మవోకవుల కావ్యములుగూడ ఆవేదన, ఆవేశములకు
ఆటవట్టులైయున్నవి. కావుననే వానియందు రామణీయకత, జీవకళ
యుట్టిపడుచున్నది. ఇంతెందుకు? సాహిత్య ప్రియులగు మహారాజుల చల్లని
యేలుబడిలో ప్రజాసముదాయము పాడిపంటలతో నిత్య కల్యాణము, పచ్చతోరణముగా
గడివిన కాలమందు అన్యవిచారము లేక శృంగార నరోవరములందు
విహారమొనరించిన రాజ హంసలగు మన (ప్రబంధకవులు కూడ రసోద్రిక్తులయియే
రచనా రంగమున రాణించినారు. “స్తుతిమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కుల కేల
గల్లెనో అతులిత మాధురీమహిమ” యను ప్రశ్నకు “సుకుమార వారవనితా జనితా
ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధారస ధారల పారవశ్యమే” యను
ప్రత్యుత్తరము గమనించదగినది. రసవదిష్టార్థ రక్తిచే వివశమైన హృదయమునందే
కవిత యుద్భృవిల్లుచున్నది. మన శతకములు, చాటువులు ఇందుకు మేలి
నిదర్శనములుగా నున్నవి.
దక్షిణదేశ విద్యాసాగరుడై ఆంధ్రసాహితీ పునరుద్ధరణ ప్రభావుడని పేరుగాంచిన
వీరేశలింగ దీక్షితుడు ఆనాటి సాంఘిక పరిస్థితులను గాంచి యావేదన చెందినవాడే.
తరువాత మన నవ్యాంధ్రకవులనేకులు జాతీయ స్వాతంత్రోద్యమముచే
ప్రబోధితులైనవారే; దేశ మాత పిలుపును అందుకొనినవారే, వీరగంధము తెచ్చినారము
వీరులెవరో చెప్పుడీ యని యెవరికి వారు ప్రశ్నించుకొనినవారే. దేశ దౌర్భాగ్యమును
గాంచి మాతృదాస్య విమోచనమునకు సకల త్యాగము లొనరింప సంసిద్ధులైనవారే,
ఇల్లు గాలునప్పుడు ఆత్మానందము కొరకు వీణియను చేబట్టు ప్రబుద్ధుడు
కళోపాసకుడు గాకపోవుటయే గాక మానవత్వపు పొలిమేరకు మైళ్ళదూరమున గూడ
86
సారన్వత నవనీతము
నిలిచి యుండుటకు అర్హుడు కాజాలడు. అవసర సమయములందు ఆయుధమును
ధరించుటకు గూడ వెనుదీయక కార్యశూరుడై కర్మవీరుడైన ఘనుడే కలముగూడ
నడిపింపవలసిన యావశ్యకత నేడున్నది.
ఈ సందర్భమున నొక విషయము నొక్కి వక్కాణింపవలసి యున్నది. అన్ని
విషయములను గురించి అందరికిని ఒకేవిధముగా ఆవేదన కలిగినను ప్రతి
వ్యక్తియును కావ్యకర్త కాజాలడు. పద్మపత్రము లందే మధువు లభించుచున్నది.
శుక్తిలో నిలిచిన స్వాతివాన చినుకులే మౌక్తికములుగా మారుచున్నవి. ప్రతిభావంతునికి
కలిగిన వేడుకయో, వేదనయో వాగ్రూపమునొందినప్పుడే రససిద్ధికలుగుచున్నది.
“ఎరువుల సొమ్ము బరువులచేటు” అన్నట్లు తెచ్చి పెట్టుకొనిన ఆవేశము వలన, కృత్రిమ
మగు ఆవేదన వలన ఎవరి రచనలకు గాని కావ్యత్వము సిద్ధింపదు. కావుననే ఏ
యొక రాజకీయ సాంఘికాభిప్రాయములకో ప్రణమిల్లి ప్రచారముకొరకు వ్రాసిన
వ్రాత లన్నియు సాహిత్యము కాజాలవు. రసోద్రిక్తులు కాని భాషాసేవకులు
కావ్యనిర్మాణమునకు ప్రయత్నము గావించిన పరిహాసాస్పదులు కాకతప్పదు.
సాహిత్యేతరమగు విజ్ఞానవాజ్బయ నిర్మాణము కొరకు వారు కృషిచేయుట ఆవశ్యకము.
అర్థశాస్త్ర రాజకీయ శాస్తాది సాంఘిక శాస్త్ర విజ్ఞానముతో పాటు భౌతిక విజ్ఞానము
యీనాడు ఆంధ్రభాషకు మిక్కిలి అక్కరయైయున్నది. సాహిత్యము మానవ జీవిత
విమర్శనమను సిద్ధాంతము నంగీకరించినప్పుడు వాజ్మయము కాలకర్మానుగతమై
విలసిల్లునని యొప్పుకొనక తప్పదు. ఇది భౌతిక విజ్ఞానము పరిపక్వమగుచున్న
కాలము; atomic energy యొక్క యుగము.
నేటి తెనుగు సారస్వతము వంక తిలకించునప్పుడు ఆధునికాంధ్ర రచయితల
నాకర్షించుచున్న వాజ్మయ విభాగములు ఖండకావ్యము, గేయము, కథ మాత్రమే
యని విస్పష్టమగుచున్నది. అచ్చటచ్చట ఏకాంక నాటికలను వ్రాయువారు కలరు.
ఈ రచయితలు సమకాలిక జీవితమునందలి విషమ సమస్యల వంక తమ దృష్టిని
మరల్చకుండుట శోచనీయము. కాళోజి, పొట్లపల్లి మున్నగు కొందరు యువకుల
రచనలందు మాత్రమే దేశమునందు జరుగుచున్న కల్లోలములను గురించిన యావేదన
కానుపించుచున్నది. పిళ్ళా వేంకటరత్నకవ యొక్కరు నాకు దెలిసినంతవరకు
భారతస్వాతంత్ర్యమునందలి వీరఘట్టములను కావ్య గానము జేసినారు. కాని అనేకులు
ఇంకను బాహ్య ప్రపంచమును మరచి గాలిమేడలలోనే ఉయ్యాలలూగుచున్నారు.
ప్రజాబాహుళ్యమున కొక దివ్య సందేశ మొసగవలసిన బాధ్యత తమపై కలదని
గుర్తింపకున్నారు.
87
డా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
వంగదేశపు కాటకము మనవారిలో యెందరి హృదయ తండ్రులను
కదలించినది? 1942 సంవత్సరవు జాతీయోద్యమమునందలి వీరగాథలు
తలచుకొన్నంతనే ఒడలు జలదరింపజేయు సాహస కృత్యములు యెందరి లేఖినుల
నాట్యమాడించినవి? సుబాసుని శౌర్యము, జయ్రకాశాదుల యద్భుత పరాక్రమము
వస్తువుగా స్వీకరించిన రచయిత లెందరున్నారు? మహాత్ముని యుపవాసములు,
త్యాగ సంపద, తుపాకి గుండ్లకు గుండె నెదురొడ్డిన మహాపురుషుల పవిత్ర చరిత్రము,
అనాథుల యశ్రుధారలు యే కవీశ్వరుని భావనాశక్తిని విజృంభింప జేసినవి? ఏ
కథకునికి ఇతివృత్తమై యొప్పినవి? నేడు ఏకాకియై, పాదచారియై, కాళ్ళు బొబ్బలెక్క
ఎండయనక, చలియనక, అసిధారావ్రతము బూని వంగదేశమున ఘోరతపస్సు
గావించుచున్న కరుణాస్వరూపియగు మహాత్ముని యనుభములకన్న ఉదాత్తమగు
కవితావస్తువు కలదా? ఆలోచింపుడు. ఇటీవల మనదేశమున జరుగుచున్న
యమానుషములు, ప్రవహించుచున్న రక్త స్రవంతులు, యెందరు సారస్వత సేవకుల
హృదయముల కాఘాతము కలిగించినవో యోచింపుడు.
తుద కొక్కమాట. కావ్యములు, గేయములు, కథలు సారస్వత రంగమున
ముఖ్యపాత్రను ధరించుటయం దాశ్చర్య మేమియును లేదుకాని ఇవియే సమగ్ర
సారస్వతము కాజాలవు. మన భాషకు అనవసరమైన అభివృద్ధి చాలకలదు.
దేశచరిత్రలు, జీవిత చరిత్రలు మనకు మిక్కిలి స్వల్పముగా నున్నవి. అరటిపండొలిచి
చేతి కిచ్చినట్లు విషయ నిరూపణచేయ సమర్థులైన వ్యాసకర్తలు మనలో మిక్కిలి
స్వల్పముగా నున్నారు. శాస్త్రీయ విజ్ఞానము మనభాషలో లేనేలేదనిన అతిశయోక్తి
కాజాలదు. శిల్పము, సంగీతము, చిత్రకళ మున్నగు వానిని గురించియెన కొంత
విజ్ఞానము నొసంగ గల గ్రంథజాలము మనకు మృగ్యము. మన యువకులందు
విశ్వవిద్యాలయ పట్టభద్రు లనేకులు కలరు. కొందరు తమ యభిమాన విషయము
లందు ప్రత్యేక పరిశ్రమ గావించుచున్నారు. విదేశ యాత్రలను గావించి బహు
గ్రంథావలోకన మొనరించిన వారు కలరు. వీరు తమ విజ్ఞానముతో మాతృభాషను
పూజింపవలసిన యవసరము కలదు.
(సాపొతీమేఖల - అధ్యక్షోవన్యానము)
88
సారస్వత నవనీతము
కళ
మానవునకు సౌందర్య సంవీక్షణమువలన కలుగు ఆనందము ప్రకృతిసిద్ధమైనది.
నిండు పున్నమనాడు పడమటి కాంత యొడిలోన పవళించియుండు నెలబాలుని
తిలకించినప్పుడుకాని, ఆకులు రాలక పూలువాడని ఆరామమందు “చిలుక పోటులచేత
జెరగిన సహకార ఫలముల” నుండి స్రవియించు పచ్చి తేనెను పరికించినప్పుడు
కాని, మరియెట్టి మనోహర దృశ్యమును గాంచినప్పుడు కాని, మన హృదయము
లందు సౌందర్య సాక్షాత్కార మగుచుండును. విద్యాధికులకు, విజ్ఞానులకు,
విద్యావిహీనులకు, అజ్ఞానులకు, శ్రీమంతులకు, నిరుపేదలకు, స్రీలకు, పురుషులకు,
బాలురకు, అందరికిని కొలదియో, గొప్పయో సౌందర్యరక్తి యుండితీరును.
మానవునకు సౌందర్యమునందున్న సహజమగు (ప్రేమయే ఆతడు లలితకళల
నారాధించుటకు ప్రోత్సాహకారణమని చెప్పవచ్చును. మానవుని హృదయమున
యెచ్చటనో దాగియున్న సృష్టిశక్తి పైకుబికివచ్చి ఏదో మూగరూపమును దాల్చుటయే
లలితకళల యొక్క ఆవిర్భావమని చెప్పవచ్చును. లలితకళలు సౌందర్యము యొక్క
భావచిత్రములు. కావున కళయొక్క స్వభావమును గుర్తించినప్పుడే మనము సౌందర్య
దర్శనము చేయగలుగుదుము.
ప్రపంచమునందలి ఏ గొప్పకళనైన తిలకించుడు; అది ప్రత్యేక వ్యక్తి యొక్క
నిర్మాణమని విశదమగును. అట్లగుటచే ఒక కావ్యముగాని ఒక చిత్రముకాని ఒక
భంగిమకాని సరిగా పూర్వ సంప్రదాయమునే అనుసరించి; ఇదివర కున్నవానివలెనే
యుండి, ఒకే యంత్రమునుండి తయారుచేసిన నాణెములవలె నుండుట సంభవము
కాదు- ఒక క్రొత్తభావము, ఒక క్రొత్త జీవకళ, ఒక క్రొత్త చైతన్యము కలిగగినదే
నిక్మమగు కళయని చెప్పవలసియుండును. పాత పాటలే తరిగి పాడిన రోతగా నుండదా!
ఉద్రేకము కవిత్వమునకే కాదు - సౌందర్య ప్రధానమునగు కళలన్నింటికిని
జన్మస్థానమని చెప్పవచ్చును. కవివలె చిత్రకారుడుకూడ భావనా వీధులందలి తన
యనుభవములను వర్ణముల రూపమున ప్రదర్శించుచుండును.
లలితకళల లక్షణములను వివరించుచు సిద్ధాంతములను (ప్రతిపాదించు
గ్రంథము లనేకము కలవు. కాని యీ సిద్ధాంతములను మాత్రమే నమలి మ్రింగుట
వలన యెవరికిని నవనవోన్న్మేషశాలిని యగు ప్రజ్ఞ లభింపజాలదు. సహజప్రతిభ
89
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
పరిపూర్ణముగా అభివృద్ధి నొందుటకు దోహదము మాత్రమే కావించునవి లక్షణ
గ్రంథములు. సంప్రదాయము, కళను సమకాలిక సాంఘిక పరిస్థితులతో
సమన్వయించి ఆ రెండింటికి సమరసభావము కలిగించునది మాత్రమే! ఒకకాలమున
అత్యుత్తముగా పరిగణింపబడిన సంప్రదాయము మరియొక కాలమున పనికి
రాకపోవచ్చును. కావుననే కాలముతోపాటు సాంప్రదాయములు మారి జాతీయ
పునర్వికాసము జరుగుచుండును. కళ యొక్క సౌందర్యమును ప్రతిపాదించుటయే
యొక్క సిద్ధాంతమునుగాని మనము ఆవిషయమున తుదిమాటగా అంగీకరించుటయు
పొసగదు. సర్వకాల సర్వావస్థలయందు కళాసౌందర్యమును ప్రతిపాదించు ఆదర్శ
మిదియొక్కటేయని యెవ్వరును ట్రేలెత్తి చూపజాలరు. అట్టెనచో అభివృద్ధియను
మాటయే మన శబ్దకోశమునుండి అంతరించవలసి యుండును. ఒక కాలమునందు
ఒక గొప్ప కళోపాసకుడు నిర్మించిన కళాశకలముసు అచ్చుగ్రుద్దినట్లు మరల మనము
తయారు చేయజాలము. అట్లుచేయుట కళకాదు; చేసినను అది యొక నమూనా
మాత్రమే యగును. అందు కళాసౌందర్యము లోపించితీరును. ప్రత్యేకవ్యక్తిత్వము
వైలక్షణ్యము కలిగిన నిర్మాణమే కళోపాసకుల ఆదర్శము. బింబములకు
ప్రతిబింబములను తయారుచేయుట కళోపాసకుల పనికాదు.
కవిత్వము లలితకళలలో ్రధానస్థానము నాక్రమించును - కావున కవిత్వమును
గురించి చెప్పిన విషయములు ఇతర లలిత కళలకు కారణభూతములగు విషయములు
రెండు- మొదటిది భావచిత్రము; రెండవది భావచిత్రములను హృదయ ఫలకములందు
ప్రదర్శించు మనో వికారము. కావ్యప్రపంచమున వ్యక్తుల భావచిత్రములు, వివిధ
వస్తువుల దృశ్యముల భావచిత్రములు, మానవుని సుఖదుఃఖముల భావచిత్రములు
మున్నగునవి ప్రదర్శితము లగుచున్నవి. ఈ భావచిత్రముల వెనుక కవి
యొక్కనివేకాదు, పాఠకుల మనోవికారములు కూడ గోచరించుచుండును. దుస్సహ
దుఃఖానుభోవములు, కంటికి నీరుదెచ్చి వృాదయమును కరిగించు
కరుణరసప్రపూర్ణములగు ఘట్టములు, పరమాత్మతో లీనమగుటకు అంతరాత్మ పడు
ఆవేదన మున్నగు మనో వికారములతో పాటు “దాటిపోయిన యుగముల” నాటి
చరిత్ర యొక్క భావచిత్రముల లలితకళలు మన యెదుట ప్రదర్శించుచున్నవి.
కార్యకారణ క్రమమున వివరింపరాని అనిర్వచనీయ మాధుర్యము సౌందర్యభూతి
కవిత్వము మనకొనగుచున్నది. భావచిత్రములను మనోవికారములను
90
సారస్వత నవనీతము
కళాప్రపంచమున వేరుపరచుటకు వీలులేదు. ఈ రెండు శక్తులయొక్క సరస
సమ్మేళనకు కళాసౌందర్యము రెండు శక్తులుగాక కళాప్రపంచమున అనేక యితర
విషయములు కూడ సౌందర్య దర్శనమునకు సహకారులు కావచ్చును. ఈ
సందర్భమున కళావస్తువు చారిత్రకముగా గాని ఇతరత్రముగా గాని యథార్థము
కావలసిన యవసరము లేదని మనవిచేయుట ఆవశ్యకము.
ఒక ఛాయాచిత్రమును పరికించుడు - అది ప్రపంచమునందలి యొక
మానవుని యొక్కగాని వస్తువు యొక్కగాని ప్రతిబింబము. ఈ (ప్రతిబింబము
కళాశకలము గాజాలదు. కేవలము వివిధ వర్ణములయొక్క విచిత్రసమ్మేళనము కళ
కాజాలదు. అట్లే వివిధ ధ్వనుల యోగసమ్మేళనము కూడా సంగీతము కాజాలదు.
అదియే సంగీతమైనచో గాయకుడు కానివాడు కూడ సంగీతమును రచింపవచ్చును.
తుట్టతుదకు వివిధ ధ్వనులను సాధ్యమైనన్ని విధములుగా సమ్మేళనము జేసిన తరువాత,
వివిధ శబ్దములను సాధ్యమైనన్ని విధములుగా సమ్మేళనము జేసిన తరువాత
సంగీతము, కవిత్వము ఈ ప్రపంచమునుంచి శాశ్వతముగా నిష్మమింపవలసి వచ్చును.
కావున బాహ్యస్వరూపమును గాంచి, శబ్ద వర్ణధ్వనుల సమ్మేళనముగాంచి; అదియే
నిక్క్మమగు కళయని భ్రమించుట ప్రమాదము. కళయొక్క సౌందర్యమును ప్రతిపాదించు
భావచిత్రములు, మనోవికారములు లేనిది అది కళ యెన్నటికిని కాజాలదు. కవితా
రసపిపాసువగు పాఠకుడొక (గ్రంథమును పఠించినప్పుడు శబ్దజాలము యొక్క
ఇంద్రజాలముతో సంతృప్తిపడక అందలి కావ్యసౌందర్యమును తనివిదీర
యనుభవించును. మేధాసంపద, యుక్తివాదము, వివిధ విషయపరిజ్ఞానము
ప్రపంచమునకు పరమోపకారమొనరించుట నిస్సంశయమే కాని రసపిపాసువుకు
సౌందర్య సాక్షాత్కారము కలిగించు శక్తి మాత్రము వానికి లేదు. హృదయశక్తి లేని
మేధాశక్తి, సౌందర్యములేని విజ్ఞానము, భార్యలేని భర్త యొక్క సంసారమువంటివి.
ఇట్లని కళాసౌందర్యమును తృణీకరించు శుష్మహృదయులు గ్రహింపవలెను.
కళ తత్వశాస్త్రము కాదు; కళ చరిత్రకాదు; కళ భౌతిక శాస్త్రముకాదు. గాలిలో
మేడలుకట్టుట కళ గాదు. భౌతికశాస్త్ర తత్వశాస్తములవలె యుక్తివాదముపై
ఆధారపడకున్నను, చరిత్రవలె గతకాలమున జరిగిన సంగతులను గ్రహించునది
కాకపోయినను, కళ యందు కూడ ఒక ప్రత్యేకమగు క్రమము, విలక్షణమగు సత్యము
గోచరించుచుండును. అస్పష్టమై, క్రమబద్ధముగాక చెల్లాచెదురైయున్న
91
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
మనోవికారములకు విశిష్టము క్రమబద్ధమునగు స్వరూపము నొసంగుటయే కళయొక్క
ప్రత్యేకత. కళ ఆకాశ హర్యములను నిర్మించునది గాక ప్రతిభావంతమగు సృష్టిని
గావించునది యని మనము గ్రహింపవలెను.
మన యందరికిని మనోవికారములు కలుగుచుండును. మనము
సంతోషించెదము; దుఃఖించెదము; కోపించెదము; దయార్ద హృదయుల మగుదుము.
ఆ సందర్భములందు అప్రయత్నముగా మననోటినుండి శబ్దజాలము ఉబికివచ్చును.
కాని యీ మాటలు కవిత్వము కాజాలవు. కవి యగువాడు తన మనో వికారములను
ఏకముఖము గావించి క్రమబద్ధముగా వ్యక్తీకరించునప్పుడే అది కవిత్వమగును; అందు
సౌందర్యము ప్రతిఫలించును. కాని నోటికి వచ్చిన మాటలన్నియు కవిత్వము
కాజాలవు. ప్రతిభాశాలియగు వ్యక్తిచే ప్రశాంతసమయమున సంస్మరణమునొంది
వ్యక్తమైన భావములే కళాసౌందర్యమునకు ఆటవట్టులని యొక విమర్శకుని
అభిప్రాయము. కావుననే మన యందరి హృదయములందు కలుగు మనోవికారములు
తాత్మాలికములే. కవిత్వమునందలి మనో వికారములు శాశ్వతములై యొప్పుచుండును.
అనేకులు పుత్ర శోకము ననుభవించున్నారు. ఆ సందర్భములందు మనోవికారము
లెన్నియోరీతుల ప్రదర్శించుచున్నారు. ఈ ప్రదర్శనములు, ఈ ప్రలాపములు
తాత్మాలికములు మాత్రమే. కాని కళయందలి శోకమట్టిది గాదు; దానికొక
శాశ్వతత్వము కలదు. భారతమున అభిమన్యుని వధానంతరము-
“...పోటుబంటనై- అచ్చటికేల పోయితి మహా గుణభూషణు గోలుపోయితిన్”
అను నర్జునుని శోకమున కొకవిధమగు శాశ్వతత్వము కలదు. ఇదియే కళయొక్క
విశ్వజనీనత యని చెప్పవచ్చును. కావుననే కవి వ్యక్తీకరించిన శోకము, సంతోషము,
కరుణ, వేడుక, వేదనలు ప్రత్యేక వ్యక్తిత్వములు కలిగి విశ్వజనీనములై యొప్పుచున్నవి.
ఒకేయొక భావమును ప్రదర్శించు కళ కొంత వెగటు కలిగించవచ్చును. వైవిధ్యము
కళ యొక్క అందమును ద్విగుణీకృత మొనరించును. కావుననే కాబోలు మనవారు
కావ్యమునందు అప్టాదశవర్ణనాదు లుండవలెనని విధించి కావ్యవస్తువును విశాల
పరచినారు.
కళ యొక్క ముఖ్య కర్తవ్యము ఉపదేశము, ప్రచారము, అనుశాసనము కాదు
- ఉపదేశము, ప్రచారము, అనుశాసనము అంతర్వాహినులుగా నుండవచ్చును.
కవిత్వమును కాంతాసమ్మితముగా గ్రహించిన మన ప్రాచీనులు యీ సత్యమును
92
సారస్వత నవనీతము
చక్కగా విశదీకరించినారు. “మానవజీవిత విమర్శనమే కళకు ముఖ్య ప్రతిపాదకమగు
విషయము.”
కళా సౌందర్యము యొక్క కేంద్రస్థాన మేదియను ప్రశ్న స్వాభావికముగా
కలుగుచున్నది. ఒక చక్కని అజంతా చిత్తరువును తిలకింపుడు- ఆ చిత్రము ఒక్కొక
మానవునియందు అతని సంస్కృతి ననుసరించి ఒక్కొక విధముగా సౌందర్యానుభూతి
కలిగించును. కొందరిని రవివర్మపటములే యెక్కువగా ఆకర్షించుట జూచుచున్నాము.
కావున కళాసౌందర్యమునకు ఆటపట్టులు మన హృదయములే యని చెప్పుట మిక్కిలి
సమంజసము.
పటమునందలి వర్ణములు, రేఖలు మున్నగు సాధన సామగ్రి మాత్రమే కళా
సౌందర్యమున కాటపట్టులు గావు. అర్థశాస్త్ర ప్రపంచమున నివి యుపయోగకరములగు
వస్తువులు. ఇవి కావు- అని మనము స్పష్టముగ నిర్దేశించలేని విధముగనే కళా
ప్రపంచమున గూడ ఇవి సుందరమగు వస్తువులని మన మొక కడపటి నిర్ణయము
చేయజాలము. అర్థశాస్త్రమున అవసరము, సరఫరా మున్నగు విషయాలు వస్తువుల
యుపయోగమును నిర్ణయించిన విధముగనే రసికుల మనోవృత్తి కళాప్రపంచమున
సౌందర్యనిర్ణయము గావించుచుండును.
మనము కావ్యములను శృంగారకావ్యములు, వీరకావ్యములు అని
వివిధములుగా విభజించుచున్నాము. ఇది మన సౌలభ్యమునకై చేసికొనిన విభజనమే
కాని కావ్యసౌందర్యము కొలిచి చూపు మానదండము కాదు. శాస్త్ర ప్రకారముగా
ఒక కావ్యము సర్వలక్షణ సమన్వితమై యుండవచ్చును- కాని సౌందర్యము
సంపూర్ణముగా లోపించవచ్చును. వ్యాకరణము, అలంకారశాస్త్రము, సాహిత్యశాస్త్రము
మున్నగునవి రచనాసూత్రములను బోధించి భాషా సంప్రదాయములను తెలుపుటకు
సహకారము చేయును గాని కళయొక్క అంతరాత్మను చూపించజాలవు. కళా
సౌందర్యమునకు పరమ ప్రమాణములు రసికుల హృదయములు మాత్రమే.
93
దా దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
జానపద గేయములు
వ్రాతకోతలెరుంగని సామాన్య జనులు రసోద్రిక్తులై ఆలపించు మధుర
భావగేయములు జానపద గీతములు. ఈ గేయములు సాధారణముగా
ఖండకావ్యములవలె పరిమిత పరిమాణము కలవి. అందలి భాష వ్యాకరణ బద్ధమైనది
కాదు. కృత్రిమరహితములై మిక్కిలి సహజములగు నీ గేయములందు వేదాంత
వాసనగాని తాత్వికవిభూతి గాని అంతగా కానరాదు. వివాహవేళలు, వరికోతల
సమయములు, వెన్నెల రాత్రులు, పర్వదినోత్సవము లీజానపద గేయములకు జనన
కాలములని చెప్పవచ్చును. పల్లెపట్టులలో అనాగరక గృహమునందలి కృత్రిమరహిత,
నిష్కలుషమగు వాతావరణమునకు (ప్రతిబింబము లీగేయములు. అయినను
వీనియందు ఒక అనిర్వచనీయమగు ఆనందము రామణీయకత శ్రావ్యత
గోచరించును. పదములలో సహజమగు ఉద్రేకము ఆనందదాయకమగు సరళత
ఉట్టిపడుచుండును.
సంస్కృతి,నాగరికత అభివృద్ధినంది పల్లెలు పట్టణములుగా మారినవి. ఈ
మార్చువలన జానపద గేయములందును కొంత మార్పు కలిగినది. వానియందలి
భాష ఎక్కువ సలక్షణమై, వ్యాకరణ బద్ధమై యొప్పిన దీమార్పువలననేయని
చెప్పవచ్చును. అందలి యితివృత్తము గూడ ఉన్నత కుటుంబములకు,
ధనికవర్గములకు సంబంధించినవై యొప్పినవి. మనము అనుదినము మాట్లాడుకొను
భాషయందు వ్యక్తీకరింపబడిన యీ చిన్న గేయములలో అవ్యక్తమగు నొక రామణీయత
గలదు. కొన్ని కొంత అసభ్యముగ నుండి అసహ్యము కలిగించినప్పటికిని విముఖులను
మాత్రము చేయవు. ఐతే ఇందున్న రహస్యమేమి? సాహిత్యశిల్పమా? కాదు.
ఉదాత్తమగు ఇతివృత్తమా? కాదు. సాధారణముగా ఇవి మిక్కిలి చిన్నవై అకస్మాత్తుగా
ముగియుచుండి కొంత జాగ్రత్తగా పరిశీలించినచో మనమెంత విద్యావంతులమైనను
మనమెంత విజ్ఞానము నార్జించినను తప్పక ఆకర్షించుచుండును. మానవ
స్వభావమునందలి సహజ సరళ సుందర భావములు వీనియందు మనోహరముగా
కూర్చబడి యుండుటయే ఇందలి రహస్యమని తెలియుచున్నది.
ప్రకృతిమాత స్తన్యపానమున మైమరచి యాలపించిన భావగేయములీ పాటలు
గావున అదిగూడ వాని కమ్మందమునకొక కారణమని చెప్పవచ్చును. ఈ విశాల
విశ్వమునందు ఏ యజ్ఞాత ప్రదేశముననో ఎట్టి దోహదక్రియలు లేక పెరిగి పుష్పించి
94
సారస్వత నవనీతము
ఫలించు పచ్చని యడవి తోటలే ఈ గేయములని చెప్పవచ్చును. ఈ గేయములు
మన పూర్వలాక్షిణికుల నెవ్వరిని ఆకర్షించలేదు. కాని ఇవి జానపదుల హృదయగత
భావములు అణగియుండనేరక యుబికివచ్చి కవితా స్వరూపమును దాల్చిన
సారస్వతమని నా అభిప్రాయము.
ఇంటిలో (స్రీలు వేడుకగా పాడుకొను పాటలు సంతోష సమయములందు
అందరును కలిసి ఆలపించుటకో, పరిశ్రమ జేయునప్పుడు అలసట దీర్చుకొనుటకో
ఉపకరించుచున్నవి. ఈ నాటి నాగరిక సంఘమునుండి యీ పాటలు క్రమక్రముగా
నిష్రమించుచున్నవి. ఆధునిక యుగమున ఆంధ్రభాష పునర్వికాసారంభమున
పునరుద్ధరించవలసిన యీ పాటలు ఎన్నియో తెగలుగా నున్నవి.
ఇందులో మొదటి వర్గము గృహములో శిశూదయము కలిగినప్పుడు పట్టరాని
ఆనందముచే ప్రబోధితములు. ఈ విధములగు పాటలలో నిండుచూలాలి ప్రసవవేదన,
ఆ సందర్భమున కుటుంబము నందలి రక్తసంబంధము కలవారి హృదయములందలి
ఉద్వేగము మంత్రసాని కౌశల్యము, శిశూదయము తరువాత జరుగు ముద్దు ముచ్చటలు
వినువారిని ముగ్గులను జేయుచున్నవి.
కడుపారగన్న చిన్నారి శిశువును ఊయెలలో నుంచి యూచునపుడు
మాతృహృదయము నందు గలుగు మధురభావములు వ్యక్తీకరించు పాటలు మరికొన్ని,
అవి చక్కగా పాడినచో ఎట్టివాడైనను నిద్దురచే తూగకమానరు. వానినే మనవారు
లాలిపాటలందురు.
తన హృదయములో దాగియున్న భావములను బయలు పెట్ట జాలక
అమ్మయమ్మాయని యేడ్చుచు నినాదాలు చేయు శిశువును తల్లి యెంత
ఊరడించదలచినను అంత ఎక్కువగా యేడ్చునప్పుడు తొట్టిలోనుంచి శిశువును
దీసియెత్తుకొని చందమామను జూపించి ఆ సుందరమూర్తిని చందమామరావె
జాబిల్లిరావె, వచ్చి బాబుకు ముద్దిచ్చిపోవె అని యుపలాలించు తరుణమెంత
మధురమైనది : బాల్యక్రీడావిశేషములను వర్ణించుపాటలు మరికొన్ని గలవు. ఈ
పాటలు శైశవదశయందలి ఆనందమును అనుసంధించు చుండును. చూడుడు-
కాళ్లాగజ్జ, కంకణమ్ము
కమ్మనితోట, నిమ్మలదావి
పచ్చనిఅడుగు, కుచ్చులపొదలు
తెల్లనిపూలూ, తియ్యనిబాలూ,
95
డా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
అని బాలికలు పాడుచున్నప్పటి దృశ్యమెంత అందమైనది. ఈ పాటలలో కొన్ని
పండుగనాటి వేడుకలకు సంబంధించినవి. ఈ పండుగలలో (ప్రముఖమైనది
సంక్రాంతి. సంక్రాంతి ముగ్గులు దీర్చుట మున్నగు క్రీడా విశేషములు ఆంధ్రబాలికలకు
అత్యంత (ప్రేమపాత్రములు. చక్కగా అలంకరించుకొని వస్రాలంకారవిభూషితలై
బాలికలు మంగళగౌరిని పూజించుచు పాడుపాటలు మనకు మిక్కిలి పరిచితములైనవి.
శ్రావణ మంగళవారము పాటలు మున్నగునవి గూడ యిట్టివేయని చెప్పవచ్చును.
వివాహాది శుభ సందర్భములు వేదోక్త విధానములకే గాక ఆట పాటలకును
ఆటపట్టులు. వధువు మంగళస్నాన మాచరించునప్పుడు, తిలకమును నొసటిపైన
బుగ్గలమీద దిద్దునపుడు, అగ్నిహోత్రము ముందు తీసికొనివచ్చునప్పుడు రమణీమణులు
పాటలుపాడు ఆచారము కలదు. వివాహ సందర్భమున వధూవరులకు మధ్యనున్న
పరదా తొలగింపగా ప్రప్రథమమున వధూవరులొండొరులను జూచుకొనునప్పుడు
పాడు పాటలు మధురభావోపేతములు. శోభనపుగదిలోనికి వధూవరుల పంపునపుడు
సుందరాంగులు మందహాసముతో పాడు పాటలు రసోన్మత్తత కలిగించునవిగా నుండి
ఆ పడుచు స్త్రీల మధ్య నొంటరిగా నున్న ఆ వరుని యవస్థ వ్యక్తీకరించుచున్నవి.
ఓ నల్లనికాక ఈ మంచి ముత్యమును నీవెట్లు సాధించితివి అని
అన్యాపదేశముగా వరుని పరిహసించి నవ్వించుచుండు నీపాటలకు, తలుపు దగ్గరి
పాటలకును దగ్గరి చుట్టరికము కలదు. శోభనము రెండవనాడో మూడవనాడో వధువు
గదిలో ప్రవేశించి తలుపు దగ్గర వైచుకొనగా వరుడు వచ్చు సన్నివేశము యీ పాటలకు
మూలాధారము.
తలుపుతీయవె భామా - నే ద్వారక ధాముడనేభామా
జాజిపువ్వుల సరములు తెచ్చితి - గొజ్జగిపువ్వుల గుత్తులు దెచ్చితి
జాజిపువ్వులవి సత్యకు కావలె - గొజ్జగి పూలవి కోరును రుక్మిణి
ద్వారక కీయెడ దారులు లేవోయీ
“నిలువజాలని బాళిని తూలుచు కలికిరో నిను కలియవచ్చితిని, పలుకులను
పన్నీరుచుక్కలు చిలుక పలుకదవే, పచ్చితేనెలు పొంగి వరదలుపారు నీ
చిగురాకువాతెజ వెచ్చవెచ్చగ ద్రాగనిది నావిరహ దాహము తీరు టెటులో?” ఇవి
కొన్ని యుదాహరణములు మాత్రమే. ఇందులో కొన్ని ప్రకృతి పురుషుల లీలావిలాస
పరముగా వేదాంత తత్వమును వివరించునవి. కొన్ని వీనిలో యెక్కువ ప్రణయ
96
సారన్వత నవనీతము
సాగరమున నీదు పడుచు జంటల శృంగార విలాసమునకు సంబంధించినవి. ఈ
శృంగార సంబంధములగు పాటలు వివిధములుగా నున్నవి. ఓరోరి బండివాడ -
ఒంటెద్దు బండివాడ నిలుపు నీబండి ఆపు నీబండి.
చిన్నగన్నెరుపువ్వు చీరగట్టినదాన చిలుక రెక్కలరైక బిగియ దొడిగినదాన
కుదురుపాపటతీసి కురులుదువ్వినదాన నుదుట కస్తురి కాయ చిదురు పెట్టినదాన
వంటి పాటలు శృంగారోద్రేకమును ప్రకటించుచుండును. సాయంకాలము నందు
పశువులమందను తోలుకొని వచ్చు బాలకుడో లేక ఎద్దులబండిని తోలుకొని పోవు
యువకుడో వీనిని మైమరచి పాడుచుండుట మనము బహుపర్యాయములు జూచియే
యున్నాము. జానపదులను మైమరిపించు నీపాటలు విద్యాధికులను గూడ సుందర
భావోపేతములై ఆకర్షించు చున్నవి. ఈ పాటలు సహృదయులను భావడోలికలందు
వూయెల లూగించుచుండును. ప్రొద్దు పొడవకముందు పాడు మరికొన్ని పాటలును
కలవు. నిజముగా నివి రాత్రి చాలాసేపు విలాసములందు నిమగ్నులై నిద్రించియున్న
వారిని లేపుట కుద్దేశింపబడినవి.
మేలుకొనరా ధూర్తకృష్ణుడ మేలుకొనరా ధీరచోరుడ మేలుమేలెపుడొచ్చి నాపడకిల్లు
సొచ్చితి రాతిరీ, తూర్పు రేఖలు తెల్లవారెను త్రోవలను వినబడె సందడి అత్తమామలు
మెసలుచున్నా రల్లరుల పాల్సేయకుమునను, మందకేగిన నామగడు వచ్చె వేళ ఆయెను
మరది లేచిన పరువునిలువదు మసలకుర ఈ దొంగనిద్రను తమ్మ ఉమిసితి
నిచ్చటిచ్చట తగనిబిడ్డల తోడికోడలు సొమ్మసిల్లినయట్లు కదలవు చోరుడా ఇక
మేలుకో మరియొక్క మారురా.
తెల్లవారెనమ్మ చెల్లె నేనేమందు, నల్లని నాస్వామి లేరా
మరల రెప్పలుమూసి మసలుచున్నావు, మర్యాద నిలదింకపోరా
తెలతెలవారెను దిశలెల్లచూడరా, తిరిగి రావచ్చునుపోరా
తరుణులెల్లను లేచి, పెరుగుచిల్ముచున్నారు తడయరాదిక మీదపోరా
అరకన్ను నలరవాల్చి అటునిటు చూచేవు, కరుణించినను వీడిపోరా
గుసగుసమాటాడా కూడదంటే నీవు గుజుకొట్టుచున్నావులేరా
చిన్న దానట్లు నాసిగ్గెల్ల చెరిపితి శీఘ్రమేయిక లేచిపోరా
పొమ్మంటినంచు నీ బుద్ధిలోనుంచాకు ప్రొద్దులేదనియంటిపోరా
ఈ ప్రొడ్దుపొడపు పాటలలో పైన వివరించిన శృంగార క్రీడలకు సంబంధించినవే
కాక వేదాంతార్థ ప్రతి పాదకములగునవి కూడ కలవు.
97
దా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
పొలములలో కాయకష్టము జేయువారు పాడుపాటలు కొన్ని కలవు. ఈ
పాటలకు ఇతివృత్తము వ్యవసాయ సంబంధ కార్యకలాపమో లేక తమ కుటుంబ
విషయమో అయియున్నవి. విత్తనములు నాటునప్పుడు వరులు కోయునప్పుడు ఈ
పాటలు కలిసి పాడుట ఆచారము.
తొలకర్లు తొంగిచూచె సిరిసిరిమువ్వా మొలుకలు మొగమెత్తె సిరిసిరి, చాళ్ల
సాగినపైరు సరిపొట్టలీనాలె, పండినాపంటలు పాతళ్లు నిండాలె, మిడతపోటడకుండ
మేడాలునడపాలె, సామమేసినకోడె నేవళంగొస్తాది ఆకోడె తొక్కితే అరచిపండును
భూమి.
ఒకపెద్ద బరువును మోయునప్పుడు ఒక కష్టమును చేయునప్పుడు గాని పాడు
పాటలు మరికొన్ని కలవు.
సముద్రమే ఈదాడు చలిలేక సిరిస్వామి
విసమునే మింగాడు వెరవకా విస్సన్న
వరదనే ఆపాడు కరములా రావణుడు
కొట్టరా ఆ చెట్టు నెట్టరా ఆ గుండు.
పిండి విసరునప్పుడు పాడు తీయని పాట నొకమారు తిలకింపుడు.
తిరగాలే మాయింట తిరగాలీ
ఈ ప్రొద్దు తియ్యని కుడుములు
నెయ్యితో వుడుకంగ
కుండలో కవ్వము కులికి తిరిగినయట్టు,
బొమ్మతోడాసారె దిమ్మ తిరిగినయట్లు,
గుండాన బాపండు కుడిచే తిరిగినట్లు.
సువ్విసువ్వి రామచంద్ర, సువ్విసువ్వి రామచంద్ర
సువ్విసీతమ్మ మాకు శుభములిమ్మా
పసిడి రోకళ్లు పట్టి భామలపుడు సువ్విదంప
కనుల పండువాయె కౌసల్య కపుడు.
ఈ పాటలలో పెద్దవి కూడ కలవు. ఇవి యెక్కువగా పురాణకథలకు
సంబంధించినవి. చక్కని జాతీయములతో మిక్కిలి శ్రావ్యములై యెప్పుచున్న వీపాటలు.
ఇవి ముఖ్యముగా స్త్రీలు తీరిక సమయములందు పాడుకొనునవి. ఈ పాటలు పాడుట
98
సారస్వత నవనీతము
స్త్రీల కొక క్రీడా విశేషము, అభిమానాస్పదమగు కళ. ఆధునిక నాగరికత ప్రభావమున
యీ పాటలు ప్రస్తుతము మన గృహముల నుండి నిష్కమించుచున్నవి. కాని వీనిని
తిరిగి యథాస్థానమున ప్రతిష్టించుట మనవిధి. ఈ పాటలలోని చక్కని భాష
జాతీయోక్తులు, సాంసారిక సౌందర్యము ప్రకటించుచు రమణీయముగా నుండును
చూడుడు.
కస్తూరి రంగరంగా నాయన్న కోనేటి రంగరంగా
దేవకీ గర్భమందు కృష్ణావతారుడై జన్మించెనూ
నేలపై బడ్డయపుడె ఆచిన్న బాల కావుకావనుచు
ప్రోలెల్ల మేలుకొనగా కిలకిలా కేరింతలాడసాగె
రేపల్లె చంద్రుడమ్మా ఈ బిడ్డ మాపిన్ని మదనుడమ్మా
నవనీత చోరుడమ్మా ఈబిడ్డ నందగోపాలుడమ్మా
రామలాలీ మేఘ శ్యామలాలీ
తామరసనయనా దశరథ తనయలాలీ
చిన్నముద్దుల నాన్నా సిరులముద్భులనాన్నా
వెచ్చ వెచ్చని పాలు ఇచ్చమీరగ త్రాగి
కుచ్చుల్ల పొత్తికల ముచ్చటగ పవళించి.
ఇంత చక్కని తెనుగుభాష తెనుగు జాతీయమునకు బదులుగా సంస్కృత
సమాసములు మన వాజ్మయమున ప్రధాన పాత్ర వహించుట శోచనీయము.
సహృదయుడగు యే సారస్వత విమర్శకుడును వీనిని విస్మరింపజాలడు. ఈ
పాటయందలి చక్కని తెనుగు నుడికారమునకు మెరుగులు దిద్దవలసిన బాధ్యత
ఆధునిక సారస్వతోపాసకుల యందు కలదు. 'సీతసమర్త చిలుక రాయబారము
కుశలవకథ, బొబ్బిలికథ, బాలనాగమ్మ, లక్ష్మమ్మకథ, దేసింగురాజు కథ మున్నగునవి
యీ పెద్ద పాటలలో పేర్కొనదగినవి.
సీతమ్మ సమర్త నోరారపాడని పడుచులు మిక్కిలి యరుదని చెప్పవచ్చును.
నేటి నాగరికయువతీయువకులు తప్ప. ఈ పాటల యందు కల్పనా
చమత్మారమునకన్న భాషా సౌందర్యము భావసౌకుమార్యము, నుడికారమునందలి
శ్రావ్యత మిక్కిలి మెచ్చదగియున్నవి.
99
డా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
శ్రీరాముల పట్టపుదేవి, సీత సమర్హాడిందీ
వేగజూచి చెప్పండీ ఒక వేడుకచేయవలె రామచంద్రా
అప్పుడు పంచాంగంబుల విప్పిచూచి మునులెల్లా
మంచిది హస్తానక్షత్రము పంచమి సోమవారమ్ము
మించగలేదిపు డభిజితు మంచిముహూర్తమె రామచంద్రా
పరమ పతివ్రతయై యుండును పలువురు పుత్రుల గనునూ
పట్టమహిషియై అఖండరాజ్యము పాలించును రామచంద్రా
కడువేడుకతో కౌసల్యాసతి వడివడి చెలులను పిలిచీ
పేరంటాండ్రను పిలిపించె కడువేడుక చేయవలె రామచంద్రా
పచ్చిపసుపూ సలిచి సీతకు పట్టుచీర కట్టించిరి
జిలువన్నెల తళుకుల రవికా తొడిగించిరి రామచంద్రా
నలుదిక్కులనూ పెట్టిరి దీపమ్ములూ రామచంద్రా
మూడవదినము తొలిసమర్తకూ వేడుకలన్నీ చేసి
చేడెను నాల్గవనాడు జలకములాడించిరి రామచంద్రా
ఈ విధముగా సుమారు రెండువందల పంక్తులలో యీపాట వ్యాపించి యున్నది.
సీతాదేవి శోభనపు ముచ్చట యెంత ముద్దుగా వర్ణింపబడినదో తిలకింపుడు.
“ఉల్లాసముతో గృహమున రఘువల్లభునీ ఉంచి
చల్లచల్లగా జారిరి సీతా సఖులెల్లరు రామచంద్రా
నెలతయుండుమా నీవనిచెప్పుచు తలుపు తటాలున జేర్చి
పలపల నడవగ జానకి వణకసాగెను రామచంద్రా
తలుపు దగ్గర సీతగుండెలు తటతట సుడిదిరుగా
సిగ్గు చెండాడగా స్రుగ్గిమగ్గిసలయి భయపడె రామచంద్రా
ఆంగుళిగల రత్నపుటుంగరమటు దొరలించీ
అంగనవో నాయుంగరమదే అందింతువెయనె రామచంద్రా.
సరళములు, సభ్యములు, స్వభావ సుందరమగు నీపంక్తులు వినువారిని
పులకాంకిత గాత్రులను గావించి మరల నొక్మమారు శోభనపు పెండ్లికొడుకులనుగా
జేసితీరును. కళా సౌందర్యము ప్రతిఫలించు నీ ఘట్టమును ప్రబంధకవుల
శోభనవర్ణనముతో పోల్చినప్పుడు లాక్షణికుల యాజ్ఞాప్రకారము చిత్రించిన ఆ
పటముకన్న యీ చిత్రము యెంత మనోజ్ఞము మరియు సభ్యతరమై యున్నదో
100
సారన్వత నవనీతము
గోచరించితీరును. ప్రబంధములయందలి వర్ణనలు కృత్రిమములై పాడినదే పాటగా
కొంతవరకు అసభ్యములుగా కూడా నుండును. కాని యీ పాటల యందలి నాజూకు
వర్ణనలు మనల నానంద డోళికలయందు ఉయ్యాల లూగించుచున్నవి.
ధర్మరాజు జూదము ఈ పెద్దపాటలలో పేర్కొనదగినది. జూదములొక కళగా
మన పూర్వులు భావించిరి. మహాభారతాదులందువలె యీ ధర్మరాజు
జూదమునందుగూడ చదువరుల కొక నందేవాము కలుగుచున్నది.
ద్యూతకళానిపుణుడగు ధర్మరాజు ఎట్లోడిపోయెనా అను ప్రశ్నకు సంతృప్తికరమగు
సమాధానము దొరుకుటలేదు. ఈ ధర్మరాజు జూదమునందు జ్యేష్టాదేవికిని,
లక్ష్మీదేవికిని మధ్య జరిగిన సంభాషణ కొంత వింతగాను అస్వాభావికముగాను
కానుపించుచున్నది. కొన్ని పనులు జేయుట వలన ప్రజలను లక్ష్మీదేవి వదలిపెట్టి
తన అక్కగారి యేలుబడి కప్పగించవలెనని జ్యేష్టాదేవి తన చెల్లెలిని అర్థించి
సమ్మతింపజేయుట కొంత వింతగానే యున్నది.
ఈ పనులు జేయుటవలననే ధర్మరాజు కూడా ఓడిపోయినట్లు తెలియుచున్నది.
“చేటలోపలపండ్లు చెరిపిన్ననాడు మంచంబు ఓరగా పెట్టినానాడు
అరికాలునిండుగా తడువనీనాడు నాడునిను కొలువనని పలికితీ నేను
అలికివిడిచిన గడప దాటడేరాజు దివ్వెలేనిగృహమున తిరుగడే అతడు
నీరాడలేనింట నిలవడే తల్లి ఆడిమిగిలిన జలము లాడడేరాజు
కట్టివిడిచినగుడ్డ కట్టడేరాజు జంటగా పెండ్లిండ్లు శాయడేరాజు
ఒడిలోన పువ్వులు కోయడే అతడు,
అని దారిద్యకారణములు వివరింప బడినవి.
(శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారి ఒక ఆంగ్ల ఉపన్యాసము ఇందుకు ఆధారము)
101
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
8.
tes) ని
స్త్రీల పాటలలోని కవిత్వము
“ఏడువకు యేడువకు వెణ్టినాగన్న ఏడిస్తెనీకండ్లు నీలాలుగారు
నీలాలుగారితే నే జూడలేను పాలైనగారవే బంగారుకండ్ల”
అని యే చల్లనితల్లి తీయని యెలుగున యెప్పుడు తొలిసారిగా యుయ్యెల
నూచినదో కాని ఆ రమణీయగేయము వినినవ్చుడెల్ల యేదో యొక
యనిర్వచనీయమగు రసానుభూతి కలిగి ముగ్గులమై మరియొక్మమారా గేయమును
విన నువ్విళ్ళూరు చుందుము. తెనుగు తీయదనము, భావంపుచక్కదనముతో
తులదూగు రచనలు సంస్కృత సమాసాభిరామములై వివిధాలంకార శోభితములగు
నాంధ్రప్రబంధ ములయందును కడుస్వల్పములనుట అతియోశక్తి కానేరదు.
సంగీత సాహిత్యములు
సంగీత సాహిత్యములు శారదాదేవికి స్రనద్వయమని వర్ణించుట మన సాహితీ
సంప్రదాయము. శారద సమస్త విద్యాప్రదాయినియే కాదు; సకల కళాస్వరూపిణికూడ.
సూరనార్యుడు రంభా నలకూబరుల విలాస వర్ణనావసరమున ఆ వేలుపు వెలవెలంది
గళస్వనమున నపురూపమగు మాధుర్యము నొలికించినాడు.
మున్నెన్నడు కనివిని యెరుంగని యా కోమల గళస్వనము నాలకించి
“మరియొక్కమారు, మరియొక్మమా” రని కుబేరనందనుడు కొసరి, కొసరి యామెను
ప్రార్థించినాడు.
ఎటనుంచి యాలకించెనో చతుర్ముఖుడు ఆ గళస్వనమాధుర్యమునకు
మైమరచియే కాబోలు, చక్కెరబోడుల కంఠములందు కమ్మదనము చిలుకరించినాడు.
కావుననే సంగీత మెలనాగల స్వత్వమై యొప్పుచున్నది.
సంగీతమే యననేల? జాతీయములతో నొప్పు చక్కని సంభాషణా చాతుర్యము
స్రీలకు వెన్నతోడ బెట్టినవిద్య. ఈ రెండు గుణములు వారి వేడుకపాటలయందు
ప్రతిబింబించుచున్నవి.. ఈనాడు అన్యభాషా కలుషితమై ఆంధ్రభాష పురుషుల
వాగ్రూపమున వికారముగా ప్రత్యక్షమగుచున్నది. అద్దాని నిక్కంపు సొగసు యింకను
మన చెలియల పలుకులయందే నెలకొనియున్నది. భామామణులు భావాల భరిణెలు;
వారి హృదయములు రసార్ధములు. ఈ రసాగ్ధత వారి వేడుకపాటలయందు
ప్రతిబింబించుచున్నది.
102
సారస్వత నవనీతము
సంఘముయొక్క వివిధ సమస్యల కాలవాలములగు స్త్రీల పాటలు మన
సాంసారిక సౌందర్యమునకు ప్రతిబింబములు. కళా స్వరూపమగు కసుగందుల
నిదురపుచ్చుటకై యుయ్యెల నూచునప్పుడు, తోడి నెచ్చెలులతోడ పూదోటయందు
మెలగునవ్పుడు, వివాహాది శుభకార్యములందు వరునగల వనితలతో
లేబరియాచకములనాడు నవసరమున, మంగళగౌరి, శ్రావణ శుక్రవారము మున్నగు
నోములు నోచునప్పుడును మగువల మనసులు భావాగ్టములగుట సహజము.
తత్భలితమే వారి గేయ సముదాయము.
జోలపాటలు : లాలిపాటలు
జోలపాటలు, లాలిపాటలు ముఖ్యముగా శబ్దచిత్ర ప్రధానములు. లలిత
సంస్కృత పద బహుళములు. చూడుడు: -
“జో రవికుల శుభాంగ, జో సన్నుతాంగ”
“లాలి బంగరుబొమ్మ లాలి మా యమ్మ
లాలి ముద్దులగుమ్మ లాలి సీతమ్మ”
“పగడంపు రతనాల పసితొట్టెగట్టి,
సొగసైన పైడి గొల్సుల చేతబట్టి
మగువ లూచెదరు సంభ్రమము లెగదొట్టి
మొగలి రేకులు కొప్పులనిండ జుట్టి,
మొలక నవ్వులు వెన్నెలలు వెదజల్లు
తళుకుచూపులు దిక్కులు పిక్కటిల్ల” గా
లాలి యూచునపుడు-
“గాజు లొరయగను కంకణములు జార;
జాజి కొప్పులనుండి జలజల రాల
తేజ మలరగ నందియలు రవళిల్ల
రాజముఖు లూచెదరు...”
అను సుందర వాతావరణ మెంత యాహ్లోదకరము!
ఆభరణ ప్రీతి
స్రీలకు భూషణాలంకారములయెడ గలుగు సహజప్రీతి కిది నిదర్శనము. పచ్చ
10
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
కర్పూరము, అత్తరువు, పన్నీరు, మొల్లలు, తెల్ల చేమంతులు మున్నగు భోగ్యవస్తువులు,
వారి పాటలయందు కొల్లలు. రమణులకు ప్రియతమములగు నీ వస్తువులు రసికుల
కానందప్రదములు గదా!
వరుసపాటలలో పెండ్లికొడుకుతో మరదండ్రు హాస్యమాడుట, వదినె మరదండ్ర
యన్యోన్య పరిహాస ప్రసంగము, వియ్యపురాండ్ర నెయ్యపుతీయము ముఖ్యములు.
కాని, వీనియందటనట కొన్ని యసభ్యములు గోచరించుట మన దురదృష్టము.
వింతవింత రంగులచీరెలు, వాని కనుగుణములైన రవికెలు, మానవతీమణులు
మక్కువతో నపేక్షించే వస్తువులు. ఈ వస్తు (పేమ వారి పాటలయందు
సమయోచితముగా సవిశేషముగా వ్యక్తమగుచున్నది.
“సంపెంగ పువుచీరె, కెంపునీలపు రవికె
ముడితెల్లనిచీరె, నిండు మొగ్గలుగల రవికె,
నిమ్మకాయ వన్నెచీరె, నీలివన్నె రవికె.”
అను జతలు వీరిపాటలలో మనకు కనులపండువొనరించును. ఇది జదువునపుడు
మన నవ్య కవికుమారుల సెనగపూరైక దొడిగిన చిన్నది మనవైపు తొంగిచూచుచున్నది.
తలుపు దగ్గర పాట
తలుపుదగ్గరిపాటలు కొన్ని మిక్కిలి రమ్యములు. వీనిలో నాయికా నాయికుల
సంభాషణా చాతుర్యము స్తవనీయము. నాయిక ప్రణయకోపము వహించియుండ
నాయకుడామెను ప్రసన్న నొనర్చుటకు స్వీయవర్తనము సమర్థించుకొను యత్న
మాపాటలకు ప్రాణాధారము. జిలుగు బంగరుచీరెలు, రత్నములు దాపిన రవికెలు,
దవనము, మరువము మున్నగు విలాసవస్తువుల లంచమునిచ్చి, ఆమె యనుగ్రహము
నపేక్షించును. కాని, యామె మాత్రమిది వేళగాదని కచ్చితముగా పలుకుచున్నది.
చూడుడు: -
“జిలుగు బంగరుచీరెలు దెస్తిని సమ్మతిపడవే భామా”
“జిలుగు బంగరుచీరెలు దెచ్చితె వేళగాదుపోవోయి.”
“సత్యభామ, నీచక్కని జడలకు జాజులైన ముడిచేనే,
విరజాజులైన ముడిచేనే”
“జాజులుముడిచే సఖియలుమాకు చాలగలరు పోవోయి”
104
సారస్వత నవనీతము
“వనితరొ వినవె సత్యభామ నీపాదములకు మొక్కేనే”
“అవుతలి వీధిన రుక్మిణియున్నది ఆయుష్మంతుడవోయి,
దీర్చాయుష్మంతుడవోయి.”
తుదకు ఎట్లో తలుపుతెరచి లోనికి రానిచ్చినది. సఖుని సందర్శనమైనంతనే
సకియకు సందేహము లెక్కువైనవి. ప్రత్యక్షముగా గన్పట్టు రతి చిహ్నములుగాంచి
యూరకుండలేక పోయినది. అప్పుడు వారి సంభాషణ: -
“గోవిందుడ నీచక్కని గోటికొనలు కందెనేమోయి”
“గోవర్ధనగిరి పర్వతమెత్తితె గోళ్లుకందెనె భామా”
“సరసిజాక్ష నీ అధరము నొక్కిన సారసాక్షి యెవరోయి?
ఆ సారసాక్షి యెవరోయి?”
“తరుణిరొ అదియొక ఫలమని చిలుకలు తగిలిపొడిచెనేభామా”
“వరదుడ నీచెక్కుల నెలవంక లున్నవేమోయి?
నెలవంకలున్న వేమోయి?”
“గోరువంకలు పట్టుకరాగా, గొరికెనె యవి ముద్దులగుమ్మా”
“సారసాక్ష నీ మేన తెల్లని చందనమెక్కడిదోయీ?”
“పూలదోటలో విహరింపగ పుప్పొడిరాలెనె తరుణీ,
ఆ పుప్పొడిరాలెనె తరుణీ”
“పూలతోటలో విహరించుటకు పోయిన గారణమేమోయి?
ఆ పోయిన కారణమేమోయి?”
“పావురము దప్పించుకపోగా పట్టబోతినే చెలియా,
పట్టబోతినే చెలియా!”
“దేవదేవ నీ బుగ్గను కాటుక దిద్దిన సఖి ఎవతోయీ!
ఆ దిద్దిన సఖి యెవతోయీ?”
“గ్రక్కున చెమటకు గారిన కస్తురి చుక్కబొట్టు, వో మగువా!
అది చుక్కబొట్టు వో మగువా!”
ఈ సుకుమార శృంగారచిత్రము ముందు ప్రబంధాదుల యందలి
జుగుప్పాకరములగు వర్ణనలు నిస్తేజములుగదా! గోరువంకలు పట్టుట, పావురములతో
105
డా॥ దేవులపల్లి రామానుజరావు (గ్రంథావళి
నాడుట, చిలుకల పలుకులు వినుట, రసికుల కాహ్లాదకరములగు క్రీడలు గాబోలు!
అన్య దేశీయ దాన్యముచే చైతన్యముడిగిన మనకు కుక్కలనుబెంచుట,
వాసనాహీనములగు కాగితపు పూలను ముడిచికొనుటయే నాగరికతా లక్షణమగుట
ఎట్టి విపరీతము, దౌర్భాగ్యము!
కుమార్తెపై గారాబం
చిన్ననాట నుండియు మిగుల గారాబముతో బెంచిన ప్రియ కుమారిక
నత్తవారింటి కంపు సందర్భమున కన్నీళ్ళతో వా
“ఎన్నడు నినువిడిచి యెడబాయనైతి,
కన్నతల్లిరొ నేను గడతేరు టెట్లు?
బొమ్మరిండ్లనుగట్టి పొలతుల బిలిచి
అమ్మరో యెవరింక ఆటలాడుదురు?
వేర్వేరు బొమ్మలపెండ్లిండ్లు జేసి
చిట్టిబొట్టు నోములా చేడెలగూడి
ఎవ్వార లికను మా యింట నోచెదరు?
నెయ్యగత్తెలగూడి నిండు వేడుకను
ఉయ్యాల లెవ్వార లూగుదురింక”
అని మాతృడ్రేమ ముట్టిపడునట్లు వచియించు సన్నివేశమెంత రసస్ఫోరకము?
చెలికత్తెల పరిహాస వాక్యములు
వీరి పాటలలో మంగళహారతులకు మేలుకొలుపులకు ముఖ్యస్థానము కలదు.
పురాణగాథలు - అందు ముఖ్యముగా రామాయణ కథను మన స్రీలెన్నియో విధముల
తనవిదీర పాడుకొందురు. సీతమ్మ వారికి ఇలవేలుపు. ఆమె కల్యాణసందర్భమున
'పేరంటాండ్రు తమలో తామాడుకొను పలుకుల నొకమా రాలకింపుము: -
“పడతి నీకందమే పట్టంచుచీరె
మణిపతక మొక్కటి మగువ మాకియవె
ఎక్కడిదె యీచీరె యింతిరో నీకు
మొక్కగా నావిభుడు మొన్న దెప్పించె
ఎలనాగ యొక్కడిదె యీ బన్నసరము
106
సారస్వత నవనీతము
వెలబెట్టి చేయించె వెలది నా విభుడు
ఓ సెమ్మ నీకింత యొయ్యార మటనె
చూచిన నెవరైన సొరిది నవ్వెదరు
పయ్యెద జారెను పద్మాయతాక్షి
చయ్యన పతివచ్చె సవరించుకొనవె,”
అను సహజోపేత రమణీయోక్తులు శ్రోత్రరసాయనములు కదా!
కల్యాణ సందర్భమున సీతమ్మకు జేసిన యలంకారము గనుల గట్టునట్లు
వర్ణింపబడిన దీ పాటలయందు.
రూపవర్ణనా చాతుర్యము
ఈ పాటలలో రూపవర్ణనాచాతుర్యము మిక్కిలి ప్రశంసనీయం.
“చేమంతి రేకులే చెలియచెక్కిళ్ళు
దానిమ్మగింజలే తరుణి పల్వరుస”
అనునదొక చిన్నియుదాహరణము. తన చెల్లెండ్రతో శాంతాసమేతయైన సీతమ్మను
రామచంద్రుడు కొంత దూరమునుండి చూచి శతృఘ్నునితో:
“చుక్కలలో బాలచంద్రుడున్నట్లు,
కొలువయి కూర్చున్న మన యక్క జూడు
అందరి లోపల సుందరి ననుచు
అష్టవంకర్లతో మీ వదినె జూడు”
అని పల్క, నా యనుజన్ముడు,
“ఆదిలక్ష్మి సీత ఆ లోకమాత” అని వదిన గారిని ప్రశంసించును. సీతమ్మ
యాంధ్ర సుందరులపాలిటి యమృతావతారము. కాననే యెన్నడోపాపరాజు -
“మ॥ జననీ నీవు మహాపతివ్రతవు, నీ సౌశీల్యమిల్లాం డ్రకెల్లనుమేల్చంతి”
యని ముక్తకంఠముతో కీర్తించినాడు.
ఆ లక్ష్మణు డన్నగారితో వనవాసమొనరించిన పదునాలుగేండ్లును, పాపము
సాధ్వీమణి ఊర్మిళాదేవి అన్నపానములు వర్ణించి సుషుప్త్యవస్థలో నుండెనట. తిరిగి
సౌమిత్రి అయోధ్యనగరమునకు వచ్చినది కూడ ఆమెకు స్మృతియే లేదు. ఆ యవస్థలో
లక్ష్మణుడు భార్యకడకేగి ప్రక్కన కూర్చుండగా, నామె:-
107
డా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
లక్ష్మణ ఊర్మిళా సంభాషణ
“అయ్య మీ రెవరయ్యా మీరింత
యాగడంబులకొస్తిరీ,
సందుగొందులు వెదుకుచూ మీ రింత
జంకులేకిట కొస్తిరీ,
ఎవ్వరును లేనివేళ మీరిప్పు డేకాంతముల కొస్తిరా?
మా తండ్రి జనకరాజు వింటె మిము నిప్పుడాజ్ఞ సేయగమానరూ
మాయక్క బావ విన్నా మీకిపుడు ప్రాణాలకే హానివచ్చు
మా యక్క మరది వింటె, మిమ్మిపుడు బ్రతుకనివ్వరు జగతిలో
హెచ్చయిన వంశానికి అపకీర్తివచ్చె నేనేమిసేతూ”
అని దుఃఖపౌరుషములతో క్షత్రియాంగన కావున రోష కషాయితాక్షయై వచించెనట.
శాంతమ్మ యచ్చముగా నాంధ్రులయింటి ఆడుబిడ్డ. ఆమెకు మరదండ్రతో
పరిహాసమాడుటయన్న మిక్కిలి ముచ్చట. కావున, యూర్మిళను గూర్చి యామె యక్క
చెల్లెండ్లతో - శాంతమ్మ :
“పసిడిపానుపును సొలసియుండే
ఉండె నొక పదునాలుగేండ్లు పడతి,
కుందనపు ప్రతిమ కళలు
ఈ కళలు యెందుండి దాగున్నవో,
దృష్టి తగులకుండా నీలాల
నివ్వాళులివ్వరమ్మా”
అని మందహాస మొనరించినది. అపుడు సీతమ్మ చెల్లెలి పక్షమున శాంతకు:
“ఇంద్రాది చంద్రులను వలపించేటి
చంద్రులు మీ తమ్ములూ
దృష్టితగులకుండా నీలాల
నివ్వాళు లివ్వరమ్మా”
అని వదినెగారు గావున, వినయ సహితమగు ప్రత్యుత్తరమిచ్చినది. అయితే శాంతమ్మ
యంతతో మిన్నకొనలేదు.
108
సారస్వత నవనీతము
“అక్క చెల్లెండ్రు మీరు
మిక్కిలి సౌందర్య శాలులమ్మా
మా తమ్ములను వలపించేటి
జాణలకు దృష్టితగులూ”-
అని మాటకు మాట వచించినది.
సీతా కల్యాణసందర్భమున వడ్డించబడిన భక్ష్యవిశేషములు శాకపాకములు
నోరూరజేయును. పట్టాభిషేక కాలమున శాంతమ్మ ముద్దుల మరదలగు నూర్మిళతో
పరిహాసమాడకుండ నుండలేక పోయినది.
“నిద్రబోయిన పదునాలుగేండ్ల మధ్యలో
భుజియింపకున్నట్టి భూమీశుదేవి
చాలనే పాయసము మేలయిన పిండివంటలు
సంతుష్టిగా గుడిచి సరయూనదీ నీళ్ళు
వాంఛతో తాగవే, వచ్చె లక్ష్మణుడు
నిర్విచారము, లేదు నిద్ర, యీరాత్రి
సరసమాడావలెను సౌమిత్రితోడ”
అని చిరునవ్వును చిలుకరించినది.
ఈనాడు పాటలకు ప్రచారము తగ్గినది. బానిసలమై, సర్వవిధముల నధః
పతితులమై యున్నాము. ప్రాతపాటలపై రోతహెచ్చినది. స్వీయ సంస్కృతి, నాగరికత
నామావశేషములై యున్నవి. ఇక నీపాటల నాదరించు వారెవ్వరు? ఎవరో కొందరు
పల్లెటూరు పడుచులుదప్ప. పరిస్థితు లీవిధముగనేయున్న, ఆ కొందరుగూడ వీనిని
విస్మరింతురేమో? అయ్యో! ఆంధ్రదేశ దౌర్భాగ్యము! ఇకనైనను వీనిని సేకరించి,
సంస్కరించి ప్రకటించి యాదరించుట మన విద్యాధిక యువతీమణుల కర్తవ్యము.
109
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
సమీక్ష
ఆంధ్ర వాజ్యయము - ప్రకృతి
మనోహరములగు ప్రకృతివర్ణనలు ప్రతి సారస్వతమునందును కలవు.
స్వాభావికములగు ప్రకృతివర్ణనములకును కవిత్వమునకును గల సంబంధ
మతిసన్నిహితము. కవి ప్రకృతిని యత్యంతముగం బ్రేమించును. ఆ ప్రేమ యపారము,
అగాధము, పవిత్రమును. ప్రకృతి దృశ్యములు కవి భావములను ప్రజ్వలింప
జేయును. తదవలోకన జనితానంద మాతనిని ప్రకృతిని వర్ణింప దొరకొనంజేయును.
తత్ర్రయత్న ఫలితమే విదగ్ధ హృదయుల యెడ కవిత్వముగాం బరిణమించును.
ఈ ప్రకృతి ప్రేమ ప్రకటన సాధ్యమైనప్పుడు, అవసరమైనప్పు డతండు చేయును.
నాటక మెక్కువగ మనస్తత్వ పరిశీలనా సంబంధము. (ప్రకృతివర్ణనల కందు
స్థానమెక్కువగా నుండదు. అట్టి నాటకమందు సయితము జెచిత్యానుకూలములగు
ప్రకృతి వర్ణనలు కాన్పించుచుండును. దీన, కవి ప్రకృతి ప్రేమ విస్పష్టము. ప్రపంచ
సాహిత్యమందు నాటక రచయితగా సుప్రసిద్ధుండయిన కాళిదాస మహాకవి
శాకుంతలమందు -
“హాయిగా స్నానములంజేయ ననువుపడుచు
పాటల సుగంధయుత వన పవన మమర
సులభముగ నీడలను నిద్రసుఖముం గలగి
దివసములు రమ్యములగు చాల చివరలందు.
కమ్రసుకుమార కేసరాగ్రములు గలిగి
తుమ్మెదలచేత దరచుంబితమ్ములగు శి
రీష కుసుమముల దయాగ్రహృదయలగుచు
తాల్తురింతులు కర్ణావతంసములుగ.”
అని వనవర్ణనను మిక్కిలి హృాదయంగమముగం జేసినాడు. భవభూతి మహాకవి
ఉత్తర రామచరిత్రమున-
“నేలబొరియలలోం ద్రాగ నీరులేక
నెండ వేడికి దూపిలి తొండలిందుం
110
సారస్వత నవనీతము
గొండచిలువల చెమ్మటల్ (గ్రోలుచుండు
భయదములు నిర్దలంబు లీ ప్రాంతరములు”
అని యరణ్యవర్ణనముం జేసినాండు. కాళిదాసుని ప్రకృతివర్ణనలు కోమలములు.
భవభూతి వర్ణనలు గంభీరములు. Shakespeare మహాకవి రచనలయందుంగూడ
ప్రకృతివర్ణనలకు తావుకలదు.
స్వభావసిద్ధమగు ప్రకృతి వర్ణన నిక్కంపు కవిత్వ లక్షణములలో నొకటి. కాని
యుక్రేక్షా కావ్యలింగాద్యలంకారములతోం (బ్రకృతి వర్ణనయను నెపమున
భావనాతీతములుగ వ్రాసిన మాత్రమున కవిత్వము కాంజాలదు. వర్ణనలు
సహజములుగా నుండిననే హృదయాహ్లోదకరములు. చూడుండు. “Fidelity t0 na-
ture, not perversion of it in the name of a figure of speech is one of
the main essentials of poetry.” (పకృతి కనుకూలమగు కవిత
రసికజనానందకరము. “Poetry is enjoyed in so far as it is unnatural and
entirely out of touch with human mentality. No poetry can live that is
divorced from nature.”
ఇప్పుడు మన మాంధ్రవాజ్మయమునందలి ప్రకృతి వర్ణనలను గుణించి
విచారింతము. మనకు తొలికబ్బము భారతము. కావున కవిత్రయ కవిత్వంబునందలి
ప్రకృతి వర్ణనము ప్రథమ విచారణీయాంశము. నన్నయభట్టు ప్రకృతి వర్ణన యత్యంత
మనోహరము. సుకుమారములగు గుంభనము లీతని ప్రకృతి వర్ణనల
రమణీయతరములుగం జేసెడి. అంతేకాదు. ఈ నన్నపాచార్యుని వర్ణనలు విస్పష్టంబు
ననన్యంబునగు నొక చిత్రమును చిత్రింపం జేయం గలుగునవియై యుండును.
ఇందున కుదాహరణములు తత్మృత భారత భాగమునం దనేకములు.
వనవాసకాలమ్మున పాండవులు గంధమాదనంబునకుం బోవునప్పుడు శైలవర్ణనమ్ముC
గాంచుండు.
“నానావర్ణ శిలావిహ
గానేక మృగాభిరామమై భూనారీ
నానాభరణవిభూషిత
పీనోన్నతకుచముం బోలి వెలింగెడుదానిజ”.
111
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
“లలితాచ్చస్ఫటి కశిలా
తలములపైం బాలు విమలతరనిర్హరిణీ
జలపూరములను తారో
ల్లలదురుహారాలి నుజ్వలంబగుదానిక.”
వారటం బ్రవేశించిన యనంతరము గాడ్పుతోడి వాన పెద్దయుం బొద్దు
కురిసెనంట. అది యెట్టిదో పరికింపుండు.
“కురిసెంబ్రచండవృష్టి ఘనఘోషము లెల్లకెలంకులక్ భయం
కరములుగాం గరాళకరకాతతులొప్పం దటిల్లతాళి వి
స్ఫురితముగాం బ్రపూర్ణజలపూరము తద్దిరికుంజ భూరిని
ర్ల రతటినీ తటీనికట సాలచయమ్ము విమూలితమ్ముగాజ£”
నరనారాయణాశ్రమమ్మున బదరీవర్ణనముం దిలకింపుండు.
“లలితమధు'స్రవఫలములు
విలసితమృదుపత్రతతులు వృత్తస్మంధ
మ్ములు నవిచలితచ్భ్చాయలుం
గల బదరీతరులం జూచి కడు విస్మితులై.”
అరణ్యపర్వశేషమ్మును పూరించిన ఎజ్బ్టాప్రెగ్గడ మహాకవి తిక్కనార్యుని
తరువాతివాండు. ఈతండు నన్నయ తిక్కనల ననుసరించి రచనం గావించినాడు.
ఈ కవివరేణ్యుని వర్ణనలు కొన్ని యెడల నన్నయ వర్ణనలం బోలియుండు. ఎజ్టాప్రెగ్గడ
శారద వేళవర్ణనం గాంచుండు.
“స్ఫురదరుణాంశు రాగరుచిం బొంపిరివోవ నిరస్తనీరదా
వరణములై దళత్మమల వైభవజృంభణ ముల్లసిల్ల ను
ద్ధరతరహంస సారస మధువ్రతనిస్వనముల్ సెలంగంగాం
గరము వెలింగె వాసర ముఖంబులు శారదవేళం జూడంగజ”
అప్పుడు “మదోత్మటద్విరద సంవుములు” దానాంభః వటలమ్మునం
బృథుపయోధారావలిందాల్చి గర్జానిర్జోషము బృంహితచ్చలనం బ్రచ్చ్భాదించి ప్రావృట్స
యోదానీకమ్ము శరద్భయమ్మున నిగూఢాకారతన్‌దిగ్గెనాంగా నొప్పారెనంట. వెండియు
నిర్మల కమలాకరమ్ములు విశద శారదాంబుద పరివేష్టనమునం బొలుచు గగనమ్ము
112
సారస్వత నవనీతము
ప్రతిబింబమో యనంగ వికచకాశవనీ పరివేష్టనమున' నతిశయిల్లెనంట. ఇతని
హరివంశమున మానవ మనస్తత్వమును ప్రకటించు ఘట్టములు రసవత్తరములగు
ప్రకృతి వర్ణనముల కాకరములు.
ఇంక తిక్కనార్యుని ప్రతిభ యనన్యసామాన్యము. ఈతని రచనమ్మునందు కవిత్వ
గుణమ్ములన్నియుం గలవు. ఈమహాకవి కళాచతురత, మనోవృత్తి వివరణశక్తి,
రసానుగుణ వర్ణనలు, సందర్భోచిత శైలి మున్నగునవి యనితరసాధ్యములు. ఈ
కవితల్లజుండు ప్రపంచమందలి యే యితర సారస్వతమందలి యే యితర కవితోనైనం
దులదూగం గలండనుట నిస్సంశయము. అంతియగాక ప్రపంచ సారస్వత మందింత
ప్రతిభాశాలి కలండా యనిపించును. సాంగోపాంగముగ వేదాధ్యయన మొనరించిన
సోమయాజి. రాజనీతి నెటీంగి మనుమసిద్ధి రాజ్యచక్రమును నడిపించిన
మంత్రిసత్తముండు. యుద్దరహస్యములం దెలిసిన సేనానాయకుండు. రాజ్యము
వైరులహస్తగతమైనప్పుడు గణపతిదేవుని తన కవితాకన్య వదనమ్మున వశపరచుకొని
రాజ్యమును తనరాజున కార్టించి యిచ్చిన నిక్కంపు నెచ్చెలి. స్వామిభక్తి పరాయణుండు.
ఉభయభాషా ప్రవీణుండగు పండితుండు. నిరర్గళ కవితాధారం బదునేను పర్వమ్ముల
నేకధాటి నాంధ్రీకరించిన కవిసత్తముండు. శేముషీ విశేషమ్మద్వితీయము. తిక్కనదృష్టి
యెప్పుడు కథాగమనవేగమ్మునందును. కావుననె యాతనివర్ణనలు కథాంశ
సంబంధములు. చూడుండు.
“ద్రుపదనందన పరిభవ దుఃఖమునకు
నుల్లమున దురపిల్లుచునున్న నరసి
వేడినిట్టూరుపో యన వెడలెం గ్రొత్త
తావిమూతులు విచ్చు నెత్తమ్మివిరుల”
“తన మనమున పాండుతనయు
లని సేంతకు వేద్మంజేయు టాత్మగంని తమ
మ్మున వారు మెజయరని వ
చ్చిన క్రియ శశి పూర్వశైల శిఖర మ్మెక్కెన్”
కథాంశ సంబంధములయ్య నీ వర్ణనలు మిక్కిలి హృద్యములు. ఇంతమాత్రమున
తిక్కనార్యుని వర్ణనలు కేవల కథాంశ సంబంధములనుటకు వీలులేదు. బెచితి
ననుసరించి చేసిన రమ్యతరమ్ములగు ప్రకృతి వర్ణనలుకూడ పెక్కులుకలవు. ప్రభాత
కాలమునందు నాకాశము-
113
డా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
“రాలియున్న పుష్పప్రకరము విదిర్చి
చెన్నుగా నున్న వేసిన సెజ్జ యనంగ
వేగుటయుం జుక్కలన్నియు విరిసి విశద
భాతి చెలువొందెం జూడ నంబరతలంబు”
అనియు “మృణాళకలశమ్ముల వలన బాలచంద్రశతాభిరామమ్ములగు శంభు
జలమూర్తి విశేషమ్ములంబోని సరోవరమ్ములును,.. ... రేపకడ వనలక్ష్మి పురశ్రీ
నలంకరించువడువున నెడపడక యెల్లెడల నిగురు విభాతకుసుమకదంబంబు
పరిమళంబునైయున్నంతి అనియు వర్ణించియున్నాండు. సూర్యాస్తమయ వర్ణన తిక్కన
“చుక్కలుతోడుతోడం దలసూపందొడంగె మనోభవుండు వి
ల్లెక్కెడి చక్రవాకముల యిక్కలు రోయంగం జొచ్చె నేల కెం
'పెక్కుచువచ్చెం దీవియల యేడ్తెఅఖ సోయగమందె సందడుల్
దక్కెం బురమ్ము వీథుల మదమ్మొలసె౯£ విటచిత్త వృత్తుల౯”
అని చేసినాడు. చీకటిని సోమయాజి యెంత చక్కగా, సహజముగా
వర్ణించినాండో చూడుండు.
“పెనుమిజ్టిది పల్లమ్మిది
యనకుండంగ నోలముం బయలు నొక్కటిగాం
గనువిచ్చుటయును మోడ్పుట
యును సరిగాం దమము పర్వె నుర్విందోడ్లోజ”
ఈ ప్రతిభాశాలిని ప్రశంసించుటకు పండిత ప్రకాండులే తమ యసమర్థతను
వెల్లడించియుండ మాబోటి యాంధ్ర వాజ్మయ చరణ పరమాణువులా తత్మార్యమునకు
సాహసించునది? నిజానికి పూర్వ కవులలో భారత కవుల యందే నిక్కంపు కవిత
నెలకొని యున్నది. కాని ప్రకృతి వర్ణనలోని భావధార్థ్యము, జెన్నత్యము,
రామణీయకమును గుటించి చర్చించుచున్నప్పుడు నన్నెచోడ మహాకవియే
యగ్రతాంబూలార్జుండని మాయభిప్రాయము. అతని కవితలో నలంకార సంపత్తి
మెండు. సోదర ద్రావిడభాషా పద సమ్మేళన మిక్కవి కవితాప్రశస్తి కాటంకము.
అయినను తాను చెప్పుదాని నెదుటివాండు గ్రహించునటుల కవితవ్రాయుటలో నితండు
మిగులప్రోడ.
114
సారస్వత నవనీతము
భారత కవులకును, కృష్ణదేవరాయలనాంటి కవులకును మధ్య కాలమ్ము నందు
ముఖ్యులు శ్రీనాథ పోతనలు. వీరు ప్రకృతి వర్ణనయం దంతగా నాసక్తులయి యుండి
నట్లగుపడదు. శ్రీనాథకృత 'కాశీఖండ' గ్రంథ మందలి సూర్యోదయవర్ల్ణన ప్రశంసనీయ
మగు ప్రకృతి వర్ణన. ఆంధ్ర వాజ్మయమున పద్య రచనా నైపుణ్యమున శ్రీనాథుని
బోలు ఘనుండు లేండనుట నిక్కువము. సీసపద్య రచన మీ కవిసార్వభౌముని
హస్తములందు సొంపులుదీరినది. గాంభీర్య గుణమున నీతండు మున్నెన్నందగినవాండు.
ఈతని కవనము బ్యాండు వాయిద్యముంబోలు. కాని పాండిత్య ప్రకర్షణమ్ములు
నలంకార భూయిష్టమ్ములగు నీతని రచనల యందంతగా మనోహరములగు ప్రకృతి
వర్ణనలు గోచరింపవు. శృంగార రసభరితమ్మును, అలంకార శోభితమ్మును, సంస్కృత
సమాసాభిరామమ్మునై యలరారెడునది యీతని కవిత్వము.
ఇంక పోతన యన్ననో, 'బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యక
కూళలకిచ్చి యప్పడుపుకూడు భుజింపక నిజదారసుతోదర పోషణార్థము హాలికుం
డయి హరిభక్తియను మందార మకరంద మాధుర్యమునం దేలిన మధుపమ్ము.”
తిక్కనార్యునివలె నీ భక్తాగ్రేసరుండు బుద్ధిపూర్వ కళాచతురుండు కాండు. కేవల
మావేశభరితుండగు వ్యక్తి. భక్తి రసమును వర్ణించుపట్ల నీకవికుల తిలకుడు తనుం
దాను మజిచి, పాఠకునింగూడ విస్మృతి సాగరమున నోలలాడించును. ఈతని
కవిత్వముతో నుపమింపం దగిన దొక శ్రీకృష్ణుని మురళీగానమే. ఇమ్మహాకవి కేవలము
రసలోలుండు. ఆవేశభరిత హృదయుండు. భక్తిని ప్రహ్లాదుని బోలువాండు. ఇమ్మహాను
భావున కిష్టమొక భక్తి రసము. కావున ప్రకృతి వర్ణనల కొజకా మేలి కబ్బమున
వెదకుట నిష్ప్రయోజనము.
శ్రీనాథ పోతనల యనంతరము మన యాంధ్ర వాజజయమునకు శుభదినములు.
కృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్యాధీశ్వరుండయి తిమ్మరుసుంబోలు రాజనీతి
విశారదు లొకయెడను, పెద్దనాది మహాకవి శిఖామణులు మటొక్క యెడను, సామంత
దండనాయకులు వేటొక్క యెడనుండ మధ్య నవరత్న ఖచిత సింహాసనముపై
రామకృష్ణుని పరిహాస వచనములకు మందహాస మొనరించుచుం గొలువుండిన
దినములు. స్వయముగా కవియై యితరకవులను పోషించి యాంధ్ర సారస్వతమున
కమూల్యోపకార మొనర్చినాండీ విద్యానగర సషమ్రాట్టు. ఈ కాలమున నాంధ్రకవితా
పితామహుండు ప్రథమ ప్రబంధ రచన కుపక్రమించినాండు. ఈ పెద్దన పాండిత్య
115
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
కవిత్వములు కృష్ణరాయని వంటి రసికుని జోహారులందినవి. ప్రబంధరచనను
పరిపూర్ణదశకు తెచ్చిన వాండీ కవి. ఈ కవి భావనాశక్తి మిక్కిలి ప్రశంసనీయము.
వర్ణన లత్యంత స్వాభావికములు. కడుంగడు హృదయంగమములు. ప్రవరాఖ్యుండా
నిర్ణనారణ్యమున నొక్కదివ్యభవనమును చూచెనంట. అద్దాని పరిసర ప్రకృతి
రామణీయకము నేత్రపర్వము. ఎట్టివానికేని యందు నివసింప నిచ్చగొలుపునది.
“తావుల్ క్రేవలం జల్లు చెంగలువ కేదారమ్ము తీరమ్మునః
మావుల్ క్రోవులు నల్లిబిల్లిగొను కాంతారమ్మునందైందవ
(గ్రావాకల్పిత కాయమాన జటిల ద్రాక్షాగుళుచ్చమ్ములన్
పూవుందీవల నొప్పు నొక్క భవనమ్మున్ గారుడోత్మీర్ణమున్”
గంధర్వగాన ఘూర్ణితమగు కోనయన్ననో యత్యంత మనోహరము. అద్దానిం
బ్రశంసింప సాధ్యముకాదు. మన యల్లసానికవి సూర్యాస్తమయ మెంత స్వభావసిద్ధమో
తిలకింపుండు.
“శ్రేణుల్ గట్టి నభోంతరాళమునం బాజెంబక్షు లుష్టాంశు పా
షాణవ్రాతము కోష్టమయ్యె మృగతృష్ణా వార్భులింకెన్ జపా
శోణమ్మయ్యెం బతంగబింబము దిశాస్తోమమ్ము శోభాదరి
ద్రాణమ్మయ్యె సరోజషండములు నిద్రాణమ్ములయ్యెక్ గడున్.”
ముక్కుతిమ్మన ముద్దుముద్దుగ వీణాకలకలముల కలకలనగు పలుకుల
మెలపాలయ పారిజాతావవారణము చేనీనాండు. ఇతని గుంఛ నము
లతిసుకుమారములు, అత్యంత కోమలములు, ముద్దులమూటలు. ఈ ముద్దుకవికి
యుత్రేక్షాలంకార మెక్కువమక్కువ. దృితీయాశ్వాస మంతయు నించు మించుగ ప్రకృతి
వర్ణనాభరితము. ఉకత్రేక్షాలంకార శోభితము. కాని యీ వర్ణనలు స్వాభావికములు
కావు. కొన్ని భావనాతీతమ్ములు కూడ. ఇట్లయ్యు నొకటి రెండు స్వభావసిద్ధములగు
'ప్రకృతివర్ణన లిందు కలవు.
ఒక భృంగమ్ము పరాళినీ మదనతంత్రోన్మాది ప్రాణేశ్వరి౯
మకరందాసవ మత్త నబ్దగృహసీమః బెట్టి తాంబోయి సం
జకడజ వచ్చి తదానమన్ముకుళమౌ జాడన్ జనన్‌రాక, యా
మికుండోనాం దిరిగె౯ కొలంకురమకున్ మేలెంత హీనమ్మొకో.
116
సారస్వత నవనీతము
అనునది ప్రశంసనీయము. ఇంక ధూర్జటి యన్ననో పోతనామాత్యుని వలె
భక్తుండు. కాళహస్తీశ్వర మాహాత్యము భక్తి రస భరితము. ఈ క్రింది యత్యద్భుతమ్మగు
పద్యరత్న మీతని ప్రకృతి వర్ణనా సామర్ధ్యమును ప్రకటించును.
ప్రాతఃకాల తుషారశీకరచయప్రాప్తిన్ లసన్మాక్తికో
పేతాగారములట్లు చెల్వెసంగు తద్బిందుచ్చటాజాత వి
ద్యోతచ్భాయలం గొంతసేపు బహురత్నోదీర్ణ గేహమ్ములై
లూతాకల్పిత తంతుసద్మములు వొల్చుం జూడం జిత్రమ్ములై.
వీరిలో పింగళి సూరన యాంధ్ర కవితా పితామహునకు మనుమండంట.
ఈతని సామర్థ్యము తాతగారికి దగ్గులు నేర్పెడిదై యున్న యది. కల్పనా
చాతుర్యమునందు, క్రొంగ్రొత్త త్రోవలు త్రొక్కినాండు. ఆంధ్రవాజ్మయమున తిక్కన
పోతనల యనంతరము నేంటివజకు నిక్కంవు వ్యక్తిత్వము కలవారు సూరన
రామకృష్ణులు. ఇప్పుడు మనము చూడవలసినది యీ సూరన ప్రకృతి వర్ణనము.
ప్రభావతీ ప్రద్యుమ్న మందలి యీతని హంసలు మన కండ్ల యెదుట ప్రత్యక్షమై
యున్నట్లు గన్పట్టెడి.
ఇట్లు కన్సట్టుచు నేతెంచి హంసలు
వసుధ చేరువ నేటవాలుగాంగ
నతినిశ్చల ప్రసారిత పతత్రమ్ములై
దిగుచుం గాముని ముందు దిక్కుం గొంత
సరి గడవగంబాజీ మరలు బోరలు దెట్ట
గిల నొక్కకవ వంచి మలపు దిరిగి
యెబుకలంతట రెండనెజియం జక్కంగంజూచి
యవనిం గాల్మోపి జెక్కార్చిముడిచి
మొగము లొకవింత యొయ్యారముగ మలంచి
యీకను విదిర్చికొనుచు నొక్కింతవణకు
హైమ రేఖా విచిత్ర నిజాంగరుహ వి
నిర్మలతం జూడ్కులకు నింపునింపుచుండె.
ఇంక నాద్వారక యాకాశము నుండి చూచువారి నెట్లు విస్మయ సముద్రమున
ముంచి వేయుచున్నదో చూడుండు.
A117
దా దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
కలధౌత కేళీనగంబు కాంబోలును
తనరుచున్నది శంభుతనువులీల
ఘనపుష్ప చాంపేయ వనరాజి కాంబోలు
వేలుచున్నది పులితోలు సిరుల
హరినీల సోపానసరణి కాంబోలును
పగటుచున్నది నల్లపాంపపేరు
పవడంపుటొల్లె సౌభాగ్యంబు కాంబోలుం
జాటుచున్నది జటాజూటరుచిని
సరసి కాంబోలుం గ్రాలెడి సురనదిగతి
నోడ కాంబోలుం బోలెడి నుడుపతికళ
యనిమిషాధిప చూచితే యల్ల పసిండి
కోటనడిమి శృంగారంపు తోంటలోన.
కథా కల్పనా చాతుర్యమున సూరన యగ్రసరుండగుచో నవ్య వర్ణనా ఫక్మియందు
రామకృష్ణుండు మున్నెన్నందగినవాండు. ఏపనిం జేసిన నీతని యందొక విధమగు
నవ్యత, విలక్షణమగు వ్యక్తిత్వము చూపట్టును. ఈతని యీ క్రింది వర్ణన
లపూర్వములు; మిక్కిలి హృదయంగమములు.
“మారుతాహతిరాలు నారికేళ ఫలాళి
నిడిసి జల్లించు పుండ్రేక్షురసము
చిలుక పోటులచేతం జిరిగిన సహకార
ఫలముల దొజంగెడి పచ్చితేనె
చిక్రోడదంట్టలు చెక్కుసుగంధిమ
నంటిపండ్లను గ్రాలునవ్యసుధయుం
బాకవేళారంభ పరిపాటి దమయంతం
బలిగిన పనస క్రొంబండ్లచే స
మేతమై కాలువలుగట్టి యేకహేలం
బఅవ నందలి క్రియ్యూట పసిమితేటం
బండు నవ్వీట ముక్కారుంబసిండిగారు
సరసధాన్యంపు మంచిరాజనపుం జేల.”
118
సారస్వత నవనీతము
“మరువంపువలపుం బల్మజుం గ్రోలిక్రోలిక
భ్రాల్చియూరక మేనుమఅచుం గొన్ని
యరవిచ్చు తెలిమొల్లవిరుల మూతులు సాచి
పొదింగూడి టెక్కలం బొదవుం గొన్ని
గురువింద పూందేనె పెరలకై తమలోనం
బొత్తువోవక సారెం బోరుంగొన్ని
పక్వంబులగుదాంకం బాటించి మల్లికా
కలికానికాయంబుం గాంచుంగొన్ని
బోగివశమైన గేదంగిపూవునకును
వగచు మటికొన్ని బంధుజీవక లతాంత
గుచ్చములలోన నొక కొంత కొలువుసేయుం
దేంటు లఖిలర్తు మయవనీవాటి గమిచి.”
“గంధవిరహితమను బుద్ధిం గనక తేంటి
మూతివిచ్చిన మోదుగు మొగ్గం దగిలి
సౌరభాకాంక్షం జొచ్చి చెన్నా రెం గీర
తుండవశమైన నేరెడుపండుంబోలె”.
సహజములగు నిట్టి వర్ణన లీతని కబ్బమున ననేకములు. స్థలా భావముచే
నిట్టూర్పు విడుచుచుంటిమి. రామకృష్ణుని వర్ణనములు పూర్వాంధ్ర వాజయమున
కననివి.
రామరాజభూషణాదుల గుణించి ప్రసంగించుట యనవసరము. వారికి
కావలసినది శ్లేష-చిత్రకవిత్వము మొదలగునవి. మనకు వలయునవి సహజములగు
ప్రకృతి వర్ణనలు. వీరియనంతరము వీరేశలింగ దీక్షితుని వజకుంగల కవులలో
యనుకరణము లెక్కుడు. కథాకల్పనము శూన్యము. పాత్ర పోషణ కానరాదు.
శృంగారము. అదియును పచ్చిది. మటొకరసము మృగ్యము. వీరిలో త్రిభాశాలి
చేమకూర వేంకటకవి యొక్కండేయేమో!
ఇంక మనద్భష్టి వీరేశలింగమువంక మరల్తము. ఈ యుగమున కాది పురుషుండు.
ఎంత ప్రతిభాశాలియోకాని యాంధ్రవాజ్మయమున నాతండు త్రొక్కని త్రోవలేదు.
ప్రబంధములు, అచ్చ తెనుంగు కబ్బములు, నిరోష్ట్య కావ్యములు, నవలలు,
119
దా దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
నాటకములు, శాస్త్రములు, భాషాంతరీకరణములు, ఉపన్యాసములు, వాజ్మయ
విమర్శనలు, మత విమర్శనములు, చరిత్ర పరిశోధనలు (అక్కడక్కడ కొన్ని
పొరపాటులు కలవు) మున్నగు వాని యన్నింటియందీతండు సిద్ధహస్తుండు. సంఘ
సంస్కరణ పరాయణుండయి, పత్రికా సంపాదకుండయి, యుపాధ్వాయుండయి యిన్ని
కార్యముల నెట్లు నిర్వహింపం గలిగెనని మేమద్భుత పడుచుందుము!
ఈ యుగమున వాజ్మయము సర్వతోముఖాభివృద్ధి నందుచున్నది. కొందరు
తప్ప యీ యుగమువా రాంగ్ల వాజ్మయ సంపర్మము కలవారు. Wordsworth,
Shelley, Keats మున్నగు కవివర్యుల రచనములం జక్కగా పఠించిన వారగుటచే
వారిపోకడ లాంధ్ర సారస్వతమునం గన్పట్టును. కాని కేవల మాంగ్లేయకవుల
యనుకరణమే యాధునికాంధ్ర వాజ్మయమని తలంపరాదు. స్వతంత్రోజ్ఞ్వలభావ
విలసనరమణీయములు నగు రచనములు గూడ యనేకములు. ఈ యాధునికులలో
సుప్రసిద్ధ రచయితలు వేంకట పార్వతీశ్వరకవులు, రాయప్రోలు, అబ్బూరి, దేవులపల్లి,
దువ్వూరి, బొడ్దు, విశ్వనాథ, తల్లావజల, జి. జాషువ మున్నగువారు.
ఈ కవి కుమారుల ప్రకృతి వర్ణనము లెంతటి స్వాభావికములో మెంతటి
హృదయంగమములో చూడుడు... వేంకట పార్వతీశ్వర కవులు
“జలతరంగముల నూయెలలూగినట్లుండి
తటిలేచి చలువల తజుముచుండు
నరవిరిమొగ్గల నలరించునట్లుండి
యదనెంచి రజముల నపహరించు
లతకూన చెంత మెల్లన యున్న యట్లుండి
సమయమ్ముంగని చుట్టు సడలంజేయు
ననగొమ్మ నిట్టె యుంచినయట్టులే యుంచి
కొంటెయై వలపులం గొల్లవెట్టు
చలువటెక్కలకాం డురజంపుదొంగ
'పైండిపచ్చీండు తావుల బందెకాండు”
అగు ప్రభాత వాత మహ్లాదకరము. మటియు -
“జలదమాలిక నింగిపై నలరుచుండ
మెజుంగుందీవెలు మిలమిల మెజయుచుండ
120
సారస్వత నవనీతము
పాటపాడంగం జినుకులు పడుచునుండ
తరచుగాక తుషారమ్ము గురియుచుండ
టివ్వుజివ్వున వలిగాలి జువ్వుచుండ
రేంగి యొక్కొక్క జడిగొట్టి యాగుచుండ
కాజుమబ్బుల చీంకటి క్రమ్ముచుండ
నొజపిడింగాంచి మేఘమ్ము లుఖుముచుండ
జోరుమని వానకాళుల జాజుచుండ
స్వాంత మలరించు వర్షావసరముంజూచి
మెడలుణిక్క్మించి కూయు నెమళ్ళంజూచి
యెలమి దివినాండు వాన కోయిలలంజూచి
తొరటవాయని శుకదంపతులను చూచి”
అను గీత మానందకరము. వీరి కవితయందు ప్రకృతి వర్ణనకు
నిదర్శనములనేకములు. కవిభూషణుని నవ్యత, భావ వికాసము శ్లాఘాపాత్రము.
ఈతని కావ్యము లన్నింట ప్రత్యేక వైలక్షణ్యము విస్పష్టము. ప్రకృతి సౌందర్య
విలోకనమందు - తత్రకటనమందు నీతండత్యంత నిపుణుడు. ఈతని కోయిల-
“పిలపిలయంచు మంచు గురి
పించెడి వేగున లేచి చిన్నిగం
టలు మెడలందు ఘల్లని స్సు
టమ్ముగ మైయంగ మేయు గొజ్టెమం
దల సరిగాచు గొల్లని యు
దారపుటీలలలో ్రతిధ్వనుల్
మొలవంగంజేసి మైమజపు
ముంపులముంచెడు”
నది. మతియు మేఘఫోదయమును
ఎండినబీళ్ల యందు నుద
యించిన పచ్చిక కండ్లపండువై
యుండెను చూడియాలు తల
లూపెను క్రొత్తగవచ్చు నీటిచే
121
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
నిండె తటాక గర్భములు
నిష్కుటముల్ కడు శ్యామలమ్ములై
మెండుకొనె£్ వనిజ మొగిలు
మేసెం బ్రభాతములందుం గొండలః.
అని చక్కగా వర్ణించినాండు.
“దప్పింగొనిచేరిన మిళింద తనయతతికి
పూలపాలిచ్చి చీంకట్లం బోవకుండ
కడుపులో దాచుకొనదె? శ్రీ కమలదేవి
చేరందీసిన మమకార మేరికెణుక?”
“ఎండలో మాడిపోవు లేంయిగురు లరసి
యేడ్చునదుల ్రేమోదంత మెవండెణుంగు?
నీటితరంగల రేల్పవల్‌నృత్యమాడు
చంద్ర సూర్యులుకూడ నా జాడ కనరు”
“పూలబిడ్డల ప్రీతి నుయ్యాలలూపు
పవనుం డెజుంగండు తొడిమలు వదలుననుచు
తలంపులకు విరుద్ధములగు ఫలితములకు
బాధ్యులెవ్వరో పుణ్యపాపమ్ము లేవా”
అను పద్యము లాంధ్ర వాజ్మయమున యపురూపములు. వర్ణనలు
సేయుటయందాతని నేర్పు గణనీయము.
“నిగనిగలెగయు కన్నె చిగుళ్ల గుంపుల
నీడలారెడు చిన్నినిమ్మచెట్లు
పురివిచ్చినట్లు నిమ్ములం గొమ్మపందిళ్లు
సాచుకుమార రసాలతరులు
చువ్వలట్లెదిగి చూచుక గుచ్చములు ట్రేలు
మొలకప్రాయపు బాలపోకచాళ్లు
కడలెల్ల వాసనల్ సుడిగొట్ట విదిలెడి
పూంగొమ్మ లూంగు పున్నాగమొక్క
122
సారస్వత నవనీతము
లందునందునం బెరిగి యా యందమైన
బ్రాహ్మణులయింటి తోంటకు వన్నెంబెట్టు
వెదురులును గున్నగోరంటపొదలు బలసి
చొరనలవిగాని కంచెగాం బెరసియుండ.”
“పచ్చగిలిన వసుంధరాభాగ్య సీమ
నెల్లయెడలం గన్విందుగా నుల్లసిలుచు
పసుపుంబూసిన ముత్రెదువల మొగాల
ననుకరించి గుమ్మడిపూవు లందమయ్యె.”
అనునవి రసవత్తరములగు పద్యములు.
ఈ యాధునికులు పూలమొగ్గలం బెంచికొని వాని నెంతయో ్రేమింతురు.
స్నేహితులవలె భావింతురు. వానిని గుజించి హృద్యములగు పద్యముల వ్రాయుదురు.
ఇందుకు నిదర్శనము రామకృష్ణరాయని మందార శిశువు. వీరిలో నవీనుండు శ్రీ
బాపిరాజుగారు. ఈతని పదముల పొందిక వాని తీయందనము మెచ్చుకొనం దగినది.
ఇతండును ప్రకృతివర్ణనా ప్రియుండు. సూర్యభగవాను నుద్దేశించి-
“నిండిన తేనెతో వలపు నిండిన డెందముం గాన్మ వెట్టం గై
దండకు వేచియుండె మమతల్ చెమరించిన కావిమోవి మా
ర్హాండ మిటారి తమ్మి జవరా లదిగో సుకవీంద్ర రాణ్మణీ
మండలులైన యీ యళికుమారకు లింతకు విన్నవింపరే”
“పవడమ్ముల్ వెలివెట్టు మావిచిగురుం బజ్జీలు నోరూర గా
రవపుం గ్రాంజవి వీకంగోకిలపు పేరంటాండ్రు సాపాటుగా
నవలీలామయ పంచమశ్రుతుల సంధానించి నీకై సుధా
రవళిక మంగళ మాలపించిరి జగద్రక్షానురాగాకృతిక”
“ఆరవిచ్చిన వెల్లలతాచయమ్ము
కోరి పాడిన వెల్ల శకుంతసమితి
ప్రకృతిమాత సహస్రకరమ్ము లెత్తి
స్వస్తినుడివెడి నవతరింపంగదోయి”
అనునవి సహజాపాత రమణీయోక్తులు.
123
దా/ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
“కలువపువ్వులకుం జిక్కిలిగింత బొసంగించి
కొసరి మాటకు నవ్వుకొనుచు మురిసి
వలగొన్న మబ్బుపిల్లలంగూడి వేడుక
తోడ దాంగుడుమూతలాడి యలసి
తళుకుంజుక్కల కన్నుగిలుపులం గడకంట
విడిసిన చిజఖునవ్వు పొడల కడరి
పరువెత్తు మున్నీటితరంగగుజ్టాల స
వారీ యొనర్చు బింబమున కుచ్చి
చలువవెన్నెల రేక పిసాళివలపు
నవ్వు కెరటాల తియ్యందనమ్ముతోడ
ఈ సమస్తజగమ్ము ముంచెత్తి విడిచి
చదలంగొలువుండె మా మామ చందమామ”
అను చందమామను గురించిన పద్యము ప్రశంసా పాత్రము. రామిరెడ్డిగారి
వనకుమారిలోని ప్రకృతి వర్ణన యీ క్రిందివిధము.
“కొండనెత్తమ్ములం గోరాడుమబ్బుల
గమన సౌందర్యమ్ముం గాంచికాంచి
మేఘోదయమ్మున మిసమిస పురివిచ్చి
యాడు నెమ్ములయొప్పు లరసియరసి
యమృత ధారల రీతి నచ్చమై ప్రవహించు
సెలయేళ్ళలోం గ్రీడ సలిపిసలిపి
ప్రకృతి మంజులమైన పక్షులగానమ్ము
తమిదీఅ వీనులం ద్రావిత్రావి
యెండవేళల పూంబొదరిండ్లదూణి
హరిణగర్భిణులకుం జివురాకులొసంగి
ప్రసవమాలల ధరియించి ప్రతిదినమ్ము
గాననమ్ములరాణియై గ్రాలుచుండు.”
తోరణాకారముగ వ్రాలిన వీరి పక్షుల వర్ణనమెంత స్వభావ రమ్యమో
యోజింపుండు.
124
సారన్వత నవనీతము
“చిలుకలదండు కేంకృతులు
సేయుచు మామిడియాకు తోరణ
మ్ములు చదలెల్లం గట్టినటు
మూంగి చివుక్కున వ్రాలి దోరకం
కులు తమనోటం బెట్టుకొని
గూడులకుం గొనిపోవుచుండె సం
చలనము లేని నామనము
సందడినింబడి యుల్కి మేల్మనె£౯.”
ఒక కవివర్యుని మాపెంత ముచ్చటయో గనుంగొనుండు.
చల్లంగా మెల్లంగా సాంగు పిల్లగాలి
తరంగలందు కలసిపోవు విరులవలపు
వోలె రజనిపడంతొక మేలిముసుంగు
చాయలం దైక్యమై పోయె సాంధ్యరోచి.
కృష్ణశాస్త్రిగారి
“అలరుపడంతులెల్లరు హిమాంబువుల న్నవమల్లి కాసతి=
జలకము లార్చినారు వనజాత పరాగమలందినారు మే
ల్లిలుగు హొరంగు పొందళుకు చీరలుగట్టిరి పెండ్లికంచు కో
మల జలజాతపత్రముల మాటున నేంటికి దాగినాండవో.”
అను పద్యములోని కూరుపెంత కోమలమో భావమంత రమణీయము.
విశ్వనాథ సత్యనారాయణగారి
“కోనలన్నీ ముంచుకొని వచ్చు సెలయేటి
చాన కిన్నెరసాని జలజలా ప్రవహించు
నురుగులో పైకెగయు తరగలో క్రొంగ్రొత్త
తేనెకాలువ లూరెనో యమృతంపు
వానచినుకులు జాజెనో
తేనెతరగలపిండులోన జలజల సాంగు
125
డా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
చాన కిన్నెరసాని జాలైన మేలైన
వాకవో యందాల రాకవో బంగారు
జిలుగుగంటలు మోగెనో
చిన్నారి బిగువునవ్వులు నాగెనో.”
అను వాగువర్ణన మిక్కిలి మధురము.
ఇంక జాషువ కవివర్యుండు
'ఫిర్దౌసి' సర్వాంగపుష్టి మెజయ
“ముదురు కోయిల కంఠమున నివాసముసేయు
కొసరింపు కూతల గుట్టుందెలిసి
ప్రతిపుష్పగంధ గర్భముం జీల్చికొనివచ్చు
పిల్లగాడ్చుల జన్మవృత్తమరసి
మేఘమ్ము తెజచాటు మెఅపు బోగముసాని
మోసగింపుల యర్థమును గ్రహించి
శరధినాయకుని క్రొన్నురువు పిల్లలతీఅు
బడిలేని యాటల భావమెటింగి
ముగ్ధమోహన సౌందర్య పూర్ణయైన
ప్రకృతిరమతోడ స్నేహభావమున మెలంగి.”
కబ్బము రచించెనని వ్రాసినాండు. ఈ సుకవివతంసుని పదము లతి
లలితములు. సుకుమారములు. ఇక్కవి కవితాకన్య ముద్దరాలు. పాఠకుల చిత్తముల
నాకర్షించుటయందు సూదంటురాయి. వేయిన్నూట పదారుల వియ్యమందినది.
కమ్మందనమున కాటపట్టు. తిలకింపుండు మేఘుని వర్ణనమెంత మేలుతరముగా
నున్నదో-
ఆకటందూలు సస్యశ్యామల క్షేత్ర
కన్యకడుపు చల్లగా భుజించె
బక్కచిక్కిన కొండవాగుం దటాకమ్ము
చిటుకలో నుప్పొంగి చియ్యబట్టె
ముమ్మాయ ముత్యమ్ము వోలి తామరమీంద
వర్షబిందువు తాండవమ్ము స్‌సె
126
సారస్వత నవనీతము
నడయాడురతనమ్ము వడువున నాడాడ
నారుద్రపురుగు ప్రత్యక్షమయ్యె
చెలంగి చేయార దానమ్ముం జేసిచేసి
కొణతపడియున్న వాని కాపురమువోలి
యుబ్బుం జెడి తూలె నొకచిన్న మబ్బుతునుక
యుత్తరమ్ముగ దిక్కుల కొత్తిగిల్లి.
ఇట్లీ కవి సత్తములు ప్రకృతి కాంతా నిరుపమాన సౌందర్యమును గాంచి
ముగ్గులై తదవలోకన జనితానంద పారవశ్యముచే దానిని వర్ణింతురు. కావున వారి
వర్ణనలు సాంకేతికములు, పాండిత్య ప్రకర్షకమ్ములు నయి యుండవు. సౌందర్యానంద
మనుభవించి వ్రాసినవి కావున స్వాభావికములై, సహజములై విలసిల్లుచుండు. ప్రకృతి
కాంతా సౌందర్యముం గ్రోలియే వారు కవులగుచున్నారు. కావుననే యొక యాధుని
కాంధ్ర కవి కుమారుడు -
“గూడులకు వచ్చు పక్షులకూజితములు
సంజకెంజాయ గారడి చక్కందనము
వరుల వినవచ్చు కీటకావృత్తగీతి
కాపు వానిని సైతము కవినొనర్చు.”
అని సముచితముగా వాక్రుచ్చినాండు.
127
దా/ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
నవ్యసాహిత్యమున వీరకావ్యములు
(ఆంధ్ర సారస్వత పరిషత్తు ఓరుగల్లు వార్షికోత్సవ సందర్భమున చదివిన వ్యాసము.)
కవిత్వమనగా జీవిత విమర్శనమని యొక సుప్రసిద్ధ ఆంగ్ల విమర్శక శేఖరుడు
వచించినాడు. సాహిత్యము సమకాలిక సంఘ జీవితమునకు ప్రతిబింబమని మరియొక
యభిప్రాయము. నాకు జూడగా నీ రెండు సూక్తులును పరస్పరవిరుద్ధములు
గాకుండటయే కాక యన్యోన్య సహకార మొనరించుకొనుచున్నవి. ఏలయన కవితకు
ఉద్రేకము ప్రోత్సాహజనకమైనపుడు కవికి సమకాలిక మానవజీవిత విమర్శనముకన్న
యెక్కువ భావస్ఫోరకమగు వస్తువు కానరాదు. మానవ జీవిత విమర్శనమునందు
నిమగ్నయగు లేఖినికి సమకాలిక సంఘమే యాశ్రయమగుట మిక్కిలి సహజము.
పారలౌకికములును, అనుభవదూరములును అగు విషయములను గురించి
భావోదయమై హృదయము రసాగర్టమగుట అసంభవము కాకపోయినను
అసామాన్యమును, అసాధారణము అని నా విధేయ విజ్ఞప్తి. మానవ జీవితమే సాహితీ
సర్వస్వమని సిద్ధాంతము చేయు నధికారముకాని అభిలాషకాని నాకులేదు. కాని
సాహిత్యమునకు, కవిత్వమునకు అత్యవసరమగు ముఖ్యలక్షణములలో నొక్కటి మానవ
జీవిత విమర్శనమను సర్వజనాంగీకారమగు విషయమును మాత్రమిచట
మనవిచేయుట నా విధ్యుక్తధర్శ్మము. మానవజీవితమునకు సంబంధించని ప్రకృతి
సౌందర్యవర్ణ నాదులు కవితాప్రపంచమున సమున్నతస్థాసము సలంకరింపక పోలేదు.
బుతుసంహారమువంటి కావ్యము లిందుకు నిదర్శనము. బుతుసంహారమునందును
సమకాలిక విలాసజీవన చిత్రణముకలదు. సమకాలిక సంఘజీవితముతో నెట్టి
సంబంధమునులేని యితివృత్తములు కథావస్తువులుగాగల కావ్యములు లేకపోలేదు.
సుప్రసిద్ధములగు శాకుంతల, మేఘదూతములే యిందుకుదాహరణము. కాని
సూక్ష్మముగా పరిశీలించినచో కాళిదాస మహాకవీంద్రుని కావ్యములుగూడ మానవ
జీవిత విమర్శనములని విశదము కాకతప్పదు. మరియు నవి సమకాలిక జీవితమునకు
చిత్రములనుటకు కొన్ని విమర్శనములైన కనిపింపకపోవు. మహర్షియగు వాల్మీకి
కవీంద్రుని కావ్యశిరోరత్నమే, కవిత్వము మానవజీవిత విమర్శనమని వేనోళ్ళ
చాటుచున్నది. సారస్వతమునందు మనుష్యజీవితమునకు గల ప్రాముఖ్యతను
గుర్తెరింగిన ప్రపంచ కవులలో సర్వవిధముల ప్రథమగణ్యుడు వాల్మీకి. కవితా
128
సారస్వత నవనీతము
చక్రవర్తియగు నాతని యమృతలేఖనియే, దివ్యవాణియే ఛందో ప్రపంచమునందు
మానవ జీవితమునకు స్వచ్చందవిహారము సమకూర్చినది.
సాహిత్యము ఒక జాతియొక్క నాగరికత ప్రతిబింబించు నద్దము వంటిది.
సాహిత్యములేని జాతికి సంస్కృతిలేదు; నాగరికతలేదు; విజ్ఞానములేదు;
మరేమియులేదు; సర్వమూశూన్యము. సాహిత్యమునకు ముఖ్యలక్షణము చైతన్యము;
జీవకళ. ఒకజాతి నుద్ధరించుటకు కదన రంగమునకన్నను యెక్కుడు ప్రభావముకలది
కవితారంగము. కత్తి కసాధ్యములగు కార్యములను కలము నెరవేర్చినది. ప్రపంచకవి
జీవిత చరిత్ర నొకమా రవలోకించితిమేని, జీవితసమరమున నారితేరిన జగజెట్టులే
సాహిత్యాంగణమునందు సన్నుతి కెక్కినవారలని తెలియుచున్నది. ఆంధ్రులపాలిటి
యమృతమూర్తియగు తిక్కనార్యుని జీవిత మీవిషయమునే వ్యక్తికరించుచున్నది. వాడి
యలుగులకన్నను వేడియగు కావ్యమును సృష్టించిన మంత్రమణి యాతడు.
భాగ్యభోగములను గోల్పోయిన రాజన్యునకు స్వాతంత్ర్య ప్రదానముజేసిన
సమర్భుడాతడు. అవసర సమయములందు ఆయుధములను ధరించి విజృంభించిన
వీరాగ్రేసరులు కవులలో గలరు.
కవులు యెన్నుకొనబడిన శాసన కర్తలని యొకరన్నారు. (9066 26 the
unrecognised legislators of the world), ప్రజాభిప్రాయమును కల్పించుటలో
సంఘమును సక్రమపద్ధతిని నడిపించుటలో కవులకు, కావ్యములకు గల శక్తి యనన్య
సామాన్యమైనది. ఆధునికనాటక కర్తలలో నొక్కరు
“ధరణి౯£౯ వాబ్బయపీఠమెక్కి బహుధా ధర్మంబు శాసించి తత్సరణిక దూషణ
భూషణంబులను శిక్షారక్షలుద్దించుచుక సరసామోదముగాగ మానవ మనస్సామ్రాజ్య
మడ్రాంతముక పరిపాలించు కవీశువైభవము”ను ప్రస్తుతించినారు.
నవరనములందు నాయక రత్నములు శృంగార వీరములని మన
యాలంకారికుల నిర్వచనము. కావుననే వారు కావ్యమునందు ప్రధాన
రసముగానుండదగిన ప్రభావము వానికే కలదని చెప్పిరి. ఇందుకు సంస్కృతమున
భవభూతి మహాకవి విరచితమగు నుత్తర రామచరిత్ర మొక యపవాదముగా
కన్పట్టుచున్నది. అదియును కరుణరసముగాక విప్రలంభ శృంగారమే ప్రధానముగా
గల కావ్యమని రాయిగ్రుద్ది వచించు పండితప్రకాండులు కలరు. ఏది యెట్లున్నను
ఒకమాట మాత్రము సత్యము. విశ్వసాహిత్యముననే శృంగార వీరరసములు ఇతర
129
దా/ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
రసములకన్న హెచ్చు ప్రాముఖ్యమునొంది కవుల భావనాశక్తికి ఉద్దీపకములై
పాఠకలోకము నాకర్షించినవి. భక్తి కరుణములు దప్ప యీ విషయమున వానితో
సమానరసములు లేవని నాకు దోచుచున్నది. కొందరు భక్తిని రసముగానైన
పేర్కొనలేదు. మరికొందరు దానిని గూడచేర్చి రసములు పదియని చెప్పినారు.
ప్రస్తుతము రసవిచారము చేయు నవకాశముగాని, యధికారముగాని నాకు లేవు.
ఈ శాఖాచంక్రమణ ఫలితము సారస్వతమున వీరరస ప్రాముఖ్యమును గుర్తించుట.
వీరమును దానవీరము, ధర్మవీరము అని కొన్నివిధముల విభజించినను మన
కావ్యములందు ప్రదర్శింపబడిన వీరము ముఖ్యముగా యుద్ధరంగమునకు
సంబంధించినది. ఆధునిక కావ్యములలో శ్రీ తుమ్మల సీతారామమూర్తి చౌదరిగారి
ధర్మజ్యోతి యను చిన్నకబ్బమునందు ధర్మవీరము ప్రదర్శింపబడినదను విషయమిట
ప్రత్యేక స్మరణీయము.
మన యాంధ్రసాహిత్యమునకు శిరోభూషణమగుటయే కాక మన వీర
కావ్యములలో నగ్రగణ్యమగు గ్రంథము మహాభారతము. తిక్కనార్యునకు
యుద్ధరంగమనిన యొడ లుప్ప్బొంగును. భారతమును పఠించునప్పుడు పాఠకుడు
తాను స్వయముగా కిరీటియై, గాంగేయుడై, వడముడియై, యస్రగురుడై,
సూర్యనందనుడై యాహవకేళి యొనరించును. అభిమన్యునితోపాటు ఆతడును
పద్మవ్యూహమున ప్రవేశించి వీరవిహారమొనరింప నిచ్చగించును. “తినిన గారెలె
తినవలయును, వినిన భారతమే వినవలయు”నట. అనుదినము గీతాపారాయణము
వలె నాశ్రయింపదగి, పారతంత్ర్యాపతితమైన యాంధ్రజాతికి పునః పునః
పఠనయోగ్యమై స్వాతంత్ర్య దీక్షాబద్ధ మొనరింప జేయగల మహోత్తమకావ్యము
ఆంధ్రభారతము.
భారతము తరువాత మనవారికి వీర రసమునెడ కొంత వైముఖ్యము కలిగినది.
ఏలయన నాటినుండి నేటివరకును పలనాటి వీరచరిత్రమొక్కటి దప్ప మన
సారస్వతమున యెన్నదగిన వీరకావ్యము మరియొక్కటి రచింపబడలేదు. ఇందునకు
కారణ మా కాలమునందలి సాంఘిక రాజకీయ పరిస్థితులే యని మనచరిత్ర
యుదోషించు చున్నది. తరువాత మన కాశ్రయమైనది శృంగార రసమొక్కటే. ఈ
శృంగార కావ్యములందటనట వీరరసము గోచరించినను, దాని ప్రాశస్త్యము మిక్కిలి
తక్కువ.
130
సారస్వత నవనీతము
భారతీయులు స్వాతంత్ర్యము గోలుపోయి కొన్ని శతాబ్బములైనవి.
క్రమక్రమముగా మనవారిలో భోగలాలసత, విదేశ వ్యామోహము అతిశయించినవి.
చిరకాలపు బానిసతనమువలన పౌరుషము కొంత మొక్కవోవునేమొ! అనేక
కారణములవలన గత శతాబ్దాంతమునుండి మనవారు తమ యథార్ధస్థితిని గ్రహించి
యాత్మావలోకన మొనరించుకొనుచున్నారు. జాతీయవాయువులు మన దేశమున
వీవసాగినవి; స్వాతంత్ర్యకాంక్షలు చెలరేగినవి; త్యాగమహిమ, సేవామహత్వము
మనవారు గుర్తించిరి; నిజధర్మమును గ్రహించిరి; నాయకులు కొందరు తమ
సర్వస్వమును మాతృదేవతకర్పించిరి; ఇంకను అర్చించుచున్నారు. (ప్రజలు వారిచే
నుద్భోధితులై కర్తవ్య పరాయణులగుచున్నారు. విదేశవ్యామోహము, వైజ్ఞానిక దాస్యము
సడలించు ప్రయత్నములు సాగుచున్నవి. జాతీయవిద్యకు ప్రాముఖ్యముగలిగినది.
మందగించిన మాతృభాషాభిమానము మరల మనవారి హృదయము లందు
కందళించినది. చరిత్ర పరిశోధనమునందు శ్రద్ధ వహించి, గర్వింపదగినగతము
మనకు కలదని తెలిసికొనినాము. ఈ సందర్భమున శ్రీచిలుకూరి వీరభద్రరావుగారి
ఆంధ్రులచరిత్ర అపారమగు సేవ యొనరించినది. ఇంక భాషాసేవకులు
మిన్నకుండగలరా? సాహిత్యము మానవజాతి విమర్శనమైనచో, సమకాలిక సంఘ
జీవనముతో సంబంధము కలిగియున్నచో కవికుమారులు, సారస్వతోపాసకులు
స్వాతంత్రోద్యమమున పాల్గొనకుండ నుండగలరా? వారి రచనలు స్వాతంత్రోద్యమ
ప్రభావమునుండి తప్పించుకొనగలవా? ఇందుకు నిదర్శనముగా మన సారస్వతోపాసకు
లనేకులు జాతీయ సమరమున పాల్గొనినారు; త్యాగమొనరించినారు, సోదర
దేశీయులను మేలుకొలిపినారు.
“ఏ ప్రఫుల్ల పుష్పంబుల నీశ్వరునకు
పూజసల్పితినో యేను పూర్వమందు
కలదయేని పునర్జన్మ కలుగుగాక
మధురమధురమైన-తెనుగు మాతృభాష.”
అని యుప్పొంగినారు మన కవివరేణ్యులు.
లోకమంతకు కాకవెట్టిన కాకతీసతి కదనపాండితిని దలంచి, సమరమున
వెన్నిచ్చి చనుదెంచిన ప్రాణనాథునకు వేడినీళ్ళనుతోడిన వీరవనితలను స్మరించి,
క్షాత్రయుగముల శౌర్య చండిమతో పాటు, రెడ్డిరాజుల, కమ్మసేనాపతుల, వెల్మవీరుల,
131
దా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
వీర విహారములను జ్ఞప్తికి దెచ్చుకొని, జారిన దేశగౌరవము చక్కన దిద్దవలయునని
అభినవాంధ్రకవి శేఖరుడు అర్ధించినాడు. వీరగంధము తెచ్చినారము, వీరు లెవ్వరా
చెప్పుడీ యని మరియొక్కరు ప్రశ్నించిరి. దువ్వూరి కవికోకిలము రెడ్డికుల
'ప్రబోధమునందు, నైవేద్యమునందు, స్వాతంత్ర్యరథము నందును శౌర్యసౌరభ్యములను
వెదజల్లినారు. విశ్వనాథకవి యాంధ్రదేశ భూపాలకథలను సంగ్రహించి ఖండకావ్యహార
మొక్కటి గల్పించినారు. ఎన్నడో యొకనాడు తాను ఆంధ్రవిరోధి కంఠదళన
మొనరించిన సైనికుడననియు - యీనాడు:
“తెలుగు నదులెల్ల పొంగెత్తి ప్రళయవారి
కెరలి పడి తెల్లు నేల ముగించనిమ్ము
నేటితో నస్వతంత్రతా నియతమైన
యీ (బ్రదుకు తెన్గువారు భరించలేరు”-
అనియును చాటినాడు. ఈ కవివర్యులచే ప్రబోధితులై మన నవ్య కవికుమారులు
ఆంధ్రుల యశస్సును కావ్యగానమొనరించినారు. వేయేల, అనేకులు అవసర
సమయములందు కృష్ణజన్మస్థానముల నలంకరించుటకును వెనుదీయలేదు;
స్వాతంత్ర్యదేవత వారికి సాక్షాత్మరించినది. ఈ విధముగా మన నవ్యసాహిత్యమున
జాతీయ వాజ్మయము ప్రభవించి, వీరరస ప్రధానములగు ననేక ఖండకావ్యములు
తలయెత్తినవి. ప్రత్యేకముగా చారిత్రకగాథలు కొన్ని వీర కావ్యరూపములను దాల్చినవి.
బోడేపూడి వేంకటరావుగారి - యాంధ్రతేజము; పుట్టపర్తి నారాయణాచార్యులవారి -
షాజీ కొడాలి వెంకట సుబ్బారావుగారి - హంపీక్షేత్రము; మున్నగునవి దీనిలో
కొన్ని జాషువా కవీంద్రుని శివాజి ప్రబంధమొక్కటి యముద్రితమని తెలియుచున్నది.
అందులో మూడు నాలుగు పద్యములు మాత్రమే ఆంధ్ర పాఠక లోకమున కాదరించు
భాగ్యము కలిగినది. మొత్తముమీద పై గ్రంథములన్నియును ఖండకావ్యములే యని
చెప్పవచ్చును.
ఈ పరిస్థితులలో యిటీవలనే ప్రొద్దుటూరి పురంబున వీరరస ప్రధానములగు
రెండు నిండు కావ్యములు జనించి, సారస్వత గగనమున సూర్యచంద్రులట్లు
శోభిల్లుచున్నవి. ఇవియే - ప్రతాపసింహ చరిత్ర; శివభారతమును.
ఈ గ్రంథకర్త లిరువురును మిక్కిలి సన్నిహితులగు నంతరంగ మిత్రులు. ఇరువురు
అవధానులే, ఇరువురు కవిసింహులే. ఇరువురి కావ్యాదర్శము వీరపూజయే. ఇరువురి
132
సారస్వత నవనీతము
శైలియు నంతగా నవ్యతావాసనలేని “ప్రబంధముల వక్రతతో గూడిన పురాణశయ్య”
సహజమై కృత్రిమాలంకార రహితమైన భాష. ఈ రెండుగ్రంథములును శ్రీ
విశ్వనాథవారన్నట్లు అస్వతంత్రజాతికి స్మృతిగ్రంథములు. మన ధర్మమునే గాక మన
పరిస్థితులను గూడ చెప్పునవి; వాజ్మయమున శాశ్వతముగా నుండదగిన యుత్తమ
కావ్యరాజములు.
బాహ్య దృష్టికి కవలబిడ్డలట్లు కన్సించు నీ రెండు కావ్యములును సూక్ష్మముగా
పరిశీలించిన వైలక్షణ్యముతో భాసిల్లుచున్నవి. సంభాషణలు దీర్చుటలో, ప్రకృతి
వర్ణనానైపుణ్యమున, పాత్రలు పరస్పరహృదయ ప్రకటన మొనరించుకొనుటయందు
శివభారతము మిన్న రణరంగవర్ణనమందు నిజముగా ప్రతాపుడే కవిగా నవతరించి
నాడేమోయను భ్రాంతిని కల్పించు రాజశేఖరుని గ్రంథము మేలు. “ఈనిన పులియట్టు
లెగిరి పైవ్రాలెడు” సైనికులు, పిడుగులు గుంపులై పడెడు వీకను నిప్పులురాలునట్లు
పైబడెడు తుపాకిగుండ్ల జడివానల పెల్లును ప్రదర్శించు యుద్ధచిత్రణమందు రాణా
ప్రతాపచరిత్ర శివభారతము కన్నపై చేయి.
“తల్లి నే గట్టుకొని స్వాతంత్ర్య భవనరాజంబు కన్నీటివణద మునిగె” అనియును-
“పిల్లలును మేము బయల జీవింపవలసె
మానవుల కర్షనుగు తిండి మరచిపోయి”-
అను కరుణరస ప్రపూరితములగు ప్రతాపుని వాక్కులు హృదయములను చూర్ణ
మొనరించుచున్నవి.
ఇట్టి కరుణరస ప్రదర్శనము శివభారతమునందును కాననగును. ఉక్తివైచిత్యమీ
రెండు కావ్యములందును సమృద్ధము. ఛందోదృష్టితో జూచినప్పుడు ధారాశుద్ధియందు
యతిప్రాసములు అప్రయత్నముగా భావము ననుసరించుట యందు యీ రెండు
గ్రంథములును యెన్నదగినవే. కాని రాణాప్రతాపచరిత్రయందు సీసములకు,
గీతములకు ప్రాధాన్యమెక్కువ. శివభారతమున యెక్కువగా వాడినవి వృత్తములు.
చక్కని జాతీయోక్తు లీ రెంటియందును కలవు. శివభారతమునకు శాంతరసము
స్థాయి. ప్రతాపచరిత్రమున ప్రతి పదమునందున వీరరస ముట్టిపడుచుండును.
ఈ రెండు కావ్యములకుగల వైలక్షణ్యమునకు కారణము తత్మథానాయకుల
విశిష్టతయే. ప్రతాపుడు ఆదర్శమునే ప్రధానముగా నెంచుకొని అందుకొరకు సర్వమును
133
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
త్యాగమొనరింప సంసిద్ధుడు. పవిత్రమగు నాదర్శమును పవిత్రమగు సాధన
సహాయమున పొందగోరువాడు ప్రతాపుడు. వెనుకముందాలోచించుట యీతని
ప్రకృతికి విరుద్ధము. కాని కార్యార్థియె, లక్ష్యసిద్ధికై సాధనశుద్ధి నంతగా సరకు
సేయనివాడు శివుడు. ఈ విభేదమే రాజపుత్ర మహారాష్ట్ర ప్రకృతులందు గల విభేదము;
ఈ కావ్యద్వయ విశిష్టత.
ఈ రెండు గ్రంథములందలి యితివృత్తములును ఆంధ్రదేశమునకు
సంబంధించినవి. ఆంధ్రచరిత్ర వీరగాథల కాలవాలము. ఆంధ్రులనేక సామ్రాజ్యముల
నిర్మించిరి. వారి వైభవము వ్లినీవంటి చరిత్రకారునకు కన్నులు గుట్టినది;
మార్మొపాలోవంటి యాత్రీకుని దిగ్భాంతు నొనరించినది. వారికి ప్రత్యేక సంస్కృతి
గలదు; ప్రకాశవంతమగు సాహిత్యము కలదు; ఉజలమగు చరిత్రగలదు. ఎన్ని
రాజ్యములు, ఎన్ని సామ్రాజ్యములు, ఎన్ని యుద్ధములు, ఎంత రాజనీతి వైశారద్యము
ఆంధ్రచరిత్రమున గోచరించునో ఒకమారు వుటలను తెరచిచూడుడు.
రక్తాంకితములగు నక్షరములను తిలకింపుడు. ఎంతమంది యాంధ్రకవు లీ గాథలను
గాన మొనరించినారు? ఎందర భావనా శక్తి కీచరిత్ర దోహద మొసంగినది?
ఆధునిక కవి కుమారులు మన సారస్వతమున నూతన మార్గముల
ననేకములను ద్రొక్కుచున్నారు. అతివాస్తవికత, అభ్యుదయరచన వీనిలో ముఖ్యములు.
మార్పు అనిన యులికిపడువారిలో నేనొక్కడను కాను. సారస్వత రంగమున నవ్యత
యనివార్యము; అట్టి నవ్యతకు సుస్వాగత మొసంగుట మన పరమధర్మము. కాని
సంప్రదాయ విరుద్ధములగు వెట్టి వేషములను వేయుటవలన యెట్టి ప్రయోజనమును
లేదు. ప్రాతదియెల్లను జోతయని దాని కగ్ని సంస్మారమొనరింప వలయునను
వాదమును మాత్రము మనము సహింపజాలము; ప్రతిఘటించి తీరుదుము. నేడు
మన జాతికి కావలసిది చైతన్యము, పౌరుషము. మన సారస్వతమున కవసరమైన
రసము వీరము. అందుకు సాధనము వీరపూజ. వీరపూజకు వలయు సామగ్రి మన
యాంధ్ర చరిత్రమున కావలసినంత కలదు. కుమార కవిసింహులు తమ దృష్టి
నీవంక మరల్చవలయును.
134
సారస్వత నవనీతము
క్షేత్రయ్య నాయికలు
ఆంధ్ర కవులలో, విశేషించి తెలుగు పదకర్తలలో, క్షేత్రయ్య కొక విశిష్టత కలదు.
ఈయన పదాలలో సంగీతము, సాహిత్యము, అభినయము సంస్కృతమున
జయదేవుడు మరియు నారాయణతీర్థుల రచసలందు వలె ముప్పిరిగొని యున్నవి.
క్షేత్రయ్య పదాలు శృంగార రస ప్రధానములు. ఈయన తంజావూరు రాజుల
కాలమున నివసించిన వాగ్గేయ కారకుడు. అనగా సుమారు రెండునూర్ల సంవత్సరాల
(క్రింద యీయన రచనలు జరిగినవన్న మాట. అప్పటివరకు మనదేశములో ఇంగ్లీషు
రాజ్య విస్తరణ పూర్తియె, పాశ్చాత్య నాగరికత అడుగు పెట్టలేదు. మన వేష భాషలు,
అలంకారాలు, మరియు ఆచారాలు ఆధునిక నాగరికతా ప్రబావమునకు లోనై,
విజాతీయములు కాలేదు. మన 'జాతిలో సాహసము, శౌర్యము, పరాక్రమము
లోపించుట అప్పటికే మొదలైనప్పటికిని శృంగార రక్తి పూర్తిగా సన్నగిల్లని కాలమది.
అట్టి కాలమున నివసించిన శృంగార నాయికలను క్షేత్రయ్య తన కవితలో
చిత్రించినాడు.
క్షేత్రయ్య నాయికలు నెజిజాణలు, ప్రియుని చిత్త మెరిగిన సార సంగ్రాహిణులు,
సరసజ్ఞు రాండ్రు. వారు ఆట పాటలయందే కాక “మరియన్నిట” నెజిజాణలు.
వారికి సన్న వలువలు ఇష్టము, ఈ నాయికలలో కొందరు పట్టు పాటాని పూలపావడ,
సరిగల బుట్టాల రవశల్లాతో మనకు సాక్షాత్మరించెదరు, మరికొందరు మేటీ చందురు
కావిపావడామీద పట్టుచేలము గట్టుకొని ఎడవాలు పైట వేసికొనెదరు. ఇంక కొందరు
మేటి పైఠాణి కొంగు జారగదీసి జాళువారైకను తొడుగుకొనిన సొగసులాడులు. ఈ
నాయికలలో కొందరు పసుపు దుప్పటి వల్లెవాటు వేసికొనగా మరి కొందరు చలువ
దుప్పటి ముసుగు వేసికొనెదరు. ఈ నాయికలందరికిని తిలకము అనివార్యమైన
అలంకారము. ఒక నాయిక నొసలిపై మిసమిసలాడు తిలకము, మరొక ముద్దులాడి
నుదుటిపై చక్కని, సన్నని కస్తూరి నామము. కామకలా ప్రవీణలైన యీ నాయికలు
ప్రణయకోపము వచ్చినప్పుడు ఘనమైన జడమేటు వేయుటలో ఆరితేరినవారు.
ఒకానొక నాయిక ఘనమైన జడమేటు వలన ప్రియుని శరీరము కందిపోయినప్పుడు,
అది కనపడకుండుటకై అలదు కొనిన గంధమును, గంధము చాటున కందియున్న
సొగసును పరిశీలించు చిత్రమొకటి మనకు యీ పదాలలో కనపడుచున్నది.
135
డా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
అందుచేత యీ నాయికలు గుత్తపువన్నెల కీల్దడను కోరి కోరి వేయించు కొనెదరు.
పూవులు లేని కొప్పులు గాని జడలు గాని మనకు కనపడవు, అవి యాకాలమున
లేనే లేవేమో; పూవులన్నియును పరిమళ భరితములై యుండుట అవసరము. మల్లెలు,
మొల్లలు, సన్నజాజులు విరజాజులు యీ నాయికల కబరీభరములందును
కీలుజడలందును శోభిల్లు చుండును. కలువపూవులతో యీ కాంతలు మన్మధ పూజ
గావించెడి వారలు. చెక్కిళ్లమీద కస్తూరికా మకరికలు దిద్దుకొనుట గళము మీద
గంధము అలదు కొనుట ఆ నాయికలు అనుదినము చేసికొను అలంకార విశేషములు.
ఇందుకు తోడు యెల్లప్పుడు పుక్కిటిలో కప్పురపు తావులతో నొప్పు విడెము. ఘనసారము
జవ్వాది కస్తూరి యీ నాయికలకు అత్యవసరమైన విలాస సామగ్రి. వానిని
బహువిధములుగా వారు ఉపయోగంచు కొనెదరు. కస్తూరి పైన తెలుగు వారికి గల
ప్రేమను ఆచంద్ర తారార్మము గావించిన శ్రీనాథుడు, యీ సందర్భములో జ్ఞప్తికి
వచ్చును. కన్నుల కాటుక, కాళ్ల లత్తుక, మరికొన్ని ముఖ్యమైన అలంకారములు. ఈ
అలంకారాలతో పాటు తగు సొమ్ములు ధరించి యీ నాయికలు పూచినతంగేళ్ల వలె
భూషణ భూషితలై యున్నారు. ఇరు చెవులకు తాటంకములు వజ్రాల కమ్మలు రెండు
చేతులకు గాజులు, వేలికి ముద్దుటుంగరము, నడుముకు మొలనూలు (కొందరికి
ప్రియుడు పంపిన గంటభారి మొలనూలు) ముత్తెముతో శోభిల్లు ముక్కర నాగసరాలు,
చెయిసరాలు, బన్నసరాలు మొదలైన ఆభరణాలతో యీ నాయికలు క్షేత్రయ్య
సమకాలికుడైన చేమకూర వెంకన్న చిత్రించిన “అతి వినోదము గాగ రతుల మెప్పించు
నేర్పు” గలిగినట్టి ముత్యాల కమ్మల ముద్దులాడులు, నీలంపు ముంగర నీలవేణులు,
కెంపుల బొగడల కీరవాణులు, పచ్చల కడియాల పద్మగంధుల వంటివారు. పన్నీరు,
గంధము, జగ్గు గుల్కు బుక్కా వలపు సొలపు జూపులతో నొప్పు యీ వన్నెలాడులను
సదా యెడబాయక యుండు పరిమళ ద్రవ్యములు.
ఈ నాయికలు నివసించు గృహములు, మేడలు, శృంగార సీమలు, అందాల
పుట్టలు, తూగుటూయెలలు, చలువ చప్పరములు, శృంగార వనములు వీరి
గృహాంగణాలలో కనుపించుచున్నవి. కొంచెము లోపలికి వెళ్ళి సావధానముగా
పరిశీలించినచో ఒకచోట పంజరము, అందులో సుద్దులు తెలుపు చిలుక మనకు
కనుపించును. కొన్ని యిండ్లలో చిలుకలతో పాటు గోరువంకలు కూడ. ఒక గదిలో
గిలకల పట్టెమంచము, దానిపైన పానుపు, పాన్సుపై తెల్లని దుప్పటి, దుప్పటిపై
136
సారస్వత నవనీతము
మల్లెలు, మొల్లలు. ఒకచోట నిలువుటద్దము. నూరిన గంధ కస్తురి పచ్చికస్తురి జవ్వాది,
కర్పూరము, మంచిగంధము, పన్నీరు మంచునీరు మొదలైన శృంగార సామగ్రి
అక్కెరకొద్ది మక్కువతో సేకరించుకోబడి యున్నవి. ఇట్టి సన్నివేశములో సంచరించు
నాయిక మదనశాస్త్రములో మంచి ప్రవీణురాలు. శృంగార వనములో చెలువునితో
కూడి చదరంగ మాడుట యీ నాయికలు అభిమానించు ఆటలలో ముఖ్యమైనది.
సంగీతమును గూర్చి వేరుగా చెప్ప వలసిన పనియేలేదు. తంబుర మీటుటలో, వీణ
వాయించుటలో వీరికి గల ప్రావీణ్యము అసామాన్యము. జంత్రగాత్రముల రాల్గరగించు
విమల గాంధర్వము మరియు అనవిల్తు శాస్త్రంపు మినుకు లావర్తించుపని, వెన్నతోడ
బెట్టిన విద్యలైనట్టి వరూధిని వీరికి దగ్గరి చుట్టము. పద్యరచనలో ప్రవీణుడైన
నాయకునికి పద్యములోనే సమాధానము యిచ్చుటలోను, ప్రియుని ముద్దు కవితను
చదివి అతనిని ఆకర్షించుట లోను వీరు మంచి నేర్పరులు. ఈ నాయికల శ్రేణికి
చెందిన ఒకానొక (ప్రొఢ యీ కాలముననే,
“ఏ వనితల్ మముందలప నేమిపనో, తమరాడువారుగా
రో, వలపించు నేర్చెరుగరో, తమ కౌగిటి లోన నుండగా
రా, విది యేమిరా విజయ రాఘవ యంచిలు దూరిబల్మిమై
తీ వరకత్తెనై ఇటకు తీసుక వచ్చితి నా తలోదరీ” అని
రాజపత్నికి వ్రాసి పంపిన పద్య సమాధానము తెలుగు వాజ్మయములో
ప్రసిద్ధమైనది. క్షేత్రయ్య నాయికలను అలంకార శాస్త్ర దృక్పథముతో పరిశీలించినచో,
వీరిలో అన్నిరకాల నాయికలు కన్పట్టు చున్నారు. ఒక్కొక్క పదములో ఒక్కొక్క రకమైన
నాయిక కలదు. స్వీయ, పరకీయ, సామాన్య నాయిక లిందులో కలరు. వీరిలోగూడ
కన్యలు ముగ్ధలు మధ్యలు ప్రొఢలు, విరహోత్మంఠితలు, ఖండితలు, కలహాంతరితలు
స్వాధీన పతికలు ధీరలు, అధీరలు, ధీరాధీరలు, జ్యేష్టలు, కనిష్టలు కలరు. ఈ
నాయికల చెలికత్తెలైన సఖులుకూడ క్షేత్రయ్య చిత్రించిన స్త్రీలలో కలరు. చూడుడు,
ఒకామె స్వీయ (ఖండిత) ప్రియుని శరీరమున రతిచిహ్నములు చూచును. కాని
ఘాటుగా మాట్లాడదు, అసూయను మాత్రము ప్రదర్శించును. కాని స్పష్టముగా
ఇంటినుండి వెళ్ళిపొమ్మని చెప్పదు. మరొకతె ఎత్తి పొడుపుమాటలతో ప్రియుని
యెదుర్మొనును. ఇందులో ప్రొఢయైన యొకతె, హృదయములోని అసూయను
అణచుకొని, పైకి గాంభీర్యము వహించి మాట్లాడును. సాధారణముగా స్వీయ లందరు
137
డా॥ దేవులపల్లి రామానుజరావు (గ్రంథావళి
ప్రియుడు రానందుకు విరహముతో అంగలార్చుట యీ పదాలలో కనపడును.
పరకీయలలో విరహోత్మ్యరింతలు, కలహాంతరితలు అతృవ్తలు, తృష్తాతృప్తలు కలరు.
ఈ పరకీయలలో నొకతె “నామగడు కత్తికోతకాడు. నేటికి ఆజ్ఞయిమ్ము అత్తవారింటికి
పోకతప్పదు. పుట్టింటిలో యెల్లప్పుడు ఉండ గలనా? బావ, సవతి మరియు అత్తలతో
పోరాడి మరలి వచ్చెదను, లేక నీవైన ఒకమారు తిరునాళ్ల నెపముతో మాయూరికి
రారాదా?” అని సెలవు తీసికొనును. స్వీయ (కులస్రీ) తెల్లవారముందె లెమ్మని
ప్రియుని కోరును. పరకీయ తెల్లవారు నేమో? ఇతరులు చూచిన ప్రమాదము, ఇక
నీవు వెళ్లుమని తొందర జేయును. సామాన్య నాయిక “అయ్యో! అప్పుడే తెల్లవారినదే,
ఇంకను ప్రొద్దుండక పోయెనే” యని అతృప్తి వెల్లడించును. సామాన్య నాయికలు
సాధించుట, ధనాసక్తితో డబ్బు యిమ్మని జగడ మాడుట యీ పదాలలో కనపడును.
“అయిదు వరహాలు యయ గలిగితేరా, చలువ చీరెలు, చెంగలువలు యీయ
గలిగితే నేరా” అని యీ నాయికలు సాధించుదురు. స్వాధీనపతికయైన స్వీయసఖితో
భర్త యొక్క గుణగణమును వర్ణించును. ఈ నాయికలకు చెలికత్తెలైన సఖులు
నాయికకు హితవు చెప్పెదరు, ఓపిక పట్టుమని కోరెదరు, చమత్మారముగా
మాట్లాడుదురు. చక్కెరబొమ్మా మీ యిద్దరి మనసు చల్ల నాయెనా? యని సరసముగా
ప్రశ్నింతురు. క్షేత్రయ్య ఒక్కొక పదము, ఒక్కొక విధమైన నాయిక భావ ప్రకటనమే.
తెలుగు దేశములోని ఆనాటి రసిక జీవనము క్షేత్రయ్య రచనలలో చక్కగా
ప్రతిఫలించు చున్నది. తెనుగు పలుకు బళ్లలోని చక్కదనమును, తీపిని ఇంతముద్దుగా
మన కంద జేసిన కవులు మిక్కిలి తక్కువ. “కన్నీరు కావేరి కాలువ, పొందు వద్దని
గట్టిగ వక్కలాకు లిచ్చెను, చెలియ పెట్టిన మందు తలకెక్కెనో, నా సొగసెప్పుడు
జూచెదరే, మీరేమైన ఆర్బెదరో, తీర్చెదరో, దృష్టి దాకించిరో నొసటి భ్రాత తప్పదాయె,
ఈనిన పులివంటి కోపము, లక్కవంటి మనసు రాయై, దాదు ఫిర్యాదేది ధరణిలో
లేదాయె, కలిబోసిన ఉట్టి వంక జూచినట్లు, ఆడపుట్టువు పుట్టలేదా ఒట్టుపెట్టి
చెప్పెదను, ఉట్టి పడ్డట్లు వచ్చె” మొదలైన చక్కని తెనుగు నానుడులు, లోకోక్తులు
యీ గేయాలలో కొల్లలు. ఇవి యన్నియు ఆంధ్ర సుందరులు అనుదినము తమ
సంభాషణలో ఉపయోగించునవి. “మొప్పె వగలు, అసురసురన్నది, నాలిముచ్చు
గయ్యాళి, దబ్బున, ఆడుకొనుట వాలాయము, సరిప్రొద్దు, తియ్య బెల్లి మాటలు
చలపాది కోపము, ఆగఢము, మీసము దువ్వుట, అముకొన్న (ప్రేమ, మోముచిన్న
138
సారస్వత నవనీతము
జేసుకొనుట” మొదలైన మాటలు యీ పదాలు నూటికి నూరుపాళ్లు తెలుగుదనము
కలిగి యున్నవని తెలుపుచున్నవి. క్షేత్రయ్య పదముల లోని సన్నివేశములు, నాయికల
వర్ణన శైలీభాషలు మొదలైనవి తంజాపురాంధ్ర రాజుల కాలమున నివసించి రచనలు
గావించిన చేమకూర వెంకన్న ముద్దు పళని, మొదలైనవారి కావ్యాలలోని
సన్నివేశములు మరియు వర్ణనలు శైలీ, భాషలను పోలియున్నవి.
“ఈ రేయి నను గూడితే ఇన్నూరు ఘట్లు” ఇచ్చెదనన్నాడు ఒక చోట క్షేత్రయ్య.
ఘట్లు ఒక విధమైన నాణెము లేమో; సావకాశముగా పరిశీలించినచో యీ పదాలలో
యిట్టి విశేషాలు ఇంకను పెక్కులు కనుపించ వచ్చును.
139
దా/ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
వేయిపడగలు
నవ్యాంధ్ర సారస్వత విశేషము నవల. ఆధునిక సారస్వతమున ముఖ్యశాఖ
వచన వాజ్మయము; తదుప శాఖ నవల. భావ కవిత్వము వలె నవలయు
కొంతవరకాంగ్ల సాహితీ ప్రభావ చోదితమని చెప్పవచ్చును. కాదంబరీ,
కళాపూర్ణోదయాదులందు వలె, కథా చమత్కృతి, సంవిధాన చాతుర్యము, పాత్రపోషణ,
నవలా వాజ్మయమున ముఖ్యములు. నవలలు సాంఘికములు, చారిత్రకములు,
అపరాధపరిశోధకములని ముఖ్యముగా మూడు విధములు.
గద్య వాజ్మయ ప్రచార బాహుళ్యముతో పాటు నవలా సారస్వతము మన
తెనుగున వర్ధిల్లు చున్నది. సారస్వతానుబంధములు, మాస పత్రికలు, గ్రంథమాలలు
వీని యభివృద్ధికి తోడుపడినవి. మన విద్యార్థుల కీ నవలలు ఉపవాచకములైనవి.
గద్యతిక్మనయగు శ్రీ వీరేశలింగము పంతులుగారి రాజశేఖర చరిత్రము మన భాషలో
క్రొత్తయుగమును స్థాపించిన ప్రథమ నవల; మరియు ప్రశస్తమగు నవలలలో నొకటి.
పంతులవారి సంస్మరాణాభిలాష కీ నవల చక్కని యద్దము వంటిది. ఈ మార్గమున
శ్రీ విజ్ఞానచంద్రికా గ్రంథమండలి వారి కృషి ప్రత్యేక ప్రశంసనీయము. ఉత్తమ
నవలలకు బహుమానముల నేర్చరచి, వారు విమలాదేవి, రాయచూరు యుద్ధమువంటి
చక్కని నవలలను ప్రకటించిరి. సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకాగ్రగణ్యులగు శ్రీ వేంకట
లక్ష్మణరావుగారి సంపాదకత్వమున వెలువడినవగుటచే గాబోలు యీ నవలలు
చారిత్రకములు. తమకు గురుప్రాయులగు శ్రీ వీరేశలింగముగారి అనేక
ఇతరోద్యమములకు తోడ్చడినట్లై, నవలా రచన యందును ముందంజవేసి, ఆంధ్రులకు
హేమలత, కర్పూరమంజరి, అహల్యాబాయి, సౌందర్యతిలక, గణపతి వంటి
యమూల్యములగు నవలల నొసంగిన వారు చిత్రవచన కావ్యరచనా నిపుణులు
శ్రీచిలకమర్తి లక్ష్మీనరసింహముగారు. వీరి సుధాశరచ్చంద్రము రమేశచంద్రదత్తుని
బంగాళీ ఆఖ్యాయికకు మనోహరమగు ననువాదము. చక్కదనమునకు మారుపేరగు
వీరిశైలి వీరి నవలల కొక వింత విన్నాణ మొసగుచున్నది. అద్భుత నవలా రచనమున
ఆంగ్లమున స్మాటు వలె లక్ష్మీనరసింహముగారు అద్వితీయులు. ఈ సందర్భమున
శ్రీవేంకట పార్వతీశ్వర కవుల సేవ సుప్రసిద్ధము. ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల
వారు వంగభాష నుండి (ముఖ్యముగా బంకించంద్రునివి) అనేకములగు నవలల
140
సారస్వత నవనీతము
ననువదించి యాంధ్రుల కొసగిరి. శ్రీ శివశంకరశాస్రి గారి సంపాదకత్వమున నవలా
ప్రకటనము కొరకే యుద్భవించి సేవ యొనరించినది సరస్వతీ గ్రంథ మండలి. ఈ
గ్రంథ మండలివారు ప్రకటించిన శ్రీ కేతవరపు వెంకటశాస్త్రిగారి లక్ష్మీప్రసాదము;
పూర్ణానందము, అగ్రహారము ఆంధ్రులకు సుపరిచితములు మరియు స్వతంత్ర
రచనలు. ఇచ్చట పేర్కొనబడిన రెండు గ్రంథమాలలును అపరాధ పరిశోధక నవలలను
విరివిగా ప్రకటించినవి. వీరి నవలలలో స్వకపోల కల్పితములు తక్కువ. వంగ
మహారాష్ట్ర భాషల నుండి పరిపర్తనము లధికములు. ఆంధ్రులలో నవలా
పఠనమునందు అభిరుచి ఉత్సాహము కల్పించిన వీగ్రంథమాలలు. నవీనుడగు
చక్రపాణియు, విద్వద్వర్యులగు శ్రీ వేలూరి శివరామశాస్తిగారును శరచ్చంద్రుని
నవలల నాంధ్రుల కొసంగినారు.
ఇట్లు క్రమపరిణామము నందినది మన నవలా సారస్వతము. అపరాధ
పరిశోధక నవలలలో మనము చెప్పదగిన యభివృద్ధి జేయలేదు. చారిత్రక నవలలలో
విజ్ఞాన చంద్రికాగ్రంథ మండలి వారి ప్రకటనములు, లక్ష్మీనరసింహముగారి
(గ్రంథములు దప్ప మనకు గర్వింప దగినవిలేవు. సాంఘిక నవలా రచనా రంగమును
మనము కొంత అభివృద్ధి నొనరించితిమి. ప్రశంసములగు సాంఘిక నవలలు మనకు
సంఖ్యలో పరిమితములు; తద్రచయితలును యిద్దరో, ముగ్గురో. ఉత్తమ రచన
లెప్పుడును అసంఖ్యాకములు కావుగదా? “గంగి గోవుపాలు గంటెడైననుచాలు
కడివెడైననేమి ఖరముపాలు”! ఈ సందర్భమున శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారి
మాలపల్లి యను మహోత్మష్టమగు నవలా రాజమును విస్మరించుటకు వీలులేక
పోవుటయే గాక దానినెంత కొనియాడినను తక్కువయే.
ఖండ కావ్యములతో పాటు భాషారంగమున చిన్నకథయు ప్రాముఖ్యత
వహించినది. అనేకులదృష్టి కొంతవరకు నవల నుండి చిన్నకథ వంక మరలినదని
చెప్పవచ్చును. అనుచర కవికులముతోకలసి భావగీతముల నాలపించియు నవలా
సారన్వతమున కృషి యొనరించిన వారలు కవినమ్రట్ శ్రీ విశ్వనాథ
సత్యనారాయణగారు, శ్రీ అడవి బాపిరాజుగారును. నవ్యాంధ్ర కవికుమారులలో
వీరిరువురుదప్ప ఉపజ్ఞా సహితములగు నవలలను రచించినవారు లేనే లేరేమో?
విశ్వనాధ సత్యనారాయణగారి నవలలు విలక్షణమగు వ్యక్తిత్వము గలవి. వానిని
పరభాషా నవలలతో పోల్చినప్పుడు తల వంచవలసిన యవసరము లేకపోవుటయేగాక
141
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
గర్వించుటకు న్యాయమగు కారణములుగలవు. వీరి వేయిపడగలు గ్రంథము
ధర్మరక్షణకు కంకణము గట్టుకొనినదన్నారు ఆచార్య శ్రీ కురుగంటి సీతారామయ్య
గారు. “సత్యనారాయణగారు కవి సార్వభౌములు; సుకుమార హృదయులు కావున
సంఘ మందలి యన్యాయములును, అక్రమములును వీరి హృదయమునకు సమ్మెట
పోటయినవి. చచ్చిపోవుచున్న యొక జాతి చివరిమెరపులను జూచి వీరు తమ
హృదయావేదన, భావోద్వేగము శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారి స్నేహలతా
ప్రియంవదల సంభాషణయందువలె, స్వీయ నవలల యందు వెల్లడించి సంఘమునకు
సక్రమమగు దారి చూపినారు.” వేయిపడగలు చెలియలికట్ట యిందుకు నిదర్శనములు.
భరత ఖండమున నీకాలము సంధియుగము. పాశ్చాత్య వ్యామోహాగ్రస్తులలో
కొందరిప్పుడిప్పుడే కనులు విప్పుచున్నారు. జాతీయభావములు ్రబలుచున్నవి.
నాగరికతయని మనమువ్యామోహ పడిన వస్తువు నిజమగు నాగరికతగాక సంఘ
వృక్షమునకు బట్టిన చీడపురుగు అని తెలిసికొనుచున్నారు. మన సంస్కృతియననేమో
తెలిసికొన నుంకించుచున్నారు. కాని యీ భావపరిణామము మిక్కిలి మెల్లగా
జరుగుచున్నది. దోహదము అత్యవసరముగా గన్పట్టుచున్నది. రాజకీయ దాస్యము
మన ఆర్థిక వైజ్ఞానిక దాస్యములకు మూలకారణమైనది. ఆరోగ్యమునకు మోమువాచి
జీవచ్చవములై, మన యువకులు చదివిన, చదువుచున్న చదువుకు ప్రతిఫలము
కడుపునిండ కూడైనను దొరుకుటలేదు. కూలినాలి యొనర్చు పెంపేదల రక్తమును
శ్రీమంతులు ద్రావుచున్నారు. సంఘమున గట్టుదిట్టముల నొల్లక జనులు స్వచ్చంద
ప్రవృత్తులగుచున్నారు. వైవాహిక సంస్థమీద విశ్వాసము తగ్గుచున్నది. స్వైరవివారము,
కామసంతృప్తియే నిజమగు (ప్రేమయని భ్రమించుచున్నారు. ఈ భావముల
ప్రచారమునకు కొంత సాహిత్యముకూడ జనించినది. వీరిలో ముఖ్యుడు గుడిపాటి
వెంకటచలముగారు. ఆయన రచించిన శశిరేఖయను నవలయు, ఇతర గ్రంథములును
ఈ సిద్ధాంతములను ప్రతిపాదించుచున్నవి. ఈ స్వేచ్చ, ఈ భావములు నేడు మన
యువకుల జీవితములను విషాదాంతములనుగా జేయుచున్నవి. భగ్న ప్రణయము,
భగ్న జీవితములు సామాన్యములైనవి. కావుననే సత్యనారాయణగారు నియమము
నాగరికత, నియమము దాటిపోవుట పశువృత్తియని యెలుగెత్తి చాటినారు.
చెలియలికట్టలోని నియమము నిలకడ లేని స్వేచ్భాజీవియగు రంగని జీవిత మిందుకు
నిదర్శనము. కామమే ప్రధానము, శరీరసౌఖ్యమే పరమావధియని భావించి విధ్యుక్తధర్మ
నిర్వహణము విస్మరించుట నాగరిక లక్షణముగాదు.
142
సారన్వత నవనీతము
“సారపు ధర్మము న్విమలసత్యము పాపముచేత బొంకుచే పారము జెందలేక
చెడబారినదైన యవస్థ దక్షులెవ్వార లుపేక్షసేతు రదివారల చేటగుగాక
ధర్మనిస్తారకమయ్యు సత్యఫలదాయకమయ్యును దైవ ముండెడిన్” - అని
మహాభారతము చెప్పుచున్నది.
కావుననే సత్యనారాయణ గారుపేక్షంప జాలరైరి. ఒకజాతి యౌన్నత్యము,
అభివృద్ధి తత్సారస్వతముపై నాధారపడియుండును. కట్టబట్ట తినగూడునులేక
ఎన్నియో కోట్ల ప్రజలు మలమల మాడుచుండ, భావి దేశకల్యాణమునకు బాధ్యులగు
ప్రజలు ఇట్టి భావములకు దాసులగుట జూచి సత్యనారాయణగారికి కలిగిన
యావేదనకు మేరలేదు. ఈ స్వేచ్భాజీవుల యాంగ్ల వాజ్మయపు పిచ్చిభాషకోసము
తెనుగు ప్రబంధములు చదివినను భావములకొర కాంగ్లభాషా గ్రంథము లవశ్య
పఠనీయములను నంతవరకు ముదిరినది. చెలియలికట్టలో రంగడు, తత్సహచరులు;
వేయిపడగలలోచక్రవర్తి, రాధాపత్యాదులు యీ తెగలోనివారు. స్వజాతి, స్వభాషయను
నహంకారదర్శన మందని జాతికి పురోభివృద్ధిలేదని కవివాణి పలుకుచున్నది. మన
రుచులు; అభిరుచులు జాహ్యదాస్యమునకు ప్రతిబింబములు. జీవితము కృత్రిమమగు
యంత్రమైనది. పండినచోట ధాన్యలక్ష్మి రైళ్ళమీదబడి మరియెవ్వరికో ఆకలిదీర్చుటకు
పరుగెత్తుచున్నది. ధనాశా పిశాచ మెల్లయెడల తాండవించుచున్నది. ప్రజలామెనే
దైవమని భ్రమించి యారాధించుచున్నారు. సత్యముచచ్చిన దేశీయ ప్రజలు
ధనవ్యయము జేసికొనుచు లెక్క సేయకున్నారు. కాని జరుగుచున్న యాత్మభ్రంశము
తెలినికొనుటలేదు. బోగముదానికిచ్చిన డబ్బు మోటారు కొన్నదానికన్న
చెడిపోయినదా? అదియొక పేదజీవి బ్రతుకుటకైన నుపయోగపడినదికదా!
అధర్మములు అన్యాయములను జూచి సుకుమార హృదయులు సాధారణ
మనుజులకన్న నెక్కుడు క్షోభింతురు. ఆ యావేదన, ఆ యుద్వేగము మహాగ్రంథ
రచనగా ప్రత్యక్షమగును. విశ్వసాహిత్యము నొకమారు వీక్షించితిమేని,
మహాగ్రంథరచయిత లెల్లరు క్షోభించి కుమిలి కృశించినవారే! సమకాలిక
సంఘమునందలి యక్రమముల నెదుర్కొనిన వారే! తత్ఫలితముగా ననేక కష్టముల
ననుభవించినవారే! మహా రచయితలనే సమకాలికులు గుర్తించి గౌరవించ లేదు;
పూలమాలికల నర్చించకున్న మానె సంకెళ్ళను దగిలింపక విడువలేదు. మహా
గ్రంథముల కెన్నింటికో రచనా రంగములు శ్రీ కృష్ణ జన్మస్థానములైనవి.
143
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
ఒక మహారచయిత సంఘమునందలి యన్యాయములను అధర్మములను
ఖండించి యెదురు తిరిగిన క్షంతవ్యుడే. కాని ఒకవ్యక్తి ప్రతిభా విశేషమును గుర్తింపని
సమకాలికులు మాత్రము క్షమార్లులు కాజాలరు. సత్యనారాయణగారి గ్రంథములను
జదివి పెదవి విరుచు వారీవిషయమును గమనించుట యావశ్యకము, ముఖ్యముగా
వారి నవలలు నొప్పినొందిన యొకసుకుమార హృదయుని యావేదనయని
తెలియనగును.
ఇంతకు శ్రీసత్యనారాయణగారి యతివాదమును సమర్థించుట లేదు.
ఏకీభవించుటయుకాదు. లోపములకేమి, ఎవరును సర్వజ్ఞులు కారుగదా? “నలినము
శైవలంబున పెనంగొని యుండియు రమ్యమే యగుజ;- వేయేల, ఆ కళంకమే, ఆ
మచ్చయే చందమామ యంద చందములను ద్విగుణీకృత మొనరించును. చూడుడు-
“వెన్నునికున్న మచ్చ యరవిందము రత్నము భోగిలక్షణం
బెన్నగ నీదుమచ్చ యదియేమె కళంకము నిచ్చకాలనక
తిన్నగ నిట్లెయుండును కదే, గిరికవ్వము దూసి, చన్న, నీ
యన్నువమచ్చ నెవ్వరెటులాడిననుజ్ మన కేమిలే సఖా”
ప్రాతయాచారములు నశించి శక్తిలేని నూతనత్వము మనల నావరించిన
సంధికాలము, నాగరికత యనబడు నీ నూత్నత్వము నెడల ప్రబలుచున్న యసంతృప్తి
యీ నవల కథావిధానమున కాకరము. రామేశ్వరశాస్ర్రిగారు వర్ణాశ్రమ ధర్మములన్నియు
ముద్దకట్టిన మూర్తి. ఆర్నేయపౌరుషేయముల కాయన పర్యాయపదము. ఆత్మగౌరవము
గల యాతనికి తగిన జమీకదారుడు కృష్ణమనాయుడు. రంగాజమ్మ ఆయన
రాసిక్యమునకు పెన్నిధి మహోదారగుణ సంపన్న రుక్మిణమ్మా రావుగారు సర్వవిధముల
కృష్ణమనాయనికి సహధర్మచారిణి. గోపన్న జమీకదారులకు నమ్మినబంటు.
భక్తిప్రవత్తులు సేవ భూతదయ ఆయనయందు మూర్తీభవించినవి. రామేశ్వరశాస్త్రి
తనకు జేసిన మేలు మరవక నోరుదెరచి యాచింపనేరని ధర్మారావుకు మహోపకార
మొనర్చినవాడు, గోపన్న ఇన్నాళ్లుగ నెవరి యుప్పుదిని బ్రతికెనో వారికి దూరముగ
నెక్కడనో మరణింవనోవక కోటకరుగు దెంచి ఆ “నల్లనివాడు
పద్మనయనంబులవాడు” అనుపద్యమును కర్ణామృతముగ నాలకించి కాని యసువుల
విడువని ఇచ్చాశక్తి సమన్వితుడు గోపన్న విద్యుల్లతవలె వారి గొప్పదనము ఒకమారు
మెరిసి వారిభౌతిక కాయములతో పాటు యీ ప్రపంచమునుండి మాయమైనది.
పాశ్చాత్యనాగరికతా ప్రభావమునుండి తప్పించుకొన్న యదృష్టజీవులు వారు.
144
సారస్వత నవనీతము
క్రమక్రమముగా ప్రాతమర్యాదలు పోవుచున్నవి. ఇంగ్లీషు చదువు సుబ్బన్న
పేటలోనికి ప్రవేశించినది. దానితోపాటు స్వాతంత్ర్యము, వ్యక్తిగౌరవము సంఘమును
వశీకృతమొనరించుకొన్నవి. పూర్వమరియాదలు, పూర్వపద్ధతులు నిష్రమించినవి.
ధనవంతులే గౌరవనీయులను భావములు ప్రబలినవి. రంగారావుగారి పరిపాలన
మారంభమైనది. ఆయన చెలియలికట్ట రంగనివలె యాంగ్లమానస పుత్రుడు. రైతులను
మాడ్చి పీడించిన ధన మాయన వెల్ల ఏనుగు నిమిత్తము, భోగలాలసత కొరకు
వెచ్చించెను. గుమాస్తాలను, సేవకులను తొలగించి మిగిలించిన ధనమాయన
విదేశవస్తువుల కొరకు వినియోగించెను. గవర్నరుగారి నజరానాలకు, పెట్రోలుకు,
కారులకు, రైళ్ళకు వ్యయముజేసిన ధనమునకు లెక్కయేలేదు. రాజాదరణ లేక మన
పరిశ్రమలు, మన లలితకళలు, మన యాయుర్వేదము, మన విజ్ఞానము తుదకు
మనవ్యవసాయము అంతరించుటకు సర్వసన్నాహాములు సంపూర్తియెనవి. పురపాలక
సంఘములు, ఎన్నికలు మున్నగువానియందు తగులుకొనిన మనకీగోల యేల?
ఈ విధముగా కారుమబ్బులు గ్రమ్ముకొని యున్న ఆకసమున మినుకు మినుకు
మను తారకలు ధర్మారావు, అరుంధతి, గిరిక, కేశవరావు మున్నగువారు. తండ్రిగారి
కీర్తిప్రతిష్టలకు, పాండిత్య పౌరుషములకు, దారిద్యమునకు వారసుడు ధర్మారావు.
సత్యనారాయణగారు ధర్మారావు రూపమున యీ నవలయందు గన్నట్టుచున్నా
రేమోయను సందేహము కలుగుచున్నది. అరుంధతి ధర్మారావునకు అనురూపగుణ
ప్రచురయగు ప్రేయసి. ఆర్థికములగు చిక్కులు వారి యనురాగమునకెట్టి యాటంకము
కలిగింపలేదు.
సామాన్య సంసారుల దైనందిన జీవితమును కనులగట్టినట్లు చిత్రించినవారలు
శ్రీవిశ్వనాథ మునిమాణిక్యముగార్లు. అరుంధతి ధర్మారావుల యనురాగ ప్రసంగములు
కాంతం కథలను జ్ఞప్తికి దెచ్చును. సాంసారిక జీవితమును సౌఖ్యమొనగూర్చునవి
మేడలు, మోటరులు కావు; మరి నిష్మల్మమగు ప్రేమ. పూటపూటకు కష్టపడుచుండిన
రోజులయందును అరుంధతీ ధర్మారావుల మనస్సులు నారిని యానందసాగరమున
నోలలాడించినవి, అనుభవ వివాహములను, స్వేచ్చా (ప్రేమ సూత్రములను బోధించు
నీకాలమున, వివాహసంస్థను ధిక్కరించు నీదినములలో సత్యనారాయణగారు
చిత్రించిన వైవాహిక జీవితపు సౌందర్య పావిత్ర్యములు మిక్కిలి సరములుగా నున్నవి.
145
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
అరుంధతి మధురమూర్తి , ఆమె వాక్కులకు సహజగుణమగు రసస్ఫోరకత్వము
ధర్మారావు సహవాసముచే నిగ్గులు దీరినది. గుణగ్రహణ నైపుణ్యమున ఆమెకు ఆమెయే
సాటి. ఎన్నినోముల ఫలమో యరుంధతీ గిరికా రధంతరుల సరాగము. ఒకరికొకరు
ప్రాణమిచ్చుకొందురు. వారి సంభాషణ లెన్నిమారులు చదివినను పాఠకునికి
తనివిదీరదు. శశిరేఖ యన్నట్లు వారు ముగ్గురు విచిత్ర స్రీలు. ఒకరికన్న నొకరు
పవిత్రశీలలు, వివేకమతులు. ఒక్కరికిని ఆంగ్రేయవాసనలేదు. మాటలలో రససస్ఫురణ
చాలగలదు. మూడవయామె కన్నులలో దివ్యజ్యోతి; హరప్పకరడు గట్టిన జాతీయత;
ప్రబలుచున్న ప్రాశ్చాత్య పద్ధతులపై తిరుగుబాటుకు నిదర్శనము. ఆధునిక నాగరికతపై
తిరుగుబాటు నాగమ్మ, పసరిక పైరుపచ్చ. మనకు రాజు పోయినను సరే, మరేమి
నశించినను సరే, పసరిక యొక్కటి యున్న చాలుననును ధర్మారావు. నాయరు
మహోదారుడగు వ్యక్తి. ఆనాడు ధర్మారావు గృహమునకేగి తనకడ మిగిలియున్న
రెండురూపాయలు చేతుల్లో పెట్టినప్పుడు మహామేధావియగు ధర్మారావు నాయరు
ముందు కుంచించుకొని రేణువైపోయెను. నాయరు గొప్పదనమును, ఎవరి నెత్తురు
ద్రావి తాను బలిసెనో ఆ పేదవాని శిరసునే యెక్కి సవారి చేయవలయునను ధనికుల
చిత్త వృత్తిలో పోల్చుడు. “నేను న్యాయముగా సంపాదించుచున్నాను. నాకు చాలినంత
దీసుకొందును. లోకములో నిన్ని దొంగతనములు జరుగుచుండినను బాగుబడిన
దొంగ యెవడు” అని ప్రశ్నించుచున్న అనిరిగాని మాటల చాటునుండి
సత్యనారాయణగారు తొంగిచూచుచున్నారు.
అస్థలిత ప్రణయాసురక్తి చిరంతన శుద్ధిచే గాని కలుగబోదు అనినారు శ్రీ
రాయప్రోలు సుబ్బారావుగారు. వేయి పడగలలోని శశిరేఖ (ప్రేమమిట్టిదే. కిరీటికామె
యంతరంగ శాంతి దేవత, తపః కల్పవల్లి. వారి యన్యోన్యప్రేమ కామ ప్రవృత్తికి
లొంగిన స్వైర విహారముగాదు. అది నియమబద్ధము, దైవభక్తికి విధేయము.
సాహిత్యము సమకాలిక జీవితమును విస్మరింప జాలదను సత్యమునకు నిదర్శన
మీ గ్రంథము. జాతీయ వాయువు లీపొత్తమున నెల్లడ వీచుచున్నది. కేశవరావు
ఆంధ్రరత్న గోపాల కృష్ణుని జ్ఞప్తికి దెచ్చుచున్నాడు. మనదేశమున దేనికిని మాపులేదు.
ఖద్దరకు మాపేమిటి. అది యెప్పుడును పవిత్రమే, నిర్మలినమేయను ధర్మారావు,
హరప్ప, కేశవరావు మన జాతీయవాదులే.
భరతవర్షమునకు జీవనాధారము వ్యవసాయము. కాని దురాశచే ధన దేవతలకు
మోకరిల్లి వరి పైరునుదప్ప యితరములను పండించుట మానినాడు మన కర్షకుడు.
146
సారస్వత నవనీతము
పశువులకు మేతవేయు విచారమే లేదు, మన రైతుకు. వరిపైరును తప్ప తదితరములకు
పరదేశములపై నాధార పడుచున్నాము. మతమును సంఘమును మనోహరముగా
జెప్పునది వాజ్మయమని సత్యనారాయణగారి నిర్వచనము. మన మతమును
సంఘమును మనోహరముగా వ్యక్తీకరించినది వేయిపడగలు.
మత్స్యగంధి సమీపమున నన్నయభట్టారకునివలె గిరికా సస్నిధానమున
సత్యనారాయణగారు ముగ్భులైనారు. కాననే గిరికతో పాటు వారును అదే
నందనందనుం డతర్ష్డితుడయ్యె పాటలీ తరులార పట్టరమ్మ అని నృత్య మొనరించినారు.
చివరకు గిరిక పుణ్యములు పండి స్వామిలో లీనమైనది. అనంతరము శుష్మించి తన
చిన్నారి మరదలిని చేరబోయిన దరుంధతి. రైతు కృతకభావములకు లోనైనాడు.
పసరిక పొలాల వంక పరి వెత్తినది. “మెట్ట పొలాలు లేనిచో జాతి త్రాచులము మా
బ్రతుకెట్లు? రైతు మాకు నిలువ నీడలేకుండ జేసెను. నీవు పాశ్చాత్య
వ్యామోహగ్రస్తుడవై మమ్ము చేతులార జంపితివి” అని జాతి పాములా పసరికసు
వీడిచనెను. తుదకు పాము గరువగా పసరిక ప్రాణము వీడెను.
ఈ విధముగా శక్తిలేని యొక క్రొత్తదనము లోకము నావరించినది. ప్రాతదెల్ల
నశించిపోయినది. వేయిపడగల సుబ్రహ్మణ్యేశ్వరస్వామియే రెండు పడగలతో
మిగిలినాడు. ధర్మార్థ కామ మోక్ష హేతువులగు విద్యలు నశించినవి. కేశవరావు
గతించెను. స్వర్గమర్యములకు లంకె గణాచారి పోయినది. ఇక మిగిలినదొక పతివ్రత.
ఆమె చావదు. సనాతని. అధికపతితమగు భారత జాతినుద్ధరింపజేయ నామెయే
సమర్భురాలు. ఖడ్గతిక్కనభార్య, రుద్రమదేవి మున్నగు వారివలె ఆమె భారతీయులను
చైతన్యపూరితులను జేసి జాతిని పునరుద్ధరింప సమర్భురాలు.
అనుకరణము ఆత్మహత్య; పరధర్మము భయావహము. కావున దేశకాల
పాత్రముల కనుగుణముగా స్వధర్మమును సవరించుకొని జాత్యభ్యుదయమునకు
పాటుపడవలయునని సత్యనారాయణగారు మనకొక దివ్యసందేశ మొసగుచున్నారు.
మనకళలు, మన పరిశ్రమలు, మన సంస్కృతి, మన వ్యవసాయముల నుద్ధరింప
నడుముగట్టుకొని కార్యరంగమున దుముకుట కింత కన్నను మహదవకాశములేదు.
ఉక్తివైచిత్యము కవితాగుణములలో నొక్కటి. మహాకవులగు శ్రీవిశ్వనాథవారి
రచనలయందీగుణము సమృద్ధము. వారి వాక్యవిన్యాసమునం దొకవిధముగు
చక్కదనము, భావములయందొక నూత్నత్వము, సౌందర్యము, ఉక్తి వైచిత్రి,
జాన్నత్యము, గాంభీర్యము గాననగును.
వేయి పడగలు భావ(ప్రేరకమగు నవల, ఉత్తేజకరమగు రచన.
147
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
మునిమాణిక్యంవారి కాంతం
భారత రామాయణాలలోని పాత్రలను విడిచిపెట్టితే ఆంధ్ర సారస్వతంలో
సజీవమైన పాత్రలు చాలా తక్కువని ఒప్పుకోకతప్పదు. ప్రబంధాలలోని
నాయికానాయకులు భావనా ప్రపంచము లోనివారే, కాని వాస్తవిక ప్రపంచానికి
చెందినవారు కారు. ప్రజలలో ఈ పాత్రలకు పలుకుబడి మిక్కిలి తక్కువ. జీవకళ
గూడ తక్కువే, వరూధిని, సత్యభామ, కలభాషిణివంటి కొందరిలో మాత్రం
చైతన్యమూ, జీవకళా కనుపించుతవి. కాని వీరినైనా సామాన్య ప్రజానీకం అర్థం
చేసుకోవడం కష్టం. వరూధిని అప్సరో భామిని, సత్యభామ రాజకన్య. కలభాషిణి
వేశ్యాంగన. అందుచేత యీ ముగ్గురూ, సామాన్య ప్రజలలోనివారు కారనే చెప్పవలెను.
ప్రబంధాలలో చిత్రింపబడ్డ ప్రీ పాత్రలలో ఒక్క నిగమశర్మ అక్మమాత్రం మనం
ప్రతిదినం మన కుటుంబాలయందు చూస్తున్న స్రీల తరగతిలోనిది.
పూర్వసాహిత్యంలోనే కాకుండా, ఆధునిక సాహిత్యంలో కూడా జీవకళలో
విలసిల్లుతున్న పాత్రలు వ్రేళ్ళమీద లెక్కపెట్టదగినవే. గిరీశం ఆధునిక నాగరితా
సంపర్మం, ఆంగ్ల భాషాపరిచయం కలిగినవారిని మాత్రమే ఆకర్షించుతున్నాడు.
పట్టణాలలోనే గిరీశం కనబడుతాడు, గ్రామప్రాంతాలలోని జనసామాన్యంలో గిరీశం
కనపడడు. గిరీశం హాస్యం కొంతవరకు ఆంగ్లభాషా పదాలపైన ఆధారపడి వుంటుంది.
పల్లెపట్టులలోని గ్రామీణులకు ముఖ్యంగా మా తెలంగాణ ప్రాంతాలవారికి గిరీశం
హాస్యం అర్ధం కావడం కష్టం. బారిష్టర్ పార్వతీశం కూడా పూర్తిగా కాకపోయినా
కొంతవరకు ఇట్టివాడే. పార్వతీశం కథ లండను ప్రయాణంతో మొదలవుతుంది.
లండన్‌లో పార్వతీశం వ్యాటు సంఘటనలోని హాస్యం అర్థంచేసుకోడానికి ఒక విధమైన
వాతావరణం అవసరం. యెంకి జీవితమే (ప్రేమాభిరామమని ఒక్కమాట చెప్పితే
చాలు ఆమె వ్యక్తిత్వం నిరూపించడానికి, కాంతం వీరందరివంటిది కాదు. ఆమె
సామాన్య సంసారి; అచ్చంగా తెలుగింటి ఆడబిడ్డ. ఆంధ్రదేశంలో యే ప్రాంతంలోని
యే గ్రామానికి వెళ్ళినా మనకు కాంతం కనుపించి తీరుతుంది. ఆమె వేషభాషలు
సకలాంధ్రజనులకు అర్ధమౌతవి, ఆమె హాస్యం మిక్కిలి సున్నితమైంది.
కాంతం జగదేకసుందరి అని చెప్పడానికి వీలులేదు. ఎందుకంటె- ఆమె
పల్లవపాణిగాని, పద్మనయనగాని, రాకేందుబింబానన గాని కాదు. ఫేసుపవుడర్లు,
148
సారస్వత నవనీతము
లిప్‌స్టిక్కులు మున్నగు ఆధునిక సౌందర్య పోషణ పరికరాలను, విలాస సామగ్రిని
ఉపయోగించడంలో నేర్పు కలిగిన నవనాగరికురాలుకూడ కాదు కాంతం. భర్తమీద
కోపం వస్తే “కలస్వరం” తోగాని, “కలకంఠ వధూకల కాకలీధ్వను”లతో గాని,
“కాంభోజి మేళ విపంచికా” స్వరంతో గాని యేద్వగలిగిన సామర్థ్యం కాంతానికి
లేదు. కాంతం టెన్నిసు ఆడలేదు. కారు నడపడం చేతగాదు. తుదకు భర్త వెంట
సాయంకాలంపూట కొంచెంసేపు వాహ్యాళికైనా వెళ్ళలేదు. కాని యీ సామర్థ్యాలన్నీ
కలిగిన సతీమణులకంటె యెక్కువ సమ్మోహనశక్తి ఉన్నది ఆమెకు.
ట్రోచి కూడా సరిగ్గా పెట్టుకోడానికి చేతగాని పల్లెటూరు పడుచు కాంతం.
ఈనాటి క్రొత్తఫ్యాషన్‌లు కొన్ని ఆమె భర్త వద్దనే నేర్చుకున్నది.
కాంతం అంత పొడగరీకాదు, పొట్టీకాదు. చామనచాయ శరీరము,
నవ్వమొగము, చక్కని నేత్రాలుకలిగిన ఓ మోస్తరు అందగత్తె ఆమె. కొంత రూపురేఖలు,
అందచందాలు, హావభావాలు, చదువుసంధ్యలు, సిరిసంపదలు, అన్నీ సంసారపక్షమే
కాంతానికి. తెల్లచీరెలమీద (ప్రేమ, మల్లెపూలమీద మక్కువ.
తన బాధ్యతలు, కష్టసుఖాలు, బాగా గ్రహించగలిగిన సాధ్వికాంతం. కాపురానికి
వచ్చిన క్రొత్తలో తనను విడిచి, క్షణం ఉండజాలని భర్తను బుజ్జగించి, కాలేజికి
పంపి, పాఠాలు చదివించి, పరీక్షలు ప్యాసుజేయించిన బాధ్యతగలవ్యక్తి ఆమె. కాలేజికి
వెళ్ళి వచ్చిన తర్వాత, పెందలాడే భోజనం పెట్టి ఆమె భర్తను సక్రమంగా చదివించింది.
కాపురానికి వచ్చిన క్రొత్తదినాలనుంచే, ఆమె భర్తను అదుపు ఆజ్ఞలలో నుంచి కొంగున
ముడివేసుకొన్నది. తాను గీసిన గీటు దాటకుండా భర్తకు శిక్షణ యిచ్చిన
ఉపాధ్యాయురాలు కాంతమ్మ.
కాంతానికి ఇంగ్లీషు రాదు. కాని భర్తతో ఆమె - “మీరు ఇంగ్లీషులో
మాట్లాడుతుంటే నాకేదో అర్ధమైనట్లే వుంటుందండీ” అని అంటుంది. అంటే భర్తమోము
చూచి ఆమె ఆయన హృద్దతాభిప్రాయాలను తెలుసుకోగలదన్న మాట.
కాంతానికి భర్త ఇంగ్రీషు చెప్పించాలెనని అనుకున్నాడు. కాని యెంత ప్రయత్నం
చేసినా అది సాధ్యం కాలేదు. ఆమెకు నగలమీద వున్నంత ప్రేమ ఇంగ్లీషుమీద
లేదు. కనీసం ఆమెచేత వార్తాపత్రిక నైనా చదివించవలెననుకుంటే, అదీ నెరవేరలేదు.
కాంతం ఒక విధంగా చాలా అమాయకురాలనీ, ప్రపంచజ్ఞానం బొత్తిగా లేనిదని
చెప్పవచ్చును. “రేపు యుద్ధం ఆపి నవరసులు ఒక గంటసేపు చవుకగా అమ్ముతారని”
149
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
యెవరో చెప్పితే పాపం ఆమె నమ్ముతుంది. నమ్మడమే కాకుండా, ఆ సమయానికి
అక్కడికి వెళ్ళి చవుకధరకు నవరసులు తీసుకొని రానందుకు భర్తను కోపిస్తుంది.
ఒక రోజు పిల్లవాణ్ణి ఉపాధ్యాయుడు దెబ్బలుకొడితే, ఆమె భర్తతో “చూడండి, ఆ
మాస్టర్ చేతు లెట్లావచ్చినాయో! అనవసరంగా పిల్లవాణ్ణి కొట్టాడు. చైనా యెక్కడున్నదో
చెప్పమన్నాడట. వీడు చిన్నవాడాయె, ఎక్కడపెట్టాడో, మరచిపోయినాడు' అని
అంటుంది.
కాంతానికి నగలమీద వుండేకోరిక ఇంగ్లీషు చదువుమీద, వార్తా పత్రికలమీద
లేదని ఇంతకుముందే చెప్పినాను. లంకాయాగం, కుచేలకథ మొదలయినవి కాంతం
బాగా చదువుకున్నది. కుమారి శతకం, నృసింహశతకం గూడ చదువుకున్నది.
ప్రహ్లాదచరిత్ర మొదలయినవి అర్థం తెలిసి చదువగలిగేది.
శ్రీరాములు అయోధ్యలో వుండేవాడని ఆమెకు తెలుసు. కాని వైసురాయి
యెక్కడవుంటాడో ఆమెకు తెలియదు. శ్రీరాములు దండకారణ్యానికి యేమార్గాన
పోయినాడో ఆమెకు తెలుసు, కాని మనం మద్రాసుకు యెట్లాపోవలెనో ఆమెకు
తెలియదు. పంచాంగం చూచి తిథి వార నక్షత్రాలు చెప్పగలదు, రైల్వే గైడ్ చూచుట
ఆమె చేతగాదు.
అయితే కాంతం మంచి ఊహ తెలివితేటలు గలది. భర్త పిల్లవాడిచేత గుర్రాన్ని
గూర్చి కాంపోజిషన్ వ్రాయించితే “పిల్లవాడికి గుజ్జాలను గూర్చి, గాడిదలను గూర్చి
పాఠాలు చెప్పుతారండి!” అని ఆశ్చర్యపడుతుంది, భర్తను వేళాకోళం చేస్తుంది.
కాంతం మంచి పొదుపరి. భర్త జేబులో అవసరానికన్న యెక్కువ డబ్బు
ఉండనీయకుండా జాగ్రత్త పడుతుంది.
ప్రపంచములో సాధారణంగా స్రీలకు పుట్టింటిమీద మమకారం యెక్కువ.
కాంతం యిందుకు అపవాదం కాదు. తన భర్త పూర్వీకులు, తన పూర్వీకులంత
గొప్ప వాళ్లు కాదని ఆమె అభిప్రాయం. సామాన్యంగా అందరు ప్రీలవలె భర్త పరాయి
స్రీవంక కన్నెత్తి చూడడంకూడ, ఎంత మాత్రం ఇష్టపడదు. భర్త యెవరో స్త్రీని
ముద్దుపెట్టుకున్నట్టు కలవస్తే ఆమె యెంతో ఆదుర్దా పడుతుంది.
కాంతం మంచి మాటకారి. ఆమె మాటల్లో సున్నితమైన హాస్యం, లలితమైన
చాతుర్యం ప్రతిబింబిస్తుంది. కాపురానికి వచ్చిన క్రొత్తలోనే భర్తను స్వాధీనం చేసుకున్న
నెరజాణ ఆమె. ఒకనాడు వారిద్దరు ఆప్తుల యింటికి వెళ్ళిరి. కాంతానికి వదినవరుస
150
సారస్వత నవనీతము
గల ఆ యింటి యజమానురాలు యీ క్రొత్తదంపతులను, పేరు చెప్పనిదే గడపదాటి
లోనికి రావద్దని సరసమాడింది. ఆ సందర్భంలో పరిహాసానికి ఆమె భర్త తన
భార్యపేరు సుబ్బలక్ష్మి అని అబద్ధమాడెను. తరువాత గడుసరియైన కాంతం, కాఫీ
అతని చేతుల మీద ఒలకబోసి ఇకముందు ఇట్టిపని చేయవద్దని బుద్ధి చెప్పింది.
ఆనాటిరాత్రి భోజనాల వద్ద జరిగిన మరొక మధుర సంఘటన, కాంతం ప్రసంగ
కుశలతకు, మాటకు మాట బదులుచెప్పే నేర్చుకు, రసికత్వానికి మంచి నిదర్శనం.
కాంతం భర్త ఆమెకన్న తొందరగా భోజనం ముగించి యెవరూ చూడకుండా, పెరుగు
చేతిని కాంతం బుగ్గలకు రాసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇది కనిపెట్టి వదినెగారు-
“ఏమేపిల్ల! అదేమి ఆగడమే, పెరుగు బాగుంటే ఇంకా రెండుముద్దలు తినాలిగాని,
బుగ్గలకు పూసుకుంటారా!” అని హాస్యమాడితే, వెంటనే కాంతం - “మీ తమ్ముడు
సరిగ్గా తినకుండా లేచిపోయినారు, చూశావా వదినా- వారి కొరకే కాస్త బుగ్గలకు
పూసుకున్నాను” అని బదులు చెప్పి, సమయస్స్ఫూర్తిని ప్రకటించింది.
ఎంత కోపంలో వున్నా నవ్వించగల మాటపొందిక కాంతానికి పెట్టనిసొమ్ము-
దెబ్బతగలకుండా హాస్యం ఆడటంలో కాంతానికి పెట్టింది పేరు. ఒకరోజు భర్త-
“మీ చెల్లెలు ఒక కోతి, మీ అక్కయ్య మరోకోతి, తోకలు మాత్రం లేవు” అని
ఎగతాళి చేస్తే, ఆమె యేమాత్రం తడుముకోకుండా, “మీ చెల్లెళ్ళకు ఆ లోటూ
లేదు” అని జవాబు చెప్పుతుంది.
ఇంకొకసారి జరిగిన సంఘటనయేమనగా - దంపతులిద్దరి మధ్య ప్రణయ
కలహం వచ్చింది. మూడురోజులు మాట్లాడుకోలేదు వారు. అయితే యీ పరిస్థితి
ఇద్దరికీ దుర్భరంగానే వున్నది. ఈ సందర్భంలో ఒకరు మేడమీదికిపోతూ, మరొకరు
మేడ క్రిందికి వస్తూ వారిద్దరు యెదురు పడడం తటస్థించింది. మేడమెట్లు మిక్కిలి
యిరుకైనవి. ఒకమారు ఒక్కరే వెళ్ళగలరు. ఆ మెట్లమీద కొంతసేపు ఇద్దరూ అట్లే
నిలబడ్డారు. ఒకరు మరొకరు తప్పుకోవలెనని ఆశించుతూ ఎవ్వరూ తప్పుకోలేదు.
అప్పుడు కాంతం “కొద్దిగా దారియివ్వండని” అడుగుతుంది. ఆయన “నేను పూల్సుకు
దారియిప్వ” నంటాడు. వెంటనే ఆమె- “అయితే నేను మాత్రం యిస్తా” నని చెప్పుతూ
దారి యిస్తుంది. మరొకమారు భర్త “నేను వొట్టి తెలివి తక్కువ వాడిననా, నీ
అనుమానం” అంటాడు. “అహం, హం, హం, అనుమానమేమిలేదు, గట్టినమ్మకమే”
నంటుంది, మాటలమూటయైన కాంతం. ఇంకోసారి, ఇంటిలోని పాడిగొడ్డు
పోట్లమారిదై నందున అమ్మి వేస్తానంటాడు భర్త. అప్పుడు కాంతం- “పాడిగొడ్డును
151
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
అమ్ముకొంటారండి పోట్లదైనంతమాత్రాన. ఇంతకూ ఆమాటకొస్తే, నేను మిమ్ముల్ని
పెట్టుకొని కాపురం చెయ్యలేదండీ యిన్నాళ్ళు” అని అంటుంది. కాంతం మాటకారి
తనానికి, ప్రసంగ కుశలతకూ, హాస్యోక్తి చాతుర్యానికి ఇట్టి సంఘటనలెన్నైనా
చూపించవచ్చును.
కాంతం జీవితమే ఒక లలిత మధుర శృంగార కావ్యం. కార్యం గాకముందు
ఒకనాడు భర్త ఆమెను ఒంటరిగా కలుసుకొని కౌగలించుకుంటే, చెంపమీద
మృదువుగా కొట్టి, మందలించిన మధురమూర్తి కాంతం. ప్రతిదినము రాత్రి భర్త
కూర్చున్న కుర్చీకి సరిగ్గా వెనుక నున్న గూట్లో స్నోబాటిల్ వెదికే నెపంతో అతని
బుజాలమీద చెయ్యివేసి, అవసరం లేకపోయినా కొద్దిగానొక్కి తన వక్షస్థలం అతని
చెంపకు తాకించి, భర్తను రంజింపజేసే చతురశ్ళ్శంగారవతి కాంతమ్మ. తన బహుకాల
తపఃఫలమని యీమెను జూచి కాంతం విధేయుడైన భర్త మురిసిపోతాడు.
మొదటిరోజుల్లో, ఆమె తన తనుద్యుతి కుటిలాలకాలు, సుదీర్ణనీల శిరోజాలు,
ముఖవికాసం చేత భర్తను ఆకర్షించింది. యవ్వనపు పొంగు చల్లారి, పిల్లలతల్లియైన
తరువాత ఆమె తన స్వభావం, ప్రవర్తన, ప్రేమా, చమత్మార సంభాషణా మొదలయిన
గుణాలచే భర్తను వశీకృతుణ్ణి జేసుకున్నది. దాంపత్యంలో ఉండే విలువకు కాంతం
జీవితం ఒక మంచి నిదర్శనం.
అసంతృప్తి ఆమె జీవితంలో యెక్కడాలేదు. జీవితం అంతా త్యాగమే ఆమెకు.
భర్తకూ, పిల్లలకూ, 'సేవజేయడంలో తన సౌందర్యమూ, యవ్వనమూ, అన్నీ త్యాగం
చేసిన ధన్యజీవి ఆమె.
“వీకటిలో దేవులాడుతున్న నాబ్రతుకుకు ఆమె ధృవతార; హృదయక్షేతానికి
అమృతవాహిని; నా సహోదరి, భార్యా అన్నీ ఆమెయే” నని భర్త చేత మెప్పులు
పొందిన కాంతానికి జీవితంలో తృప్తి లేకపోవడమనే సమస్య యెన్నడూ కలుగలేదు.
గృహమే భూతలస్వర్గముగా ఆమె మార్చింది. ఆదర్శ గృహిణి యైన
మునిమాణిక్యం వారి కాంతం తెలుగు నాయికలలో మాణిక్యం వంటిది. మనపూర్వులు
చెప్పిన- “షట్టర్మయుక్తా కులధర్మపత్నీ” అన్న సూక్తి ఆమె యందు అక్షరాలా
వర్తించుతుంది.
కాంతం భర్త చెప్పినట్లు, ఎంతటి బుద్ధిహీనుడోకదా ఆ భగవంతుడు, తాను
నిర్మించిన సుందర భవనంలో వుండే అతిసుందర వస్తువునే కూల్చినాడు.
152
సారన్వత నవనీతము
సారస్వత వికాసము
వాజ్యయముపై జాతీయోద్యమ ప్రభావము
నిద్రాణమైయున్న జాతిని మేలుకొలుపుటకు సాహిత్యముకన్న మహత్తరమైన
సాధనము మరొక్కటి లేదు. ఒక దేశము యొక్క కష్ట సుఖములు, మంచి చెడ్డలు,
ఒడు దుడుకులు, ఆ వాజ్మయములో 'ప్రతిబింబించుచుండును. ఒక జాతి చరిత్రను
నిర్మించుటలో రచయితలకుగల ప్రభావము అమోఘమైనది. రూసో, వాల్టేరుల రచనలు
(్రైంచి విప్లవమునకు కారణభూతములైనవి.
టాల్‌స్థాయి, మాక్సింగోర్కీ డాస్టావొస్కి ప్రభృతులు రష్యన్ వాజ్మయముద్వారా
ఆ దేశీయులలో అద్భుతమైన ప్రబోధము కలుగజేసిరి. శ్రీకృష్ణదేవరాయల
నిర్యాణానంతరము శత్రురాజొకడు విజయనగరము మీద దండెత్తి వచ్చినప్పుడు
అల్లసాని పెద్దన చెప్పిన పద్యము విని సిగ్గిల్లి ఆ రాజు తన సైన్యముతో పలాయనము
చిత్తగించినాడట. ఖద్గతిక్కన రణరంగమున వెన్నిచ్చి, యింటికి మరలి వచ్చినప్పుడు,
ఆతని తల్లి, మరియు భార్యచెప్పిన చాటు పద్యములు ఆతనిలో పరాక్రమము
విజృంభింవజేసి, యుద్ధభూమికి పంపినవట. ఇవన్నియు రచయితలకు,
వాజ్మయమునకు, దేశచరిత్రలను దిద్ది తీర్చటలోగల ప్రభావమునకు స్టాలీపులాకముగా
పేర్కొనబడిన నిదర్శనాలు మాత్రమే.
టైటీష్ వరిపాలన (క్రింద అణగిపోయిన భారతీయులను, తమ
విధ్యుక్తధర్మములను పాలింపవలసినదని ప్రబోధించి, మేలుకొలిపినది వాబజ్మయమే
యని చెప్పిన అతిశయోక్తి కాజాలదు. ఒక యుద్యమము చక్కగా వ్యాప్తి జెందుటకు
వాజ్మయము మిక్కిలి శక్తివంతమైన సాధనమని భారత స్వాతంత్రోద్యమ చరిత్ర
నిరూపించుచున్నది. ప్రబుద్ధభారతమునకు తొలి వైతాళికులు రచయితలేనని
చెప్పవచ్చును.
మన దేశీయులను మేలుకొలిపిన ప్రప్రథములలో స్వామీ దయానంద సరస్వతి
ముఖ్యుడు. ఆయన వ్రాసిన సత్యార్థ ప్రకాశిక బహుభాషలలో పరివర్తింపబడి
అసంఖ్యాకులగు ప్రజల హృదయాలలో జాతీయ ఆత్మగౌరవ బీజములను చల్లి,
వారిచేత దేశము యొక్క గొప్పదనమును గుర్తింపజేసినది. తమకొక ప్రత్యేక సంస్కృతి,
భాస్వంతమైన చరిత్ర కలదనియు, అందు కనుగుణముగా తమ భవిష్యత్తును
నిర్మించుకోవలెననియు సత్యార్థ ప్రకాశిక ప్రబోధించినది. రాజా రామమోహనరాయ్‌చే
153
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
ప్రబోధితమైన వంగదేశమున, ఈశ్వరచంద్ర విద్యాసాగర ప్రభృతులు దేశీయులలో
తమ రచనల ద్వారా చైతన్యమును కలుగజేసిరి.
తరువాత స్వామీ వివేకానందుని రచనలు, ఉపన్యాసములు ఆసేతు హిమాచల
పర్యంత ప్రదేశమున ఉద్బోధము చైతన్యము కలుగజేసినవి. ముఖ్యముగా విదేశాలలో
వివేకానందుని వలన భారతదేశ వ్యక్తిత్వము ప్రపంచమునకు బోధపడినది. పాశ్చాత్య
దేశాలలో భారతీయులు అనాగరికులు, అడవి మనుష్యులను అపోహలను
వివేకానందుడు తొలగించెను. వంగదేశములో క్రమక్రమముగా వ్యాపించుచున్న
క్రీస్తుమత ప్రచారమును అరికట్టుటకు మరొకవంక నుండి బ్రహ్మసమాజము
ఉద్భవించినది. శ్రీ రఘుపతి వేంకటరత్నమునాయుడు, వీరేశలింగము పంతులుగార్ల
ద్వారా ఆంధ్రదేశము మీద (బ్రహ్మసమాజ ప్రభావము ఎక్కువగా పడినదని
చెప్పవచ్చును. కేశవచంద్రసేనుని రచనలు వంగదేశముసందలి యువకులను ఊపి
ఉత్సాహతరంగితులను జేసినవి. ఈవిధముగా దేశములో సంచలనము కలుగజేసి,
ప్రజలలో చైతన్యము వ్యాపింపజేయుటకై ఉద్యమములు క్రమక్రమముగా తల
యెత్తినవి. ఈ యుద్యమాల ప్రచారము భారతదేశము నందలి వివిధ భాషలలో
విరివిగా జరిగినది.
భారత రాజకీయాలలో డాక్టరు అనీబిసెంటు ప్రవేశము ఒక చారిత్రాత్మక
ఘట్టము. ఆమె మన జాతీయోద్యమమునకు తొలిసారి విప్లవ దృక్పథము నిచ్చిన
వీరనారీమణి, త్యాగశీల, హోం రూలు ఉద్యమముద్వారా, శాసనోల్లంఘనముజేసి
చెరసాల కరిగి, ప్రజలలో జెయిలు భయమును తొలగించిన గౌరవము డాక్టర్
అనీబిసెంటుకు చెందుచున్నది. భారతీయ సంస్కృతి, నాగరికతా విజ్ఞానములమీద
ఆమెకు అత్యంత గౌరవము. భగవద్గీతను ఇంగ్రీషులోనికి అనువదించి, యువకులలో
గీతాప్రచారము గావించి, భారతీయులలో దేశాఖిమానము ప్రచారము జేయుటకు
ఆమె జేసిన సేవ అత్యంత ప్రశంసనీయమైనది. దివ్యజ్ఞానసమాజ ఉద్యమము ద్వారా,
దివ్యజ్ఞాన సమాజసంఘములు స్థాపించి ఉపన్యాసములతో భారతదేశమును ప్రబుద్ధము
గావించినది డాక్టర్ అనీబిసెంటు. విద్యాధికులు, విద్యార్థులు, యువకులు డాక్టర్
అనీబిసెంటుకు అనుచరులుగా చేరిరి. ఆమె ప్రారంభించిన హోంరూల్ ఉద్యమమునకు
శ్రీ సి.పి.రామస్వామి అయ్యర్, పండిత్ జవాహర్‌లాల్ నెహ్రూగార్లు కొంతకాలము
సంయుక్త కార్యదర్శులుగా పనిజేసిరని ఇక్కడ ప్రస్తావించుట పేర్కొనదగిన విశేషము.
154
సారస్వత నవనీతము
మరొక ప్రక్కనుండి మహారాష్ట్రములో వీరసావర్శర్ విప్లవ ధ్వజమును ఎగురవేసి,
సోదరదేశీయులలో తన పుస్తకముల ద్వారా ప్రబోధము సాగించెను. మహారాష్ట్ర
సామ్రజ్యస్థాపన, ఉన్నతి, పతనములనుగూర్చి వివరించుచు, సావర్మర్ వ్రాసిన
హిందూపద్ పాదుషాహి గ్రంథము మహారాష్టులలో స్వతంత్ర భావములను
కలుగజేసెను.
1857 సంవత్సరములో మనదేశమున బ్రిటీషు పరిపాలన మీద ప్రకటింపబడిన
స్వాతంత్ర్య యుద్ధమును, బ్రిటీష్ ప్రభుత్వము కొందరు విద్రోహుల సహాయముతో
అణచివేసి, దానిని ఒక తిరుగుబాటుగ మాత్రమే చిత్రించినది. వీరసావర్మర్ యీ
1857 విప్లవమునుగూర్చి “భారత స్వాతంత్ర్య సమరమను ఒక ఉద్ధంథమును
రచించెను.” మహోజ్బలమగు యీ గ్రంథమును బ్రిటీష్ ప్రభుత్వము నిషేధించి
నను రహస్యముగా ఎందరో యువకులు దానిని పఠించి, సోదర దేశీయులలో
స్వాతంత్రోద్యమ ప్రచారము చేసిరి. ఈ [గ్రంథమును పఠించినారను నేరముమీద
ఎందరో యువకులు అరెస్టు అయినారు. “భారత స్వాతంత్యసమరము” దేశీయుల
రక్తమును ఉడుకెత్తించి, స్వాతంత్ర్య కాంక్షలు చెలరేగజేసినది. లోకమాన్య
బాలగంగాధర తిలక్, మరాఠా, కేసరి పత్రికలలో సంపాదకీయాల ద్వారా దేశములో
ప్రబోధము సాగించెను. స్వాతంత్ర్య భావప్రపూర్ణములగు ఆ సంపాదకీయాలకు భీతిల్లి,
ఆయనను బ్రిటీషు ప్రభుత్వము నిర్బంధించినది. జెయిలును శ్రీకృష్ణజన్మస్థానమని
భావించి, తిలక్ మహాశయుడు తన నిర్బంధకాలమున గీతాభాష్యమును
కర్మయోగమను పేరుతో రచించెను. తిలక్ కర్మయోగమునకు భారతదేశములో
విశాలవ్యాప్తి కలిగినది. కర్మయోగము ద్వారా భారతీయులు తమ విధ్యుక్తధర్శమును
గుర్తించి, పరదేశ ప్రభుత్వ దాస్య బంధములను త్రెంచివేయ వలెననియు, శ్రీకృష్ణుని
బోధలలోని రహస్య మిదియేననియు బాలగంగాధరుడు బోధించెను. తిలక్
కర్మయోగము భారతదేశములోని అన్ని భాషలయందు అనువదింపబడినది.
స్వాతంత్ర్యము నా జన్మ హక్కని బాలగంగాధరుడు గర్జించెను. గోఖలే, దాదాభాయి
నౌరోజి, రమేశచంద్రదత్తుల ఆంగ్ల రచనలద్వారా విద్యాధిక ప్రపంచమునకు, బ్రిటీష్
పరిపాలనవలన నష్టములను సకారణముగా నిరూపించి, స్వపరిపాలన ఆవశ్యకతను
బుజువు చేసిరి. కాని వారి రచనలు ఆంగ్ల విద్యాధికులకు మాత్రమే ఉపకరించినవి.
ఇవి ఇతర భాషల లోనికి అనునదింప బడలేదు.
155
దా॥ దేవులపల్లి రామానుజరావు (గ్రంథావళి
మహారాష్ట్ర దేశమున లోకమాన్య బాలగంగాధరతిలక్‌తోపాటు తన కలమును
జాతీయోద్యమ ప్రచారమునకు వినియోగించిన విద్వాంసుడు శ్రీ చింతామణి కేల్కర్.
తిలక్ తరువాత కేసరి పత్రికకు సంపాదకుడుగా పనిచేసి ఆయన మహారాష్ట్ర దేశములో
జాగృతిని కలిగించెను.
మహారాష్ట్రభాషలో జాతీయోద్యమ వ్యాప్తికి తోడ్పడిన రచయితలలో శ్రీ సానే
గురూజీ ప్రముఖులు - ఈయన తన రచనలలో ప్రాచీన సంస్కృతిని, పురాణములను,
భారతీయ సాంఘిక పద్ధతులను సామ్యవాద సూత్రములతో సమన్వయించినాడు.
మామావరేర్మర్ తన లేఖిని ద్వారా, మన విద్యాధికులు క్రైస్తవ మిషనరీల వలె
దేశాభ్యదయమునకై జీవితాలను అంకితము చేయవలెనని, ధర్మాదాయములను
జాతీయము చేయవలెననియు ప్రబోధించెను. ఈయన రచనలలో హాస్యము,
చమత్మారము ఉట్టిపడుచుండును.
మహారాష్ట్ర దేశములో ఖాండేకర్, హిందీలో (ప్రేమ్‌చందువలె, తెలుగులో శ్రీ
చింతా దీక్షితులుగారు, చిన్నకథల ద్వారా జాతీయోద్యమ ఘట్టములను చక్కగా
చిత్రించిరి. నారాయణ సీతారాం ఫడ్కే సుప్రసిద్ధ నవలా రచయిత- సమకాలిక
సమస్యలు, యీయన నవలలకు యితివృత్తములు. తిలక్ కాలమునందలి
రాజకీయాలను ప్రవాసియను నవలయందు, 1942 విప్లవమును జంరూ మారుతము
అను నవలయందు ఫడ్మేగారు చక్కగా వివరించిరి. చీకటిబజారును, ప్రజాహిత
జీవనములోని అవినీతిని నిర్జాక్షిజ్యముగా యీయన తన రచనలలో ప్రకటించి,
సంఘమునకు దారి జూపినాడు.
ఇటీవల యీయన కాళ్మీరు సమస్యను గూర్చి కూడ ఒక చక్కని నవలను
వ్రాసినాడు.
మహారాష్ట్ర దేశములో గాంధీ రాజకీయాలను, గాంధీ వాజ్మయమును వ్యాప్తిలోనికి
దెచ్చిన పండితులు, రచయితలు ఆచార్య వినోబాభావే, కాకా కలేల్మరుగార్లు.
ఆచార్య ఆత్రే సంఘములోని చాదస్తములనన్నింటిని తూర్పారబట్టిన
విమర్శకుడు. హాస్యమునకు ఆటపట్టులగు యీయన రచనలు మహారాష్ట్ర దేశమున
మంచి ప్రబోధము కలిగించినవి. మహారాష్ట్ర జాతీయ కవులలో గోవింద అగ్రజ్,
తాంబేగారు ప్రముఖులు.
156
సారస్వత నవనీతము
హిందీభాషలో జాతీయోద్యమ ఘట్టములకు వాజ్మయములో స్థానమొసంగిన
కథకులు మున్నీ (ప్రేమచంద్, సుదర్శన్‌గార్లు. మున్నీప్రేమచంద్ కథలు అన్ని
భాషలలోనికి ముఖ్యముగా తెలుగుభాష లోనికి చాలవరకు పరివర్తింపబడినవి.
బెంగాలు కాటకమునుగూర్చి, శ్రీ సుదర్శన్ వ్రాసిన అన్నదాతయను గ్రంథము
సుప్రసిద్ధమైనది. హిందీ జాతీయ కవులలో శ్రీ మైథిలీశరణగుప్త, మహాదేవీవర్మగార్లు
ముఖ్యులు. క్షితీంద్ర మోహనసేన్, దేవేంద్ర సత్యార్థి గార్లు హిందీ భాషలో జాతీయ
వాజ్మయమును బహుళముగా సృష్టించిరి. భారత రాజ్యాంగ పరిషత్తు సభ్యులు శ్రీ
బాలకృష్ణ శర్మగారు హిందీభాషలో మంచి రచయితలు. ఆధునిక హిందీ రచయితలలో
రాహుల్ సాంకృత్యాయన్ ప్రముఖులు. ఈయన రచనలయందు విప్లవ దృక్పథము
ప్రముఖముగా నుండును. “ఓల్లానుండి గంగాతీరమువరకు” అను రాహుల్
సాంకృత్యాయన్ సుప్రసిద్ధమైనది.
కర్ణాటక సాహిత్యములో గూడ ఇట్టి పరిణామము మనకు కనుపించుచున్నది.
ఆలూరి వెంకటరావుగారు గాంధీ రాజకీయాలకన్న ముందే కర్ణాటక దేశములో
దేశభక్తిని ప్రబోధించు రచనలు గావించిరి. కర్ణాటక భాషలో శ్రీకృష్ణశర్మగారు జాతీయ
సమస్యలను ప్రజలకు విప్పి చెప్పు రచనలను విరివిగా చేసినారు. అంబికాతనయదత్తు,
మన శ్రీశ్రీవలె, కర్ణాటక భాషలో విప్లవ ధ్వజమునెత్తిన రచయితలు. భారత రాజ్యాంగ
పరిషత్సభ్యులు మరియు కేంద్ర ప్రభుత్వ ఉపమంత్రి శ్రీ దివాకర్‌గారు కర్ణాటక
భాషలో గాంధీ రాజకీయాలకు గాంధీ వాజ్మయమునకు చక్కని సమీక్షలను వ్రాసిరి.
వీరిని మనము శ్రీ ముట్నూరి కృష్ణారావుగారితో పోల్చవచ్చును. ఆచార్య గోకాక్
జాతీయ వాజ్మయ సమీక్షకులలో ఎన్నతగినవారు. రాజరత్నం, పుట్టప్ప గార్లు
ఉత్తేజకరమైన జాతీయ గేయములను రచించిరి.
స్వాతంత్ర్య్యజ్యోతిని మారుమూల పల్లెలలోనికి దీసికొనివెళ్ళి, ఇంటింట వెలిగించి
చీకటిలోనున్న ప్రజా సామాన్యమునకు వెలుతురు జూపించి, భారతీయ
జాతీయోద్యమమును నిజమైన ప్రజల ఉద్యమముగా జేసిన సంపూర్ణ గౌరవము
గాంధీ మహాత్మునికే చెందుచున్నది. గుజరాతీలో - నవజీవన్; ఇంగ్రీషులో - యంగ్
ఇండియా; మున్నగు పత్రికల ద్వారా గాంధీమహాత్ముడు ప్రజలలో జాతీయ భావాలను
ప్రజ్వరిల్లజేసెను. ఇంగ్లీషు భాషయందును, గుజరాతీ యందును, గాంధీ మహాత్ముని
కలము అత్యంత శక్తివంతమైనది. పూవు వలె మృదువే గాక, వ(జ్రమువలె
157
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
కఠోరమైనదిగూడ ఆయన రచన. గాంధీమహాత్ముని వ్యాసములు ఆసేతు
హిమాచలపర్యంతము ప్రజలను పులకాంకిత గాత్రులను జేసి, స్వాతంత్ర సమరములో
వారు నడుము కట్టి ముందుకు దూకుటకు ఉపయోగపడినవి. క్విట్ ఇండియా
సందర్భమునందును, అంతకుముందును, ఆయన నిర్వహించిన వివిధ ఉద్యమాల
సందర్భమునందును ఆయన వ్రాసిన వ్యాసములకు ప్రపంచ వాజ్మయమున
నత్యున్నతస్థానము కలదు. రస్మిన్, టాల్‌స్థాయిల రచనల ప్రభావము గాంధీమహాత్ముని
జీవితముమీద యెక్కువగా పడినదని చెప్పవచ్చును. మహాత్మునివలెనే జవాహర్లాల్
కూడ రచనల ద్వారా భారతదేశమును ప్రబోధించెను.
ఈ సందర్భములో భారత స్వాతంత్ర్య ఉద్యమమునకు తోడ్పడిన విదేశీయుల
రచనలను గూర్చి కూడ ప్రస్తావించుట అవసరము.
సండర్‌లాండు వ్రాసిన ఇండియా ఇక బాండేజి (దాస్యబంధాలలో జిక్కుకొనిన
భారతదేశము), రామ్సే మాక్టోనాల్డు రచనలు మున్నగునవి భారత జాతీయోద్యమ
ప్రచారమునకు బాగుగా తోడ్చడినవి. మనదేశములో అమృతబజారు పత్రిక; ప్రకాశం
పంతులు గారి స్వరాజ్య; బొంబాయి క్రానికల్; చింతామణిగారి లీడర్; ట్రిబ్యూక
మున్నగు పత్రికలు నిర్భయ విమర్శల ద్వారా దేశములో చైతన్యము, ప్రబోధము
కలుగజేసినవి.
భారత జాతీయోద్యమమును గూర్చి వ్రాసిన విదేశీయులలో ట్రెయిల్స్‌ఫర్డు గారికి
ఉన్నతస్థానము గలదు. భారతజాతీయ కాంగ్రెస్ ఆశయాలను ధైర్యముతో తమ
రచనల ద్వారా సమర్ధించిన వారిలో బ్రెయిల్స్‌ఫర్జుగారు ముఖ్యులు.
1942 సంవత్సరమున గాంధీ, నెహ్రూ, పటేలు మున్నగు నాయకులు
చెరసాలలో బంధింపబడిన తరువాత, భారత జాతీయోద్యమమును, దౌర్దన్యపద్ధతుల
ద్వారా అణచివేయుటకు బ్రిటీషు ప్రభుత్వము ప్రయత్నించిన సందర్భమున, సుప్రసిద్ధ
పత్రికా రచయిత లూయీఫిషర్ భారత జాతీయ కాంగ్రెసును గూర్చియు, మన
జాతీయోద్యమమును గూర్చియు వ్రాసిన వ్యాసములు, ప్రపంచమును దిగ్రాంత
మొనరించి, భారతీయుల హక్కులు న్యాయమైనవని ప్రపంచమునకు బుజువు చేసినవి.
భారత జాతీయోద్యమ చరిత్రలో లూయీఫిషర్ రచనలు చిరస్మరణీయములు.
వందేమాతరం గేయము భారతీయులను ప్రబోధించుటలో చేసిన సేవనుగూర్చి
యెంత ప్రశంసించిన తక్కువయే. బంకించంద్రుని జీవితకాలమున ఆయన నవలలు,
158
సారస్వత నవనీతము
వంగదేశమును ప్రబోధించినవి. కాని, తరువాత క్రమక్రమముగా జాతీయోద్యమ
విస్తరణతో రాజకీయాలలో, గాంధీమహాత్ముని అవతరణతో, జాతీయోద్యమము దాల్చిన
విప్లవ పరిణామముతో వందేమాతరం గీతము సకల భారతీయుల హృదయాలను
ఉత్సాహతరంగితము జేసి, వారి నెత్తురును ఉడుకెత్తించి, ఉత్తేజితులను గావించినది.
ఈ గీతముకొరకు ప్రాణములనైన ఒడ్డుటకు యువకులు నంసిద్భులైరి.
వందేమాతరమనగా జాతీయోద్యమమునకు, భారత స్వాతంత్ర్య జ్యోతికి
పర్యాయపదమైనది. భారతదేశములో వందేమాతరంవలె ప్రజల హృదయాలమీద
ఆధిపత్యము వహించిన గేయము మరొక్కటి లేదనిన సత్యమునకు తలవంపులు
వాటిల్లవు. రవీంద్రుడు శక్తివంతమైన ఒక మహాసంస్థగా అవతరించి భారతీయులలో
ప్రబోధము గావించెను. నేడు రవీంద్రుని 'జనగణమన' భారతజాతీయ గేయముగా
అంగీకరింపబడినది. వంగ భాషలో శరత్ చంద్ర ప్రభృతులు, తమ రచనలద్వారా
సోదర దేశీయులను ప్రబోధించిరి. మహర్షి అరవిందునికి రవీంద్రునితో సమానమైన
స్థానము వంగదేశమున కలదు. గాంధీమహాత్ముడు, రాజకీయరంగమున ప్రాధాన్యత
వహించకముందే, ఆయన గీతాఉపన్యానములు వంగదేశమును ఉత్తేజిత
మొనరించినవి. ఆ దినాలలోని వంగదేశమునందలి విప్లవోద్యమ నాయకులందరును
అరవిందుని గీతా ఉపన్యాసములను విని, ప్రబోధితులై, భారతమాత సేవకు
జీవితములను అంకితము జేయుటకు నిశ్చయించి ముందుకు వచ్చిన వారే యని
చెప్పవచ్చును. ఇంగ్లీషులో శ్రీ కె.యస్.వెంకటరమణి మున్నగువారు రచించిన
గ్రంథములు విద్యాధికులను, విద్యార్థులను ప్రబోధితులను జేసినవి. వెంకటరమణిగారి
(గ్రంథములు తెలుగులో కూడా పరివర్తించబడినవి.
తెలుగుదేశమున వాజ్మయము ద్వారా ప్రజలను మేలుకొల్పిన వైతాళికుడు శ్రీ
వీరేశలింగం పంతులు. వీరేశలింగం పంతులుగారు తమ రచనల ద్వారా
సంఘములోని కుళ్లును బయటపెట్టి, సంస్మరణోద్యమమును మాటలతో ప్రచారముజేసి
సంతృప్తి జెందక, ఆచరణ లోనికి దెచ్చిరి. వీరేశలింగముగారిది సంస్కరణ దృక్పథము.
రాజకీయముగా వీరేశలింగముగారు ప్రజాప్రబోధము జేయకపోయినప్పటికి వారి
సంఘ సంస్మరణోద్యమము ఆంధ్రుల కన్నులు తెరిపించి, జాతీయోద్యమ వ్యాప్తికి
ఆంధ్రదేశములో మంచి అవకాశము కలుగజేసినది. ఆంధ్రపత్రికను స్థాపించిన
స్వర్గీయ దేశోద్ధారక విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు ఆంధ్రదేశమున
159
దా దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
రాజకీయ చైతన్యమును కలుగజేయుటకు అద్వితీయమైన కృషిచేసిరి. ఆంధ్రుల ఏకైక
దినపత్రికగా ఆంధ్రపత్రిక స్వాతంత్రోద్యమ బీజాలను ప్రజా హృదయ క్షేత్రాలలో
చల్లి, చిరస్మరణీయమగు సేవగావించినది. ఆంధ్రదేశములో రాజకీయ ప్రబోధము
కావించిన పత్రికలలో కృష్ణాపత్రికది అగ్రతాంబూలము. ఒకమారు శ్రీ ముట్టూరి
కృష్ణారావుగారు తమ పత్రికలో యెక్కువగా వార్తల ప్రకటన జరుగుట లేదను
ఆరోపణకు ప్రత్యుత్తర మిచ్చుచు, కృష్ణాపత్రిక వార్తాపత్రిక కాదనియు (16౪5
Paper), అది అభిప్రాయాల పత్రిక యనియు (Reviews Paper) తెలిపిరి.
భారతజాతీయ కాంగ్రెసు ఆదర్శాలను గూర్చి కాంగ్రెసు అధ్యక్షోపన్యాసాలను గూర్చి
జాతీయ భావ ప్రబోధకములగు కృష్ణా పత్రిక సంపాదకీయములు ఆంధ్రదేశములో
అపూర్వమగు సంచలనము కలుగజేసినవి. మారుమూలలనున్న ప్రజలు కృష్ణాపత్రిక
సంపాదకీయములను చదివి రాజకీయముగా చైతన్యవంతులైరి. నాయకులను,
విద్యాధికులను, ప్రజాసామాన్యమును అందరినీ ఒక్కుమ్మడిగా ఊవి,
ఉత్సాహతరంగితులను జేసినవి కృష్ణాపత్రిక సంపాదకీయాలు. రాధాకృష్ణుని వంటి
వేదాంతవేత్తలేకాక పల్లెటూరి ప్రజానీకమును గూడ కృష్ణా సంపాదకీయాలు
ఉత్తేజితులను గావించినవి. నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఆ పత్రికా
సంపాదకీయాలను చదివి ప్రబోధితులగు చుండెడివారు.
ఆంధ్ర, కృష్ణా పత్రికల ననుసరించి యితర పత్రికలు గూడా బయలుదేరి
ఆంధ్రదేశ రాజకీయ వాతావరణమును సజీపముగా జేసినవి. యువకులు
భావగేయముల ద్వారా, ప్రజానీకమును మాతృ దేశసేవకై, ముందుకు వచ్చునట్లు
జేసినారు. గురజాడ, రాయప్రోలు కవీంద్రులు ఇట్టి యువకులకు మార్గదర్శకులైరి.
దువ్వూరి, విశ్వనాథ, జాషువ, తుమ్మల కవీశ్వరుల రచనలు ఆంధ్రదేశములో దేశభక్తి,
త్యాగదీక్షను ప్రబోధించినవి. శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణగారు కృష్ణా పత్రికలలో
తమ గేయములద్వారా సత్యాగ్రహోద్యమ (ప్రబోధమును జేసిరి. “మా కొద్దీ
తెల్లదొరతనము”, “అంటరాని వారెవరో కాదు, మా వెంటరానివారె”, “దండాలు
దండాలు భరతమాత” అను గేయాలు అపారమైన చైతన్యము కలుగజేసినవి.
ఆధునికాంధ్ర కవిశేఖరుల రచనలలోని చావలేదు చావలేదు, ఆంధ్రుల మహోజ్వల
చరిత్ర, దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్”, “వీర గంధము
తెచ్చినారము, వీరులెవ్వరో చెప్పుడీ, “కొల్లాయి గట్టితేనేమి మా గాంధి కోమటై
160
సారస్వత నవనీతము
పుట్టితేనేమి అను గేయభాగాలు ఆంధ్ర ప్రజల నాలుకలమీద నాట్యముజేసినవి.
భరతఖండపు చక్కని పాడియావు వంటి పద్యములు ప్రజాసామాన్యములో బ్రిటీష్
పరిపాలనా స్వరూపమును బాగుగా చిత్రించినవి. రాయప్రోలు, గురజాడ, విశ్వనాథ,
జాషువా, తుమ్మల, దువ్వూరి మున్నగు ఆధునిక కవిశేఖరుల రచనలు బహిరంగ
సభలలో వేదికలమీద, శ్రావ్యముగా పఠింపబడి ప్రజలను చైతన్యవంతులుగా జేసినవి.
సభలలో దేశభక్తి ప్రబోధములగు గేయాలు, పద్యాలు అద్భుతమైన జాగృతిని
కలుగజేసినవి.
ఈ జాతీయోద్యమ వాజ్మయ ్రభావఫలితముగా తెలుగులో వీరకావ్యములు
గూడ బయలుదేరి, పరదేశపాలనా బంధములను త్రెంచుకొనుటకై ప్రబోధము జేసినవి.
ఆధునిక కవులలో శ్రీశివశంకరశాస్త్రి, శ్రీ అడివి బాపిరాజు, శ్రీ కొడాలి ఆంజనేయులు
మున్నగు వారు త్యాగ సమయములందు ముందుకువచ్చి చెరసాలల నలంకరించిరి.
శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారి 'మాలపల్లి' అను నవల ప్రజలలో చాలా ప్రచారము
కలుగజేసినది.
161
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
తెలంగాణము - ఆంధ్ర సారస్వత వికాసము
ఒక జాతియొక్క సర్వతోముఖ వికాసానికి, ఆ జాతి సాహిత్యానికి సన్నిహిత
సంబంధముకలదు. ఈ సంబంధము పరస్పర ్రభావముతో గూడుకొన్నదని ఏ
జాతిచరిత్రను, ఏ వాజ్మయచరిత్రను పరిశీలించినప్పటికిని స్పష్టముకాగలదు. ఒకజాతి
సంస్కృతికి, నాగరికతకు ఆ జాతి సాహిత్యమే కొలతబద్దవంటిది. సారస్వతములేని
జాతి మృతప్రాయము. ఒక దేశ చరిత్రను పరిశీలించినప్పుడు, ఆ దేశము నందు
పుట్టి పెరిగిన అభ్యుదయకరమైన ఉద్యమాలకు జీవనాధారము సారస్వతమనియే
బోధపడ గలదు. దేశ కాలపరిస్థితుల నుండి సాహిత్యము తప్పించుకొన జాలదు.
అదేవిధముగా ప్రతిభావంతమైన సాహిత్యము యొక్క ప్రభావమును ఏ జాతి కూడ
తప్పించుకొనజాలదు. దాస్యశృంఖలాబగ్ధమై, పరాయిపాలనలో నలిగిపోవుచున్న
భారతదేశమే, బంకించంద్ర చటర్జీ, ఈశ్వరచంద్ర విద్యాసాగరులు, రవీంద్ర కవీంద్రుల
వంటి సాహితీ వేత్తలను గన్నది. వారి రచనలను విన్న భారతజాతి ఒక్కుమ్మడి
సంకెళ్ళను త్రెంపుకొని స్వాతంత్రోద్యమమునందు దూకినది. వారు వంగ
రాష్ట్రమునకేకాక ఇతర రాష్ట్రములకు కూడ ఆదర్శప్రాయులైరి. వీరి రచనల ద్వారా
భారతదేశ రాజకీయాలందు ప్రముఖ పాత్రను వహించిన స్వాతంత్ర్య వీరులు, వన్నె
కెక్కిన నాయకులు బంగాళా దేశమున (ప్రభవించిరి. బంకించం(ద్రుని
వందేమాతరగీతము యావద్భారత హృదయములో ప్రతిధ్వనించి పులకెత్తింప జేసినది.
సమకాలికముగా ఇతర ప్రాంతాల యందు అక్కడి రచయితల ద్వారా ఇట్టి చైతన్యమే
కలిగినది.
మన తెలుగు నేలగూడ ఈ పరివర్తననుండి తప్పించుకొనలేదు. వీరేశలింగం
పంతులు, చిలుకూరు వీరభద్రరావు, కొమట్టాజు లక్ష్మణరావు పంతులు, చిలకమర్తి
లక్ష్మీనరసింహము ప్రభృతుల సారస్వత సేవ ఆంధ్ర దేశములో నవోదయానికి నాందీ
ప్రస్తావనయైనది.
పూర్వ రంగము
ఆంధ్రజాతి మిక్కిలి ప్రాబీనమైనదని చరిత్ర ఉద్దోషించుచున్నది. రెండువేల
సంవత్సరాల క్రిందట ఆంధ్రదేశాన్ని పాలించిన మొట్టమొదటి స్వతంత్ర రాజవంశము
శాతవాహనులది. ఆనాడు ఆంధ్రదేశపు సరిహద్దులు తూర్పున బంగాళాఖాతము
162
సారస్వత నవనీతము
వరకును, పడమర అరేబియా సముద్రము వరకును, ఉత్తరమున మధ్య హిందూ
దేశమునకు, దక్షిణాన మైసూరుదాకను వ్యాపించినట్టు చరిత్ర వల్ల విశదము కాగలదు.
శాతవాహనులు పరిపాలించిన రాజ్యము సమగ్రమమనియే చెప్పవచ్చును. అనగా
శాతవాహనుల ఆంధ్రదేశములో మద్రాసు రాష్ట్రములోని తెలుగు జిల్లాలతోపాటు
హైద్రాబాదు రాష్ట్రములోని తెలుగు జిల్లాలు కూడ చేరియుండెను. ఆనాడు ఆంధ్రులు
కనిపెంచుకొన్న మహోజ్వలమైన సంస్కృతి తూరుపు దీవులలో కూడ నడయాడినట్టు
తెలియుచున్నది. తరువాత ఆంధ్రదేశ చరిత్రలో ఒడుదొడుకులెన్నియో కలిగినవి.
చిన్న చిన్న రాజ్యము లేర్చడుటతో తెలుగు నేల చీలి, చిందర వందరయై పోయినది.
అయితే- దేశ సమైక్యతకు నిజానికి భంగము వాటిల్లినది బ్రిటీషు పరిపాలనలోనేయని
చెప్పవచ్చును.
ఈస్టు ఇండియా కంపెనీవారు మన దేశములో ప్రవేశించి, క్రమక్రమముగా
విస్తరించి అప్పుడు ఆంధ్ర దేశానికి పరిపాలకుడుగా నున్న హైద్రాబాదు నిజామును
తమకు అధీనునిగా జేసుకొనిన తరువాత, ప్రస్తుతము ఆంధ్ర దేశములోని సర్మారు
జిల్లాలు కంపెనీ పరిపాలన క్రిందికి 1760లో తేబడినవి. అనగా హైద్రాబాదులోని
ప్రస్తుత తెలుగు జిల్లాలు నిజాం పరిపాలన క్రింద ఉండిపోయినవి. సర్కారు జిల్లాలు
బ్రిటీషు పరిపాలన క్రిందికి వచ్చెను. ఇది జరిగి సుమారు రెండువందల
సంవత్సరములు కావచ్చినవి.
చరిత్రలో ఈ రెండువందల సంవత్సరాలు యేమంత గొప్ప కాలము కాదు.
అయినప్పటికి 1766 సంవత్సరములో జరిగిన కృత్రిమ భౌగోళిక విభజన ఫలితంగా
ఆంధ్రుల సమైక్యతకు భంగము కలిగినదని చెప్పవచ్చును. ఆనాటినుండి పరిపాలన
దృష్ట్యా ఏర్పడిన ఈ పొలిమేరలు ఒకరి నొకరు అర్థము చేసుకొనుటకు
ప్రతిబంధకములైనవి.
“హైద్రాబాదు రాష్ట్రములో ఆంధ్రోద్యమ పితామహుల ప్రసంగవశమున నాకు
జెప్పిన ఒక వృత్తాంతము ఈ సందర్భములో జ్ఞప్తికి వచ్చుచున్నది. వారు క్రొత్తగా
ప్రజాహిత జీవనములో అడుగు పెట్టిన తర్వాత అనగా మూడు దశాబ్దాల
(క్రిందనన్నమాట; ఒక పర్యాయము వారు సర్మారు జిల్లాల ఆంధ్ర ప్రముఖులైన
ఒకరితో ఏదో సంభాషించు సందర్భమున (వారు తరువాత అఖిల భారత
రాజకీయాలలో ప్రథమ గ్రేణినలంకరించిన వారు)- “హైద్రాబాదులో ఆంధ్రులు
కలరా!” యని ప్రశ్నించిరట. నేను, చాలా మంది సర్కారు జిల్లాల ఆంధ్రులు
163
డా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
సంభాషించినప్పుడు- “మీరు హైద్రాబాదు వాసులైనప్పటికి తెలుగు మాట్లాడ
గలుగుచున్నారే” యని అనేకులు ఆశ్చర్యపడి యుండిరి. హైద్రాబాదు తురకరాజ్యము
అన్న భావమొక్కటే హైద్రాబాదేతరులైన ఆంధ్రుల హృదయాలలో వ్యాపించియుండెను.
ఆధునికాంధ్ర వాజ్మయమున ప్రసిద్దులైన ఒక రచయిత తెలంగాణమున తెలుగు
రచయితలు ఎవ్వరు? అని ఒకానొక సందర్భమున నన్ను ప్రశ్నించి యుండిరి. ఈ
విధముగా రెండు వందల సంవత్సరాల కాలమున భిన్న పరిపాలన మరియు కృత్రిమ
భౌగోళిక విభజన ఫలితంగా ఆంధ్రదేశ సమైక్యతకు రాజకీయంగానే కాక,
సాంస్కృతికంగా కూడ పెద్ద గొడ్డలిపెట్టు తగిలెనని పై సంఘటనలే బుజువు
చేయుచున్నవి.
హైద్రాబాదు రాష్ట్రములోని ఎనిమిది జిల్లాలు తెలుగు జిల్లాలు; హైద్రాబాదు,
సికింద్రాబాదు నగరాలు ఆంధ్రనగరాలు. కాకతీయ సామ్రాజ్యమునకు కేంద్రమై
యలరారిన ఓరుగల్లు హైద్రాబాదు రాష్ట్రాంతర్గతము. తెలుగు దేశ చరిత్రలో తెలుగు
వాజ్మయచరిత్రలో హైద్రాబాదులోని ఎనిమిది జిల్లాలకు అత్యధికమైన
ప్రాముఖ్యతగలదు. నిజానికి మొట్టమొదటిసారి తెలుగు జాతీయతకు రూపురేఖలు
దిద్దబడినది హైద్రాబాదు రాష్ట్రములోనే యని చెప్పినచో అతిశయోక్తి కాజాలదు.
నుప్రసిద్ధచరిత్ర పరిశోధకులైన శ్రీమల్లంపల్లి సోమశేఖరశర్మగారు- “మనది
ఆంధ్రదేశం; మనమంతా ఆంధ్రుల మనే జాతీయాభిమానము మొదటిసారి మనకు
కాకతి గణపతి దేవరాయల కాలంలో కలిగిందని, ఆ రాజన్యుడే ఆంధ్రులందరిని
ఒక్క రాజ్యంలోనికి తీసుకుని రావలెనని మొదటిసారి ప్రయత్నించినాడని” గ్రంథస్థము
కావించినారు.
కాకతి గణపతి దేవుని రాజ్యపాలనలో మహోజ్వలంగా వెలిగిన ఆంధ్రరాజ్య
లక్ష్మితోపాటు ఆంధ్రసారస్వతము, ఆంధ్ర శిల్పము మూడుపూవు లారు కాయలుగా
కాచి వృద్ధి బొందినవి. ఆంధ్రశిల్ప కళాలక్ష్మి వేయి వన్నెలను దిద్దికొని
మురిసిపోయినది. మార్కో పోలోవంటి విదేశ యాత్రికులను దిగ్రమ జెందించిన
ఆంధ్రనగర వైభవము అనుపమానము. ఉత్తమ శిల్పమున కునికి పట్టులగు
సౌధములచే నలరారిన ఆ విశాల రాజవీధులు; శత్రురాజులకు దుర్భేద్యమై నిలచిన
ఆ కోటలు; ఆనాడు ఆంధ్రోర్వీశు మొగసాలపై మోగిన ఘంటా రుణత్మారములు;
ఆ పూటకూటింటిలోని కప్పురభోగి వంటకము, కమ్మని గోధుమపిండి వంట; ఆ
చిత్రశాలలు; ఏకశిలానగర నాగరిక జీవితమునకు (ప్రతిబింబములై నేటికిని
164
సారస్వత నవనీతము
క్రీడాభిరామమున అక్షరరూపముతో శోభిల్లుచున్నవి. ఇట్లు ఆంధ్రదేశమునకు, ఆంధ్ర
సంస్కృతికి కేంద్రమై వెలగిన ఆంధ్రనగరము తెలుగు జాతీయతకు వన్నెచిన్నెలు
దిద్దుటలో ఆశ్చర్యములేదు.
ఒక్కమారు తెలుగు సాహిత్యచరిత్రను అవలోకించితిమేని, తెలంగాణమునకు
ఆంధ్రవాజ్మయచరిత్రలోనున్న ప్రత్యేకన్థానము కన్నులకు గట్టును. దేశ కాల
పరిస్థితులవలన రచయితలకు, రచనలకు కొంతకాల మజ్ఞాతవాసము కలిగినది.
తెలంగాణమందలి గ్రామాలలో తాళపత్ర గ్రంథములు లేనివూరు లేనేలేదని చెప్పిన
అతిశయోక్తి కాజాలదు. ఆధునిక కాలమున ఇక్కడి సారస్వతోద్యమ వ్యాప్తిని
పరిశీలించునప్పుడు రాజకీయ పరిస్థితులను మనము దృష్టిలో నుంచుకొన
వలసియున్నది. బ్రిటీషువారు ఏమి జేసినప్పటికిని, బ్రిటీషు ఇండియాలో విద్యావ్యాప్తికె
జరిగిన కృషిని నిరోధించలేదనియే చెప్పవలెను. సారస్వత కృషి జరుగుటకు
కావలసినంత యవకాశము దొరికినది. అందుచేత కేవల సారస్వతోపాసకులైన వారి
కృషి నిరంతరాయముగా జరిగినదనియే చెప్పవలయును. ఆధునికాంధ్రవాజ్మయ
నిర్మాతలైన వీరేశలింగ ప్రభృతుల జీవితాలు ఇందుకు నిదర్శనములు. సర్కారు జిల్లాలలో
సారస్వతసేవకు తమ జీవితాలను అంకితము జేసిన మహాశయులలో అత్యధిక
సంఖ్యాకులు రాజకీయాలలో ప్రమేయము కలిగించుకోలేదు. అందువలన అచ్చట
రాజకీయ కార్యకర్తలు సారస్వతోపాసకులు విడివిడిగా కృషి జేయుట జరిగినది.
కాని తెలంగాణములో ఇదిసాధ్యము కాని, సంభవము కాని కాలేదు. ఇక్కడి ప్రజల
మాతృభాషను అణచివేయుటయే అప్పటి ప్రభుత్వము యొక్క ముఖ్యోద్దేశమై
యుండెను. కేవల సారస్వతోద్యమము అను మాటకు అవకాశములేని పరిస్థితులను
ఇక్కడి ప్రభుత్వము కలిగించినది. గ్రంథాలయాల స్థాపనయే బహుదుస్తర కార్యముగా
నుండెను. వీని నిర్వహణ బాధ్యతను వహించిన కార్యకర్తలు ఎన్నియో ఇబ్బందులకు
గురిచేయబడిరి. సారస్వత సమావేశాలపైనగూడ అనేక విధాలైన నిర్బంధాలు
ప్రయోగింపబడి యుండెను. ప్రజల మాతృభాషల వ్యాప్తికి ఏ కొంచము అవకాశ
మిచ్చినప్పటికిని అందువల్ల స్వతంత్ర భావాలు వ్యాషిజెంది రాజకీయముగా తమ
కొంప మునిగిపోవు నను దృఢనిశ్చయముతో కవి సమ్మేళనాలు, సారస్వత సభల
యెడ గూడ ఇక్కడి ప్రభుత్వము నిర్బంధ విధానము ననుసరించినది. ఏ చిన్న
సమావేశము చేయదలచి నప్పటికిని ప్రభుత్వము యొక్క అనుమతి అవసరమై
యుండెను. ఈ అనుమతి మిక్కిలి దుర్లభమై యుండెను. ఈ వాగ్బంధన శాసనము
165
దా దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
యొక్క పైశాచిక తాండవము వలన రాజకీయ కార్యకర్తలు, సార్వతోపాసకులు విడివిడి
వర్గాలుగా నైనను చీలిపోయి పనిజేయు నవకాశమైనను దొరకలేదిక్కడ. సమావేశ
స్వాతంత్ర్యము, వాక్స్వాతంత్ర్యము, రచనా స్వాతంత్ర్యము హైదరాబాదీయు లందరి
యొక్క ముఖ్యాశయమై యుండెను. ఈ యాశయము కొరకై ప్రతివారును కృషి
జేసియుండిరి. ఈ కృషి ప్రభావము సారస్వత రంగమున గూడ ప్రత్యక్ష మగుచున్నది.
విజయనగర సామ్రాజ్య పతనము తరువాత వీరేశలింగము పంతులుగారివరకు
తెలుగు భాషలో జరిగిన సారస్వతకృషి స్వల్పమైన దనియే చెప్పవచ్చును. ఈ కాలములో
సమస్తాంధ్ర దేశమునందలి సారస్వతమునకును గ్రహణము పట్టినదని చెప్పిన
యతిశయోక్తి కాజాలదు. ఈ రాహుకేతువుల పీడనుండి తెలుగు దేశమును విముక్తి
గావించి, తెలుగుతోటలో క్రొత్త పాదులను నిర్మించిన మార్గదర్శి వీరేశలింగము
పంతులు. వీరేశలింగము సంస్కృతాంధ్రములు చక్కగా పఠించి, ఆంగ్ల సారస్వత
పఠనముచే ప్రభావితుడైన ఉపజ్ఞాశాలి. ఆయన సారస్వతక్షేత్రమున అడుగుబెట్టిన
సమయమున తెలుగు దేశమున రెండు ముఖ్యమైన విద్యాధిక వర్గాలు ఏర్పడియుండెను.
మొదటివారు సంస్కృత పండితులు, రెండవవారు ఆంగ్ల విద్వాంసులు. ఈ యిరు
పక్షాల మధ్య సరియైన సమన్వయము లేకుండెను. ఉభయపక్షాలకు కూడ తెలుగుతల్లి
మీద ఏమంత (ప్రేమ యుండి యుండలేదు. ఆంధ్ర భాషాభివృద్ధికై కృషి జేయవలెనను
పట్టుదల వారికి లేకుండెను. ఈ పరిస్థితులలో తెలుగు దేశమున శ్రీ వీరేశలింగము
తన పాంచజన్యమును పూరించెను. ఆంగ్లభాష ద్వారా విద్యాభ్యాసము గావించి, ఆ
భాషలోగల వివిధ వాజ్మయ విశేషములను చవిజూచిన తెలుగువారిని ఆయన ఆంధ్ర
భాషా పునరోద్ధరణము చక్కగా ఆకర్షించినది. కేవల సారస్వత కృషికై హైద్రాబాదులో
గల నిర్బంధాలు బ్రిటీషు ఇండియాలో లేకపోవుటవలన ఒక్కమారుగా తెలుగు
దేశమునందు సారస్వతోద్యమము వెల్లువయై ఉప్పొంగినది. ప్రభుత్వోద్యోగాల
యందుండు విద్యాధికులు గూడ ఈ మహా ప్రవాహమునందు స్నానము చేసి, కలము
కసరత్తులను గావించినారు.
హైద్రాబాదులోని పరిస్థితులు మరొక విధముగా నుండెను. ఊరూర
సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికి, వారు పరస్పరము సమావేశమై బాహ్య
ప్రపంచముతో సంబంధము కలిగించుకొను నవకాశము లేకుండెను. మదరాసు
విశ్వవిద్యాలయమున ప్రాంతీయ భాషలకు స్థాన మీయబడినందువలన బ్రిటీషు
ఇండియాలోని ఆంగ్ల విద్యాధికులకు తమ మాతృభాషలతో పరిచయ మేర్ప్చడియుండెను.
166
సారస్వత నవనీతము
హైద్రాబాదు రాష్ట్రమున రాజభాష ఉరుదూ; విద్యావిధానమంతయు ప్రాథమిక
తరగతులనుండి విశ్వవిద్యాలయ తరగతుల వరకు ఉరుదూ ద్వారా జరుపుచు, యే
యితర రాష్ట్రములలో లేని క్రొత్త విద్యాపద్ధతి హైద్రాబాదు ప్రజల నెత్తిమీద రుద్దబడినది.
ఉద్యోగములు మొదలైన ప్రభుత్వ కరుణాకటాక్షములు గూడ నూటికి తొమ్మిదిమంది
లేని అల్పసంఖ్యాకులమీదనే ప్రసరించినందువలన ఉరుదూ ద్వారా నైనను ఉన్నతవిద్య
నభ్యసించవలెనను అపేక్ష ప్రజలలో కలుగలేదు; ఇందుకు తోడు ప్రజాసామాన్యము
యొక్క ఆర్థిక దారిద్ర్యమును వృద్ధి చేసినది. ఈ విధముగా సమస్త భారత
మహాసముద్రములో హైద్రాబాదు రాష్ట్రమొక ప్రత్యేక ద్వీపముగా సిద్ధమై అందు
నివసించు ప్రజలను నాగరక ప్రపంచము నుండి వేరుచేసినది. తత్భలితముగా గత
శతాబ్దాంతము నుండి ఈ శతాబ్దాంతము వరకు హైద్రాబాదులోని కొద్దిమంది
విద్యావంతులలో రెండు ప్రస్ఫుటమైన వర్గాలేర్చడి యుండెను. పల్లెటూళ్ళలో గ్రాస
వాసోదైన్యమునకు గురియై కృశించుచుండిన సంస్కృతపండితులు, ఆంధ్ర కవులు
మొదటి వర్గము. ప్రభుత్వ వ్యవహారాల కొరకు కొలదియో గొప్పయో ఉరుదూభాషా
పరిచయమును అలవరచుకొన్న లౌకికులు రెండవ వర్గము.
ఈ సందర్భమున ఇంకొక ముఖ్యవిషయము గూడ గమనించవలెను.
ఆంగ్లభాష ఒక మహాసముద్రమువంటిది. ప్రపంచ విజ్ఞాన భాండారమునకు ప్రవేశము
కలుగజేయు తాళము చెవి ఆంగ్లభాష. పాఠకుల నుత్తేజితులను జేయు సామర్ధ్యము
ఆంగ్లభాషకు కలదు. కాని ఉరుదూ భాష ఇట్టిది కాదు. ఉరుదూ వయః పరిమాణము
మూడు నుండి నాలుగు వందల సంవత్సరాలకు మించియుండదు. ఉరుదూ కవిత్వము
గోలకొండ, బిజాపూరు 'రాజధానులందు పదహారవ శతాబ్దము యొక్క చివరను,
పదిహేడవ శతాబ్ది యొక్క ఆదియందును ప్రారంభమైనది. ఉరుదూ సారస్వతమునకు
శృంగార కవిత్వము, ప్రబంధ పోకడలు, సూఫీతత్వ ప్రతిపాదకమైన సాహిత్యము
ప్రధాన లక్షణములు. కావున ఈ ఉరుదూ సారస్వతమునకు పఠితలను ఆంగ్ల భాషవలె
ఉత్తేజితులను చేసి, విజ్ఞానము ప్రసాదించు సామర్థ్యము లేనందువలన, ఇది చెప్పదగిన
గొప్ప పరిణామాలను ప్రాంతీయ భాషలలో కలుగ జేయలేకపోయినది.
హైద్రాబాదు రాష్ట్రములోని తెలుగుసీమవంక తమ దృష్టిని ప్రసరించి ఆధునిక
యుగమున ఇక్కడి సారస్వతోద్యమమునకు నిజమైన పునాదులు వేసిన వారు స్వర్గీయ
శ్రీ కొమట్టాజు వేంకట లక్ష్మణరావు గారు. శ్రీ వేంకటలక్ష్మణరావుగారు మహారాష్ట్ర
దేశముతోను, భాషతోను గాఢమైన సంబంధము, పరిచయము కలిగిన విద్వన్మణులు.
167
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
చరిత్ర పరిశోధన, విజ్ఞాన ప్రచారము వారి ఆశయాలైయుండెను. ఈ ప్రత్యేక
ఆశయాలు కలిగిన లక్ష్మణరావుగారు తెలంగాణ క్షేత్రములో నాటిన సాహిత్య వృక్షము
వానికి అనుగుణమైన ఫలములనే లభింపజేసినది. ఈ శతాబ్దారంభమున హైద్రాబాదు
రాష్ట్రమునందు వారు గ్రంథాలయోద్యమ రూపమున భాషాప్రచారము ప్రారంభించిరి.
హైద్రాబాదులోని శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయము (1901),
హనుమకొండలోని రాజనరేంద్ర భాషానిలయము (1904)ల స్థావనకు
లక్ష్మణరావుగారి కృషి ప్రోత్సాహములే ముఖ్య కారణములు. లక్ష్మణరావుగారు తమ
విజ్ఞానచంద్రికా గ్రంథమండలిని 1900వ సంవత్సరమునందే స్థాపించిరి. ఈ
గ్రంథమండలి మొదటి నాలుగు ప్రచురణములు హైద్రాబాదు నుండియే వెలువడినవి.
తరువాత 1908 సంవత్సరమున విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి కార్యాలయమును
హైద్రాబాదు నుండి మార్చుట జరిగినది. లక్ష్మణరావుగారు చూపించిన మార్గమున
హైద్రాబాదు రాష్ట్రమందు ఆంధ్రవాజ్మయ రథము నడిపించుటకు నడుము గట్టిన
సారథి మాడపాటి హనుమంతరావు పంతులుగారు. ఒక్క వాజ్మయోద్యమముకే కాక
రాజకీయోద్యమము మొదలైన ఇతర ఉద్యమాలకుకూడ మార్గదర్శకులు శ్రీ
హనుమంతరావుగారే. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో కొందరి మహానీయుల
జీవితాలను పరిశీలించినపుడు మనదేశము పరాధీన దేశము కాకుండినచో, వారు
రాజకీయ రంగమున అడుగుబెట్టక, విజ్ఞానప్రపంచము నందు మాత్రమే విహరించెడి
వారని విస్పష్టము కాగలదు. ఇట్టి శ్రేణిలో చేర్చదగిన వారు శ్రీ హనుమంతరావు
పంతులుగారు. వీరు హైద్రాబాదు రాష్ట్రము నందుగాక మరొక ప్రాంతమున
జన్మించియుండినచో, తమ జీవితమును సాహిత్య వ్యవసాయమునకు, విద్యావ్యాప్తికి
పూర్తిగా వినియోగించెడివారు. హైద్రాబాదు రాష్ట్రములోని ప్రత్యేక పరిస్థితులే వారి
ప్రజాహిత జీవనమునకు రాజకీయవాసన కలిగించినవి. హనుమంతరావుగారు
ఇంగ్లీషు, ఉరుదూ, ఫార్సీ భాషలయందు ప్రవీణులు; లక్ష్మణరాయ సాహచర్యముచే
ప్రభావితులు. తెలంగాణ పరిస్థితులను చక్కగా అవగాహన చేనుకొనిన
ఆంధ్రభాషాప్రియులు. వారు దేశభాషలపైన ప్రభుత్వమునకు గల సవతి తల్లి ప్రేమను
గమనించిరి. ఆంధ్ర చరిత్ర కుపయుక్తములుగాగల అనేక శాసనములు యూరూర
పడియుండుటను తిలకించిరి. తాటియాకు గ్రంథాలు వేనవేలుగా జీర్ణించిపోవుట
పరికించిరి. నాగరిక జీవిత సౌధమునకు ఉరుదూ భాషయే సింహద్వారముగా
భావింపబడుట నవలోకించిరి. పల్లెలలో అజ్ఞాతవాసము చేయుచున్న కవి
168
సారస్వత నవనీతము
పండితులయెడ ఒకమారు తమ దృక్కులను ప్రసరించిరి. ఈ పరిస్థితులలో
ఆంధ్రభాషోద్ధరణకు గ్రంథాలయాలే ముఖ్యసాధనములని గ్రహించి జిల్లాలలో విరివిగా
గ్రంథాలయాలను స్థాపించుట ద్వారా భాషాప్రచారమును గావించిరి. కొంత
కాలమునుండి నిద్రావస్థలో నున్న ఆంధ్రులను గ్రంథాలయోద్యమము వాజ్మయ
ప్రదర్శనములు రచయితలలో ఉత్సాహమును పురికొలుపుటకు చక్కగా తోడుపడినవి.
యువకులనేకులు సాహిత్యసేవకు కంకణబద్ద్భులైనారు. గ్రంథమాలలు, పత్రికలు
బయలుదేరి, భాషాప్రచారము ప్రారంభించినవి. శ్రీ సురవరము ప్రతాపరెడ్డిగారివంటి
ఆంగ్ల విద్యాధికులు జీవితములో ఆర్థికముగా అభివృద్ధికి రాగల అనేక అవకాశాలను
జారవిడుచుకొని సాహిత్యసేవకు, భాషా ప్రచారమునకు, పత్రికారచన ద్వారా దేశసేవకు
తమ జీవితమును అంకితము గావించిరి. తెలంగాణలో ప్రజాభిప్రాయమును
దిద్దితీర్చుట యందు, నిర్భయముగా అభిప్రాయాలు ప్రకటించి ప్రజలకు అండగా
నిలిచిన గౌరవము గోలకోండ పత్రికకు యియ్యవలసి యున్నది.
హనుమంతరావుగారు స్వయముగా చక్కని రచయితలు. తెలుగు భాషలో
వ్యాసకర్తలు ఈ నాటికిని మిక్కిలి అరుదుగానున్నారు. చక్కని-చిక్కని వచన శైలిలో
విషయ పరిపూర్ణతగల వ్యాసములను వ్రాయ సమర్థులైన కొద్దిమంది ఆంధ్ర
రచయితలలో హనుమంతరావుగారికి ప్రత్యేకమైన స్థానముగలదు. బంకించం ద్రఛటర్టీ
జ్రాసిన ఆనందమఠమను నవలకు తెలుగు అనువాదము; గ్యారీబాల్టీ జీవితచరిత్ర;
రోమక సామ్రాజ్య చరిత్ర; శ్రీ చింతామణిరావు వైద్యాగారి “ఎపిక్ ఇండియా” అను
ఆంగ్ల గ్రంథములకు “క్షాత్రకాలపు హింద్వార్యుల”ను తెలుగు పరివర్తనములు
హనుమంతరావుగారి తొలిరచనలు. ఈ రచనలు హనుమంతరావుగారి ఆశయాలు,
వారిమీద లక్ష్మణరావుగారి ప్రభావము స్పష్టముగా తెలుపుచున్నవి. తెలుగు భాషలో
మంచి వచన గ్రంథములు లేకపోవుటచేత, ఆ లోటును దీర్చవలెనన్నది మొదటి
యాశయము. ఆంగ్ల, వంగ, మహారాష్టాది ఆంధ్రేతర వాజ్మయాలలో జరుగుచున్న
సాహిత్య ప్రచారమునుజూచి, ఆ విధముగానే మన భాషలో గూడ చరిత్ర, విజ్ఞానము
మొదలైన విషయాలను గూర్చి గ్రంథరచన చేయవలయుననునది రెండవ ఆశయము.
ఆంగ్లాది పాశ్చాత్య భాషల యందలి నూతన వాబ్మియరీతులను, విజ్ఞానమును తెలుగులో
దిగుమతి చేయవలయుననునది మూడవ ఆశయము. నేడు హనుమంతరావుగారు
రాజకీయముగా అస్త్రసన్యాసము గావించినప్పటికి ఇట్టి ఆశయాలతో సాహిత్యసేవ
కావించుచునేయున్నారు. లక్ష్మణరావుగారి మరణము తరువాత విజ్ఞానచంద్రికా
169
దా/ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
(గ్రంథమండలి ఆగిపోయినది. గ్రంథమండలి అంతర్జానముతోపాటు, తెలుగులో
విజ్ఞాన వాజ్మయ ప్రకటన ప్రయత్నాలు సన్నగిల్లినవి. తెలంగాణముననేకాక
సమగ్రాంధ్రదేశమున జరిగిన సాహిత్యకృషిని సమీక్షించినచో మన భాషలో వివిధ
విషయాలనుగురించి విజ్ఞానమును ప్రసాదించగల గ్రంథజాలము మిక్కిలి
తక్కువయనియు, మహారాష్ట్ర, వంగ, హిందీ భాషలతో పోల్చినప్పుడు మనము చాలా
వెనుకబడి యున్నామనియు ఒప్పుకొనక తప్పదు. ఇది హనుమంతరావుగారికి
వృాదయవేదన కలిగించినది. ఈ లోటు నివారించుటకే వారు ఆంధ్ర
చంద్రికాగ్రంథమాలను స్థాపించిరి. ఆ గ్రంథమాల యొక్క సకల వ్యవహారములను
తామే నెరవేర్చుచు గ్రంథప్రకటన గావించుచున్నారు. ఇప్పటివరకీ గ్రంథమాలలో
విస్మృత సామ్రాజ్యములు, ఆంధ్రోద్యమ చరిత్ర రెండు సంపుటములు, ఆంధ్ర సాహిత్య
చరిత్ర సంగ్రహము, ప్రాచీనాంధ్రనగరములు, రాజకీయ పరిజ్ఞానము అను పుస్తకాలు
వెలువడినవి. త్వరలోనే ఆర్థిక, భౌతిక విజ్ఞానములగూర్చి గ్రంథములు కొన్ని
వెలువడనున్నవి. చారిత్రక దృక్పథము, విజ్ఞాన వాజ్మయ ప్రచారము అను
హనుమంతరావుగారి ముఖ్యాశయములు ఈ [గ్రంథమాల ప్రచురణములలో
ప్రతిబింబితములగుచున్నవి.
తెలుగు భాషలో హనుమంతరావుగారికి ప్రత్యేక విశిష్ట స్థానము నీయగలిగినది
వారి కథానికారచన. ఆధునిక ఆంధ్ర వాజ్మియమున కథానికా రచనకు మార్గదర్శకులైన
కీర్తి గౌరవములు హనుమంతరావుగారికి చెందవలసియున్నవి. సుమారు నలుబది
సంవత్సరాల క్రింద కృష్ణాపత్రికలో వీరు వరుసగా 18 కథానికలను ప్రచురించి
ఆంధ్ర కథావీధికి త్రోవజూపించియున్నారు.
ఇది యిట్లుండగా శ్రీలక్ష్మణరావుగారు చూపించిన మార్గాన హనుమంతరావు
గారొక గొప్ప సారస్వతోద్యమమునకు దృఢమైన పునాదుల నేర్చరచిరి. ఇతర ప్రాంతాల
సారస్వత కృషిని తెలంగాణ సారస్వతోద్యమముతో పోల్చినప్పుడు క్రొత్త ప్రత్యేకతలు
కన్పట్టుచున్నవి. తెలంగాణములో సారస్వత కృషి ఒక నిర్మాణాత్మక ఉద్యమముగా
కొనసాగినది. ఇతర ప్రాంతాలలో సారస్వత కృషి వ్యక్తులను ఆశ్రయించినది.
తెలంగాణా సారస్వత కృషి ప్రజలను మేలు కొలుపు ఒక మహోద్యమముగా సంస్థలను
ఆశ్రయించి కొనసాగినది.
170
సారస్వత నవనీతము
పండిత కవులు
తెలంగాణములో కవుల యొక్కయు పండితుల యొక్కయు కొరత ఎన్నడు
లేకుండెను. ప్రచారము, ప్రకటనము ఇక్కడి ప్రత్యేక పరిస్థితుల వలన లోపించినందున
నివురుగప్పిన నిప్పువలె కవులు, పండితులు దాగుకొనియుండిరి. స్థాలీపులాక
న్యాయముగా ఈ సందర్భములో వీరిని కొందరిని ప్రశంసించుట అవసరము. శ్రీ
వెల్లాల సదాశివ శాస్తులవారు కొల్లాపుర సంస్థాన వాస్తవ్యులు; బహు గ్రంథకర్తలు;
మహాపండితులు. సంస్కృతములో చంపువులు, శాస్త్ర చర్చలు కావించిన చాలా గొప్ప
వైయాకరణి. ఈయన తెలుగులో చంద్రికా పరిణయమునకు వ్యాఖ్యాత. వీరి రచనలలో
పేర్కొన తగినవి, ఆంధ్రుల చరిత్ర విమర్శనము; నరస భూపాలీయమును గూర్చి
కావ్యాలంకార సంగ్రహమను తెలుగువచన గ్రంథమును; నామిరెడ్డి చరిత్ర
(శాసనములపై చరిత్ర) అనునవి. ఈ పండిత శ్రేణిలో పేర్కొనదగిన మరొకరు
శ్రీబుక్కపట్నము శ్రీనివాసాచార్యులవారు. వీరిది విద్వత్మవి కుటుంబము. ఎనిమిది
తరములుగా వీరి వంశమువారు కవులు. సుప్రసిద్ధులైన కిరీటి వేంకటాచార్యులవారు
వీరి పూర్వులలో నొకరు. శ్రీనివాసాచార్యులవారు తమ ఏడవ సంవత్సరము నుండియే
కవిత్వము జెప్పనేర్చి, పదునైదవయేట, బాలకవి బిరుదాంకితులైరి. తరువాత మైసూరు
నంస్థానానమందు బాలనరస్వతి బిరుదమందిరి. నవద్వీపములో తర్మతీర్థ
బిరుదమందిరి. ఉత్తర భారత మందలి దర్భాంగ, జోద్పూరు, గవాలియారు, ఇందోరు,
ధారానగరు, జమ్మూ మొదలగు అనేక సంస్థానాలలో దిగ్విజయము గావించినారు.
ప్రాకృతములు, సంస్కృతము, ఆంధ్రము అష్టభాషలలో అనువుగా శతఘంట కవనము
చేయువారు. మద్రాసు, కడప, ప్రొద్దుటూరు, బనగనపల్లి, పెనుగొండ, తాడిపర్తి,
సురపురము మొదలగు స్థలములలో అవధానములు గావించినారు. వీరు బహు
(గ్రంథకర్తలు. రచనలు విశేషముగా సంస్కృతమున నున్నవి. వీరి కుమారులైన జాతక
విద్వన్మణి వేంకటాచార్యుల వద్ద వీరి గ్రంథాలు కలవు. ఈ వేంకటాచార్యులవారి
నెరుగని పండితులు, కవులు ఆంధ్రదేశమున లేరు. ఆంధ్రనాటక పితామహులగు
ధర్మవరము కృష్ణమాచార్యులవారును, ఉత్తర హిందుస్థాన హిందూసంస్థాన
కవీశ్వరులును, వీరిని ప్రశంసించిరి. శ్రీ తిరుపతి వెంకటకవులు వీరిని కొనియాడుచు
పద్యములను వ్రాసిరి.
హిందూ, మద్రాసుమేలు, స్టాండర్దువంటి ఆంగ్లపత్రికలు వీరి ఆశుకవితనుగాంచి
అద్భుతపడి అనేకరీతులుగా స్తుతించిరి. మైసూరులోని వైష్ణవపీఠమునకు అధిపతులుగా
171
దా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
వెళ్ళిన పరకాలస్వాములవారు గద్వాల వ్యాస్తవ్యులు. గొప్ప సంస్కృతాంధ్ర పండితులు,
శతాధిక గ్రంథకర్తలు. గద్వాల వ్యాస్తవ్యులేయెన పుల్లగుమ్మి వెంకటాచార్యుల వారు
గొప్ప వైయాకరణులు. సంస్కృతాంధ్రరచయితలు. ఆత్మూరి మల్లికార్జున శాగస్తిగారు
రాయచూరు వ్యాస్తవ్యులు, శతావధానులు. గణితశాస్త్రమున ఎన్ని కోట్ల సంఖ్యలైనను
నోటితో లెక్కించి చెప్పగల సమర్థులు. చాలాగొప్ప జ్యోతిశ్శాస్త్రవేత్తలు. వట్టెము
వాస్తవ్యులగు పాపకవి తెనుగుకవి. వనపర్తివ్యాస్తవ్యులగు విక్రాల సోదరులు గొప్ప
పండితకవులు. కర్నమడకల అనంతాచార్యులవారు గద్వాల ఆస్థానపండితులుగా
నుండిరి. న్యాయ, వేద, వేదాంత, వ్యాకరణ, మీమాంస, సాహిత్యములందు గొప్ప
ప్రవీణులు. కాశీనుండి శివకుమార పండితులవారు గద్వాలకువచ్చి అనంతాచార్యుల
వారులేరని విని, తమ పాండిత్య ప్రకాశమునకై సభను జయించుటకు ప్రభుల
యాజ్ఞనుబొంది ఈ సభలో తమను జయించువారు లేరని శపథము చేసి, అందరిని
ఓడించిరి. తరువాత రాజుగారు అనంతాచార్యులవారిని పిలిపించిరి. వారు వీరి
వాదమును ఒక్క పూర్వపక్షము ఖండించినంతనే శివకుమార పండితులు, ఇది
అనంతాచార్యులవారికి దప్ప మరొకరికి సాధ్యముకాదని తెలిపిరట. శ్రీ పత్రి
విశ్వేశ్వరశాస్రిగారు చక్కని కవిత్వము చెప్పగల గొప్ప పండితులు. రామాయణ
సంగ్రహము వారి రచనలలో పేర్మొనదగినది. ప్రాస్తావికముగా వీరు చెప్పినపద్యములు
మనోహరమైనవి. కొల్లాపురమునుండి వెళ్ళిపోవలెనను ఉద్దేశమును ప్రకటించుచు,
వెళ్ళిపోవుటకుముందుగా ఆశువుగా చెప్పిన-
“స్థానబలంబునన్ హృదయసార మెరుంగని దుష్టవంశ సం
తానము విజ్ఞవీగెడు కతాన పరస్పరఘర్షజాత వై
శ్వానర విస్ఫులింగములు బర్వి వనంబఖిలంబు గాల్బెడున్
కాన దొలంగు మీ సుఖము గాంచుమి చందన! లోకనందనా”
అనుపద్యము పేర్కొనదగినది. గోపాలపేట రామచంద్రాచార్యులవారు
శతావధానులు, ఆనందరామాయణ ఆంధ్ర గ్రంథకర్త. మహాభక్త విజయ గ్రంథకర్త
మందడి వేంకటకృష్ణకవి వనపర్తి వాస్తవ్యులు- చక్కని కవులు. దివ్యవాణి పత్రికా
సంపాదకులై, సనాతనధర్మ ప్రచారమునకు కంకణము గట్టిన చివుకుల అప్పయ్య
శాస్త్రిగారు సికింద్రాబాదునుండి గర్గభాగవతాది బహుగ్రంథములను వ్రాసి ప్రకటించిరి.
రెండు సంవత్సరాల క్రింద గతించిన శ్రీ చిదిరెమఠము వీరభద్రశర్మగారు
నల్లగొండ జిల్లా చర్లపల్లి వాస్తవ్యులు, కాశీలో వీరొక పీఠమునకు అధిపతులైనారుకూడ.
172
సారస్వత నవనీతము
వేదతీర్థ, కావ్యతీర్ధ, స్కృతితీర్ధ, ధర్మాచార్య, సాహిత్యవిశారద మున్నగు బిరుదాంకితులు.
మహారాష్ట్ర కర్ణాటక, సంస్కృతాంధ్రములు బాగుగాతెలిసి కవిత్వము చెప్పగల
సమర్థులు; మంచి విమర్శకులు; ప్రామాణికులైన పండితులు; వక్తలు.
వీరందరు పాతిక శతాబ్దములో గతించినారు. ఇప్పటికి తెలంగాణ జిల్లాలలో
వివిధ శాస్త్ర పరిజ్ఞాతలు, ఉద్దండ పండితులెందరో కలరు. వీరిలో వట్టెము
నరసింహశాస్తిగారు ప్రత్యేకముగా పేర్కొనదగినవారు. వీరు గొప్ప వైయాకరణి. శ్రీ
అయితమురాజు కొండల్ రావుగారు బహుభాషా విశారదులు. ప్రభుత్వ విద్యాశాఖ
నుండి ఉపకారవేతనము పొంది, హైద్రాబాదులో నివసించుచున్నారు.
సంస్కృతాంధ్రాంగ్లములందేగాక, ఉరుదూ, ఫార్మీ, అరబ్బీ, కర్ణాటాది బహు
భాషలయందు పాండిత్యము గడించి, ఉరుదూ, తెలుగు నిఘంటువును వ్రాసిరి. ఈ
పండితులలో వక్తలు, హాస్యరసపూరితముగ సంభాషించగల నేర్పరులుకూడ కలరు.
మహబూబ్‌నగరములోని అచ్చంపేట వాస్తవ్యులు గొప్ప వైయాకరణులునగు
నరసింగయ్య గారు ఇట్టి చమత్కార సంభాషణలో నేర్పరులు. వీరిని ఒకరు
తాంబూలము వేసుకొమ్మని కోరగా, తాము పతితద్విజులమని చెప్పి, తమకు
దంతములు లేకపోవుటను శ్లేషించిరి. గద్వాలలో ఆస్థాన కవీశ్వరులుగా నుండి
గతించిన శ్రీ గాడేపల్లి వీరరాఘవశాస్త్రిగారు అద్వితీయమైన ధార, గొప్ప ప్రతిభ
గలిగిన ఉద్దండ కవీశ్వరులు. వీరి అవధానములు, సమస్యాపూరణములు, శ్రీనాథ,
తెనాలి రామకృష్ణాది పూర్వ కవీశ్వరులను స్ఫురింప జేయునవియై యున్నవి. వీరి
కవిత్వము ఇతరుల కవిత్వమువలె సులభమైనదేయని ఒకరు ఆక్షేపించినప్పుడు-వీరు,
“సులభంబైన సమానమాయెనట దిక్ శుద్ధాంత కాంతా నిర
ర్లళ లావణ్యమయ ప్రభావ విహరత్మల్లోల మాలాతి ని
ర్మల డిండీరకణాయమానసుయశోరామా మనోహారి వా
గ్విలసద్భూషణు నన్నెరుంగరొకొ దేవీ ఎంతమాటాడె జూ.”
అని యాశువుగా జెప్పిన ఎనిమిది పద్యములు వీరి నిరర్గళ కవితా ధోరణిని
నిరూపించుచున్నవి, అనేక అవధానాలు గావించి దుష్మర ప్రాసలతో గూడిన వివిధ
సమస్యలను పూరించి వీరు సారస్వత జైత్రయాత్రను గావించిరి. ఒక సభలో 'పాండిత్య
హీనాఃకవయః అని ఒకరెత్తి పొడిచి నప్పుడు, వీరు -
173
దా/ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
“వ్యాసుండన్న పురాణకర్త అతడా పాండిత్య హీనుండె కా
భాసుండన్న మహాకవీంద్రు డతడా పాండిత్య హీనుండు వా
గ్వ్యాసంగుండగు భట్టబాణు డతడా పాండిత్య హీనుండు”
అని, యేబదిరెండు పాదముల శార్జూల వృత్తములో-
“కుస్తీకీవు డీకొందువా? నీ సంసారము గుట్టు
లో దలచి వందేయంచు వాకొందువా?”
అని ప్రశ్నించిరట. ఈ కవి అనేక సమస్యలను పూరించిరి- వానిలో
ఉదాహరణకై- “దారము లేని హారము నుదారత నీ కెవరిచ్చి రమ్మరో?” అను
“సారస గాత్రి యొక్కతె నిశాసమయంబున మంచి ముత్తెముల్
గూరిచి తా ధరించి తనుగూడెడు నాథు కవుంగిలింప జే
కూరెను గుర్తులవ్వి గని కోమలి కిట్లని రెల్ల నెచ్చెలుల్
దారము లేని హారము నుదారత నీ కేవరిచ్చిరమ్మరో?”
దీనికే పూర్వకవులు మరికొందరు పచ్చలాధారము లేని హారమనియు,
మందారములేని హారమనియు పూర్తిచేసిరని చెప్పినప్పుడు వీరి పూరణములోని
స్వారస్యము స్పష్టము కాగలదు. కవిశ్రేణిలో చేర్చదగిన మరొకరు కీ॥శే॥ మాదిరాజు
విశ్వనాథరావుగారు - వారు అరబ్బీ, ఫార్సీ, ఉర్దూ, ఇంగ్లీషు, సంస్కృతాంధ్రాది
బహుభాషా విశారదులు - ప్రస్తుతము హైద్రాబాదు ప్రభుత్వ శాఖలో ఉన్నతోద్యోగము
నందున్నరావుగారు ఇటీవలనే కీర్తిశేషులైరి. ఈ ప్రాంతములో లక్ష్మణశాస్రిగారితో
కలసి వీరు - కర్ణసుందరి యను నాటకమును, బిల్హణుని విక్రమాంక దేవచరిత్ర
ప్రబంధమును తెనుగులో వ్రాసియున్నారు. విశ్వనాథ కవితా వ్యాసంగమును ఇతరులలో
వ్యాప్తిజేయుటకు శ్రమించి, తాము ఇతరులతో జేయు పరస్పర ఉత్తర ప్రత్యుత్తరములు
గూడ పద్యరూపముననే జరుపుచు, ఒక కవిత్వ ఉద్యమమును కొల్లాపురములో
లేవదీసిన స్నేహలతా కవితాసంఘనిర్వాహకులు శ్రీరామ సుబ్బారాయుడుగారు,
ప్రత్యేకముగా ప్రశంసనీయులు. నల్లగొండ జిల్లాలో శ్రీగవ్వా అమృతరెడ్డి, శ్రీ గంగుల
శాయిరెడ్డిగార్లు మధుర కవిత్వమును వ్రాసినారు. శాయిరెడ్డిగారి “కాపుబిడ్డ చక్కని
ఖండకావ్యముల సంపుటి.
174
సారస్వత నవనీతము
ఈ విధముగా ఈ శతాబ్దాదియందు శ్రీ మాడపాటి హనుమంతరావుగారు
నవీనపద్దతుల ద్వారా సారస్వతోద్యమ వ్యాప్తికి కృషిజేయుచుండగా మరొకవంక
విద్వత్మవిసింహములు సంస్థానాధీశ్వరుల ఆస్థానాలలో వీర విహారములు గావించినవి.
ముఖ్యముగా వనపర్తి, ఆత్మకూరు, గద్వాల సంస్థానములు కవిపండిత పోషణకు
ప్రసిద్ధి గాంచినవి. గద్వాల సంస్థానాధీశ్వరులు, కీర్తిశేషులునగు సీతారామ భూపాలుడు
గావించినన్ని కవి పండిత సన్మానములు, యెన్నడు యే ఆస్థానమునందును
జరుగలేదని బహుపండితుల అభిప్రాయమైయున్నది. రసికులు భాషాపోషకులు
విద్యాప్రియులునగు ఆధునిక సంస్థానాధీశ్వరులలో వారు మున్నెన్నదగినారు.
నవయుగారంభము
ఈ శతాబ్దాదిలో శ్రీ హనుమంతరావుగారి పిలుపును అందుకొని భాషాసేవకు
యువకు లనేకులు ముందుకువచ్చి పత్రికల ద్వారా; గ్రంథాలయాల ద్వారా, సారస్వత
సభల ద్వారా, గ్రంథమాలలద్వారా, విశేషకృషిని గావించిరి. ఈ సందర్భములో శ్రీ
సురవరము ప్రతాపరెడ్డిగారి నామము ప్రత్యేక ప్రశంసనీయము. శ్రీ సురవరము
ప్రతాపరెడ్డిగారు బహుముఖముల వాజ్మయసేన గావించిన భాషా తపస్వి. ఆయనను
రాజకీయనాయకుడుగా, పత్రికాసంపాదకుడుగా సకలాంధ్రదేశము గుర్తించినది.
కవిగా, నాటక రచయితగా, కథకుడుగా, పరిశోధకుడుగా, పండితవర్యుడుగా ఆయన
యావదాంధ్ర దేశఖ్యాతిని గాంచిరి. ప్రతాపరెడ్డి ఒక వ్యక్తి గాడు. ఒక మహాసంస్థ.
ఎందరో రచయితలను వాజ్మయరంగమునకు లాగుకొని వచ్చి, ముందుకు నెట్టినా
డాయన - తెలంగాణమును మేలుకొలిపిన వైతాళికులలో ముఖ్యుడాయన. నీలగిరి,
తెనుగుపత్రికలు, సుజాత యీ రాష్ట్రమున సారస్వత ప్రచారమునకు స్తుతిపాత్రమైన
కృషి గావించినవి. నీలగిరి నల్లగొండనుండి వెలువడినది. తెనుగుపత్రిక వరంగల్లు
జిల్లా మానుకోట తాలూకాలోని ఇనుగుర్తి యను చిన్న గ్రామమునుండి ఒద్దిరాజు
సీతారామచంద్రరావు, రాఘవ రంగారావు అను సోదరుల సంపాదకత్వమున
వెలువడినది.
ఈ సోదరులు విశేష ప్రతిభావంతులు. అనేకవిధాలైన వాజ్బయ నిర్మాణము
చేయకలిగిన దక్షులు. జోడుగుజ్జముల వంటి యీ సోదరకవులు ఏకాంకికలు, కథలు,
నాటకములు, వ్యాసములు, విమర్శలు, పుంఖానుపుంఖముగా తెలుగు పత్రిక ద్వారా
తెలంగాణమున ప్రకటించి, విశేష భాషాప్రచారము గావించిరి. ఆనాటి నీలగిరి.
175
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
తెనుగుపత్రికల సంపుటాలను ఒకమారు పరిశీలించినచో, యువక ప్రతిభకు,
అజ్ఞాతరచనలకు, యీ పత్రికలు యేవిధముగా దోహదము గావించినవో స్పష్టము
కాగలదు.
శేషభట్టరు రామానుజాచార్యులవారు భావోద్వేగముతో కూడిన ఖండ కావ్యముల
నెన్నింటినో రచించి, ఉత్తమ కవిశ్రేణిలో ప్రత్యేక స్థానము సంపాదించికొనిరి. వీరు
హాస్యరసాత్మక పద్యములు వ్రాయుటలో దిట్టలు; వీరేశలింగకవి కంఠాభరణ
(గ్రంథమాలాధిపతులు. వీరి రచనలు సుజాత, తెలుగుపత్రిక, నీలగిరి పత్రికలలో
ప్రకటితము లైనవి. వీరి రచనలు నేడు వారి గృహమున అజ్ఞాతవాసము చేయుచున్నవి.
సుజాత శ్రీ పి.యన్. శర్మగారి సంపాదకత్వమున హైదరాబాదునుండి వెలువడినది.
శ్రీ శర్మగారిప్పుడు హైదరాబాదులో ఉన్నతోద్యోగము నందున్నారు. ఈ పత్రిక ఇప్పటి
యువకులలో అపారమైన ప్రభోదము కలుగజేసి, ఎందరో రచయితలను, కవులను
ఉద్భవింపజేసినది. సుప్రసిద్ధులైన శ్రీ గుడిపాటి వేంకటచలము గారి రచనలను
మొట్టమొదటి సారిగా ప్రకటించిన గౌరవము సుజాత పత్రికకు యాయ
వలసియున్నది.
ఈ విధముగా హైదరాబాదులో జరిగిన ప్రబోధవలితముగా ఆధునిక
సారస్వతమునకు తెలంగాణ క్షేత్రములో బీజావాపనమైనది. ఎన్నియో పాదులు
కల్పించబడినవి. ఆ పాదులలో ప్రభవించిన సాహిత్యవల్లి క్రొత్తక్రొత్త పూవులనేకము
విరియబూచి కమ్మతావులను వెదజల్లినది.
యువకులు సారస్వత రంగమున నూతన మార్గముల నన్వేషింప సాగినారు.
ఈ ఉద్యమము ఇనుపచట్టములో బిగింపబడిన కళాశాలలను గూడ కొంతవరకు
కదలించినది. ఉన్నత విద్యనభ్యసించు యువకులు కొందరు సాహిత్యరంగమున
ముందంజవేసిరి. వీరిలో కొందరిని పేర్మొనుట యీ సందర్భమున అవసరమైయున్నది.
నిజాంకళాశాలలో విద్యనభ్యసించుచున్న శ్రీ సిరిగూరి జయరావు ఇట్టి యువకులలో
పేర్కొనదగినవారు. ఈయన తెలుగులో ఆధునిక పద్ధతిని ఉత్కృష్టమైన కవిత్వము
వ్రాసినారు. తిక్కననుగూర్చి యీయన వ్రాసిన గేయము, తెలుగువారు నిద్దుర
మేలుకొనవలెనని సీసపద్యములలో జేసిన ప్రబోధము, ఇతర సారస్వత వ్యాసములు
తెలుగుసరస్వతికి మంచికానుకలు.
“ఒకవంక నాంగ్లేయ సుకుమారి యిచ్చగిం
పులతోడ వలపింప దలచుచుండ
176
సారస్వత నవనీతము
ముసుగులో దాగిలిమూత లాడుచు నుర్జు
భాషావనిత వలల్ బరచుచుండ
అప్పరోభామినినంచు సంస్కృతకాంత
పాలిండ్లు పొంగార పై బడంగ
తగుదునమ్మా యంచు వగలాడి గ్రామ్యంపు
గులుకు మిటారి తళ్ళులు నటింప
హింది కన్యను పెండ్లాడుమీ యటంచు
పెద్దలందరు బలవంత పెట్ట నకట!
“చిన్నతనమునుండి నెచ్చెలిగనున్న
తెలుగుకన్నియ ముద్దులు తీర్చుటెపుడొ
చనుబాలు త్రాగునా డనురాగ మొలుకంగ
అమ్మా యటంచు మాటాడునాడు
గోళికాయల నాడుకొనునాడు తగవు లా
టలలోన తిట్టులు పలుకునాడు
అత్తింటికేగిన కొత్తలో మరదలి
హాస్యోక్తులకు బదులాడునాడు
ముసలి ముత్తాత నీరసముగా వెడలిపో
యెదనంచు కడమాట వదలునాడు
చచ్చెనో, యొడలెరుంగదో, పిచ్చిపట్టి
రూపుమాసెనో అన్యభాషా పిశాచి
జెర యెటనుండి దాపురమాయె నీకు
తెలుగు కాపురముకు పెద్ద తెగులువోలె.”
శ్రీ జయరావు తరువాత ఐ.సి.యన్. పరీక్షలో విజయము పొంది,
ఉన్నతోద్యోగము నందుండగా పిన్నవయసుననే మృత్యుదేవత ఆయనను కబళించినది.
జయరావు వలెనే ఎన్నో ఆశలు గొలిపి అకాల మరణను వాతబడినవారు కోదాటి
రామకృష్ణరావు. ఈయన కలము ఖండకావ్య రచనయందు, వ్యాసరచనయందు నిగ్గులు
దీరినది. తెనుగు పత్రిక, సుజాత మొదలైన పత్రికలను ఈయన రచనలు
అలంకరించినవి. ఇంచుమించుగా వీరిద్దరితో సమకాలికుడు శ్రీ మామునూరు
నాగభూషణరావు. ఈ కవికోకిలము కొంతకాలము తెలంగాణ సారస్వతోద్యాన
177
డా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
వనమున మధురమధురముగా గూసి నేడు మౌనముద్రను వహించినది. చక్కని
కవిత్వము వ్రాయుటేగాక, శ్రావ్యముగా పాడగల సమర్భుడీయన. సారస్వత చంద్రికా
గ్రంథమాలను స్థాపించి యీయన “వెన్నెలకుప్పలను” మనోహర ఖండకావ్య
సంపుటినొక దానిని ప్రకటించినారు. ఈ సంపుటి ఈయన అభిరుచి ప్రాశస్యమునకు,
రసహృదయమునకు ఉజ్వలోదాహరణము. శ్రీ భండారు వీర రాజేశ్వరరావు యీ
కాలమున పేర్మొనవలసిన మరొక యువకవి. “ఆర్టపురుగు”, 'పసిపాపివంటి ఖండ
కావ్యములు యాయనకు నకలాంధ్రదేశకవి మండలియందు ఉత్కృష్ట
స్థానమునొసగుచున్నవి. ఇదేకాలమున సారస్వతరంగమున ప్రవేశించిన మరొకవ్యక్తి
శ్రీ ఉదయరాజు శేషగిరిరావు. ఈయన సంస్కృతాంధ్రాంగ్ల అరబ్బీ ఫార్సీ మొదలైన
బహు భాషలలో ప్రవీణుడు. చక్కని కవిత్వము వ్రాయగల ప్రతిభావంతుడు.
'మనోరమియను ఖండ కావ్యము యీయన రచనలలో పేర్కొనదగినది. గార్లపాటి
రాఘవరెడ్డి యా యుగమునకు చెందిన మరొక విద్వత్మవీశ్వరుడు.
ఈ విధముగా ప్రతిభావంతమగు కవితా వ్యాసంగము ఒకవంక జరుగుచుండగా,
మరొకవంక కథానికల రచనయందు తెలంగాణ యువకులు ముందుకు రాసాగిరి.
ఇట్టి యువకులలో శ్రీ నందగిరి వేంకటరావు ముఖ్యుడు. ఈయన ఆనాటి పత్రికలలో
అసంఖ్యాకములగు కథలను ప్రకటించినాడు. హైద్రాబాదులో జరిగిన మొదటి
అఖిలాంధ్ర కథకుల సమావేశమునకు అధ్యక్షత వహించినాడు. నందగిరి చక్కని
వ్యావహారిక భాషలో కథానికారచన చేయగలిగిన సమర్ధుడు. స్రీ పురుష సంబంధ
సమస్యలకు యీయన కథానికలలో ప్రాధాన్యత కనబడుచుండును. సకలాంధ్ర
కథకులలో మొదటి శ్రేణికి చేరదగిన కథకు డీయనయని చెప్పిన అతిశయోక్తి
కాజాలదు. విద్వాంసులై, పరిశోధకులై, కథానిక రచనవంక తమ దృష్టి
ప్రసరించినవారు సురవరము ప్రతాపరెడ్డిగారు. వీరి కథలు “ప్రతాపరెడ్డి కథలు”
అని పుస్తకరూపముగా (ప్రకటింపబడినవి. ఈ కాలమున వచన రచనలు
గావించినవారిలో ముఖ్యులు నేడు హైద్రాబాదుకు విద్యాశాఖా మంత్రిగానున్న ప్రఖ్యాత
ఆంధ్ర నాయకులు శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారు. వీరు బహుభాషా విశారదులు,
కవులు, విమర్శకులు, వక్తలు. ఇంగ్లీషులో 'గ్రే' వ్రాసిన ఎలిజి మరియు ఉమర్
ఖయ్యాం రుబాయీలను పీరు మనోహగమైన పద్యములలో ఆంధ్రీకరించి యున్నారు.
వీరు ఫార్సీవాజ్బయ చరిత్ర, ఎంకి పాటలు మొదలైన ఆధునిక రచనలను గూర్చి
వ్రాసిన వ్యాసములు మన తెలుగు విమర్శనమున అగ్రశ్రేణిలో నుండదగినవి.
178
సారస్వత నవనీతము
రామకృష్ణారావుగారు చరిత్ర పరిశోధకులుగూడ. అప్పకవి నివాసస్థానమును గూర్చిన
చర్చలలో వీరు పాల్గొని, అప్పకవి తెలంగాణ ప్రాంతము వాడని వీరు
నిరూపించియుండిరి.
శ్రీ మాడపాటి హనుమంతరావుగారికి సమకాలికుడై హైద్రాబాదాంధ్రుల
అభ్యుదయమునకై అపారమగు సేవ గావించినవారు శ్రీ ఆదిరాజు వీరభద్రరావుగారు.
కీర్తిని కాంక్షింపక సేవయే ప్రధానముగా భావించినవారిలో వీరు అగ్రగణ్యులు. వీరు
లక్ష్మణరావుగారి అనుచరులు. హనుమంతరావు పంతులుగారికి కుడిభుజము
వంటివారు. హైదరాబాదులోని కృష్ణదేవరాయాంధ్రభాషానిలయము యొక్క పెంపు
సొంపులకు కారణభూతులైన పెద్దలలో వీరు ముఖ్యులు. ఈ నిలయ రజోత్సవ
సంచికకు సంపాదకులై, దానిని సర్వాంగ సుందరముగా విజ్ఞానదాయకముగా సిద్ధము
జేసియుండిరి. లక్ష్మణరాయ పరిశోధక మండలికి కార్యదర్శులై పెక్కు శాసనాలను
అనేక చరిత్రాంశములను బహిరంగ పరచినారు. ఇంకను చరిత్రాత్మకములు, భాషా
విషయకములు, విజ్ఞానదాయకములునగు వ్యాసము లనేకములను వ్రాసి, ఆంధ్ర
వచన రచయితలందు విశిష్టమగు స్థానము నాక్రమించి యున్నారు. నేడు హైద్రాబాదు
రాష్ట్రమందలి చారిత్రక ప్రదేశములు చరిత్ర పరిశోధన భాషావ్యవసాయము ఇంతయేల
ఆంధ్రోద్యమము యొక్క యే విషయమునుగురించి యైనను సమగ్రవిజ్ఞానము
గలిగినవారు శ్రీ వీరభద్రరావుగారనుటలో అతిశయోక్తి యేమియును లేదు.
'పచ్చన్నముగా వీరు చేసిన భాషాసేవ యెంతయో కలదు. వీరి అనేక అముద్రిత
రచనలు కలవు. ముద్రిత రచనలలో పేర్కొనదగినది ప్రాచీనాంధ్ర నగరములను
గ్రంథము.
ఈ కాలమున పత్రికలలో రచనలు గావించి, సభలలో ఉపన్యాసాలు జేసి,
సంస్థల నిర్వహణబాధ్యత వహించి, సారస్వత సేవకు కృషిచేసిన విద్యాధికులలో శ్రీ
గాడేపల్లి సూర్యప్రకాశరావుగారు, శ్రీ సరిపెల్లి విశ్వనాథశాస్రిగారు, శ్రీ ఇల్లిందల
సీతారామరావు గారు, శ్రీ లోకనంది శంకరనారాయణరావుగారు మొదలయినవారు
ముఖ్యులు. సాహిత్యరంగముననే కాక, కళారంగమున యీ కాలమున
ప్రశంసనీయమగు సేవ జరిగినది. శ్రీ మార్చాల రామాచార్యులుగారు మంచి
చిత్రకారులుగా పేరుపొందిరి. వీరి చిత్రములు 'సుజాతి మొదలయిన పత్రికలలో
ప్రకటితమైనవి. నాట్యకళ అభవృద్ధికై యువకులు కొందరు నడుముకట్టి
కళాసమితులను స్థాపించిరి. సికింద్రాబాదులోని “జగదీశ నాట్యమండలి” వీనిలో
179
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
యెన్నదగినది. ఈ నాట్య మండలిలో ముఖ్యపాత్రధారులు బుచ్చయ్యగారు. ఈ
మండలివారు మద్రాసు, బెజవాడ, గుంటూరు, సింగరేణి, సికింద్రాబాదు మొదలయిన
పట్టణాలలో నాటకాలు ఆడి మెప్పులు పొందిరి.
ఈ విధముగా ఆధునిక యుగమున అన్ని రంగములందు హైద్రాబాదాంధ్రులు
ముందుకు వచ్చి కృషిని గావించిరి. ఈ కృషికి పత్రికలు, గ్రంథమాలలు,
గ్రంథాలయాలు మిక్కిలి సహాయకారులైనవి.
సారస్వతోద్యమములు
ఈ రాష్ట్రమున మొదటి పత్రిక పొతబోధిని. ఇది (క్రీ.శ. 1913లో
మహబూబునగరము నుండి శ్రీనివాస శర్మగారి సంపాదకత్వమున వెలువడినది.
ఈ కాలముననే అవతరించి సేవజేసిన పత్రికలలో ఆంధ్రమాత, నీలగిరి, తెనుగు,
గోలకొండ, శైవ ప్రచారిణి, మీజాజ, దివ్యవాణి, సుజాత, ఆంధ్రాభ్యుదయము,
దేశబంధు, దక్కన్‌కేసరి, పూలతోట, మద్యపాననిరోధక పత్రిక, తెలుగుతల్లి
ఆంధ్రకేసరి, విభూతి పేర్కొనదగినవి. గ్రంథమాలలలో గోలకొండ, కిన్నర, దివ్యవాణీ
సుకృతి ప్రాసాదము, మాతృభారతి, ఆంధ్రశ్రీ, కాకతీయ, పూలతోట, వీరేశలింగ
కవి కంఠాభరణ, కృషి ప్రచారిణి, శివధర్మగ్రంథమాల, విజ్ఞానప్రచారిణి, వేంకటేశ్వర,
అణా, దేశోద్ధారక, ఆంధ్ర కేసరి, సాహితీమేఖల, సాధనసమితి, కావ్యమాల
మొదలైనవానిని పేర్మొనవలసి యున్నది. సారస్వత సంస్థలలో విజ్ఞానవర్ధినీ పరిషత్తు,
వైతాళికసమితి, ఆంధ్రవాజ్మయ సేవాసమితి, కాకతీయ కళాసమితి యెన్నదగిన
సేవ గావించినవి. ఇవిగాక- గోలకొండ కవులసంచిక, కృష్ణదేవరాయ గ్రంథాలయ
రజతోత్సవ సంచిక, శబ్దానుశాస నాంధ్రభాషా నిలయ రజతోత్సవ సంచిక, పోతన
వర్ధంతి సంచిక, హనుమంతరావు షష్టిపూర్తి సంచిక మొదలైనవి స్థానికుల రచనలను
యేరికూర్చి ప్రకటించినవి.
ఈ విధముగా జరుగుచుండిన సారస్వత సేవకు ప్రోత్సాహకరములైన మూడు
ముఖ్యవిషయాలను ఇక్కడ పేర్కొనవలసి యున్నది. హైద్రాబాదులో ఆంధ్రబాలికలకు
మాతృభాషలో విద్యాభ్యాస సౌకర్యము గలిగించి, మహిళామణులలో ఆంధ్ర
సారస్వతాసక్తి కలిగించిన సంస్థ హైద్రాబాదు నారాయణ గూడెములోని ఆంధ్రబాలికా
పాఠశాల. ఈ బాలికా పాఠశాలయందు విద్యాభాస్యము గావించిన బాలికలు తరువాత
విదుషీమణులుగా రచయిత్రులుగా ప్రఖ్యాతి గాంచినారు.
180
సారస్వత నవనీతము
క్రీ.శ 1940 వరకు హైదరాబాదులో తెలుగు దిన పత్రికను స్థాపించి నిర్వహించు
ప్రయత్నములు అప్పటి ప్రభుత్వ నిర్భంధము వలన సాగలేదు. పత్రిక అనుమతి
కొరకు ప్రముఖులు ప్రయత్నించి విఫలులైరి. కాని యెట్లోతుదకు 1940
సంవత్సరమున తెలంగాణ పత్రికను నిర్వహించుటకు అనుజ్ఞ లభించినది. ఈ దిన
పత్రిక ద్వారా ఇక్కడి సారస్వతోద్యమమునకు మంచి దోహదము కలిగింది. ఇదే
సందర్భములో హైదరాబాదులో జరిగిన మరొక సంఘటనను ప్రత్యేకముగా
స్మరించవలసి యున్నది. హైదరాబాదులో ఆంధ్రోద్యమము గ్రంథాలయోద్యమముగా
ప్రారంభమై యుండెను. కాని క్రమక్రమముగా ఈ ఉద్యమము రాజకీయ ఉద్యమముగా
పరిణమించినది. అందుచేత తెలంగాణములోని ఆంధ్రులకొరకు మరొక సారస్వత
సంస్థను స్థాపించు అవసరము కలిగెను.
ఆంధ్ర సారస్వత పరిషత్తు
శ్రీ మాడపాటి హనుమంతరావు, శ్రీ సురవరము ప్రతాపరెడ్డి మొదలైన పెద్దలు
ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిరి. ఇది యొక చారిత్రాత్మకమైన సంఘటన.
ఆంధ్రదేశము నందలి ఇతర సారస్వత సంస్థలవలెగాక యీ పరిషత్తు ప్రత్యేక
ఆదర్శాలతో ఆశయాలతో నిర్మాణాత్మక కార్యక్రమముతో అవతరించినది. ప్రజా
సామాన్యమునందు భాషా ప్రచారము గావించు మహోద్దేశముతో పరీక్షల నిర్వహణను
సాధనగా తీసికొని ఈ పరిషత్తు కృషిని ప్రారంభించినది. వాగ్బంధన శాసనాది
నిర్భంధముల వలన యీ పరిషత్తు కృషి ఆదిలో యెక్కువగా జరుగక పోయిసప్పటికిని,
పోలీసుచర్య ముగిసిన తరువాత ఇది తెలంగాణములో ఒక మహోద్యమముగా
వ్యాప్తిజెందుచు, వేలకొలది ప్రజలను అక్షరాస్యులుగా జేయుచు, భాషాప్రచారము
గావించుచున్నది. పరిషత్తు పక్షమున సంవత్సరమునకు రెండుపర్యాయములు జరుగు
పరీక్షలలో ఒక్కొక్క పరీక్ష యందు ఆరువేల మంది అభ్యర్థులు పాల్గొనుచున్నారని
చెప్పినచో, పరిషత్తు పరీక్షలు తెలంగాణ జిల్లాలలోని రెండువందల కేంద్రాలయందు
జరుగుచున్నవని చెప్పినచో, పరిషత్తుకు నేడు రెండువందల శాఖలు కలవని చెప్పినచో,
యీ ఉద్యమస్వరూపము మీరు కొంత ఊహించవచ్చును.
ఈ విధముగా తెలంగాణమున గత దశాబ్దమున ఒక మహోద్యమము ప్రారంభమై
వ్యాపించుచున్నది. యువకులు నూతన రచనల ద్వారా తెలుగు సరస్వతిని
ఆరాధించుచున్నారు. పెద్దలు విజ్ఞాన వాజ్మయ ప్రకటనకై కృషిజేయుచు యువకులను
181
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
ప్రోత్సహించుచున్నారు. ఈ కాలమున వాజ్మయసేవకు కటిబద్భులైన యువకులలో
కవులు, కథకులు, వ్యాసకర్తలు గ్రంథకర్తలు అనేకులు కలరు.
ఈనాటి కవులలో పేరెన్నిక గన్నవారు శ్రీ వానమామలై వరదాచార్యులవారు.
వీరిది విద్వత్మవి కుటుంబము. తండ్రిగారు గొప్పపండితులు, శాస్త్రవేత్తలు,
సోదరులందరు పండితకవులు. శ్రీ వరదాచార్యులవారు తమ కావ్యపఠనము ద్వారా
ఎన్ని వేల మందిగల సభనైనను రంజింపజేయగలరు. మధురమైన వారి కవిత్వమునకు
శ్రావ్యమైన కంఠము వన్నె పెట్టుచున్నది. వీరి ఖండ కావ్యములు “మణిమాల” యను
గ్రంథరూపమున ప్రకటితములైనవి - పోతన మహాకావ్యమును వీరు ఇటీవలనే
రచించియున్నారు. ఈ గ్రంథము ్రకటితమైనచో, ఆధునికాంధ్ర వాజ్మయములో
దీనికొక ఉత్కృష్ట స్థానము లభించగలదు.
దాశరథి కృష్ణమాచార్యులు యువకవి-కవిత్వములో యీయన పోగలిగినన్ని
పోకడలు పోగలవారు ఆంధ్ర దేశములోనే మిక్కిలి తక్కువయని చెప్పవచ్చును.
యువకుడైన యీయనకు ఉజ్వలమైన సారస్వత భవిష్యత్తుకలదు. అభ్యుదయ
కవులలోనే గాక పండిత కవులలో కూడ దాశరథికి ప్రత్యేక స్థానముకలదు- “అగ్నిధార
“రుద్రవీణ'యను రెండు ఖండకావ్య సంపుటములు యీయన ప్రకటించియున్నారు.
బెల్లంకొండ చంద్రమౌళిశాస్తి బహుముఖాలుగా లేఖినీ విన్యాసము చేయగలదక్షుడు.
కవిత్వము, కథానిక రచన, ఏకాంకికారచన మొదలైన వివిధ వాజ్మయ వీధులలో
యీయన విహరించుచున్నారు. ఈ సందర్భమున చండూరు ప్రాంతమునందలి సాహితీ
మేఖలవారి కృషి ప్రత్యేక ప్రశంసనీయము. ఈ సాహితీమేఖల కవులందరు
యువకులు. నిండు జవ్వనమున నున్నవారు. సంస్కృతాంధ్రములలోనేగాక
ఆంగ్లభాషలో కూడ మంచి పరిచయము కలిగినవారు. ఈ కవులలో శ్రీ పులిజాల
హనుమంతరావు, ధవళా శ్రీనివాసరావు, సిరిప్రగడ భార్గవరావు ప్రత్యేకముగా
సంస్మరణీయులు. “గుమ్మ పాలల్లోని గోరెచ్చదనము, అరటిపూవులలోని అందంపుసిగ్గు,
బీరపూవులవోలెవిచ్చు భావాలు, పరుగెత్తు పినలేడి పరువంపుశైలి”, వీరి కవితాకాంతకు
అత్యంత ప్రియమగు సామగ్రి. శ్రీమతి సోమరాజు ఇందుమతీ దేవిని యీ కాలమున
కృషిచేసిన కవయిత్రులలో పేర్కొనవలసియున్నది. సుకుమార భావ పుష్పాలను లలిత
పదసూత్రములో సుందరహారముగా యేరికూర్చుటలో యీమెకు ప్రత్యేకవిన్నాణము
గలదు. ప్రేయసిని గూర్చి ప్రియుల భావాలను ప్రకటించుకవిత్వము మన
ఆంధ్రవాజ్మయమున సమృద్ధముగా గలదు. కాని ప్రియుని గూర్చి ప్రేయసి భావాలను
182
సారస్వత నవనీతము
చిత్రించు కవిత్వములేని కొరతను శ్రీమతి ఇందుమతిదేవి తీర్చినదని చెప్పవచ్చును.
శ్రీకప్పగంతుల లక్ష్మణశాస్తి, శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి, పెరవలి
లింగయ్యశాస్త్రి, విద్వత్మవీశ్వరులు. గడియారము రామకృష్ణశర్మ చరిత్ర పరిశోధకులే
గాక చక్కని కవిత్వము వ్రాసిన సారస్వతోపాసకులు.
ప్రగతి సాహిత్యము
నెల్లుట్ల రామకృష్ణకవి ఓరుగల్లు ప్రాంతీయుడు. మూర్తీభవించిన ఆవేశము
యీయన కవిత్వము. ఈయనలో స్వకులాభిమానము హెచ్చు. ఆంధ్రభారతి మా
యింటి ఆడుబిడ్డ యని యీయన చెప్పుకొనినాడు. ఖండకావ్య రచనలలో యయన
అందెవేసిన చేయి. ఈయన కవిత్వమున భావాలు హృదయమునుండి సూటిగా
దూసికొని వచ్చుచుండును. 'నీ కొదమ కవిత్వము వాజ్మయ మదవతికి విభూషణంబు
మధురకవీశి అని యీాయనను శ్రీ జాషువగారు ప్రస్తుతించి యున్నారు. ఈయన
సూరబాల కావ్యమును సమీక్షించుచు పురాతనాధునాతన కవీశ్వరులకు మధ్యవర్తి
యనదగిన సాహిత్యవేత్త ఈయన యని గోలకొండ పత్రిక” అభిప్రాయబడినది.
ఈ కాలమున గేయరచన యిక్కడి యువకులను యెక్కువగా ఆకర్షించినది -
ఈ గేయకవులలో దాశరథికి సమున్నతస్థానము గలదు. కాళోజి నారాయణరావు ఈ
గేయకవులలో అగ్రతాంబూలమునకు అర్హుడు. కాళోజి రాజకీయరంగమున ప్రథమ
ఢ్రేణిలో నిలిచి అనేక పర్యాయములు శ్రీకృష్ణ జన్మస్థానము నలంకరించిన దేశభక్తుడు.
ఈయన హృదయమునకు సమ్మెటపోటైన ఒక్కొక్క రాజకీయ సంఘటన ఈయన
కలమునుండి ఒక్కొక్క గేయముగా వెలువడినది. రసవిహీనములై ఎవరికిని చేపని
యెండినచనులగు రాజకీయాలు ఈయన కలమునుండి సుధాధారలను
ప్రవహింపజేసినవి. నల్లగొండలో చెలరేగిన నాజీశక్తుల నగ్ననృత్యమును గూర్చి
ఈయన వ్రాసిన గేయము తెలంగాణ జిల్లాలోని ప్రజాసామాన్యమును ఆకర్షించి,
పొలాలలో పనిచేయు కార్మికుల రసనాగ్రములమీద తాండవించినది. ఈయన కవితలో
ఒక ప్రత్యేకమైన ఉక్తివైచిత్యము, భావోద్రేకము ప్రస్ఫుటముగా గోచరమగుచుండును.
“యుద్ధము మూలమున చెలామణులకు ఉబ్బులరోగము వచ్చినది.” ఇట్టివి
ఉక్తివైచిత్యమునకు నిదర్శనము. కాళోజి సహజకవి; ప్రజాకవి; అంతేకాదు, ఈయన
కథకుడు గూడ. లంకాపునరుద్ధరణ అను యీయనకథ వ్యంగ్య విమర్శద్వారా
సమకాలిక పరిపాలనా విధానమును బాగుగా తూర్పారబట్టినది. ఈ గేయ కవులలో
183
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
వెల్టుర్తి మాణిక్యరావు కొక ప్రత్యేక స్థానముగలదు. ఈయన బాలవాజ్మయ
నిర్మాణమందు గూడ దక్షుడు. వెల్టుర్తి, కాళోజి కవులలో అనేకమైన పోలికలుగలవు.
పొట్లపల్లి రామారావు ఈయుగము నందలి కవులలోను, కథకులలోను విశిష్టస్థానము
నాక్రమించుచున్న వ్యక్తి. ఈయన కథలు, గేయాలు అనేక పత్రికలలో ప్రకటితమైనవి.
ఈయన రచనలందు హృదయావేదన, ఉద్రేకము ప్రముఖముగా గన్పట్టుచుండును.
ఈయన వ్రాసిన సైనికుని జాబులు మన వాజ్మయములో ఒక క్రొత్త రకమైన రచన.
ఆధునిక లేఖావాజ్మయమునకు మేలి అలంకారము. ఈనాటికవులలో శ్రీ పల్లాదుర్ణయ్య,
శ్రీ ఊటుకూరి రంగారావు, శ్రీ చిల్లర భావనారాయణరావు, శ్రీ భాగి నారాయణమూర్తి,
శ్రీ బి.రామరాజు, శ్రీ భూపాలరావు, శ్రీ రాఘవచార్యులు, శ్రీ పి.వి.నరసింహారావు,
శ్రీమతి పర్ఫా జానకీదేవి, శ్రీ అడ్లూరి అయోధ్యరామకవి, శ్రీగార్లపాటి రాఘవరెడ్డి,
శ్రీ పాములపర్తి సదాశివరావు, శ్రీ రామగోపాలరావు, శ్రీ నెల్లుట్ల వేంకటేశ్వరరావు,
శ్రీ దేవులపల్లి వేంకటేశ్వరరావు, శ్రీ మూటుకూరి వేంకటేశ్వరరావు, శ్రీ గవ్వా
మురహరిరెడ్డి మొదలైనవారు ప్రత్యేకముగా ప్రశంసనీయులు.
చిన్న కథలు
ఈ కాలము యువకులనేకులు కథానికను ఉపాసించిరి. వారిలో శ్రీ భాస్మర
భట్ల కృష్ణారావు అనేక కథలను వ్రాసి యావదాంధ్ర ప్రఖ్యాతిని పొందిన యువకుడు.
ఈయన వ్రాసిన కథలు కొన్ని వందలకు పైగా నుండును. కమ్మని వ్యావహారిక
భాషలో కథానికను ఒక కళాఖండముగ దిద్దితీర్చు నేర్చు యాయన కలమునకు
గలదు. శ్రీ పొట్లపల్లి రామారావుకథలు, సామాన్యజనుల జీవితమునందలి
ఒడుదుడుకులను నిమ్నోన్నతములను, సమాజమందలి అన్యాయములను చిత్రించుచు
సాంఘికాభ్యుదయమును ప్రబోధించుచున్నవి. పొట్లపల్లి, భాస్మరభట్లలు తెలంగాణ
కథానిక సాహిత్య గగనమున దేదీష్యముగా వెలుగుచున్న తారలు. ధరణికోట
- శ్రీనివాసులు సాంసారిక సంఘటనలు రమ్యముగా చిత్రించు నేర్పుగల కథకుడు.
ఈయనకు శ్రీ మునిమాణిక్యము భావనా గురువని చెప్పవచ్చును. బూర్గుల
రంగనాథరావు సుప్రసిద్ధకవి; కథకుడు - సారస్వతోపాసకుడు, ఈయన కథలు
“వాహ్యాళ” అను సంపుట రూపమున వెలువడినవి. మధ్యతరగతి కుటుంబాలలో
దైనందిన సంఘటనలను తెలంగాణ వ్యావహారిక భాషలో మనోహరముగ తన
కథలయందు యీయన చిత్రించినాడు. భాగి నారాయణమూర్తి గేయ కవియే గాక
మంచి కథకుడుగూడ. సుప్రసిద్ధ కథకులైన నందగిరి వేంకటరావుగారి ధర్మపత్ని
184
సారస్వత నవనీతము
శ్రీమతి నందగిరి ఇందిరాదేవి తమ రచనల ద్వారా సకలాంధ్ర కథకులలో ఒక
ఉన్నతస్థానము నాక్రమించుచున్నది. కొంచెము ఆలస్యముగా సారస్వత జీవనము
ప్రారంభించి నప్పటికిని ఉత్తమ కథకులలో చేరదగిన సోదరీమణి శ్రీమతి ఇల్లిందల
సరస్వతీదేవి. ఈ మధ్యనే యాయమ కథలు “పండుగ బహుమాన”మను పేరుతో
ప్రకటింపబడినవి. తెలంగాణ కథకులలో శ్రీమతి భారతీ రత్నాకరాంబ, నెల్లూరి
కేశవస్వామి, ఇటికాల నీలకంఠరావు, వెల్టుర్తి మాణిక్యరావు, తా-రా-స్వామి, మానేపల్లి
తాతాచారి మొదలైనవారిని యిక్కడ పేర్కొనవలసి యున్నది.
వ్యాసములు
ఈ కాలమున వ్యాసరచనకు యెక్కవ ప్రాముఖ్యత కలదు. ఏ విషయమును
గూర్చియైనను చక్కగా అరటిపండొలచి చేతికిచ్చినట్లు వివరించి చెప్పగల విద్యార్ధులైన
వ్యాసకర్తలు అనేకులు ముందుకు వచ్చినారు. వీరిలో గోలకొండ సంపాదకులు
శ్రీనరోత్తమరెడ్డి, ప్రగతి సంపాదకులు చంద్రమౌళీశ్వరరావు, పులిజాల హనుమంతరావు,
కేశవపంతుల నరసింహశాస్త్రి, రాపోలు లలితాదేవి, యల్లాప్రగడ సీతాకుమారి,
నందగిరి ఇందిరాదేవి, కోదాటి సోదరులు, బి. వి. రమణారావు, డి.వి.జి. కృష్ణమూర్తి,
గొబ్బూరి రామచంద్రరావు, గొట్టుముక్కల కృష్ణమూర్తి మొదలయినవారు ముఖ్యులు.
ఉన్నతోద్యోగమునుండి ప్రభుత్వ కార్యనిర్వాహణలో తీరిక లేకపోయినప్పటికి
తెలుగుతల్లి కొలువును మరువనివారు శ్రీపర్సా వేంకటేశ్వరరావుగారు. వీరు ప్రస్తుతము
ఆంధ్రసారస్వత పరిషత్తు అధ్యక్షులు, యువకులు, బి.ఏ. ఎల్. ఎల్‌బి. పట్టభద్రులు.
అనేక సారస్వత సంస్థలకు సహాయ మొనర్చిన ఉదారులు; రసికులు; స్వయముగా
సారస్వతోపాసకులు, నేటి తెలుగు వ్యాసరచయితలలో వీరి కొక ప్రత్యేక విశిష్టస్థానము
కలదు. ఇటీవల వీరు 'మన రాజ్యాంగము” అను పుస్తకము వ్రాసినారు.
వివిధ కళలు
నాట్యకళ, చిత్రకళ, మొదలైన రంగాలలో కూడ యీ కాలమున విశేష కృషి
జరిగినది. హైద్రాబాదులోని నాట్యకళా పరిషత్తు, ఓరుగల్లులోని కాకతీయ కళాసమితి,
ఖమ్మం, సూర్యాపేట పట్టణాలలోని కళాసమితులు తమ ప్రదర్శనల ద్వారా కళోపాసన
గావించినవి. ఈ కాలమున చిత్రకళయందు ప్రత్యేక నైపుణ్యము పై వర్ణించిన వానిలో
శ్రీమతి సంగెం లక్ష్మీబాయమ్మను పేర్మొనవలసి యున్నది. ఈయమ చిత్రకారిణియే
185
డా॥ దేవులపల్లి రామానుజరావు (గ్రంథావళి
గాక మంచి కథలను వ్రాయనేర్చిరి గూడ. సాహిత్యమును, చిత్రకళను విడిచి
రాజకీయాలలో యీమె ప్రవేశించుట దురదృష్టము.
కొండవల్లి శేషగిరిరావు యీనాటి చిత్రకారులలో అగ్రగణ్యుడు.
గోపాలరాజుభట్టు, వినయకుమారువంటి యువకులు చిత్రకళను, నాట్యకళను
ఉపాసించుచు వ్యంగ్య చిత్రరచనలో నిపుణులుగా 'ప్రసిద్ధిగాంచినారు. గడియారం
రామకృష్ణశర్మ, కె.వి.భూపాల్‌రావు, వీరభద్రయ్య ప్రభృతులగు యువకులు చరిత్ర
పరిశోధనకు తమ అమూల్యమగు కాలమును వినియోగించుచు కాలగర్భమున
దాగియున్న అనేక నూతనాంశములను వెల్లడి చేయుచున్నారు.
రాష్ట్రేతర కవిపండితుల సేవ
తెలంగానమువారు గాకపోయినప్పటికిని ఇక్కడనే స్థిరనివాసము కల్పించుకొని
సాపాత్యసేవ జేనిన విద్వాంనులను, కవుల కొందరిని యిచ్చట
ప్రశంసించవలసియున్నది. సుప్రసిద్ధ కవులగు శ్రీరాయప్రోలు సుబ్బారావుగారు తన
సారస్వత కృషిని హైద్రాబాదు నుండి జరిపినారు. ఆచార్య శ్రీ కురుగంటి
సీతారామయ్యగారి అనేక గ్రంథములు హైదరాబాదు నుండియే ప్రకటితములైనవి.
శ్రీ సన్నిధానము సూర్యనారాయణ శాగస్తులవారి సారస్వత కృషి యంతయు
హైద్రాబాదు నందే జరిగినది. నరసభూపాలీయ వివరణము, తత్సమ చంద్రిక,
ఖండకావ్యములు, వచనరచనలను, శ్రీ సన్నిధానమువారు యిక్కడ నుండియే
ప్రకటించిరి. శ్రీ బిదురు శేషయ్యగారు హైద్రాబాదులో అనేక సారస్వత సంస్థలకు
కార్యదర్శిగా ప్రశంసనీయమగు సేవజేసిరి. శ్రీ చలమచర్ల రంగాచార్యులవారి సారస్వత
కృషికి తెలంగాణమే కేంద్రమైనది. వారి ప్రతాపరుద్రదీయ అనువాదము, పోతన
నాటకము” హైద్రాబాదు నుండియే ప్రకటి తములైనవి. శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనము,
బాలేందు శేఖరము సోదరులు, తెలంగాణ దేశీయులలో లీనమై బహుగ్రంథములను
వ్రాని ఆంధ్రభాషా దేవిని ఆరాధించుచున్నారు. కీర్తిశేషులైన అచ్యుతుని
వెంకటాచలపతిరావు గారి “అంపశయ్య” మొదలైన నాటకాలు యిక్కడనుండియే
వెలువడినవి.
పండితులు, కవులు, విమర్శకులు, కథకులు అయిన శ్రీ అంబటిపూడి
వెంకటరత్నముగారు తెలంగాణమునకు పెంపుడు కొడుకు. ఆయన చండూరు
ప్రాంతములో చేసిన సారస్వత సేవ ప్రశంసనీయమైనది. అనేక యువకులను
186
సారస్వత నవనీతము
సాహిత్యరంగమునకు తీసుకొనివచ్చి వారిని కవులనుగా జేసిన గౌరవము శ్రీ
అంబటిపూడి వారికి చెందుచున్నది. శేషాద్రి రమణకవులలో ఒకడైన శ్రీ దూపాటి
వేంకట రమణాచార్యులువారు తమ సాహిత్య జీవనమును పూర్తిగా తెలంగాణమునకే
అంకితము గావించిరి. జిల్లాలలో తాళపత్ర గ్రంథములను శాసనాలను అన్వేషించి,
పరిశోధించి, బహు ప్రయాసకు గురియై తెలంగాణమునకు వీరు ప్రశంసనీయమైన
సేవ జేసినారు.
ఈ కాలమున సాహిత్యకృషి విరివిగా జరిగినది. ఆంధ్ర సారస్వతపరిషత్తు
తెలుగుతల్లి సందేశమును పల్లెపల్లెలకు వాడవాడలకు తీసుకొనిపోవుచున్నది. ఈ
దశాబ్దమున 'గోలకొండి దినపత్రిక యైనది, “శోభ ఓరుగల్లునుండి వెలువడి
యువరచయితల రచనలకు స్వాగతమిచ్చినది. తెలంగాణ ప్రజాపోరాటమున
విజయవాడనుండి వెలువడిన 'సారథి” పోలీసుచర్య తరువాత కూడ కొంత కాలము
హైద్రాబాదు నుండి వెలువడి సారస్వతోద్యమునకు మంచి చేయూత నిచ్చినది.
పోలీసుచర్య తరువాత కాకతీయ, ప్రగతి, భాగ్యనగర్, జనశక్తి మొదలైన పత్రికలు
యువకుల సంపాదకత్వమున వెలువడుచు సాహిత్యోద్యమ వనమున క్రొత్తపాదులను
నిర్మించుచున్నవి. పండితులు పరిశోధకులు, కవులు నగు గడియారము రామకృష్ణశర్మ
గారు సుజాతను పునరుద్ధరించి ప్రశంసనీయముగా భాషాసేవ జేయుచున్నారు.
ఈ విధముగ తెలంగాణమున అర్ధశతాబ్దము నుండియు ప్రాచీన, నవీన కావ్య
పద్ధతులలో రచనలు సాగినవి. చిన్నకథలు, నాటకములు, వ్యాసములు, విమర్శలు,
పరిశోధనములు వృద్ధినొందినవి. పత్రికలు, (గ్రంథమాలలు, సారస్వతసంస్థలు
ప్రారంభింపబడి మహోన్నత సారస్వతోద్యమమును నిర్వహించుచున్నవి. ఆలస్యముగ
ప్రబుద్ధమైనను తెలంగాణము చక్కని చిక్కని నడకతో నిర్మాణాత్మక దృష్టితో ముందుకు
సాగుచు సాటిసోదరులచే గౌరవింపబడు ఉత్తమస్థాయి నందుకొనుచున్నది.
187
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
ఓరుగల్లు మండలమున సారస్వత సేవ
తెనుగు సారస్వతము ముత్యాల పంట పండిన తేనె మాగాణము తెలంగాణము.
తెలంగాణమునకు ఆయువుపట్టు ఓరుగల్లు మండలమని చెప్పవచ్చును. ఓరుగల్లు
చరిత్ర పరిశోధకులకే కాదు, సారస్వత పిపాసువులకును, శిల్పవిద్యాప్రవీణులకును
తీర్థయాత్రాస్థలము. ఏకశిలా నగరమునందు అంధ్ర పౌరుషము, ఆంధ్రసారస్వతము,
ఆంధ్ర శిల్పము అను మూడు నదులు కలిసి త్రివేణీ సంగమమైనది. ప్రపంచములోని
మహారాణి మణులందు సర్వవిధముల నగ్రగణ్యురాలై సామ్రాజ్య చక్రము నవలీలగా
నరచేత ద్రిప్పిన రుద్రమదేవి యోరుగంటి ఆడుబిడ్డయే. మార్కొపోలోవంటి విదేశ
యాత్రికుని దిగ్రాంతమొనరించినది యీమె పరిపాలించిన యాంధ్రనగరము యొక్క
వైభవము. ఉత్తమ శిల్పమున కునికిపట్టులగు సౌధములచే నలరారిన ఆ విశాల
రాజవీధులు, శత్రురాజులకు దుర్భేద్యమగు ఆ దుర్గము ఆ 'నాడు” ఆంధ్రోర్వీశు
మోసాలపై మోసిన ఘంటా రుణత్మారములు, ఆ పూటకూటింటిలోని కప్పురభోగి
వంటకము, కమ్మని గోధుమపిండి వంటయును, ఆ చిత్రశాలలు ఏకశిలానగర
నాగరక జీవితమునకు ప్రతిబింబములై నేటికిని క్రీడాభిరామమున అక్షరరూపముతో
శోభిల్లుచున్నవి. ఇట్లు ఆంధ్రదేశమునకు, ఆంధ్ర సంస్కృతికి కేంద్రస్థానమై విలసిల్లిన
ఓరుగల్లునందు జరిగిన సారస్వత కృషి ప్రకాశవంతమగుటలో ఆశ్చర్యములేదు.
ఆంధ్ర సారస్వతమున ఉత్తమోత్తమములగు గ్రంథములు మూడు. వీనిలో
రెండింటికి జన్మస్థానము ఓరుగల్లు. మూడవదానిలో ముఖ్యభాగము ప్రకాశమైనది
ఆనాటి కాకతీయచక్రవర్తి సభామంటపమునందు తిక్కనార్యుడు గణపతిదేవుని
నిండోలగమున తన మహాభారతమును కావ్యగాన మొనరించినాడు. భాస్కర
రామాయణ (గ్రంథకర్తలగు భాస్మరుడు మల్లికార్డునభట్టు కుమార రుద్రదేవుడు
అయ్యలార్యుడు 1300 సంవత్సర ప్రాంతమున ఏకశిలానగర పరిసరము లందు
నివసించి భాషాసేవగావించినారు. ఇంక ఆంధ్రులపాలిటి పారిజాతమగు
పోతనామాత్యునికి కాపురమై యొప్పినదీ యోరుగల్లే యను విషయము జగత్ర్రసిద్ధము.
ఇంచుమించు భాస్మర రామాయణరచనా కాలమునందే అనగా 1300 సంవత్సర
ప్రాంతముననే ఓరుగల్లునందు మారన మహాకవి మార్మండేయ పురాణమును
ఆంధ్రభారతి కర్పించినాడు. మార్మండేయ పురాణము ఆంధ్ర సారస్వతమున
188
సారస్వత నవనీతము
ఉత్తమశ్రేణికి జెంది సారస్వతోపాసకు లవశ్యముగా పఠింపదగిన గ్రంథము. అల్లసాని
పెద్దనార్యుని మనుచరిత్రమునకు ఆధారమైనది యీ మార్కండేయ
పురాణాంతర్గతమగు గాథయే. పెద్దన మారనను మక్కికి మక్కిగా అనుకరించినట్లు
మనుచరిత్రమునందు నిదర్శనములు కలవు.
లలితకళలను గురించి పరిశ్రమ సల్పి గ్రంథరచన గావించిన జాయప సేనాని
కాకతీయ రాజులకు సేనానాయకుడుగా నుండెను. ఈయన రచించిన గ్రంథము
నృత్తరత్నాకరము. కాలము 1750 ప్రాంతము. సుప్రసిద్ధ అలంకార శాస్త్రమగు
ప్రతాపరుద్ర యశోభూషణ కృతికర్తయగు విద్యానాధుడు ఆంధ్రనగరమునందు
కాకతీయ రాజుల యాస్థానమును 1300 ప్రాంత మలంకరించినాడు. అలంకార
శాస్త్రమును రచించిన యాంధ్రులలో ప్రథముడు విద్యానాథుడగుటయే కాక తత్కృతి
భర్తయును, ఆంధ్రప్రభువగుట పేర్కొనదగిన విశేషము.
సాధారణముగా రాజులు కృతిభర్తలే కాని కృతికర్తలగుట యరుదు. హాలుని
తరువాత కృతికర్తయెన ఆంధ్రప్రభువు 1272 ప్రాంతమున కాకతీయ సామ్రాజ్యమున
కధిపతియెన రుద్రదేవచక్రవర్తి. ఈయన హనుమకొండలో నీతిసారమను గ్రంథమును
రచించినాడు. ఈ కాకతీయరాజధానియందే గణపతి దేవునకు ప్రధానిగా నుండిన
మహా మేధావియగు శివదేవయ్య (1250-1320) పురుషార్థసారమను గ్రంథమును
రచించియున్నాడు. (ప్రేమాభిరామమను (గ్రంథమును వ్రాసిన రావిపాటి
త్రిపురాంతకుడు 1300 ప్రాంతమున ఓరుగల్లునందు నివసించియుందెను. ప్రస్తుతము
మనకీ (ప్రేమాభిరామము లభ్యముకాదు. ఇది కాకతీయుల రాజధానీ నగర
వర్ణనాదులకు సంబంధించిన సంస్కృత గ్రంథము. క్రీడా భిరామమను తెనుగు
(గ్రంథమునకు మాతృక (ప్రేమాభిరామము. 1300 సంవత్సర (ప్రాంతమున
అగస్తుడను నొక కవీశ్వరుడు (ఇతడే విద్యానాథ కవియట) నలకీర్తి కౌముది,
బాలభారతమను గ్రంథములను, మరియు చక్రపాణి రంగనాధుడు 1280 సంవత్సర
ప్రాంతమున నయనగతి రగడ మున్నగు గ్రంథములను రచించి యున్నారు.
సాహిత్యము ప్రజలకొరకను సత్యమును గ్రహించి జాను తెనుంగున, ప్రజా
సాహిత్యమునకు మిక్కిలి యనుకూలమగు ద్విపద రూపమున బసవపురాణమును
రచించిన పాలకుర్తి సోమనాథకవి ఓరుగల్లు మండలమునందే 1150 ప్రాంతమున
తన కలమునకు స్వైర విహారము సమకూర్చినాడు. శైవవాజ్మయమునకు
189
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
జన్మస్థానము, ఆటపట్టు ఓరుగల్లని చెప్పవచ్చును. ద్విపద వాజ్మయమునకును
జన్మస్థానము ఓరుగల్లే. 1260 (ప్రాంతమున శివతత్వసారము వ్రాసిన మల్లికార్జున
పండితారాధ్యులు, 1500 ప్రాంతమున బసవపురాణమను పద్యకావ్యమును, ప్రభు
లింగలీలయు వ్రాసిన పిడుపర్తి సోమనాథుడు, 1470 ప్రాంతమున సిద్ధేశ్వర చరిత్రను
ద్విపద గ్రంథమును వ్రాసిన కాసె సర్వప్పయు, 1550 ప్రాంతమున బసవపురాణమును
వ్రాసిన పిడుపర్తి బసవప్పయు, 1480 ప్రాంతమున వీరశైవ దీక్షాబోధ బ్రహ్మోత్తర
ఖండములను వ్రానిన విడువర్తి బనవకవియు, 1200 ప్రాంతమున
శివతత్వరసాయనము వ్రాసిన విశ్వేశ్వర శివదేశికులు మున్నగువారందరును
ఏకశిలానగర ప్రాంతీయులే. ఈ విధముగా పైన పేర్కొనబడిన శతాబ్ధములు ఓరుగల్లు
సారస్వత చరిత్రమున, కాదు, ఆంధ్ర సారస్వత చరిత్రముననే సువర్ణయుగమని
చెప్పవచ్చును.
ఓరుగల్లు ప్రాంతమునందు శివకవులతోపాటు వైష్ణవ కవులును బయలుదేరి
వైష్ణవ వాజ్మయ ప్రచారము గావించియున్నారు. 1700 ప్రాంతమున ఓరుగల్లు
సమీపముగానున్న వరదన్నపేటలో రామానుజాచార్యులను వైష్ణవుడు ముముక్షుజన
కల్పకమును, తత్వార్థ దర్చణమను ద్విపద గ్రంథమును రచించినాడు. సుమారు
170 సంవత్సరముల క్రింద అచ్చి లక్ష్మణాచార్యులను కవి మరియొక ముముక్షు
జనకల్పకము వ్రాసియున్నాడు. సుమారు 360 సంవత్సముల క్రింద తిరునగరి
వెంకటాచార్యులు యతిరాజవింశతి యను గ్రంథమును రచించినాడు. ఇప్పటికిని
ఓరుగల్లు మండలమునందు కవితాపాటవము గల వైష్ణవు లనేకులున్నారు. వీరి
గృహములందు వీరి పూర్వులచే రచింపబడిన పెక్కు గ్రంథములు కలవు. ఎవరు
వ్రాసిరో తెలియని మేలుకొలుపులు మంగళహారతులు ఓరుగల్లు మండలమున
'సేకరింపవలసినవి నేడు సమృద్దముగా కలవు.
1700 సంవత్సర ప్రాంతమున ఏకామ్రనాథుడను పండితుడు ద్వాత్రింశత్సాల
భంజికలను గ్రంథముతోపాటు ప్రతావ చరిత్రమను వచనగ్రంథమును
బ్రాసియున్నాడు. ఈయన ఓరుగల్లు నివాసి. ఈ గ్రంథమే ఆంధ్రభాషలో మొదటి
వచనగ్రంథమేమో? అట్లే యగుచో మన వచన సారస్వతమునకు పునాదివేసిన
గౌరవము ఓరుగల్లునకే యాయవలసి యుండును. ఈ పదునేడవ శతాబ్దముననే
కేసన మల్లనలు దాక్షాయణీ పరిణయము విష్ణు భజనానందము అను రెండు
గ్రంథములను రచించియున్నారు.
190
సారస్వత నవనీతము
తరువాత ఓరుగల్లులో నెన్నదగిన సారస్వత కృషిగావించిన వారు పరశురామ
పంతులవారు. వీరిలో పశురామపంతుల అనంతరామకవి 1830 సంవత్సర
ప్రాంతమున హనుమద్విజయము అను గ్రంథమునకు కర్తృత్వము వహించెను.
రమారమి 130 సంవత్సరముల క్రితం పరశురామ పంతుల రామమూర్తి
సీతారామాంజనేయము అను యక్షగానమును విరచించియున్నాడు. సుమారొక
నూటాయరువది సంవత్సముల క్రింద పరశురామపంతుల లింగమూర్తి యను పండిత
'ప్రకాండుడు సీతారామాంజనేయ మను గొప్ప ఆధ్యాత్మిక గ్రంథమును
బ్రాసియున్నాడు. కళాదృష్టితోగాక ఆధ్మాతిక దృష్టితో జూచిన సీతారామాంజనేయము
భారతముతో తులదూగుచుండును. మొత్తముమీద సీతారామాంజనేయము మరొక
యుద్ధంథమని చెప్పవచ్చును. ఈ పశురామపంతులవారి వంశీకులు నేటికిని
ఓరుగల్లున నివసించుచున్నారు.
గత శతాబ్దాంతమున ఓరుగల్లు పట్టణమునందు తూము రామదాసను నొక
పండిత కవి నిర్వచన మిత్రవిందోద్వాహాది గ్రంథములను రచించుటయేగాక ఆంధ్ర
పదనిధాన మను నొక నిఘంటువును కూడ రచించియున్నాడు. ఈ నిఘంటువును
శ్రీ శేషాద్రిరమణ కవులు సంపాదకులుగా కొంతకాలము ఓరుగల్లునందు భాషాసేవ
గావించిన కాకతీయ గ్రంథమాలవారు ప్రకటించియున్నారు. ఈ రామదాస కవి
వంశీకులు నేడును వరంగలునందు నివసించియున్నారు. ఇంకను ఓరుగల్లు
ప్రాంతమునందు భాషాసేవ గావించిన పూర్వకవులలో హరిశ్చంద్ర యను
ద్విపదగ్రంధమును వ్రాసిన వెన్నలకంటి చంద్రశేఖర కవియును, ప్రజాభ్యుదయకర్త
యగు నెల్లుట్ల నారాయణకవియు, వెలిగందల నారయ, హరిభట్టు మున్నగువారు
ప్రత్యేకముగా ప్రశంసనీయులు.
ఆధునిక కాలమున జాతీయ పునర్వికాసముతోపాటు సారస్వత పునరుజ్జీవనము
కూడ మనదేశమున జరిగినది. వీరేశలింగ ప్రభృతులగు మహానీయులు మన భాషలో
(గ్రొత్త రచనారీతులను ప్రవేశపెట్టినారు. పత్రిక లవతరించి వాజయమునకు బహుళ
ప్రచార మొసంగినవి. ఈ విధముగా నొక క్రొత్తదనము సారస్వత ప్రపంచము
నావరించినది. ఈ నవ్యతా ప్రభావము నుండి ఓరుగల్లు మండల మెట్లు
తప్పించుకొనును?
191
దా దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
నేటి షష్టిపూర్యుత్సవ సందర్భమున నిజాం రాష్ర్రాంధ్రుల జోహారుల
నందుకొనుచున్న శ్రీ మాడపాటి హనుమంతరావుగారు ఓరుగల్లు వాసులు. కొంత
కాలము ఓరుగల్లునందు కాపురముండి గ్రంథాలయోద్యమాది రూపముగా ప్రజాసేవ
గావించినారు. కావున ఆంధ్ర పితామహుల సారస్వత కృషి కొంత ఓరుగల్లునందు
జరిగి యుండుట నిస్సంశయము. హనుమంతరావుగారు తెనుగులో చిన్న కథలను
వ్రాసిన ప్రథములలో నొక్కరని చెప్పవచ్చును. మున్నీ ప్రేమచంద్రుని కధలను
మనోహరమగు సులభశైలిలో ఆంధ్రీకరించి వీరు భాషాసేవ గావించినారు.
హనుమంతరావుగారు తెనుగులో చక్కని వ్యాసకర్తలు. వీరి వేషభాషలవలె శైలియును
ఆడంబర రహితమైనది.
శ్రీ మాడపాటి హనుమంతరావుగారికి సమకాలికులై నిజాం రాష్ట్రమునందలి
ఆంధ్రుల యభ్యుదయమునకై అపారమగు 'సేవ గావించిన శ్రీ ఆదిరాజు వీరభద్రరావు
గారికిని జన్మస్థాన మీ యేకశిలా నగరప్రాంతమే. మనరాష్ట్రమునందు కీర్తిని కాంక్షింపక
సేవయే ప్రధానముగా భావించినవారిలో శ్రీ వీరభద్రరావుగా రగ్రగణ్యులు.
శ్రీకృష్ణదేవరా యాంధ్రభాషా నిలయము యొక్క పెంపుసొంపులకు ఆధారభూతులైన
పెద్దలలో వీరొక్కరు. నిలయపు రజతోత్సవ సంచికకు వీరు సంపాదకులై సంచికను
సర్వాంగ సుందరముగను, విజ్ఞాన దాయకముగను సిద్ధము గావించినారు.
లక్ష్మణరాయ పరిశోధకమండలికి కార్యదర్శులై, పెక్కు శాసన విషయములను
బహిరంగ పరచినారు. ఇంకను చరిత్రాత్మకములు, భాషా విషయకములును. విజ్ఞాన
దాయకములునగు వ్యాస రచయితలందొక విశిష్టమగు స్థానము నాక్రమించి
యున్నారు. నేడు నిజాం రాష్ర్రాంధ్రమునందలి చారిత్రక ప్రదేశములు, చరిత్ర
పరిశోధన, భాషావ్యవసాయము, ఇంతయేల ఆంధ్రోధ్యమము యొక్క యే విషయమును
గురించియైనను సమగ్ర విజ్ఞానము గలిగినవారు శ్రీ వీరభద్రరావుగారనుటలో నెట్టి
అతిశయోక్తియునులేదు. వీరు ప్రచ్చన్నముగా జేసిన భాషాసేవ యెంతయో కలదు.
నిజాం రాష్ట్రమున ప్రథమ ఆంధ్ర పత్రికలు నీలగిరి, తెనుగు పత్రికలు. ఇందు
తెనుగు పత్రిక ఓరుగల్లు మండలాంతర్గతమగు మానుకోటకు సమీపము నందలి
ఇనుగుర్తి గ్రామమునుండి వెలువడినది. ఈ పత్రికా సంపాదకులు శ్రీ ఒద్దిరాజు
సీతారామచంద్రరావు, రాఘవ రంగారావు సోదరులు. వీరిరువురును పండితులు,
కవులు, గ్రంథకర్తలు బహు భాషా కోవిదులు, వీరి సంపాదకత్వమున కొన్ని
192
సారస్వత నవనీతము
సంవత్సరములు తెనుగు పత్రిక ప్రజాసేవ, భాషాసేవ గావించినది. తరువాత యీ
పత్రిక కేంద్రస్థానము ఓరుగల్లునకు మారినది. ఓరుగల్లునందు యీ పత్రికను కొంత
కాలము చక్కగా నడిపిన వారిలో ముఖ్యులు శ్రీ తూము వరదరాజు, దేవులపల్లి
వేంకటాచలపతిరావు గార్లు. వీరిరువురు స్థానిక గ్రంథాలయము యొక్క ఉన్నతి కొరకై
శ్రద్ధతో శ్రమ యొనరించిరి. ఓరుగల్లులో తెనుగు పత్రికకు సమకాలికముగా భాషా
సేవగావించినది శైవప్రచారిణి. శైవప్రచారిణికి సంపాదకులు శ్రీ ముదిగొండ
వీరేశలింగశాస్రిగారు. శ్రీ శాస్త్రిగారు సంస్కృతాంధ్రములయందు చక్కని పండితులు.
ప్రస్తుతము స్థానిక కళాశాల యందు పండితులుగా నున్నారు. తెనుగు పత్రిక శైవ
(వ్రచారిణుల వలెనే నుకృతీగతాయువన్నట్లు న్వల్పకాలమే జీవించినది
ఆంధ్రాభ్యుదయమను మాస పత్రిక. ఈ పత్రిక హనుమకొండనుండి శ్రీ కోకల
సీతారామశర్మగారి సంపాదకత్వమున వెలువడుచుండెడిది. ఓరుగల్లు మండలము
నందలి బూర్గంపహాడు నుండి ఆంధ్ర వాజ్మయ సేవాసమితి పక్షమున కిన్నెరయను
సంపుటము లొకటి రెండు వెలువడినవి, తెనుగు పత్రిక ప్రకటింపంబడు రోజులలో
శ్రీ ముసిపట్ల పట్టాభిరామారావుగారును, గార్లపాటి రాఘవరెడ్డిగారును చక్కని కవిత్వము
వ్రాయుచుందెడివారు. శ్రీ పట్టాభిరామారావుగారు గత సంవత్సరము ఓరుగల్లులో
జరిగిన కవిసమ్మేళనమున కధ్యక్షత వహించియుండిరి. హనుమకొండ కళాశాలలో
ఉపాధ్యాయులుగా నుండి కీర్తిశేషులైన శ్రీ కంభంపాటి అప్పన్న శాస్త్రిగారు వేయిస్తంభాల
గుడి శాసనమును ప్రకటించియు, పూలతోటయసు మాసపత్రికను నిర్వహించియు
భాషా సేవ చేసియున్నారు.
ఓరుగల్లు కళాశాలయందు చిరకాలము వండితులుగానుండి,
సంన్కృతాంధ్రాంగ్గములయందేగాక, ఉర్టూ, ఫారసీ, అరబ్బీ, కర్ణాటకాది
బహుభాషలయందు పాండిత్యము గడించి, ఉర్దూ-తెలుగు నిఘంటువు వ్రాసి
ప్రశంసనీయమగు భాషాసేవ గావించి, ప్రచారమును కాంక్షింపక, పత్రికలయందు
'పేరెక్కించుకొనక, సభలజోలికిబోక, సమావేశముల కాహ్వానింపబడక నివురుగప్పిన
నిప్పువలె అజ్ఞాతముగా నున్న విజ్ఞాన నిక్షేపము శ్రీ అయితంరాజు కొండలరావుగారు,
వీరి వలెనె బహుభాషా కోవిదులై ఓరుగల్లు కళాశాలయందు ప్రస్తుతము పండితులుగా
నుండి అనేక గ్రంథములను రచించుచు ప్రకటింపనొల్లక అజ్ఞాతముగా నున్నవారు
శ్రీ ఉదయరాజు శేషగిరిరావు, ఎం.ఏ.గారు.
193
దా దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
గోలకొండ కవులసంచిక నాటికి ఓరుగల్లు మండలమున మొత్తము ఎనుబది
యైదుగురు కవులున్నట్లు తెలియుచున్నది. వీరిలో శ్రీ మామునూరి నాగభూషణ
రావుగారు ఆధునిక సంప్రదాయము ననుసరించి చక్కని కవిత్వమును వ్రాసిన
సుప్రసిద్ధులు. వీరి కవితా సౌందర్యమును పఠనామాధుర్యము ద్విగుణీకృత
మొనరించుచున్నది. వీరొక గ్రంథమాలను స్థాపించి వెన్నెల కుప్పలవంటి చక్కని
గ్రంథములను ప్రకటించినారు. ఓరుగల్లు మండలముల బహు గ్రంథకర్తలు
పండితులు, అవధానులు, ఆధునికులయందు కలరు. గోలకొండ కవుల సంచిక
ఇచ్చట సారస్వతోపాసకుల రచనలను యేరి కూర్చినది.
ఈ ప్రాంతమున సారస్వతసేవ యొనరించిన గ్రంథమాలలు కాకతీయ
గ్రంథమాల ఓరుగల్లు, విజ్ఞాన ప్రచారిణీ గ్రంథమాల ఇనుగుర్తి, వేంకటేశ్వర
గ్రంథమాల గార్ల, అణాగ్రంథమాల ఇనుగుర్తి ఆంధ్రవాజ్మయ సేవాసమితి పాల్వంచ
ప్రస్తుత మీ గ్రంథమాలలు అంతరించినవి. ఇప్పుడీ ప్రాంతములో భాషాసేవ విద్యా
ప్రచారము గావించుచున్న సంస్థలలో పేర్కొనదగినవి ఆంధ్ర విద్యాభివర్ణనీ సమాజము
ఓరుగల్లు, సారస్వత సేవాసమితి ఘనపురము, కాకతీయ కళాసమితి ఓరుగల్లు,
కాకతీయ క్లబ్ ఓరుగల్లు, హస్మర్స్‌క్లబ్ ఖమ్మము, రఘునాథపల్లి ఆంధ్ర విద్యాలయము,
ఆంధ్ర జాతీయ యువజన సంఘము ఖమ్మము, మున్నగునవి కలవు. ఓరుగల్లు
మండలమున (గ్రంధాలయోద్యమము క్రమవ్యాప్తినాంది అభివృద్ధి గాంచినది.
హనుమకొండలోని రాజనరేంద్ర ఆంధ్రభాషానిలయము, ఓరుగల్లు నందలి శబ్దాను
శాసనాంధ్ర భాషానిలయము రజతోత్సవములు గావించుకొన్నవి. ఇంకను ఇచ్చటి
గ్రంథాలయములలో ప్రశంసింపదగినవి శైవ ప్రచారిణీ గ్రంథభాండాగారము ఓరుగల్లు,
విజ్ఞాన నికేతనము ఖమ్మము మెట్టు, హిందీప్రచారిణీ గ్రంథాలయము మల్లేపల్లి,
విజ్ఞాన ప్రకాశినీ గ్రంథనిలయము కలకోట, వత్రికా వఠనమందిరము
జంరఖాలరావుపేట, ఉస్మానియా గ్రంథాలయము మధిర, మహబూబియా
గ్రంథాలయము ఎజ్జుపాలెము, సిద్ధి మల్లేశ్వర గ్రంథాలయము రేమిడిచర్ల, శ్రీ జనార్దన
నిలయము మామునూరు, వేంకటేశ్వర గ్రంథాలయము గార్ల, విష్ణువర్ధ నాంధ్ర
భాషానిలయము బూర్గంపాడు, దేశోద్ధారక ఆంధ్ర భాషానిలయము కుక్కునూరు,
ప్రతాపరుద్ర ఆంధ్ర భాషా నిలయము మడిగొండ.
ఆంధ్ర గ్రంథాలయము - రఘునాథపల్లి స్టేషన్, హసన్‌పర్తి గ్రంథాలయము,
నర్సంపేట గ్రంథాలయము, ఓరుగల్లు కోటలోని ప్రతాపరుద్ర గ్రంథాలయము,
కరీమాబాదు గ్రంథాలయము, వర్తక గ్రంథాలయము - యెల్లందు మున్నగునవి.
194
సారస్వత నవనీతము
ఓరుగల్లు మండలమునందు ఆంధ్రభాషా వికాసమునకు ఆంధ్రుల యందు
విజ్ఞానాభివృద్ధికిని కృషి సలిపిన మహాశయులు అనేకులు కలరు. శ్రీమాన్ దూపాటి
వేంకటరమణాచార్యులు శతావధానులుగారు మండలమునందంతటను
సంచారముచేసి ఆంధ్రచరిత్రకు సంబంధించిన పెక్కు నూతన విషయములను
వెల్లడిపరచియున్నారు. శాసన పరిశోధనమందును, భాషా పరిశోధనమందును వీరు
జూపిన అభినివేశము ఇచ్చటివారి యుత్సాహమునకు దోహదమొనరించినది.
క్రొత్తపల్లి వేంకటరామ లక్ష్మీనారాయణశర్మగారు గోదావరి తీరము మన్య
ప్రాంతములలో గ్రంథాలయములను, వాజ్మయసమితులను నెలకొల్పి చక్కని
ప్రబోధము గావించియున్నారు. శ్రీ కోదాటి నారాయణరావు నిజాం రాష్ట్రమునందు
ఆంధ్రదేశ గ్రంథాలయ కార్యనిర్వహణ భారము వహించి తదుద్యమ వ్యాప్తికై ప్రచారము
సలుపుచున్నారు.
నేడు ఓరుగల్లు మండలమున భాషాప్రియులును సారస్వతోపాసకులునగు
యువకులనేకులు కలరు. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రాయప్రోలు సుబ్బారావు
గారలవంటి ఆధునిక కవిశేఖరులచే మన్ననలంది “మణిమాల”ను ఆంధ్ర శారద
కంఠమున నలంకరించిన శ్రీ వానమామల వరదాచార్యులవారు ఓరుగల్లునకు
సమీపముననే యున్న మడికొండవాసులు. ఈ షష్టిపూర్తి సంచికలో సిరియాల
దేవియను ఏకాంకికను ఆంధ్ర పితామహున కంకితమొసంగిన కవులు శ్రీ బెల్లంకొండ
చంద్రమౌళి శాస్త్రిగారు ఓరుగల్లు మండలాంతర్గతులు. నేడు చిన్న కథలను వ్రాయుటలో
సిద్ధహస్తులుగా ప్రశంసలొందుచున్న శ్రీ పొట్లపల్లి రామారావుగారు ఓరుగల్లునకు
సమీపముగా నున్న తాటికొండ వాస్తవ్యులు. వీరు చక్కని గేయములను కూడ
వ్రాసియున్నారు. ఓరుగల్లు మండలమున భాషాసేవ గావించుచున్న విదుషీమణులును
కలరు. వీరిలో శ్రీ సోమరాజు ఇందుమతీ దేవిగారు ప్రత్యేక ప్రశంసనీయురాలు.
భాషయందు, సౌందర్య భావములందు రమణీయత యీయమ ప్రత్యేకత. గోలకొండ
సంచికలో యీమె ప్రకటించిన పద్యములు మిక్కిలి మనోహరముగా నున్నవి. శ్రీ
ఇందుమతీదేవిగారు ఒక చక్కని ఖండకావ్య సంపుటమును ప్రకటించియున్నారు.
ఆధునిక లుపాసించు నవ్యత యీమె కవితయందు ప్రత్యక్షమై యున్నది.
యువకులలో పేర్కొనదగిన మరియొక్కరు శ్రీ నెల్లుట్ల రామకృష్ణకవి. ఈయన
సూరబాలయను ఖండకావ్యమును, భావార్డవాది ఇతర గ్రంథములను వ్రాసియున్నారు.
195
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
భావమును గీత పద్యమున ఇమిడించుటలో ఈయనకొక ్రత్యేకమగు విన్నాణము
కలదు. నియోగిశాఖాభిమానము ఈయనయందు మూర్తీభవించియున్నది.
రాజకీయ రంగమునుండి సారన్వత రంగమునకు లంఫీంంచిన
నాప్రియమిత్రుడు శ్రీ నారాయణరావు కాళోజి నేడు గేయరచన యందు నిమగ్ఫుడై
యున్నాడు. ఆతని యొక్కొక్క హృదయస్పందము, ఒక గేయముగా మారుచున్నది.
స్వభావసిద్ధమగు ఉద్రేకము ఈయన గేయములందు ఉప్పొంగుచుండును.
ఓరుగల్లు మొదటినుండియు నేటివరకు సారస్వతరంగమున తన పాత్రను
కాలానుగుణముగా నిర్వహించుచునే యున్నది. ఇది యొక పవిత్రమగు యాత్ర
అవశ్యము ఆచరింపవలసిన ధర్మము; మాతృ దేవతా పాదసేవ నిరంతరము సాగుచునే
యుండగలదు.
“నిలువదు స్యందనంబు ధరణీపతి పాలన దండిఖీతిచే......
అనర్గళ జవయాత్ర నేగెడిని కన్నులకున్ గనరాని చోటికిన్”
“ప్రజల యా తేరు మోకుల బట్టువారు”
అని యొక యాధునిక కవిశేఖరుడు వ్రాసినట్లుగా మాతృదేవతాస్యందనము
ముందుకు సాగుచునే యుండగలదు. కాలము అనంతమైనది. ప్రపంచము
విశాలమైనది. భావప్రపంచమునకు మార్చు సహజము.
196
సారస్వత నవనీతము
నవ్య కవితా నీరాజనము
కవి స్రష్ట
కవిత్వము లలితకళలలో నగ్రగణ్యము. లలితకళలను నామమే వాని,
రామణీయకమును ప్రస్ఫుట మొనరించుచున్నది. లలితకళలు సౌందర్య ప్రధానములు.
వానియనుభవము హృదయాహ్లోదకరము. శ్రావ్యమగు గానము వినినప్పుడు చక్కని
చిత్రము చూచినప్పుడు సరసమగు పద్యమును జదివినప్పుడు మనకు కలుగు
దివ్యమగు నానందము అనిర్వచనీయము, అనుభవైకవేద్యము.
కళానుభవము మనశ్శాంతికి నమూల్యమగు సాధనము. మనస్సు కలతవడి
చీకాకునొందినప్పుడు తమ యభిమాన గళోపాసనము చేత తాత్కాలికముగా దుఃఖ
వేదననుండి విముక్తులై తన్మయానందమొందువారు కలరు. సంతోష సమయమున
కళోపాసనము కళానుభవము మనయానందమును ద్విగుణీకృత మొనరించును.
ఏకాంతముగా నున్నప్పుడు, పనిపాటలు లేనప్పుడు, విశ్రాంతికాలమున కళోపాసనము
మనకాప్తమిత్రము. ముఖ్యముగా కవిత రసిక జనచకోరములకు వూర్ణ
చంద్రోదయము. కాని యొకమాట. పరమ పవిత్రమగు కళా ప్రపంచము
సహృదయులకు మాత్రమే ప్రవేశసాధ్యము. కళా పుష్ప వాటికాంతరమునం బ్రవేశించి
యందలి యరవిరి మొగ్గలను అరవిచ్చిన సుందర సుమచయమును కోరికదీర
గోసికొని వాని సౌందర్య సౌరభ్యముల మనసార ననుభవించి తన్మయులై
యానందమున నోలలాడు భాగ్యము రసాగ్ట హృదయులది మాత్రమే. కళోపాసకునికి
ప్రకృతి యంతయు ప్రేమమయము. సౌందర్యపూర్ణము, ఆనందదాయకము.
రమణీయములగు నర్ధములనిచ్చు సుందరపద సముదాయమే కావ్యమని
చెప్పనొప్పును. రామణీయకమనగా క్షణక్షణ నవ్యతను జూపి మనల నానంద
పరవశుల జేయు గుణము. నిక్కంపు కవిత కిట్టిగుణము సహజసిద్ధము. భాగవత
మందలి వర్ణన గోపాలకృష్ణుని బాల్యక్రీడల వర్ణన, గోపికాగీతములు భ్రమరగీతములు
మున్నగునవి యిందుకు నిదర్శనములు. ఈ (గ్రంథముల నెన్నిమారులు జదివినను
తనివి దీరదు. మనము దానిని పఠించు ప్రతిపర్యాయమును అందేదొ క్రొత్తదనము
గోచరించును. ఈ క్రొత్తదనమే కావ్య రామణీయకమునకు ప్రత్యేక లక్షణము.
ఉద్రేకమే కవితకు ప్రాణాధారమని యొకానొక యభిప్రాయము. ఉద్రేకము
లేనిది యే మహాకార్యమును నెరవేరుట దుస్తరము. అనాథల నిమిత్తము తన
197
దా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
సర్వస్వము ధారవోయు త్యాగశాలి, దేశ స్వాతంత్ర్య సంపాదనార్థము తనధన మాన
ప్రాణముల నర్చించు వీరవరేణ్యుడు ఇందుకు దృష్టాంతములు. ఇతర రంగము
నట్లుంచినను సాహిత్యాంగణమున గూడ ఉద్రేకము ప్రముఖపాత్ర ధరించుచున్నది.
ఉ(దేక ఫలితములగు మనోవికారములు, భావములు శాంత సమయమున సహజ
ప్రతిభాశాలియగు వ్యక్తిచే సంస్మరింపబడి కవితా రూపమున ప్రత్యక్షమగును.
భావోద్రేకమన నేమియో యెరుగని శుష్మహృదయులు కవులెన్నటికిని కాజాలరు.
ఉద్రేకము యొక్క అభావము కళా సౌంద ర్యాభావమేయని చెప్పిన అతిశయోక్తి
కానేరదు. హృదయము భావప్రపూర్ణమై రసాగ్టమై విలసిల్లినప్పుడే కవికుమారుని
లేఖిని ముఖమున ముత్యాలవర్షము కురిసి సాహితీ క్షేత్రమును సస్యశ్యానులముగా
నొనరించును.
చూడుడు!
“వైత్రపల్లవదూతి చక్కిలిగింతలన్, గుస్తరింపగ బాడుకోకిలంబు
జలకమాడిన నభోజనని ఘనాలక లారవిప్పిన వేళ నాడునెమలి
పండువెన్నెల జున్నుబాలు చేపినరేల స్వరజయకవల్లించు భ్రమర బాల
దానిమ్మ పగడాలు కానుపుగ నప్పు నామకీర్తనసల్పు రామచిల్క
అట్లే ప్రాణిలోకము రసవదిష్టార్థరక్తి వివశమగు నప్టెయున్ముక్త
యగును కవిత”
కవిత్వతత్వ నిరతిశయానంద భావభరితాంతఃకరణుండై తిక్కనార్యుడు
భారతరచనకు కృత ప్రయత్నుండయ్యెనట. ఆయన యొక దివ్య స్వప్నమున హరిహర
నాథునిచే ప్రబోధితుడగుట భవ్యమగు కవితావేశ ప్రభావము. సోమయాజిది
గంభీరమగు భావనాశక్తి. ప్రహ్లాద గజేంద్రులలో లీనుడై రసపారవశ్యమున తన్మయుడైన
పోతన్నది తన్మయ భావనాశక్తి. ముఖ్యముగా నీయిరువురి రచనల సౌందర్యమునకు
కారణము ఆవేశమేయని తెలియనగును. భావనాశక్తి యేరూపమున ప్రత్యక్షమైనను
దానికి ప్రోత్సాహ కారణము ఉద్రేకమే; పరమ పవిత్రమగు వైదికావేశమే కదా
నన్నయార్యుని కావ్య మహత్వమునకు హేతువు.
సహజ ప్రతిభాశాలియగు కవి సృష్టిలో నే వస్తువును దిలకించినను అతని
హృదయముననొక విధమగు నుత్సాహము జనించి, ఆవేశ భరితుడగును. అప్పుడాతని
హృదయమున కొన్ని భావములు జనించి రసోదయమగును. ఈ విధముగ
198
సారన్వత నవనీతము
భావమునకు రసమునకు జన్యజనక సంబంధము గలదు. కవితయందు భావ
ప్రాధాన్యతను, ఉద్రేక ప్రాముఖ్యతను నృష్టీకరించుటకొరకే నవ్యకవితకు
భావకవిత్వమను నామాంతర మొసంగినారు ఆధునికులు. ఎవ్వాని హృదయము
అపూర్వములగు భావములకు నిలయమో అదియే రసమునకు నిధానము.
రామణీయకమునకు పట్టుగొమ్మ. అట్టి
వానిడెందంబు సోకిపోవని తలపులు
వాని కనుసన్న తలలు వంపని యుపమలు
వాని కలమున కులుకు జూపని పదములు
యీ ప్రపంచమున గానరావు. చూడుడు బాలెంతరాలైన యొక పల్లెటూరి
పడుచును గాంచి యాధుని కాంధ్ర కవిశేఖరుడేమని (ప్రశ్నించుచున్నాడో!
అత్యంత సుకుమారివైనట్లు గనుపింతు
వేలాగు నడిచితో యీ దూరపథమెల్ల
ఏ లీల గడచితో యీ ముండ్ల పొదలెల్ల
ఆకుపచ్చని నిగ్గు అసియాడు నీమేన
ఏ భంగి మోసితో యీ పాలభాండంబు
ఏ చాయ మూసితో యీ బాల భాగ్యంబు
అప్పుడు
కూర్చుండు మొక్కింత చేర్చుక్క చమటార
సోలేవు లేకున్న సురపొన్న సుమమట్లు
వ్రాలేవు లేకున్న పసితమల్పాకట్లు
గులకజా బాటలన్ మొలక పూదోటలా
గేచాయ మార్చితో యీమెత్తని పదాల
యేతల్లి నేర్చెనా యీయింద్రజాలంబు
అని ఆశ్చర్యమొంది
ఎవరియింటివి ఆలు ఎవరు పిండిరి పాలు
చిన్నారి లేగలన్ కన్నెతీగలగట్టి
కన్నారికడకిట్లు మున్నెవచ్చితివెట్లు
199
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
పాలూరునీపల్కు బాలెంతససిచిల్కు
పాలీయ వచ్చితీ పడరానిపాట్లోర్చి
పాలమ్మువ్రతమంత భాగవతోక్తంబో?
అని యర్ధాంత రన్యాసమున ముగించునప్పుడు భావము భాషయను నిరువురు
బాలకులు “నేను ముందు నేను ముంద”ని పందెము వైచుకొని రససముద్ర
మీదుచున్నారో యను సందేహము కల్గుచున్నది.
కవి సృష్టికర్త, ఆనంద సౌందర్యము లీ సృష్టికి ప్రత్యేక లక్షణములు.
“తమ్మిచూలుకేలు దమ్మినిగలనేర్పు
కవికలంబునందు గలదుగాన
నీశ్వరత్వమతనికే చలామణియయ్యె”
కవి నిర్మితజగత్తు మన దైనందిన వ్యవహార ప్రపంచమునకు శుష్క
నీరసానుకరణముగాక ప్రతిభావంతమగు స్వతంత్ర నిర్మాణమే యనుట
నిస్సంశయము. కవి ప్రకృతిని తన కవితా దర్బణమున ప్రతిఫలింప జేయవచ్చును.
కాని తత్మార్య నిర్వహణమందు గూడ నాతడొక విధమగు నవ్యత, స్వీయ (ప్రతిభ
ప్రదర్శించుచున్నాడు. జుగుష్పాదులను, ధూమకలుషిత దుర్గంధములను (గ్రహించును.
“ప్రకృతి యందు రమ్యముగాని వస్తుతతిని చిత్రకళలు రమ్యముగ దీర్చెడివి.”
అంతియేకాని కవి యంధుడై ప్రకృతిని నీరసముగా ననుకరింపడు. రమ్యముగా
దీర్చుటలో కవి స్వీయభావనా మహిమను, నిర్మాణ కౌశలమును ప్రదర్శించి రవి
గాననిది కూడ కవి గాంచునని తెలియజేయుచున్నాడు.
నీర తీసిపోయిన తటినీ తటాల
పొరలుపడ్డయిసుక మడపులనుచూచి
పానుపునువీడిలేచు భామానితంబ
గళ్లిత సిత దుకూలాంచలముల
స్మరించుట కవి యొక్క నిర్మాణ నైపుణ్యమునకు నిదర్శనము.
స్వీయ నిర్మాణ జగమునందు కవి సర్వ సమర్భుండు. అందాతనికి దుస్సాధ్యమగు
కార్యమేలేదు. దైనిక ప్రపంచమున దైవ సంకల్పమువలె కావ్యజగత్తునందు కవి
కుమారుని సంకల్ప మమోఘము.
200
సారస్వత నవనీతము
భావములను వ్యక్తీకరించు సాధనము భాష, కావ్యసంసారమున శబ్ధార్థములకు
గల సంబంధము మానవ ప్రపంచమునందలి దాంపత్యమును బోలును. వీనిలో
నొకటి లేక యింకొకటి శోభిల్లదు. రెండింటి సంయోగమే ఫలప్రదము. భావమున
కాహ్లాదమెంత ప్రధానమో శైలికి సౌందర్యమంత ముఖ్యము. కవిత ఆనంద
సౌందర్యములచే విలసిల్లునది కదా! ఆనందము భావమున; సౌందర్యము శైలిలో.
ఈ యానంద సౌందర్యముల సమ్మేళనమే రామణీయకము. ఏవిధముగ దుఃఖము,
కరుణ మున్నగు రసముల ననుభవించుటలో ఆనందము కలదో, అదే విధముగ
క్రోధాదులను వర్ణించు రీతులయందు సౌందర్యము కలదు. సందర్భములనుబట్టి
శైలియు భేదించును. ఏ భావమునకు యే శైలియే వృత్తము అనుగుణ్యమో అది
చక్కగా తెలిసి వ్రాసిన మహాకవి తిక్కన. కవులయొక్క చోద్యప్రయోగ కౌశలము,
అమృత శబ్దావతారము దాల్చి, పాఠకులను శిరీష కుసుమ పేశల సుధామయోక్తులతో
చిఖునవ్వు పెదవుల కందళింపం బలుకరించును. కావ్యము యొక్క శైలీ
మాధుర్యమునకు ప్రమాణము శ్రవణ సుఖము. పరభాషా పదములను స్వీయభాషా
సంప్రదాయమున కనుకూలముగ అవసరము గలిగినపుడు పోహళించి స్వీయ
భావప్రబోధము జేయువారే నిక్కంపు కవులు.
కవులు నిరంకుశులు. వారికి “ఇదివలయును, ఇదికూడ” దని యాజ్ఞాపించుట
యసమంజసము. రసానుభవమే మనవిధి అన్యములు మనకనవసరములు.
భోజ్యములు రుచికరములుగా నున్నవియా యని పరిశీలించుటయే మనవిధి. కాని
ప్రత్యేక పరిమాణయుక్తముగ లవణాదులను వాడవలయుననుట భావ్యముకాదు.
ఇట నలంకారములు వాడవలయును, ఇటకూడదు అనియు, పాత్రములు ప్రత్యేక
లక్షణములతో నొప్పారవలయుననియును విధించుట సహృదయ లక్షణము గాదు.
కావ్యరచనకు కావలసినది సహజ ప్రతిభకాని, కేవలము ఛందశ్శాస్త్ర పాండిత్యము,
వ్యాకరణ వేతృత్వముకాదు. కావ్యము సహృదయుల కానందము గూర్చగలదాయను
ప్రశ్నయేముఖ్యము; ఇతరము లసంభావ్యములు.
కావ్యములు నీతిబోధకముగా నుండవలయునని యొకమతము ఉండిన
నుండవచ్చును. కాని కావ్యప్రధానోద్దేశము నీతిబోధనము మాత్రముకాదు. నీతిని
బోధింపక పోయినంతమాత్రమున నొక కావ్యమును రసప్రపంచము నుండి
బహిష్మరించుట రసికసమ్మతము గాదు. కావ్యప్రధానోద్దేశమగు రసస్ఫోరకత్వమునకు
201
డా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
నీతిబోధనము విధేయమైయుండవలయును; గాన నీతివాదుల యొక్కయు తాత్వికుల
యొక్కయు అడుగులకు మడుగు లొత్తుచువారికి చరణాశ్రిత దాసియై కవితాకాంత
యూడిగ మొనరింపజాలదు.
కవికి తాత్వికునకు కయ్యంబె సాగెను
బహుదినాలు వాక్ష్రపంచమందు
రాగరక్తుడొకడు, రాగముక్తుడొకడు
సుగుణ నిర్గుణముల సఖ్యమెట్లు?
మార్పు జగల్లక్షణము. మానవ ప్రపంచమున నిది స్పష్టము. ఆదినుండియు
మానవుడెన్నియోమార్పుల నందినాడు. సమస్త వ్యవహారములందీ మార్చు సుస్పష్టము.
సాహిత్య మీసామాన్య సూత్రమున కపవాదము కాజాలదు. ఇంతయేల?
సాహిత్యమునకు మార్చే, నవ్యతయే శోభ గూర్చుననుట పరమసత్యము.
“కాలధర్మానుగతమై జగత్పవృత్తి,
మారునపుడు వాబ్మయమును మారునిజము”
ఒక జాతియొక్క సారస్వతము ఆ జాతి యొక్క జాతీయ జీవనము
కద్దమువంటిది. కావున వాజ్మయము ఒక పురుషాంతరము నుండి మరియొక
పురుషాంతరము వరకు క్రమక్రమాభివృద్ధి నొందుచుండును. ఈ సందర్భమున
రాయట్రోలు సుబ్బారావుగారి వాక్యములు ఉదాహరణ యోగ్యములు. “కవి యొక్క
కర్మయే కావ్యము” అయితే కవులన నెవరు? మంత్రద్రష్టలై ఛందస్సుల నవతరింప
జేసిన వైదికర్నులు కవులు; విజ్ఞాన పారంగతులై యుపనిషత్తులనుపాదించిన
(బ్రహ్మవాదులు కవులు; ఆనందోపాసకులై మానవజీవిత మాధుర్యమును సంకీర్తన
మొనరించిన కాళిదాసాదులు కవులు. అయితె యీకవుల కందరకు ఏకాదర్శమే
గోచరింపదు. లక్ష్య లక్షణముల రెంటను అంతర మగపడుచున్నది.” ఆంగ్ల
సాహిత్యమునగూడ నీ మార్చు విస్పష్టము. ఛాసరు షేక్సియరులు, మిల్దను కీట్సుల
కావ్యము లిందుకు నిదర్శనములు. నన్నయ, తిక్కనలు, ఎజ్జనసోమనలు, శ్రీనాథ
పోతనలు, పెద్దనసూరనలు, తెనుగు వాజ్మయమున మార్పునకు త్రోవజూపినవారు.
లక్ష లక్షణముల రెంటి యందును ఈ కవులలో నంతర మగుపడుచున్నది.
సంఘ జీవితమునకు సాహిత్యమునకు వీడరాని సంబంధము కలదు. ఒక
కాలమునందలి నాగరికత ప్రత్యేక స్వరూపమును దాల్బుటకు కారణములు, ఆ
202
సారస్వత నవనీతము
నాగరికతపై గల యితర ప్రభావములు (influences) ఆ జాతియొక్క
సాహిత్యమునందును స్పష్టముగా గన్పట్టును. అసాధారణ ప్రతిభాశాలియగు రచయిత
స్వీయ వాజ్మయమునందు నూత్న శక మారంభించి సమకాలిక సాహిత్యమునకు
గ్రొత్త రుచులను గల్చించుటయు గలదు. కాని యెంతటి శేముషీ సింధువైనను
సమకాలిక సంస్కృతి, విజ్ఞానము, ఆదర్శములు, నైతిక మానసిక విప్లవ శక్తులు
మున్నగువాని ప్రభావమునుండి తప్పించుకొనజాలడు. కవియొక్క వ్యక్తిత్వము,
తత్మాలమందలి యాదర్శములు, వీని పరస్పర ప్రభావ పరిణామ ఫలితము సాహితీ
చరిత్రమున నొక విలక్షణమగు రస వదధ్యాయమును ప్రారంభింపజేయును. ఇందుకు
మన యాధునిక కవి కుమారుల ఖండ కావ్యములు ఉజ్వలోదాహరణములు.
అదియేమి చిత్రమోకాని ప్రపంచమున ప్రతి సారస్వతమునకును ఆరంభము
పద్య రచనయే. పూర్వకాలమున నేటివలె విజ్ఞానము ఎక్కువగా నభివృద్ధినాందక,
ఉన్నది కొంచెము సరిగా ప్రబలక యుండుటవలన మానవుల హృదయశక్తి బలవత్తరమై
యుండెను. ఆనాడు వారి మెదడుకన్న హృదయమే గొప్పది. కావుననే కాబోలు
గద్యరచనకన్న పద్యవాజ్మయము, కవిత్వము ఆనాడు యెక్కువగా నభివృద్ధి నొందినది.
ఆదికవులందరు పురాణములకే ప్రాముఖ్యమొసంగిరి, కావ్యములు, నాటకములు
తరువాతవి. జనులకు మానవాతీతములగు విషయములందు రక్తియు, దేవతలమహిమ
యందు భక్తియు నిందులకు కారణమైయుండనోపును. కవులును తమ కృతులు
జనాదరణకు పాత్రములు కావలయునను తలంపుతో రచించుటచే ఆనాడు
పురాణములు ప్రబలియుండును. ఆకాలమున మతమునకు ప్రజాజీవితమునకును
అవినాభావసంబంధమే యుండెను. మతమునకు సంఘమునగల మహనీయ
ప్రాముఖ్యము, మానవుల నావేశ భరితులనుగా జేయుటలో దాని సామర్థ్యము, పురాణ
రచనాకారణములలో నొక్కటియై యుండనోపును. కాలక్రమమున జనుల రుచి భేదమే
సాహితియందలి మార్పునకు కారణమయ్యెను.
ఆంధ్రమున నన్నయాదులు స్వతంత్ర కావ్యరచనా శక్తికి జాలినవారయ్యును
పురాణముల నాంధ్రీకరించుటతోడనే సంతృప్తి నందియుండుటకు కారణములు
దేశకాల పాత్రములే యనుట సత్యము. వైదికావేశమున సాంస్కృతిక బహుళంబగు
శైలిని భారతరచన గావించిన మహాత్ముడు నన్నప్రార్యుడు. రాజనీతి రహస్యములెరింగి
తీపి గొలుపు తెనుంగున భారతరచన సాగించి ప్రబంధావళికి బీజముల నాటిన
203
డా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
వాజ్మయ ధురంధరుడు తిక్కన సోమయాజి. నన్నయ తిక్కనల విలక్షణ వ్యక్తిత్వముల
నమన్వయించిన దక్షుడు శంభుదానుడు. సోమన శబ్బ చిత్రమునకు
ప్రాధాన్యమిచ్చినాడు. పాల్కురికి కవి జాను తెనుంగున తన రచనలను విలసిల్లజేసి
న్వీయభావప్రచారము నిరాఘాటముగా సాగించినాడు. శ్రీనాథ పోతనలు
సమకాలికులు. కాని భాషాసేవ యొనర్చినది భిన్నమార్గముల. అక్కచెల్లెండ్రనదగు
భక్తి శృంగారములు వీరి రచనలయందు అల్లిబిల్లిగా నల్లుకొన్న రెండు తీగెలవలె
నొప్పుచున్నవి. సానలదీరిన జాతిరత్నములను సాపొతీనుందరికి కాన్మ
యొసంగినవారు పెద్దన రామరాజభూషణులు. కల్పనాచాతుర్యము సూరన్నది. వర్ణనా
నైపుణ్యము రామకృష్ణునిది. ఇట్లాంధ్ర సారస్వతమున గణనీయుడగు ప్రతివ్యక్తియు
స్వీయాభిప్రాయములను, ఆత్మవ్యక్తిత్వమును ప్రకటించుచు స్వతంత్రములగు
దారులనుద్రొక్కి మార్పు వాజ్మయ లక్షణమని చెప్పక చెప్పినారు.
నీరసానుకరణములు బింబప్రతిబింబ నదృశములగు ప్రబంధములు
మనసారస్వతమున కొన్ని జన్మించినవి. పరంపరాగతములగు భావములే, పూర్వ
ప్రబంధముల పోకడలే వానికి ముఖ్య లక్షణములు.
“శివుడుక తాండవమాడనాడవె పిశాచీ భూతబేతాళముల్?”
శతక వాజ్మయ మొక్కటే యీ కాలమున సాహిత్యమని చెప్పదగినది; అట్లుండ
వచన వాజ్మయమునకు పునాది వేసినవాడు చిన్నయసూరి. కాని తెనుగు వచనము
చక్మదనముతో ముద్దులొల్కినది వీరేశలింగయుగమున. వీరేశలింగము గద్యతిక్కన;
అపరనన్నయ. మన వాబ్మయమును సర్వాంగశోభితను జేసినది వీరేశలింగపంతులు.
ఆయన “ఆంధ్ర సాహితీ పునరుద్ధరణ ప్రభావ”డనుట నిక్కువము.
204
సారస్వత నవనీతము
నవ యుగోదయము
శ్రీ వీరేశలింగయుగమున సాహిత్యలక్ష్మి నూత్నశోభలతో విలసిల్లినది. ప్రబంధ
కవిత్వాది శృంఖలా విమోచనమువలన కళకళలాడు నెమ్మోముతో పెంపసలారినది.
నిడుదలగు సమాసములపై మక్కువ మాయమైనది. చదివినను వినినను జనుల
కర్థమగు శైలిని అల్ప్బపద పరికరముతో అనల్పార్ధమును వ్యక్తీకరించు గ్రంథ
సముదాయముపై ప్రీతి హెచ్చినది. రాజుల ఇష్టానిష్టముల ననుసరించి వారి
కనుకూలమగు రచనలు సాగించు కాలమంతరించినది. సామాన్య ప్రజల
జీవితమునకు ప్రాముఖ్యము హెచ్చినది. ఉద్రేకము కవితా రంగమున ప్రముఖస్థానము
నాక్రమించినది. జీవకళతో సాహిత్యము తేజోవంతమైనది.
సారస్వత ప్రపంచమున వీరేశలింగము త్రొక్కని త్రోవలేదు. ఆయన బహుముఖ
సారస్వత సేవకు ముఖ్య కారణము ఆంగ్లవాజ్మయ సంపర్మము. ఆ కాలమున విశ్వ
విద్యాలయములం దాంగ్లేయ విద్య నభ్యసించిన విద్యాధికులు ఆంగ్లేయ భాషాభి
రుచులను గలిగి ఆ మార్గమున జేసిన రచనలను ప్రోత్సహించి, మరియు శ్రీ
వీరేశలింగము గారిచే స్థాపితమైన యీనవీన సారస్వతోద్యమమున పాల్గొని
భాషాయోషను మేలిసొమ్ములతో నలంకరించిరి. తెనుగున ఆధునిక పద్ధతులపై నాటక
రచనకు పునాదులు వేసి గురజాడ అప్పారావుగారికి మార్గదర్శి యైనది శ్రీ
వీరేశలింగముగారి యమృత లేఖనియే. ఆంగ్రవాజ్మయ సంపర్మముకతన నాంధ్రమున
విషాదాంత నాటకము ఉద్భవించినది. రామకృష్ణాచార్యులవారి విషాద సారంగధరమిట
ప్రత్యేక స్మరణీయము. సాంఘికదురాచారములను ఈకాలమున ప్రకటించు
నాటకములీ నవీనోద్యమ ఫలితములే. చారిత్రక, సాంఘిక, అద్భుత కథా
ప్రధానములగు నవలలు మన సారస్వత నికుంజమున మొగ్గ దొడిగినవి. రాజశేఖర
చరిత్రము, చిలకమర్తివారి నవలలు, మాలపల్లి, ఇటీవల అడవి బాపిరాజు, విశ్వనాథ
సత్యనారాయణగార్ల రచన లిందుకు నిదర్శనములు. కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, వేంకట
లక్ష్మణరావు, పానుగంటి లక్ష్మీనరసింహారావు మున్నగువారు వ్యాసరచనలో ఆత్మ
ప్రతిభా సూచకమగు వివిధ మార్గములను జూపినారు.
దేశచరిత్రము, శాసన పరిశోధనయందు విద్వాంసులు (శ్రద్ధ వహించినారు.
కవితా విమర్శనము పూర్వ పద్ధతులను విడిచి నూతన మార్గముల నడచినది.
205
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
సంవత్సరాది సంచికలలో విద్యాధికుల వ్యాసములు, గ్రంథాలయ సర్వస్వమునందలి
రాయహ్రోలువారి విమర్శనములు, దువ్వూరి, బసవరాజుల వ్యాసము లిందుకు
నిదర్శనములు. కవిత్వ తత్వవిచారము, అనంత కృష్ణశర్మగారి వ్యాసములు సాహితీ
విమర్శనమున క్రొత్త పద్ధతులను ప్రవేశపెట్టినవి. ఆంగ్లభాష యందు వలె
వసంతలేఖలు శారదలేఖలు పత్రికల నలంకరించినవి. కవిజీవితములు, వ్యక్తి
చరిత్రములు, స్వీయ చరిత్రలు మన భాషయందు కూడ ప్రభవించినవి. ఈ
నవీనోద్యమముకు ప్రాణాధారము వత్రికా వాజ్మయము. ఆంధ్ర కృష్ణా
పత్రికాధిపతులొనరించిన సేవ తెనుగు వాజ్మయమున న్వర్థాక్షరములతో
లిఖింపదగినది. ముట్నూరి కృష్ణారావుగారి సంపాదకీయములు తెనుగున నొకక్రొత్త
శైలిని కళా ప్రపంచమున క్రొత్త రుచులను ప్రబలజేసినవి. భారతి, శారద, సాహితి,
సుజాత, ప్రతిభ, ఉదయిని, మున్నగు మాసపత్రిక లొనరించిన సేవ గణనీయము.
ఆనాడు సంఘసంస్మరణోద్యమ ఫలితముగా ఆంధ్రమున నెంతయో సాహిత్య
ముద్భవించినది. వీరేశలింగము (బ్రహ్మ మతావలంబుడు, సంఘ సంస్మారి, దక్షణదేశ
విద్యాసాగరుడు. ఆయన తన భావములను రచనల మూలకముగా నాంధ్రావనిలో
ప్రచారమొనరించి ఆంధ్రులను మేలుకొలిపి నవయుగోదయ మొనరించినాడు
వీరేశలింగ దీక్షితుడు. ఈ నవయుగ ప్రభాతమున వీరేశలింగమున కించుమించు
సైదోడులగు వైతాళికులు, వేంకటలక్ష్మణరావు, వేంకట రాయశాస్త్రి, వీరభద్రరావు,
వడ్డాది వావిలికొలనులు, జయంతి గిడుగులు, తిరుపతి వేంకటకవులు, నాగేశ్వరరావు
మున్నగువారు.
లక్ష్మణరావుగారు వివిధ విజ్ఞాన శాఖలయందు ప్రవీణులు. బహుభాషా
కోవిదులు. విజ్ఞాన సర్వస్వ సంపాదకులై, విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి స్థాపించి
ఆంధ్రులకు విజ్ఞానభిక్షపెట్టిన విజ్ఞాని లక్ష్మణరావు. వేంకటరాయశాస్త్రి
సంస్కృతాంధ్రములయందు మహాపండితులు. ్రతాపరుద్రీయము ఆయన కళా
వేతృత్వములకు, స్వతంత్ర నాటక రచనాశక్తికి నిదర్శనము. సాహిత్య దర్పణాది
గ్రంథములను రచించి నైషధ ఆముక్త మూల్యదలకు వ్యాఖ్యాన మొనరించిన యాతడు
నిజముగా జంకు కళంకులేని కవిచంద్రుడు; తోషిత కోవిదేంద్రుడు. ఇరువదియవ
శతాబ్బారంభమున ఆంధ్రమహా పండితులలో ప్రత్యేక వ్యక్తిత్వము గలిగి,
చారిత్రాత్మకములగు నిర్ణయములకు కారకులు జయంతి రామయ్య, గిడుగు
206
సారన్వత నవనీతము
రామమూర్తి గారలు. ఆంధ్రమహా పురుషులలో వీరిరువురకు ఉత్కృష్టస్థానములు
గలవు. ఇరువురును ఉద్దండ పండితులు, విజ్ఞాననిధులు. ఇరువురు కళా ప్రపూర్ణులే.
ఇరువురి జీవిత పరమావధి భాషాసేవయే. ఇరువురు తదాదర్శ నిర్వహణార్థము తమ
నర్వన్వము దారపోనినారు. ఇట్టి ఏకాశయ బద్భలయయ్యు వారు
భిన్నమార్గానుయాయులు, వ్యావహారిక భాషను గ్రంథముల కెక్కించి వానిని
జనసామాన్యములో వ్యాప్తికి దేవలయునని గిడుగువారి సంకల్పము. భాషను చక్కగా
సంస్కరించి, సరళమగు శైలిని పుస్తకములను ప్రకటించి, విజ్ఞానము ప్రజలకు
పంచిపెట్టవలయునని జయంతివారి ఆశయము. ఇట్టి వాదములతో నీ పండిత
సింహము లొండొరుల డీకొనినవి. జయాభిలాషులై పోరాటము సాగించినారు.
భావసంఘర్షణము ప్రస్ఫుటమై యాంధ్రలోకమున నిరుకక్షలు బయలుదేరినవి.
గురజాడవారు 500121 reform and spoken Telugu తో గిడుగువారి కండయై
నిలిచినారు. పానుగంటి వారు రామయ్యగారి వాదమును బలపరిచినారు. ఆంధ్రుల
యశోవంతమగు చరిత్రను గ్రంథస్థ మొనరించి, వారిని భాస్వంతమగు భవిష్యత్తును
నిర్మింప ప్రబోధించిన మహానీయులు చిలుకూరి వీరభద్రరావుగారు. తిరుపతి
వేంకటకవులు కవితకు స్వేచ్ళావిహార మొసంగి ప్రజలలో వాజ్మయాభిరుచిని
పునరుజ్జీవింపజేసినారు. సారస్వతోద్యాన వనమున వీరు కల్పించిన క్రొత్త పాదుల
నుండి యుద్భవించిన నూతన కవిత్వవల్లి నవ ప్రసవములను విరబూచినది.
ఆధునికాంధ్ర కవులలో వీరికి శిష్యులో, ప్రశిష్యులో, ఏకలవ్య శిష్యులో కాని వారు
లేరనుట అతిశయోక్తి కానేరదు. ఆంధ్రావనిలో పద్యరచనకు బహుళ (ప్రచారము
కల్పించిన వారలు తిరుపతి వెంకటకవులు. గంగా ప్రవాహమునుబోలు వీరి
కవితావాహినియందు స్నానమాడి సాహితీ దేవాలయమున ఖండకావ్య కుసుమములతో
ప్రవేశించినవారు నవ్యాంధ్ర కవికుమారులు. వీరిని గురించి “వానలో దడియనివారు
మద్దురు వధానమృదూక్తి మరంద ధారలో గడుగనివారు మాకెచట కానగ రారిల
తెల్గునాడునజ” అని వచించి నాడొక యాధునిక కవికుమారుడు. ఇంకొక కవి
మిత్రులు “ఎన్నడు బెండు పల్మొదవ దెవ్వని నాల్మకు యే యుధార భావోన్నతునిక
రసాగ్ట హృదయుజ వరియించుట మన్ననగాంచె నాంధ్రి” అని ప్రశంసించి తమ
సౌందరనందమును “నీడినట్టి భిక్ష యిదే నీకె యొసంగెదమని కళా భరణముగా
నర్చించినారు. తిక్కన కేతనల యనంతర మిట్టి రమణీయ దృశ్యము ఆంధ్ర సాహితీ
చరిత్రమున వేరొక్కటి గానరాదు. సుప్రసిద్ధుడగు నింకొక కవిశేఖరుడు,
207
డా దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
ఇలుదాటి నీవు రావలెగాని
నీ పదంబులు నమస్కృతులలో మునిగి తేలు
మతినెంచి నీవు సమ్మతి జూపవలెగాని
బిరుదాళి నీ రొమ్ము తురగలించు
చేసాచి నీవు యాచింపంగవలె గాని
మణులతో నీ కొంగు తొణకిపోవు
తల పూని నీవు చే కలమందవలె గాని
సిసలైన కవనంబు చెంగలించు
అని సముచితముగా ప్రశంసించినాడు.
ఈ విధముగా నాంధ్రులు మేలుకొని నూత్న ప్రభాతము నాహ్వానించినారు. ఆ
సమయమున దేశీయ మహాసభ ఆంధ్రుల హృదయ క్షేత్రముల స్వాతంత్ర్య బీజముల
నాటి వారిని వీరపూజా తత్పరులను గా నొనర్చినది. ప్రకాశము, పట్టాభి, సాంబమూర్తి,
నాగేశ్వరరావులవంటి యాంధ్ర మహానాయకులుద్భవించి జాతీయోత్సాహము
నినుమడింప జేసినారు. (ప్రజలలో స్వతంత్ర భావములు ప్రజ్వరిల్లినవి; జాతీయ
వాజ్మయము జనించినది. ఆంధ్రమహాసభ ఆంధ్రత్వము ప్రబోధించినది. ఆంధ్రరాష్ట్ర
సమస్య ప్రాముఖ్యత నందినది. రాష్ట్ర సంపాదనార్థము ప్రబోధ వాజ్బయము పెరిగినది.
శ్రీ తుమ్మల సీతారామమూర్తి చౌదరిగారి రాష్ట్రగానమిట ప్రత్యేక స్మరణీయము. గాంధీ
యుగమారంభమై “సత్యము” 'అహింసి “విశ్వమానవ కల్యాణము” మున్నగు
ఉన్నతాదర్శములు ప్రజల నాకర్శించినవి. ఆత్మకథ సౌందరనందమువంటి కావ్యములు
వాజ్మయమునకు మేలి సొమ్ములై విలసిల్లినవి.
వంగసాహితీ ప్రభావమిట ప్రసక్తము. శాంతినికేతనమున రవీంద్రనాథుని
సహచర్యమునంది వచ్చినాడు నవ్యాంధ్ర చైత్ర శుభోత్సవవిభాతమును చిగురింపజేసిన
ఆచార్య శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారు. సాహితీ సమితి సభాపతియై, నవ్యాంధ్ర
సాహిత్య ప్రవక్తయె, ఆంగ్లేయ ఫ్రెంచి వంగభాషలయందు సంస్కృతాంధ్రములతోపాటు
ప్రవీణులైన శ్రీ శివశంకరశాస్తిగారు వంగ భాషలోని పోకడలను కొన్ని తెనుగున
ప్రవేశపెట్టినారు. శ్రీ వెంకట పార్వతీశ్వర కవులు వంగనవలల నాంధ్రుల కొసంగినారు.
ఈ కాలముననే కవిసార్వభౌముడగు రవీంద్రనాథుని కవితామహిమ, ఆధ్యాత్మిక
శక్తియుక్తములగు నాతని రచనలు ప్రపంచమును దిగ్భాంత మొనరించినవి. ఆయన
208
సారన్వత నవనీతము
ప్రబోధించిన విశ్వమానవ సౌటభ్రాతృత్వము జగత్మల్యాణము, జాతి భేద రాహిత్యము
ఆంధ్రుల నాకర్షించినవి. “% Common wealth of nations and a federation
of worlds”
అను నాదర్శములు మన కవి కుమారులను ముగ్గులనుగా నొనర్చినవి.
చూడు మును మును మేటివారలమాట
లనియెడి మంత్ర మహిమను జాతిబంధము
లన్ని గొలుసులుజారి సంపదలబ్బెడుక,
ఎల్లలోకము నొక్క యిల్లయి
వర్ణభేదము వెల్లకిల్లయి
వేలనెరుగని (ప్రేమబంధము
వేడుకలు గురియ
మతములన్నియు మాసిపోవును
జ్ఞానమొక్కటి నిలిచి పోవును
అంత స్వర్గ సుఖంబులన్నవి
యవని విలసిల్లుక.
అని గురజాడ వారి వాక్కులవంటివి ఇతర ప్రముఖుల రచనల యందును
కాననగును. వంగ వైష్ణవ గీతములందలి రక్తి, (ప్రేమ, ప్రకృతి పురుషుల లీలా
విలాస వర్ణనము వేంకట పార్వతీశ్వర కవుల ఏకాంత సేవయందు కాననగును.
(బ్రహ్మన మాజ ప్రాబల్యము కృష్ణ శా(స్తిగారియందు గోచరము. వైవ్షవ
సంప్రదాయమందలి ప్రేమయే కాబోలు నవ్యకవుల రచనలయందు గోపాలకృష్ణుడు,
వేణుగానము రాధ మిక్కిలి ప్రాముఖ్యముగలిగి రసికుల హృదయముల కాహ్లోదము
గలిగించుట. రాధాకృష్ణుల మధుర ప్రణయమును శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు
శృంగారవీధిలో చిత్రించినారు, పోతనామాత్యుని భ్రమరగీతాదులు మన భావకవి
కుమారుల రాధాకృష్ణుల ప్రణయ సంకీర్తనమునకు కొంతవరకు కారణమేమొ?
ఈ ప్రోద్బలములన్నింటిలో నెన్నదగినది ఆంగ్లసారస్వత ప్రోద్బలము. భిన్న
నాగరికతా సంపర్మము భిన్న సారస్వత సంబంధము ప్రతిసాహిత్యము నందును
విప్లవము కలుగజేసితీరును. ఈనాటి తెనుగు సారస్వత వాహిని సంస్కృతాంగ్రేయ
వాజ్మయ వాహినులతో నంగమించి త్రివేణీ నంగమ సౌందర్యమును,
209
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
ధిక్కరించుచున్నది. ఆంగ్ల భాషా వ్యాసంగము ఆంధ్రభావకవికుమారులను
స్వేచ్భానురక్తులుగను ఆశయ పూరితులుగను జేసి సహజ భావనా మహిమకు
దోహదమొసంగి ఉజ్వలభావ పూరితములగు రచనల నుద్దీపింపజేసినది. ఆంగ్ల
సహాయమున విశ్వసాహిత్యముతో సంపర్మము గలిగి ఆంధ్ర సాహితీ దృష్టి
విశాలమైనది. నవ్యాంధ్ర కవితకు ముఖ్యాంగ్లసాహితీ ప్రోద్చలములు వర్చువర్తు
షెల్లీకీట్సు రచనలని చెప్పవచ్చును. Wordsworth ప్రకృతి ప్రేమ, ప్రకృత్యుపాసన
కీట్సు భావసౌందర్యము, భాషా మాధుర్యము షెల్లీ స్వాతంత్ర్యదాహము, ఆధ్యాత్మిక
తృష్ణ అస్పష్టతా మాధుర్యము అభినవాంధ్ర కవి కుమారులయందు పుష్కలముగా
లభించును. ఈ మువ్వురు కవుల కావ్యరీతియందలి శ్రావ్యమగు సంగీతధ్వని మన
యాధునికాంధ్ర కవుల రచనలయందు గానవచ్చును. పైన బేర్కొనబడిన యాంగ్ల
కవికుమారులయందు నీతికన్న రసపోషణకే యగ్రతాంబూలము, పరాసు విప్రవమునకు
ఆంగ్ల వాజ్మయమునకు గల సంబంధము వంటిదే గాంధి తత్వమునకు మన నవ్య
కవికుమారుల స్వాతంత్ర భావములకుగల సంబంధము. ప్లేటో తత్వము ఆంగ్లభావ
కవికుమారుల నేవిధముగా నాకర్షించి వారి ప్రతిభకు దోహద మొనంరించినదో
అదే విధముగా వైష్ణవ గీతముల భక్తి ప్రేమలు మన కవుల భావనాశక్తిని విజృంభింప
జేసినవి.
కాని నవ్యకవుల రచనలు ఆంగ్లభావ దాస్యపరిణామములు, తదనుకరణా
నుసరణములని చెప్పుట తప్పు. వీరి రచనలు సహజ ప్రతిభ కాలవాలములును
ఉజ్వల భావనా మహిమచే ప్రదీప్తములును అని తెలియనగును. ఈ రచనలలో
తెనుగుదనము మూర్తీభవించి యుండును. స్వీయభావ ప్రధానములగుటచేత
వీనియందు విలక్షణ వ్యక్తిత్వము ప్రస్ఫుటము. ఈ భావ వైలక్ష్యమేకాక శైలీ ప్రత్యేకత
ఆధునిక రచనల విశేష గుణము. ఆంగ్లభాషా వ్యాసంగము కొంతవరకు వీరి కవితా
శక్తికి దోహద మొనరించినది. అంతే-
అంతమాత్రమున తెనుంగు సరస్వతీ సౌందర్యము స్వీయ ప్రత్యేకత కోలుపోవదు.
తెనుగుదనము భావకవికుమారులు మిక్కిలిగా ప్రేమించి పోషించుకొను గుణము.
కావున వారు భాషా వధూటి కొసంగు భూషణములు ఎరువు సొమ్ములుకావు.
విశిష్టమగు భావనా శక్తిచే నుద్దీపింపబడి భవ్యమగు నావేశ ఫలితములగు వీరి రచనలు
గంభీర భావ శోభితములై సౌందర్య విలసితములై తద్రచయితల సహజ సామర్థ్యము
వ్యక్తీకరింపుచున్నవి.
210
సారస్వత నవనీతము
ఆధునిక కవితయందు కవి హృదయము ప్రతిబింబించును. కవి యొక్క
ఆశయములే, సామాజికములగు పలువిషయములను గురించిన యాతనిభావములే
నవ్యకవితయందు గోచరించును. పరోక్షముగా నేదోయొక సందర్భమును
కలిగించుకొని కాక ప్రత్యక్షముగా పాఠకుల నుద్దేశించుట నవ్య కవుల యలవాటు.
“నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు
నాయిచ్చయే గాక నాకేటి వెరపు”
అని పలికిన భావ కవీంద్రుని
“నావలెనె యాతడున్మత్త భావశాలి
ఆగి కోలేడు రేగునూహలనొకింత
ఇంత చిజుగీత యెద వేగిరించునేని”
పాడుకొనును, తాండవనృత్య మాడుకొసును, అను వాక్కులిట నుదాహరణ
యోగ్యములు. భావకవితలో కవియొక్క భావములకే ప్రాధాన్యత.
“నాకనుల యెట్ట యెదుటన నా జనకుని
జనని గుత్తుకలను గోసి ననునడిగె నతండు
నే దయాంబుధిని గాదా యటంచు
ఓ ప్రభూ! నీవయంటి నే నొదిగియుండి;
నా కనుల యెట్టయెదుటన నా లతాంగి
ప్రాణములు నిల్వునం దీసినను నడిగె నతండు
నే దయాంబుధినిగాదా యటంచు
ఓ ప్రభూ! నీవయంటి నే నొదిగి యొదిగి;
నా కనులయెట్ట యెదుటన నా యనుంగు
తనుజు కుత్తుకనులిమి తానను నడిగె న
తండు నే దయాంబుధినిగాదా యటంచు
ఓ ప్రభూ! నీవయంటి నే నొదిగిపోయి;”
అని యా దయాంబుధి పాద పంకజముల కడ మోకరిల్లిన శ్రీ విశ్వనాథ
సత్యనారాయణగారును,
“నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి రూపరేఖా కమనీయ
వైఖరులగాంచి భళీ భళి యన్నవాడె, మీదే కులమన్న ప్రశ్న వెలయించి చివుక్కున
లేచిపోవుచో, బాకున గ్రుమ్మినట్లగును పార్థివచంద్ర వచింప సిగ్గగుక్.
211
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
అని హృదయా వేదనను వెలిబుచ్చిన జాషువా కవివరుడు యీ విషయము
నిరూపించుచున్నాడు. ఈ కవులు ఆవేశ పూరితులుగాక, వారి హృదయములందు
రసోదయము గలుగక కవితా రచనకుపక్రమింపరు. గాననే వారి రచనలలో
భావములంత యుత్మటముగా హృదయమునుండి దూసికొని వచ్చునవిగా నుండును.
చూడుడు.
“ప్రకృతిని తనలోన నాకు గన్పడగనీక
దాచుకొన్న దసూయచేతను మదీయ
హృదయ రాజ్యాధినాథుని విదితయశుని;
ఏను భరియింపగాజాల నీ దురంత
కుటిల దారుణకార్య సంఘటనమింక
ఎవ్వరని ప్రకృతినన్ను ఊహింతు వీవు
అంధకారము నల్టెస లావరింప
కంపిత నిశీధ మేఘ సంఘములు గ్రమ్మ
భయదమాలిక చేత సర్వ ప్రపంచ
రాజ దండము ధరియించి ప్రతిభతోడ
మేరుభూధర శిఖర సామీష్యభాగ
పీఠికను గొల్వుదీరినభీతి దవిలి
తతమహార్ణవ ఘోషయే శృతిగజేసి
సర్వ పైశాచగణము సంస్తవము సేయ
చండ్రనిప్పుల గనుల శాసనము వ్రాసి
కడగి బంధింతు సర్వలోకాల నేను
సకల మతశాస్త్ర సారవిస్తార కలిత
నిజమనోరథ భగ్న గంఠీరవుడను
వదల నాతని జూపించి గదలిపొమ్ము
మన్నిశిత వీక్షణ నిపాత మార్గణముల
గెరలి యవ్వడుబోడు ప్రకృతి నిజంబు
ఈవు నాస్వామి జూపింపవేని వినుము
అగ్ని కణములు రాలు నేత్రాలతోడ
212
సారస్వత నవనీతము
వేడి నిశ్చాసములను కెంబెదవులదర
తనువు ఆపాద మస్తకంబును మహోగ్ర
గతిని గంపించి పోవ దుర్శతివిగాన
నీదు వైభవము నిన్ను బూదిగాగ
నిపుడె భీషణగతి శపియింతు నేను”
ఉత్సాహము, ఆవేశము, ఉద్రేకము, నవ్యకవితకు ముఖ్య లక్షణములు. ఆవేశ
సాగరమును నిగ్రహ సహాయమున నీదువాడు కావ్యకర్త. ఏ సహాయమును లేక
ఆవేశ మేవైపున ఈడ్చిన ఆవైపునకు దిరుగువాడు భావకవి. కావున కథా చమత్కారము,
వర్ణనా నైపుణ్యము, పాత్రపోషణ నవ్యకావ్యములందంతగా గానరావు. రసానుభవమున
నార హృదయుడైన కవి కుమారుని లేఖినీ విన్యాసమే నవ్యకవితా విలాసము.
ఆంగ్లేయ కవులతో నవ్యాంధ్ర కవులకు కొన్ని పోలికలు గన్పట్టుచున్నవి. ఆంగ్ల
వాబ్మయమున వలె తెనుగునందును స్మృతి కావ్యములు గోచరించుచున్నవి. దువ్వూరి
రామిరెడ్డిగారి “భగ్న హృదయము” విశ్వనాథవారి “వరలక్ష్మీ త్రిశతి” యీనాటి స్మృతి
కావ్యములలో నగ్రగణ్యములు. స్పెన్సరు, మిల్దను, షెల్లీ, ఆర్బాల్డు, మున్నగువారి
చేతులయందు నిగ్గులు దీరిన గోప కావ్య (25101210) ప్రభావము రామిరెడ్డిగారి
“వనకుమారి” యందు కాననగును. మర్మకవుల (Mystic poets) యస్పష్టతా
మాధుర్యము శ్రీ రాయప్రోలువారి కృతులయందు కన్పట్టును. ఆంగ్లేయ కవులవలె
నవ్యాంధ్ర కవులుగూడ సౌందర్యా రాధకులు. జీవితమునందలి సామాన్య
విషయములందు గూడ వీరు కవితా కన్య సౌందర్యమును దర్శింతురు. “ఆర్ధ పురుగు”,
“గిజిగాడు” మున్నగు మనోహర ఖండ కావ్యములిందుకు నిదర్శనములు.
“సరస చైతన్య రంజిత జగతియందు
కవి గ్రహింపగ రాని వస్తువులు గలవె?
రాళ్ల నేడ్చించు పచ్చి విరహులభాతి
ఏళ్లచే జోలబాడించు తల్లు లట్లు”
ఆంగ్ల కవులవలె మనవారికి పూర్వఛందో రచనలయందు కొంత యసంతృప్తి
కన్చించుచున్నది. ద్విపద, ఆటవెలది, తేటగీతులకు తెనుగులో గలిగిన ప్రచార
బాహుళ్యము, గురజాడవారి “ముత్యాల సరములు” అబ్బూరి రామకృష్ణారావుగారి
నూతన ఛందో బద్ధములగు రచనలు యీ విషయమునకు దృష్టాంతములు. ఆంగ్ల
213
డా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
భావకవితా యుగమున తత్సాహితీ విమర్శనమందు గూడ చారిత్రాత్మకములగు
మార్పులు కలిగినవి. శబ్ద విచారములతో సంతృప్తినొంది, సాంకేతికములును,
పాండిత్య ప్రదర్శనములును అగు జాన్సను, పోపుల విమర్శన లంతరించి షెల్లీవంటి
రస హృదయుల సరస విమర్శలు ఆంగ్లభాష నలంకరించినవి. తెనుగు విమర్శనా
సాహిత్యమున గూడ నిట్టి మార్పు విస్పష్టము. ప్రకృత్యుపాసనా ఫలితముగ నాంగ్ల
సారస్వతమున పరంపరా గతములు, సాంకేతికములునగు బంధనములు విడిపోయి
మానవ జీవితముయొక్క నిష్కాపట్యము సరళత, అమాయకత కవితా రంగమున
ప్రధాన పాత్ర నభినయించినవి. బ్లేకు, వర్చువర్తు వంటికవులు శైశవము నారాధించిరి.
Unsophisticated nature ను కవితాగాన మొనరించెను కాపు కవియగు 3903ను
యిట్టివాడే. దీనులయెడ దయ పేదలయెడ కరుణ బర్చు) కవితలో ప్రధానములు. ఈ
కవులయందు పాండిత్య శౌండీర్యమునకన్న సరస సాహిత్యమే అధికము. పై
విషయము లన్నింటి యందును ఆంధ్రాంగ్ల కవులకు సామ్యముకలదు.
సమకాలీనములగు నవీన భావములు, సామ్యవాదము, హరిజన సమస్య, ఖద్దరు,
వైరాగ్య రాహిత్యము, రాజసగుణ ప్రాధాన్యత (ముఖ్యముగా ఉమరు ఖయ్యాం
ప్రభావము) నవ్యకవితా లక్షణములలో కొన్ని
భావరంగముననే కాక క్రియాంగణమందు గూడ స్వాతంత్ర్య కాములు
నవ్యకవులు. ఈ మార్గమున భవభూతి వీరికి మార్గదర్శి.
“ఈ వినూతన భావముల్ తావిలేని
పువ్వులని యంధలోకమ్ము నవ్వనిమ్ము
ఈ దిగంత ప్రణయ రేఖ పాదులైన
మధువు లూరించుబో నాదు హృదయమందు”
భావిభారత ప్రత్యూషమును గాంచి యుష్పాంగగల యుత్సాహ శీలురు వీరు.
ఆంధ్రుల మహోజ్వల చరిత్రము “చావలేదు, చావలేదు.” అని ఢంకాగొట్టి వచింపగల
యాత్మవిశ్వాసము వీరికి గలదు. “సభ్యతామిషమునక దేశంబునందుల్ల నింతకు
ధర్మంబులు గాగ నెన్నబడు నన్యాయంబు లీనాటితో వికలంబై చనుగాకయంచు
కరుణావేశంబు దీపింప” బలికెడు స్వాతంత్ర్యదేవి వీరి కారాధ్య దేవత కావుననే వీరి
దృష్టిలో పూవులు గూడ.
“పేదల రక్తమాంసముల పెంపువహించి దయారసామృతా స్వాద దరిద్రులైన
ధనవంతులు పెద్దరికమ్ముకై, మతోన్మాదము పెంచు దేవునికి మారుగ నిల్చిన
214
సారస్వత నవనీతము
రాతిబొమ్మల” పూజించు నిమిత్తము గాని, “లలనాజనతాకబరీ భరైకభూషాకలన”
గాని కాంక్షింపక “మాతృదేశ సేవాచరణమ్మునం దసువు లర్బణ సేయగజాలు పార్ధివ
శ్రీ చెలువారు చోట” రాలిపోవకోరును. మాతృదేశము, మాతృభాష వీరికి
పూజనీయములు.
“ప్రాగడరా నీతల్లి భూమిభారతిని
నిలుపరా నీజాతి నిండుగర్వంబు
లేదురా యిటువంటి భూదేవి యెందు
లేరురా మనవంటి ధీరులింకెందు
ఏపూర్వ పుణ్యమో ఏ యోగబలమో
జనియించినాడ వీస్వర్గ ఖండమున
ఏమంచి పూవుల£్ ప్రేమించినావో
నినుమోచె నీతల్లి కనకగర్భమున”
అనియు
“కలదయేని పునర్జన్మ కలుగుగాక
మధుర మధురమైన తెనుగు మాతృభాష”
అనియు పొంగి పోదురు. ప్రకృతి శోభా విలాస లాలసులగు నీకవులు, వసంత
వికాసము, శేష చైత్రము, జలదాంగన కంకణము, మందారశిశువు, చందమామ,
గరిక మొదలగువానిని గూర్చి రమణీయములగు భావములను ప్రకటించిరి. గొల్లవాని
గొడవలు, కాపువాని జీవితము, బ్రాహ్మణ సంసారము, జానపదుల సరససల్లాపములు,
పేదల కష్టములు, యీనాటి కవుల కావ్య విషయములుగా నున్నవి.
నవ్యుల శృంగారము అతి లలితము, మిగుల సున్నితము, కచకుచాది
వర్ణనలకందు తావులేదు. ప్రియురాలి శాంతమనోజ్ఞరూపము, తిలకపాటల పాలమం
డల దీప్తిజాలము, కాంచనహార విలసత్మంఠ దేశము ఇవియే వీరు వర్ణించి చిత్రించునవి.
వీరి ప్రేమ సిద్ధాంతములు సంభోగ శృంగారము నాశ్రయించునవికావు. ప్రేమ
యంతరంగముల నతికింపజాలినది. కాయసాయుజ్యము అంత ముఖ్యముగాదు.
ఆధునికుల వర్ణనా ఫక్కియు నూతనము. చెదిరిన సౌందర్యము, సహజ సౌందర్యము
215
దా దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
వీరికి ప్రియములు. అంగవర్ణనమేగాక గుణవర్ణనయు వారియందు గనుపించును.
ఆధునికులు స్ర్తీని ప్రణయిని భావముతో కాక తల్లిగను సోదరిగను (ప్రేమించి
యారాధింతురు.
వీరి శైలియు క్రొంగొత్త సొబగులచే విలసిల్లును. శ్రవణ సుఖము నొసంగు
మృదుల సరళాక్షరముల సమ్మేళనము వారి శైలికి విలక్షణ గుణము.
శైలిలో మృదుత్వము సాధించుకొరకు సంధులు విసంధులైనను సాంస్కృతములు
దేశ్యములతోడ సమసించినను, వారు సరకుసేయరు. అందు నిమిత్తము వారు ఇతర
దేశీయులును గూడ మనభాషా సంప్రదాయముల ననుసరించి వాడుట కలదు.
216
సారస్వత నవనీతము
ఖండ కావ్యములు
ఆంధ్ర సారస్వతమున ఖండకావ్య మహోదయము సాహిత్య స్థాపకులగు
కవిభూషణ ఆచార్య శ్రీరాయప్రోలు సుబ్బారావుగారి రచనలలో తొలుకరించినది.
గురజాడ అప్పారావుగారి “ముత్యాల సరముల” కూర్చుతో సారస్వత ప్రపంచమున
కలిగిన సంచలమునకు సుబ్బారావుగారి రచనలు దోహద మొనర్చినవి.
సుబ్బారావుగారు పాయలు పాయలుగా విడిపోయిన తెలుగు కన్నియ ముంగురులకు
వేణియోగ్యాభరణముగా జడకుచ్చులల్లి యిచ్చినారు. ఆమె మణిబంధమందు తృణ
కంకణము భక్తితో నమర్చినారు. మరికొన్ని కావ్యసుమములను మాలికగా గూర్చి
యామెకంఠమున వేసినారు.
సుబ్బారావుగారు ప్రకృత్యుపాసకులు గావున గ్రంథారంభమున కృత్యాద్యవస్థల
ననుభవింపక, ప్రకృతిని పులకాంకిత గాత్రులై ఉత్సాహపూరిత హృదయముతో
నేవిధముగా స్తుతియించినారో తిలకింపుడు.
“మామిడికొమ్మమీద కల మంత్ర
పరాయణుడైన కోకిల
స్వామికి మొక్కి యా యభినవ
ధ్వని ధారణకుద్యమించితిన్
xxx
శశివికసించిన (శ్రావణ
నిశీధమున గానబడిన నీరద సుతకు౯
ప్రశమిత మతినై యీ ప
ద్యశుభాంజలి నొసంగితి ప్రణయార్చణమనుచుక.”
అంతేకాదు,
“అణువునజాండమునేక స
రణి నిండారిన మనోహరపు వాగర్థ
ప్రణయము గీర్తించెడి మృదు
గుణులభాషా కుమారకుల నుతియింతు౯.
217
దాః దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
శాశ్వత నవ్యస్ఫురణల
నశ్వరాలావణ్యమై యెనయు కావ్యకళా
విశ్వమునందానంద ర
సైశ్వర్యము లేలు కవిత కంజలి యిత్తుః.”
అని కరయుగమును బంధించి కావ్యరచనకు ప్రారంభించుట భవ్య
భావానుభవము కతన హృదయము ఆర్టమై రసోదయమగుటయే కారణము. తెనుగు
సాహిత్యమున తామవలంబించిన నూత్న మార్గమును గురించి వారు యీ విధముగా
వచించియున్నారు “హ్లోదైక మయమగు కావ్యమువలన నర్థింపదగిన పరమ
ప్రయోజనము ఆనందము. ఆ ఆనందోపాసన గావించువాడే భావకవి. వస్తు
సంవరణమునందు భావకవికి తన స్వానుభవమే యధికరణము. భావకవిత్వమున
స్రీ మాతృపీఠమునం దాసీనురాలగును........ అతివిశాలమగు నాత్మదేశమునందు
తనయంత మాతృభావమును మూర్తీభవింపజేయును. ఆ అనాది వీతతో
వికల్పజగన్మయుడైన తా నెట్లు మెలగవలయునో (కవికి) బోధపడుటలేదు. కావున
తండ్రిని సాక్షిగానే వదలి తల్లిని ప్రత్యక్షదైవముగా సమీపించుచున్నాడు. తనకు
యిష్టదైవము దేశము ఆమెకు ఆప్తపుత్రుడు తాను.”
అంతస్సున రసస్పందముగాక కవితా దర్శనము గాదని సుబ్బారావుగారి
మతము. వీరి కావ్యము లిందుకు మేలినిదర్శనములు. ఈ విషయమున నాంగ్ల
భావకవి సమ్రాట్టులగు పషెల్లీకీట్సులతో వీరు తలదూగుచుందురు. వారొనరించిన
ఆంధ్రులయశోగాన మీ విషయములు వ్యక్తీకరించుచున్నది. ఆ కావ్యగానమున
ఉత్సాహమే, ఆవేశమే ప్రత్యక్షరమందును ప్రత్యక్షమగుచుండును. చావలేదు, చావలేదు
ఆంధ్రుల మవోజ్వల చరిత అన్మదార్హమనోవీధి నావపాంవజ్ఞవ్లి
కెలయించుచున్నాడనని పలికి “ఆంధ్రసంతతికే మహితాభిమాన దివ్యదీక్షా సుఖస్ఫూర్తి
తీవరించె ఆ మహావేశ మర్దించి యాంధ్రులార చల్లుడాంధ్రలోకమున నక్షతలు నేడు”
అని నిద్రాముద్రితులైన సోదరాంధ్రులను ప్రబోధించినారు.
“మన పితామహ మాతామహోపనిధుల శౌర్యప్రనక్తి”, రసవశంకర
నాగగరరాగరక్తి, దూరదేశమందలి అన్యజాతుల నుద్ధరింప జాలిన వారి ప్రతిభా
విశేషము, నిజాంధ్రజాతి తంతు విచ్ళేదము సలుప జాలునని వారుఘంటా పథముగా
వచించుచున్నారు. సంగీత సాహిత్య కళలను ఉగ్గుపాలతో ద్రావియుమిసిన
218
సారస్వత నవనీతము
యాం(ద్రులను జగన్మోహనాస్త్రములభ్యనింవ నందేవావులయని వారు
ప్రశ్నించుచున్నారు. విమల సాహస సౌకుమార్యములను దిజ్ఞతంబముల చిత్రించిన
ఖద్గతిక్కన భార్య రుద్రమదేవి మున్నగు తెలుగు పడుచుల చరిత్రము జాతిచైతన్యము
కొరకు పఠింపవలయునని శాసించుచున్నారు. విజయకన్యకు వీరగోరజముబూసిన
బలభద్రులు మనపూర్వులు; పులికడుపున చలిచీమ పుట్టనగునె? ఒకనాడు
మనయింటిపడుచు జతలు చిలుక సరస్సులో శృంగారనౌకలు నిడిపిరి. నిత్యకల్యాణము
పచ్చతోరణముగ సాంగ గీతకల్యాణ శాఖ క్రింద ఆనంద దేవతలనుపాసించిన ఆంధ్రుల
మహోన్నత్యము కవిభూషణులు నోరూర నోరార కీర్తించి ఆంధ్రుల చెవులలో ఉత్సాహ
మంత్రమునూదినారు. కులము దడువక పొలిమేర గోలబడక నాజాతి, నాదేశము,
నాభాషయను అహంకార దర్శనమందుమని ప్రబోధించినారు. “జన్మభూమి” యని
వారు వ్రాసిన గీతము తెలుగువారికి ముహదాంధ్రమున జాతీయగీతముగా
నుండదగినది. శ్రీ సుబ్బారావుగారు సౌందర్యోపాసకులు. అపూర్వములగు వీరిసౌందర్య
వర్ణనలు నవ్యాంధ్ర సారస్వతమునకు భూషణ ప్రాయములు.
కృత్రిమాలంకార శోభితముగాని సహజ సౌందర్యవైభవమే సూరనార్యుని
శాలీనునికివలె వీరికిని ప్రియతమము. వీరి సౌందర్యము 'విరిసిననొక్క యొప్పు
అరవీడిన వేరొక యొప్పు కొప్పుగాబరగిన నొక్కయొప్పు' వేణిభావరచన నొక్కయొప్పు
అను సూరనార్యుని పద్యమును జ్ఞప్తికిదెచ్చును. 'జిలుగు పూలకలంకారి చీరజార'
జారు చెమ్మట ముత్యాల జంపుసరులతో నరుగుచున్న తృణకంకణ నాయికా
సౌందర్యము స్వభావరమ్యము.
శ్రీ సుబ్బారావుగారి కావ్య వాతావరణము శుద్ధముగా నాంధ్రులది. ఆ భావములు
అచ్చముగా తెనుగువారివి, అందలి నుడికారపు సొంపు తీయని తెనుగుబాసది.
సూక్ష్మాతి సూక్ష్మములగు విషయములను గురించి గంభీరతమములగు భావములను
ప్రకటించుటలో కవిభూవణునకుగల చాతుర్యము (వ్రశంన నీయము.
స్వప్నకుమారములోని
“కారుచీకట్లు లోకమున్లప్పెననుచు
నేలనిందించెదవు మేఘజాలములను”
“పూలబిడ్డల ప్రీతినుయ్యాలలూవు
పవనుడెరుగడు తొడిమలు వదలుననుచు”
219
దా దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
అను పద్యములలోని భావ గాంభీర్యము మిక్కిలి శ్లాఘనీయము.
సుబ్బారావుగారి తృణకంకణ స్వప్న కుమారములు జతగా పఠింపవలసిన
గ్రంధములు.
స్వప్న కుమారమున న్రీకాముక భావముతో తన్ను సమీపించిన కవి
కుమారునకు పుత్ర భావము నుపదేశించును.
“పిలిచి బ్రతిమాలి పాలీయగలను గాని, బాలుగొనుటకు నేయోగ్యురాలగాను”
అను వాక్యము స్వప్న కుమారమునకు సంక్షేప రూపము. ఇంత మాత్రమున నాయిక
యొక్క అభిప్రాయము (ప్రేమకూడదని కాదు; కాని యది ప్రదర్శింపబడవలసిన
విధానము వేరు అని మాత్రమే. కావుననే యా దయావతి,
“తుమ్మెదలు గ్రక్కుననుచు మధువుం ద్యజించు
భావము విరక్తి కాబోదు పడుచువాడ
కోమల ప్రేమ సంపూర్ణ కుసుమ దశల
నలరు నప్పుడె దుఃఖ రజస్సు స్థలన మగును
వర్ష ధారల గడుగంగ బడిన పొలమె
ఆర్థమై పచ్చబడు నంచు నరయలేదె”
అని పలికి,
“అనుభవింపుము ప్రేమోచ్చిష్టము కుమార
అంటులేదని నీయాప్తు లంపినారు.”
అని ప్రబోధించు దృశ్యము రమణీయము.
తృణకంకణ నాయికా నాయకులు (ప్రేమ తపస్వినులు, చిన్న నాటి నెచ్చెలులు.
ఈనాడు మన సంఘ జీవితమున అటనట యరాజకము ప్రబలుచున్నది.
విద్యాధికులు కొందరు (ప్రేమకు శారీరక సౌఖ్యమని యర్థము చెప్పుచున్నారు. ఒకరి
నొకరు వీక్షించినంత మాత్రమున హృదయము లుద్రిక్తములగుచున్నవి, క్రొత్తదన
మొకింత మాసిన యంతనే వైవాహిక జీవితము దుర్భరమగుచున్నది. కొందరి రచనలు
యీ మార్గమునే యనుసరించుచు విపరీత సిద్ధాంతములు ప్రతిపాదించుచున్నవి.
వీరికి సుబ్బారావుగారు 'తృణకంకణమున' దివ్య సందేశ మొసంగియున్నారు.
“తెనుంగుతోటలో నిత్య వర్చస్వినియగు వీరి లేఖిని స్వచ్చంద గగన
తోరణములక్రింద, సహృదయానంద కల్యాణ విహృతికొణకు, లలిత సారస్వత
220
సారన్వత నవనీతము
నికుంజవలయమున తెనుంగు మీరిన గరువవు తీరులతో భావ పదము బాడినది.
ఆ సమయమున తెనుంగుతల్లి సమక్షమున భవిష్యదాంధ్రశోభను అవలోకించినారు
కవి భూషణులు.
విమర్శనాశక్తి, కావ్యరచనాశక్తి రెండును ఒకే వ్యక్తి యందు సమముగా
విజృంభించుట యరుదు. శ్రీ సుబ్బారావుగారి యందు నిర్మాణ విమర్శనాశక్తులు
రెండును సమముగా విజృంభించిన వనుటకు వారి కావ్యములు, 'రమ్యాలోకము'ను
తార్మాణములు. కవితా ప్రపంచమున ఆవేశమునకగ్రస్థాన మొసంగి, ఆనంద
సౌందర్యముల నారాధించి ప్రకృత్యుపాసకులై శృంగార రసమును వింతరీతుల
బ్రదర్శించి, ప్రేమ స్వరూపిణి యగు స్త్రీని మాతృపీఠమునం దాసీనురాలిని గావించి
శబ్దార్థములందు సమానముగా తెనుగు దనము ప్రకటించి రసోపాసకులై వర్ధిల్లుచున్న
ఆచార్య సుబ్బారావుగారే యాంధ్రభావ కవిలోకమునకు మార్గదర్శకులు.
ఇంతలో నవ్య సారస్వతోద్యాన వనమున కవితారసాల శాఖారూఢయై ఒకనాటి
వసంతకాలమున నెల్లూరి ప్రాంతములో “దువ్వూరి కవికోకిలము” శ్రావ్యముగగూసి
రసికాంధ్రప్రీతి గావించినది. శ్రీ దువ్వూరి రామరెడ్డిగారు ఫారసి కన్న శ్రావ్యమై
పల్లవకోమలమగు తెనుంగున “పానశాలా” ప్రతిష్టలు గావించినారు. “నలజారమ్మ
అగ్ని ప్రవేశము”చే మన హృదయముల గరిగించినారు. “వనకుమారి” యందలి
మౌగ్య్యముచే మన మనముల నాకర్షించినారు. “జలదాంగన” యందు
భావనామహిమను ప్రకటించినారు. “నక్షత్రమాల” యందు ఖండకావ్యతారాగణము
దివ్యదీవ్హులతో (ప్రకాశించుచున్నది. ఇక “నైవేద్యము”న ప్రొద్ధపొడువున
దేవిపాదపూజకొరకు దోసిట గన్నేరుబూలతో దెచ్చి అర్చించిన హృదయపు సుగంధ
దీపము జ్వలించుచున్నది.
సంస్కృతాంధ్రాంగ్లఫారసీక వాజ్మయములతో చక్మనిపరిచయముగల వీరికలము
నవనవానంద భావసుందరి లతాంతములతో నవనవలాడు చుండును. క్రొత్త పాతల
కూర్మి కలయికయే ఈయన కావ్యములకు వన్నెపెట్టుచున్నది. ఈతని కవిత్వమున
రాయప్రోలు సుబ్బారావుగారి రచనలయందువలె యుత్సాహ మెల్లఎడల దీపించు
చుండును. విశ్వ సౌందర్యము సర్వమానవ సమానత్వము నీకవివర్యుడు కాంక్షించును.
రెడ్డిగారు వీరకుల ప్రభూతులు. వీరిభావములు శూరజనోచితములు.
కత్తులకూపము గాంచినంతనే వీరిచిత్తమున రోషాగ్ని ప్రజ్వరిల్లును.
221
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
కొండవీటియందు రెడ్డివీరుల నెత్తురు శౌర్య సౌరభ్యము వెదజల్లుటం గాంచి
పరవశులైనారు. నాటి రెడ్డిరాజుల శౌర్యము వారికి జ్ఞప్తికివచ్చినది. ఒక్కమారు
వారినందరిని స్మరించినారు. ఇకనేమి, యావేశ పూరితులయి శౌర్యలక్ష్మి సాహిత్యరక్తి
ఉదారాశయము “హోమధూమాగ్ని వృతంబగు నగ్నిహోత్రమటుల, మనకడపటి
నెత్తురుబొట్టువరకు చావలేదు, చావలేదు” అని వీరాలాపము లాడినారు.
గాంధీ మహాత్ముడు రాట్నమే మనకు స్వరాజ్యము దెచ్చునని వచించెను. అందలి
సత్యమును గ్రహించినాడు రామిరెడ్డి. ఈ కవి యువకుడు దేశచక్రము త్రిప్పును.
విజయకేతనము విప్పును. ఈయన “స్వాతంత్ర్య రథము'న నిజప్రభావ దుర్వార
పవిత్రమూర్తి యగు స్వాతంత్ర్య దేవతను సాక్షాత్మరింపజేసినాడు. ఆ దేవి “ధర్మజీవనా
కారమే శాంత బింబమే అకల్మష సత్యనికేతనంబే సంసారఫల స్వరూపమే
ప్రజాహృదయంబోయన కనులపండువు సేయుచు, 'సభ్యతా మిషమునక దేశంబులం
దెల్ల నింతకు ధర్మంబులుగాగ నెన్నబడు నన్యాయంబులీ నాటితో వికలంబై చనుగాక
యంచు కరుణావేశంబు దీపింపి పలికినది.
రెడ్డిగారి హృదయము మిక్కిలి సుకుమారము, సుమకోమలము. అతి సున్నితము.
పూలుకోయుటయె యీ కళోపాసకునకు కష్టము. ఏలయన పువ్వులనుండి
మంచుబొట్లు కాల్వలం గట్టెడు నశ్రుబిందువు లట్లు గారుచుండును. ఇది సహింపలేక
ప్రకృతిచిత్తము నెత్తురు లొలుకజేయ నేనెన్నడు బూనలేననుకొన్నాడు. నిజమే,
పూచిన్నల హత్యజేయ తలపెట్టుట కోకిలకు దూరముకదా! ప్రకృతి రామణీయకమును
పాడుజేసి దైవపూజకు దిగుట పాపముకాదా! ఆవేద వేద్యుని బూజింప నాత్మకుసుమ
సమర్పణమే యుత్తమము.
ఈ కళోపాసకునకు ప్రపంచమందలి ప్రతి వస్తువును రమణీయ ప్రతిపాదకమే!
ఈయన గరికను జూచి సంతోషముతో నుప్పొంగు టయే యిందుకు నిదర్శనము.
మొన్నగా గురిసిన ముత్యాల వానకు మురిపాలగుబురై పెరుగుచున్న గరికను గాంచి
ముగ్గుడై దైవస్ఫష్టిని దానికి తావొండు గలదని గ్రహించు కొనుచున్నాడు.
రామిరెడ్డి స్వాతంత్ర్య్యకామి, కృత్రిమ బంధముల పాటించుట ఆయన ప్రకృతికి
విరుద్ధము. “కాలమనంతము ఇలవిశాల, భావ లోకముక్రమముగా బడయు
మార్చు”యని భవభూతివలె తనమనస్సును స్వాతంత్ర్యసీమను జరింప జేసినాడు.
ఇదియొక్క భావలోకమునందే కాదు. దైనిక జీవితమునందు కూడ స్వాతంత్ర్య
మీయనకు ప్రియమతము. కావుననే,
222
సారస్వత నవనీతము
“కూలిజూపి నాకు కూడుపెట్టు
తిరిపమెత్తి తిన్న దీరు నాయాకలి”
అనియొక బీదముసలమ్మచే పలికించినాడు.
రామిరెడ్డి కాపుబిడ్డ. కర్షకులపై నీతనికి గాధమగు ప్రీతి. కావుననే కృషీవలుని
జీవిత విషయముల గానము జేసినాడు. ఈయన కృషీవలునికి వల్లెయే
సర్వప్రపంచము. అందు ప్రేయసి యొక్కతయే రమణీయ విగ్రహము. అతనికిగల
భాగ్యనిధులు బంగరువంట పొలములు మాత్రమే. ఇక మతమన్ననో
అనుదినపరిశ్రమము. విలంబమనునది యీతని వాజయమునలేనేలేదు. రాయప్రోలు
సుబ్బారావుగారు 'కష్టకమల'యందు బ్రాహ్మణ జీవితమునెంత రమ్యతరముగా
చిత్రించినారో దువ్వూరి రామిరెడ్డిగారు 'కృషీవలు'ని యందు కర్షక జీవితమునంత
జాగ్రత్తగా స్వీయకవితా మాలయందు గ్రుచ్చినారు.
రామిరెడ్డి మనస్సు విశ్వముతో లయాన్వితమై నటించును. ఈతని భావమునందు
విశ్వజనానుభూతి యెల్లపుడు విరియుచుండును.
వంగ భాషా ప్రోద్బలము, వైష్ణవ గీతములభక్తి ప్రపత్తులు, వేంకట పార్వతీశ్వర
కవుల రచనలయందు గోచరించును. ఒక భావమునే పలు విధముల జెప్పుట వీరి
ప్రత్యేకత. వీరు రచించిన తేటగీతములు, మంజరులలో ప్రత్యేకమగు
కోమలత్వముగలదు. తీయని పదములను గూర్చుటలో వీరు ప్రోడలు. వీరి రచనలు
ముఖ్యముగ 'ఏకాంతసేవ', భక్తిరసభరితమై (ప్రకృతి పురుషుల లీలావిలాసమును
చక్కగా చిత్రించును. వీరి రచనలు పఠించునపుడు రవీంద్రనాథుని కావ్యకన్యక మన
యెదుట నిలుచుండును.
అబ్బూరి రామకృష్ణారావుగారి రచనలు లావణ్య ప్రధానములు. మాతృదేశభక్తి
ప్రబోధకములు. వీనియందు భావనాశక్తి భవ్యమగు నావేశము సమృద్ధము. వీరి
నూతన ఛందోబద్ధములగు రచనలు, నవ్య కవితా లతాంగికి క్రొత్త శోభను
చేకూర్చినవి. మందార శిశువువంటి ఖండ కావ్యములు, వీరి కవితా రమణీయతకు
నిదర్శనములు.
దేవులపల్లి కృష్ణశాస్రిగారు స్వైరవిహార ధీరులు; తమ యానందముకొరకే
వ్రాయు వారిలో నగ్రగణ్యులు.
223
దా॥ దేవులపల్లి రామానుజరావు (గ్రంథావళి
“నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు
నా యిచ్చయే గాక నా కేటి వెజపు...
స మాయ మయ్యెదను నామధుర గానమున”
అని చెప్పుకొన్న స్వేచ్చా జీవులు. వీరి పద్యములను, నాయని సుబ్బారావుగారి
రచనలను పఠించునప్పుడు దుఃఖించుటయే వీరి స్వభావమనిపించును.
దుఃఖావేశ ప్రపూర్ణములగు షెల్లీ రచనలతో నాయని కృష్ణశాస్ర్రిగార్ల ఖండ
కావ్యములను పోల్చవచ్చును. 'శూన్యమున ఒకడనే పడిపోదును' అని శ్రీకృష్ణకాస్రిగారు
ఆక్రోశించునప్పుడు, “ఏడ్చుగూడ ప్రియంబుగాదేమిపుత్ర” అను శ్రీ రాయప్రోలువారి
వాక్యము జ్ఞప్తికి వచ్చును. తనసొగసు చూచి యేడ్చు సుందరివోలె, తమ కవితా
'ప్రాగల్బ్యమును చూచి దుఃఖించుచున్నట్లు కనిపించుచున్నారు శ్రీ కృష్ణశాస్త్రిగారు.
నాయని, బసవరాజులు లిరిక్ కవిత్వమును తెనుగులో సమగ్రముగా ప్రతిష్టించినారు.
ప్రేమ యొక్క విప్లవమును తెనుగులో కావ్యగానము జేసినారు నాయని, కృష్ణశాగ్తిగార్లు.
“ప్రేయనీ ప్రేయసీయను కృష్ణశాస్రిగారి గీతములో నేదోయొక విధమైన
అనిర్వచనీయమగు ఆవేదన గోచరించును. వియోగవేదనా భరముచే హృదయము
నొప్పినొంద, ప్రియురాలిని గూర్చి తమ యావేదనను ప్రకటించుచు, నొకనిండు
కావ్యము వ్రాసికొనిన శ్రీ శివశంకరశాస్రిగారి రచన యందలి మాధుర్యము,
సౌందర్యశక్తి భవ్యానురాగము శ్రీకృష్ణశాస్రిగారి యందు గానరాదు; దుస్సహవేదభర
మొకటిదప్ప. కృష్ణశాస్రిగారి యావేదనలో నొకవిధమగు భయంకరత్వము
గోచరించును. అగమ్య తమస్వినీ గర్భకుహరాల వెడలిపోయిన వీరిప్రేయసి, వీరిని
నీరంధ్ర భయదాంధకార జీమూతాళిలో, ఆఖాతంపు టేకాంతములో విడచిపెట్టినది.
శూన్య హృదయముతో కవిగారు, ఓచెలీ, ఓచెలియని కృంగి కృశించినారు. ప్రేయసి
కొరకు యెదురుచూచి వియోగావస్థలో -
“ఆపలేని నా కోరిక
కారుచూపు బొరగచీలి
కాలికుములు చీకటిలో
క్రాగిక్రాగి నీ కొరకై
కజవులోననె నశింతునో,”
అనియు,
224
సారస్వత నవనీతము
“ఈ వియోగ నిరాశా
క్షణక్షణ ప్రతీక్ష చెదరి
ఎగసి ఎగసి పగిలిపోదునో,”
అనియు,
“కాలాంతమునకు కాచియుందువా
ఆపలేని ఆసకు ప్రాణాంతమేని, వేచియుందునా,
చివురింపదో చైత్ర శుభోత్సవ వసంత
మీ దరిద్ర హేమంతమున,”
అనియు నాక్రోశించినారు. శ్రీకృష్ణుని వేణుగానము విని
“మోయింపకోయి మురళి
'మైయింపకోయి కృష్ణ
తీయ తేనియ బరువు
మోయలేదీ (బ్రతుకు,
మురళిపాటకు రగిలి
మరుగునీ వెన్నెలలు,
సొగయు నా యెదకేల
తగని సౌఖ్యజ్వాల”
“సౌఖ్యజ్వాల”
యను పదము కృష్ణశాస్రిగారి కవితా స్వరూపమునకు తార్కాణము. ఆ చెప్పరాని
దుఃఖములో, ఆ యవ్యక్త వేదనలో, కృష్ణశాగస్తిగారి కేమియానందమో?
“కుమిలి పోవుదు నాశావకాశముల”ను అనియు, “ఇది నితాంతతమః
క్రాంతమిది దరిద్ర” మనియు “నిర్జీవశబ్దమిట్టె మూగు, మరల (గ్రుడ్డి రాతిరిపడు,
మరలనోరుకాని శృతి లేని చీకటులు మరల మరల పాడిల్లు” అనియు విలపించినారు.
అంతియకాదు, “వెదకి, వేసారి నా వెర్రి బ్రతుకెపుడేని తుదిరేయి కను
మూయునా, మేలయై నిదుర బరువుల క్రుంగునా”యని జీవితముతో విసుగొంది,
“వనరుచేడ్వగలేను, చచ్చిచావగలేను
225
డా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
కనలేని వెలుగు కొరకై ఎన్నడును
కనరాని దాని కొరకై
ఒక క్రొత్త బరవుతో, ఒక క్రొత్త యాసతో
ఒకడనే పడిపోదునూ, శూన్యమున
ఒకడనేగృశియింతునూ,”
అనియు,
“యేడ్చివైచితి వినువారుయేరులేక
యేడ్చుసందడి నా లోననే చొరంగి”
అనియు కృష్ణశాస్త్రిగారు తమ హృదయావేదనను వెలిబుచ్చియున్నారు.
కృష్ణశాస్రిగారి పల్లకియను గీతము మిక్కిలి యాహ్లోదకరము. అదిచదువునప్పుడు
నాయికతో పాటు మనముకూడ “ప్రణయవల్లకి పల్లకి, చక్రచాప వక్రరేఖ పల్లకి,
మధు స్వప్న శాఖ పల్లకి” అని పలుకుచు పల్లకితో యూరేగుచుందుము.
తెనుంగు కవులలో ప్రియురాలిని శ్రీ శివశంకరశాస్త్రి, వేదుల సత్యనారాయణ
శాస్త్రి గార్లవలె ఆదరించినవారు మిక్కిలి యరుదు. వీరి దృష్టిలో స్రీ పవిత్ర ప్రేమమయ
దేవత. ఆమెకు సంఘమున మిక్కిలి పూజ్యస్థానము గలదు. ఆంగ్లేయ కవియగు
Ottw2y కూడ నిట్టి భావములనే వెలువరించినాడు. “ఆమె నవనీత హృదయ,
నాయంతరంగ శాంతిదేవత... జన్మజన్మ పుణ్యములు పండి ప్రాప్తమయిన కేళి
పరిత్యాగ లీల ఆమె పద సన్నిధాన దివ్యస్థలాన భక్తి నమ్రుడనై నిలంబడిన యపుడు
తలవునకు వచ్చునా పేదతనము నాకు” అని యారాధించిన వేదుల
సత్యనారాయణగారును,
“ఇందిరా నిన్ను నేనిష్టదేవతవోలె భావించుచున్నాను భక్తితో నిరతంబు, నీ
మనోహర పాద నీరేజయుగళమ్ము అర్చింతు ఇందిరా అంతరంగమునందు నీపాద
పద్మాల నిటలమ్ము సోకంగ, వ్రాలిపోక ననుజ్ఞ వాంఛించుచున్నాను” అని పలికిన
శివశంకర శాస్తిగారును, సోదర కళోపాసకులు, దీర్ణరమ్య సంస్కృతాభిరామంబులగు
ముత్యాలసరముల కూర్పులో శివశంకర శాస్త్రిగారికి ప్రత్యేక ప్రావీణ్యముకలదు.
పండిత కవులై, కవి పండితులై ప్రకాశించు శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు
ఆంధ్ర సారస్వతాకాశమున దివ్యతార. కవిత్వము వీరిచేతులందలి క్రీడాకందుకము.
ఆంధ్రావేశము వీరియందు మూర్తీభవించినది. ఆంధ్ర పూర్వరాజ్యమ్ములు, ఆనాటి
226
సారస్వత నవనీతము
సంస్కృతి, నాగరికత తలంచుకొన్నంతనే వీరి హృదయము చలించును. “ఎన్ని
జన్మముల నుండియోకదా నాతనువున ఆంధ్రరక్తము ప్రవహించుట” అని వీరు
తత్మారణము నూహింతురు. పారతంత్ర్యా పతితులయ్యును పురాణమహదాంధ్రమున
స్వతంత్ర పౌరుడనను భ్రమ వీరికి సత్యముగా దోచుచుండును. అపూర్వములగు
భావముల కాలవాలము వీరి హృదయము. చిత్రవిచిత్ర భావసౌదామినులు వీరిహృద
యాకాశమున తల్మొత్తుచుండును. “నేను మాయమ్మయొడిలోన నింతవాడనైన యప్పుడు
నాలోన యఖిల మిమిడియుందెనేమొ” యని తలంచి, “పాడుటకు మున్ను
కంఠగర్భమున నెరుగరాక యవ్యక్తమైయున్న రాగమట్లు నిభృత చిక్కణమూర్తులు
నీవు నిసువులిన్ని సుఖములు దాగినారెటుల దేవి” అని ప్రశ్నించుచున్నారు.
వరమేశ్వరుడు వీరికెన్ని యావదలు గలిగించినను దయాన్వరూవుడే.
దయాంబుధియను ఖండ కావ్యమిందుకు నిదర్శనము. ఇంకొకయెడ పరమేశ్వరుడు
వీరిని పరిగాఢ శర్వరీచ్చవి, దరిద్రతా నిధానము, తేజోవిహానము, అనవరతము
భాప్పధారా మిళితమునగు అంగణమున ఉండుమనినాడు. ఎన్నడో యొక్కనాడు
మాత్రము ఆ అంధకారమున మెరపుమెరసినది. ఆనాడు వారి కుటీరమానంద
వాయుప్రచార శతసహస్ర కుసుమ పరిమళవాప్తమైనది. కాని యంతలోతిరిగి చీకటులు
క్రమ్మినవి. ఆనాటి మెరపును స్మరించుకొనుచుండినారు కవిగారు. కాని లోకమును
దూషింపలేదు. జీవితము హేయము, దేహము శుష్మము అని తలంచి దానికి స్వస్తి
చెప్పనుంకింపలేదు. ఆట్లయినను పరమేశ్వర హృదయము వారి దృష్టిలో కరుణా
సాగరము. ఒకనాడు వారు ప్రభుదర్శనార్థమై దేవాలయమున కేగుచుండ త్రోవలో
ఎవరో యొకరు ఆయనయే వీరి గృహమునకరిగి నాడని చెప్పిరి. కాని వారే
మార్గముననేగిరో ఆయన యేత్రోవ నరుదెంచెనో యొకరి నొకరు కలసికొనరైరి. ఆ
పరమేశ్వరుని దోషమందు లేశమునులేదు. కావుననే వీరు “నీపథాంచల మంటని
మా పథమ్ము.......యెంత దురదృష్ట ముద్రితమ్ము” అని తమ భాగ్యదోషమునే
తలంచుకొనిరి, 'ఇరుత్రోవలో. ప్రభువు యొక్క రథము దీక్షాప్రణీత విధురవేగముతో
పర్వులెత్తుచున్నది. అపుడు కవిగారి శరీరము దానిక్రిందబడి నలిగినలిగి రక్తప్రవాహము
లింకినది. ఈ దీనుడెవరో ఈ హాహా నినాదమునకు కారణమేమో యనియెన రథము
ఆగలేదు. తిరిగి చూడలేదు. తెల్లవారినచో రథచోదకుడు రక్తాంకితములగు
చక్రములను కడగి శుభ్రము చేయును. ఈ సమయమున కవిగారు గాయముచే
బాధపడుటలేదు. దేవుని దూరుటలేదు. కాని వారికి కలిగినది “అచటి బహుజన
227
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
రక్తము లందు నాది యదని గుర్తేమి కనబడును స్వామి” అను ప్రశ్న యొక్కటియే.
అవురూవములగు భావములను; అనురూవములగు వద్యములలో
వ్యక్తపరచుటయందు జాణలు శ్రీ విశ్వనాథ కవిగారు. ఉన్నత భావాంచిత వీధులందు
విహరించు కవిసమ్రాట్టులయ్యు వీరు సామాన్య జనుల భావములను చక్కగా దెలసి
వ్యక్తీకరింప సమర్భులు. ఎన్నియో దినములనుండి నిరీక్షించిన వర్షమునకు
వీరేవిధముగా స్వాగత మొసగుచున్నారో చూడుడు, “మాపొన్నలు పూత వట్టునిక
పొంతపొలాలకు నీరమబ్బెడిన్; మొన్నటిదాక వానలకు మోములు వాచిరి మాదు
కర్షకుల్”. మేఘము నుద్దేశించి 'దుక్కి టెద్దడుగు పెట్టగజాలని మాపొలాలలో
నురుమదశైవపాద కటకోజ్వల నాద మనోహరంబుగా నురిమిన నీకొసంగెదను
పాయసముల్ నవ భాప్ప బిందువులో అనుచున్నారు. ఆ వానయొక్క యుపయోగము
“పొడిపొడియై తలల్ ముదిరి పోయిన యెర్రనికారుజొన్నలో, పడితిని కొత్తలో పసరు
పంటిడిజాగిన యావుదూడలుక, తడవడిపోయె మాయెడద తల్లడిలెన్ తొలివానచిక్కు
పైబడి సుఖమయ్యె నేటికనపాయత నొందెను మాదు సస్యముల్.” “పొలముల వట్టి
నీరములు బోదలె నిండవు, నాకు మళ్ళలో చెలమల నీరుతోడి యర చేతులు బొబ్బలు
వొక్కె బోదెలోపలి జలమంచు పిచ్చుకలు పాపము ముక్కులు ముంచుచుండె నీ
విలయుముదాటి పాయె ననిపించెను నీయురుముల్ కృపానిధీ” అని సవిశేషముగా
చిత్రించినారు. మూగనోము ఆచరింప సమకట్టిన ఆంధ్ర యువతి సొగసు నొకమారు
తిలకింపుడు.
“నీ తెలిపట్టు చీరెమెయి నీడలు సాగి
ముసుంగు సంజక్రొం
బూతల తెల్లలే మొగిలు పోలిక
వాలిక గాలి తూలిపో
లేత బెడంగు కుచ్చెళులు నీ చిరు
కాళుల ముద్దుతోచెనో
లేత పారాడుపయ్యెద చలించిన
పచ్చని తాళి దోచెనో”
ఆ కమ్మని పాలబుగ్గ, పతి కోసము ఇన్ని నోములను కిమ్మనకుండ
నోచుచుండుట గాంచి కవిగారు “ఓసి పసిదాన భవన్నియమ ప్రభావ సంధానముచేత
నీ పతి సుధామయమూర్తి సముజ్వలించెడిజ” అని ఆశీర్వదించినాడు.
228
సారస్వత నవనీతము
చక్కని భాషలో తీయని భావములను పారిజాత కుసుమ సుకుమారములగు
పద్యములలో వెల్లడిజేయు నిపుణులు కొడాలి ఆంజనేయులుగారు. తెనుగు భాష
యొక్క చక్కదనమే వీరి కవిత. వ్రాసినది స్వల్పముగాని గుణమున ఉత్కృష్టము. వీరి
కవితా కన్య నాజూకు రసికుల మనస్సుల నుజ్టూతలూగించును. రాధిక నుద్దేశించిన
పద్యములు కడురమణీయములు. సిగ్గులొలికెడు చూపులతో ఇతరులెవ్వరును
చూడనట్లు వేదికపై నాసీనయైన పెండ్లి కూతురు తన ప్రియుని వీక్షించుటనుజూచి
ఆమె నుద్దేశించి వీరు వచించిన యీ క్రింది వచనములు నహజాపాత
రమణీయములు.
“త్వాద్భశ బాలికల్ తలుపు దగ్గర
బాటలువాడు పెద్ద ము
త్రెదులు భర్త పేరడగి నప్పుడు
ల్ల తీగయెలుంగు ముగ్ధత£
పేదవడంగ వంతు మన పెండ్లి కు
మారునిదన్న నీదు ల
జ్ఞాదరహాస చంద్రికలు
శాశ్వతమై వెదజల్లుగావుతః.
పునుగు జవాది తావులు గుబుల్మొను నీ
పసుపుం బయంటకొం
గున ముడివైచికొంటిగద కోమలి
నీ మగడింక నెట్టు చె
ప్పినటులే వినంగలడు పెండ్లము గీచిన
గీటుదాటడం
చును వదినల్ నగక జురుకు చూపుల
జూచెడు నీకు సౌఖ్యమౌ”.
సలక్షణమగు కవిత్వము వ్రాసి ఆంధ్రరసికలోకము నాకర్షించిన నారు శ్రీ
జాషువాకవిగారు. వీరిధారాశుద్ధి మిక్కిలి ప్రశంసనీయము. పద్యములొకటి రెండు
పర్యాయములు జదివిన కంఠస్థమై భావము చెవులలో ప్రతిధ్వనించుచుండును. వీరు
ప్రయోగించు పదముల యందొక విధమగు తీయందనము మెత్తందనము
అనిర్వచనీయమగు సౌందర్యము కలవు. ఇందుకు వీరు రచించిన ఖండ కావ్యములు,
229
డా॥ దేవులపల్లి రామానుజరావు (గ్రంథావళి
ముఖ్యముగా 'పిరదౌసి”, 'గబ్బిలము'లు సాక్షి 'పిరదౌసి'లో ఈకవి కోకిల, కవుల
శక్తి సామర్థ్యములను గుణించి యేమని వచింపుచున్నాడో గమనించుడు.
“కవిని గన్నత్రల్లి గర్భంబు ధన్యంబు;”
BR
“దాటిపోయిన యుగములనాటి చరిత
మరలబుట్టింప గవియ సమరుడను...”
kx x
“కవిశాశ్వతుడుర్వరనా
రవితారముగా వసించు...”
* x x*
“వసుధశాసింప గలసార్వభౌముడగును
ధీరుడగు భిక్షకుండగు దీనుడగును
దుఃితుండగు నిత్యసంతోషియగును
సత్మవి ధరింపరాని వేషములు గలవె?”
xx x*
“తమ్మిచూలి కేలుదమ్మినిగలనేర్పు
కవికలంబునందు గలదుగాన
నీశ్వరత్వమతనికే చలామణియయ్యె.”
'పిరదౌసి'లోని కవిత్వమును గురించి ముచ్చటింపవలయునన్న, పిరదౌసి యొక్క
కవిత్వమును గురించి కవిగారు వచించిన మాటలనే పునరుద్దాటింపవలెను.
“'సాొంపుతడియారని' ఈ కావ్యములో “పదముల పొందిక గుజ్జపు కదునున కెన
వచ్చు”ను. “రససంపదయు భావ శబలతయు” గల ఈ హృద్య రచనలోని
శయ్యావిలాసము “దిరిసెన పుంబూవుకరణీ ముద్దులుగారును”. ఈ కవిగారొక చోట
“మల్లెపూవు టత్తరులొలకించి” వేరొకచోట “విషాదగీతములకే మిగిలిన రసహీనమైన
మషీపంకము”తో “సుఖంబుల ప్రొద్దుగ్రుంక” జేసి “భయంకర ఖేదతమాలవాటిక”లో
తాండవింతురు. జాషువాకవిగారి కృతులన్నింటిలో కరుణరసప్లావితమైన 'పిరదౌసి”
మేలుబంతి.
అపారమైన దేశభక్తి, అఖండమైన స్వభాషానురక్తి అప్రతిహతమైన
జాత్యభిమానము వీరి ఖండ కావ్యములందెల్ల యెడల గానుపించును. వీరి
230
సారస్వత నవనీతము
“గబ్బిలము”లోని, “తెల్లురాజ్యంపు నైలింప శ్రీల కొకానొకప్పుడు కేళీరంగ” మైన
హంపీక్షేత్ర వర్ణనను జదివి కన్నీరువిడువని తెలుగువాడుండడు.
దువ్వూరు మొదలగువారివలే జాషువా గారికిని, సత్యము అహింస రాట్నము
అభిమాన వస్తువులే యైనను అన్నివిధముల నధోగతికి పాల్పడిన హరిజనులపై
వీరికి ప్రత్యేకమైన (ప్రేమ. వర్ణవ్యత్యాసముల వలన అగ్రజన్ములనబడువారు వీరిపై
విధియించిన ఘోరయన్యాయములను నిర్మొగమాటముగా, నవకాశమున్నపుడెల్ల
యధిక్షేపించినారు.
తుమ్మల సీతారామమూర్తి చౌదరిగారి పద్యములు, ముఖ్యముగా సీసములు,
శ్రీనాథుని రచనా గాంభీర్యమును జ్ఞప్తికిదెచ్చును. తెనుగు నుడికారపు సొంపు వీరి
శబ్దములందు పూర్ణముగా గన్ఫట్టుచున్నది. “నాకులమ్ము నందువలె కవితలోగూడ
కమ్మదనము వెలయింతున”ని వీరన్నది యధార్ధము.
మాధవపెద్ది బుచ్చి సుందరరామ శాస్త్రిగారు “ఉమర్ ఖయాం), “బృందావనము”,
“పంచవటి” మొదలగు చక్కని ఖండ కావ్యములను సంతరించిరి.
ఇట్లొకవంక మన భాషలో శృంగారకరుణరస ప్రధానములైన ఖండ కావ్యములు
'ప్రవర్థమానమగుచుండ యీనాడు మనకు మిక్కిలి యవసరమై జాతిని
వీర్యవంతముగా చేయజాలు వీరరస (ప్రధానములగు మహాకావ్యములు కొన్ని
యుద్భవించినవి. ఈ రచయితలెల్లరును పండిత కవులగుట పేర్కొనదగిన విశేషము.
ఈ కావ్యములలో సుప్రసిద్ధములగు రెండు, ప్రొద్దుటూరు (గగ్రామమను ఉద్యాన
వనమున మొగ్గ దొడిగినవి. అవియే శ్రీ పండిత రాజశేఖర అవధానిగారి “రాణా
ప్రతాప సింహ చరిత్ర” శ్రీ గడియారము వేంకట శేషశాస్రిగారి “శివభారతము”
అను ఉత్నష్టములగు కావ్యరత్నములు.
ఉదాత్త కావ్య నిర్మాణము గావించి ప్రచారము నొల్లక కొంతవరకు అజ్ఞాతముగా
నున్నవారు కవిరత్న శ్రీ అంబటిపూడి వేంకట రత్నముగారు. ఈయన నివురుగప్పిన
నిప్ప ఈయన కావ్యములలో నగ్రగణ్యమగు 'మైనాదేవి', మొరాజ కన్య' పైన పేర్కొనిన
గ్రంథములతో పాటు మన వీర కావ్య సౌధములో నగ్రస్థానమాక్రమించుకొనును.
శ్రీ వేంకటరత్నముగారు కవియేకాదు. ఒక సంస్థ చండూరు ప్రాంతమున 'సాహితీ
మేఖలిను స్థాపించి నేడు తెలంగాణములోని యువక కవులలో పేరువడసిన శ్రీధవళా
శ్రీనివాసరావు, పులిజాల హనుమంతరావు, సిరిప్రగడ భార్గవరావు, మద్దోజు
సత్యనారాయణగార్ల వంటి కవి కిశోరములకు భావనా గురువులైవారిచే
రసవంతములగు కృతుల రచింపజేసిన కవివర్యులు శ్రీ అంబటిపూడి వారు.
231
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
ఇట్లీ భావకవితా సారస్వతము నొకమారు తిలకించితిమేని వానిలో ముఖ్యములు
ఖండకావ్యములని తెలియుచున్నది. మహాకావ్య రచనను (ప్రేరేపించు మహారాజులు
లేకపోవుటయు అనేక విషమ సమస్యల కాలవాలమగు నీకాలమున ప్రజలకు
దీర్గకావ్యములు పఠింప నుత్సాహము లేకుండుటయు ఆంగ్ల భావ కవి కుమారుల
రచనలు ఎక్కువగా ఖండకావ్యములే యగుటయు కొంతవరకు సమర్ధులగు కవులకు
విశేషముగా నవకాశము లేకుండుటయు నిందులకు గారణములని తోచును.
పాశ్చాత్యుల లిరిక్ కవిత్వము, జాతీయోద్యమముల ప్రభావ పరిణామముగా
(ప్రభవించిన భావకవితా స్రవంతి ఖండకావ్యములు, గేయములను రెండు పాయలుగ
ప్రవహించినది. ఖండకావ్యములతో బాటు తెనుగు బాసలో గేయములుగూడ
ప్రజామోదము వడసి అనేక ఉత్తమ రచనలకు దోహద మొసంగగినది.
ఆధునిక సాహిత్యమున శ్రీ గురజాడ అప్పారావుగారి 'ముత్యాల సరములలో”
కంఠ గేయ సాహితీ కన్యకు ఒక రమణీయ స్వరూప మేర్చడినది. తరువాత యీ
గేయసుందరిని నవ్యాంధ్ర సాహిత్యారామములోని సుందర మందిరములో జేర్చి
సర్వాంగ శోభితగా తీర్చిదిద్దినవారిలో ప్రముఖులు శ్రీ బసవరాజు అప్పారావు, విశ్వనాథ
సత్యనారాయణ, నండూరి సుబ్బారావు, అడవిబాపిరాజు, నాళము కృష్ణారావు,
మల్లవరపు విశ్వేశ్వరరావు ప్రభృతులు.
తెనుగు భాషయొక్క తీయందనమును సౌందర్యమును వ్యక్తపరుచవలయునన్న.
జటిలపద సమాసములను, కృతక గ్రాంధిక భాషను పరిత్యజించుటయే కాక ఈ
భాషకు వృత్తము లననుకూలములనియు సరళమైన మాత్రాఛందస్సులే యుక్తమనియు
అభిప్రాయపడిన గురజాడ అప్పారావుగారు గేయ కవిత్వమునకు మార్గదర్శి; ఆదికవి.
“వెనుక చూచిన కార్యమేమోయ్
మంచిగతమున కొంచమేనోయ్
మందగించక ముందు అడుగేయ్
వెనుకబడుతే వెనుకెనోయ్
దేశాభిమానం నాకుకద్దని
వట్టిగొప్పలు చెప్పుకోకోయ్
పూనియేదైనాను ఒకమేల్
232
సారస్వత నవనీతము
కూర్చిజనులకు చూపవోయ్
స్వంత లాభం కొంతమానుకు
పొరుగువాడికి తోడుపడవోయ్
దేశమంటె మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్
ఈ సురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుపడునోయ్?”
అని అప్పారావుగారు సోదరాంధ్రులనేకాక భారతీయులందరిని సూటిగా
ప్రబోధించినారు. 'దేశమును (ప్రేమించుమన్నా! అను ఈ గేయము, రవీంద్రుని,
బంకించంద్రుని, ఇక్సాలుని జాతీయ గీతముల మరపించుచున్నది. ఈ గీతముతో
అప్పారావుగారి పేరు ఆంధ్రులలో చిరస్థాయిగా నుండగలదు.
నండూరి సుబ్బారావుగారి పాటలు మహోన్నత భావ ప్రపూర్ణములై సహృదయ
హృదయాహ్లాదకరములై యొప్పుచుండును. చూపుతో మాటాడి ఊపిరితో తెనిగించు
శక్తి వీరికి కలదు. కవిత్వము వీరిని వలచి వరించినది. ఈ మార్గమున నింకెందరో
ప్రయత్నించినను “యెంకి పాటలి వంటి మనోహర కావ్యము మరియొకటి
వెలువడలేదు ఎవరేమన్నను 'యెంకిపాటలు” ఆధునికాంధ్ర వాజ్మయమున
కమూల్యాలంకారమనుట నిస్సంశయము.
బసవరాజు అప్పారావుగారి పాటలు మనోహరములు. 'యశోధరా విలాసము”,
“కాల్లాయిగట్టితే నేమి” మున్నగు గేయములు ఆంధ్రవాజ్మయమున శాశ్వతముగా
నుండదగినవి. వీరి రచనలు ముఖ్యముగా స్వానుభవ భామ్యములు.
ఉద్వేగావేశయుక్తమగు సూటియగు భావప్రకటన వానియందు వ్యక్తమగుచుండును.
విశ్వనాథ సత్యనారాయణగారి ‘కిన్నెర సానిపాటలు”, 'కోకిలమ్మ పెండ్లి? ఆంధ్ర
భాషకు మేలిసొమ్ములు. కిన్నెరసానిలోని శబ్ద చిత్రము, శైలి, భావగాంభీర్యము అనితర
సాధ్యములు. కిన్నెరసాని యను పేరుగలిగి యున్నంతమాత్రమున నొక
రసవత్మావ్యమును నొక మహాకవిచే వ్రాయించుకొని తన ఆస్తిక్యమునకు శాశ్వతత్వము
గడియించు కొనిన అసెలయేటి కన్నియ యెంత ధన్యయోకదా!
బొడ్డు బాపిరాజుగారి 'కాత్యాయిని”, అడవి బాపిరాజుగారి “గోధూళి, నాళము
కృష్ణారావుగారి “తేనెచినుకులు”, మల్లవరపు వారి 'మధుకీల' యిట ప్రత్యేక
స్మరణీయములు.
233
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
మన దేశమునందలి రాజకీయోద్యమ ప్రచారమునకు యీ గేయము చక్కగా
అనుకూలించినది. గాంధి మహోత్ముని వీలువు వినినంతనే ఒక్కమారు
ఆంధ్రదేశమంతయు సత్యాగ్రహ సమరమున ముందంజవేసినది. కవికుమారులు
సోదరాంధ్రులను ప్రబోధించి యీ తెల్ల దొరతనమునకు స్వస్తి చెప్పవలెనని
ఆదేశించినారు. వారికి గేయము అనుకూలమగు సాధనముగా ఉపయోగించినది.
ఆ రోజులలో శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణగారు కృష్ణాపత్రికయందు పుంఖాను
పుంఖముగా రాజకీయోద్యమ ్రచారకమగు గేయములను ప్రకటించినారు.
భరతమాత నుద్దేశించి వ్రాసిన గేయములు శ్రీ సత్యనారాయణగారికి ఆంధ్ర
సారస్వతమున నొక విలక్షణమగు స్థానము నొసగుచున్నవి. ఇది ప్రజా యుగము;
స్వాతంత్ర్యము ప్రజల జన్మహక్కు నిరంకుశమగు ప్రభుత్వమును, బూజు పట్టిన
రాజరికమును ప్రజలు సహింపజాలరు. ఇట్టి భావములు మన గేయకవుల రచనలను
ప్రేరేపించినవి. శ్రీ పురిపండ అప్పల స్వామిగారు “రాజుగారి కోటలో, రాణిగారి
తోటలో జిల్లెడు మొలిచింది, పల్లేరు ప్రాకింది” అని యెలిగెత్తి చాటుచు విప్లవ
పతాకమును ప్రతిష్టించినారు. శ్రీ మాదవపెద్ది బుచ్చిసుందర రామశాస్త్రి అంటరాని
తనమును నిరసించుచు గేయరచన గావించినారు.
ఈ విధముగా (ప్రబంధ కవులవలె భావ కవులుకూడా తెనుగు సాహిత్యములో
నొక ప్రత్యేక వాతావరణము సృష్టించినారు. దేశ భక్తి ప్రబోధకములగు పద్యములను
వారు గానము చేసినారు. ప్రియురాలు వారికారాధ్యదేవత. వారు స్వేచ్భాజీవులు;
సౌందర్యమును ఆనందమును ఉపాసించువారు. అరసికులకు రసము నివేదించుట
సాధ్యము కాదని వారభిప్రాయ పడినారు. కావుననే,
“సుకవి భోగ్యంబు లిచటి వస్తువులు వీని
నలిపివేయకు డిటునటు కలచి వైచి”
అని వారు హెచ్చరించినారు. తుషారజలము, నీలంపు జలదంపు నిగ్గు విరిచేడీ
చిన్నారిసిగ్గు, వసంత బుతుశోభ, కోయిల కూతలు, కమ్మతెమ్మెరలు, ఎలదేటి
చిరుపాటలు, చిబుజరీయంచు చీర, రుచిరకర సరోజములు, కాంచనహార
విలసత్మంఠదేశము, జారుచెమ్మట ముత్యాల జంపుసరులు మున్నగు మనోహర
సామగ్రినివారు సాహిత్యమునందు సమకూర్చినారు. కానివారు కల్పించిన
యీనిత్యకల్యాణము పచ్చతోరణము యెక్కువ రోజులు కాపురము చేయలేదు. ఆ
సుఖస్వప్నములు కొలదికాలమే నిలిచియుండినవి.
234
సారన్వత నవనీతము
అభ్యుదయ యుగము
ప్రథమ ప్రపంచ మహా యుద్దానంతరము (ప్రజాస్వామికముల బూటకపు
ప్రవర్తనపైనను, యుద్ధకారణమగు పెట్టుబడి విధానము పైనను, శుష్కధర్మ
ప్రవచనముల పైనను ప్రజలకు యేవగింపు, నిరాశ, నిస్పృహ కలిగినది.
తత్భలితముగా పాతసంప్రదాయముల నెదిరించి క్రొత్త వానిని యేర్చరచుకొను
ప్రయత్నము తీవ్రరూపము దాల్చినది. ఇతర రంగములందువలె సాహిత్య రంగమున
గూడ యీ ప్రయత్నము ప్రస్ఫుటమైనది. కవిత్వములో తిరుగుబాటు, పురోభాగిత్వము
పొడసూపసాగినవి. పూర్వ ఛందోనియమములను కావ్య సాంప్రదాయములను
పాటించక యెవరి యిష్టము వచ్చినట్టు వారు వ్రాయసాగినారు. ఈ క్రొత్త క్రొత్త
పోకడలకు, Dadaism, Sur - Realism, Impressionism అను కొన్నిపేర్లు
వ్యాప్తిలోనికి వచ్చినవి. ఈ 'యిజం'లలోనే యొకదానికిగూడ సరియైన స్వరూపము
యేర్పడకమునుపే మరియొక్క 'యిజం” బయలుదేరి సాహిత్య రంగమున
అరాజకత్వము, అయోమయత్వము ఆవరించినవి.
పైన పేర్మొనినట్లు భావకవుల సుఖస్వప్నములను పడద్రోసి వారుకల్పించిన
ప్రశాంత సుందర వాతావరణమున అరాజకత్వపు సుడిగాలి తీవ్రముగా చెలరేగినది.
ఇన్నాళ్ళు గేయరచన సాగించుచున్న కొందరు కవులకు యీ అధి వాస్తవికతపై
ప్రీతి హెచ్చినది.
పల్లెపడుచు, నిర్మల మనస్మయు నగు 'యెంకి' యింట నుండి బయలుదేరి
కిన్నెరసాని" యింట కళోపాసనము ముగించుకొని “గోధూళి వేళ నవ్య సాహిత్య
వీధులందు మలయామారుతము సేవించుచున్న కవితా లతాంగి ఒక్కమారుగా యీ
అరాజకత్వపు కారుచీకటులను యెదుర్మొనవలసి వచ్చినది. ఒక వంకనుండి శ్రీశ్రీగారు
మరియొక వంకనుండి పఠాభిగారు అట్టహాసము గావించుచు ఆమెకు చీకాకు
కలిగించిరి. ఆయమ తొట్రుపాటును, మంజులగళస్వనమును, కజ్జలాన్విత
నేత్రయుగ్మమును అవలోకించి శ్రీశ్రీగారు
“యిదేమిటీ వింత భయాలు?
ఇంట్లో చీకటి?
235
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
ఇదేమిటీ అపస్వరాలు?
తెగింది తీగ!
అదేమిటా రంగులనీడలు?
చావూ బ్రతుకూ!
ఎక్కడి కెళ్తావీ రాత్రి?”
అని గద్దించి అడిగినారు.
“దుద్దుకజ్బతో నడుములు విరగదంతా”ను అని పఠాభిగారు అట్టహాసము
గావించినారు.
“ఎల్జిశాలువ కప్పుకొని మాయింటికొచ్చిందొక రివాల్వర్” అని
భయపెట్టినారు. ఇక పాపమామె భరించుకోలేక పోయినది.
“తురాయికంటె, అకురాయికంటె, కీ
చురాయి కంటె హిమాంశురాయి గొప్పవాడ”ని
“తెల్లమబ్బులు తెనాలి వెళ్ళాను, కుక్క వెంట పాండవులు స్వర్గానికి” అను
పదనృత్యములు భావకవితాకన్యను భయాన్వితను గావించినవి.
శ్రీశ్రీ పఠాభిగార్లతోపాటు ఆధివాస్తవిక రచనలు సాగించినారు గోరాశాస్త్రి,
శ్రీరంగం నారాయణబాబు, సౌరీస్, ఆరుద్ర, దేశరాజు కృష్ణశర్మ మున్నగువారు.
ఈ ఆధివాస్తవికతా స్వరూపమును నిర్దేశించుట సాధ్యము గానిపని. అట్లు
సాధ్యము గాకపోవుటయే ఆధివాస్తవికతయొక్క ప్రత్యేకతయని చెప్పవచ్చును. కావుననే
వారు,
“జీబ్రాకు, Algebra చిహ్నాల
లాంకోటు పాంకోళ్లు తొడగి
సాహిత్యం పౌరోహిత్యం చేస్తే
వెట్టికాదు SUI - 192130 ర. సోదరా!”
అని చెప్పియున్నారు.
వీరి రచనలను పరిశీలించినప్పుడు యెవరికివారే యమునాతీరే అను సామెత
జ్ఞప్తికి వచ్చును. ఒక నిర్ణీతమగు ఆదర్శము లేదు. ఒక విస్పష్టమగు పద్ధతి కానరాదు.
గందరగోళము చేయుటకు వీరికి సాహిత్యమొక సాధనము. సౌందర్యమునకు అగ్ని
236
|
\
|
|
సారస్వత నవనీతము
సంస్కారము గావించుటయందే వీరి కానందము కలదు. వీరు ఉపయోగించు
పదములకు అర్థములేదు; ఉండవలసిన యవసరములేదు. అర్ధమును అధ్వాన్నపు
అడవిలో వదలుచున్నారు. యీ మతమును తెనుగులో ప్రతిష్టించిన పీఠాధిపతులు,
ఛందస్సు వీరు అర్థమునకు ముందే పరిత్యజించినారు. పిల్లివలె మ్యావు మ్యావు అని
యరచుటయందు వీరికేమో ఆనందము కలదట. ఇంగ్లీషు మాటలు, ఇంగ్లీషు లిపిలో
వీరు పుంఖాను పుంఖము వాడుచుందురు. తెనుగులిపిక్రమమును (Spelling)
వ్యత్యాసము చేయుట వీరి మరియొక ప్రత్యేకత. ఈ సందర్భమున పఠాఖిని
అసహాయశూరునిగా మనము పేర్కొనవచ్చును. ఒక్కమాటలో, నోటికివచ్చినది,
ఇష్టమువచ్చిన రీతినివ్రాయుటయే వీరి విశిష్టత.
సాహితీ సమితి కవులమీద పగదీర్చు కొనుటయే వీరియుద్దేశమైనట్లు వీరికవితా
సామగ్రివలన మనకు స్పష్టమగుచున్నది. చూడుడు,
“పులిచంపిన వేడినెత్తురు, రుద్రాలిక నయన జ్వాలిక, కలకత్తా కాళికానాలుక,
రగులుకొనే రాక్షసిబొగ్గు, బుగులుకొనే బుక్కాగుండా, రాబందుల రెక్కలచప్పుడు”
వీరికి కవితా సామగ్రి. భీభత్సము, ౮813130 వీరి కవితా ప్రపంచమున
వికటాట్టహాసము గావించుచుండును.
1930వ సంవత్సర ప్రాంతమున నకల (ప్రపంచము ఆర్థికక్షోభకు
ఆలవాలమైనది. చదువుకొన్నవారిని నిరుద్యోగ పిశాచము పీడింప సాగినది. విశ్వ
విద్యాలయములందు డి(గ్రీలను నంపాదించిన యువకుల జీవితములు
కష్టభూయిష్టములైనవి. వారికి భవిష్యత్తులో కారుచీకటులు తప్ప మరియేమియును
కానుపించలేదు. నిరాశ, అసంతృప్తి, అశాంతి. ఇవియేవారికి యేదిక్కు జూచినను
ప్రత్యక్షమైనవి. ఇక వారికి యీ సుందర వాతావరణము, గులాబి గుత్తులఅత్తరులు,
పన్నీటిజల్లులు, మల్లెపూలదండలు, దివ్య కుసుమాంగి యీనెలు దీసియిచ్చు
తమలపాకుల మడుపులు, సొగసులాడుల సౌందర్య సంకీర్తనములు కేవలము కల్పిత
ప్రపంచమునకు సంబంధించినవియై యెండ మావులవలె విసుగు కల్గించుటలో
ఆశ్చర్యములేదు. ఆకట నకనకలాడు డొక్కలకు ఈ మధుర స్వనములు
హాయికల్పించునా? కావున వారి దృక్పథము ఇంకొక వంక ప్రసరించినది. విద్యాధికుల
భగ్నజీవితములు సారస్వత సలిలప్రవాహమునకు క్రొత్త కాలువలు గట్టినవి.
ఇంతకుముందు సారస్వతో పాసకుల నాకర్షించిన షెల్లీకీట్సుల కావ్యజాలము, మపాసా
237
దా/ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
ఆస్కార్‌వైల్స్‌ల గ్రంథ సముదాయము, త్వరత్వరగా వారి షెల్ళుల నుండి
నిషమింపసాగినవి. రష్యక విప్లవము మనవారి దృష్టి నాకర్షించినది. మార్క్సులెనిజ
రచనలు చదివి ఉత్తేజితులైనారు. గోర్కీ హ్యుగో, డోస్టోవొస్కి జోలా రచనలు మనవారి
భావనాశక్తికి దోహదములైనవి. కావుననే శ్రీశ్రీగారు
“మరో ప్రపంచం, మరో ప్రపంచం
పదండిపోదాం, వినలేదా
మరో ప్రపంచపు జలపాతం?
ఉరకండీ, ఉరకండీ, ముందుకు”
అని యువ్చైస్వనములో హెచ్చరించినాడు.
తమకు తమ పూర్వులకు గల విభేదములను “వ్యత్యాసం” అను గేయములో
చక్కగా వ్యక్తీకరించినాడు. “వడ్డించిన విస్తరి మీ జీవితం, మంచికీ చెడ్డకీ మధ్య
కంచుగోడలున్నాయి మీకు” అని ఆయన పూర్వుల నుద్దేశించి పలికినాడు.
1. “బ్రతుకు కాలి, పనికిమాలి
శనిదేవత, రథ చక్రపు
టిరుసులలో బడినలిగిన
కూడులేని గుడ్డలేని
పక్షులార భిక్షులార
హతాశులై యేడవకండీ
2. మీరక్తం కలగి కలగి; మీనాడులు కదలి కదలి మీ ప్రేగులు కనలి కనలి.
3. అది విలయం, అది సమరం అటో యిటో తెగిపోతుంది,
స్వాతంత్ర్యం, సమరభావం, సౌభ్రాతం, సౌహార్ద పునాదులై.
4. నేనుసైతం ప్రపంచాబ్దపు తెల్లరేక్రై పల్లవిస్తాను, నేనుసైతం విశ్వవీణకుతంత్రినై
మూర్చనలుపోతాను”
అని యావేదనతో మనకవికుమారులు ముందుకువచ్చినారు. జీవితము
సంఘర్షణయని యెలుగెత్తి వచింపసాగినారు.
సమకాలిక రాజకీయములందలి మార్పులు కొంతవరకు వీరి రచనలకు
ప్రోత్సాహ మొసంగినవి. ప్రజసామాన్యము యొక్క శ్రేయస్సే. లోకకల్యాణమే తమ
238
సారస్వత నవనీతము
ఆదర్శమని వీరు నొక్కి నొక్కి చాటుచున్నారు. పెట్టుబడివిధానము, జమీందారీ
వ్యవస్థలపై తిరుగుబాటు, సమాజము నందలి ఆర్థిక వ్యత్యాసములు వాజ్మయ
రంగమునకెక్కినవి. శ్రమ జీవులచెమటలు, అనాథల అ(శ్రుకణములు, దారిద్ర్య
పిశాచపు ప్రళయ తాండవము వీరి హృదయములపై సమ్మెటపోటులైనవి. వీరి కవితలో
ఆనంద భాష్పములకన్న అ(శ్రుకణములే అధికము. పండు వెన్నెలకన్న పరిగాఢ
తమమే, ఉత్సాహముకన్న నిరుత్సాహమే వీరి రచనల యందు కానుపించును. భావ
కవులధారా శుద్ధికలిగిన వృత్తములు, ఆటవెలదులు. తేటగీతులు ద్విపదలు
మున్నగువాని స్థానము గేయము ఆక్రమించినది. శ్రవణ సుఖము, శైలీ రమ్యతలకు
ప్రాధాన్యము తక్సువైనది. అబ్బూరి వంటి కవుల క్రొత్త పోకడలు వీరికన్నులకు
లంబాడి లంగాలవలె గోచరించినవి.
ఈవిధముగా అభ్యుదయ మార్గము తెనుగు సారస్వతమున ప్రాముఖ్యత
వహించినది.
ఆరంభ కాలమున “రాజకీయములలోని 'కమ్యూనిజం'కు సారస్వతము నందలి
రూపాంతరమీ అభ్యుదయమార్గమ”ను అభిప్రాయములు వ్యాపించియుండెను. కాని
అభ్యుదయ రచయితల సంఘమువారు యీ అభిప్రాయములను నివారించుటకు
ప్రయత్నము గావించుట సంతోషప్రదము.
వీరి సమావేశములందు సుప్రసిద్ధాంధ్ర కవిశేఖరులు పాల్గొనుచున్నారు.
నన్నయాదులగు పూర్వులనుకూడ వీరు అభ్యుదయ వాదులుగనే అంగీకరించు
చున్నారు. లక్ష్మణరావు, వీరేశలింగము వంటివారి వర్ధంతులను వీరు జరుపుచున్నారు.
చిలకమర్తివారి 'స్వీయ చరిత్రను వీరు ప్రకటించియున్నారు. న్యాయమూర్తి
రాజమన్నారు వంటివారు వీరి సమావేశములకధ్యక్షత వహించి తమయుపన్యాసమును
సమన్వయ పద్ధతినే నడిపించినారు; అన్నియు సమాధాన వాక్యములనే పలికినారు.
రచన, రచన కొరకుగాక జీవితమును రమణీయము జేయుట కొరకని వీరి వాదన.
సమాజమునందలి క్రుళ్ళును తీసి వేయవలెను. అభివృద్ధికి దారితీయు అన్ని
యుద్యమములకు సహకార మొసరింపవలెను. శాంతి స్వేచ్చను సాధింపవలెను.
సాహిత్యము ద్వారా మన సాంఘిక జీవితమును పునరుజ్జీవింప జేసికొనవలెను.
విప్లవ శక్తి యెచ్చట గోచరించినను దానిని బలవంతము జేయవలెను క్రొత్త యుగము
నందలి విశిష్టతను ప్రజలకు ప్రబోధింప వలెను. సమస్యను నిర్దేశించి కర్తవ్యమును
స్ఫురింపజేయవలెను.
239
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
ఇట్టియున్నతా దర్శములతో మన యువకవులు సారస్వతరంగమున ప్రవేశించి
ముఖ్యముగా గేయ రూపమున తమ యావేదనను వ్యక్తీకరింప సాగినారు. మన
సమాజమునందలి అన్యాయములను, ఘోరవ్యత్యాసములను వీరు సుస్పష్టముగా
ప్రకటించుచున్నారు. ఈ నాడు మనల నెదుర్కొనుచున్న నమస్యలేవియో
వీరిగేయములు ప్రజా సముదాయమునకు వ్యక్తీకరించుచున్నవి. స్థాలీపులాక
న్యాయముగ యీయుకవుల రచనల కొన్నింటిని వరిశీలించినచో వీరి
హృదయములందు అగ్ని పర్వతము లేవిధముగా (బ్రద్దలగుచున్నవో మనకు
బోధపడును.
శ్రీతాపీ ధర్మారావుగారి వంటి పెద్దలను, పండిత ప్రకాండులనునకూడ నీ
అభ్యుదయోద్యమము ఆకర్షించినది. శ్రీశ్రీగారి “మరోప్రపంచం”లో వారు పులకితులై,
అభ్యుదయ గీతములనాలపించినారు. ఈ ప్రపంచము నందలి వ్యత్యాసములను
వారు,
“నెత్తు రోడు కన్నులు వేయి కలగ బట్టేనోయ్
కలిమి తళుకు ఒకధనికుని కంటనుంటాది.
తిండిలేని నోరులు వేయికలగ బట్టేనోయ్
సావుకార్ల విందొక్కటి సాగుతుంటాది.
కరగి తరగు కండలు వేయి కలగబట్టేనోయ్
పెద్దవారి ఫ్యాక్టరీలు పెరుగుతుంటాయి”
అని యెలుగెత్తి చాటినారు. అభ్యుదయకవులలో నొకప్రముఖ స్థానము
నాక్రమించుచు, అభ్యుదయ ప్రతికాసంపాదక వర్గములో ముఖ్యులై, అనేక విధముల
భాషా సేవగావించుచున్న పండితులు శ్రీ ప్రయాగ కోదండరామశాస్త్రిగారు. వారి
పాండిత్యము వారి రచనలలో ప్రస్ఫుటముగా గోచరించుచుండును.
“రాళ్ళుతిని యేళ్లుత్రాగు దుర్భరదరిద్ర
మానవులు రత్నగర్భా కుమారులైన
వారితో గూడ వింత సంసారయాత్ర
గడుపుచున్నారు” అని శ్రీ ప్రయాగవారు తాపీ ధర్మారావు గారి భావములనే
మరొక విధముగా వ్యక్తీకరించుచున్నారు.
240
సారస్వత నవనీతము
“ఈ ప్రపంచమునందలి కోటికులాలకు, లక్షమతాలకు బానిసగా నేను
బ్రతుకలేను. సంఘానికి చదువునేర్పు స్వతంత్రుడిగా నేను జన్మిస్తానని శ్రీ కుందుర్తి
ఆంజనేయులుగారు విప్లవధ్వజమునెత్తినారు. అదియే వారి యభిప్రాయములో
నరజాతివిముక్తికై వెలసిన నవపతాక.
“ఈ నవపతాకముగాంచి పతిత ప్రజలగుండెలు పరిప్రల్లమయ్యె”నని శ్రీ అనిసెట్టి
సుబ్బారావుగారు వక్కాణించుచున్నారు. ఈ సమధర్మ సంధు సంస్థావన
జేయువేళయందు, “దిక్కులన్నీ మనకు దివిటీలువట్టిన”వని వారు
స్వాతంత్రయోధులకు జూవించుచున్నారు. “శ్రామికుల శిరన్సులతో
బంతులాడుపాలకులను ప్రగతి చక్రఘట్టనలతో సంహరింపవలె”నని శ్రీ అనిసెట్టి
సుబ్బారావుగారు ప్రబోధించుచున్నారు. మరొక వంకనుండి శ్రీ నార్ల చిరంజీవిగారు
“యుగయుగాల నుండి మనలను బంధించియున్న సంకెళ్ళను తెగ ద్రెంచవలె” నని
ఆదేశించుచున్నారు. 'క్రాంతిపథమును జూపించి శాంతిజగమును స్థాపించుటయే
వీరి ఆదర్శము. వీరి యభిప్రాయము ప్రకారము మానవజాతి చిరకాలమునుండి
అనుభవించుచున్న దాస్యముపోయి స్వాతంత్రము రానున్నది.
“ఏదేశ చరిత్ర చూచినా యేమున్నది గర్వకారణం...
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం”
అని శ్రీశ్రీ ఉద్దాటించినారు. అభ్యుదయ కవులు ఒక తరముముందటి
కవీశ్వరులవలె, ప్రాచీనాంధ్ర వైభవమును, ప్రశస్తిని కీర్తించి యుండలేరు. అది వీరి
భావనాశక్తికి దోహదమొసంగి యుండలేదు.
నేటి మతకలహములను మరచి ప్రజలందరు ఏక కుటుంబముగా మెలగ
వలెనని యీఅభ్యుదయ కవులు ప్రబోధించుచున్నారు. కావుననే శ్రీకొనకళ్ళ వెంకట
రత్నంగారు,
“ఉక్కు తల్పుల ఊచలొక్కటైనా విడదు
సంకెళ్ళ బరువింత సడలిపోనే లేదు
కత్తులేరుళిపించుతావా,
సోదరుల
కుత్తుక తెగనరుకుతావా?”
241
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
అని ఆవేదనతో ప్రశ్నించుచున్నారు కర్షక కార్మికుల జీవితము అభ్యుదయ
సాహిత్యమునందు అగ్రస్థానము నాక్రమించుచున్నది. కూలీల రైతుల సుఖదుఃఖముల
నీకవులు చక్కగా గానముచేసి యున్నారు శ్రీవిశ్వనాధ కృష్ణదేవరాయల వంటి
యువకులు,
“ఏరువాకను గారవించుట ఏటఏట మరచిపోకోయి
కరువు రాదోయి
దేశాన పరువుపోదోయి”
ప్రొద్దంతము చెమ్మటయోడ్చి కష్టించి పనిజేయు (శ్రమ జీవులే మనసంఘము
నుండి వైదొలగినచో, మనగతి యేమికావలయునని యువకవులలో
శ్యమంతకమణివలె తేజరిల్లు శ్రీపొట్లవల్లి రామారావుగారు ప్రశ్నించుచున్నారు.
అన్యాయముగా రాజులకోపాగ్నికి గురియై చెరసాలలో కృంగి కృశించుచున్న
స్వతంత్ర భావప్రేరితులగు అజ్ఞాతజీవులను అసహాయ జీవులను గాంచి
వీరెట్టిభావములను వ్యక్తీకరించినారో విచారించుడు. మానవుని రూపములోనున్న
దానవులు ఉక్కుగొలుసులు పేని, ఉరికొయ్యలు నాటించి, నిలువు గోడలుగట్టి యీ
అసహాయజీవిని ఖైది గావించినారు. ఇకవారేమో రక్తము పారించి రాజ్య తృష్టాంధులై
దేవతలరూపమున దిరుగుచున్నారు. మరియొకచోట వీరు ప్రజా సముదాయమును
గురించి యెంత సత్యమగు భావములను వెల్లడించినారో తిలకింపుడు. “జనత యొక్క
జననము చీకటిలో; మరణము వాకిటలో, చరిత్ర విస్థృతిలో” వారు నేర్చినదిలేదు,
మరచినది లేదు. అట్లయినను వారియందు నిబిడీకృతమైన శక్తి బలవత్తరమైనది.
స్టాలి౯ ఆశక్తినిజూచి సమ్మోహితుడైనాడు. మహత్ముడు ఆశక్తికి ముగ్గుడైనాడు.
నిజముగా ఏవ్యక్తిపైనను పూలుజల్లునది వారే; ధూళీజల్లునది వారే; కరి యెక్కించినను
వారే; ఉరి యెక్కించినను వారే. తెరచాటు భాగవతము వారికి సరిపడదు. ఈ విధమగు
ప్రజాసముదాయపు ఆధిక్యతను కీర్తించినారు శ్రీ పొట్లపల్లివారు.
యువకవీశ్వరుడు శ్రీకాళోజి నారాయణరావు, కొన్ని మంచి అభ్యుదయ రచనలు
గావించినాడు. కూరలోని యుప్పువలె కాళోజి కవితలో రాజకీయము లొప్పుచుండును.
రాజకీయ స్వాతంత్ర్యములేక మనము యెన్నాళ్ళు ఆధోగతిలో నుండవలెనని
పరితపించినాడు కాళోజి. “పోలీసు టండను దౌర్జన్యాలు పోషణ బొందేదెన్నాళ్ళు
దమననీతితో దౌర్యన్యాలకు దాగిలుమూతలు యెన్నాళ్లు? బాధలు పెట్టి పలకనీయని
242
సారస్వత నవనీతము
పాపుల భయమెన్నాళ్ళు? పగటిదోపిడుల నాపగ లేక ప్రజాదరణ గోల్పోయిన ప్రభుత్వ
మింకెన్నాళ్లు” అని యాయన ఆక్రందించినాడు.
“రాజులపేరిట అరాజకమునకు
జరిగిన పూజలుచాలింక,
బీదల సర్వస్వముతో ధనికులు జేసిన
బేరములుచాలింక” అని యావేదన పడినాడు.
“అన్నపురాసులు ఒకచోట
ఆకలిమంటలు ఒకచోట
సంపదలన్నీ ఒకచోట
గంపెడుబలగం ఒకచోట
అవకాశమంతయు ఒకచోట
అవసరమెల్లను యింకొకచోట” అని
యీ కవీశ్వరుడు మనకు చూపించుచున్నాడు. దౌర్జన్యముల వేపమునను
సహింపలేని సుకుమార హృదయుడు మనకవీశ్వరుడు.
అభ్యుదయ కవులలో దాశరథి కృష్ణమాచార్యులు గారికొక ప్రత్యేకమగు స్థానము
కలదు. వీరు శ్రీశ్రీని అనుకరించి మించినారను ప్రతీతికలదు. యువ కవులలో
సంస్కృత సమాసముల నుపయోగించుటలో దక్షులు. అభ్యుదయ కవిత్వమునకు
మేలి నిదర్శనములు వీరిరచనలు. మార్చిను సిద్ధాంతములకు చక్కని భాష్యములు
వీరి గేయములు. “ఆగర్భ శ్రీనాథుడికి అనాథుడికి అనాదిగా సాగుతున్నది అనంత
సంగ్రామ”మని వచించుచున్నారు. ఆ సంగ్రామము యొక్క దిగ్విజయము
ఆకాంక్షించుచున్నారు. చెమటయోడ్చి కర్షకకార్శికులు ఉత్పత్తిజేయు దేశధనమును
జమీందార్లు, శ్రీమంతులు దోపిడిజేయుట వీరికి గిట్టదు.
అంతేకాదు,
“మధనపడే మేధావులు
నిర్మించిన అణుశక్తికి ప్రభుత్వాల కంట్రోళ్ల'ను వీరుగర్జించుచున్నారు.
“సజ్ఞబువ్వ కోసరమై లజ్ఞవిడిచి
చిరిగిన చీరెలతో ముజ్జగాలు తిరిగే
243
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
పేదల ఎంగిలి మెతుకులు దొంగిలించి
బంగారం పొంగించిన ధనికులను
మింగాలని దొంగ చాటుగా కాలం
తొంగి చూచుచున్న”
దని హెచ్చరించుచున్నారు.
ఈ అభ్యుదయ రచయితల కవితా వ్యాసంగము ముఖ్యముగా గేయరూపముననే
మనకు లభించుచున్నది. వృత్తములు మున్నగు పూర్వ ఛందస్సులను వీరెవ్వరు (శ్రీ
ప్రయాగ కోదండ రామశాస్త్రి గారివంటి యొకరిద్దరు తప్ప) తమ సాధనగా
స్వీకరింపలేదు; అవి యందుకు తగినవి కావనికూడ వీరిలో కొందరు విస్పష్టముగా
వచించియున్నారు.
అభ్యుదయ సాహితీపరులగు యువకవుల భాషను గురించి యొక మాట.
దీర్షసంస్కృత సమాసములతో నిండియున్న కొన్ని గేయములు ప్రజా సామాన్యము
నేవిధముగా రంజించునో తెలియదు. ప్రజలకొరకుద్దేశించిన సాహిత్యమునందు
గాఢగూఢ సమాసముల కేమైన తావు కలదాయని యోచింపవలెను.
1. “మహోత్సాతమై, గహనాంతర నిష్యందివలె”
2 తీవ జాజ్వల్యమాన విప్లవ శంఖపు విభాతం”
3. “భుజంగ ప్రయాతం బుభుక్షాభిఘాతం”
4. “ఖద్గమృగోదగ్రవిరావం, రుంరూనిల షడ్డధ్వానం”
స్థాలీపులాకన్యాయముగా ఉదాహృతములు. వీరి రచనలు జాను తెనుగుననే
విలసిల్లవలెను. సాహిత్యము యొక్క పరమ ప్రయోజనము లోక కల్యాణమను
ప్రాచీనుల యభిప్రాయమునే అభ్యుదయ వాదులుకూడ అంగీకరించుట మిక్కిలి
ప్రశంస నీయము. సారస్వతమున నవ్యతకు సర్వదా సుస్వాగతము. క్రొత్తదియన్నంత
మాత్రముననే ఎవ్వరును ఉలికిపడవలసిన యవసరములేదు. మార్పు సజీవ
సాహిత్యమునకు సహజమగు లక్షణము. పాడిన పాటలనే మరలపాడుట వలన
ఎట్టి ప్రయోజనము లేదు. ఏదోయొక విలక్షణత యున్నప్పుడే రచనలు శోభించును.
అంధానుకరణము అనర్థదాయకము. నిజమైన రచయిత రచనలయందు తన ప్రత్యేక
వ్యక్తిత్వమును ప్రతిబింబింప జేయవలెను. అప్పుడే సారస్వతమునకు సార్థకత. కాని
244
సారస్వత నవనీతము
యొక విజ్ఞప్తి. వాయమున సంప్రదాయమును తృణీకరింపరాదు; సంప్రదాయము
పవిత్రమైనది. మనసంప్రదాయము పోషించుకొనుచు ఎన్ని మార్పులైన తేవచ్చును;
ఎంతముందుకైన పోవచ్చును. అదియే నిజమైన ప్రగతి.
“దేశమనియెడు దొడ్డ వృక్షము
ప్రేమలను పూలెత్తవలెనోయ్.”
xxx
“ఆకులందున అణగిమణగీ
కవితకోయిల పలకవలెనోయ్
పలుకులనువిని దేశమందభి
మానములు మొలకెత్తవలెనోయ్.
అను గురజాడవారి మాటలు నేటి కవులందరకును ఆదరణీయములు.
అభ్యుదయవాదుల కొకయున్నతమగు ఆదర్శముగలదు; ఉజ్వలమగు
భవిష్యత్తుగలదు.
245
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
సమాజము - రచయిత
మన దేశమునకు స్వాతంత్ర్యము వచ్చి నవయుగోదయ మైనది. భావ
స్వాతంత్రము, ప్రకటనా స్వాతంత్రములను నిర్వచించిన సంపూర్ణ ప్రజాస్వామిక
రాజ్యాంగ చట్టము ప్రకారము యీనాడు మన పరిపాలన జరుగుచున్నది. స్వయముగా
రచయితలై, (గ్రంథకర్తలై వాజ్మయ ప్రపంచమున గణుతి కెక్కినవారు నేడు భారత
పరిపాలనా రథ సారథులై యున్నారు. భారత స్వాతంత్ర్య వీరులలో రచయితలు
గూడ తగినంత మంది కలరు. బారత స్వాతంత్రోద్యమానికి రచయితలు జేసిన
సహకారము మిక్కిలి గొప్పది. స్వాతంత్రము నా జన్మహక్కని గర్జించి భావ
స్వాతంత్యమునకు 'ప్రతిబంధకమైన అధికారమును ధిక్కరించి ప్రతిఘటించిన
యోధులు మన రచయితలలో కలరు.
రచయితకు సమాజమున సమున్నత స్థానము కలదు. తమ ఉజ్వల
సంప్రదాయముల కనుగుణముగా దేశమును దిద్ది తీర్చృవలసిన బాధ్యత రచయితల
మీద కలదు. ఈ బాధ్యతను గుర్తించని రచయిత, తన పవిత్ర కర్తవ్యమును విస్మరించి,
దేశమునకు, భాషకు అపకారము చేసినవాడు కాగలడు. స్వతంత్ర భారతము
నందుకూడ కొందరికి రచయితలను గూర్చి విచిత్రమైన అభిప్రాయాలు వ్యాపించి
యుండుట ఆశ్చర్యకరము. అసూర్యంపశ్యలైన రాజకన్యల వలె రచయితలు,
రాజకీయాలు మొదలైన దైనందిన ప్రపంచములో ప్రజా జీవనముతో దూరముగా
నుండవలెనను వింత అభిప్రాయాలు యీనాడును, యీ స్వతంత్ర భారతమున
కూడ కొందరు కలిగి యున్నారు. రచయితలైన వారు ఇతర జీవిత రంగాలతో
దూరముగా నుండవలెనని కొందరి వింతవాదన. స్వతంత్ర దేశమునందు
రాజకీయాలను నిర్వచించి, వానికి సరిహద్దు లేర్చరుచుట చాలకష్టమైన పని.
రాజకీయములని రాజకీయేతరములని దైనందిన సమస్యల విభజించుట కష్టసాధ్యము.
నిజానికి రచయిత రాజకీయాలనిన మడిగట్టుకోవలసిన అవసరమేమియును
కనబడదు. తీవ్ర రాజకీయాభిప్రాయాలు కలిగిన రచయితను గూర్చి యెవరును
ఉలికిపడ వలసిన ఆవశ్యకతలేదు. అంతేకాదు రచయితలు వందులవలె అధికారుల
అడుగులకు మడుగులొత్తువారుగా నుండవలెనని స్వతంత్ర భారతములోని
పరిపాలకులు ఆశించినచో అందువలన ప్రమాదకరమగు పరిస్థితులేర్చడక తప్పదు.
246
సారన్వత నవనీతము
ఈనాడు రచనా రంగమున కొన్ని విషమ పరిణామాలు కన్పించుచున్నవి.
అధికారము, ధనము, యీ రెండును వాజ్ఞయ ప్రపంచమును కల్లోల పరచుచున్న
విపరీత నిదర్శనాలు నేడు కనపడుచున్నవి. వాజ్ఞయ పీఠము నందు ప్రతిభకన్న
అధికారమే ప్రధాన యోగ్యతగా పరిణమించిన ఉదాహరణాలను చూపించ వచ్చును.
నిన్నటి వరకు రచనా రంగమునకు బహుదూరమున నుండి నేడు బహుకారణాల
వలన ఒక గొప్ప పదవిని సాధించిన నాయకమ్మన్యులు- సారస్వత సభా వేదికలందు
సమ్మానితులై, రచయితలకు శాసకులగుట సంతాపకరమైన సంఘటనలు.
భావస్వాతంత్ర్య ప్రకటనా స్వాతంత్ర్యములు ప్రాతిపదికలుగాగల ప్రజాస్వామికమున
ఇట్టి పరిణామాలు మిక్కిలి ప్రమాదకరమైనవి. అధికారములో నున్నవారికి
పూలదండలు వేయుటకై కొన్ని వాజ్మయ సంఘములు అవతరించుచున్నవి. కొందరు
రచయితలు కొద్ది కొద్ది ముడుపులకు ఆశపడి అధికారుల స్తోత్రపాఠములు జేయుచు
వందిమాగధ బృందముగా సిద్ధమగు చున్నారు. కొన్ని సారస్వత ప్రచార సంస్థల
సభలకు అధ్యక్షత వహించుటకు మంత్రి పదవియే ప్రధాన యోగ్యతగా
కనపడుచున్నది. రాజుగారి మతము వైష్ణవమైనచో ఆస్థాన కవిగారి మతముకూడ
వైష్ణవము. రాజుగారి మతము శైవమైనచో అస్థానకవిగారి మతముగూడ శైవమైన
పద్ధతి యీనాడు కోరదగినది గాదు. ధనమిచ్చి ఘనముగా సత్మరించినచో రాజుగారి
ఉంపుడుకత్తెను గూర్చి చంద్రరేఖా విలాసము వ్రాయుటకును, అనుకొన్న రీతిగా
సత్కారము జరుగనిచో, ఆ చంద్రరేఖా విలాసమునే చంద్రరేఖా విలాపముగా
మార్చుటకును జంకని కవీశ్వరులు రచనారంగము నుండి ఎంత తొందరగా
నిష్రమించిన దేశమునకు అంతమంచిది.
రాజుల రోజులు అంతరించినవి. సార్వభౌమాధికారము ప్రజాయత్తమైనది.
మనపూర్వులు కావ్యము యొక్క లక్ష్యము విశ్వశ్రేయస్సు అని ఎన్నడో ఉద్దాటించినారు.
కావున ప్రజాస్వామిక యుగమున లోక కల్యాణము మరియు ప్రజల అభ్యుదయములు
రచయితల ఆదర్శములు కావలసి యున్నవి. అందుచేత పరిపాలకుల పక్షమున,
ప్రభుత్వాల పక్షమున రచయితల సమీకరణ జరుగుట (Regimentation) కోర
దగిన పరిణామముకాదు. ప్రభుత్వ సమాచార శాఖల జోక్యము వాజ్మయ
రంగమందైనను పత్రికారంగమందైనను అభిలషించ దగినదికాదు. పత్రికల పైగాని
రచయితలపైగాని సమాచార శాఖల యొక్కయు, అందలి ఉద్యోగుల యొక్కయు
247
డా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
ప్రభావము ప్రజాస్వామిక పరిపాలన సూత్రములకు మరియు భావస్వాతంత్ర్య ప్రకటనా
స్వాతంత్ర్యములకు భంగకారి. ౧౯౪౭ సంవత్సరమున కాశీ విశ్వవిద్యాలయము
నందు స్వర్గీయ శ్రీమతి సరోజినీదేవి అధ్యక్షతన జరిగిన రెండవ అఖిల భారత
రచయితల సమావేశ సందర్భమున స్వతంత్ర భారతమున రచయితల బాధ్యతలను
గూర్చి ఒక చక్కని గోష్టి జరిగినది. అప్పుడు శ్రీ యు.కె.ఓమూగారు చదివిన
వ్యాసములో “.......... దురదృష్ట వశమున యీనాడు శబ్దములు చవకయై ప్రతి
గంటకు కొన్ని లక్షలు మానవ ప్రపంచమున విసరివేయ బడుచున్నవి. పత్రికలు,
ప్రచారశాఖలు ప్రతి నిముషానికి శబ్బములను కుప్పలు తిప్పలుగా ఉత్పత్తిజేసి
చేతిబాంబుల వలె మానవ కోటి మీద విసరివేయు చున్నవి. ఇందువలన అనేక
విషమ ఫలితాలు కలుగుచున్నవి. కావున రచయిత తన బాధ్యతలను జాగ్రత్తగా
నిర్వహించ వలసి యున్నది. అని హెచ్చరించారు.
ఈనాడు ప్రపంచము మరొక మానవ మారణహోమమును యెదుర్మొన వలసిన
సూచనలు కనబడుచున్నవి. హైడ్రోజక బాంబులు ఆటంబాంబుల ప్రళయ తాండవము
భీభత్స పరిణామాలకు దారితీయు అవకాశాలు పొడసూపుచున్నవి. కావున రచయితలు
అంతర్జాతీయముగా విశ్వశాంతి సందేశము నీయ వలసి యున్నది. ఆంతరంగికముగా
గూడ రచయితల మీద గురుతర బాధ్యతలు కలవు. సంఘర్షణ; అధికారదాహము,
ధన వ్యామోహము, కులతత్వాలు మొదలైనవి సమాజ జీవనమును కలుషిత
మొనరించుచున్నవి. రచయతలు యీనాడు పౌరజీవనమును సక్రమ మార్గమున
నడిపించునట్లు ప్రబోధింపవలసి యున్నది.
రచయితల బాధ్యతతోపాటు వారి స్థానమును గూడ మనము గమనించ
వలసియుండును. సమాజ జీవనమున యీనాడు సినిమా తారకు గల గౌరవములో
నూరవ వంతైనను, ఆదాయములో లక్షవంతైనను రచయితలకు లభించుట లేదు.
ఇది చాల శోచనీయమైన పరిస్థితి. తన రచన లోకము యొక్క వెలుతురు జూచు
నిమిత్తము రచయిత అష్టకష్టాలు అనుభవించ వలసి వచ్చుచున్నది. పుస్తకమును
గాని పత్రికను గాని కొని చదువు అలవాటు మనవారిలో ఇంకను కలుగకపోవుట
విచారకరము. ఇంగ్లండు మొదలైన దేశాలలో ప్రతిభావంతులైన రచయిత ఇతర
వృత్తిని ఆశ్రయించ వలసిన అవసరములేదు. కేవల రచయితలుగా జీవనోపాధిని
గడుపుకొను వారు పాశ్చాత్య దేశాలలో కలరు. మన దేశమున రచయితకు తన
248
సారస్వత నవనీతము
రచనల ద్వారా జీవనోపాధిని గడుపుకొను అవకాశములు లభించవలసి యుందును.
అట్టి బాధ్యత ప్రజలమీద కలదు. అప్పుడే రచయిత పరాశ్రయమునుండి విముక్తుడై
స్వతంత్రుడు కాగలుగును. రచయిత స్వతంత్రుడు కానంతవరకు ప్రజల సమస్యలకు
ప్రజల జీవనమునకు, మరియు రచయిత సొంత భావములకు బదులుగా
అధికారమునకు ధనమునకు వాజ్మయ రంగమున పట్టాభిషేకము తప్పదేమొ. ఇట్టి
పరిస్థితి దేశ శ్రేయస్సుకు ప్రజల క్షేమమునకు తీవ్ర ప్రతిబంధకము కాగలదు. ఇట్టి
పరిస్థితి నివారించుట యీ నవయుగమును ప్రజల యొక్కయు ప్రజల ప్రతినిధుల
యొక్కయు ప్రధాన బాధ్యత.
ప్రథమ అఖిలభారత రచయితల మహాసభలో సాహిత్యము నందలి నైతిక
విలువలను గూర్చి ముచ్చటించుచు ఆచార్య రాధాకృష్ణులు చెప్పిన మాటలు యీ
సందర్భమున గమనించ తగియున్నవి. “. వాజ్బయము మానవునికి
మానవుని మధ్య దృఢమైన బంధముగా నుండవలెను........... తీరిక సమయాలలో
కాలక్షేపము గాని తాత్మాలిక వినోదము గాని కలిగించుట సాహిత్యము యొక్క
ముఖ్యోద్దేశము కాదు. సాహిత్యము యొక్క ఉద్దేశము అంతకన్న గంభీరమైనది.
సాహిత్యము మానవుని ఉత్తేజ పరచి అతనిని ఉన్నత పథమునకు తీసికొని
వెళ్లవలెను.......... సాహిత్య కళోపాసకులు ఆరాధించవలసినది, సత్య మొక్కటే,
సత్యారాధనలో వారు భయ సంకోచములను వీడి బాహ్య ప్రమాణములను సరకుసేయ
గూడదు................ మనమొక వేళ పొరపడవచ్చును. కాని మన అంతఃకరణమునకు
వ్యతిరేకముగా పోగూడదు. నిజమైన సాహిత్యోపాసకునకు చిత్తశుద్ధి మరియు తాను
చెప్పుదానిలో విశ్వాసము ముఖ్య అవసరములు.............. సాహిత్యోపాసకులమైన
మనము ప్రభుత్వాల యందుగాక మానవుని యందు మాత్రమే విశ్వాసము కలిగి
యుండవలెను. ఈ మార్గమున యితరులు సమాధానపడవచ్చును. కాని సాహిత్య
కళోపాసకులకు మాత్రము పూర్తిగా నిజాయితీ అవసరము.............. తన ఆదర్శాలకు
రచయిత నువ్వులు నీళ్లు వదలినచో అతడు గొప్ప రచయిత కాగల యర్షత
కోల్పోవగలడు. రచయిత తను ఆదర్శముగా నుంచుకోవలసిన దొక్కటే. అదియే
మానవుని భవిష్యత్తు”.
249
దా దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
సారస్వతానుబంధము
రాధా కృష్ణ పండితుడు
ఆక్సుఫర్జు విశ్వ విద్యాలయమున మొట్టమొదటిసారి రాధాకృష్ణ పండితుడు
ఉపన్యసించిన సందర్భము. “వెళ్ళి వేదాంతి, పిచ్చి భారతీయుడు” మనకేమి
చెప్పగలడని విశ్వవిద్యాలయాధికారులు, విద్యార్థులు ఆ ఉపన్యాసమునకు తగిన
ప్రాముఖ్యత నీయక సరిగా ఆదేసమయానికి ఆక్సుఫర్జు - కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాల
మధ్య నొక క్రికెట్ పోటీని యేర్పాటు చేసిరట. విద్యార్థులందరు క్రికెట్ ఆటను
వీక్షించుటకు వెళ్ళిరట. కావున ఆనాటి ఉపన్యాసమునకు వచ్చినవారు విశ్వవిద్యాలయ
ఉపాధ్యక్షునితోపాటు నలుగురు అధ్యాపకులు మాత్రమే యుండిరి. రాధాకృష్ణుడిది
(గ్రహించి ప్రశాంతముగా వేదికనెక్కి తన ఉపన్యాసము ఆరంభించినారు. సరిగా
అయిదు నిమిషాలు గడిచినవో లేవో, కాని విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు తన కుర్చీ
నుండి లేచి, రాధాకృష్ణుని కొంతసేపటివరకు తన ఉపన్యాసము ఆపమని ప్రార్థించి,
క్రీకెటు క్రీడాస్థలమునకు బోయి, విద్యార్థులతో, “ప్రాచ్యఖండము నుండి ఒక
మహాప్రవక్త అరుదెంచినాడు. ఆ అద్భుతమైన, అమూల్యమైన ఉపన్యాసమును
మీరందరు విని తీరవలెనని వెంటనే ఆటలను చాలించి రమ్మని పిలుచుకొని
వచ్చినారట.
తరువాత ఆక్సుఫర్షు, కేంబ్రిడ్జి లండ౯ విశ్వవిద్యాలయములే కాక అమెరికా,
యూరోపు ఖండములందలి సుప్రసిద్ధ విద్యానంస్థలన్నియును రాధాకృష్ణుని
ప్రత్యేకముగా ఆహ్వానించి ఆయన వాక్సుధాధారలనుగ్రోలు గౌరవమును
సంపాదించుకొన్నవి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒలింపిక్ పందెముల సందర్భములో
గూడ, రాధాకృష్ణుని ఉపన్యాసమునకు కుర్చీలు చాలలేదనియు, ఒలింపిక్
పందెములకన్న ఎక్కువగా పాశ్చాత్యులను ఆయన ఉపన్యాసములే ఆకర్షించినవనియు
పాశ్చాత్య పత్రికలే వేనోళ్ల ప్రశంసించినవి. హిమవన్నగము నుండి అవతరించు
గంగా ప్రవాహ సదృశమగు ఆయన ఉపన్యాసమును సంక్షిప్త లేఖనము ద్వారా
నంగ్రహించుటకు లండక టైమ్స్ సంపాదకునకే చేతగాక పోయినదట.
భావగాంభీర్యము, భాషాసౌష్టవము కలిగిన ఆయన అనర్గళ వాగ్గోరణికి పాశ్చాత్య
ప్రపంచము అచ్చెరువు జెంది సమ్మోహిత మైనది. గంధర్వులను గూడ
250
సారస్వత నవనీతము
మంత్రముగ్గులను చేయగలిగిన వచోవిలాస మాయనది. హైదరాబాదు నందలి నిజాం
కళాశాలలో ఆయన ఉపన్యాస సభకు అధ్యక్షత వహించుచు, విద్యాప్రియుడు వేదాంత
వేత్తయునగు నవాబ్ అమీన్‌జంగ్ బహాదుర్ “నేను ముస్లీంను; మహమ్మద్ ప్రవక్తలలో
కడపటి వాడనియు ఆయన తరువాత మరొక ప్రవక్త జన్మించడనియు ఇస్లాంమతము
ఆదేశించుచున్నది. అయినప్పటికీ రాధాకృష్ణుడు మహాప్రవక్తయని ఎలుగెత్తి చాటుటకు
నేనెంత మాత్రము సందేహించ” నని చెప్పిన పరిచయ వాక్యములు ఈనాటికి చెవులలో
ప్రతిధ్వనించుచున్నవి. భారతదేశ విశ్వవిద్యాలయము లన్నియు ఆయనను
స్నాతకోపన్యాసము లిచ్చుటకై ఆహ్వానించి తమను తాము గౌరవించుకొన్నవి. ప్రతిభ
యెక్కడ నున్నను ప్రశ్నించి గౌరవించుటకు వెనుకాడని ఉదరాభావో పేతుడగు ఆషుతోశ్
ముఖర్జీ రాధాకృష్ణ రత్నమును కలకత్తా విశ్వవిద్యాలయమున ప్రతిష్టించి
ప్రపంచమునకు జూపించాడు.
రాధాకృష్ణుడు భారతీయ సంస్కృతిని గూర్చియు, భారతీయ వేదాంత
తత్త్వశాస్త్రములను గూర్చియు అనేక ఉద్ధంథములనురచించి ప్రాచ్య విజ్ఞానదీపముచే
పాశ్చాత్య ప్రపంచమునకు వెలుతురును జూపించినాడు. ఆయన రచించిన
గ్రంథములన్నియును (ఫెంచి, జర్మన్, రమ్యన్ మున్నగు ఐరోవీయ
భాషలన్నింటియందును అనువదింపబడి ప్రపంచ మహా విజ్ఞానుల జోహారుల
నందుకొన్నవి. రాధాకృష్ణుడు యూరోపు అమెరికా దేశాలలో గావించిన విజ్ఞానజైత్ర
యాత్ర ఆనాడు అద్వైతమతస్థాపన దీక్నాబద్భుడైన శంకరభగవత్సాదుల వారి
ఉద్యమమునకు తీసిపోదని చెప్పుట అతిశయోక్తి కాజాలదు. అంతర్జాతీయ కీర్తిని
గడించిన నలుగురైదుగురు ప్రాచ్యదేశీయులలో జవహర్, గాంధీ, రవీంద్రులతో పాటు
రాధాకృమ్ణునకు గూడ స్థానము కలదు. రవీంద్రుని గీతాంజలియందలి
గంభీరభావములను తెలసికొన జాలక చకితులై నివ్వెరపోయిన పాశ్చాత్య విజ్ఞానులకు
అందలి మహోన్నత భావములను వారికి అర్ధమగునట్లుగా వివరించి చెప్పి రవీంద్రుడు
నోబుల్ బహుమానము పొందుటగు కారకుడైన విజ్ఞాని, భాష్యకారుడు రాధాకృష్ణ
పండితుడు. మహాత్మునికి ఆయన యందు అపరిమిత అభిమానము. మదనమోహన
మాలవ్యా ప్రభృతులు రాధాకృష్ణుని యెడల అత్యంత ఆదరభావమును జూపుచుండిరి.
జవహార్‌లాల్‌కు ఆయన మీద భక్తి గౌరవాలు కలవు. మదనమోహన మాలవ్యా
కాశీవిశ్వవిద్యాలయ ఉపాధ్యక్ష పదవినుండి విరమించినతరువాత గాంధీ మహాత్ముడు
251
దా॥/ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
మాలవ్యా పండితుడు ఇరువురుకలిసి ఆపదవికి రాధాకృష్ణుడు తప్ప మరొక్కడు
అర్హులుకారని నిర్ణయించిరని చెప్పినచో ఆయనను గూర్చి వేరుగా ప్రశంసింపవలసిన
అవసరము లేదు.
రాధాకృష్ణుని రష్యాలో భారతదేశ రాయబారిగా జవహర్ లాల్ నియమించుట
ఆయనకు ఈయన యందుగల విశ్వాసమునకు మంచి నిదర్శనమని చెప్పవచ్చును.
ఈ పదవికి ఇంతకన్న తగినవారు మన దేశములో లేరని హిందూస్తాన్ టైమ్స్ పత్రికయే
గాక బ్లిట్ట్ వంటి సోషలిస్టు అతివాద పత్రికలు గూడ హర్షించినవి. రష్యాలో రాయబార
పదవి మిక్కిలి ముఖ్యమైనది. ప్రస్తుత క్లిష్ట అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులలో ఈ
పదవికి ప్రాముఖ్యత ద్విగుణీకృతమగు చున్నది. శ్రీమతి విజయలక్ష్మి పండిట్ రష్యాలో
తన కర్తవ్యమును నెరవేర్చుట యందు విజయము పొందలేదని చెప్పబడుచున్నది.
విజయలక్ష్మి అంతర్జాతీయ వేదికల మీద వచో విలాసము ప్రదర్శించగలిగిన
విదుషీమణియే; పాశ్చాత్య సంఘమున ఆధునిక నాగరికతా మర్యాదలతో
మెప్పులందగలిగిన జాణయే; కాని రష్యా దేశమున మాత్రము ఆమె తన (ప్రతిభను
ప్రదర్శింప జాలకపోయెను. అందుకు కారణము రష్యా ప్రజల మనస్తత్వమే. ఆమె
రుచులు అభిరుచులు ఆధునిక నాగరికతను సంపూర్ణముగా ఆకళించుకొనిన ఠీవి,
వేషభాషలు, అమెరికా వంటి దేశములో బాగుగా ఉపకరించును. గాని రష్యాలో
భారతదేశ సంస్కృతిని భారతదేశ ఆత్మను వివరించి చెప్పగలిగిన విజ్ఞానియే
అవసరము. రష్యా ప్రజలు అట్టి వ్యక్తినే కోరుచుందురు. ఈ పనికై రాధాకృష్ణుని
కన్న తగినవారు భారతదేశములో మరొకరు లేరనుట నిస్సంశయము.
విద్యా సమస్యలతో వేదాంత భాష్యాలతో ఇన్నాళ్లు గడిపిన రాధాకృష్ణ పండితుడు
మంత్రాంగము రాజనీతిని ప్రదర్శించ వలసిన రాయబారిగా వెళ్ళినాడు. కాని
ఇంతకుముందు రాజకీయాలనిన అంటక ముట్టక మడిగట్టుకొని యుండిన కేవల
విద్వాంసుడు కాడాయన. రాధాకృష్ణ పండితుడు భారత రాజకీయాలయందు భారత
జాతీయోద్యమము నందు మొదటి నుండియు శ్రద్ద వహించుచునే యుండెను. కావున
ఇప్పుడు ఆయన శాంతి దూతగా భారతదేశము ఇతర దేశాల మధ్య సాంస్కృతిక
బాంధవ్యమును అత్యంత ప్రతిభావంతముగా నిర్వహించు భారత రిపబ్లిక్
ఉపాధ్యక్షపదవికి శోభావంతులుగా అలంకరించియున్నారు.
252
సారస్వత నవనీతము
సారస్వత మూర్తులు
కందుకూరి పరేశలింగము పంతులు
ఆంధ్ర వాజ్మయ చరిత్రయందే కాక ఆంధ్రదేశ చరిత్ర యందును వీరేశలింగము
యుగ పురుషుడు. ఆధునిక కాలమున నిద్రాణమై యుండిన తెలుగుదేశమును
మేలుకొలిపిన వైతాళికులలో సర్వవిధముల అగ్రగణ్యుడు వీరేశలింగము.
వీరేశలింగము ధనవంతుడు కాడు, విశ్వవిద్యాలయాలలో గొప్ప డిగ్రీలను
బడసిన విద్యాధికుడు కాడు. తక్కువ ఆదాయముతో, ఎక్కువ చాకిరీతో, కటకటలతో,
కష్టములతో జీవితము గడచు ఉపాధ్యాయ వృత్తి ఆయనది. అయినప్పటికిని, సకల
సౌకర్యములు సిరిసంపదలు, విద్యావిజ్ఞానములు కలిగినవారు నెరవేర్చలేని
మహాకార్యములను ఆయన సాధించినారు.
ఆకులురాలి మోడువారిన ఆంధ్రవాజ్మయ వృక్షమును తిరిగి చిగురింపజేసి,
తెలుగుభాషకు నూతన చైతన్యము కలుగ జేసిన “ఆంధ్ర సాహితీ పునరుద్దరణ ప్రభావు”
డాయన. చరిత్ర జీవితచరిత్ర, స్వీయ చరిత్ర, నవల, నాటకము ప్రహసనము, వ్యాసము,
శాస్త్రము మొదలయిన అనేక నూతన వాజ్మయరీతులకు మార్గదర్శి ఆయన. పైన
పేర్కొనిన వాజ్మయ విశేషములన్నింటి యందును మొదటి రచన ఆయనదే యని
చెప్పినచో, అతిశయోక్తికాజాలదు. తెలుగుదేశమున వీరేశలింగము పంతులు
అవతరించకపోయినచో, యీనాడు తెలుగుభాష యే స్థితిలో యుండెడిదో బాగుగా
ఊహించుకొనవచ్చును.
శుద్దాంధ్రనిరోస్ట్ర నిర్వచనాది అనేక నిర్భంధనములతో కూడిన కావ్యములను
రచించుటలో ఆయనకు యెంత నేర్పుకలదో, దైనందిన జీవితములోని ఒక ఘట్టమును
దీసుకొని ప్రహసనముగనో, నాటకముగనో, నవలగనో, రచించుటయందు కూడ
ఆయనకు అంతే నైపుణ్యము కలదు. ఇట్టి భిన్నశక్తుల సమ్మేళనము మిక్కిలి
అపురూపమయినది. వ్యవహార ధర్మబోధిని, (బ్రాహ్మవివాహము మొదలయిన
వీరేశలింగము రచనలలో గురుజాడ అప్పారావుగారి కన్యాశుల్మమునకు గట్టిపునాదులు
పడినవని చెప్పిన అతిశయోక్తి కాజాలదు. సంఘసంస్కరణ, భాషాసంస్కరణాది
ఉద్యమములయందు గురజాడ ప్రభృతులకు భావనాగురువు వీరేశలింగం పంతులే.
తెలుగు కవుల జీవిత చరిత్ర ఆయన ఆంధ్రశారదకు అర్చించిన మేటి యాభరణము.
వివిధ వాజ్మయవీధులందు విహరించిన శతాధిక గ్రంథకర్త ఆయన.
253
దా దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
తన రచనలద్వార జనసామాన్యమున విజ్ఞానము వ్యాపింపజేసి, ఆంధ్రజాతి
అభ్యున్నతిని సాధించుటకై వీరేశలింగము తనజీవితము అంకితము జేసినాడు. ఆయన
తన ఉపన్యాసములందు, రచనలయందు సంఘములోని కుళ్ళును పెళ్ళగించి,
బయటపెట్టినాడు. లంచగొండులను, అవినీతిపరులను, అభివృద్ధి నిరోధకులను బహు
ముఖాలుగా తన రచనతో ఆయన పరిహసించి సమకాలిన సాంఘిక సమస్యలను
అన్నింటిని చర్చించి సారస్వతము మానవజీవిత విమర్శన మని నిరూపించినాడు.
అనాథులను సనాథులను జేయుటకు యావజ్జీవితమును వినియోగించిన
మానవసేవా పరాయణుడు వీరేశలింగము పంతులు. విధవా వివాహము,
వ్యభిచారవృత్తి నిర్మూలనము మొదలయిన సంఘసంస్మరణముల కొరకు ఆయన
అనేక కష్టనష్టాలపాలు గావలసివచ్చినది. పరువు నష్టపుదావాలు మొదలయిన వానిని
కూడ అయన యెదుర్కొనవలనివచ్చినది. కాతి తన ఆశయసాధనకై
యెట్టికష్టములనుగూడ ఆయన లక్ష్యము చేయలేదు. ప్రతిఘటన యెక్కువైన కొలది
ఆయన పట్టుదల ద్విగుణీకృత మగుచుండెను. నిశ్చల ధైర్యమునకు అచంచల దీక్షకు
అ(ప్రతిమానమైన కార్యదక్షతకు వీరేశలింగము పర్యాయపదమని చెప్పవచ్చును.
అఖిలభారత సంఘసంస్మరణ సభకు వీరేశలింగము అధ్యక్షతవహించిన సందర్భమున,
స్వర్గీయ శ్రీ రానడే వంటి విద్వాంసుడు సంఘసంస్కర్త ఆయనను దక్షణదేశ
విద్యాసాగరుడని ప్రశంసించెను.
తీవ్రభాషా సంఘసంస్మరణోద్యములందు ప్రధాన పాత్రను వహించుచు,
(గంథరచన,పక్రికా సంపాదకత్వము, పునర్వివాహములు మొదలయిన
బహుకార్యములందు నిమగ్నులయినప్పటికిని, రాజమహేంద్రవరమున అనేక సంస్థల
నిర్వహణభారము వహించినవాడని చెప్పినచో, ఆయన ప్రత్యేక వ్యక్తిత్వము స్పష్టము
కాగలదు.
వీరేశలింగము ఒక వ్యక్తికాడు. ఒక మహాసంస్థ. అనాదినుండి నేటివరకు
ఆంధ్రదేశ చరిత్రలో వీరేశలింగముతో పోల్చదగిన మరొక వ్యక్తి కనుపించడని
చెప్పినచో, సత్యమునకు తలవంపులు వాటిల్ల జాలవు. స్వయంకృషివలన మానవుడు
పొందదగిన అత్యున్నతస్థాయికి వీరేశలింగము జీవితమొక ఉత్కృష్టోదాహరణము.
ఆంధ్రదేశమునకు, ఆంధ్రభాషకు, వీరేశలింగము జేసిన సేవ నిరూపమానమైనది.
254
సారస్వత నవనీతము
కొమటజ్టాజు వేంకట లక్ష్మణరావు
ఆయన జన్మించినది యేమంత నంవన్నమైన కుటుంబముకాదు.
విద్యాభ్యాసమంతయు, ఆంధ్రదేశమునకుదూరముగానున్న మహారాష్ట్ర ప్రాంతమగు
నాగపురమందు జరిగినది. ఇంగ్లీషు చదువులో ప్రావీణ్యత గడించి, ఎం.ఎ. పట్టము
నొందినాడు. అవలంబించిన వృత్తి రాజా గారివద్ద దివానుపదవి. కాని
జీవితసర్వస్వమంతయును ఆంధ్రభాషా సేవకు అర్చించి, తెలుగుతల్లికి పెంపు
సొంపులు సమకూర్చినాడు. ఆయనయే స్వర్గీయ శ్రీ కొమజ్టాజు వేంకటలక్ష్మణరావు.
కేవలము ఇంగ్లీషు చదువుతో, ఆయన సంతృప్తి పొందలేదు. సంస్కృతాంధ్రము
లందేకాక మహారాష్ట్ర భాషయందు పాండిత్యము సంపాదించినాడు. మహారాష్ట్రభాషలో
రచయితగా పేరు గాంచినవ్యక్తి ఆధునికాంధ్రులలో లక్ష్మణరావు గారొక్కరేనని
చెప్పవచ్చును. రామాయణములో వాల్మీకి ప్రస్తావించిన పంచవటి, మనదేశములో
యెక్కడనున్నదను సమస్యమీద ఆయన లోకమాన్య బాలగంగాధరతిలక్ వంటి
కొమ్ములుదిరిగిన పండితులతో మహారాష్ట్ర భాషయందే, మహారాష్ట్ర పత్రికలయందే,
వ్యాసరూవకమగు చర్చలు జరిపి, పంచవటి ఆంధ్రదేశములోనిదేయని
నిరూపించినారు.
తెలుగుసారస్వత రంగమున వీరేశలింగ వీరుడు, తన జైత్రయాత్రను
ప్రారంభించిన కాలమున లక్ష్మణరావు ఆంధ్రభాషా ప్రపంచమున అడుగు పెట్టినాడు.
తెలుగులో అప్పటివరకు విజ్ఞానవాబ్మయములేదు. చక్కని వచనరచనలేదు. సరియైన
చరిత్ర పరిశోధనలేదు; ఏవిషయమును గూర్చియెనను చక్కగా ఒకవ్యాసము
బ్రాయగలిగిన రచయతలు కూడ మిక్కిలి అరుదుగానుండిరి. ఈ పరిస్థితిని
లక్ష్మణరావు పరిశీలించినాడు. ఈ కొరతలుదీర్చి, తెలుగుబాషను సమగ్రము
చేయవలెనను దృఢదీక్షతో, ఆయన ముందుకు వచ్చినాడు.
ఆంధ్రులను గూర్చినమొట్టమొదటి చరిత్ర గ్రంథమగు ఆంధ్రుల చరిత్రను,
స్వర్గీయ శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారు రచించుటకు ప్రోత్సాహ మొనరించి, ఆ
గ్రంథమును ప్రకటించినది శ్రీ లక్ష్మణరావుగారే. తెలుగుదేశములో విజ్ఞాన వాజ్మయ
ప్రచారము చేయుటకు విజ్ఞాన చంద్రికా మండలిని స్థాపించి, మనభాషలో భౌతిక
రసాయనాది శాస్త్ర గ్రంథములను రచింపజేసి ప్రకటించిన గౌరవము శ్రీ లక్ష్మణరావుగారికే
255
దా/ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
చెందుచున్నది. నాటినుండి నేటివరకు (శ్రీలక్ష్మణరావుగారి అనంతరము)
యీవాజ్మయ వీధిలో మనముచేసిన యభివృద్ధి యేమియను ప్రశ్నించుకొన్నప్పుడు
మనము చెప్పగలిగిన ప్రత్యుత్తరము మనకు తలవంపులు ఘటిల్లజేయుచున్నవి.
హిందూదేశచరిత్ర, శివాజిచరిత్ర వంటి గ్రంథములను స్వయముగా రచించి;
శ్రీ లక్ష్మణరావు ఆంధ్రభాషకు అమూల్యమైన సేవ గావించినారు. యువకులలో
దాగుకొనియున్న ప్రతిభను పసిగట్టి, వారిచేత భాషాసేవ జేయించిన భాషాతపస్వి
శ్రీ లక్ష్మణరావు. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, డాక్టర్ కట్టమంచి
రామలింగారెడ్డి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు ప్రభృతులగు యువకులలో దాగియున్న
ప్రతిభావిశేషమును గ్రహించి, వారిచేత వున్తకములను రచింవజేని,
విజ్ఞానచంద్రికామండలి ద్వారా వానిని ఆయన ప్రకటించినారు. శ్రీ మల్లంపల్లి
సోమశేఖరశర్మ వంటి ఉత్తమ పరిశోధకుని, సర్వవిధముల ప్రోత్సహించి,
ఆంధ్రదేశమునకు అర్చించిన మహనీయుడు శ్రీ లక్ష్మణరావు.
తెలుగుభాషలో చరిత్రరచనకు ఆయన ఒరవడిపెట్టినారు. మన చరిత్రలోని
అనేక విషయములను పరిశోధించి, బహిర్గత మొనరించినారు ఆయన. చరిత్ర
పరిశోధకునకుండవలసిన నిష్పాక్షికబుద్ధి, తర్మశక్తి, బహుభాషాపరిచయము, శ్రీ
లక్ష్మణరావుగారి రచనలలోని ప్రతిపంక్తి యందును ప్రత్యక్షమగుచుండును. చారిత్రక
విషయాలను గూర్చియే కాక అనేక యితర విషయాలనుగూర్చి విలువగల వ్యాసాలను
వ్రాసి తెలుగుభాషలో ఉత్తమ వ్యాసరచనకు ఆయన మార్గదర్శకుడైనాడు.
ఏవిషయమునుగూర్చి వ్రాసినను, అది పరిపూర్ణముగా నుండుట లక్ష్మణరావుగారి
యందలి విశిష్టత. లలితకళలు, పంచాంగములు మొదలైన వ్యాసములు ఇందుకు
మేటి నిదర్శనములు. సమగ్రతకు, సరళతకు, ఆయన వ్యాసములు ఉత్కృష్టోదా
హరణములు. మన వ్యాసకర్తలకు, వచన రచయితలకు, లక్ష్మణరావుగారి భాష,
పద్ధతి ఆదర్శముగా నుండతగియున్నది. ఒక్కమాటలో చెప్పవలెనన్నచో, రచన
యెట్లుండవలెననగా, లక్ష్మణరావుగారి వ్యాసరచనవలె నుండవలెనని నిస్సందేహముగా
ప్రత్యుత్తరము చెప్పవచ్చును.
తెలుగులో విజ్ఞానకోశమును (ఇంగ్లీషు భాషయందలి ఎజసైక్లొ పీడియా
వంటిది.) సిద్ధము జేయించుభారము వహించి, రెండు సంపుటములు తన జీవిత
కాలముననే ముగించి, ప్రకటించి భాషకు మహోపకారము గావించినారు. ఈ
256
సారస్వత నవనీతము
విజ్ఞానసర్వస్వరచన ప్రారంభమైన తరువాత. మహారాష్టులు కూడ ఇట్టి. విజ్ఞానకోశ
ప్రకటనకై పనిని ప్రారంభించి పూర్తిగావించు కొనినారు. కాని లక్ష్మణరావుగారి
అకాల మరణముతో మనవిజ్ఞాన సర్వస్వరచన ఆగిపోయినది. లక్ష్మణరావు
కృషినిజూచి ప్రారంభించిన మహారాష్రులు మాత్రము తమవిజ్ఞాన సర్వస్వమును
పూర్తిగావించుకొనినారు.
ఆంధ్రభాషలో క్రొత్త పదములను ప్రవేశపెట్టి భాషావికాసమునకు శ్రీ లక్ష్మణరావు
ప్రత్యేకముగా కృషి జేసియుండిరి. పత్రికాధిపతియను శబ్దమునకు బదులుగా తెలుగులో
“పత్రికా సంపాదకుడ”ను శబ్దమును లక్ష్మణరావుగారే ప్రవేశపెట్టిరి. “ఫలానా”
శబ్దమునకు తెలుగులో పర్యాయపదములేనందున “అముక” మనుశబ్దమును
ప్రవేశపెట్టి తమ రచనలయందు ఉపయోగించినారు. మనభాషలో కొన్ని శబ్దములు
లేనిలోటును దీర్చుటకై, శ్రీ లక్ష్మణరావు ప్రశంసనీయమగు కృషి జేసి యుండిరి.
తెలంగాణమును మరచిపోవని ఆధునికాంధ్ర వాజ్మయ నిర్మాతలలో శ్రీ
లక్ష్మణరావు మొట్టవెొదలు పేర్కొనదగినవారు. మన ప్రాంతమందలి
గ్రంథాలయోద్యమమునకు ఆయనయే ప్రారంభకులని చెప్పవచ్చును. హైదరాబాదులోని
శ్రీ కృష్ణదేవరాయాంధ్రభాషా నిలయమును, హనుమకొండలోని రాజనరేంద్ర
భాషానిలయమును స్థాపించుటకు మూలకారణము శ్రీ లక్ష్మణరావే. హైదరాబాదు
రాష్ట్ర ఆంధ్రోద్యమ పితామహులకు మార్గదర్శి శ్రీ లక్ష్మణరావే.
ఆధునికాంధ్రవాజ్మయ సౌధమునకు మూల స్తంభములు అయిదు. 1. శ్రీ
వీరేశలింగము, 2. శ్రీ లక్ష్మణరావు, 3. శ్రీ నాగేశ్వరరావు, 4. శ్రీ చెళ్లపిళ్ళ వేంకట
శాస్త్రి, 5. శ్రీ గురజాడ అప్పారావు.
“తెలుగను నాట్యరంగమున దివ్యులుమెచ్చ ప్రధానపాత్రగా
నిలిచి, విమర్శగీతము లనిందితరీతినిం బాడుచుండగా
కలిగిన కాలమృత్యువను కాండపటంబది, జారె నన్నవా
రలు, గనలేరు, నిన్ను, కొమరాజ కులాగ్రణీ! లక్ష్మణాగ్రణీ!”
257
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు
ఆధునికాంధ్ర వాజ్మయ నిర్మాతలలో శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహము గారు
ముఖ్యులు. తెలుగు దేశమున వారు చేసిన భాషా ప్రచారము అమూల్యమైనది.
ఆంధ్ర వాజ్బయమునకు, ఆంధ్ర సంస్కృతికిని రాజమహేంద్రవరము పుట్టినిల్లు.
నన్నయనాటి నుండి నేటి వరకును అనేక సాహితీపరులు, రాజమహేంద్రవరమున
ఉద్భవించి తెలుగుతల్లికి సేవగావించిరి. అట్టి మహానీయులలో చిలకమర్తి వారికి
ప్రముఖస్థానము కలదు. వీరేశలింగము పంతులుగారికి మిక్కిలి సన్నిహితులగు
అనుచరులై ఆంధ్ర సారస్వత పునరుద్ధరణకు ఆ మహానుభావుడు ప్రారంభించిన
మహోద్యమ రంగమున నడుముగట్టి నిలిచి తెలుగుభాషకు అపూర్వమైన
పెంపుసొంపులను సమకూర్చిన భాషాతపస్వి చిలకమర్తి లక్ష్మీనరసింహము పంతులు.
పంతులుగారు శతాధిక గ్రంథకర్తలు. వీరి రచనలలో (ప్రహసనములు,
నాటకములు, నవలలు, మహాపురుషుల జీవిత చరిత్రములు, వినోదములు
ముఖ్యమైనవి. పంతులుగారి నాటకములలో గయోపాఖ్యానము ఆబాలగోపాలము
యొక్క ఆదరణను పొందినది. “అల్లుడా రమ్మని యాదరమ్మున బిల్వ” వంటి
పద్యములు ఆంధ్ర ప్రజల రసనాగ్రములందు నాట్యమాడినది. నాటకములలో
పద్యరచనా ప్రావీణ్యమున పంతులుగారిని జెప్పి మరొకరిని జెప్పవలెను. వారి
నాటకములలో చతురచంద్రహాసము ఉత్కృష్టమైనదని చెప్పవచ్చును.
తెలుగు నవలా రచయితలందు వీరేశలింగము తరువాత చెప్పదగినవారు
లక్ష్మీనరసింహముగారు. హేమలత, రామచంద్ర విజయము, అహల్యాబాయి,
కర్పూరమంజరి మొదలైన నవలలను పఠించని ఆంధ్ర సారస్వత ప్రియులు లేరని
చెప్పిన అతిశయోక్తి కాజాలదు. పంతులు గారి వచనశైలి, మిక్కిలి లలితమై
ఆదర్శప్రాయమై యొప్పుచున్నది. ముక్కుతిమ్మన పద్యములను యెంత ముద్దు ముద్దుగా
వ్రాసినాడో పంతులుగారు గద్యమును అంత ముద్దుగా వ్రాసినారని చెప్పవచ్చును.
పంతులుగారి వచనశైలి చక్కదనమునకు పర్యాయపదమని చెప్పిన అతిశయోక్తి
కాజాలదు.
తెలుగు భాషలో హాస్యమును పోషించిన కొద్దిమంది రచయితలలో
లక్ష్మీనరసింహము గారికి అగ్రస్థానము కలదు. వీరేశలింగము గారి హాస్యము
258
సారస్వత నవనీతము
పేలవముగా నుండిన ఉదాహరణములను చూపించవచ్చును. పానుగంటి వారి
హాస్యము మోటుగా నుండిన నిదర్శనాలు చూపించవచ్చును. గురజాడవారి హాస్యము
ఆంగ్లభాషా పరిచయము లేనివారికి అర్థముకాని ఘట్టాలు పేర్కొనవచ్చును. కాని
లక్ష్మీనరసింహము గారి హాస్యము మిక్కిలి సున్నితమై, ప్రతివారిని రంజించుచుండును.
గణపతి వారి హాస్యరచనలలో పేర్కొనదగినది. వారి ఇతర నాటకాల యందును,
నవలల యందును హాస్యము సముచితముగా పోషింపబడినది.
చిలకమర్తి లక్ష్మీనరసింహముగారు సంఘసంస్కర్తలు. వీరేశలింగము గారి
సారన్వతోద్యమముతో పాటు నంభం నంన్మరణోద్యమమునందుగూడ
లక్ష్మీనరసింహము గారు భాగస్వాములై యుండిరి.
నభారంజనము లక్ష్మీనరనింవాముగారికి వెన్నతో బెట్టిన విద్య.
సంభాషణయందు, సభావేదికలయందును, వారి ప్రసంగములు ఉత్తేజకరములై,
చమత్మారయుక్తములై, వివిధ విజ్ఞాన నిక్షేపములై యొప్పు చుండెడివి.
చిలకమర్తి లక్ష్మీనరసింహము గారు ఆంధ్ర శారదకు అనేక ఆభరణము
లర్చించిన సాహితీపరులు. తెలుగు భాషలోని వచన రచయితలలో ప్రముఖులు,
మన హాస్య రచయితలలో ముఖ్యులు, సంఘ సంస్కర్తలు, దేశ భక్తులు, వక్తలు,
సంభాషణాచతురులు.
259
డా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
గురజాడ అప్పారావు
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్
గురజాడ అప్పారావుగారిని తలచుకొన్నంతనే ప్రతి యాంధ్రునికి పైగేయము
జ్ఞప్తికివచ్చి తీరును. నిజానికి, యీ గేయము పఠించని వేదిక ఆంధ్రదేశమున లేదని
చెప్పిన అతిశయోక్తి కాజాలదు.
ఆధునిక యుగమున తెలుగు బాషలో విప్లవాత్మకమగు మార్పులు తెచ్చిన
వాజ్మయ సేవకులలో గురజాడ అప్పారావుగారికి ప్రముఖమైన స్థానము కలదు.
అప్పారావుగారి ఆదర్శములు రెండు. మొదటిది సంఘుసంర్మరణ; రెండవది
భాషానంన్మరణ. వారి రచనలలో యీ రెండు ఆదర్శములు బాగుగా
ప్రతిబింబితమగుచున్నవి.
గురుజాడవారి కలము మూడు భిన్నవాజ్మయ వీధులందు విహారము జేసినది.
ఒకటి ఖండకావ్య రచన; రెండు నాటకరచన; మూడు కథానికా రచన. ఈ మూడు
వాజ్మయ వీధులందు గూడ అప్పారావుగారు తమ ప్రత్యేక వ్యక్తిత్వమును ప్రదర్శించి
తెలుగు భాషయందొక క్రొత్తదనమును ప్రవేశపెట్టి, యువక రచయితలకు భావనా
గురువులు మరియు మార్గదర్శకులై యొప్పినారు. నవ్యకవులను మేలుకొలిపిన
వైతాళికులలో గురజాడ అప్పారావుగారికి ప్రముఖమైన స్థానము కలదు.
తెలుగుతల్లికి అప్పారావుగారు సమర్పించిన మేలినగ ముత్యాల సరములు.
ఆధునికాంధ్రవాజ్మయమునకు మార్గదర్శకమైన రచనలలో ముత్యాల సరములు
యెన్నదగినది. ఈ ముత్యాల సరములలో దేశభక్తి ప్రబోధకములగు గీతములను
సమకూర్చి, తెలుగు జాతిని అప్పారావు గారు ప్రబోధించిరి. మన దేశములోని జానపద
వాజ్బ్మయము ఆయనను ఆకర్షించినది. అట్టి రచనల ద్వారా ప్రబోధము జేసినచో,
తమ ఉద్దేశము చక్కగా సఫలము కాగలదని గ్రహించి, ఆ పద్ధతి ప్రకారము ముత్యాల
సరములు అనునొక క్రొత్త, విశిష్టమైన ఛందస్సును సమకూర్చుకొని, ఆ ఛందస్సు
ద్వారా జాతీయోక్తులతో గూడిన తేట తెనుగుభాషలో ప్రబోధకరములగు గేయములను
వ్రాసి, ఆంధ్ర కవిత్వరంగమున ఒక నూతన మార్గమును ఆయన చూపించినాడు.
260
సారస్వత నవనీతము
గురజాడ అప్పారావుగారి రచనలలో అత్యధికముగా జనాదరణ పొంది; వారికి
విశేషమైన కీర్తిని సంపాదించి పెట్టినది కన్యాశుల్క నాటకము - తెలుగులోనున్న
కొద్ది నంఖ్యగల మంచి నాటకములలో కన్యాశుల్కము మొట్టమొదలు
పేర్మొనదగినదనుట నిస్సంశయము. అప్పారావుగారు తమ భాషాసంస్కరణ,
సంఘసంస్కరణ అను రెండు ఆశయాలకు అనుగుణముగా కన్యాశుల్మమును
రచించిరి. కన్యాశుల్మము నందు గురజాడ అప్పారావుగారు వోన్యరన
చిత్రణమునందును, సమకాలిక సాంఘికజీవిత విమర్శనమందును, పాత్రపోషణ
మందును గల అద్వితీయమైన నేర్పు చక్కగా ప్రదర్శించినారు.
వ్యావహారిక భాషోద్యమమునకు జనకులగు కీ॥శే॥ గిడుగు రామమూర్తి
పంతులుగారు గురజాడ అప్పారావుగారికి చిన్ననాటి స్నేహితులు. అప్పారావుగారి
మీద రామమూర్తి పంతులుగారి యొక్కయు వీరేశలింగము పంతులుగారి యొక్కయు
ప్రభావము ప్రస్ఫుటముగా కనపడుచుండును. రామమూర్తి పంతులుగారి వ్యావహారిక
భాషోద్యమమునకు బాసటయై నిలిచి, అందుకు అనుగుణముగా అప్పారావుగారు
కన్యాశుల్మమును రచించి, వ్యావహారక భాషలోగల జిగిని పటుత్వమును లోకమునకు
వెల్లడిచేసిరి. వ్యావహారిక భాషలో రచనలు జేయుటకు, కన్యాశుల్మము చక్కని దారి
చూపించినది.
“అప్పారాయకవికి సంఘ సంస్కారము వ్యావహారిక భాషావాదము, ప్రధాన
విషయాలైనవి. ఒకవంక వీరేశలింగముగారు, మరొక వంక గిడుగు రామమూర్తి
పంతులుగారు ఈ యిరువురి ఉద్యమాలను ఆకళించుకొని రచన సాగించిన
ప్రతిభాశాలి గురజాడ అప్పారావు...” అని తమ నవార్యధ్రసాహిత్య వీధులలో
శ్రీసీతారామయ్యగారు తెలిపినారు.
గురజాడ అప్పారావుగారు తెలుగుభాషలో కొన్ని చిన్న కథలను గూడ వ్రాసినారు.
అయితేవారి “ముత్యాల సరము”లకు “కన్యాశుల్మము”నకు కలిగినంత వ్యాప్తి ఈ
కథలకు కలుగలేదు. ఆ రెండు రచనలవలె, యీ కథలు యువక రచయితలకు
మార్గదర్శకములు గాలేదు; ఆంధ్రదేశమున వానివలె, యివి సంచలనము
కలుగజేయలేదు.
క్రొత్తప్రాతల మేలికలయికకు అప్పారావుగారి గేయములు మేటి నిదర్శనములు;
సాంఘిక నాటక రచనకు కన్యాశుల్మము మార్గదర్శకము. తెలుగు భాషలో ఒక
ప్రత్యేక యుగమునకు స్థాపకులు శ్రీ గురజాడ అప్పారావుగారు.
261
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
©. 2.
చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి
తెలుగు కవులలో తమ ఘనతను గూర్చి గొప్పగా చెప్పుకొనిన కవులు ఎందరో
ఉన్నారు. శారద నీరూపము అని యొక కవీశ్వరుడు చెప్పించుకొన్నాడు. సంగీత
సాహిత్య సరసవిద్యలు నేర్చు కవుల టొమ్మునుగాని కాల్చివిడువనని మరొక కవి
సార్వభౌముడు తెలుపుకున్నాడు. చమత్కృతి మత్కృతి మత్కృతీత్వమునుగూర్చి వేరొక
కవీంద్రుడు చాటుకొన్నాడు. కాని కవిత్వముకొరకే నేను జన్మించినానని చెప్పినవారు
సకలాంధ్రకవులలో ఒక్కరే కనుపించుచున్నారు. వారే శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్రిగారు.
“కవనార్థం బుదయించితిన్” అని వారు తమ జీవితాదర్శమును చక్కగా
వెల్లడించినారు.
ఇది ప్రగల్ఫోక్తి కాక కేవలము సత్యోక్తియేయనుట నిస్సంశయము. శ్రీ
వేంకటశాస్రిగారి శిష్యులొకరు చెప్పినట్లు వానలో దడియనివారు, తమ గురుదేవుల
అవధాన మృదూక్తి మరందధారలో స్నానమాడనివారు తెలుగుదేశములో లేరని
చెప్పవచ్చును.
శ్రీ వేంకటశాస్రిగారికి పూర్వము ఆంధ్రదేశములో అవధానముచేసిన
విద్వతృ్కవీంద్రులు కొందరు కనువించుచున్నారు. కాని వారెవరు శ్రీ
వేంకటశాస్రిగారివలె తమ అవధానములచేత, ఆంధ్రదేశము నంతయును ఒక్కుమ్మడి
ఊపివేయలేదు. శ్రీ తిరుపతి వేంకటకవుల సారథ్యమున తెలుగుతల్లి రథము
ఆంధ్రదేశమున నిరాటంకముగా స్వైరవిహారము గావించినది. ఈ విధముగా
సారస్వత జైత్రయాత్ర గావించిన ఆంధ్రకవీశ్వరులలో వీరితో పోల్చదగినవ్యక్తి
శ్రీనాథుడొక్కడే.
తమ అంతరంగమిత్రులగు దివాకర్ల తిరుపతిశాస్రిగారితో చెళ్ళపిళ్ళ
వేంకటశాస్రిగారు ఆంధ్రదేశమున జేసిన సారస్వత ప్రచారము అద్వితీయమైనది.
“తిరుపతి యతండు వేంకటేశ్వరుడ నేను, వెరసి తిరుపతి వేంకటేశ్వరుల మేము”
అని యొకమారు శ్రీ వేంకటశాగస్రిగారు చెప్పియుండిరి. ఆంధ్రదేశమునకు
ఇలవేలుపగు తిరుపతి వేంకటేశ్వరులవలె, యీ తిరుపతి వేంకటేశ్వరులు తెలుగు
కవులందరికిని ఆరాధ్యులైరి. వీరిని గూర్చి వ్రాయుచు శ్రీ మల్లాది సూర్యనారాయణ
శాస్త్రిగారు “ఆంధ్రదేశమున వీరు త్రొక్కని సభలేదు; పొందని రాజగౌరవములేదు;
ఎరుగని కవితారహస్యములేదు” అని తెలిపిన మాటలు అక్షరాల సత్యములు.
262
సారస్వత నవనీతము
ఈ సందర్భములో వేంకటశాస్రిగారు (తిరుపతి వేంకటేశ్వరులు) ఆంధ్రవాజ్మయ
రంగమున అడుగుపెట్టిన కాలమును మనము గమనించుట అవసరము. తెలుగు
భాషకు సరియైన గౌరవము లేని కాలమున వీరు తెలుగు కవులుగా తమ
పాంచజన్యమును పూరించిరి. పూర్వపండితులకు సంస్కృత భాషపైన ఆధునిక
విధ్యాధికులకు ఆంగ్ల భాషపైన మోజు కలిగిన రోజులవి. శ్రీ వీరేశలింగము
పంతులుగారు చేసిన కృషివలన తెలుగుభాషకు కొంత ప్రచారము కలిగినమాట
వాస్తవమే కాని వీరేశలింగముగారిది కవితాప్రచార దృష్టికాదని మనము
గమనించవలెను. తెలుగులో వచనరచనలు వ్యావ్తినాందుటకొరకే శ్రీ
వీరేశలింగముగారు ముఖ్యముగా కృషిచేసిరి. భాషాసంస్మరణము, వచనరచనలతో
పాటు సంఘసంస్మరణమునకు వీరేశలింగము పంతులుగారు ప్రాధాన్యత నిచ్చిరి.
కాని వేంకట శాస్త్రిగారు కవితా ప్రచారమునే తమ ఆదర్శముగా గ్రహించి ఆంధ్రదేశము
నందలి మారుమూలల పల్లెలకు జనసామాన్యమునకు, తమ అవధానముల ద్వారా
తెలుగుతల్లి పిలుపును అందించిరి. అంతకుముందు తెలుగులో కవిత్వము వ్రాయుట
యేమియని సందేహించిన పలువురు విద్వాంసులు దిగ్రాంతులైరి. ఈ విధముగా
తిరుపతి వేంకటేశ్వరుల శంఖారావము నాలకించి, ఆంధ్రదేశమున పల్లెపల్లెకు వాడ
వాడకు కవులు బయలుదేరిరి. ఈ నాడు దేశములో పేరుగాంచిన కవులందరికిని
ఇంచుమించుగా శ్రీ వేంకటశాస్రిగారే గురువని చెప్పినచో సత్యమునకు తలవంపులు
వాటిల్లజాలవు. ఆంధ్రదేశమున వారికి శిష్యులో ప్రశిష్యులో, ఏకలవ్య శిష్యులో కాని
కవులు లేరని చెప్పినను అతిశయోక్తి కాజాలదు.
శ్రీ వేంకటశాస్రిగారి శిష్యులలో పట్టాభి సీతారామయ్య గారివంటి నాయకులు,
ముట్నూరి కృష్ణారావుగారి వంటి విజ్ఞానులు, వేలూరి శివరామశాస్రిగారివంటి
విద్వత్సకాండులు, వేటూరి ప్రభాకరశాస్తిగారి వంటి సాహిత్య పరిశోధకులు, విశ్వనాథ
సత్యనారాయణ, పింగళి లక్ష్మీకాంతము, కాటూరి వేంకటేశ్వర రావు గారలవంటి
కవీంద్రులు కలరని చెప్పినచో, వారి వ్యక్తిత్వము యెట్టిదో ప్రతివారును
ఊహించవచ్చును. ఎండిపోయిన తెనుగుతోటను తమ కవితా సుధాప్రవాహముచే
తిరిగి చిగురింపజేసి (క్రొత్తపాదుల నెన్నింటినో కల్పించి, ఆ పాదులలో ప్రభవించిన
తీగెలనుండి నవప్రసవములు విరబూచుచుండగా చూచి యానందించిన ధన్యజీవి.
శ్రీ వేంకటశాస్రిగారి ఆకారమెంత నిరాడంబరమైనదో కవిత్వము అంత సులభ
సుందరమైనది. కావుననే వారికి కొల్లాయిగుడ్డలు వాడవేడుక, లల్లాయపదములు
వాడవేడుక అని ఆంధ్రదేశములో (ప్రఖ్యాతికలిగినది. శ్రీ వేంకటశాస్రిగారు హాస్యోక్తి
నిపుణులు. వారి ఛలోక్తులు హాస్యోక్తులు ఏరి కూర్చినచో కొన్ని సంపుటములే కాగలవు.
263
దా॥ దేవులవల్లి రామానుజరావు (గంథావళి
శ్రీ వేంకటశాస్రిగారు గొప్పవక్త. ఎట్టి సభలోనైన వారులేచి నిలిచి ఎంతసేపు
మాట్లాడినను సభ్యులు విసుగులేక వినుచుండెడివారు.
శ్రీ వేంకటశాస్రిగారు బహువిధములైన రచనలు గావించిరి. వారి పాండవ
నాటకములు (శ్రవణానంద పాణిగ్భృహీత కావ్యములు నానారాజసందర్భనము,
గుంటూరుసీమ, గీరతము మొదలైన ఖండ కావ్యములు సుప్రసిద్ధములైనవి. కేవలము
సాహిత్యదృష్టితో పరిశీలించినప్పుడు వారి రచనలలో బుద్ధచరిత్రము ఉత్కృష్టమైనదని
చెప్పవచ్చును. వారి పాండవోద్యోగము ఆంధ్రదేశము నందు అనేక పట్టణాలలో
ప్రదర్శింపబడినది. ఈ పాండవ నాటకములోని వద్యములు అనేకులకు
కంఠస్థములైనవని చెప్పినచో, ప్రజలలో వానిప్రచారము స్పష్టము కాగలదు.
వేంకటశాస్రిగారు తెలుగులో అనేక విషయాలను గూర్చిన వ్యాసాలు వివిధ పత్రికలలో
వ్రాసినారు. ఈ వ్యాసాలు వారి పాండిత్యమునకు సంస్కృతాంధ్రములందలి బహు
(గ్రంథావలోకమునకు వివిధవిషయ వరిజ్ఞానమునకు మేటి నిదర్శనము. శ్రీ
వేంకటశాస్రిగారు యీవ్యాసాలను వ్యావహారిక భాషలో వ్రాయుట పేర్కొనదగిన
విషయము.
ఆంధ్రదేశములో మహాపురుషులు కవిశేఖరులు, విద్వాంసులు అనేకులు
ఉద్భవించినారు. కాని శ్రీ వేంకటశాస్రిగారివలె తమలోని జ్యోతిచే ఇతరులకు వెలుగు
చూపించి అసంఖ్యాకులగు రచయితలను సృష్టించిన వారు మాత్రము మిక్కిలి అరుదు.
ఇదివరకు తెలిపినట్లు శ్రీ వేంకటశాస్రిగారు పొందని గౌరవము లేదు.
ఆంధ్ర విశ్వవిద్యాలయము వారికి కళాప్రవూర్ణ పట్టమునిచ్చి తననుతాను
గౌరవించుకొన్నది. మద్రాసు ప్రభుత్వము ఆంధ్రభాషకు వారిని ఆస్థానకవిగా
వరించినది. ఈ సందర్భములో విజయవాడ యందు జరిగిన సన్మానసభ
ఆంధ్రదేశమునకు వేంకటశాగ్రిగారి యెడలగల భక్తి ప్రపత్తులను బాగుగా
ప్రకటించినది. ఆ సభకు అధ్యక్షతవహించిన శ్రీ రామలింగారెడ్డిగారు “ఇట్టి సభను
ఇంతకుముందు నేను చూడలేదు. యికముందు చూచెదనని నమ్మకములేదు” అని
తెలిపియుండిరి.
ఈవిధముగా సుమారొక అర్థశతాబ్దముపైగా ఆంధ్రవాజ్మయరంగమునకు
నాయకత్వము వహించి అద్యతనాంధ్రకవిప్రపంచ నిర్మాతగా పేరుగాంచిన శ్రీ
వేంకటశాగస్రిగారు శివరాత్రి పర్వదినమునాడు ఎనుబదియేండ్ల వయస్సున
పరలోకగతులైరి.
264
సారస్వత నవనీతము
కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు
తెలుగు దేశమునకును, తెలుగు భాషకు కీ॥ శే॥ కాశీనాథుని నాగేశ్వరరావు
పంతులుగారు చేసిన సేవ నిరుపమానమైనది. ఆంధ్రదేశ చరిత్రలో శ్రీకృష్ణ
దేవరాయలకు యేవిధముగను తీసిపోని వ్యక్తి త్రీ నాగేశ్వరరావు పంతులుగారని
చెప్పిన అతిశయోక్తి కాజాలదు. నవ్యాంధ్ర వాజ్మయ నిర్మాతయగు శ్రీ వీరేశలింగము
పంతులుగారితో సమానమైన స్థానము శ్రీ నాగేశ్వరరావుగారికి కలదు.
నాగేశ్వరరావుగారు జన్మతః శ్రీమంతులుగారు. స్వయంకృషిచేత వారు
కావలసినంత డబ్బు సంపాదించినారు. ఆంధ్రదేశములో వారివలె - అంతేగాదు
వారికన్న యెక్కువ గూడ డబ్బు సంపాదించిన వారు ఎందరో ఉండవచ్చును. కాని
వారివలె తాము ఆర్జించిన డబ్బును దేశముకొరకు, భాషకొరకు వినియోగించిన
వారు మరొక్కరు గనుపించరని చెప్పిన సత్యమునకు తలవంపులు వాటిల్లవు.
నాగేశ్వరరావుగారే లేకపోయినచో, యీనాటి ఆంధ్రదేశము యేవిధముగా
నుండెడిదోయని మనము (వ శ్నించుకొని శాంతముగా నమాధానము
ఆలోచించుకొనిచో, నాగేశ్వరావుగారి వ్యక్తిత్వము స్పష్టముగా బోధపడగలదు.
ఆంధ్రోద్యమమునకు, ఆంధ్రజాతీయ భాషా వికాసమునకు నూతన చైతన్యము,
క్రొత్త జీవము కలిగించి ఆంధ్రులందరిని ఏకముఖముగా నడిపించు ఉద్దేశముతో
శ్రీ నాగేశ్వరరావుగారు ఆంధ్రపత్రికను స్థాపించిరి. తెలుగు సీమలో మొదటిదినపత్రిక
ఆంధ్రపత్రికయే. ఆంధ్ర పత్రికను తెలుగు ప్రజలలో ఒక క్రొత్త ఉత్సాహము ఉత్తేజము
కలుగజేసి తెలుగునాట జాతీయ పునరుజ్జీవనము కలుగజేసినది. సాంఘిక విద్యా,
విజ్ఞాన సారస్వత రంగములందు ఆంధ్రపత్రిక జేసిన ప్రబోధము అనుపమానమైనది.
నేడు ఆంధ్రావనిలో కలిగిన జాగృతికి ప్రధాన కారణములలో ఆంధ్రపత్రిక
ముఖ్యమైనది. దినపత్రికతోపాటు ఆంధ్రవారపత్రిక భారతిమాస పత్రికలను స్థాపించి,
తెలుగు సారస్వతాభివృద్ధికి పంతులుగారు దోహదము గావించిరి. ఈ పత్రికలతోపాటు
ఆంధ్ర గ్రంథమాల ద్వారా, ఉత్తమమైన వాజ్బయమును ప్రతిభావంతమైన రచనలను
ప్రకటించి పంతులుగారు తెలుగు సరస్వతిని మేలి సొమ్ములతో నలంకరించిరి.
స్వర్గీయ శ్రీ కొమజ్టాజు వేంకట లక్ష్మణరావుగారు ఆరంభించిన విజ్ఞాన సర్వస్వ
ప్రకటన భారమును గూడ మూడు సంవత్సరాలపాటు వహించి రెండు సంపుటాలను
సంస్మరింపించి ప్రకటింపజేసిరి.
265
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
నాగేశ్వరరావుగారు స్వయముగా గ్రంథకర్తలు; రచయితలు. వారు వివిధ
గ్రంథములకు వ్రాసిన పీఠికలను ఒకచోటచేర్చి ప్రకటించినచో అదియొక
మంచివిజ్ఞాన నిక్షేపముగా నుండగలదు.
ఆంధ్రదేశములో పంతులుగారి సహాయముపొందని సంస్థ లేదనుట
నిస్సందేహము. నాగేశ్వరరావుపంతులుగారిచేత ఆర్థిక సహాయము పొందని కవులు,
గాయకులు, పండితులు, చిత్రకారులు ఆంధ్రదేశములో లేరనుట అతిశయోక్తి
కాజాలదు. ఎందరో బీద విద్యార్థులు పంతులుగారి సహాయంచేత విద్యాధికులై,
తరువాత పెద్ద పెద్ద పదవులను అలంకరించినారు.
పంతులుగారి బెదార్యము ప్రసిద్ధమైనది. పుస్తక ముద్రణము కొరకు,
శరణాలయాల స్థాపనకు, విద్యాలయాల నిర్వహణకు, సంతర్పణలకు, వివాహాలకు,
గృహనిర్మాణాలకు, వారుజేసిన దానాలు అంతులేదు. పంతులుగారి గృహము
అన్నపూర్ణదేవి మందిరముగా నుండెడిది.
పంతులుగారి దేశసేవ బహుముఖమైనది. వారి సహకార సానుభూతులు పొందని
ఉద్యమము తెలుగునాడులో లేదని చెప్పవచ్చును. గాంధీమహాత్ముని శంఖారావము
నాలకించి, స్వాతంత్రోద్యమమున పాల్గొని, ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలకు
వారు ఆధిపత్యము వహించిరి. త్యాగసమయమున, వెనుకంజవేయక, అనేక
పర్యాయములు శ్రీకృష్ణ జన్మస్థానమునకేగి మాతృదేవి దాస్యశ్చంఖలా విమోచనమునకై
కృషిచేసిన యోధులలో శ్రీ నాగేశ్వరరావుగారు ప్రముఖులు.
నాగేశ్వరరావు పంతులుగారు అజాతశత్రువు. సర్వజన ప్రియత్వమున భారతదేశ
నాయకులలో నాగేశ్వరరావుగారిని శ్రీ రాజేంద్రప్రసాద్ గారితో పోల్చవచ్చును.
ద్వేషమునకు వారి హృదయములో స్థానములేదు. రాడ్ర్రేతర ప్రముఖుల
ఆదరాభిమానములు పొందిన ఆంధ్రయువకులలో శ్రీ నాగేశ్వరరావు
మున్నెన్నదగినవారు. శ్రీనివాసశాస్రిగారు ప్రభృతులగు మితవాద నాయకులు,
వ్రమల్లచంద్రరాయ్ వంటి శాస్త్రవేత్తలు నాగేశ్వరరావుగారిమీద ప్రత్యేక
గౌరవాభిమానములు కలిగియుండిరి.
వారిని దేశద్ధారకులుగా ఆంధ్రప్రజానీకము ప్రస్తుతించినది.
“విశ్వదాతయని” గాంధీమహాత్ముడు వారిని ప్రశంసించిరి.
ఆంధ్ర విశ్వవిద్యాలయము వారికి కళాప్రపూర్ణ బిరుదమిచ్చి తన్నుతాను
సత్మరించుకొన్నది.
266
సారస్వత నవనీతము
ముట్నూరి కృష్ణారావు
పత్రికా రచనకు తమ జీవితాలను అంకితము జేసిన ఆంధ్రులు అనేకులు
కలరు. వీరిలో కొందరు ఆంధ్రేతర ప్రాంతములకుగూడ వెళ్ళి, ఆంగ్ల దినపత్రికలకు
సంపాదకత్వము వహించుటయే గాక విదేశాలలోని పత్రికలకు గూడ వ్యాసములను
వ్రాసి ప్రఖ్యాతి గాంచినారు. కాని యీ ఆంధ్రపత్రికా రచయితలందరిలో శ్రీ ముట్నూరి
కృష్ణారావుగారికి గల స్థానము అద్వితీయమైనది. పత్రికా రచయితగా వారికి విశిష్టమైన
వ్యక్తిత్వము కలదు. కృష్ణారావుగారు కృష్ణాపత్రికలో పూర్తిగా లీనమైపోయినారు. ఈ
విధముగా పత్రికతో అద్వైతము కలుగజేసుకొనిన పత్రికా రచయిత ఆంధ్రులలో
లేరు. ఒక పర్యాయము తమ పత్రిక ఆశయమును గూర్చి వివరించుచు కృష్ణాపత్రిక
వార్తాపత్రిక కాదనియు అది అభిప్రాయాల పత్రికయనియు వారే తెలిపిరి.
తెలుగు దేశమును జాగృతము గావించుటలో కృష్ణాపత్రిక చేసిన సేవ
అమోఘమైనది. ఆంధ్రులలో చైతన్యము కలుగజేసి, ఆంధ్రదేశమున జాతీయ భావాలను
ప్రచారముచేసిన వ్యక్తులలోను సంస్థలలోను కృష్ణాపత్రికను మొట్టమొదట పేర్కొనవలసి
యున్నది. గాంధీమహాత్ముని సత్యాగ్రహోద్యమమును గూర్చియు, కాంగ్రెస్ ఆశయాలను
గూర్చియు, జవహర్లాలువంటి స్వాతంత్రయోధుల ఉపన్యాసములను గూర్చియు
కృష్ణాపత్రిక జేసిన వ్యాఖ్యానములు, సంపాదకీయ విమర్శలు ఆంధ్రదేశమును
ఉత్తేజితము గావించినవి. కృష్ణాపత్రికను చదవి తమ రాజకీయ అభిప్రాయాలను
యేర్చరచుకొనిన నిదర్శనాలను ఆంధ్రదేశమున యెన్నియెన చూపించవచ్చును. బ్రిటీష్
పరిపాలనను తూర్చారబట్టి, తెనుగు ప్రజను స్వాతంత్ర్య రంగమునం దుముకజేసిన
దివ్యాస్త్రము కృష్ణాపత్రిక.
కేవలము రాజకీయ రంగముననే కాక వాజ్మయ శిల్పకళా రంగములందు
గూడ కృష్ణారావుగారు తమ సంపాదకీయాల ద్వారా తెలుగుజాతి అభిరుచులను
దిద్ది తీర్చినారు. కాళిదాసు కవిత్వమును గూర్చి, తెనుగుభాషలో క్రొత్తరీతులను గూర్చి,
వంగచిత్రముల సౌందర్యమును గూర్చి, ప్రాచ్య పాశ్చాత్య వాజ్మయ విశేషములను
గూర్చి వారు వ్రాసిన వ్యాసములు తెలుగుదేశమున ఎందరినో సంస్మారులుగా సిద్ధము
గావించినవి. ఆధునిక సాహిత్యమున ప్రత్యేక ప్రజ్ఞను జూపి, విశేష ప్రఖ్యాతిని
ఆర్జించిన ఆంధ్రరచయితల కనేకులకు కృష్ణారావుగారు భావనాగురువు. వారి దర్భారు
ప్రసంగములు అనేకులలో నివురుగప్పిన నిప్పువలె దాగుకొనియున్న ప్రతిభకు
దోహదము గావించినవి.
267
డా॥ దేవులపల్లి రామానుజరావు (గ్రంథావళి
రాజకీయములు, సాహిత్యము, శిల్పము, కళ మొదలైన విషయాలయందు శ్రీ
కృష్ణారావుగారు కూలంకషమగు ప్రజ్ఞను సంపాదించిరి. టాగోరు కవిత్వమును గూర్చి
కృష్ణారావుగారు వ్రాసిన వ్యాసములు, రాధాకృష్ణునివంటి వేదాంతవేత్త రచనాశక్తిని
ఉద్దీపింపజేసినవని చెప్పుచుందురు. ఒకపర్యాయము గాంధీమహాత్ముడు పట్టాభిగారితో
కృష్ణారావుగారిని గూర్చి ప్రస్తావించి “ఆ ఫిలాసఫర్ బాగున్నారా” యని అడిగినారట.
ఇందువలన మహాత్ముని వంటి వారికిగూడ కృష్ణారావుగారు ఫిలాసఫర్ అనుభవము
యేర్చడినట్లు స్పష్టమగుచున్నది.
తెలుగుభాషలో వ్యాసరచనకు చక్కని ఒరవడి పెట్టినవారు ముట్నూరి
కృష్ణారావుగారనుట నిస్సంశయము. ఏ విషయమును గూర్చియైనను సమగ్రముగను,
స్పష్టముగను, సుబోధకముగను వ్రాయు తెలుగువచన రచయితలలో కృష్ణారావుగారిది
అగ్రతాంబూలము. వైశాల్యముతోపాటు లోతుగూడ వారి రచనలయందు
కనుపించుచుండును. తెలుగులో వ్యాసరచనా ప్రావీణ్యమును సంపాదించ దలచినవారు
కృష్ణారావుగారి రచనలను పదేపదే పఠించుట అవసరము.
కృష్ణావ(త్రిక నంపాదకీయములు నిర్భయ నిష్పాక్షిక విమర్శలుగా
తెలుగుదేశమునందు ప్రసిద్ధి గాంచినవి. సత్యప్రకటనమునందు స్నేహము గాని,
మొగమోటమునుగాని, కృష్ణారావుగారు పాటింపలేదు. ఆంధ్రరాష్ట్ర సమస్యనుగూర్చి
తమ అంతరంగ మిత్రులగు శ్రీపట్టాభి సీతారామయ్యగారి వంటివారిని విమర్శించుటకు
గూడ వారు వెనుదీయలేదు.
ఆడంబరము, ప్రచారము ఒల్లనివ్యక్తి శ్రీ ముట్నూరి కృష్ణారావుగారు.
ఆంధ్రదేశములో వారొక గొప్ప సంస్థగా ఆంధ్రప్రజాహిత జీవినములో వారొక
మహాశక్తిగానుండిరి. వారు లేనికొరత యీ నాడు ఆంధ్రదేశమునందు ప్రస్ఫుటముగా
కనబడుచున్నది.
268
సారస్వత నవనీతము
కట్టమంచి రామలింగారెడ్డి
డాక్టర్ రామలింగారెడ్డిగారు చిత్తూరు జిల్లాలోని కట్టమంచి వాస్తవ్యులు. వీరిది
సంపన్న కుటుంబము, పండిత వంశము. వారి తండ్రి సుబ్రహ్మణ్యరెడ్డిగారు
గ్రంథకర్తలు. డాక్టర్ రెడ్డిగారు 1880లో జన్మించిరి. అనగా మరణించువరకు వారి
వయస్సు 70 సంవత్సరాలు. వారు 1902 సంవత్సరములో భారత ప్రభుత్వము
ఇచ్చిన విద్యార్థి వేతనముమీద ఇంగ్లండు వెళ్లి అక్కడ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయములో
చేరి చరిత్ర టైపాస్‌లో ప్రథమములుగా ఉత్తీర్ణులైరి. పూవు పుట్టగనే పరిమళించునన్నట్లు
రెడ్డిగారి ప్రతిభ వారి విద్యాదశ నుండియే ప్రకటితమైనది. వీరు కేంట్రిడ్డి
విశ్వవిద్యాలయములో విద్యార్థిగా నున్నప్పుడు అక్కడ విద్యార్థి సంఘమునకు
ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడుట యనిన సామాన్యమైన కార్యముగాదు. ఈ యెన్నిక
దాక్టర్ రెడ్డిగారి ప్రతిభా సంపదకు నుంచి తార్కాణము. ఈ పదవిని అలంకరించిన
మొదటి భారతీయుడు వీరే.
ఇంగ్లండు నుంచి వచ్చిన తరువాత డాక్టర్ రెడ్డిగారు బరోడా కళాశాలలో వైస్
ప్రిన్స్‌పాల్‌గా పనిచేసి బరోడా ప్రభుత్వ పక్షమున మరొకసారి విదేశయాత్రకు వెళ్లిరి.
తిరిగి స్వదేశమునకు వచ్చిన పిమ్మట వీరు మైసూరు సంస్థానములో కొంతకాలము
మహారాజా వారి కళాశాలకు ప్రిన్సిపాలుగను మరికొంత కాలము విద్యాశాఖా
ధ్యక్షులుగను పనిజేసిరి. తరువాత వారు ఆంధ్ర విశ్వవిద్యాలయమునకు ఉపాధ్యక్షులైరి.
శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణగారు యీ విశ్వవిద్యాలయమునకు ఉపాధ్యక్షులుగా పనిజేసిన
కాలముతప్ప మొదటినుండియు గడిచిన సంవత్సరము వరకు దాక్టర్ రెడ్డిగారే ఆంధ్ర
విశ్వవిద్యాలయమునకు ఉపాధ్యక్షులుగా నుండి దాని అభివృద్ధికి తోడ్చడిరి.
డాక్టర్ రెడ్డిగారు గొప్పమేధావి, విద్యావేత్త. నిజముగా వీరితో సమానమైన
శేముషీ ధురంధరులు, విజ్ఞానులు మనదేశమున మిక్కిలి అరుదనియే చెప్పవలెను.
కాని రాజకీయ రంగమున డాక్టర్ రెడ్డిగారు చేసిన శాఖా చంక్రమణము వలన
వారిశక్తి సామర్ధ్యములకు తగినంత కీర్తి వారికి లభించుటగాని దేశమునకు వారివలన
తగినంత మేలు కలుగుటగాని జరుగలేదు.
డాక్టర్ రెడ్డిగారు మద్రాసు రాజకీయాలలో ఒక ముఖ్య పాత్రను నిర్వహించిరి.
వీరు మద్రాసు శాసనసభకు సభ్యులుగా కొంతకాలము పనిజేసిరి. ఒక పర్యాయము
ఆంధ్ర మహాసభకు అధ్యక్షులుగా కూడ ఎన్నుకోబడిరి. ఒక సంవత్సరము చిత్తూరు
269
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
జిల్లా బోర్డుకు అధ్యక్షులుగా పనిజేసిరి. శాసనసభలలో రెడ్డిగారు తమ ప్రత్యేక
వ్యక్తిత్వమును ప్రకటించిరి. ఏ విషయమునైనను ఒక నూతన దృక్పథముతో
వరిశీలించి మనోహరముగా వ్యక్తీకరించునేర్చు రెడ్డిగారి శానన నభా
ప్రసంగములలోను, చర్చలలోను స్పష్టమగుచుండెను. అతిరథమహారథులను గూడ
సభారంగములందు వాద వేదికలందు పల్టీలను గొట్టించగల నేర్పు రెడ్డిగారు కలిగి
యుండిరి.
రామలింగారెడ్డిగారు గొప్ప వక్త. మంచిరచయిత. మన దేశమున అఖిలభారత
స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన మహాశయులలో అనేకులు ఆంగ్రభాషయందు మాట్లాడినంత
ధారాళముగా మాతృభాషలో మాట్లాడలేరు. కాని రెడ్డిగారు నవనాగరికులైనప్పటికిని
మాతృభాషను ఎన్నడును మరువలేదు. ఇంగ్లండు వెళ్ళినప్పుడు, విదేశయాత్రలు
గావించినప్పుడుగూడ రెడ్డిగారు కళాపూర్ణోదయమును, మహాభారతమును
వెంటతీసికొని వెళ్లిరి. ఆంగ్లాంధ్రముల రెండింటియందు సమాన వక్తృత్వము
కలిగినవారు శ్రీ రామలింగారెడ్డిగారు. వారి ప్రసంగము ఉపన్యాసముకాదు. అది
రసవంతమైన కవిత్వమని చెప్పిన అతిశయోక్తి కాజాలదు. వైదుష్యము, భాషా
సౌందర్యము, హాస్యము వారి ప్రసంగములో ముప్పిరి గొని యుండెడివి. ఛలోక్తులను
విసరుటలో వారిది అందెవేసిన చేయి. రెడ్డిగారి ఉపన్యాసాలు మహామహోపాధ్యాయులైన
విద్వాంసులకు సైతము విజ్ఞానపు విందులుగా నుండెడివి.
రెడ్డిగారు తెలుగులో చక్కని కవిత్వము వ్రాసిరి. వీరి కవితా రచనలలో
మునలమ్మమరణము, నవయామిని, అర్థశాస్త్రకృతి సమర్పణ పద్యములు
పేర్కొనదగినవి. ఆధునిక కావ్యములలో ముసలమ్మ మరణము ప్రథమశ్రేణి
నలంకరించ దగినదని ప్రసిద్ధ విమర్శకుల అభిప్రాయమై యున్నది. రెడ్డిగారు మంచి
వచన రచయితలు. వారి శైలి, ఆంధ్రాంగ్లముల రెండింటియందు, ప్రత్యేకమైన
విన్నాణముకలది. కళాపూర్ణోదయమును విమర్శించుచు ప్రత్యేకమైన వీరు వ్రాసిన
కవిత్వ తత్తవిచారమను గ్రంథము తెలుగులో విమర్శనా వాజ్మయమునకు మంచి
ఒరవడి పెట్టినది. వీరి అర్థశాస్త్రము విజ్ఞానచంద్రికా (గంథమండలిచే ప్రకటితమై
మద్రాసు విశ్వవిద్యాలయమునుండి బహుమతి పొందినది. వారు వివిధ గ్రంథములకు
వ్రాసిన పీఠికలు ఒక సంపుటముగా ప్రకటితమైనది. ఆధునికాంధ్రకవులనేకులను
రెడ్డిగారు ప్రోత్సహించిరి.
రెడ్డిగారి మరణమువలన ఆంధ్రదేశమున ్రకాశించుచుండిన ఒక దివ్యజ్యోతి
చల్లారినది.
270
సారస్వత నవనీతము
సురవరం ప్రతాపరెడ్డి
ఆయన మితభాషి, సాధారణముగా అడిగినంతవరకు జవాబు చెప్పి,
తనపనియేదో చేసికొనుట ఆయనకు అలవాటు. ఆధునిక నాగరికతా సంపర్క
ఫలితాలైన కృత్రిమ మర్యాదలు, హావభావవిలాసాలు ఆయనలో కనుపించవు.
ఆయనతో గాఢముగా పరిచయము లేనివారికి, ఒకటి రెండు మారులు మాత్రమే
ఆయనను చూచినవారికి, ఆయన చాలకటువైన మానిసిగా తోచును. తీవ్ర
స్వరూపము కొట్టవచ్చినట్లుండు మాటతీరువెనక ఒక మెత్తని హృదయము ఉన్నదని
ఆయనతో పరిచయము అధికమైనకొలది తెలిసికొనవచ్చును. నిండు మనస్సు
నవ్యనవనీతము - పలుకుమాత్రము దారుణాఖండల శస్త్రతుల్యము. ఇట్టి వ్యక్తి శ్రీ
సురవరం ప్రతాపరెడ్డి.
శ్రీ ప్రతాపరెడ్డి బహు భాషా విశారదులు. తెలంగాణములో దేదీష్యమానముగా
వెల్లుచున్న భాషాజ్యోతి; సంచార గ్రంథాలయము, సంభాషించు విజ్ఞానకోశము.
“సురవరంవారు రాజకీయాలలోనే తన ప్రజాజీవితమును ప్రారంభించినారు అని
ఆంధ్రపితామహులు శ్రీ మాడపాటి హనుమంతరావుగారు అన్నారు. ఆంధ్రోద్యమానికి
బీజావావనముగావించిన రోజులు; అప్పుడే విశ్వవిద్యాలయమును వదలి
ప్రతాపరెడ్డిగారు హైద్రాబాదులో న్యాయవాద వృత్తిని ప్రారంభించినారు. కాని ఆవృత్తి
ఆయన స్వభావమునకు సరిపడలేదు. అప్పటికేనెలకు ఏడెనిమిదివందల ఆదాయము
వచ్చు న్యాయవాద వృత్తిని ముందువెనకలు ఆలోచింపక వదలినారు. పత్రికా రచనల
ద్వారా దేశాభ్యుదయమునకు తమ జీవితమును ఈ విధముగా అంకితము చేయుటకు
న్యాయవాదవృత్తిని విడిచిపెట్టిన మరొక ఆంధ్ర వ్యక్తి మందుముల నరసింగరావుగారు.
ప్రతాపరెడ్డి, నరసింగరావు గార లిద్దరూ హనుమంతరావుగారి సహచరులే. పై ఇద్దరు
ప్రత్యక్షముగా వత్రికారంగములో దూకినారు. ఆంధ్ర వితామహులు
హనుమంతరావుగారు మాత్రము ప్రచ్చన్నముగా పత్రికా సంబంధము కలిగించుకొని,
నేడు కూడా అదేవిధముగా పత్రికారచన చేయుచున్నారు.
ఆనాడు శ్రీ ప్రతాపరెడ్డి న్యాయవాద వృత్తినే అంటి పెట్టుకొని ఉన్నట్లయిన ఏనాడో
న్యాయమూర్తి కాగలుగువారు. ఆనాడే ఆయన తన పలుకుబడి ద్వారా ఏదైనా
ఉద్యోగమున ప్రవేశించి ఉన్న కావలసినంత డబ్బు సంపాదించి నేడొక ఉన్నతోద్యోగిగా
271
దా/ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
వికసించెడివారు. కాని ఆ రెండు పనులు ఆయన చేయలేదు; ఆ రెండుపనులు
ఆయన న్వభావమునకు విరుద్ధమైనవి. ఇష్టములేని వనిని దేవుడేవచ్చి
బలవంతపెట్టినను చేయడు. అదే ఆయన విశిష్టత.
రాజకీయాలతో జీవితము నారంభించి, చివరకు కేవల విద్వాంసుడుగా
తయారైనాడు. ఆయనతోపాటు న్యాయవాదిగా ప్రవేశించి, మొట్టమొదట
రాజకీయాలతో కొంతకొంత సంబంధము మాత్రము కల్గించుకొనుచు, ఆంటీ
అంటకుండా ఉండి, కొంత సాహిత్యాభిరుచి కలిగి, బహుభాషా విశారదుడై, “ఈయన
తన జీవితమును సారస్వత సేవకే అర్చించగలడు” అని ప్రజలకు ఆశలు గొల్చిన
శ్రీ బూర్గుల రామకృష్ణరావు నేడు ఇరువదినాలుగు గంటలును రాజకీయాలలో మునిగి
తేలుచున్నారు. ప్రకృతి చిత్రము!
నేడు స్టేటు కాంగ్రెసు ఆంధ్ర రాష్ట్రీయ సంఘముగా మారిన ఆనాటి (1929-
30) ఆంధ్ర మహాసభకు ప్రథమ అధ్యక్షుడు శ్రీ ప్రతాపరెడ్డి. తర్వాత ఆంధ్రమహాసభ
సంపూర్ణముగా రాజకీయ సంస్థ అయినది. తెలంగాణములో నివసించు వారందరు,
తెలుగువచ్చినను రాకపోయినను తెలుగువారే అని ఆంధ్రమహాసభ నిర్ణయించినది.
అందుకు విరుద్ధముగా శ్రీ ప్రతాపరెడ్డి ఒక ఉద్యమమును లేవదీసి, ఆంధ్రమహాసభ
వేదికమీద ఆంధ్రమునకు మాత్రమే స్థానము ఉండవలెనని, ఆంధ్రులందరికి తెలుగు
తప్పని సరిగా రావలెనని గర్జించిన దినాలు జ్ఞాపకమున్నవి. ఈ వాదమును
పురస్మరించుకొని శ్రీ రెడ్డి ఆంధ్రమహాసభలో అభివృద్ధి పక్షమును స్టాపించిరి. కాని
ఈ పక్షము ఎక్కువకాలము పని చేయలేదు. తౌరక్యాంధ్రులతో సరిపడక,
సురవరంవారు క్రమక్రమముగా రాజకీయాల నుండి నిష్మ్రమించినారు. కాని నాటికి
నేటికీ కూడా, ప్రతాపరెడ్డిగారు అతివాదియే. ఆనాటి అభివృద్ధిపక్షపు భావబీజాలే
మొలకలెత్తి, తర్వాత ఆంధ్రసారస్వత పరిషత్తు యొక్క స్థాపనకు కారణభూతమైనవని
చెప్పవలెను.
తెలంగాణములో దేశసేవకు, భాషాసేవకు తన జీవితమును సంపూర్ణముగా
ధారపోసిన ఏకైకవ్యక్తి శ్రీ ప్రతాపరెడ్డి అన్నచో అతిశయోక్తి కాదు. ఆయన బహుభాషా
విశారదుడు. కనపడిన గ్రంథమును ఆసాంతము వల్లించువరకూ ఆయనకు
నిద్రపట్టదు. కేవలము పఠించుటేకాదు- గుణదోషగ్రహణ దృష్టితో గ్రంథమందలి
ప్రతి అక్షరమును మననము చేయును. ఏ విషయమును స్పృశించినను, దాని
272
సారస్వత నవనీతము
సారము చూడనిదే ఆయన వదలడు. శ్రీ ప్రతాపరెడ్డి పండితుడు - విమర్శకుడు-
కవి - కథకుడు - వ్యాసరచయిత - విజ్ఞాని. ఆయన కవికంటె ఎక్కువగా
విమర్శకుడు- విమర్శకుని కంటె ముఖ్యముగా సహృదయుడైన పండితుడు. ఆయన
రచించిన “రామాయణ విశేషములు” అను గ్రంథములో ఆగాధ పాండిత్యము, బహుళ
గ్రంథ పరిచయము, నిశిత విమర్శనా పటిమ అక్షరక్షరమునకు ప్రత్యక్షమగు చున్నవి.
ఆంధ్రుల సాంఘిక జీవనమును గూర్చి ఆయన వ్రాసిన వ్యాసాలు, చరిత్ర రచనకొక
వినూత్నమైన ఒరవడి అని చెప్పవలె. “హైందవధర్మ పోలీలు” ఆయన నిర్చుష్టవచన
రచనకు రమ్యమైన తార్మాణము. రెడ్డిగారు వ్రాసిన “నిరీక్షణము” అనుకథ తెలుగు
కథానికా సాహిత్యమునకు చక్కని అలంకారము “తుకారాం” అను నాటకము ఆయన
రచించిన గ్రంథములన్నిటిలో ఆయనకు చాలా అభిమాన పాత్రమైనదని ఆయన
సంభాషణలలో గ్రహించగలరు. పత్రికా రచయితగా ఆయన చేసిన దేశసేవ గోల్కొండ
పత్రికా పఠకులకు విదితమే.
తెలంగాణము నాజన్మభూమి అని ఉప్పొంగిపోవును. తెలంగాణముపై ఆయనకు
గల అభిమాన(ప్రేమలకు నిదర్శనము “గోలకొండ కవులసంచిక”. ఈ సంచికను
గూర్చి;
“గోలకొండ కవుల కుసుమాలు సమకూర్చి
దండ గ్రుచ్చె మా ప్రతాపరెడ్డి
అందు తావులీను అలరు సమర్చింప
బడయమైతి మకట భాగ్యరేఖ” -
అని శ్రీ శేషాద్రి రమణకవులు వ్రాసిరి.
తెలంగాణములోని సారస్వత, సాంఘిక, రాజకీయ, విద్యా, వైజ్ఞానిక,
సాంస్కృతిక సంస్థలు జరుపు కార్యకలాపములలో అధ్యక్ష పీఠము ఎప్పుడును
అయాచితముగా ప్రతాపరెడ్డిగారినే వరించుట పరిపాటి. విజ్ఞానవర్ధనీ పరిషత్తునకు
రెడ్డిగారు స్థాపకులు. ఈ సంస్థ ఆయనకు అతి ప్రాణప్రదమైనది. విజ్ఞానవర్ధని అనేకుల
హృదయాలలో విజ్ఞానజ్యోతిని వెల్లించినది. ఆంధ్ర శారదార్చనకై తెలంగాణ
యువకులను గాఢ నిద్ర నుండి మేలుకొలిపిన వైతాళికుడు - దేశికుడు - శ్రీ ప్రతాపరెడ్డి.
రెడ్డివిద్యార్థి వసతి గృహమును అభివృద్ధికి తెచ్చిన వారిలో ముఖ్యుడు. తెలంగాణ
మునకు ఆయన చేసిన సేవస్మరణీయమైనది.
273
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
జార్జి బెర్నార్డు షా
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆంగ్ల రచయిత జార్జి బెర్నార్డుషా కొంత కాలము
నుండి అస్వస్థతతో నుండి త్వరలోనే సంపూర్ణముగా ఆరోగ్యము పొందగలడని
ఆశించుచుండగా అకస్మాత్తుగా ఆయన మరణ వార్త తెలిసినది. గండము గడచి
బయటపడినచో తాను అమరుడను కాగలనని బెర్నార్డు షా కొన్నిదినాలకు ముందే
తెలిపియుండెను. ఈ మాటల వలన ఆయన గూడ తన అవసానమును శంకించినట్లే
స్పష్టము కాగలదు.
షా ఐర్లండు దేశీయుడు. కాని ఆయన మరణము ఐర్లండు దేశమునే కాక
సమస్త ప్రపంచమును గూడ దుఃఖ సముద్రములో ముంచినది.
ఈనాటి ప్రపంచ మహారచయితలలో బెర్బార్డు షాకు సమున్నతస్థానము కలదు.
నాటక రచయితగా ఆయన జగత్ర్రసిద్ధి గాంచి 'షేఖ్సియర్‌తో సమానమైన రచయితగా
మెప్పులొందినాడు. షా అనేక నాటకములను రచించెను. తననాటకములన్నింటిలో
జోస్ ఆఫ్ ఆర్క్ ఉత్మృష్టమైనదని ఆయన అభిప్రాయమై యుండెను. ఇటీవల ఆయన
యీ అభిప్రాయమును తెలుపుచు జోన్ ఆఫ్ ఆర్మ్‌ను తాను వ్రాయలేదనియు,
జోన్‌ఆఫ్‌ఆర్మ్‌యే దానిని వ్రాసినదనియు తెలిపిరి. షా రచనలలో వ్యంగ్యము
అధిక్షేపము సమృద్ధిగా కనబడుచుండును. ఎనిమిదవ ఎడ్వర్డు, తాను కోరిన స్త్రీని
వివాహము చేసుకొనుటకై స్వతంత్రములేక పోయినందున రాజ్యపరిత్యాగము
చేసినప్పుడు ఆ సంఘటనకు కారణభూతుడైన బాల్టిన్ ప్రధాని మొదలైన వారి
శీలమును ఆయన ఒక నాటకములో చక్కగా చిత్రించి యుండెను.
షా ఒక నాటక రచయితయేకాదు, అనేక ఇతర విషయాలను గూర్చి కూడ
ఆయన విలువగల గ్రంథములను వ్రాసి యున్నారు. అర్థశాస్త్ర రాజకీయ శాస్త్రములు
షాకు అభిమానాస్పదమైన విషయములు. ఈ విషయములను గూర్చి ఆయన
గ్రంథములను గూడ రచించినాడు. షా గొప్ప విజ్ఞాని, మేధావి, ఫిలాసఫర్.
మన తెలుగు కవీశ్వరులలో నొకరు యెంత బాగుగా రచించినప్పటికిని
సమకాలికు లెన్నటికిని మెచ్చరని తన విచారమును ఆక్రోశమును ప్రకటించెను.
సాధారణముగా, అందు ముఖ్యముగా ప్రాచ్య ఖండమునందు, సమకాలికుల
274
సారస్వత నవనీతము
మెప్పుపొందుట మిక్కిలి కష్టమైన పని. అయితే యీనాడు పరిస్థితులు కొంచెము
మారినవి. ప్రతిభకు ప్రణమిల్లుట మనవారు మెల్లమెల్లగా నేర్చుకొనుచున్నారు.
సమకాలికుల ఆదరము పొందిన రచయితలు కూడ కనబడుచున్నారు. అయితే
బెర్చార్డు షా వలె సమస్త ప్రపంచములోని సమకాలికుల యొక్క గౌరవాదరములు
పొందిన రచయిత మరొక్కరు కనిపించరని చెప్పవచ్చును. తన జీవిత కాములోనే
ఆయన పూర్వ కవులతో సమానమైన గౌరవాదరములు పొందగలిగెను.
షా మంచి వక్త, సంభాషణా చతురుడు, ఛలోక్తి నిపుణుడు, ఏ విషయము
గూర్చి యైనను ప్రశ్నించినప్పుడు వెంటనే యేమాత్రము తడముకొనక చమత్మారముగా
సమాధానము జెప్పుటలో షా అద్వితీయమైన నేర్పుగలిగి యుండెను. ఈయన ఛలోక్తి
ప్రపంచ ప్రఖ్యాతి పొందినది. ఈ విధముగా తన చలోక్తులచేత సమస్త జగత్తును
ఆకర్షించిన ఆధునిక రచయిత మరొక్కరులేరని చెప్పిన అతిశయోక్తి కాజాలదు. షా
ఛలోక్తులన్నియు కలిపి ఒక పుస్తకము ప్రకటించినచో అది యొక మంచి రచనగా
ఉండగలదు. షా ఛలోక్తులలో సమాధానములలో ఆయన ప్రత్యేక వ్యక్తిత్వము
ప్రతిబింబితమగు చుండును. షా సుందరాకారుడుకాడు. ఒకసారి అయిరోపాలో
సౌందర్యమునకు ప్రసిద్ధి చెందిన యొక విలాసిని షాను వివాహమాడగోరి “నన్ను
నీవు పెండ్లాడినచో మన సంతానమునకు నా సౌందర్యము నీ మేధాసంపద”
లభించగలదని వ్రాసినప్పుడు షా వెంటనే ఆమెకు “.......... మన సంతానమునకు
నా సౌందర్యము నీ మేధస్సు లభించినచో చాల పశ్చాత్తాప పడవలసి యుండునని”
వ్రాసిన సమాధానము సుప్రసిద్ధమైనది.
షా శాకాహారి, సామ్యవాది, సామ్యవాదమును గూర్చి ఆయన యొక గ్రంథమును
గూడ రచించెను. పుస్తక సమీక్ష సాహిత్య విమర్శలలో ఆయన ప్రత్యేకమైన నేర్చుగలిగి
యుండెను. 1925 సంవత్సరములో ఆయన సాహిత్యమునకు నోబుల్ బహుమానము
పొందియుండెను. మరణించువరకు ఆయన వయస్సు 94 సంవత్సరాలు.
షా తీవ్రమైన రాజకీయ అభిప్రాయములు కలిగియుండెను. నిర్భయముగా
విమర్శించుటలో షాను మొదలుజెప్పి తరువాత ఇతరులను చెప్పవలెను. యుద్ధమును
గూర్చి అభిప్రాయము తెలుపుమని కోరగా “ఈ విషయమై నా అభిప్రాయముతో
పనియేమి? ఏది యెట్లున్నను నేను విధిగా పన్ను చెల్లించు చున్నాను కదా” అని
275
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
ఆయన తెలిపి యుండెను. గాంధీ మహాత్ముని మరణము పట్ల సంతాపమును తెలుపుచు
“ప్రపంచములో మిక్కిలి మంచివాడుగా నుండుట కూడ యెంత ఉపద్రవకరమైనదో
ఇందు వలన వెల్లడి యగుచున్న” దని షా చేసిన వ్యాఖ్యానము ఆయన ప్రత్యేకతకు
నిదర్శనము. ప్రపంచ రాజకీయ వేత్తలందరిలో నెహ్రూ, స్టాలిన్‌ల మీద షాకు విశేష
గౌరవాదరము లుండెను. ఈనాటి అంతర్జాతీయ రాజకీయ సంఘర్షణలో ప్రపంచము
యొక్క ఆశలన్నియును వారిద్దరి మీదనే ఆధారపడి యున్నవని ఆయన
తెలిపియుండెను.
94 సంవత్సరాల వృద్ధ దశయందు షా అస్తమించెను. ఆరమగ్గిన పండు రాలి
పోయినది. జీర్ణమైన శరీరము నుండి అత్మ యెగిరిపోయినది.
276
సారస్వత నవనీతము
మధుర మూర్తి బాపిరాజు
స్వర్గీయ శ్రీ బాపిరాజు గారిని సంస్మరించినంతనే, ఆయన (ప్రేమమూర్తి కనుల
ముందు సాక్షాత్మరించి, ఆయన మరణవార్త అసత్యమను భ్రాంతి కలుగుతుంది.
నిజమాలోచించితే బాపిరాజు గారు మరణించలేదు. ఆయన శరీరము మాత్రమే
అద్భశ్యమైనది. ఆయన అమర జీవి.
ఆంధ్ర దేశానికి తెలంగాణానికి మధ్య స్నేహ సంబంధాలు అభివృద్ధి గావించి,
యీ రెండు ప్రాంతాలను దగ్గరగా తీసికొని వచ్చుటకు ప్రయత్నించిన మిక్కిలి
కొద్దిమంది సారస్వత ప్రతులలో బాపిరాజు గారు ముఖ్యముగా లెక్కింప దగినవారు.
1942 ప్రాంతమున బాపిరాజు గారొకటి రెండు సంవత్సరాలు హైద్రాబాదు
లోనే నివాసము కల్పించుకొని యుండిరి. ఆ స్వల్ప వ్యవధిలో తెలంగాణములోని
అన్ని పక్షాల వారికి బాపిరాజు గారు ఆప్తబంధువులైనారు. ఆ రోజుల్లో బాపిరాజు
గారు ప్రాతినిధ్యము వహించిన రాజకీయ అభిప్రాయాలను హర్షించనివారు కూడ
శిల్పిగా, చిత్రకారునిగా, సారస్వత ్రతునిగా, అన్నిటికిమించి (ప్రేమమూర్తి యైన
సరసునిగా, ఆయనను ప్రేమించి ఆదరించేవారు. వాస్తవానికి బాపిరాజు గారు అజాత
శత్రువు. ఆయన మూర్తి సుకుమారము, హృదయము కుసుమ కోమలము, వాక్కు
నవ్య నవనీత సమానము.
తెలంగాణములో ఆయన నివసించిన కాలము కొద్దిదైనప్పటికిని, ఆ స్వల్ప
వ్యవధిలో ఆయన యిక్కడి పెద్దలతో, పిన్నలతో, రాజకీయ నాయకులతో,
ప్రముఖులతో, కవులతో, పండితులతో, అందరితోను సన్నిహిత సంబంధాలు
కలుగజేసికొని యుండిరి. బావగారనియో, అన్నగారనియో, తమ్ముడనియో
ఒక్కొక్షరితో ఒక్కొక్క విధమైన వరుసతో, ఆప్యాయతను కలవరచుకొని బాపిరాజుగారు
ప్రతివారి ప్రేమను చూరగొని యుండిరి.
బాపిరాజుగారిని తలచుకొన్నప్పుడు కొన్ని మధురమైన సంఘటనలు జ్ఞప్తికి
వస్తున్నవి. 1941 ప్రాంతమున హనుమకొండలో జరిగిన లక్ష్మణరాయ వర్ధంతికి
(ప్రధాన ఉపన్యాసకులుగా బాపిరాజు గారు వచ్చినప్పుడు, మొట్టమొదటిసారి నేను
వారిని కలుసుకొని సంభాషించడం జరిగింది. ఆరోజు సాయంకాలము మేము
ఉభయులమూ, వరంగల్ స్టేషన్ నుంచి హనుమకొండలోని సభాస్థలానికి వెళ్లడం
277
డా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
జరిగింది. సుమారొక గంటసేపు గుజ్బపు బండిలో ప్రయాణం చేసినాము. ఈ
గంటసేపూ బాపిరాజుగారితో సంభాషణ వలన వారి విజ్ఞానము సర్వతోముఖమైనదనీ,
వారి హృదయం విశాలమైనదనీ వారి ప్రతిభ బహుముఖమైనదనీ గ్రహంచినాను.
ముఖ్యముగా నన్నాకర్షించింది వారి మధుర స్వభావం.. అప్పుడు వారితో నేను “మీ
యందు భక్తిభయమునాకు కలుగుటలేదు. మరి మీయందు కలుగుతున్నది ప్రేమ”
అన్న మాటలను తరువాత వారితో విశేష పరిచయము కలిగినప్పుడు గూడ
మార్చుకోవలసిన అవసరములేకపోయినది.
అప్పుడు నా నివాసము స్వగ్రామమైన వరంగల్. హైద్రాబాద్ వెళ్ళిన ప్రతిసారీ
బాపిరాజుగారిని సందర్భించకుండా రావడమనేది లేకపోయేది. సాధారణంగా నేను
వారి దగ్గరకు వెళ్లడం ఉదయము పూటే. ఆ రోజులలో వారు మీజాన్‌లో ప్రకటించిన
గోనగన్నారెడ్డి మొదలైన సవలలు ట్రాస్తుండేవారు. ఆ నవలలో కొన్ని అధ్యాయాలు
వ్రాసిన సందర్భంలో నేను వారి దగ్గర కూర్చోవటం తటస్థించింది. అందుచేత
స్వయంగా వారి ప్రతిభా ప్రకాశమును మిక్కిలి సమీపంగా చూసే అవకాశం నాకు
కలిగినది.
1945 ప్రాంతమున మహబూబునగరంలో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు
వార్షికోత్సవాల సందర్భంలో సాహితీపరులైన మిత్రులతో పాటు ఆయన సహవాసంలో
మూడు రోజులు కలిసి ఉండే అవకాశం నాకు దొరికింది. ఆసారి కవిసమ్మేళనానికి
బాపిరాజుగారే అధ్యక్షులు. ఆ కవిసమ్మేళనంలో కీ॥ శే॥ సురవము ప్రతాపరెడ్డి, శ్రీ
బూర్గుల రామకృష్ణారావు మొదలైన పెద్దలతో పాటు అప్పుడే కళాశాలను విడిచి
వచ్చిన యువకుడైన నేనూ పాల్గొనడం జరిగింది. ఆ సందర్భంలో వారికి మా
అందరినీ పరిచయం చేస్తూ బాపిరాజుగారు చిత్రించిన వాక్చిత్రాలు తెలంగాణ
పరిస్థితులను గూర్చి వ్యక్తులను గూర్చి వారికి గల గాఢ పరిచయానికి మంచి
నిదర్శనాలు.
ప్రతి సంవత్సరాదికి మీజాన్ సంచిక ద్వారా బాపిరాజు గారు ఇక్కడి ప్రజాహిత
రంగంలో నున్నవారికి కొన్ని బిరుదులు ప్రసాదించేవారు. ఆ బిరుదావళిలో లలితమైన
హాస్యముముప్పిరిగొని యుండేది. ఇటువంటి బిరుదులు ఒకటి రెండు నాకు గూడ
వారు ప్రసాదించియుండిరి.
278
సారస్వత నవనీతము
బాపిరాజుగారిని తలచుకొన్నప్పుడు అనేక సమావేశాలు, అనేక సంభాషణలు,
అనేక సంఘటనలు జ్ఞప్తికి వస్తున్నవి. ముఖ్యంగా చిరునవ్వు చిందులాడుతూ
అమాయకత్వమును ప్రదర్శించే వారి ప్రసన్న వదనము, కోమలమై నిష్కపటమైన
వారి శీలము, యెన్నటికినీ మరచిపోలేము. కాకతీయ శిల్పము, కాకతీయ చరిత్ర,
కాకతీయ సీమ బాపిరాజుగారికి అభిమానాస్పదమైనవి. ఈ ప్రసక్తి వచ్చినప్పుడల్లా,
ఆయన ఎంతో ఉద్రేకంతో ఆవేశంతో మాట్లాడేవారు. మూర్తీభవించిన ఆంధ్రత్వమే
అడివి బాపిరాజుగారు. “ఏటినురగల్లోన, యెన్నెల యెలుగుల్లోన”, “ఉప్పొంగి
పోయింది గోదావరీ తెప్పున్న యెగసింది గోదావరీ” అనే గేయాలను పాడి అనేకులను
ఉత్తేజితులను గావించిన బాపిరాజుగారి వాణి యింకను చెవులలో (ప్రతిధ్వనించు
చున్నది. హైదరాబాదులో రెడ్‌హిల్స్ ప్రాంతానికి వెళ్లినప్పుడు బాపిరాజుగారు
కొంతకాలము కాపురముండిన గృహము కనుపించి, ఆయనతో గడిపిన అనేక క్షణాలు
మళ్లీ అనుభవానికి వస్తున్నవి.
ఒక్కమాటలో చెప్పవలెనన్నచో మధురమూర్తి బాపిరాజు అమరజీవి.
279
"239
వ్యాస్ మంజూష్
(తొలిముద్రణ : 01.11.1956)
షన్
రెండు మాటలు
అప్పుడప్పుడు ఆంధ్రజనత, గోలకొండ పత్రికలలో వ్రాసిన
వ్యాసాలు, రేడియోలో చేసిన ప్రసంగాలు సేకరించి, అందులో కొన్ని
ముఖ్యమైన మార్పులు గావించి సంపుటీకరించిన దీగ్రంథము.
ఇందుకు యీ పత్రికలకు, రేడియో వారికి నా కృతజ్ఞతలు. వ్యాసాలను
సేకరించి, శుద్ధప్రతిని తయారు చేయుటలో తోడ్పడిన శ్రీ సాకేతరాజు
గారికి కృతజ్ఞుడను.
ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భమున తెలుగు పాఠక లోకానికి,
యీ గ్రంథము సమర్పించుట జరుగుచున్నది.
పీఠిక వ్రాసిన మిత్రులు శ్రీ గడియారం రామకృష్ణశర్మ గారికి
ధన్యవాదాలు.
1వ నవంబర్ 1956 దేవులపల్లి రామానుజరావు
దుర్ముఖి, దీపావళి
విషయసూచిక
మున్నుడి
తెలుగు శృంగారము
శృంగారకవి పోతన ..........౨౨౨౨౨౨౨౨౨౨౦౦౦౦౦ ౦ 287
క్షేతయ్య శృంగారము.............2220౬౬6t౭౭౭లలలలజలలలలలలలలజలలలలల 292
సూరన కళాపూర్ణోదయము ...........===౭4౭222౭౭౭౭౭లలలలలలలలలలలం 297
ముద్దుపళని - రాధిక.......౨౨౨౨౨౨౨౨౨౨౦౦౦౦౦౦౦౦౦ లంట 302
ఆధునికాంధ్ర సాహిత్యము
ఆంధ్రోద్యమము - తెలుగు వాజ్బయము........................ 806
ఆధునిక కవిత్వములో శబ్దరామణీయకత ...................... 309
ప్రకాశంగారి స్వీయ చరిత్ర... 318
సాహితీ సమారాధకులు
గరుదేవదు. రవీంద్రుడు... అ 325
చిలకమర్తి.
కవయిత్రి తోరూదత్...........2 ౬22020౭౭ 332
శ్రీ రాయప్రోలు సుబ్బారావు .........౨౨౨౨౨౨౨౦౦౦౦౦ ౦౦ అలలు 335
దేవులపల్లి కృష్ణశాస్త్రి... 342
మున్నుడి
ఆధునికాంధ్ర సాహిత్యమున గద్య రచనకు ప్రధాన స్థానము కలదు. కాని
నేటి యువ రచయితలలో తెలుగు వచన రచన నొక కళగా సాధించినవారు చాల
తక్కువగ నున్నారు. అందును విమర్శనాక్షేత్రమున కృషి చేయుచున్నవారు
అంతకంటెను అల్ప సంఖ్యాకులు. సాహిత్య విమర్శనకు సంస్మారముతో బాటు
సరసత్వము, సంయమము చాల అవసరమైనవి. స్వాభావికముగ ఆవేశపు పాలెక్కువ
కల తెలుగువారిలో కవులు కథకులు కుప్పతిప్పలుగ నున్నారు. ప్రాచ్య పాశ్చాత్య
సంప్రదాయములను, సాహిత్య రీతులను క్షుజ్ణముగ నెరిగి తెలుగులో విమర్శ
సాహిత్యమునకు చక్కని రూపు రేఖలు దిద్ది తీర్చగల వారు నేటికిని వ్రేళ్ళపై లెక్క
పెట్ట దగిన స్థితిలో నుండుట గమనింపదగిన అంశము. తెలంగాణమున ఆంధ్రాంగ్ల
సాహిత్య మర్యాదల నాకళించుకొని కవి ఆంతర్యమును, కావ్య హృదయమును
గుర్తించి మనోహర శైలిలో తెలుగు సాహిత్య విమర్శలు వెలయించుచున్నహారిలో
మిత్రవర్యులు శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు ప్రథమ గణ్యులు.
ఉత్తమ రచయితగా, విమర్శకులుగా, పత్రికాధిపతిగా తెలుగు వచన రచనలోని
మెళకువలను జీర్ణించుకొన్న విద్యావేత్తలు లోకజ్ఞులునగు శ్రీ రామానుజరావు గారు
చిన్ని పొత్తములో తెలుగు కావ్యములలోని శృంగారము, ఆధునికాంధ్ర సాహిత్య
రీతులు, సాహిత్యారాధకులు అను వివిధ విషయములపై తాము వ్రాసిన కొన్ని
వ్యాసములను కూర్చినారు. ఇవన్నియును వారి విశిష్టశైలికి మచ్చుతునకలు.
తెలుగులో శృంగార ప్రబంధములు లెక్కకు పెక్కులుగ నున్నను ఉదాత్త శృంగార
రసానుభవమునంది రచనలు చేసిన తెలుగు కవులు మిక్కిలి తక్కువ. ఇందుకు
కారణము అనాటి పరిస్థితులు కావచ్చును. అనుభవమును బట్టి మనలో పలువురకు
శృంగారమును గూర్చి సరియైన జ్ఞానము లేదనుట సాహసము కాదేమో! రసరాజమగు
శృంగారముపై ఉదాత్త దృష్టి గల విద్వాంసుల అభిప్రాయముల నీసందర్భములో
గమనించుట సముచితము, “ఆనందమునకు గల అనేక రూపములలో సర్వ విదితమై,
సర్వ సులభమై, సర్వ ప్రియమైనది శృంగారము, లేక స్రీ పురుషుల పరస్పరాకర్షణము.
అదే సృష్టికి మూలశక్తి. ఉపనిషత్తులు దాని మహిమను వేనోళ్ళ కీర్తించుచున్నవి.
దేశ బుషిగాథ లందుకు దృష్టాంతములై యున్నవి. సర్వేశ్వరుని అనంతకోటి
విలాసములలో నది నిత్యమై వెలయుచున్నది. శృంగారము ప్రపంచ ధర్మములలో
నొకటి. తరులతాదులకు పుష్పమెట్టిదో స్త్రీ పురుషులకు శృంగార మట్టిది. పుష్పమును
ధరించుటకు నాజూకుతన మవసరము. శృంగారము ననుభవించు పట్టుల నయ
సౌజన్యములు ముఖ్యములు. భగవదర్చితమైన పుష్పము పుణ్యము. భగవత్రసాదముగ
అనుభవించు శృంగారము ధర్మము. పరమేశ్వర సంస్మరణ వలన సమస్త మానవ
వ్యాపారములు పవిత్రవంతములగును. శృంగారోపాసనముగూడ నట్టిదే”. ఈ
దివ్యసందేశమునే నన్నయభట్టారకుడు ప్రతిపాదించినాడు. తరువాత తెలుగుకవులలో
శృంగార రససాక్షాత్మారము నొందినవారు కొందరే ఉన్నారు. సహృదయులగు శ్రీ
రామానుజరావుగారు తెలుగు కావ్యములను మధించి ఆంతరిక రసస్వరూపము నెరిగి
ఆనందానుభూతితో శృంగారమును పోషించిన పోతన, సూరన, క్షేత్రయ్య, ముద్దు
పళని తమ కావ్యములలో అచ్చమైన శృంగారపు లోతుల నెట్లు స్పృశించిరో
నిరూపించినారు. వెగటు కలిగించు బాహిర శృంగారము కంటె ఆంతరిక శృంగారము
గొప్పదని విశదము చేసినారు. ఈ దృష్టితో తెలుగు కావ్యములను సమీక్షించిన
వారులేరు.
అధునిక సాహిత్యమునకు సంబంధించిన వ్యాసములు విషయ వైవిధ్యమును
వైశిష్టమును కలిగియున్నవి. వీరికి వ్యక్తి చిత్రణమున చక్కని నైపుణ్యము కలదు.
ఆయారంగములలో సుప్రసిద్ధులగు వ్యక్తుల స్వరూప స్వభావములను కనులకు
గట్టినట్లు చిత్రించుట సాధారణ విషయముకాదు. వాస్తవిక విషయములకు
దూరముగాక తూచినట్లు గుణదోషములను వివేచించి ఎంతటి వ్యక్తికి
సంబంధించినదైనను వెనుక ముందాడక యాథార్థ్యమును నిర్భయముగ ఎత్తిచూపగల
దిట్టతనము వీరికి వెన్నతో వచ్చినది. సందర్భోచితముగ వీరుపయోగించు వ్యంగ్యము
హృదయంగమమైనది. లోక మెరుగని వారికంటె లబ్ధ(ప్రతిష్ణులను గూర్చి వ్రాయుట
కష్టము, సజీవులగు వారిని చిత్రించుట కష్టతరము. అట్టి చిత్రణమున వ్యాసకర్తకు
గల ప్రతిభ ప్రశంసార్హమైనది.
శ్రీ రామానుజరావుగారి శైలి ప్రత్యేకమైనది. వీరి రచనల ప్రాశస్త్య్యమునకు
విషయ వివేచనా శక్తితోపాటు మనోజ్ఞశైలి ప్రధాన కారణము. శబ్దార్థములకు గల
సత్యసన్నిహిత సంబంధమును చక్కగా నెరిగిన వారగుట వలన అర్థవంతములగు
అలతి యలతి పదములతో నుందరవాక్యనిర్మాణము నందును, తాము
చెప్పదలచుకొన్న భావమును సూటిగ సుస్పష్టముగ మనస్సునకు తాకునట్లు
వ్యక్తీకరించుటలోను సిద్ధహస్తులగు వీరు ఇట్లే ఆంధ్ర కావ్యసాగరమును మధించి
లోకమునకు రసామృతమును పంచి పెట్టెదరని ఆశించున్నాను.
దుర్శఖి శరత్తు గడియారం రామకృష్ణశర్మ
1.10.56
వ్యాస మంజూష
శృంగార కవి పోతన
శ్రీనాథ పోతనలు బావ మరదులనియు, సమకాలికులనియు ప్రతీతి. ఆ
వరుసతో మనకేమి; అందలి సత్యము చారిత్రకు లెరుంగుదురు; ఈ ఉభయులలో
శ్రీనాథుని కవిత్వము శృంగార రసపూర్ణమైనదనియు సాధారణముగా లోకులవాడుక.
కాని నిజమారసినచో యీ వాడుక మాత్రము సంపూర్ణమైన సత్యము కాదని
స్పష్టమగుచున్నది. శ్రీనాథుని భీమేశ్వర పురాణము, కాశీఖండము భక్తి సంపన్నములు.
పోతనామాత్యుని భాగవతములో భక్తితోపాటు శృంగార రసము వెల్లివిరియుచున్ఫది.
అక్క చెల్లెండ్ల వంటి యీ రెండు రసములు సమానముగా ఆదరించి పోషించిన
ఆంధ్ర కవులలో బమ్మెర పోతన ప్రముఖుడని భాగవతము నందలి ప్రతి స్కంధము
బుజువు చేయుచున్నది. వాస్తవము విచారించినచో సుకుమారమైన శృంగార
చిత్రణము నందు పోతనతో సమానుడైన తెలుగు కవి మరొకరు లేరని తోచుచున్నది.
ఏ కొంచెము అవకాశము కలిగి నప్పటికిని, శృంగార రస పోషణమునకు
పోతన కలము ముందుకు దుముకుచుండును. గాఢమైన భక్తిచే అవేశము పొందిన
సందర్భాలలో కూడ పోతన హృదయము శృంగార భావములతో ఉప్పొంగిపోయిన
ఉదాహరణల నెన్నియైన చూపించవచ్చును. ఒక మాటలో చెప్పవలెనన్నదో పోతన
శృంగారము యొక్క మాధుర్యము, వైవిధ్యము ఆంధ్ర భాషలోని మరొక (గ్రంథము
నందు కనుపించదు. శ్రీనాథుడు మహాకవియే; తెలుగు దేశమును, తెలుగు నదులను,
తెలుగు ఆచారములను కవితా దర్బణమున మనోహరముగా ప్రతిబింబింప జేసిన
కవిసార్వభౌముడే, ఆయన ఆంధ్రులయింటి షడ్రసోపేత భోజనమును నోరూర,
నోరార వర్ణించిన కవులలో అగ్రగణ్యుడు. కాని శృంగార రస చిత్రణము నందు
మాత్రము పోతనతో శ్రీనాథుడు సమానుడు కాడని నిస్సంశయముగా చెప్పవచ్చును.
అంత మాత్రాన శ్రీనాథ కవీంద్రుని వాసి తగ్గ వలసిన ఆవశ్యకత ఆవంతయు
లేదు. శ్రీనాథుని శృంగార రచనలు పరిశీలించిన అవి సమకాలిక సుందరీమణుల
యొక్కరూపు రేఖలను, కప్పు కొప్పులను, చక చకలను, తళ తళలను, పై మెరుగులను
వర్ణించుట వరకే పరిమితమైనట్లు కనుపించుచున్నది. రూప వర్ణనతోడనే శ్రీనాథునిలో
భావచ్యుతి జరుగుచుండును. విలాస విభ్రమాలను, శృంగార క్రీడా విశేషాలను,
అపూర్వ మధుర సన్నివేశాలను హృదయము నుండి ఉత్మటముగా దూసికొని వచ్చు
287
దా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
(ప్రేమ భావాలను చిత్రించుటలో పోత్నతో శ్రీనాథునకు పోలికయే లేదు. శ్రీనాథుని
నైపుణ్య మంతయు ఆకారవర్ణనతోనే ఆగిపోవు చుండును. ఇందుకు యీ ఉభయుల
రచనల నుండి యెన్నియెన నిదర్శనాలను ఏరి చూపించవచ్చును.
పోతన చిత్రించిన శృంగారము విలక్షణమైనది; మధుర భావోపేతమైనది.
అపూర్వమైన శృంగార ఘట్టములను, విలాస భావాలను ప్రదర్శించుట యందు పోతన
కలమునకు గల నేర్పు అద్వితీయమైనది. శృంగార చిత్రణమునకు పోతన
కలిగించుకొను అవకాశములు కూడ ఇతర కవీశ్వరులకు తెలియని పరమ
రహస్యములు. ఈ దృష్టితో భాగవతములోని ఇష్టదేవతాది ప్రార్థనమునే పరిశీలించి
నప్పుడు మొట్ట మొదటి పద్యమే మనము చూపించగల చక్కని మచ్చుతునక.
పోతనామాత్యుని సరస్వతీదేవి చంచరీకచయ సుందరవేణి; సైకత(శ్రోణిి తోయజాత
భవచిత్త వశీకరణైక వాణి. వామనమూర్తికి మూడడుగుల నేల ధారపోయునప్పుడు,
ఆ దానమును గ్రహించు భగవంతుని హస్తమును “ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై
అంసోత్తరీయంబుపై, పాదాబ్దంబులపై కపోలతటి పై, పాలిండ్లపై నూత్నమర్యాదంజెంది
వెలుంగు” కరమని బలిచక్రవర్తి భావించుటలో బమ్మెర పోతన శృంగార హృదయము
తొంగి చూచుచున్నది. లావొక్కింతయులేక, ధైర్యము విలోలమైన గజేంద్రుని రక్షణకు
పరుగులెత్తుచున్న పరమేశ్వరుడు వైకుంఠ పురము నందలి సౌధములోని రమా
వినోదియట; వివాద ప్రోద్ధత శ్రీకుచో పరిచేలాంచలముతోనే ఆయన వెంట వెళ్లు
శ్రీదేవి యొక్కసౌందర్యమును గమనించుడు! ఆమె తాటంకములు చలించుచున్నవట;
ధమ్మిల్ల బంధము భుజము మీద నటించుచున్నదట. అదృఢముగా నున్న
చంచత్మాంచితో, శాటీముక్త కుచముతో ఆ తరుణమున ఆ యమ్మ కోటీందు ప్రభతో
వెలిగినదట. ఇటువంటి మనోహర దృశ్యములను చిత్రించినవారు ఆంధ్ర కవులలో
యెంతమంది కలరు? శ్రీనాథ రచనలలో ఇటువంటి సన్నివేశము లెక్కడ?
ఆంధ్రుల అభిమాన నాయికయైన సత్యభామను సహజ పాండిత్యుడు చిత్రించిన
నేర్పు అద్వితీయమైనది. తెలుగు సారస్వతములో ఇంతచక్కని చిత్తరువు ఇంకొకటి
కనుపించదు. సత్యభామ బహు సుకుమారి; బొమ్మ పెండ్లిండ్లకు పోనొల్లనను బాల;
మగవారి గనిన మరుగుజేరెడు ఇంతి, పసిడి యుయ్యెలలెక్క భయమందు భీరువు;
సఖుల కోలాహలస్వనము లోర్వని కన్య, వీణ చక్కగబట్టు వెరలెరుంగని కొమ్మ
మ్రూకున తీగె గూర్చగనేరని లేమ; సరవి ముత్యము గ్రువ్వజాలని అబల; చిలుకకు
288
వ్యాన మంజూష
పద్యము చెప్పనేరని తన్వి, అయినప్పటికిని హృదయేశ్వరుని సమక్షమున
వీరనారీమణియై, రాక్షసేశ్వరుని మీద విజృంభించినది. అప్పటి ఆమె సొగసును
పోతనయే వర్ణించవలెను. మరొక కవీశ్వరునకది శక్తికి మించినపని; ఆమె సౌవర్ణ
కంకణ రుణరుణ నినదములు శింజినీరవముతో చెలిమి సేయుచున్నవి.
తాటంకమణిగణ ధగధగ దీప్తలు గండమండల రుచిని కప్పివేసినవి. ధవళత రాపాంగ
థళథళ దోచులు బాణజాల ప్రభాపడలి నడపుచున్నవి. శరపాత ఘమఘమ శబ్ధము
పరిపంధి సైనిక కలకల స్వనము నడపుచున్నది. వీరము, శృంగారము, భయము,
రౌద్రము, విసయము కలిసి ఆకారము దాల్చిన భామినివలె ఆమె మనకు ప్రత్యక్ష
మగుచున్నది. ఒకవైపున వీరము, ఇంకొకవైపున శృంగారము ఆమెయందు
మూర్తీభవించినవి. ఆమె పరుని జూచినప్పుడు ఒక పద్ధతి; వరుని జూచినప్పుడు
మరొక పద్ధతి; ఏకకాలమున “నొంప మరియు నలరింప” ఆమె సమర్భురాలు.
ప్రాణేశ్వరుని జూచినప్పుడు సొంపు, నరకాసురుని జూచినప్పుడు కెంపు, ఏకక్షణము
ఆమె కన్నులలో కనుపించుచున్నవి. అమె మోము హరికి రాకేందు బింబము; అరికి
రవిబింబము, ఆమె చేలాంచలము హరికి కందర్చ కేతువు అరికి ఘనధూమ కేతువు;
ఆమె సందర్శనము హరికి అమృత ప్రవాహము; అరికి అనల సందోహము.
కేవల రూపకల్పన యందేకాదు; భావచిత్రణమందును పోతన అద్వితీయుడు;
ఆయన చిత్రించినన్ని శృంగార భంగిమలు, క్రీడలు, విలాసభావములు ఇంకొకరు
చిత్రించలేదని చెప్పినచో సత్యమునకు తలవంపులు కలుగజాలవు. కుబ్జా కృష్ణుల
క్రీడా విశేషము, ఉషానిరుద్ధుల పరిణయము, రుక్మిణీ కృష్ణుల కేళీవిలాసము మొదలైన
ఘట్టములు పోతన్న చిత్రించిన శృంగారము యొక్క వైవిధ్యమునకు చక్కని
తార్మాణములు. రుక్కిణీదేవితో శ్రీకృష్ణుని విరసోక్తులు, విరసోక్తులతో నొప్పిజెందిన
ఆమె హృదయము, ఆ హృదయములోని భావాలు ప్రత్యక్షమగుచున్న ఆకారము,
పోతన చిత్రించిన అపురూప శృంగారఘట్టములలో నొకటి. ఇటువంటి సన్నివేశములు
ఇంత రమణీయముగా చిత్రించిన తెలుగు కవీశ్వరుడు ఇంకొకరు కనుపించరు.
సూరన అయిదుతీరులు శృంగారమును చిత్రించినాడట, కాని పోతన అరువది
రీతుల శృంగారమును చిత్రించినాడు.
శ్రీకృష్ణుని గోకుల విహారము, గోపికా వస్రాపహరణము, రాసక్రీడలు, ఆ
సందర్భాలలో మధురమూర్తులైన ఆ గోపికల చిత్తవృత్తులు, సరస సల్లాపములు,
289
దా దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
అలుకలు, అన్యాపదేశములు, అనునయములు, ప్రణయకోపములు ఆంధ్ర శృంగార
వాజ్మయమున అద్వితీయ ఘట్టములు. ఈ భాగములోని ఒక్కొక్క పద్యము ఒక్కొక్క
రత్నము. ఇవి సామాన్య మైన రత్నములు కావు. అన్నియును జాతి రత్నములు;
సానలదీరిన రత్నములు. నల్లనివాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబు
పైజల్లెడువాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడైన శ్రీకృష్ణుని గోపికలు ఒకానొక
శరదాత్రినిచేయు అన్వేషణ, ఆ సందర్భమున విరహతప్తలైన గోపికల హృదయాలనుండి
ఉబికికొని వచ్చిన (ప్రేమభావాలు బహురమ్యముగా చిత్రించినాడు బమ్మెర పోతన.
గోపీకృష్ణుల క్రీడా విశేషాలను కనులకు గట్టినట్లు అతిసుకుమారముగా మనయెదుట
ఆయన ప్రదర్శించినాడు. గోపాలకృష్ణుని జాడలు తెలుసుకొనుటలో గోపికలు
చూపించు గుర్తులు ఎంత మనోహరమైనవి! ఒకచోట ఆయన మోపిన పాదాగ్రము
కనపడుచున్నది. అందువలన అక్కడ కొమ్మకు పువ్వులు గోసినట్లు భావించుచున్నారు.
వెంటనే అడుగులజాడ మాయమైనది. బహుశా సతినెత్తికొని వెళ్ళిన చిహ్నమేమో
అది; ఇంకొకచోట కూర్చున్న గుర్తులు కనపడుచున్నవి, ప్రేయసికి ధమ్మిల్లము
పెట్టినాడేమో అక్కడ; మరొకచోట యెవరో యొక వెలది నిక్కిన చొప్పు
గోచరించుచున్నది. అధూర్త గోపాలుడు ఆమెకు కెమ్మోవి యిచ్చిన చోటిది యని
స్పష్టముగా అనుమానము కలుగుచున్నది. కొంతదూరము వెళ్ళిన తరువాత వేరొకచోట
నాలుగు చరణాలు ప్రక్కప్రక్కన కనుపించినవి. అందుచేత అది గోపాలకృష్ణుడు
యెవరో యొక యెలనాగ చేయూదిన స్థలమని స్ఫురించుచున్నది. మరొకచోట
మగజాడ లోపల మగువజాడ కనుపించినది, తప్పక యీచోట ఆ శృంగార పురుషుడు
యెవరో యొక నీలవేణిచే యొదిగి యుండవచ్చును. ఇంకొకచోట రమణి మొక్కిన
చొప్పు కనపడినది. వేరొకచోట అన్యోన్య ముఖములైన అంఘ్రలు ప్రణయ కలాపమును
ప్రదర్శించినవి. ఈ విధముగా యీ ఘట్టము అత్యంత రమణీయముగా, బహు
సుకుమారముగా అతి మనోహరముగా వర్ణితమైనది. శ్రీనాథాదుల రచనలో ఇటువంటి
సొగసులు కానరావు. అట్లని చెప్పుటకు దారుకావన విహారాదులు నిదర్శనములు.
తెలుగు భాషలోని శృంగార గ్రంథములను అవలోకించినప్పుడు, శృంగార
కవుల రచనలను పరిశీలించినప్పుడు పోతన చిత్రించిన శృంగారము ముందు
నిలువదగిన రచనలు యెన్ని కలవు? అను ప్రశ్న సహజముగా కలుగుచున్నది.
శృంగార కవిత్వమునకు ప్రసిద్ధి గాంచిన వారి రచనలు భాగవత శృంగారము ముందు,
290
వ్యాన మంజూష
దివాకరుని యెదుట నున్న దివిటీ వలె గోచరించును. వాస్తవముగా తెలుగు కవులలో
శృంగార రసచిత్రణము నందు పోతన సర్వవిధాల అగ్రగణ్యుడు. పోతనను శృంగార
కవి యనుటలో తప్పేమి కలదు? శృంగార మనినచో మడి గట్టుకొనవలసిన
అవసరమేమి? భక్తిరసమును యెంత బాగుగా పోషించినాడో, శృంగార రసమును
అంత సమర్ధతతోనే పోతన చిత్రించినాడని చెప్పుటకు నిదర్శనాలు భాగవతమున
ఎన్నియైనను చూపించవచ్చును. ఆంధ్ర శృంగార కవులలో పోతనది అగ్ర
తాంబూలము; తెలుగు భక్తి కవులలో పోతన మున్నెన్న దగినవాడు.
పోతనను కవిత్వము వలచి వరించినది, దానితోపాటు పాండిత్యము గూడ
ఆయనకు సహజముగా అలవడినది. ఆంధ్ర కవులలో సహజ పాండిత్యుడను ప్రత్యేకత
పోతన కొక్కనికే కలదు. భాష ఆయన చేతిలోని క్రీడాకందుకము.
291
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
క్షేత్రయ్య శృంగారము
తెలుగు కవులలో శృంగార రసపోషణమున క్షేత్రయ్యకు ప్రత్యేకత, విశిష్టత
కలవు. ఆయన రచించిన పదాలన్నియును శృంగార రస (ప్రధానములే. శృంగారము
తప్ప ఇంకొక రసమువంక క్షేత్రయ్య దృష్టి ప్రసరించినటుల కనబడదు. ఈ పదాలకు
నాయకుడు దక్షిణనాయకుడైన శ్రీకృష్ణుడు; నాయిక చాలమట్టుకు స్వీయగా
యీపదాలలో కన్పడుచున్నది. పరకీయ సామాన్య నాయికలుకూడ కొందరు వీరిలో
కనిపించుచున్నారు. ఈ నాయికల హృదయస్పందనాలను, నాయకుని హృదయ
స్పందనాలను క్షేత్రయ్య తన పదాలలో వర్ణించి యున్నాడు.
ఈ పదాలలో విశేషముగా విప్రలంభ శృంగారమే (ప్రకటిత మగుచున్నది.
ప్రాణేశ్వరుడు తన దగ్గర లేనందున, తన దగ్గరకు రానందున, నాయికల
హృదయాలలో కలుగుభావాలు యీ పదాలలో అక్షరరూపము పొందియున్నవి. ప్రియ
వియోగముచే పరితప్తమైన హృదయపు ఉద్వేగము, ఆవేదన యీ పదాలకు
ఇతివృత్తము, వీనిలో యెక్కువగా నాయికా విరహము అనగా ప్రీ విరహమే
ప్రకటి తమగుచున్నను, కొన్నింటిలో నాయకుని విరహము అనగా పురుష విరహము
కూడ ప్రదర్శితమగుచున్నది. మన ఆలంకారికులు తమ లక్షణ గ్రంథాలలో నిర్దేశించిన
నాయికలందరును యీ పదాలలో గోచరించుచున్నారు. వీరిలో ముగ్గలు, మధ్యలు,
ధీరలు, అధీరలు, ధీరాధీరలు, జ్యేష్టలు, కనిష్టలు, స్వాధీనపతికలు మొదలైన అన్ని
తరగతుల నాయికలు కలరు. తుదకు బాలెంతరాలైన నాయిక యొక్క శృంగారమును
కూడ చిత్రించక క్షేత్రయ్య వదలి పెట్టలేదు. ఈ పదాలను యే మాత్రము స్థూలముగా
పరిశీలించినప్పటికిని వివిధ శృంగార నాయికల యొక్క చిత్తవృత్తులను ప్రదర్శించుటలో
క్షేతయ్య అద్వితీయమైన నేర్పు చూపించినట్లు స్పష్టము కాగలదు.
క్షేత్రయ్య పదాలలో ప్రతిపంక్తియందును, ప్రతి పదమునందును శృంగారమే
ప్రత్యక్షమగుచున్నది. శృంగారరసమును ఇన్ని తీరుల, ఇంత వైవిధ్యముగా, శృంగార
నాయికలను ఇన్ని రకాలుగా, ఇంత నిపుణముగా చిత్రించిన ఆంధ్ర కవీశ్వరుడు
మరొక్కడు లేడని చెప్పిన అతిశయోక్తి కాజాలదు.
ఈ పదాలలో నాయకుడైన మువ్వగోపాలుడు మిక్కిలి అందగాడు.
అన్నింటియందును నెరజాణ. కొక్మోకశాస్త్రము నందు పారంగతుడైన పండితుడు.
292
వ్యాన మంజూష
ఈడులేని రతులనేలి ప్రియురాలిని మేను మరపించగల రసిక చక్రవర్తి. ఇటువంటి
శృంగార నాయకునితో సహవాస భాగ్యమబ్చిన విలాసినులు మాత్రము సామాన్యలా!
వారందరును అందాల రాణులు; చౌశీతి బంధములలో ప్రవీణలైన నెణజాణలు.
ఆనాడు ననవిల్తు శాస్త్రంబు మినుకులావర్తించుపని వెన్నతోడ బెట్టినది మాకు అని
గర్వముగా చెప్పుకొన్న వరూధినికి యీ నాయికలందరును దగ్గరి చుట్టాలని
చెప్పవచ్చును. తన యురముననే తప్ప శయ్యమీద పవ్వళింపదనియు, తనతోతప్ప
ప్రాణప్రదమైన చెలులతోగూడ ముచ్చటలాడదనియు, ఆరూఢ రతికేళిలో తానే కాని
నన్నలయనీయదనియు, నేను అలిగితే తానేవచ్చి వేడుకొనునుగాని తన సఖీమణులను
రాయబారము పంపదనియు, ఒక సన్నివేశములో ఒక నాయికనుగూర్చి నాయకుడు
ఒక పదములో తలపోసి తమ పరస్పర అనుబంధమును, అనురాగమును, నాయిక
యొక్క నేర్పును విశదీకరించి యున్నాడు. ఇంకొకచోట ఒక నాయిక ప్రియుడు తన
దగ్గరకువచ్చి, చెంతనిలిచి, కొప్పులో పూవులు సవరించినది మాత్రమే తనకు
జ్ఞప్తియున్నది కాని చురుకు కెంపు మోవిపైనుంచుట తెలియనైతినని తన పారవశ్య
విభ్రమమును ప్రకటించుకొన్నది. ఇవి మచ్చుతునకలు మాత్రమే. ఈ విధముగా
యీ గేయాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైన శృంగార చిత్తవృత్తిని వ్యక్తీకరించుచున్నవి.
క్షేత్రయ్య తన పదాలలో చిత్రించిన నాయికలకు ప్రాణేశ్వరుని చిత్తవృత్తిని
గ్రహించుటలో ప్రత్యేక ప్రావీణ్యము కలదు. ఒక నాయిక తన ప్రాణేశ్వరుని ఒకమారు
'బ్రతిమిలాడి పాదాక్రాంత యగును. ఇంకొకమారు కన్నీటి కాలువలో ఆయనను
ముంచి తేల్చును. మరొక్కసారి ఘనమైన జడట్రేటుతో ఆయనను శిక్షించును. అనగా
సామదానభేద దండోపాయములను ఉపయోగించి ప్రియుని తమకు స్వాధీనునిగా
జేసికొనుటలో ఆరితేరిన వారుగా యీ నాయికలు కన్పట్టుచున్నారు. ఈ నాయికలు
పరిపాలించు శృంగార రాజ్యమునకు సర్వవిధములై సాచివ్యము నెరపగల సమర్థలైన
సభీమణులు ఈ పదాలలో మనకు కనడుచున్నారు. చూడుడు; ఒక నాయికకు
తన ప్రియుడు అగపడగానే ఆయన శరీరముమీది రతిచిహ్నములమీద ఆమె దృష్టి
ప్రసరించును. కాని ఆమె ఆగ్రహించక సమయానుకూలముగా వ్యవహరించి
ఘాటుగా మాట్లాడక అసూయను మాత్రమే ప్రకటించును. ఎత్తిపొడుపు మాటలతో
ఆయనను కొంత వేధించునుగాని ఇంటినుండి వెడలిపొమ్మని చెప్పదు. ఇంకొక
293
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
నాయిక ఇదే సన్నివేశములో యీ మాత్రము అసూయనుకూడ ప్రకటించక
గంభీరముగా యేమియు తెలియనట్లు వ్యవహరించును. ఇక సామాన్య నాయికల
శృంగార వృత్తాంతము, క్షేత్రయ్య నాయికలలో పరకీయలు, సామాన్యలుకూడ
నున్నారుకదా! ఈ పరకీయ నాయికలలో ఒకతె “నా మగడు కత్తికోతకాడు. నాకు
నీవు ఆజ్ఞయీయక తప్పదు. నేను అత్తవారింటికి పోకతప్పదు అయితే అక్కడ మాత్రము
నేను ఎల్లప్పుడు ఉండగలనా; అక్కడ నామగని బంధువులతో జగడమాడి తిరిగి
రాగలను. లేక నీవైన ఒకసారి యే తిరునాళ్ళ నెపముతోనో మా ఊరికి రా రాదా!”
అని సెలవుతీసికొని వెళ్లును. సామాన్య నాయికలు ధనాసక్తితో డబ్బు యిమ్మని
అడుగుట యీ పదాలలో కనపడును. “అయిదు వరహాలు యీయగలిగగితెనే రా!”
అని ఖండితముగా చెప్పినప్పుడు
కొక్కోకమెల్ల జదివిన
చక్మనివాడైన రాజ చంద్రుండైనన్
రొక్మమునీయక యెప్పుడు
చిక్కదురా వారకాంత, సిద్ధము సుమతీ.
అన్న సుమతి శతకములోని పద్యము వెంటనే జ్ఞప్తికి వచ్చును. ఈ నాయికలు
మరియు వారి చెలికత్తెలు సరస సంభాషణములందు, చమత్కార ప్రసంగములందు
ఆరితేరిన ప్రోడలు.
క్షేత్రయ్య నాయికలు ఆపాదమస్తకము శృంగారమూర్తులు. వారి గృహాలు శృంగార
నిలయములు. అందులో వారి పడకటిండ్లు అందాల సీమలు. ఇండ్లను, పడకటిండ్లను
అలంకరించుటలో విలాసవతులైన క్షేత్రయ్య నాయికలకు అసమానమైన చతురత్వము
కలదు. సహజముగా సుందరాంగులైన యీ నాయికలు కట్టుబొట్టు తీరులందు
ప్రదర్శించు శోభ మిక్కిలి రమణీయము. వస్త్రధారణమందు అలంకారములందును
ఈ నాయికలు ప్రత్యేక శ్రద్ధను ప్రదర్శించి మోహన మూర్తులుగా మనకు
సాక్షాత్మరించుచున్నారు. వారి వేషాలంకరణములను జూచినచో ప్రియుని ఆకర్షించు
విద్యను ఒక ప్రత్యేక కళగా అభ్యసించిన సుందరాంగులు వీరని స్పష్టము కాగలదు.
ఆనాడు తంజావూరులోని విలాసవతుల శృంగారమును ఈనాడు కవితా రూపమున
294
వ్యాన మంజూష
క్షేతయ్య మనకు చూపించుచున్నాడు. రకరకాలైన చీరలతో అందుకు తగిన రవికలతో
యీ పదాలలోని నాయికలు మన యెదుట ప్రత్యక్షమగు చున్నారు.
వస్తాలంకరణము నందేకాక శిరోజములను దిద్ది తీర్చుకొనుటలో యీ
నాయికలకు గల ప్రావీణ్యము మిక్కిలి గొప్పది. గుత్తపు వన్నెల కీల్ణడ యీ నాయికలకు
అత్యంత ్రేమాస్పదమైనదని యీ పదాల వలన మనకు తెలియుచున్నది. ఆ
రోజులలో పూవులులేని జడలు లేనే లేవు. జాజులు, విరజాజులు, మల్లెలు, మొల్లలు
మొదలైనవి యీ నాయికల కొప్పులలో నుండి సువాసనలను విరజిమ్ముచున్నవి.
ఇందుకు తోడు ఘనసారము, కస్తూరితో మిళితమైన తాంబూలము ఎల్లప్పుడును
ఆనాయికల వుక్కిళ్ళలో వరిమళించుచుండుట మనకు అడుగడుగున
కనుపించుచున్నది. ఈ నాయికల జడలలో వదులైనవి మిక్కిలి తక్కువ. ఎందుకనగా
కోవము వచ్చినప్పుడు నాయకుని మీద జడవ్రేటులను వేయననువుగా
నల్లుకొనుచుండుట ఆనాటి వాడుక; అందుకొరకే క్షేత్రయ్య నివసించిన తంజాపుర
రాజుల కాలమున ఒకచోట పద్యములో నాయిక తన సఖితో,
“సరసురాలవు జబ్బుగ నల్లినావదేమే జడ” అని ప్రశ్నించినప్పుడు”, ఆ
విజయరాఘవుని మేను, చిగురాకు వంటిదని, చెలికత్తె వెంటనే సమాధానము చెప్పిన
సంగతి సుప్రసిద్ధమైనది. ఉంగరాలు, గాజులు, కమ్మలు, మొలనూలు, ముక్కర,
నాగసరాలు, చెంపసరాలు, చిన్నసరాలు మొదలైన ఆభరణాలమీద యీ కాంతలకు
అమితమైన (ప్రేమ. కాళ్ళకు లత్తుక, కన్నులకు కాటుక యీ కాంతల అలంకారాలలో
అనివార్యమైనవి.
ఈ నాయికల పడక గదులు మిక్కిలి ఆకర్షణీయములైనవి. పట్టెమంచము,
దానిపైన పరుపు, పరుపుమీద తెల్లని దుప్పటి, దుష్పటిమీద కమ్మతావులు విరజిమ్ము
పూవులు, కొంతదూరములో నిలువుటద్దము, గదిముందు, ముద్దు పలుకులు పలుకు
చిలుకలతో గోరువంకలు, ఒకచోట తూగుటూయెల గల ఆ సన్నివేశము ఎంత
శృంగారమైనచో ఆలోచింపుడు. పన్నీరు గంధము, బుక్కా మొదలైన సుగంధ
ద్రవ్యములు ఆ నాయికలు సదా అనుభవించు విలాస సామగ్రి. ఉయ్యాలలూగుట
చదరంగమాడుట మొదలైన విలాస క్రీడలలో ఈ నాయికలు అత్యంత ప్రొఢలు.
295
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
ఈ విధముగా క్షేత్రయ్య తన (ప్రతి పదమునందును శృంగారమును
గుప్పించినాడు. సంగీతము, సాహిత్యము, అభినయము ముప్పిరిగొనియున్న క్షేత్రయ్య
పదాలలో, తంజాపుర రాజుల శృంగార జీవితము ప్రతిబింబితమగుచున్నదని
చెప్పవచ్చును. ఆ కాలమునాటి విలాస జీవనమును క్షేత్రయ్య చాల చక్కగా
చిత్రించినాడు.
ఈ పదాలకు నాయకుడైన గోపాలుడు మదనమోహనుడైన రసజ్ఞమూర్తి.
నాయికలు బంగారపు బొమ్మలైన శృంగారమూర్తులు. వారు నివసించు మందిరములు
సౌందర్య దేవతకు నిలయములు. రసికులకు అనుభవ యోగ్యమైన విలాస సామగ్రి
యంతయు ఆ సుందరాంగుల మందిరములందు సమృద్ధము. వేషభాషల యందు,
అలంకారము లందేకాక రుచులు, అభిరుచులందు కూడ యీ నాయికల శృంగార
ప్రీతి ప్రకటితమగుచున్నది.
296
వ్యాస మంజూష
సూరన కళాపూర్ణోదయము
“విరిసిన నొకయొప్పు, అరవీడిన వేరొకయొప్పు, జింక్కువా
టొరసిన నొక్క యొప్పు, నది యూడ్చిన వేరొకయొప్పు, వేణిభా
వ రచన నొక్కయొప్పు, ముడివైచిన వేరొకయొప్పు, కొప్పుగా
బరగిన నొక్కయొప్పు, కనుపట్టకమానదు నీ కచంబులన్”
అని యొకానొక నీలవేణి కుటిల కుంతల శోభను పింగళి సూరన
ప్రశంసించినాడు. ఆ సొగసులాడిని మనము చూడలేదు, కాని, ఆశోభయేమో,
సూరన శృంగారమునందు ప్రస్ఫుటముగా గోచరించుచున్నది. జగదేక సుందరియెన
చిగురుబోడి శిరోజ సౌభాగ్యమువలెనే సూరన కవిత్వము శోభిల్లుచున్నది. అది యేరీతిగ
అల్లినప్పటికిని, అందులో యేదొ యొక ప్రత్యేకమైన రామణీయకత గోచరించు
చుండును.
ఆంధ్ర శృంగారకవులలో సూరనది అద్వితీయస్థానము. తెలుగు భాషలో శృంగార
కవులని ప్రత్యేకముగా ప్రఖ్యాతి గాంచినవారు కలరు. ఆద్యంతము శృంగార
మొలుకునట్లుగా రచన గావించవలెనను అభినివేశముతో కలముల నాడించిన
కవీశ్వరులు కలరు. వీరందరి మధ్య, చుక్కలలో సూర్యుని వలె, సూరనార్యుడు
శోభిల్లుచున్నాడు. కళాపూర్ణోదయ మను గ్రంథ నామకరణమే ఆయన ప్రతిభను
మరియు అభిరుచి ప్రాశస్య్యమును వెల్లడి చేయుచున్నది.
స్వర్గమర్యలోకములను ఒక్కముడిలో బిగించినాడని కాళిదాస కవీంద్రుని గూర్చి
ఒక సుప్రసిద్ధ విమర్శకుడు చెప్పిన మాటలను కళాపూర్ణోదయము జ్ఞప్తికి దెచ్చుచున్నది.
సూరన్న కూడ శృంగార బంధముతో మర్యలోక స్వర్గలోక సత్యలోకములను ఒకచోట
ముడివేసినాడు. కళాపూర్ణోదయములోని కథకు యీ మూడులోకాలు ముఖ్య
రంగస్థలాలు. వీనితో వైకుంఠమునకు గూడ సూరనార్యుడు బాంధవ్యము కలిపినాడు.
సుకుమార శృంగార చిత్రణమునందు సూరనకు కాళిదాసుతో చాల దగ్గరి
చుట్టరికము కలదు. కొన్ని విషయాలలో షేక్సుయర్‌కుకూడ యీయన సమీప
బంధువు. శృంగార రసపోషణమున నిగ్రహము మరియు సభ్యతలను పాటించిన
కవులలో సూరన కాళిదాసు తరగతికి చెందినవాడు. తన కథలోని నాయికా
నాయకులను నిర్ణయించుకొనుటలోనే ఆయన ప్రత్యేక ప్రతిభ ప్రదర్శితమగుచున్నది.
297
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
తాను చిత్రించదలచిన శృంగార వైవిధ్యమునకు అనుగుణముగా ఆయన తన
పాత్రలను యెన్నుకొనినాడు. కొంచెము పరిశీలించినచో ఇందలి సత్యము స్పష్టము
కాగలదు.
శల్యాసురుడు రాక్షసులకోవకు చెందినవాడు. చూపుతోడనే వానికి వలపు
కలిగినది; ఆ వలపు తత్‌క్షణమే అనుభవమునకు (ప్రేరేపించినది. అట్లు తాను
కాంక్షించిన కాంతామణిని, అనుభవించు ప్రయత్నమున, తన శక్తులను జంతు
జాలము మీద వ్యర్థము గావించినాడు. కాని ఇష్ట పడనందున ఆమెను
బలాత్మరించలేదు; ఆమెకు అపాయము చేయుటకు యత్నించలేదు; తుట్ట తుదకు
తానే మోసపోయి, హతుడైనాడు. శల్యాసురుడు మానవత్వమున కన్న క్రింది దశలో
నివసించు ప్రాణి. తరువాత మన దృష్టి మానవలోకము మీద ప్రసరించుచున్నది.
ఈ రంగమున మనకు కనుపించు జంటలు మూడు. సుగాత్రీశాలీనులు, కలభాషిణీ
మణికంధరులు, మధురలాలసా కళాపూర్ణులు.
శాలీనుడు మర్యలోకము నందలి సామాన్య సంసారి. ఆయన రుచులుకూడ
సహజమైనవి. సహజమైన సొంపులే గాని కృత్రిమమైన భూషణాలు ఇంపుగాక పోవుట
శాలీనుని విశిష్టత. పడకటింటిలో ఆభరణ భూషితాంగి యైన భార్యామణి కన్న
తోటలో తనతోపాటు కష్టపడి పనిజేయు అర్థాంగియే ఆయనకు (్రేమాస్పదురాలు.
శాలీనుని దొకవిధమైన జానపద చిత్తవృత్తి. శాలీనునికి తగినట్టిది సుగాత్రి; పాపము
పతిని ప్రాణముగా భావించుకొను సాధ్వి, స్నేహితురాండ్రు మరియు తల్లి ఎంత
నూరిపోసి నప్పటికిని, మౌగ్ధ్యమును వదలజాలని ముద్దరాలు. భర్త తనను ఒల్లనందుకు
ఆమె ఆగ్రహించలేదు; మౌనముగా ఆయన సేవలో నిమగ్న యైనది; తన మీద
మనసు లగ్నమైన తరుణమున స్వాధీనురాలైనది. భర్త చిత్తవృత్తిని అనుసరించి మెలగు
స్వభావము ఆమెది. పరస్పర సంబంధాలలో ఈ దంపతులకు ఎరువు తెచ్చుకొనిన
కృతిమత్వము యేమియును లేదు. చల్లగా శాంతముగా అన్యోన్యముగా సాగిపోవు
సంసారము వారిది.
కలభాషిణీ మణికంధరులు సామాన్య సంసారులవంటి వారు కారు.
మణికంధరుడు కవీశ్వరుడు. గాన కళోపాసకుడు. అందాతనికి నారదునితో
సమానమైన ప్రావీణ్యము. ఆ కలహభోజనుని సేవలో నున్నప్పుడే ఆయన చిత్తము
కలభాషిణి మీదికి పోయినది, కాని వారి దాంపత్యము పొసగలేదు; సంసారియగుటకు
298
వ్యాన మంజూష
బదులుగా ఆయన సన్యాసి యైనాడు. తీర్థయాత్రలు, తపస్సు, రంభాసమాగమము,
మాయా నలకూబరవేషము క్రమక్రమముగా ఆయనకు తటస్థించినవి. కలభాషిణి
స్వైరవిహారధీరయైన వేశ్యాంగన. కూకటివేణితో కురులు గూడక మున్న ఆమె కోసము
ద్వారకా నగర విటావళి ఉవ్విళూరినది. చక్కదనము, వన్నెలాడితనము, కలికితనము
ఆమెయందు ముప్పిరిగొన్నవి. ఎలప్రాయముననే ఆ కోమలాంగి చిత్తము సంగీత
సాహిత్యాల కారణాన మణికంధరుని మీదను మరియు ఇతర కారణాన నలకూబరుని
మీదను లగ్నమైనది; దానితోపాటు నాకమృగీ నేత్రలమీద కయ్యమునకు కాలుచాచు
అసూయకూడ అంకురించినది. నలకూబరుని స్వాధీనుని గావించుకొను ఉద్దేశమును
మనసులో నుంచుకొని, మరొక నెపముమీద, తనకు యిష్టమువచ్చిన స్రీరూపము
ధరించు వరము సురమౌనికడ సంపాదించినదా యెలనాగ. తరుణము దొరికినంతనే
వేషము మార్చి మాయారంభ యెనది. ఆ వేషములో ఆమె జూపిన చాతుర్యము,
మాటకుమాట బదులుచెప్పు నేర్పు ప్రతిభావంతమైనది. రంభవంటి ప్రౌఢ నారీమణిని
తన వచోవిలాసము చేత, నటనా కౌశల్యముచేత సతమతము గావించిన జగజంత
కలభాషిణి. సవతి వేషము బహుచక్కగావేసి, రంభకన్న యేడాకులు యెక్కువగా
జదివిన నెరజాణగా తనను నిరూపించుకొనినదా యెమ్మెలాడి. మధురలాలసా
కళాపూర్ణులు రాజవంశీకులు; ఆ సాంప్రదాయాలు, ఆ లాంఛనాలు వారియందు
పరిపూర్ణముగా ప్రతిబింబిత మగుచున్నవి. నిగ్రహములేక, యోగాభ్యాసము చేసి
భ్రష్టుడైనవాని శృంగారము సిద్దుసిది.
స్వర్ణమునందలి శృంగార మిథునము రంభా నలకూబరులు; వారు నిరంతర
రతిక్రీడాపషరాయణులు. రంభ సర్వకాల సర్వావస్థలయందు తన సొత్తుగా నుండుటకు
వీలులేదని తెలిసికూడ ఆమెను వలచి, వరించి, విధేయుడైనాడు నలకూబరుడు.
స్వర్గములో రంభకొరకు వచ్చువారనేకులు; యుద్ధములో మరణించిన వీరులు; యజ్ఞ
యాగాదులు గావించిన సోమయాజులు; వీరందరిని రంజింప జేయవలసినది రంభ.
ఇందుకు తోడు దేవేంద్రుడు మరియు దేవతలు. దేవతల కొరకు, దేవేంద్రుని పనుపున
జేయవలసిన తపోవిఘ్నాది కార్యక్రమాలు కూడ ఆమెకు మెండు. అయినప్పటికిని
అవకాశము దొరికినంతనే కుబేర నందనుని కడ రెక్కలు గట్టుకొని బ్రాలుచుండును.
ఈ రంభ జగదేక సుందరి; తన కన్న చక్కనివారు లేరను అభిమానము కలది;
నరభామల పోడుముల గూర్చి ఆమెకు యేమంత గొప్ప అభిప్రాయము లేదు.
299
డా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
స్వయముగా బహు రుచులు తెలిసిన ఆ భామామణి, తన మట్టుకు మాత్రము
సవతి యూహ యైనను సహించలేదు. శరీర మెక్కడ నున్నప్పటికిని ఆమె హృదయము
మాత్రము నలకూబరుని యందే లగ్నమై యుండును. నలకూబర సహవాసములోనే
ఆమె యందలి శృంగార చేష్టా విశేషాలు, విలాస విభ్రమాలు పలు రీతుల
ప్రత్యక్షమగుచున్నవి. ఏయెడ యెవ్వరు యెన్నడు కనని, వినని యింపులు బహు
కోమలముగా తన గళ స్వనాదులందు సాక్షాత్మరింపజేసి, నలకూబరుని స్వాధీనుని
గావించుకొన్నదామె. ఇతరుల సాంగత్యము నందుకూడ ఆమె భావించువాడు
నలకూబరుడే. ఆ మోటు తపసి, కళలంటి చొక్కింప చేసినప్పుడు కూడ “నలకూబర,
విడు, విడు, రొయనియే ఆమె ఆలపించినది. కామ కళా కౌశలమున ఆరితేరిన
ప్రోడ యామె. కామము యొక్క వేడి, యౌవనము యొక్క పొంగు, రంభా
నలకూబరుల సహవాసమున స్పష్టముగా కనుపించుచుండును.
సరస్వతీ చతుర్ముఖులు సత్యలోకాధి నాథులు. ఇది మరొక విశిష్టమైన జంట.
శారద సంగీత సాహిత్యములను స్తనద్వయముగా కలిగి, సకల విద్యలకు, కళలకు
రాణి యైన రమణీమణి. చతుర్ముఖుడు స్వయముగా సృష్టికర్త, కామము యొక్క
పొంగు, యౌవనము యొక్క వేడి, శాంతించి నిగ్గులు దీరిన ప్రణయ ప్రకోపము వీరి
లీలా విలాసము. ప్రణయ కోపము, అనునయము, శృంగార చేష్టలు, మధురవాక్య
సంపదాభిరామమైన సరస సల్లాపములు వీరి కేళీవిలాసము. ఇందులోని శ్లేషయందు
ప్రకృతి సుకుమారముగా ప్రతిబింబించుచున్నది.
వీరందరికిని శిఖరాయమానముగా విరాజిల్లువాడు వైకుంఠములోని రమావినోది
మరియు గాన లోలుడైన శ్రీమహావిష్ణువు. చతుర్ముఖ జనకుడైన ఈయనను వేంకట
నాథునిగా, రంగనాయకునిగా, ఇతర దేవతా స్వరూపునిగా సూరన పలుమారు
కీర్తించియున్నాడు. ఆ ప్రశంసలన్నింటి యందును ఆకృతిదాల్చిన శృంగారముగా
ఆయన కనుపించుచున్నాడు. వైకుంఠలోకమున శ్రీమహాలక్ష్మి సమేతుడై సర్వేశ్వరుడు
యేకాంతమున సంగీతము నాలకించుచు ఆనందించు సందర్భమున, రంభనుజూచి
అసూయజెందిన కలభాషిణి వలె, తుంబురునిజూచి ఈర్షపడినాడు నారదుడు. ఆ
ఈర్ష్య పోటీకి కారణమైనది. తుంబరునితో సమానుడు అనిపించుకొనవలెనను
హృదయ శల్యమును తీసివేసికొనుటకై, ఆ కలహభోజనుడు శృంగారమూర్తి, దక్షిణ
నాయకుడు, పదారువేల నూటెనిమిదిమంది భార్యలతో పరిపూర్ణ రతోత్సవములందు
300
వ్యాన మంజూష
తేలియాడువాడును అగు శ్రీకృష్ణమూర్తి యొక్క శిక్షణను ఆశ్రయించినాడు. తన
హృదయశల్యమును తొలగించుకొను కార్యక్రమమున కలభాషిణికిని రంభకును
పోటిపెట్టి, వారిద్దరికిని హృదయ శల్యములను సిద్ధము గావించినాడు.
ఈ విధముగా నకలలోకములందలి శృంగార లీలా విలానములను
అతికోమలముగా చిత్రించినదీ కళాపూర్ణోదయము. రసవంతమైన యీకావ్యము
“శ్రీవాణీ గిరిజా శ్చిరాయదధతో, వక్షోముఖాజ్జేషు యే, లోకానాంస్టితి మావ
హన్యవిహతాం, స్రీపుంసయోగోద్భవాం” అను నన్నయ స్తోత్రమును జ్ఞప్తికి దెచ్చి,
స్రీ పుంసయోగమును ప్రతిపాదించుచున్నది.
సౌందర్యమును వర్ణించుటలో చాలా చక్కని పోకడలు పోయినా డీకవీశ్వరుడు.
నారద మునీంద్రునికి సుస్వాగతము చెప్పుటకొరకు ఉన్నవాడున్నట్లుగా ఎదురుగా
వచ్చు శ్రీకృష్ణుని సౌందర్యము అతి మనోహరమైనది. సహజ సౌందర్యమును,
సాలంకృత సౌందర్యమునే కాక చెదరిన సౌందర్యమును కూడ సూరన చాల
నాజూకుగా వర్ణించినాడు. ఈ వర్ణనల యొక్క ప్రతిధ్వనులు అభినవాంధ్ర కవుల
రచనలయందు కనుపించుచున్నవి. భయకంపితయైన భామిని సొగసును,
రతిక్రీడాలసయైన రమణి చక్కదనమును అద్దములో జూపించినట్లు వర్ణించినాడు
సూరన.
ప్రేయసీ ప్రియుల సరస సంభాషణలను, కోమల చిత్తవృత్తులను పోషించుటలో
సూరన ప్రత్యేక నైపుణ్యము ప్రదర్శించినాడు. కళాపూర్ణోదయము నందలి ఘట్టములు
ఇందుకు ఉదాహరణములు. రక్తికిని, భక్తికిని సమానముగా ఉద్దీపకమైన కళ,
సంగీతమను సత్యము యీ గ్రంథమున చక్కగా వ్యక్తీకరణ జరిగినది. కళాపూర్ణోదయ
మనునామము సర్వవిధాల యీ గ్రంథమునకు సార్థకమైనది.
301
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
ముద్దుపళని - రాధిక
తెనుగు తోటలో పాదులుదీసి తీగెలు బారించిన భామామణులలో ముద్దుపళని
ముఖ్యురాలు. ఆంధ్ర భారతిని మొల్ల, వెంకమ్మ వంటి కవయిత్రులు మేలి సొమ్ముల
నలంకరించిరి. కాని వారు త్రొక్కినత్రోవ వేరు; పళని నడిచిన బాటవేరు. ఆంధ్ర
కవయిత్రులలోనే కాక, పెద్దన, తిమ్మన, సూరనలను ముగ్గురిని విడిచిపెట్టినచో,
ఆంధ్ర ప్రబంధకర్త లందరిలోను ముద్దుపళని అద్వితీయ. ప్రొఢయైన రాధికను,
ముగ్ధయైన ఇళను చిత్రించుటలో ఆమె జూపిన నేర్చు అసమానమైనది. తెలుగు
భాషలోని శృంగార సాహిత్యమున రాధికాసాంత్వనము విశిష్టస్థానముకలది.
పళని ప్రతాపసింహుని ప్రేమకు పాత్రురాలై సంగీత సాహిత్యములందు
ప్రావీణ్యము గడించిన కళావంతురాలు. (ప్రేమాభిరామమైన ఆమె హృదయమునుండి
వెలువడిన శృంగార (ప్రబంధము రాధికా సాంత్వనము. మన్మధమన్మథుడు శృంగార
రసమూర్తియైన శ్రీకృష్ణునికి అంకితమగు యీ కావ్యమునకు కథానాయకుడుగూడ
శ్రీకృష్ణుడే. ఆ దక్షిణనాయకుని వలచి వరించిన రాధా యిళలు యీ కావ్యమునకు
నాయికలు. రాధ నెజిజాణయైనచో, ఇల చిజుజాణ. ఈ జాణ లిరువురి హృదయాలు
యీ కావ్యమందు ప్రతిబింబించుచున్నవి. ఈ నాయికల చిత్రణలో ముద్దుపళని
కళా ప్రావీణ్యము, ప్రీ హృదయము ప్రతిబింబించుచున్నవి. బహుశా, ఇందులో
కొద్దియో గొప్పయో స్వానుభవము కూడ కలదేమో!
బాలికయైన ఇళ చిన్నప్పటినుండి రాధ అదుపు ఆజ్ఞలలో పెరిగినది. ఈడురాని
లేత వయసునందే ఇళ యొక్క హృదయమున శృంగార భావాలు మొలకెత్తినవి.
రాధ ఆమెను ప్రాణసమానముగా పెంచి పోషించినది. అంతేకాదు, ఆమెను తన
సవతియని గూడ మొదలే నిర్ణయించుకొనినది. అయితే సవతియైన తరువాత
హృదయములో చెలరేగు ఈర్యాగ్ని మాత్రము ఆమె మొట్టమొదలు ఊహించి
యుండలేదు. రాధా కృష్ణుల శృంగార చేష్టలను అనుదినము అతి శ్రద్ధతో
గమనించుచుండిన ఇళ యౌవనము రాకముందే మాధవుని స్వాధీనుని చేసికొనుటలో
రాధతో పోటీపడినది. “హరినిగని రాధ అలయాట లాడుదాము” అని పడకటింటికి
పిలువగా నేనుకూడ వచ్చెదనని ఇళ పిలువని పేరంటముగా ముందంజవేయును.
అంతేకాదు పనిగట్టుకొని పలుమారు ఆ జగజంత శ్రీకృష్ణునితో సయ్యాటలకు
302
వ్యాస మంజూష
సంసిద్ధమగును. దాగిలి మూతల నెపముతో మదనగోపాలునికి పదేపదే యెదురు
వచ్చుట, గుజగుజరేకు లాటలలో కదిసి నిలుచుట, వెన్నెల కుప్పలాటలో కనులు
మూయించుకొనుట, గుజ్జెనగూళ్ల ఆటలో చెంగట వసించుట మొదలైనవి
వగలాడియైన ఆ బాలికయొక్క శృంగారచేష్టలు. ఈ చేష్టలన్నింటికి రాధ సంపూర్ణ
ఆమోదము ప్రోత్సాహము లభించినవి. ఎప్పుడీ యెమ్మెలాడికి ఈడువచ్చునోయని
ఆమె అనుక్షణము యెదురుచూచినది. ఇళకు ఒమ్ముగా దిమ్ములై రొమ్ము రావలెనని
రాధ కులదేవతలను కోరి కొలిచినది; ఆమెకు మెజుగెక్కి నెజికురులు పెరుగగా
దినమొకతైలము తెచ్చి యంటినది; కన్నెరికము తొలగగా చెంచులవద్దనుండి
తీసికొనిన మందులు యిచ్చినది. ఈ విధముగా ఆమెకు ఈడు వచ్చుటకొరకు రాధ
ఎన్నియో దోహదక్రియలు గావించినది; ఆ చెలి సొగసుచూచి “నీవు నా సవతి
వౌదువుకదే” అని ముద్దాడి, ఆ శోభనముకొరకు ఉవ్విళులూరినది.
ఇటువంటి పోషణతో యీ వాతావరణమున పెరిగిన ఇళ యొకనాటి
సుముహూర్తమున పుష్పించినది. ఆ శుభమును ముద్దుపళని మోహనాతి
మోహనముగా వర్ణించినది. వెంటనే యశోదమ్మకు కబురు గావించినది.
పెద్దముత్రైదువైన రోహిణీ దేవిని పిలిచి అవి ఆ చిన్నెలో కావో అరసి సత్యము
తెలుసుకొన్నది; చుట్టపక్కాలకు శుభపత్రికలు వ్రాసినది; దినశుద్ధి లగ్నము
నిరూపించినది; అంటుగలిగినవారిని అంటుకో నియమించినది. ఈ వర్ణనలో
అడుగడుగున గ్రీహృదయము ్రత్యక్షమగుచున్నది. ఈ సందర్భమున ఆమె
ప్రయోగించిన పదజాల మంతయును పడతుల పెదవులమీద (ప్రతిదినము
తాండవించునట్టిదే. మొత్తముమీద ఒకనాటి శుభముహూర్తమున ఆ ఒయ్యారికి
రాధ శోభనము చేయించినది. సంపెంగతైలము అంటి, స్నానము ఆడించి, చెంగావి
పావడకొసలు బిగియించి, కుంకుమపువ్వంచు కోకగట్టి, రవిక తొడిగించి, సొమ్ము
లలంకరించి శోభనమందిరమునకు పంపినది. ఇదిరసవంతమైన ఘట్టము. ఈ
సందర్భమున అధిక సుకుమారమూర్తి రసిక శిఖావతంసుడైన దక్షిణ నాయకుని
యీ బాల యెట్లు మెప్పించగలదోయను సందేహము రాధకు కలిగినది; అందుచేత
ఆ వ్యవహారమును గూర్చి కావలసిన సలహాలు, సూచనలు సవివరముగా ఇళకు
ఆమె యిచ్చినది. అంతేకాదు మాధవునితో “ఈమె వట్టి ముగ్ధ; నావలె నేర్చరికాదు
సుమా; అందుచేత యీమెను యెట్లేలెదవో” కదా! యని అప్పగించినది. ఈ శోభన
303
డా/ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
ఘట్టమున ప్రతి పదమునందు శృంగారమొలికించినది ముద్దుపళని. ఇంత చక్కగా,
ఇంతవివరముగా, ఇంత విలక్షణముగా యీ ఘట్టమును వర్ణించిన ఆంధ్రకవులు
అరుదు.
ఇళా మాధవులు తలుపులు మూసికొన్నంత వరకే రాధమ్మ సంతోషము.
తరువాత ఆవేదన ప్రారంభమైనది. “సొమ్ములియ్యవచ్చు, సొమ్మందమియవచ్చు,
ఈయరాని ప్రాణ మియ్యవచ్చు, తనదు విభుని వేరుతరుణిచేతికినిచ్చి, తాళవశమె
యెట్టిదానికైన” అని ఆక్రోశించినది. తాను శ్రీకృష్ణునితో అనుభవించిన సుఖము
జ్ఞప్తికి దెచ్చుకొన్నది. హృదయములో ద్వేషాగ్ని ప్రజ్వరిల్లినది. తన సర్వస్వమును
హరించిన ఇళపై కోపము అతిశయించినది. తాళలేక యామె తలుపులుతట్టి,
బలవంతముగా లోనికి ప్రవేశించి, పానుపునాక్రమించి తన హక్కును స్థాపించుకొని
ముగ్ధయైన ఇళకు రాధయొక్క చమత్కృతి యెట్లబ్బునని శ్రీకృష్ణునిచే మెప్పులొందినది.
ఇళా మాధవుల క్రీడలు, ఆమీద రాధ మాధవుల గతి, ముద్దుపళని వర్ణించినరీతిగా
మరే ప్రబంధములో మరేకవియును వర్ణించలేదని చెప్పినచో అతిశయోక్తి కాజాలదు.
మనిసికాటులు, చిరుగోటి పోటులు, తొడసాములు, వలపుచెమ్మటలు, యెదురొత్తులు,
పారావతధ్వనులు మొదలైనవాని ప్రసక్తి యీ గ్రంథమున బహుళముగా నున్నది.
ఎంతకాలము ఇళా మాధవులు రాధ ఇంటిలో నుండగలరు? ప్రాణేశ్వరుని
కొంగున ముడివేసికొని ఇళ తల్లిగా రింటికి పయనమై వెళ్లినది. రాధకు దుస్సహమైన
విరహవేదన సంప్రాప్తించినది. అది స్వయంకృతాపరాధ పలితమని భావించినది.
ఆ పిమ్మట రాధమ్మ అనుభవించిన ఆవేదన ఇంతింత కాదు. ఆ ఆవేదన
పూసగ్రుచ్చినట్లు వర్ణించుటలో గూడ ముద్దుపళని ప్రత్యేకత చూపినది. అక్కడ
ఇళామాధవుల సౌఖ్యానుభవ వృత్తాంతమును తన దూతిక చేత సమగ్రముగా
తెలిసికొన్న పిదప ఆమె ఆవేదన మరీ అతిశయించినది. అప్పుడామె ఇళను గూర్చి
పలికిన పలుకులు, మాధవునితో తాను అనుభవించిన కేళీ విశేషముల వర్ణనలు,
నిజముగా ముద్దుపళని హృదయము నుండి దూసికొని వచ్చిన వేమోననిపించును.
మరుసాము గమనములకు ఇళాదేవి తనచేత పడిన బెత్తంపు పెట్లను సంస్మరించక
విడువలేదు రాధమ్మ.
తిరిగి మాధవుని పొందుటయే రాధ యభీష్టము, తుట్టతుదకు అందులో ఆమె
సఫలమై ఆ దక్షిణ నాయకుని మరొకమారు తనకు స్వాధీనుని గావించు కొనినది.
304
వ్యాస మంజూష
ఈ రాధికాస్వాంతనమును నాలుగాశ్వాసాలలో ముద్దుపళని బహు రమ్యముగా
వర్ణించినది. కొన్ని సందర్భాలలో శృంగారము కొంత మేరమీరిన మాట సత్యమే.
కాని కావ్యమే శృంగార ప్రధానమైనప్పుడు, యీ విషయమై ఆక్షేపణ గావించుటలో
జెచిత్యము లేదు. ఈ శృంగార చిత్రణమునందు ఆమె జూపిన నేర్చునే మనము
గమనించవలసి యున్నది. రసైక దృష్టితో పరిశీలించినప్పుడు మన శృంగార
సారస్వతమున ముద్దుపళని గ్రంథము అతి మనోహరమైనదని ఒప్పుకొనక తప్పదు.
ముద్యవళని శైలి బహు లలితమైనది. నుందరమైన శబ్ధ్బములను
సుకుమారముగా యేరి కూర్చుటలో ఆమె అత్యంత చతురురాలు. తెలుగువారి నాలుకల
మీద తాండవమాడు సామెతల నెన్నింటినో ఆమె తన పద్యాలలో మిక్కిలి సరసముగా
ఉపయోగించుకొన్నది. “తాను బెంచిన పొట్టేలు తనదు చేన సన్నబడు సామ్యము”
“ముక్కు పచ్చలు ఆరకమునుపె” “వేలువాచిన టోలంత విరివియెన, జోలువాచిన
నది యెంత బోలుగాదు” “దాని వేలుదీసి దానికన్ పొడిచిన యటుల” “అరకాల
బెట్టి నేలరాచకున్న” “అల్పునకు కల్మివచ్చిన అర్ధరాత్రి గొడుగు తెమ్మన్న కత”
“కొన్నంగడి లోపలనే అన్నన్నా మారు బేర మగునే” “ఈకతోకలోని శ్రీకృష్ణు మాటలు”
తగిలెనా తగులును తప్పెనా తప్పును, నాతి వెణ్టివానిచేతిరాయి” “గట్టు చేరినంత
బుట్టివానికి బొమ్మ గట్టు సామ్యము” “చల్లకైవచ్చి ముంతదాచంగనేల” “ఎల్లవారికి
శుభములనెల్ల బలికి బల్లి తాబోయి పాలలో బడిన యట్లు” వంటి చక్కని పలుకుబడులు
ముద్దుపళని తన కావ్యమున బహు రమ్యముగా ఉపయోగించుకొన్నది. రమణీమణుల
సంభాషణలలోని సొగసులు యీ గ్రంథమున అడుగడుగున ప్రత్యక్షమగు చున్నవి.
విదుషీమణి, కళాప్రవీణ, స్వైరవిహారధీరయైన నెజిజాణయొక్క రసికహృదయము
యీ (గ్రంథమునందలి ప్రతి పద్యమునందును ప్రదర్శిత మగుచున్నది. శృంగార
ప్రియులైన రసికులకు అత్యంత ఆహ్లాదకరమైన రచన రాధికా సాంత్వనము.
305
దా దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
ఆంధ్రోద్యమము - తెలుగు వాజ్యయము
ఆంధ్ర రాష్ట్ర అవతరణ శుభసందర్భమున “తెలుగు దేశము” నకు నవజీవనము
కలుగుట జెచిత్యముతో కూడుకొనిన సంతోష ప్రదమైన సంఘటన. తెలుగు సీమకు
రూపురేఖలు దిద్దుకొరకు తెలుగు దేశము ముందడుగు వేయనున్న యీతరుణమున
ఆంధ్రోద్యమానికి తెలుగు వాజ్మయము గావించిన దోహదమునుగూర్చి నాలుగు
మాటలు వ్రాయుట అఫ్రస్తుతము కాజాలదు.
గడచిన నాలుగు దశాబ్దాల ఆంధ్రోద్యమ చరిత్రను ఒక మారు అవలోకించినచో,
తెలుగు పత్రికలు మరియు తెలుగు సారస్వతము యీ ఆంధ్రోద్యమానికి బలమైన
యూతనిచ్చినట్లు స్పష్టము కాగలదు. అభిప్రాయాల ప్రసారమునకు సారస్వతము
మహత్తరమైన సాధనము, కావున సజీవమైన యే ఉద్యమానికైనను తతచారము
గావించు సారస్వతము పెట్టనికోట. మన జాతీయోద్యమానికి భారతదేశ మందలి
బహుభాషలలోని వాజ్బయము వలన కలిగిన ప్రచారము మరియు బలము మిక్కిలి
గొప్పది. “జనగణమున” “వందేమాతరం” “మాకొద్దీ తెల్ల దొరతనము” “దేశమును
ప్రేమించుమన్నా” వంటి గేయాలు, మున్నీ ప్రేమచంద్రుని వంటి కథకుల రచనలు,
తెలుగులో మాలపల్లి వంటి నవలలు, స్వరాజ్య రథము మొదలైన నాటకాలు మరాఠా,
కేసరి, హరిజన్, యంగ్ ఇండియా, వందేమాతరం, స్వరాజ్య, కృష్ణా మొదలైన
పత్రికలలో ప్రకటితమైన వ్యాసాలు, సంపాదకీయాలు, ఇతర వాజ్మయము
భారతదేశములో అపారమైన ప్రబోధము కలుగజేసి, స్వాతంత్రోద్యమానికి గొప్ప
బలము చేకూర్చిన సంగతి సుప్రసిద్ధమైనది. నిజానికి ఒక్కొక భాషలో జాతీయోద్య
ప్రభావ ఫలితముగా నిర్మాణమైన వాజ్మయమును గూర్చి ఒక్కొక పుస్తకమే వ్రాయుటకు
తగినంత సామగ్రి కలదు.
సారస్వతము దేశకాల పరిస్థితుల (ప్రభావము నుండి తప్పించుకొన జాలదనుటకు
ప్రపంచ వాజ్మ్యయము ప్రబల నిదర్శనము. ఈ దృక్పథముతో నేటి తెలుగు
సారస్వతమును పరిశీలించినప్పుడు, జాతీయోద్యమ ప్రభావముతో పాటు
ఆంధ్రోద్యమానికి అత్యంతముగా ఉపకరించినది. ఆంధ్రులు మిక్కిలి ప్రాచీనమైన
జాతికి చెందినవారని, వారి ప్రసక్తి ఐతరేయ బ్రాహ్మణము నందుకూడ కలదని,
వారికి గొప్ప సంస్కృతి కలదని మన చరిత్ర వెల్లడిజేయుచున్నది. శిల్పము, కళ,
306
వ్యాస మంజూష
సాహిత్యము, విజ్ఞానము మొదలైన రంగాలలో ఆంధ్రులు భారత దేశమున ప్రముఖ
స్థానము నాక్రమించుచున్నారని మన చరిత్ర ఉద్దాటించుచున్నది. ఈ భావాలు
ఆంధ్రులను ప్రభావితులను గావించుటకు ఎంతయో తోడ్చడినవి. ఆంధ్రులలో ప్రత్యేక
రాష్ట్ర వాంఛను పురిగొల్పుటకు ఆంధ్ర చరిత్ర మిక్కిలి ఉపకరించినది. ఆంధ్రుల
యశోగానము గావించి వారిని మేలుకొలిపిన కవులు, ఆంధ్రచరిత్రలోని ఉజ్వల
ఘట్టాలను సంకీర్తనము గావించినారు. ఆధునిక కవుల రచనలలో ఇందుకు
నిదర్శనాలు అసంఖ్యాకములు.
చావలేదు, చావలేదు ఆంధ్రుల మహోజ్వల చరిత్రయని మనకు జ్ఞప్తికి దెచ్చిన
కవీశ్వరుడు తన రచనలద్వారా ఆంధ్రావనిలో అపారమైన ప్రబోధము గావించినాడు.
ఆయన పిలుపునందుకొని, ఆధునికాంధ్ర మహాకవు లనేకులు ముందుకువచ్చి
సోదరాంధ్రులసు మేలుకొలిపినారు. వీరి రచనలు బహు వేదికల నుండి గానము
చేయబడి, తెలుగుసీమలో ఉత్సాహము పురిగొల్చ్పి కర్తవ్య పరాయణత్వమును
ప్రబోధించినవి. మా తెలుగు తల్లికి మల్లెపూదండవంటి గేయాలు ఆంధ్ర
ప్రజానీకమును ఉత్సాహతరంగితము గావించినవి. కొందరు కవులు ఆంధ్ర ప్రశస్తిని
గూర్చి ప్రత్యేకముగా కావ్య సంపుటములను ప్రకటించినారు.
ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రముయొక్క అవసరమును మరికొందరు కవీశ్వరులు
తమ రచనలలో ఉద్దాటించినారు. ఇట్టివానిలో “రాష్ట్రగానము”ను ప్రత్యేకముగా
పేర్కొనవలసి యున్నది. ఇన్నాళ్లు ఆంధ్రులు “రాష్ట్రములేని పరాభవము”ను
“రక్కెసతాల్మితో” నోర్చినారని తెలిపి, ఆంధ్రుల హృదయాల ఆవేదన 'రాష్ట్రగాన'
కావ్యకర్త' ప్రకటించి, కర్తవ్యమును ఉద్భోధించినారు.
హైద్రాబాదు రాష్ట్రములో కూడ ఆంధ్రోద్యమ ప్రభావము మన వాజ్మయమునందు
ప్రస్ఫుటముగా కనపడుచున్నది. ఆంధ్ర మహాసభ వేదికలపైన మన కవీశ్వరులు
గానము గావించిన ప్రబోధ కవిత్వము యీ మహాసభలకు వచ్చిన సభ్యులను,
ప్రేక్షకులను, ఉత్తేజితులను గావించి వారిలో చైతన్యము కలుగజేసినది. అన్యభాషా
పిశాచి ఎక్కడనుండి మనకు దాపురమైనదని ప్రశ్నించుకొని, “చిన్నతనము నుండి
నెచ్చెలిగనున్న తెలుగు కన్నియ ముద్దులు తీర్చుటెపుడ”యని ఆవేదనజెందిన మన
యువ కవులు “ఏ భాషరా నీది యేమివేషమురా” “ఈ భాష, యీ వేషమెందు
కోసమురా” యనియు, ఆంధ్రుడనయి నేనాంధ్రభాషను మాట్లాడలేననుట క్షమింపరాని
307
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
అపరాధమనియు ప్రబోధించినారు. తెలంగాణమున, విశాలాంధ్ర సభల వేదికల
నుండి చక్కని ప్రబోధవాజ్మయమును గానము చేసిన కవులు కలరు.
హైద్రాబాదులో ఆంధ్రత్వప్రచారమునకు గోలకొండపత్రిక చేసిన, చేయుచున్న
సేవ అమోఘమైనది. గోలకొండ, నీలగిరి, తెనుగు మొదలైన పత్రికలలోని
రచనలయందు ఆంధ్రోద్యమ ప్రభావము స్పష్టముగా కనపడుచుండును.
మన ఆధునిక సారన్వతముపైన ఆంధ్రోద్యమ (ప్రభావమును గూర్చి
స్థాలీపులాకన్యాయముగా చెప్పిన నాలుగు మాటలివి. మన సారస్వత విమర్శకులు
యీ దృక్పథముతో మన వాజ్మయమును సమీక్షించి, కొన్ని ప్రత్యేక వ్యాసములను
వ్రాయవలసిన ఆవశ్యకత కలదు.
308
వ్యాన మంజూష
ఆధునిక కవిత్వములో శబ్ద రామణీయకత
దేశ భాషలలో తెలుగు లెస్స; లెస్సయేకాదు మిక్కిలి తీయనిది కూడ. అందుకే
కాబోలు ఆధునిక కవులొకరు తెనుగు పాటల వెంట తీపి ఎడబాయక యుండునని
తెలిపినారు. అసలే తీయనిదైన తెలుగుభాష, అందులో కవిత్వము; ఆ కవిత్వములో
కూడ ముద్దులు మూటకట్టు రచనయే అయినచో దాని యొక్క రామణీయకతను
గూర్చి వేరుగా చెప్పవలసిన పని లేదు. పూర్వ కవులలో కొందరు ప్రత్యేకముగా
ముద్దు పలుకులకు పేరుగాంచినారు. ముక్కు తిమ్మన కవిత్వము వీణా కలకలముల
కలకల నవ్వుచుండును. ఆధునికులలో కూడ రమణీయ శబ్ద సంపదతో కావ్యరచన
కావించినవారు కనబడుచున్నారు.
శబ్బరామణీయకత అనగా చక్కని వదాలయొక్క సొంపైన కూర్చు.
కావ్యమాధుర్యమునకు ఇది చాల అవసరము. మృదువైన భావాలను ప్రకటించుటకు
రమణీయమైన శబ్దాలు కావలెను. శబ్దరామణీయకతను నిర్ణయించునది (శ్రవణ
సుఖము. నవ్యుల రచనలకు ఈ (శ్రవణ సుఖము చాల ప్రధానమైనదని తెలుపుచు
“రమ్యాలోకములో'-
“వదలరీ వృత్త పదమృదు బంధమెందు
నవ్వులు రసవద్వాక్య సంధానమందు
సంధులు విసంధులైనను సాంస్కృతములు
దేశ్యములతోడ సమసించి తీవె గొనిన”
అని చెప్పియున్నారు. చెవికి ఇంపుగాని పదాలు నవ్యులకు రుచించవని కూడ
“రమ్యాలోకము”లో తెలిపి యున్నారు. సహజముగానె మధురమైన ఆంధ్రభాషలో
కావ్యరచన కావించునపుడు శబ్దరామణీయకతను చక్కగా పోషించవలసిన
ఆవశ్యకతను నవ్యాంధ్ర కవులలో ముఖ్యులందరును గమనించి యున్నారు. కావుననే,
“కాళ్ల కడియాలొరయు ఆంధ్రకన్య సొగసు
ద్రావిడీశూన్య చరణాల తడవ నేల
కేరళీ, కర్ణతాటంక భార కలన
తెగి పడగనోపు తెనుగు ముద్దియల చెవులు.” అని చెప్పియున్నారు.
309
దా దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
రూప చిత్రణము కావించునపుడు, ప్రకృతి విలాసమును ప్రదర్శించునపుడు,
కరుణ- శృంగారము మొదలైన మృదుభావాలను వ్యక్తీకరించునపుడు ఆధునిక కవులు
ఈ శబ్దరామణీయకతను ప్రత్యేకముగా పాటించియున్నారు. వారు సాధనముగా
గ్రహించిన కావ్యస్వరూప మేమైనప్పటికిని, అది ఛందోబద్ధమైనప్పటి కిని,
కాకపోయినప్పటికిని, అవి గేయాలయినప్పటికిని, వృత్తాలయినప్పటికిని సొంపైన
పదాలను ఏరి కూర్చుటలో ఆధునికులు ప్రత్యేకతను చూపించిన నిదర్శనాలను
ఎన్నిటినైనను పేర్కొనవచ్చును. సంస్కృత పదాలను, తెనుగు పదాలను గ్రహించి
సరసముగా మేళవించుటలో కూడ శబ్దరామణీయకతను పాటించి యున్నారు. కొన్ని
సందర్భాలలో ఇతర భాషా పదాల ప్రయోగమునందును ఈ శబ్ద రామణీయకత
ప్రదర్శితమగు చున్నది. “నాజూకు” “పసందు” వంటి చక్కని పరభాషా పదాలను
ఆధునికులు తమ రచనలలో రమణీయముగ ప్రయోగించి యున్నారు.
క్రొత్త పాతల మేలి కలయికయై, తేటైనవాడుక మాటలతో దీప్తిచెందుతున్న
“ముత్యాలసరాలు” ఆధునికాంధ్ర కవులనేకులకు మార్గదర్శకమైన ఉజ్వల రచన.
అచ్చమైన తెలుగు పదాలలోని అందము ఈ “ముత్యాలసరాల”లో అడుగడుగున
కనబడుచున్నది. ఒకానొక కన్యకను వర్ణించుచు
“తగటు బంగరు చీరకట్టి; కురుల పూవుల సరులు
చుట్టి, నుదుటకుంకుమ బొట్టుపెట్టి, తొగలకాంతులు
కనులుపరపగ, మించు తళుకులు నగలు నెరపగ
పసిడి కలువల పాలు పెరుగులు
పళ్లెరమున పళ్లు పూవులు
మోములందున మొలక నవ్వులు” అను వర్ణన శబ్బరామణీయకతకు చక్కని
నిదర్శనము. పూర్ణమ్మ కథను చెప్పుచు,
“మేలిమి బంగరు మెలతల్లారా
కలువల కన్నుల కన్నెల్లారా
తల్లుల గన్న పిల్లల్లారా
ఆటల పాటల పేటికలారా
కమ్మని మాటల బొమ్మల్లారా” అనున దింకొక నిదర్శనము.
ఆంధ్రుల యశోగానము గావించు
310
వ్యాన మంజూష
“విద్యానగర రాజవీధుల కవితకు పెండ్లి పందిళ్లు కప్పించునాడు.” అను రచనలో
ఉక్తివైచిత్యముతోపాటు రమణీయ శబ్ద ప్రయోగముకూడ కన్పించుచున్నది. ఒక
సుందరాంగి యొక్క మనోహరమైన హాసమును వర్ణించుచు,
“దానిమ్మపూవంటి తరుణి కెమ్మోవి పై
మల్లెపూవుల నవ్వు సుళ్లు తిరుగ” అని
చెప్పినపుడు కవి ఉపయోగించిన పదములు ఎంత రమణీయములు! తమ
ఇంటి వెనుక పూదోటలో నొక మందారము త్రిజగన్మోహనముగా మొలిచినపుడు
చుట్టుపక్కల అమ్మలక్కలు వచ్చి చూచిన ఒక సామాన్య దృశ్యమును వర్ణించుచు
“ఇరుగు పొరుగు వధూ జన మరుగు దెంచి
కనుబొమలు వంచి కంకణ రణిత పాణి
తలములం దేల్చి చూచి మందార మనిరి” అని
చెప్పిన మాటలలోని సొగసు గమనించ దగినది. కాంత కిన్నెరసాని కదలిక
పదువుకట్టిన లేళ్ల కదుపు వలె నున్నదట. కదులు తెల్లని పూల నదివోలె నున్నదట.
వదులు తెల్లని త్రాచు పడగవలె విరిసినదట. ఆమె నడువగా నడువగా తొడిమె
వూడిన పూవు పడతివలె దోచినదట. కడు సిగ్గుపడు రాచ కన్నెవలె దోచినదట.
బెడగుపోయిన రత్నపేటి వలె దోచినదట. కిన్నెరసాని ప్రవాహము ఆవుపొదుగున
పాలు ధారకట్టిన యట్లున్నదట. వనదేవతలు నీళ్లు వలకపోసిన యట్లున్నదట. తల్లి
చల్లనిప్రేమ వెల్లివారిన యట్లున్నదట. ఆమె పొంగు ముద్దరాలి మనసు పొంగువలె
నున్నదట. పసిపాప సెలివివారిన బోసి నవ్వువలె నున్నదట. గడియలోపల పెద్దకాల్వగా
గట్టిన ఆమెతోగు బంగారు తీగెలో పానకమ్మయి పోయినదట. కొబ్బరిపాలు వాకలు
కట్టి నట్లయ్యెనట. వెయ్యావులొకసారి పితికినట్లయి పోయెనట. ఆ సందర్భములో
కిన్నెరసాని తెలి తారకల వెంట వెలుగు వలె, తలిరి పూవుల వెంట తావివలె
తోచినదట. ఆ కిన్నెరసాని ఒయ్యారమునకు తగిన యంత అందముగా నున్నదీ
కవిగారుపయోగించిన శబ్దజాలము. మేఘునికి ఒక పల్లెటూరి రైతు,
“దొంతులు దీర్చి, కానుకలతో నెదురౌదుము
బంతిపూలు, చేమంతులు, చంద్రకాంతములు, మంకెన
పూవులు పోకబంతులున్
వింతల గన్నెరుల్ హృదయ వీధుల నాయెడ విశ్రమింపుమా
చింతలతోపులో విడిది చేయుము శ్రావణ మాసవేళలన్!
311
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
అని ఇచ్చు స్వాగతము గ్రామ శోభకేకాక మాటల సొగసుకు కూడ మంచి
నిదర్శనముగా నున్నది.
ఈ కవివర్యుడే మబ్బుల నెంత మనోహరముగా వర్ణించినాడో చూడుడు.
“కన్నె కాటుక కళ్లు
చిన్ని నాథుని చూచి
కదలు లాడిన వేళ
కందలించిన వేళ
ఆకాశ మధ్యాన అట నొక్క తెలిమబ్బు
మెరపులా మెరసిందిలే!
వెలుగులా వొరసిందిలే!
తొలి చిన్ని చూలాలు
కొల సిగ్గు (ప్రేమతో
విభుని చూచిన వేళ
విన్నబోయిన వేళ
బఅపు మిన్నుల లోన ఒక నీలితెర మబ్బు
సంజలా తారిందిలే!
జాలుగా మారిందిలే!
తొలికాన్సు పసిపాప
సాక నేరని బాల
తెలబోయి పతిజూచి
కళవళించిన వేళ
తూరుపు కోనలో తొంగిలించిన మబ్బు
తెగ పరుగు లెత్తిందిలే !
సొగసుల్లు పోయింది లే!
“తృణకంకణము”లో కాలినడకన బోవుచున్న కాంతయొక్క ఒడలిచాయ
పసినిమ్మపండు చాయల కొనరుచున్నదట. ఆమె యొడలి మీద నగలేమి
లేకపోయినప్పటికిని జారు చెమ్మట ముత్యాల జంపుసరులు సహజ సౌందర్యమును
వెదజల్లుచున్నవి. జిలుగు పూల కలంకారి చీరజార, జిందు సందెడు కుచ్చెళ్లు చెదర
312
వ్యాన మంజూష
నీక మాటికిని కాలు కడియాలు మలపుకొనుచు ఆమె నడచుచున్నది. ఈ నడకలో
పదములయొక్క రామణీయకత ప్రత్యక్షమగుచున్నది.
తెనుగుతోటలో ఆంధ్ర కన్యక అందచందములు అతి రమణీయముగ
వర్ణితములైనవి. తెనుగు మీరిన గరువంపు తీరులను తీయని తెనుంగు మాటలలో
తెల్పినారీ కవిగారు. అదిఒకానొక ఊరు. ఆ యూరిలో నొకకాపు. ఆ కాపు వానికొక
చక్కని కూతురు. ఈ ఘట్టమును కవిగారు ఎంత చక్కగా వర్ణించినారో గమనించుడు.
“ఊరి కావలి చెరువులో
నీరుదెత్తురు నిరతమున్
పౌర భామలు కడవలన్
జారు సందెలు మెరవగన్
చంద్రశేఖరు డెసగునూ
చంద్రుబోలిన యశముతో
పెద్దకాపయి నగరమున్
దిద్దునాతడు చదురుతో
కాసె చక్కగ మెరపలు
పూచేనోయన పవడముల్
కూతురొక్కత యతనికిన్
చూతపల్లవ మనదగున్
మంచి గందపు మొలకయో
మించు ముద్దుల గిలకయో
కల్కి చెక్కులు పలుచనై
తళుకు లెక్కెడి మిసమిసన్
మీట భావము కనులలో
మాటలాడును మితముగా
నవ్వ దెక్కువ సఖులతో
రవ్వ పల్వరుసగుపడన్
దోసపిందియ నునుపులన్
భాసిలు౯ సఖిప్రాయముల్
313
దా దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
తెల్ల చీరల మురియునూ
నల్ల రైకల దొడుగునూ”
ఈ చిత్రణము యొక్క సౌకుమార్యము పదముల యొక్క లాలిత్యము వలన
ద్విగుణీకృత మగుచున్నది.
“కష్టకమల”లో
“అరగ దంచిన సన్న బియ్యంబు వండి
పొట్లకాయల నేతి పోపుల నమర్చి
పేర పెట్టిన మీగడ పెరుగుతోడ”
నిద్ధము చేనిన భోజన మెంత కమ్మనిదో ఆ రుచులను మనకు
తెలుపుటకుపయోగించిన పదజాల మంతతీయనిది.
జానపద సుందరియైన ఎంకి చూపుతో మాటాడి ఊపిరితో తెనిగించగల జాణ.
ఆమెకకళ్లెత్తితేచాలు కనకాబిసేకాలు. ఆమె వొక్క నవ్వే యేలు వొజ్జర వైడూరాలు.
రాసోరింటికైన రంగు దెచ్చే ఆ ఎంకి యొక్క సెక్కిట సిన్నీమచ్చను గూర్చి సెపితే
సాలదు లచ్చ. ఈ విధముగా జానపదుల మాటలను కూడ బహు రమణీయముగ
ఏరి కూర్చుట జరిగినది.
వివాహ సందర్భములో పెండ్లి కూతురును కనుల కట్టినట్లుగ చిత్రించిన
కవిగారు ఆమె లజ్ఞా దరహాస చంద్రికలను శాశ్వతముగా నుండునట్లు మధుర
మధురమైన మాటలతో
“పునుగు జవాది తావులు గుబుల్మ్కొను
నీ పసుపుం బయంట కొంగున ముడివైచికొంటిగద
కోమలి, నీ మగడింక నెట్లు చెప్పిన నటులే
వినంగలడు, పెండ్లము గీచిన గీటు దాట
డంచును వదినల్ నగన్, జురుకుచూపుల
చూచెడు నీకు సౌఖ్యమౌ”
అని అనుదినము మన నాలుకల పైన నాట్యము చేయు పదాలను
రమణీయముగా నుపయోగించి ఆశీర్వదించియున్నారు.
ఈయనయే బుద్ధదేవుని సన్యాసమును గూర్చి వ్రాసిన పద్యాలలో,
314
వ్యాస మంజూష
“మొగలి రేకుల మృదుల కపోలయుగము
కరకు టెండల వేడిమి కందువారె,
తెలి మొగిలు చాటు నెలవంక తెరగు బూని
బూది బూసిన నీ మోము మురువు కరిగె”
అని బహు చక్కని పదాలను ఏరి కూర్చినారు.
జాలిమాలిన వేటకానిని జూచి కన్నీళ్లతో కరుణా మూర్తియెన లేడిపిల్ల,
“నేయియు పాయసమ్ము దిన నేర్చిన
పెద్దల పాద సేవలజ జేయగ రాదె
నీకుగల చెడ్డ తనంబొక కొంతమాను
స్వర్గీయలతా నికుంజముల కిన్నెర సానులు
పోవుదారులజ బోయెదనింక నాకు
సెలవుం దయచేసి క్రుధం ద్యజింపుమా”
అని కడు సున్నితముగా చెప్పినప్పుడు ప్రపంచమునకు శాంతి సందేశము
నిచ్చుట రమణీయముగా ధ్వనించుచున్నది.
“నిండు పున్నమనాటికి నీటుకాడు కళలు పదియారు నేరిచి గర్వపడునని,
నెల బాలుని గూర్చి భావించిన కవి కోకిల, చిన్నారి శిశువు యొక్క చిత్రమును
ఎంత మనోహరముగా మనముందుంచినారో గమనించుడు,
“గానమాలింపక కన్ను మూయని రాజి
అంబ కౌగిట పంజరంబు చిలుక
కొదమ కండలు దేరుకొను పిల్ల వస్తాదు
యుయ్యేల దిగని భాగ్యోన్నతుండు
ఊ ఊలు నేర్చిన యొక వింత చదువరి
సతిని ముట్టని నాటి సాంబమూర్తి
ప్రసవాబ్ధి తరియించి వచ్చిన పరదేశి
తన యింటి క్రొత్త పెత్తనపు దారి
ఏమి పనిమీద భూమికి నేగినాడొ,
315
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
నుడవ నేర్చిన పిమ్మట నడుగ వలయు
నేండ్లు గడచిన ముందు ముందేమొ గాని
యిప్పటికి మాత్ర మేపాప మెరుగడితడు.”
ఈ కవికోకిల రచించిన ప్రతి పద్యమందు ఇటువంటి భాషా సౌకుమార్యము
బహుళముగా కన్పించు చుండును.
ఈ శబ్ద్బరామణీయకత ఆధునికుల శిష్ట వ్యావహారిక రచనలలో కూడ
కన్చించుచున్నది. సంస్కృత పద బహుళమైన రచనల యందును కన్పించు చున్నది.
హృదయేశ్వరి వంటి కావ్యాలలో లలిత సంస్కృతపద రామణీయకత అడుగడుగున
'ప్రత్యక్షమగు చుండును. హృదయేశ్వరి యొక్క శాంత మనోజ్ఞ రూపమును వర్ణించుచు
“తిలక పాటలఫాలమండల దీప్తి జాలమును” “కలిత కాంచనహార విలసత్మంఠ
దేశమును” “కటక కంకణరుచిర కరసరోజముల”ను వర్ణించుటలో నుపయోగించిన
సంస్కృత పదములు మిక్కిలి రమణీయములు. ఇటువంటి రామణీయకత ఈ కవిగారి
పద్మావతీ చరణ చక్రవర్తి మొదలైన కావ్యాలలో సమృద్ధముగా కన్పించుచుండును.
మరొక ఆధునిక కవీశ్వరుడు వెన్నెల రాత్రిని “పవన పులకిత చంద్రాతప ప్రఫుల్ల
చారు శారద యామినీ సమయమ”ని సరసముగా సాక్షాత్మరింపజేసినాడు. తిక్కన
కవిత్వమును కీర్తించుచు,
“పూజాతి సాంద్ర కర్పూరమ్ము లందు
ప్రాబ్బదీ పాథోలవమ్ముల యందు
మడగు సన్నని పాట
పొడుచు వెన్నెల తేట
కలవు తిక్కన పల్కు తెలుగు పల్కులకు
లోల మృద్వీకాగుళుచ్చ మాధురియు
నవ పుష్య రాగ సుందర పటిష్టతయు
అలరు మల్లియ పువ్వు
నందు పిన్నని నవ్వు
కలవు తిక్కన పల్కు తెల్గు పల్కులకు”
అని చెప్పిన సందర్భములో సంస్కృతాంధ్రముల యొక్క సొగసు చక్కగా
వ్యక్తమగుచున్నది. ఇంకొక ఆధునిక కవి తోడి కవుల నుద్దేశించి,
316
వ్యాన మంజూష
“లే లెమ్ము కవిరాజ లీలా విహార
శైల కుంజలతాంత శయ్యపై నుండి
రా రమ్ము కవిరాజ రతిరాజకీర
శారికా సార సంసార మందుండి
కూజత్సి కాంగనా గోష్టి చాలించి”
అని పలికిన పలుకులు శబ్దరామణీయకతకు మరొక మచ్చుతునక. ఆధునికుల
రచనల నుండి ఇట్టి నిదర్శనముల నెన్నియైన చూపించవచ్చును. శబ్దరామణీయకత
కొరకు వ్యాకరణమును ఉల్లంఘించి అలంకార శాస్త్రమును ధిక్కరించి తుదకు
ఆర్థగౌరవమును గూడ అంతగా పాటింపని నిదర్శనాలను కూడ కొన్నింటిని మనము
చూపవచ్చును. గ్రంథములకు నామకరణము కావించుటలో కూడ శబ్ద రామణీయకత
యందలి ప్రీతి కాన్పించుచున్నది. పూర్వము ముక్కు తిమ్మన వలె ఈ కాలమున
కూడ ముద్దు పలుకును (ప్రేమించి పోషించిన మధుర కవులు కన్పించు చున్నారు.
గౌతమీ తీరమున నివసించి మధురకవి బిరుదాంకితుడైన కవివర్యుడు తీయని
పదములను చక్కని తేటగీతులలో ఏరి కూర్చిన తన గ్రంథములకు “మీగడ తరగలు”
“వెన్నెల బుడగలు” “గోరు ముద్దలు” వంటి మనోహరమైన పేర్లను పెట్టుకొన్నారు.
తమ కవిత్వము యొక్క సొగసును తెలుపుచు ఒక కవి
“గుమ్మ పాలల్లోని గోరెచ్చదనము
అరటి పువ్వుల్లోని అందంపు సిగ్గు
పరుగెత్తు పినలేడి పరువంపు శైలి
బీరపూవుల వోలె విచ్చు భావాల”తో కూడి యుండునని చెప్పినపుడు పింగళి
సూరన యొక్క రచన జ్ఞప్తికి వచ్చుచున్నది.
ఈ శతాబ్దాది నుండి గడిచిన దశాబ్దము వరకు వ్రాసిన నవ్య కవులలో
శబ్దరామణీయకత మీది ప్రీతి ఎక్కువగా గన్పట్టు చున్నది. భావ సౌందర్యముతో
పాటు భాషా సౌకుమార్యమునకు నవ్య కవులు (తమ కవితా స్వరూపమేమైనప్పటికి)
ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినారు. గడచిన పది సంవత్సరాల రచనలను పరిశీలించి
నపుడు ఈ నాటి కవులకు శబ్దరామణీయకత మీది ప్రీతి సన్నగిల్లి, పదప్రయోగమును
గూర్చిన పట్టుదల సడలుచున్నట్లు తోచుచున్నది. భావములకు తగినంత భాషా పుష్టి
ఇటీవలి రచనలలో లోపించుచున్నదేమో యను అనుమానము కూడ కలుగుచున్నది.
317
డా దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
§.
ప్రకాశంగారి స్వీయచరిత్ర
ఒక దేశ చరిత్రగాని జాతి చరిత్రగాని తెలుసుకొనవలెనన్నచో ఆ కాలమున
నివసించిన మహాపురుషుల జీవిత చరిత్రలను తెలుసుకొనుట అవసరము. మహా
పురుషులే చరిత్రనిర్మాతలు. అందుచేత వారి జీవిత వివరాలు చరిత్రకు అత్యవసరమైన
సామగ్రి. ఆ సామగ్రిలేక యే దేశ చరిత్రగాని యే జాతి చరిత్రగాని లేదు.
మన దేశమున జీవితచరిత్రలను దేశచరిత్రలను వ్రాయు అలవాటు తక్కువ.
విశేషించి పూర్వకాలమున యీ పద్ధతి బొత్తిగా లేకుండెను. ఆధునికకాలమున యీ
పద్ధతి మన దేశములో వ్యాప్తికి వచ్చినది. దేశచరిత్ర నిర్మాతలైన మహనీయులు
కొందరు ఆత్మకథలను రచించినారు. తెలుగు దేశమున ఇట్టి మహనీయులలో
ముగ్గురు ముఖ్యులుగా కన్పట్టుచున్నారు. మొదటివారు వీరేశలింగము పంతులుగారు.
'రెండవవారు చిలకమర్తి లక్ష్మీనరసింహముగారు. మూడవవారు టంగుటూరి
ప్రకాశంగారు. నవ్యాంధ్ర నిర్మాతలలో యీ ముగ్గురు అగ్రగణ్యులు. అందుచేత గడచిన
శతాబ్దమున ఆంధ్రదేశ చరిత్రకు యీ ముగ్గురు జీవితచరిత్రలు ముఖ్య ప్రాతిపదికలై
యున్నవి. ప్రకాశంగారి ప్రజాహిత జీవనమునకు అరువది సంవత్సరాలకు పైగా
వయసు కలదు. అనగా భారత జాతీయ కాంగ్రెస్‌కు ఎంత వయసుకలదో
ఇంచుమించుగా ప్రకాశంగారి ప్రజాహిత జీవనచరిత్రకు అంత వయసు కలదని
చెప్పిన అతిశయోక్తి కాజాలదు. గడచిన యేబది సంవత్సరాల ఆంధ్ర రాజకీయాలలో
ప్రకాశంగారు ప్రధాన పాత్రను నిర్వహించినారు. ఈ దృష్టితో నవ్యాంధ్ర నిర్మాణమును
గమనించినప్పుడు అడుగడుగున ప్రకాశంగారి త్యాగము, పట్టుదల అగుపడుచున్నవి.
గడచిన అర్ధశతాబ్ధములో ఆంధ్రదేశములో అవతరించిన ఉద్యమాలన్నింటి యందును
ప్రకాశంగారు ప్రధాన పాత్రను నిర్వహించియున్నారు.
మానవ జీవిత మొక యాత్ర. అందు అనేక మజిలీలు ఉన్నవి; అందు కంటక
పథములు కలవు, గండ శిలలు కలవు. కొండలను ఎక్కవలసి యుండును; దిగవలసి
యుండును; నదులను దాటవలసి యుండును; ఒడుదొడుకులను ఎదుర్కొనవలసి
యుండును. కష్టసుఖములను అనుభవించవలసియుండును. ఇవన్నియును
ప్రకాశంగారి జీవిత చరిత్రలో కనుపించుచున్నవి. అందుచేత యీ పుస్తకానికి జీవిత
యాత్రయను నామకరణము సార్థకముగా నున్నది. పంతులు గారు యీ గ్రంథములో
318
వ్యాన మంజూష
1872 సంవత్సరము నుండి 1922 సంవత్సరము వరకు అనగా ఒక అర్ధశతాబ్దమున
జరిగిన సంఘటనలను సమీక్షించియున్నారు. ఈ సమీక్షలో యీ కాలము నందలి
ఆంధ్రదేశము నందలి సాంఘిక రాజకీయ పరిస్థితులు అద్దమునందు మూర్తివలె
చక్కగా ప్రతిఫలించుచున్నవి.
ఏమాత్రము శ్రద్ధతో పరిశీలించినప్పటి కిని, ప్రకాశం పంతులుగారు జీవితము
బహుముఖమైనదని ప్రస్ఫుటము కాగలదు. ప్రకాశం పంతులుగారు స్వయంకృషిచే
పైకివచ్చిన మహావ్యక్తి, ఆయన జన్మించిన దొక మధ్య తరగతి కుటుంబము.
చిన్నతనముననే ఆయన బీదరికముతో పోరాటము చేయుట జరిగినది. బాల్యమున
జరిగిన యీ పోరాటములో ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసములు, పట్టుదల
తరువాత ఆయన జీవితములో అడుగడుగున అగుపడుచున్నవి. ఎన్ని కష్టాలు వచ్చినను
చలించక ప్రకాశం పంతులుగారు తమ విద్యాభ్యాసమును ముగించి న్యాయవాద
వృత్తిని అవలంబించి వేలకు వేలు గడించిరి.
చిన్నతనమున రాజమహేంద్రవరములో ఆయన అనేక నాటక (ప్రదర్శనాలలో
పాల్గొని అన్ని రకాలైన వ్యక్తులతో సహవాసము చేయుట జరిగినది. ఆ రోజులలో
శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహముగారికి ప్రకాశంగారి మీద (ప్రేమ కుదిరినది.
లక్ష్మీనరసింహముగారి నాటకాలలో ప్రకాశం పంతులుగారు వేషాలు వేయుట
జరిగినది. ఆనాటి ప్రకాశం పంతులుగారి మూర్తినిగూర్చి శ్రీ చిలకమర్తి వారు
“ఈగవాలిన గాని వేగ జారెడు నట్లు,
మువ్వంపు కురులను దువ్వినాడు”
అను సీసపద్యములో కనులకు గట్టినట్లుగా వర్ణించియున్నారు. పంతులుగారి
నాటకరంగానుభవము ఆనాటి నాటక ప్రదర్శనాల పరిస్థితిని చక్కగా వర్ణించుచున్నది.
కొన్ని సందర్భాలలో బాహుబల ప్రదర్శనాలు, వీర విహారాలు కూడ అవసరమై
యుండెను. పంతులుగారు అందులో ఆరితేరిన జగజెట్టులని వారి జీవిత యాత్ర
నిరూపించుచున్నవి. వారిది పౌరుష జీవనము. చిన్నప్పుడు “రాజమండ్రి కోర్టులలో
ప్లీడర్లు లాంగుకోట్లు వేసుకొని తిరుగుతూ డబ్బు సంపాదిస్తూంటే” పంతులుగారికి
కూడ ప్లీడరీ వృత్తిమీద, లాంగుకోటు మీద (ప్రేమ కుదిరినది. ఈ వృత్తిలో వారు
విజయము పొందినారు. ఆరోజులలో రాజమహేంద్రవరమున న్యాపతి సుబ్బారావు
పంతులు, మోచర్ల రామచంద్రరావు పంతులుగార్ల వంటి వారు న్యాయవాద వృత్తిలో
319
డా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
నుండిరి. ఆ పెద్దలతో ప్రకాశం గారికి సంబంధము యేర్చడినది. కాని ఆ పెద్దలత్రోవ
వేరు; ప్రకాశంగారి త్రోవవేరు. వారు మితవాదులు. ప్రకాశం పంతులుగారు
స్వభావసిద్ధముగా అతివాదులు. అందుచేత ఆ పెద్దలతో పంతులుగారికి సంఘర్షణ
తప్పలేదు. సంఘర్షణలకు జంకుట ప్రకాశంగారి ప్రకృతికి విరుద్ధము. న్యాయవాద
వృత్తితో పాటు మునిసిపల్ రాజకీయాలలో ప్రకాశంగారు అడుగుపెట్టిరి.
వృత్తియందేగాక మునిసిపల్ రాజకీయాలలో కూడ ప్రకాశంగారు స్వతంత్రముగా
వ్యవహరించిరి. అవసరమైన యప్పుడు అధికారులతో, పెద్దలతో సంఘర్షణలుపడి,
ఆ సంఘర్షణలలో తమ పట్టుదలలను నెగ్గించుకొనుటలో విజయము పొందిరి.
ప్రకాశంగారి జీవితములో యే ఘట్టమును చూచినను యీ గుణమే ప్రధానముగా
కనుపించుచుండును. ఆ రోజులలో సంఘసంస్మరణోద్యమమునందు కూడ
ప్రకాశంగారు సానుభూతిని జూపిరి. ఈ ఉద్యమముతో పాటు ప్రకాశం పంతులుగారికి
వీరేశలింగము గారితో పరిచయము యేర్చడి క్రమక్రమముగా సన్నిహితత్వము
కలిగినది. అయితే ఒకానొక సందర్భంలో వీరేశలింగము గారిని కూడ ధిక్కరించి
వారికి వ్యతిరేకముగా వ్యవహరించిన సంఘటన యొకటి ఈ జీవితయాత్రలో
కనుపించు చున్నది. ప్రకాశం పంతులుగారి స్వభావ పరిశీలన గావించిన వారికి
యీ సంఘటన ఆశ్చర్యము కలిగించునది కాదు. అవసరమైనచో ఎంతటి వారిపైనను
గూడ తిరుగుబాటు చేయుటకు వెనుకాడని సాహసులు ప్రకాశం పంతులుగారు.
విద్యాధిక వృత్తులలో, స్వతంత్ర వృత్తులలో న్యాయవాద వృత్తి ప్రముఖమైనది.
అందుచేతనే పంతులుగారు యీ వృత్తివైపు ఆకర్షితులైనారు. కాని పంతులుగారి
ప్రజ్ఞా విశేషమునకు రాజమహేంద్రవరాని కన్న యెక్కువ విశాల రంగము
అవసరమైయుండెను. ఆ రోజులలో బారిస్టర్లకుండిన గణ్యత సాధారణ దేశీయ
న్యాయవాదులకు లేకుండెను. ఎవరో ఒకరు ప్రకాశంగారు బారిస్టరు కాదని
అనినారట. వెంటనే రెక్కలు కట్టుకొని లండన్ వెళ్లి బారిస్టర్ పట్టభ[ద్రులై మద్రాసు
నగరములో బల్లగట్టినారు ప్రకాశం పంతులుగారు. అప్పుడు చెన్నపట్టణములోని
న్యాయవాద ప్రపంచమునకు మైలాపూర్ మేధావులు తలమానికములై యుండిరి.
వీరందరును అతిరథ మహారథులు. ఈ అతిరథ మహారథుల మధ్య ప్రవేశించిన
ప్రకాశంగారు అతిత్వరలో మద్రాసు న్యాయవాదులలో అగ్రగణ్యులుగ భాసించిరి.
ఆ రోజులలో మద్రాసు నగరమున తెలుగు న్యాయవాదుల సంఖ్య తక్కువ.
320
వ్యాన మంజూష
ప్రకాశంగారు ఆనాటి ఆంధ్ర న్యాయవాదులకు శిరోభూషణముగా భాసించిరి. ఆనాటి
మద్రాసు న్యాయవాదులలో టి.వి. శేషగిరి అయ్యర్, శంకరన్ నాయర్, సుబ్రహ్మణ్య
అయ్యర్, సుందర అయ్యర్, భాష్యం అయ్యంగార్, వి.కృష్ణస్వామి అయ్యర్ మొదలైన
మేధావులు ఉండిరి. ఆ మేధావులను గూర్చి ప్రకాశంగారు తమ జీవిత యాత్రలో
చక్కగా వాక్చిత్రాలను రచించినారు. పైపెద్దలతో పాటు శ్రీనివాసయ్యంగార్, అల్లాడి,
టి.ఆర్. వేంకటరామశాస్త్రి మొదలైన వారు ఆనాడు ప్రకాశం గారికి సమకాలికులైన
యువక న్యాయవాదులు. వీరందరి మధ్య ప్రకాశంగారు ప్రముఖ న్యాయవాదిగా
పేరు పొంది లక్షల డబ్బును సంపాదించిరి. ఆనాటి న్యాయవాద ప్రపంచమును
గూర్చి అనేక విషయాలను చాల చక్కగా పంతులుగారు తమ జీవిత యాత్రలో
వెల్లడించినారు. మనదేశమున న్యాయమూర్తులకు కూడ హడలుగా నుండిన మిక్కిలి
కొద్దిమంది న్యాయవాదులలో ప్రకాశం గారికి ప్రత్యేక స్థానము కలదు. పంతులుగారి
జీవితంలోని అన్ని రంగాలు ఒక యెత్తు; రాజకీయాలు యింకొకయెత్తు. పంతులుగారి
రాజకీయ జీవితము మ్యునిసిపల్ రాజకీయాలతో, కాదు, నాటకరంగ రాజకీయాలలో
ప్రారంభమైనదని చెప్పవచ్చును. ఈ రాజకీయాలలో పంతులుగారు యెట్టి
వ్యక్తిత్వమును ప్రదర్శించినారో, తరువాత రాజకీయాలలోకూడ అట్టి వ్యక్తిత్వమునే
ప్రదర్శించినారని చెప్పవచ్చును. బారిస్టర్ చదువు కొరకు లండన్ వెళ్లిన సందర్భమున
పంతులు గారికి ప్రముఖ కాంగ్రెస్ నాయకులతో పరిచయమేర్చడినది. పంతులుగారిని
బెంగాలులో విప్లవకారులు, పశ్చిమ దేశంలో తిలక్ మహాశయుడు, ఉత్తరదేశంలో
లజపతిరాయ్ బాగా ఆకర్షించినారు. గోఖలే ప్రభృతులు పంతులుగారిని ఆకర్షించలేదు.
ఇందులోకూడ పంతులుగారి ప్రత్యేక వ్యక్తిత్వము ప్రస్ఫుట మగుచున్నది. లండన్‌లో
ఉన్నప్పుడు దాదాభాయి నౌరోజిగారి పార్లమెంటు ఎన్నికలో పంతులుగారు పనిజేసిరి;
శ్యాంజీ కృష్ణవర్మతో పరిచయము కలిగించుకొనిరి.
పంతులుగారు తమ రాజకీయ జీవిత ప్రారంభములోని దేశ పరిస్థితులు ఇందులో
చక్కగా వివరించిరి. ఆనాటి ఉద్యమాలు, ఆ ఉద్యమాల నాయకులు, వారి స్వభావాలు
వంతులుగారు చక్కగా వివరించినారు. చూడండి యా మాటలు.
yore హనుమంతరావు నాయుడుగారి శుశ్రూష రాజమహేంద్రవరంలో వీరేశలింగం
పంతులుగారి సంస్మరణోద్యమమూ కొంతవరకు నాలో రాజకీయాభిలాషలు
రేకెత్తించాయి. అప్పటికి 1857 సంవత్సరంనాటి స్వతంత్ర యుద్దపుకథలు ఇంకా
321
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
ప్రచారంలోనే ఉన్నాయి. ఏమైనా ఈనాటి మహదాశయాలు ఇదమిత్సమని ఏర్పడక
పోయినా, నాలో ఇతర లౌకికాభిలాషలతోపాటు, దేశసేవ చెయ్యాలనే అభిలాష కూడ
ఉందేది...... వివేకానందస్వామి ఉవన్యాసాలు నాకు కొంత ఉత్తేజము
కలిగించాయి...... (ప్రజలు 1857 విప్లవానంతరం కొంత నిరుత్సాహపడినా,
సక్రమమైన ఆందోళన సాగుతూ ఉండాలని కూడ గ్రహించారు. దీని ఫలితమే
కాంగ్రెస్ సృష్టి అని నా అభిప్రాయము. కొంతమంది ఆంగ్లమిత్రులు కేవలం ధర్మబుద్ధితో
కాంగ్రెస్ స్థాపనకి ప్రోత్సహించినమాట సత్యమైనను మొత్తంమీద ఆంగ్ల రాజనీతిజ్ఞులు
ఈ సక్రమాందోళనా సంస్థని ప్రోత్సహించడంలో కొంత స్వార్థం కూడ లేకపోలేదని
నమ్మకం... నాకు గోఖలే అన్నా ఆయన రాజకీయాలన్నా ఒక విధమైన అయిష్టం
బయలుదేరింది....... కాంగ్రెస్ రాజకీయాలు నన్ను అప్పట్లో ఆకర్షించక పోవడానికి,
గోఖలే ప్రభృతుల నాయకత్వం ఒక కారణం. ఆనాటి కార్యక్రమంలో గాని
నాయకత్వంలోగాని నన్ను ఉత్తేజ పరిచినది ఏమిలేదు.” ఈ మాటలు రాజకీయంగా
ప్రకాశంగారి మనస్తత్వ నిరూపణకు ఉపయోగపడుచున్నవి. మితవాదానికి
మొదటినుండియు ప్రకాశంగారు వ్యతిరేకులు. స్వభావసిద్ధముగా వారు అతివాదులని
'పైమాటలు నిరూపించుచున్నవి.
లక్షలు సంపాదించు కాలమున, న్యాయవాద వృత్తిని అవలీలగా విడిచివేసి,
రాజకీయాలలో లంఘించిన త్యాగమూర్తులు ప్రకాశం పంతులుగారు. ఈ జీవిత
యాత్రలో 1922 వరకు జరిగిన సంఘటనల వివరణ మాత్రమే ఉన్నందువలన
ప్రకాశం పంతులు తీవ్ర రాజకీయ జీవనచిత్రము ఇందులో కనుపించుటలేదు. ఈ
జీవితయాత్రలోని రెండవ భాగములో అట్టి వివరణ జరుగవలెను.
మద్రాస్‌లో బిపిన్‌చంద్రపాల్ గారి ఉపన్యాసాల అధ్యక్షతతో పంతులుగారు
తీవ్ర రాజకీయాలలోనికి లంఘించిరి. ఆనాడు మద్రాసులోని హేమాహేమీలు
బిపినచంద్రపాల్ ఉపన్యాసాలకు అధ్యక్షత వహించుటకు నిరాకరించగా పంతులుగారు
అందుకొరకై ముందుకువచ్చిరి. త్యాగసమయమున అరనిముసముకూడ ఆలోచించు
స్వభావము పంతులుగారిది కాదని ఇందువలన స్పష్టమగు చున్నది. తరువాత సూరత్
కాంగ్రెస్‌కు వెళ్లుటతో, పంతులుగారికి కాంగ్రెస్ రాజకీయాలతో సన్నిహిత సంబంధము
యేర్చడినది. బిసెంటమ్మ హోంరూలు ఉద్యమముకూడ పంతులుగారు శ్రద్ధతో
పరిశీలించినారు. ఇవన్నియును పంతులుగారి రాజకీయ నాటకానికి నాందీ
322
వ్యాస మంజూష
ప్రస్తావనలు గావించినవి. 1916లో గాంధీ మహాత్ముడు సత్యాగ్రహ ప్రమాణాలు
చేయించినప్పుడు, పంతులుగారు ప్రమాణ పత్రము మీద సంతకము చేసి తమ
రాజకీయ జీవిత నాటకములోని మొదటి అంకమును ప్రారంభించినారు. అందుచేత
పంతులుగారి తీవ్ర రాజకీయ జీవితానికి గాంధీ మహాత్ముడే ప్రధాన కారకుడని
చెప్పవచ్చును. ప్రజాహిత జీవనమున పంతులుగారు అడుగు పెట్టని రంగములేదు.
నాటకాలు, సంఘ సంస్మరణతో పాటు పంతులుగారు పత్రికా రచనారంగమునందు
కూడ కృషిని గావించిరి. దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి పెట్టని కోటగా నుండ వలెనను
సంకల్పముతో పంతులుగారు, శ్రీ రాజగోపాలాచారి, డాక్టర్ పట్టాభి సీతారామయ్య,
స్వర్గీయ ముట్టూరి కృష్ణారావు, స్వర్గీయ కాశీనాథుని నాగేశ్వరరావుగార్ల ప్రోత్సాహముతో
స్వరాజ్య అను ఆంగ్ల పత్రికను స్థాపించి నడిపిరి. ఇది సహాయ నిరాకరణోద్యమానికి
బలమైన అండగా నుండెను. అప్పటి వరకే పంతులుగారు చిత్తరంజన్ దాస్, మోతీలాల్
నెహ్రూలతో పాటు న్యాయవాద వృత్తిని విసర్జించి, రాజకీయ రంగములోనికి
లంఘించిరి. ఈ పత్రికను గూర్చి పంతులుగారు “21వ సంవత్సరంలో కాంగ్రెస్
విధానం పూర్తిగా నిర్వర్తించడానికి కంకణం కట్టుకొని బయలుదేరిన పత్రిక స్వరాజ్య
ఒక్కటేనని పైన వ్రాశాను. “స్వరాజ్య అహమదాబాదు కాంగ్రెస్‌లో చేసిన తీర్మానాల
ప్రకారం కాంగ్రెస్ వారినీ ప్రజలనీ (బ్రహ్మాండంగా ఉద్భోదించింది. ఆ తరువాత
కూడ అట్లాగే ప్రబోధిస్తూ వచ్చింది” అని వ్రాసినారు. ఇందువలన పత్రికా రచన
ద్వారా కూడ పంతులుగారు దేశానికి అమూల్యమైన సేవ గావించినట్లు స్పష్టమగు
చున్నది. నిజానికి ఆరోజులలో స్వరాజ్య పత్రిక అనేకులకు త్యాగదీక్షా కంకణము
గట్టినది.
ఈ జీవిత యాత్రలో పంతులుగారు అన్ని సంగతులు దాపరికము లేకుండా
చెప్పినారు. మంచి చెడ్డలు రెండింటిని కూడ గ్రహించుటకు అనువుగా యీ జీవిత
యాత్ర రచన జరిగినదని చెప్పవచ్చును. పంతులుగారు లండన్‌కు వెళ్లిన సందర్భంలో
NES ముఖ్యంగా ఈ దేశంలో, లండన్‌లో స్త్రీల స్వేచ్చని గురించి, తాగుబోతు
తనాన్ని గురించి, వ్యాపించి ఉన్న అల్లిబొల్లి కథల వల్లనూ, నా చిన్ననాటి చర్యల
వల్లనూ, ఇక్కడ ఈ విషయాల్లో నాకు కొంత బలహీనత ఉండిన కారణంవల్లనూ,
అందరూ నేను పూర్తిగా పాడైపోతానని అనుకున్నారు. కాని నిజానికి ఆ దేశం
జీవితమే నన్ను మానసికంగా కొంత ఆ బబలహీనతనించి తప్పించి, మంచి మార్గానికి
323
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
మళ్ళించింది.” అని చెప్పినప్పుడు యధార్థ కథనము విషయములో పంతులుగారు
యెట్టి శ్రద్ధ వహించిరో స్పష్టము కాగలదు. పౌరుషానికి పర్యాయపదము (ప్రకాశం.
పట్టుదలకు మారుపేరు ప్రకాశం. ధైర్య సాహసాలకు రూపాంతరము ప్రకాశం.
మూర్తీభవించిన త్యాగము ప్రకాశం. ఈ విధముగా ప్రకాశంగారు యీ పుటలలో
మనకు ప్రత్యక్షమగుచున్నారు.
చాలచక్మని మనోహరమైన శైలితో కూడిన వ్యావహారిక భాషలో యీ జీవిత
యాత్ర రచన జరిగినది. ఇటువంటి రచనలకు ఈ శైలి ఆదర్శప్రాయమైనదని
చెప్పవచ్చును. ఈ గ్రంథమును పరిశీలించినప్పుడు ప్రకాశం పంతులుగారికి తెలుగు
వచన రచయితలలో ఒక మంచిచోటు కలదని స్పష్టమగుచున్నది.
324
వ్యాన మంజూష
గురుదేవుడు రవీంద్రుడు
నేటి ఆగస్టు 15; సకల భారతదేశమునకు పండుగ; ఈనాడు మనదేశము
నూటయేబది సంవత్సరాల ఆంగ్ల పరిపాలన నుండి విముక్తినొందెను. ఈ శుభ
సందర్భమున మనము సంస్మరించవలసిన మహనీయులలో గురుదేవుడు రవీంద్రుడు
ముఖ్యుడు. భారత జాతీయ గీతమును రచించిన మహాకవి ఆయన. అందుచేత
స్వాతంత్రోత్సవ సందర్భమున ఆయనను స్మరించుటలో విశిష్టత కలదు. ఆయన
పరమపదించినది ఆగస్టు మొదటివారము. ఇందుచేత కూడ ఆగస్టు నెలలో ఆయన
స్మరణకు ప్రత్యేకత గలదు.
రవీంద్రుడు సాహితీ ప్రపంచమున, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప రచయిత.
అంతమాత్రమే కాదు, ఆయన మన దేశ సమస్యలయందు ప్రత్యేక (శ్రద్ధను తీసికొనిన
త్యాగమూర్తి. ఇల్లు గాలిపోవునవుడు వీణను చేతబట్టుకొను ప్రబుద్ధుడు
రవీంద్రుడుకాడు. మన దేశ నాయకులనేకులకు పూజ్యుడు రవీంద్రుడు. జాతిపితయైన
గాంధీ మహాత్ముడు ఆయనను గురుదేవుడని సంబోధించెడివాడు. మహాత్ముని
పూర్ణపురుషునిగా గురుదేవుడు సంభావించెడివాడు.
మన దేశ రాజకీయ సమస్యలనుగూర్చి రవీంద్రుడు సర్వదా ఆలోచించెడివాడు.
1919 సంవత్సరమునకుముందు ఇంగ్లీషువారు ఆయనకు సర్ బిరుదము
నిచ్చియుండిరి. ఆనాడు మనదేశములో గొప్పవారికి చాలమందికి యిటువంటి
బిరుదులు ఇంగ్లీషు ప్రభుత్వము యిచ్చియుండెను. 1919 సంవత్సరములో
అమృతసర్ పట్టణమున బ్రిటిషు ప్రభుత్వము జనసమూహముపైన తుపాకులను
గాల్చినపుడు అందుకు నిరసనగా రవీంద్రుడు తన సర్ బిరుదమును త్యజించెను.
ఆనాడు మనదేశమున సర్ బిరుదాంకితులైన గొప్పవారు మరికొందరు ఉండిరి.
కాని ఇట్టి త్యాగమును, ధైర్యమును, సాహసమును ప్రదర్శించినవాడు రవీంద్రుడే.
ఆనాడు రవీంద్రుడు ఇండియా వైస్రాయికి వ్రాసిన లేఖ ప్రపంచములోని లేఖా
సాహిత్యములో మహోజ్వలమైనది. జపాను దేశము యొక్క సామ్రాజ్యతత్వమును
నిరసించుచు జపాను కవీంద్రునికి రవీంద్రుడు వ్రాసిన యుత్తరము మరొక
మహోజ్వలమైన లేఖ. బహుశః 1950వ సంవత్సరమున కాబోలు భారత జాతీయ
నాయకులను బ్రిటీషు ప్రభుత్వము చెరసాలలో నుంచినపుడు మిస్. రాత్‌బోన్ అను
పాశ్చాత్యయువతి భారత నాయకులను దూషించుచు ఒక ప్రకటనచేసి యుండెను.
ఆ ప్రకటనకు రవీంద్రుడిచ్చిన సమాధానము ఆయనకు మన స్వాతంత్రోద్యమము
325
దా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
నందుగల గాఢమైన సానుభూతి, మరియు జాతీయ నాయకులందుగల అపార
గౌరవమును వెల్లడి చేయుచున్నవి.
రవీంద్రుడు మరియు గాంధీ మహాత్ముడు పరస్పరము పూజ్య భావము కలిగి
యుండిరి. వారికి ఒకసారి మాత్రమే అభిప్రాయ భేదము కలిగినది. విదేశవస్తు
బహిష్మరణమును చేయవలెనని గాంధీ మహాత్ముడు ప్రబోధించి స్వదేశీ ఉద్యమ
ప్రచారము గావించినపుడు రవీంద్రుడు యీ ఉద్యమము యొక్క ఉపయోగమును,
యోగ్యతను సందేహించుచు గాంధీ మహాత్మునికి ఒక ఉత్తరము వ్రాసెను. దానిని
ఉత్తర మనుటకన్న సాహిత్య ఖండమని చెప్పుట సమంజసము. దీనికి సమాధానముగా
గాంధీ మహాత్ముడు వ్రాసిన ప్రత్యుత్తరము భావ గాంభీర్యము నందును, భాషా
సౌందర్యము నందును రవీంద్రుని రచనకు యే మాత్రము తీసిపోని రమణీయమైన
ఖండ కావ్యమని చెప్పవచ్చును. రవీంద్రుడు రాజకీయ నాయకుడుగా, గాంధి ఒక
మహాకవిగా యీ ఉత్తర ప్రత్యుత్తరాలలో ప్రత్యక్షమగు చున్నారు. ఇదియే వారి ప్రణయ
కలహములలో మొదటిది, మరియు చివరిది; తరువాత వారికి అభిప్రాయ
భేదాలెన్నడును కలుగలేదు. గాంధీ మహాత్ముని ఇష్టమునకు వ్యతిరేకముగా సుభాస్
చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీచేసి నపుడు కొందరు సుభాస్ చంద్రబోసు
పక్షము వహించ వలసినదని రవీంద్రుని కోరిరి. కాని ఆయన అందుకు
సమ్మతించలేదు. మహాత్మునికి వ్యతిరేకముగా ఆయన ముందుకు రాలేదు.
జవహర్‌లాల్ నెహ్రూ యందు రవీంద్రుడు, (ప్రేమ, అభిమానము, వాత్సల్యము
కలిగి యుండెను. జవహర్‌లాల్ నెహ్రూకు మొదటి నుండియు రవీంద్రుని యందు
భక్తి. రవీంద్రుని ఉన్నతాదర్శముల చేత జవహర్‌లాల్ ప్రభావితుడైన నిదర్శనాలు
కలవు. భారత జాతీయ కాంగ్రెస్ యొక్కయు, మరియు భారతదేశ స్వాతంత్ర్యము
యొక్కయు విదేశాంగ విధానము రూపొందజేసిన రాజకీయ వేత్త శ్రీ జవాహర్. శ్రీ
జవాహర్ విదేశాంగ విధానము మీద రవీంద్రుని ఉన్నతాదర్శాల ప్రభావము
కనపడుచున్నది. రవీంద్రుడు జాతి విచక్షణా విధానమునకు వ్యతిరేకి. సామ్రాజ్య
తత్వమునకు ప్రతికూలుడు. మానవత్వము నందు విశ్వాసము కలిగిన మహనీయుడు.
యుద్ధాలను ఆయుధాలను ప్రతిఘటించిన శాంతిప్రియుడు. జగత్మల్యాణమునకై
పరితపించిన బుషీశ్వరుడు. రవీంద్రుడు ప్రపంచమునకు (ప్రేమ సందేశము నిచ్చిన
మహానుభావుడు. ఒక జాతి మరొక జాతి మీద అధికారము వహించు
జాతీయాహంకారమును, ఒక మానవుడు మరొక మానవుని బానిసగా జూచు
మనస్తత్వమును రవీంద్రుడు సర్వదా వ్యతిరేకించి యుండెను. ఈనాడు జవహర్లాల్
326
వ్యాస మంజూష
దివ్యవాణి వలె, ఆనాడు రవీంద్రుని దివ్యవాణి సకల ప్రపంచమునకు, శాంతి
సందేశము నిచ్చునదిగా నుండెను. తన యీ అభిప్రాయాలను రవీంద్రుడు
ఉపన్యాసములందును, రచనల యందును పలుమారు (ప్రకటించి యుండెను.
స్వతంత్ర భారతదేశము యొక్క ఆదర్శములు కూడ యిట్లే ఉండవలెనని ఆయన
కలలు గనుచుండెను. రవీంద్రుని ఆదర్శాలు, స్వప్నాలు యీ నాడు జవహర్‌లాల్
నెహ్రూ విదేశాంగ విధానములో ప్రతిబింబితమగుచున్నవి. ఇది రవీంద్రుని విశిష్టత.
కావుననే రవీంద్రుడు సకల భారత నాయకులకు గురుదేవుడైనాడు.
ఆధునిక కాలములో భారతదేశము యొక్క ఆత్మకు చిహ్నములని చెప్పదగినవారు
ముగ్గురు. ఒకరు గాంధీ మహాత్ముడు. రెండవవారు రవీంద్రుడు. మూడవవారు
జవాహర్‌లాల్ నెహ్రూ. గాంధీమహాత్ముడు సత్యమునకు ప్రతినిధి. రవీంద్రుడు
సౌందర్యమునకు, శాంతికి ప్రతినిధి. సత్యము, సౌందర్యము, శివము భారతదేశ
సంస్కృతికి మూలకందములు. భారతదేశము యొక్క ఆత్మకు చిహ్నములు. వీనికి
ప్రతినిధులైన యీ ముగ్గురు మహనీయుల వ్యక్తిత్వాల సమన్వయమే భారతదేశము
యొక్క ఆత్మ.
రవీంద్రుడు పరమపదించినప్పుడు, ఆయనకు శ్రద్ధాంజలి సమర్పించుచు
రవీంద్రుని రచనలకు అమూల్యమైన వ్యాఖ్యానము వ్రాసి, పాశ్చాత్య ప్రపంచమునకు
పరిచయముచేసిన డాక్టర్ రాధాకృష్ణన్ “రవీంద్రుడు వ్యాస, వాల్మీకుల తరగతికి
చెందిన వాడని” చెప్పిరి. నిజమే! వ్యాస వాల్మీకులవలె రవీంద్రుడు మహర్షియిన
కవీంద్రుడు. జాతీయ గీతమును పఠించు ప్రతి సందర్భమున రవీంద్రుని సుందర
గంభీర ఆకారము మన కనులయెదుట సాక్షాత్మరించి శాంతి సందేశము
నిచ్చుచుండును.
శూరుల జన్మము, సురల జన్మము, యేరుల జన్మము తెలుసుకొనుట కష్టమని
భారత కవి సూక్తి. అదేవిధముగా బుషీశ్వరుల జన్మమే కాక మృత్యువుగూడ
సాధారణులకు తెలుసుకొనుట కష్టమైన కార్యము. రవీంద్రుడు తన మరణమునకు
కొన్ని దినములు ముందు మృత్యువును గూర్చిన ఒక రచన గావించెను. బహుశా
అదియే ఆయన తుది రచన. తన యవసానమునకు కొద్దిరోజులు ముందు
మృత్యువును గూర్చి రచన గావించిన రవీంద్రుడు త్వరలో తనకు స్వర్గలోకము
నుండి రానున్న ఆహ్వానమును ఊహించుకొనెనేమో! మహాత్ముల యూహలు
సత్యసామీష్యములుకదా!
327
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
చిలకమర్తి
టు
ఆంధ్ర వచన వాజ్మయ చరిత్రలో చిలకమర్తి లక్ష్మీనరసింహ కవి గారిది
సమున్నత స్థానము. తెలుగు ప్రబంధ కవులలో ముక్కుతిమ్మన యెట్టివాడో నవ్యాంధ్ర
వచన రచయితలలో చిలకమర్తివారు అట్టివారు. ఆధునిక వచనమునకు జనకుడైన
వీరేశలింగము పంతులుగారికి ప్రియశిష్యులు చిలకమర్తి లక్ష్మీనరసింహముగారు.
ఉభయులు కూడ గోదావరీ తీర వాసులే.
ఆధునిక అవసరాలకు అనుగుణముగా ఆంధ్ర వచన రచన దిద్దితీర్చిన యుగకర్త
గద్యతిక్కన వీరేశలింగము పంతులుగారు. వీరేశలింగముగారి ఒరవడిని అనుసరించి,
తెలుగు వచన రచనకు మెరుగుపెట్టి వచనవాజ్మయ వీధులన్నింటి యందును
'స్ర్వైరవిహారము గావించినారు చిలకమర్తి. కవికోకిలము వచన శైలి వీరేశలింగముగారి
శైలికన్న లలిత మైనదని చెప్పవచ్చును. ఆంగ్ల భాషలోని గద్యవాబ్మయ విశేషములను
తెలుగున ప్రవేశపెట్టిన వారిలో చిలకమర్తివారికి ప్రత్యేక స్థానముకలదు.
వ్యాసము, ప్రహసనము, చిన్నకథ, నవల, అనువాదము, స్వీయచరిత్ర,
జీవితచరిత్ర, పత్రికారచన అనునవి ఆధునిక వచన వాజ్మయ విశేషములు. ఈ
యన్నిటికిని మార్గదర్శకులు వీరేశలింగముగారే. ఆయన జూపించిన మార్గమున
పురోగమించి, రాచబాటను వేసినవారు చిలకమర్తి లక్ష్మీ నరసింహము పంతులుగారు.
వీరేశలింగముగారి వలె చిలకమర్తివారు సంఘ సంస్కర్తలు. ఈ సంఘ సంస్కరణాభి
లాష వీరి రచనలలో ప్రతిబింబించు చుండును. తమ రచనలలో చిలకమర్తివారు
వీరేశలింగము గారివలె వోన్యమును బహుళముగా ఉవయోగించినారు.
కందుకూరివారి హాస్యము కన్న చిలకమర్తివారి హాస్యము సున్నితమైనది. కొన్ని
సందర్భాలలో వీరేశలింగముగారి హాస్యము కొంత పేలవముగా నుండును. అటువంటి
దోషము లక్ష్మీనరసింహము గారి రచనలో కనుపించదు.
వీరేశలింగ యుగమున వచన వాజ్మియాభివృద్ధికి కృషిచేసినవారిలో ప్రముఖులైన
పానుగంటి లక్ష్మీనరసింహారావు పంతులుగారు చిలకమర్తివారి సమకాలికులు.
ఆధునిక వచన వాజ్మయమునకు పానుగంటి చిలకమర్తి కవీశ్వరులు
సూర్యచంద్రులవంటివారు. పానుగంటివారి శైలి సూర్యునివలె తీక్షణమైనది.
చిలకమర్తివారి శైలి చంద్రునివలె చల్లనిది. పానుగంటివారి వచనమును
328
వ్యాన మంజూష
పఠించునప్పుడు ఆరితేరిన యోధుడు అవలీలగాజేయు కత్తిసాము జ్ఞప్తికి వచ్చును.
చిలకమర్తివారి రచనలు చదివినప్పుడు వెన్నెలలో విహరించి నట్లుండును; పన్నీరు
చిలికినట్లుండును. పానుగంటివారి హాస్యము కొంత కరకుగానుండి అప్పుడప్పుడు
మనస్సుకు నొప్పి కలిగించు చుండును; సభ్యత యొక్క హద్దులుదాటిన నిదర్శనాలు
కూడ పానుగంటివారి రచనలలో కనుపించుచున్నవి. చిలకమర్తివారి రచనలలో
ఇటువంటి గుణము కనుపించదు. మనస్సుకు నొప్పి కలిగించని మృదువైన హాస్యము
చిలకమర్తివారి సొమ్ము. పూర్వ వాజ్మయమున కవిత్రయమని ప్రసిద్ధి గాంచిన నన్నయ
తిక్కన శంభుదాసుల కెటువంటి స్థానము కలదో ఆధునిక వచన వాజ్మయమున
కందుకూరి చిలకమర్తి పానుగంటి కవులకు అటువంటి స్థానములే కలవని
నిస్సంశయముగా చెప్పవచ్చును. పానుగంటివారు సాధించినది వ్యాసము మరియు
విమర్శ. చిలకమర్తివారు దిద్దితీర్చినది నవల మరియు జీవిత చరిత్ర.
నవలా రచనకు చిలకమర్తివారు ఉపక్రమించుటకు పూర్వము కనుపించు
తెలుగు నవల రాజశేఖరచరిత్ర యొక్కటే. స్వకపోలకల్పితములగు చిత్ర వచన
కావ్యములను అనేకము రచించి, చిలకమర్తివారు తెలుగుదేశమున వచనమునకు
బహుళ ప్రచారము కలుగజేసినారు. వీరి నవలలు మూడు తరగతులకు జెందినవి.
మొదటి తరగతి నవలలు చారిత్రక నవలలు. ఈ నవలలలో అహల్యాబాయి, హేమలత
మొదలైనవి పేర్కొనదగినవి. రెండవ తరగతికి చెందిన నవలలు సాంఘిక నవలలు.
వీనిలో రామచంద్రవిజయము, గణపతి పేర్కొన దగినవి. గణపతి హాస్యరసమునకు
ఆలవాలమైన నవల. మూడవ తరగతికి చెందిన సౌందర్యతిలక, కర్పూర మంజరి
చిలకమర్తివారి రచనలలో పెద్ద నవలలు. ఇవి అద్భుత కథా సంవిధానమునకు
ఆటపట్టులు, సుధాశరచ్చంద్రము రమేశచంద్రదత్తు సాంఘిక నవలకు అనువాదము.
ఈ నవలలు ఆధునిక యుగమున ఆంధ్ర పాఠక ప్రపంచమునకు సారస్వతాభి
రుచిని, గ్రంథపఠనాసక్తిని కలిగించి, వాజ్మయ ప్రచారమునకు మిక్కిలిగా తోడ్చడినవి.
చిలకమర్తివారి అడుగుజాడలలో నవలా రచన గావించినవారు ఆంధ్రదేశములో
తరువాత మరికొందరు బయలుదేరిరి.
చిలకమర్తి వచన రచనలలో ప్రహసనములు ప్రత్యేకముగా ఒక సంపుటము.
ఈ ప్రహసనములలో సంఘ సంస్కరణాభిలాష అడుగడుగున కనుపించుచుండును.
కడచిన శతాబ్బాంతమున ఆంధ్రదేశములో వ్యాపించియుండిన సాంఫిక
329
దా॥/ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
దురాచారములు యీ ప్రహసనములందు ప్రతిబింబించుచున్నవి. హాస్యమును మిక్కిలి
సున్నితముగా యీ ప్రహసనాలలో లక్ష్మీ నరసింహముగారు పోషించినారు; స్వేచ్చగా
వ్యావహారిక భాషను ఉపయోగించినారు. లక్ష్మీనరసింహము గారు వ్రాసిన చిన్న
కథలుకూడ చాలకలవు. ఈ కథలు అనేక తరగతులకు చెందినవి. ఆంధ్రదేశమున
వాడుకలో నున్న అనేక కథలను వీరు సంపుటీకరించి యున్నారు. కొన్ని కథలకు
వినోదమే ముఖ్యోద్దేశము. వీరి కథలలో కొన్ని పెద్దవి మరికొన్ని చిన్నవికూడ కలవు.
కాని యీనాటి కథానికలవంటివి చిలకమర్తివారి కథలు కావు. సమకాలిక
సమాజము మరియు దైనందిన సంఘటనలు చిత్రించు నేటి చిన్న కథల వంటివి
చిలకమర్తివారి కథలుకావు. కథా కథనమే ప్రధానోద్దేశముగా కలిగినవి చిలకమర్తివారి
కథలు. చమత్మారమంజరి, రాజస్థానకథావళి వినోదములు మొదలైనవి వీరి కథలలో
చెప్పదగినవి.
చిలకమర్తివారి వచన రచనలలో జీవిత చరిత్రలు కూడ ముఖ్యమైనవి.
గౌతమబుద్ధుడు, గురుగోవిందుడు, నానక్ మొదలైన మహాత్ముల చరిత్రలను
మనోహరముగా వీరు వ్రాసియున్నారు. గడచిన శతాబ్బమున మన దేశమున
ఉదయించి, వివిధ రంగాలలో అనేక ఉద్యమాలకు నాయకత్వము వహించి,
దేశాభివృద్ధికి కృషిజేసిన రాజారామమోహనరాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్,
దేవేంద్రనాథ టాగోరు మొదలైన మహానుభావుల జీవితాలను చిలకమర్తివారు
రమణీయమైన శైలిలో చిత్రించినారు. నవభారత నిర్మాతలను గూర్చి వివరముగా
తెలుసుకొన కుతూహలపడు ఆంధ్ర పాఠకులకు యీ జీవిత చరిత్రలు అత్యంత
ఉపయుక్తములు. ఈ రచనలలో చిలకమర్తివారి అభిరుచులు, అభిప్రాయాలు, గాఢ
దేశాభిమానము అడుగడుగున మనకు వెల్లడి యగుచుండును.
పత్రికా రచనలో ఆ కాలమున చిలకమర్తివారు అందెవేసిన చేయి; స్వయముగా
మనోరమ, దేశమాత అను వత్రికలకు నంపాదకత్వము వపొంచిరి.
రాజమహేంద్రవరములోని వ(త్రికలతో వారికి గాఢమైన నంబంధము.
వీరేశలింగముగారు కూడ పత్రికా రచయితలే. కాని చిలకమర్తివారు వీరేశలింగము
పంతులుగారి వలె పత్రిక ద్వారా తీవ్ర వాదోపవాదము లందు పాల్గొని రచ్చకెక్కి
రణరంగము గావించలేదు. బహుశా వీరేశలింగముగారిలోని తీవ్రత చిలకమర్తివారిలో
లేకపోవుటకు కారణము వారి శారీరక దౌర్చల్యమేమో! చిలకమర్తివారి వచన
330
వ్యాస మంజూష
రచనలలో స్వీయచరిత్రము మిక్కిలి ముఖ్యమైనది. తెలుగు భాషలో స్వీయచరిత్రలు
వ్రాసికొనిన పెద్దలు, విశేషించి కవి పండితులు మిక్కిలి తక్కువ. ఇట్టి వారిలో తిరిగి
మొట్టమొదటివారు వీరేశలింగముగారే. చిలకమర్తివారు తమ స్వీయచరిత్రను మిక్కిలి
చక్కని శైలిలో వ్రాసి ఆంధ్ర దేశమునకు ఆంధ్ర భాషకు గొప్ప ఉపకారము
గావించినారు. ఇటీవలి ఆంధ్రదేశ చరిత్రను తెలుసుకొనుటకు భావి చరిత్రకారులకు
ముఖ్యమైన ఆధారముగా చిలకమర్తి వారి స్వీయ చరిత్ర ప్రకాశించుచున్నది. ఇందులో
వారు సమకాలిక సమాజము, అందలి సంఘటనలు, వానితో సంబంధించిన వ్యక్తులు,
వారి శీలము చక్కగా చిత్రించినారు. వీరేశలింగముగారి స్వీయచరిత్ర, చిలకమర్తివారి
స్వీయచరిత్ర మరియు చిలకమర్తివారికి అత్యంత (ప్రేమాస్పదులైన టంగుటూరి
ప్రకాశం పంతులుగారి స్వీయచరిత్ర అను మూడు గ్రంథాలు ఒకచోట
సంపుటీకరించినచో అది గడచిన శతాబ్దముయొక్క రెండవ అర్ధ్థభాగము మరియు
యీ శతాబ్దము యొక్క మొదటిభాగమునకు సంబంధించిన ఆంధ్రదేశ చరిత్ర
కాగలదని చెప్పిన అతిశయోక్తి కాజాలదు.
చిలకమర్తివారి శైలికి ప్రత్యేకమైన విన్నాణము మరియు సొగసు కలవు. వారు
ఉపయోగించు శబ్దజాలము మిక్కిలి సరళమైనది మరియు బహులలితమైనది. ఈ
చక్మదనమునకు మారుపేరని చెప్పదగిన చిలకమర్తివారి వచనశైలి ఆంధ్ర విద్యార్థులకు
అవశ్య పఠనీయమైనది. ఆంధ్ర వచనమునకు సారళ్యము సమకూర్చిన వారిలో
వీరేశలింగముగారి తరువాత యెన్నదగినవారు చిలకమర్తి లక్ష్మీనరసింహముగారు.
331
దా/ దేవులపల్లి రామానుజరావు (గ్రంథావళి
కవయిత్రి తోరూదత్
“ముదితల్ నేరగరాని విద్య కలదే ముద్దార నేర్చించినన్” అని చెప్పిన చిలకమర్తి
కవి మాటలు అక్షరాల సత్యమైనవి. ఏరంగములో నైనను, సరియైన, సమానమైన
అవకాశాలు లభించినచో పురుషులకు స్త్రీలు ఏమాత్రము తీసిపోరని బుజువు
చేయుటకు ఎన్ని నిదర్శనాలైనను చూపించవచ్చును. గత శతాబ్దమున వంగ రాష్ట్రమున
జన్మించి, కీర్తిగాంచిన తోరూదత్ అను యువ కవయిత్రి జీవితము ఇటువంటి
నిదర్శనాలలో పేర్కొనదగినది.
తోరూదత్ 1856 సంవత్సరమున కలకత్తాలోని అగ్రవర్థానికి చెందిన ఒక
ఉన్నత కుటుంబమున జన్మించినది. చిన్నప్పటి నుండి సిరి సంపదలతో
తులదూగినది. అయితే యీ ఐశ్వర్యము ఆమె జీవితమును ఆనందప్రదము గావించిన
దని చెప్పుటకు వీలులేదు. శైశవదశలోనే ఆమె సుకుమార హృదయానికి తీవ్ర
అఘాతములు కొన్ని తగిలినవి. ఆమెకు పది సంవత్సరాలు నిండీ నిండని వయసులో
ఆమె అన్న తన పదునాలుగవ యేట చనిపోవుట జరిగినది. ఆమెకు ఇంకను మైనారిటీ
యైనను దాటని పదునెనిమిది సంవత్సరాల వయసులో ఆమె అక్క ఇరువదేండ్ల
ప్రాయమున మరణించుట జరిగినది. ఈ రెండు మృతులు ఆమె లేతయెడద మీద
సమ్మెట పోటులైనవి.
ఆమె తండ్రి ఉదార భావాలు కలిగిన సజ్జనుడు; మంచి విద్వాంసుడు; ఆయన
తన కూతురును అల్లారు ముద్దుగా పెంచి ఆమె విద్యాభ్యాసానికి సకల సౌకర్యాలు
కలుగజేసి, విదుషీమణిగా పెంచి పెద్ద జేసినాడు. తండ్రిగారి సుందరమైన
ఆరామములో ఆమె తన శైశవము నంతయును ఆటపాటలతో వెళ్లబుచ్చినది.
విద్యాబుద్ధులు నేర్చి, సాహితీ వ్యాసంగమున నిమగ్నయైన యౌవన దశలో ఆమె
తన చిన్నప్పటి అనుభవాలను, బాల్య స్నేహితులను, ప్రకృతి దృశ్యాలను తలంచుకొని
ఉత్తేజితమై వానిని తన కవితా సౌధమున సుందరముగా చిత్రించి అక్షరములను
గావించినది.
ఆధునిక వాతావరణములో పుట్టి పెరిగి, పాశ్చాత్య సంస్కృతి పరిపూర్ణముగా
ఆకళించుకొన్నప్పటి కిని, తోరూదత్ రచనలను పరిశీలించినప్పుడు వానిలో ప్రతి
పదమున భారత జాతీయత యొక్క ముద్ర స్పష్టముగా కనుపించుచుండును. ధృవుడు,
332
వ్యాస మంజూష
ప్రహ్లాదుడు, లక్ష్మణుడు, సీతమ్మ, సావిత్రి మొదలైన పౌరాణిక వ్యక్తులను, వారి
శీలమును అత్యంత అభిమానముతో ఆమె తన రచనల యందు చిత్రించినది.
సాధారణముగా హిందూ కుటుంబాలలో చిన్నప్పుడు పసి పిల్లలకు ఇంటిలోని ప్రీలు
పౌరాణిక కథలను వీనుల విందుగా చెప్పుట జరుగును. బహుశా, చిన్ననాటి యీ
మధుర స్మృతులే తరువాత తోరూదత్ కవితా దర్చణమున ప్రతిఫలించినవేమో!
పదమూడు సంవత్సరాల బాలికగా నున్నప్పుడు, తండ్రి ఆమెను ఇంగ్రీషు
ఫ్రెంచి భాషలను చదివించుట కొరకు ఐరోపాఖండమునకు తీసికొని వెళ్లెను. ఆమె
ఉన్నత విద్యాభ్యాసమంతయును పాశ్చాత్య దేశాలలోనే జరిగినది. ఇంగ్లీషు ఫ్రెంచి
భాషలను ఆమె కూలంకషముగా పఠించినది. అందులోను ఇంగ్లీషుకన్న యెక్కువ
వైదుష్యము ఆమె (ప్రెంచి భాషలోనే సంపాదించినది; రచనా ప్రావీణ్యమున గూడ
ఇంగ్లీషుకన్న యెక్కువ ప్రతిభ ఫెంచిలో ఆమె ప్రకటించిసదని సుప్రసిద్ధ విమర్శకుల
అభిప్రాయము. నాలుగు సంవత్సరాలు విదేశాలలో విద్యాభ్యాసము గావించిన తరువాత
ఆమె స్వదేశానికి మరియు స్వరానికి వచ్చినది; పాపము; తరువాత ఆమె జీవించినది
నాలుగేండ్లు మాత్రమే. ఇరువది మూడు సంవత్సరాలు నిండీనిండని వయసులో
ఆమె చిన్నప్పుడు తనను విడిచి వెళ్ళిన సోదరీ సోదరులను కలుసుకొనుట కొరకు
పరలోకమున కేగినది. భగవంతుని సృష్టిలోని విచిత్రమేమోకాని, ఆ ముగ్గురు సోదరీ
సోదరులు, నిండు జవ్వనము గూడ దాటని వయసులో తమ కుటుంబమును, వృద్ధ
జనకుని దుఃఖసముద్రములో ముంచివేసినారు.
ఆమె తన జీవితపు చివరలోని నాలుగు సంవత్సరాలు కలకత్తా నగరములోని
సుందరవనాంతరము నందలి సౌధములో గడపినది. ఆమెది బక్క పలుచని
సుకుమారమైన విగ్రహము. వయసుకు మించిన పాండిత్య భారముతో, నిరంతర
సాహితీ వ్యాసంగము యొక్క బరువుతో, లేదీగవంటి ఆ నాజూకు శరీరము
కృంగిపోయినదేమో! స్వదేశములో కొంత సంస్కృతము గూడ ఆమె అభ్యసించినది;
సంస్కృత వాజ్బ్యయము నందలి ఉత్తమ కావ్యామృతమును తగినంత ఆమె తన
కడుపార గ్రోలినది.
మాతృభాషమైన వంగభాషలో ఆమె యేమియును వ్రాసినట్లు కనపడదు;
అందులో ఆమె నేర్పుకూడ యెక్కువ కాదేమో! ఇంచుమించుగా ఆమె రచనలన్నియును
ఇంగ్లీషు ఫ్రెంచి భాషలలోనే జరిగినవి. ఆంగ్ల ఫ్రెంచి భాషల యందలి ప్రాచీనుల
333
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
రచనల కన్న ఆధునికుల రచనలే ఆమె యెక్కువగా అభిమానించినదని ఆమె రచనలు
చాటుచున్నవి.
రచనలను చాల గావించినప్పటికి, జీవిత కాలమున పుస్తకరూపముగా ఆమె
ప్రకటించినది ఒక్కటి మాత్రమే. అదియే 51621 gleaned in French Fields
అను గ్రంథము. ఛందో వ్యాకరణాది దోషాలు కొన్ని ఉన్నప్పటికిని, భావనాశక్తి
మరియు సహజప్రతిభ ఇందులో ప్రముఖముగా కనుపించుచున్నవి. ఆమె మరణించిన
తరువాత యీ గ్రంథమును ఆమె వృద్ధ జనకుడు పునర్ముద్రణము చేయించెను. ఈ
రచన (ఫ్రెంచి సమాజమును చిత్రించుటకు ఉద్దేశించినది. కాని ఇందులో స్పష్టముగా
కనుపించునది భారతీయ మనస్తత్వమేనని ఆంగ్ల సారస్వత విమర్శకుల అభిప్రాయము.
ఈ రచనలోని వాతావరణము మరియు పాత్ర పోషణ యందు (ఫ్రెంచి తత్వము
కన్న భారతీయత యెక్కువగా కనుపడుటయే ఇందుకు కారణము.
Mlle.D' Averes అనునది ఆమె మరొక రచన. ఇద్దరు సోదరులు ఒక
సుందరాంగికై పోరాడి పరస్పరము హత్యగావించు కొనుట యీ రచనకు ఇతివృత్తము.
సాహితీదృష్టితో యీ రచన విలువకలది. ఆమె రచనలలో శాశ్వతమైన విలువ గలవి
ఆమె ఆంగ్ల ఖండకావ్యాలు. ఈ ఖండకావ్యాలలో కొన్ని ఆమె జీవితకాలము నందే
కలకత్తా రెవ్యూ మరియు బెంగాల్ మ్యాగజీన్‌లలో ప్రకటితమై ఆమె మరణానంతరము
పుస్తకరూపకముగా ముద్రితమైనవి. ఇందులో ప్రహ్లాదుడు, సావిత్రి మొదలైన పౌరాణిక
కథలు గలవు. ఈ రచనలు భావగాంభీర్యానికి, భాషా సారళ్యానికి ఆటపట్టులు.
కొన్ని సందర్భాలలో భాష యొక్క దౌర్చల్యము, విశేషించి భావోద్వేగముతో పరుగెత్తలేని
శబ్దజాలము ఆమె రచనలలో కనుపించుచుండును. భావము, భాష యీ రెండింటి
దృష్ట్యా కూడ అత్యుదాత్తములైన కొన్ని రచనలు కూడ యీమె ఖండ కావ్యాలలో
కలవు. Our Casurina tree అనునది ఎంతటి గొప్ప కవికైనను కీర్తిని సంపాదించి
పెట్ట గలిగిన మనోహర ఖండకావ్యము. భావి చరిత్ర కారుడు ఆంగ్ల వాజ్బయ చరిత్రను
రచించునప్పుడు అందులో తోరూదత్ కొక పుటను యీయక తప్పదని, సుప్రసిద్ధ
కవయిత్రియైన సరోజినీదేవి యొక్క ఆంగ్ల రచనలను ప్రపంచానికి పరిచయము
గావించిన ఆంగ్లేయ సాహిత్య విమర్శకుడు యీమె పుస్తకానికి వ్రాసిన ఉపోద్దాతములో
ఉద్దాటించి యున్నాడు.
334
వ్యాన మంజూష
శ్రీ రాయప్రోలు సుబ్బారావు
“ఏ ప్రఫుల్ల పుష్పంబుల నీశ్వరునకు
పూజ సలిపితినో యేను పూర్వమందు
కలద యేని పునర్జన్మ కలుగు గాక
మధుర మధురమైన తెనుగు మాతృభాష”
అని తమ ఆకాంక్షను తెలుపుకొనిన ఆధునికాంధ్ర కవీశ్వరులు శ్రీరాయప్రోలు
సుబ్బారావుగారు. ఈ దృక్పథముతోనే రమ్యాలోకము నందు 'భాష కంటె నవ్యులకు
తపస్సు లేదు” అని చెప్పుట జరిగినది. సుబ్బారావుగారు కవితా రంగమున
అడుగుబెట్టిన కాలమున సకల భారతమునందు వలెనే ఆంధ్ర దేశమునందు కూడ
జాతీయోద్యమము గాఢముగ వ్యాపించి యుండెను. ఆంధ్రోద్యమము కూడ
అవతరించి అన్ని పక్షాల ఆమోదమును పొంది యుండెను. ఈ రెండు ఉద్యమాల
ప్రేరణతో వీనికి బలమైన అండగా సుబ్బారావు గారి వాణి తెలుగు దేశమును ఉత్సాహ
తరంగితము కావించినది. ఆనాడు పెన్నానదీ తీరమున జరిగిన ఆంధ్ర సభలలో
పెద్దలు అభిప్రాయ భేదాలతో ఐకమత్యమును విడనాడగా యువకులైన
సుబ్బారావుగారు ఆంధ్ర ప్రబోధ పద్యాలు వ్రాసి వానిని చదువుటకు జంకుచుండగా
ఆ పద్యాలను తీసికొని ఆంధ్రరత్న గోపాలకృష్ణుడు ఆ వేదిక నుండి తన సహజ
గంభీర ధోరణిలో పఠించగా ఆ సభలోని పెద్దలు, పిన్నలు, అందరు ఒక్కసారి తమ
కక్షలను విస్మరించి కర్తవ్య పరాయణులైన ఆ ఉజ్జ్వల ఘట్టము ఆధునికాంధ్ర చరిత్రలో
బహు రమణీయమైనది. ఆనాడు పెద్దల ముందు వేదిక మీదినుండి పద్యాలను
చదువుటకు జంకిన యువకవియే తరువాత అభినవాంధ్ర కవితా నిర్మాత యైనారు.
ఆ పద్యాలే ఆంధ్ర ప్రబోధ వాజ్మయము నందు ఉత్తమ స్థానమును ఆక్రమించి
తరువాత కవుల రచనలకు ఒరవడి యెనవి.
గడచిన నూరు సంవత్సరాల తెలుగు సారస్వతమును సవిమర్శముగా పరిశీలించి
నపుడు వివిధ వాజ్మయ వీధులలో నూతనత్వము, ప్రత్యేకత, విశిష్టత స్పష్టముగా
గోచరించుచున్నవి. ఆధునికాంధ్ర కవిత్వము మీద అధునాతన ముద్రవేసిన వారిలో
శ్రీ సుబ్బారావుగారిది అగ్రతాంబూలము. నేటి కాలపు కవిత్వమున క్రొత్త పోకడలకు
మార్గదర్శకులు శ్రీరాయప్రోలు వారని చెప్పినచో సత్యమునకు తలవంపులు
335
డా॥ దేవులపల్లి రామానుజరావు (గ్రంథావళి
కలుగజాలవు. శ్రీ వీరేశలింగం గారు ఆంధ్ర కవిత్వమునకు సారళ్యము సమకూర్చి
నప్పటికిని నవ్యతాముద్ర వేయలేదు. ఈ నవ్యతా ముద్రను భావము, భాష మొదలగు
సకల విషయములందు స్పష్టముగ ప్రవేశపెట్టినది సుబ్బారావుగారే. ఆంధ్ర
సారస్వతమున కవి యొక్క స్వీయ భావప్రధానమైన ఖండకావ్యరచనకు దేశభక్తి
'ప్రబోధకమగు కవిత్వమునకు మార్గదర్శకులు శ్రీరాయప్రోలు కవి. కావ్య కథన
పద్ధతిలో, వర్ణనా ధోరణియందు, భావప్రకటనా విధానమున సుబ్బారావుగారు క్రొత్త
దారులను జూపించినారు. ఈ క్రొత్తదారులు అభినవాంధ్ర కవికుమారులకు
అనుసరణీయములైనవి. అమలిన శృంగార సిద్ధాంతమును ప్రతిపాదించి, అందుకు
అనుగుణముగా ఒక ఖండకావ్యమును, ఒక లక్షణ గ్రంథమును, ఒక రూపకమును
శ్రీ సుబ్బారావుగారు రచించినారు. తెనుగుతోట, జడకుచ్చులు, తృణకంకణము,
స్వప్నకుమారము మొదలయిన కావ్య నామకరణములందు కూడ సుబ్బారావుగారు
నవ్యతను, సౌందర్య రక్తిని ప్రదర్శించియున్నారు. రచనలయందేగాక
వేషభాషలందుకూడ సౌందర్యరక్తి వీరియందు అడుగడుగున ప్రత్యక్షమగుచుండును.
“ఆ నీల నగరిలో అందాలవాడ- అందాల వాడలో అతి తెల్ల మేడ” అను మాటలను
జ్ఞప్తికి తెచ్చు కవిగారి గృహాంగణము సర్వదా సౌందర్య శోభతో కలకలలాడు చుండును.
సుబ్బారావుగారు ప్రకృత్యుపాసకులు. “మామిడి కొమ్మమీద కల మంత్ర
పరాయణుడైన కోకిలస్వామికి మొక్కి ఈ అభినవధ్వని ధారణ కుద్యమించితిన్”
అని వారు ప్రకృతిని ఇష్టదేవతగా ఉపాసించినారు. తమ ఇంటి ముందు (ప్రేమతో
పెంచుకొన్న ఆ అందమైన మామిడి చెట్టు ఈ సత్యమునే ఉద్దాటించుచున్నది. కావుననే
కాబోలును “ఆ వేద బుక్కులన్- ఆ మంత్ర వాక్కులన్, అంది అందక యున్న
యజ్ఞ పూరుష రేఖ”ను అందుకొను ప్రయత్నమున “తండ్రిజాడ నెరుంగ తల్లి చల్లని
కొంగు” పట్టినానని ఒక సందర్భములో తమ అభిప్రాయమును వివరించినారు.
తమ ఆంధ్రత్వమును గూర్చి ఉప్పొంగిపోవువారు సుబ్బారావుగారు. నిజానికి
ఆంధ్రుల యశోగానము కావించిన కవులందరికి వీరే మార్గదర్శకులు. అంతేకాదు
ఆంధ్ర ప్రాభవమును అతి ఉదాత్తముగ, బహు మనోహరముగ కీర్తించిన నవ్యకవులలో
సర్వవిధాల వీరికి ఉత్తమ స్థానము. రాయప్రోలు వారి ఆంధ్రాభిమానము భారత
దేశాభ్యదయమునకు, జగత్మల్యాణమునకు పరిపోషకమైనదే కాని ప్రతిబంధకమైనది
కాదు. ఆంధ్రదేశ చరిత్రలోని ఉజ్వల ఘట్టములను, మహాపురుషుల ఉదార చరిత్రలను
336
వ్యాస మంజూష
వీరు భావించి ప్రశంసించినారు. “చావలేదు చావలేదు ఆంధ్రుల మహోజ్వల చరిత్ర”
యని జ్ఞప్తి దెచ్చినారు. ఒకనాడు ఆంధ్ర సంతతికే మహితాభిమాన దివ్యదీక్షా
ముఖన్ఫూర్తితీవరించి యుండెనో తిరిగి యీనాడు ఆ మహావేశ మర్ధించి
యాంధ్రులారా! చల్లు డాంధ్రలోకమున అక్షతలు అని ఉద్బోధించినారు. ఈ కవి
వాణియే “వేదశాఖలు పెరిగెనిచ్చట, అది కావ్యం బందెనిచట, బాదరాయణ పరమ
బుషులకు పాదు సుమ్మిది చెల్లెలా” అని తెలిపి “పొగడరా నీతల్లి భూమిభారతిని,
నిలుపరా నీజాతి నిండు గర్వమును” అని ఆదేశించినది. వీరు కృష్ణరాయ నాగేశ్వరుల
భాషాసేవను ఎంత గాఢముగ ప్రస్తుతించినారో, సరోజనీ రవీంద్రుల వాజ్మయ సేవను
అంతగాఢముగా కీర్తించినారు. వేదాంత వేత్తయెన ఆచార్య రాధాకృష్ణులను ఎంత
హృదయపూర్వకముగా కీర్తించినారో భారతదేశ ఆత్మయైన శ్రీ జవహర్‌లాల్
నెహ్రూగారిని అంతే హృదయ పూర్వకముగా ప్రశంసించినారు. కృష్ణా గోదావరి
నదుల నెంతప్రేమతో ఆరాధించినారో గంగామ తల్లినిగూడ అంత భక్తితో
పూజించినారు. స్వరాష్టాభిమానము భారత జాతీయతకు ప్రతిబంధకము కాదనియు,
దానిని భాషోన్మాదముగా భావించుట సహేతుకము కాదనియు, ఆంధ్ర సాహిత్యము
మరియు సుబ్బారావుగారి కవిత్వము స్పష్టీకరించుచున్నవి. తనతల్లిని ప్రేమించనేరని
వాడు పినతల్లికి ప్రియము గావించుట అసంభవము!
సుబ్బారావుగారికి ఆర్ష సాంప్రదాయముమీద అభిమానము మెండు. ఉదార
చరితులయిన బుషులను వీరు పునఃపునః ప్రస్తుతించియున్నారు. ఆదికావ్యమును,
ఉపనిషత్తులను తలచుకొని ఉప్పొంగి “సూత్రయుగముల శుద్ధ వాసన,
క్షాత్రయుగముల శౌర్యచండిమ, చిత్రదాస్యముచే చరిత్రల, చెజగిపోయెవె చెల్లెలా!”
అని ప్రబోధించినారు. అయితే సంఘ సంస్కరణకు కాలానుగుణ్యమైన మార్పులకు
కొందరు సనాతనులవలె సుబ్బారావుగారు వ్యతిరేకులుకారు. అంతేకాదు వారు సంఘ
సంస్కరణను హర్షించి, ఆమోదించిన నిదర్శనాలు స్నేహలత మొదలయిన ఖండ
కావ్యాలలో కన్పట్టుచున్నవి. కుల, మత, వర్గ విచక్షణలను కూడ వీరు తీవ్రముగ
నిరసించి యున్నారు. “కులము దడవక, పొలిమేర గోలపడక, బోయవలె తల్లి
పల్లకీ మోయుమాంధ్ర” అను మాటలు సుబ్బారావుగారి విశాల దృక్పథమునకు
ఉజ్వలోదాహరణలు. అస్పృశ్యతను కూడ వీరు అసందిగ్ధముగ నిరసించియున్నారు..
తెనుగు తోటలో “ప్రేమవృత్తికి ఛండాల భేదమేల, బ్రాహ్మణాగ్రహారము నందు
337
డా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
పవలురేలు, విసరు పవనుండు కడజాతి వీటియందు, తాకలేక వీచెనే పక్షతంత్ర
జడిమ?” అని తెలిపియున్నారు. ప్రాచీన సంస్కృతిపైన, ఆర్ష సంప్రదాయముపైన
అభిమానము కాలానుగుణ్యమగు దేశాభివృద్ధికి నిరోధకము కాదని కవివాణి
స్పష్టీకరించుచున్నది.
సుబ్బారావుగారి కవిత్వమును పరిశీలించినపుడు వారికి తెలుగు సీమమీద,
తెలుగుసీమ సొగసుమీద, తెలుగువారి ఇంటి ఆచారాల సొంపుమీద, తెలుగు మీరిన
గర్వంపు తీరుల మీద అత్యంత అభిమానమని స్పష్టమగుచున్నది. అందుకే
“ఎరుపంచుల పట్టుచీరెలను”, “పసుపద్దిన గళ్ళ రవికెలను” ధరించి “అత్తవారంపిన
తొలి లాంఛనములతో” వరలక్ష్మీ వ్రతము కావించు “క్రొత్త కోడలిని” పసుపు కుంకుమ
పూవులు కొసరి చల్లి, చిన్ని కర్పూర హారతి చేతపట్టి” పాట పాడు ఆడబిడ్డలను
కవిగారు తమ కవితాదర్పణమున సుందరముగా ప్రతిబింబింప జేసినారు.
ఆంధ్రకన్యల అభిమాన క్రీడలయిన కోలాటము మొదలైన వానిని బహు కోమలముగా
ప్రదర్శించినారు.
“చిన్ని బంగారు పూసల చెండ్లవంటి
జొన్న కంకులు పండిన సొగసు చేల
ఎక్కడెక్కడి నుండియో చక్మవచ్చి
వ్రాలు చున్నవి పిట్టలు వేలువేలు”
అని చెప్పునపుడు తెలుగుసీమ యొక్క సొగసు కడు రమణీయముగ
చిత్రితమైనది. “కష్టకమల”లో పల్లెటూరిలోని మధ్యతరగతి తెలుగువారి సంసారము
యొక్క సౌందర్యము ఎంత మనోహరముగ చిత్రితమైనదో చూడుడు; అది
యొకపల్లెటూరు; ఆ పల్లెటూరిలో ఒకానొకచోట మల్లెపందిలి; మల్లెపందిరికి కొంత
దూరాన నున్న నొక తాళదళీ కుటీరము. దానికి చుట్టుపక్కల కందిచాపులు,
చంద్రకాంతపు మొక్కలు, మరి కొంత దూరాన తీగబచ్చలి పందిరి. దానికి సమీపాన
గున్న గోరంట పొదలు, పచ్చచేమంతి మడులు, బంతిపూల కుదురులు, ఇంకొకవైపు
చేదుడు నూయి. ఆ నూయి 'ప్రక్కన వచ్చి పసుపు నూరెడు ఒక బ్రాహ్మణ సాధ్వి-
తలంటు కొరకై ఆమె కూతురు. “చెవుల కమ్మలు పెట్టని చెలువు కొంత, ముక్కు
పుడకలు దీసిన బోసికొంత, చిన్న బోయిన ఆకన్నె వన్నెకొంత” తనకు చెలువుగూర్చగా
జారుముడితోడ వింతసింగార మొలకగా వచ్చు దృశ్యమెంతో రమణీయమైన ఘట్టము!
338
వ్యాస మంజూష
అదే సందర్భమున దగ్గరగా నున్న చిన్న దానిమ్మ చెట్టుపై కూర్చున్న చిలుక దోరగా
పండిన పండు కొరికి మొలక కెంపులవంటి గింజలను రాల్పుట ఎంత మనోహరమైన
దృశ్యము? ఈ సందర్భమున ఆ బ్రాహ్మణి మోముమీది పండువంటి బొట్టును కూడ
కవిగారు వర్ణించక విడువలేదు. ఆడపిల్లలు గోరంట రసమును హస్తములకు
అలంకరించుకొనుట, సాయంకాల సమయమందు పురాణపఠనము కావించుట,
వ్రదోవమైన నంతనే దానికి న్వన్మిచెవ్పుట వొదలయిన ఆచారాలను
సుబ్బారావుగారెంతో సుకుమారముగ చిత్రించినారు. కన్నులకాటుకతో, వేణిలో
జదకుప్పెతో, కంఠాన కాసుల దండతో సుబ్బారావుగారు కథానాయికను అలంకరించి
అచ్చమైన తెనుగు కన్నెగా మనకు చూపించినారు. అరగదంచిన సన్న బియ్యపు
అన్నము, నేతి పోపుపెట్టిన పొట్లకాయకూర, పేరబెట్టిన మీగడ పెరుగుతో గూడిన
కమ్మని శుద్దాంధ్ర భోజనమును రాయప్రోలు వారి కమలమ్మ ఆరగించినది. తెలుగుసీమ
యొక్క సౌందర్యమును ఇంత చక్కగా చిత్రించిన అభినవాంధ్ర కవి మరొక్కరు లేరని
చెప్పవచ్చును.
భాషా విషయమునకూడా తెలుగు పదాల మీదనే సుబ్బారావుగారికి ఎక్కువ
మక్కువ యైనట్లు స్పష్టమగుచున్నది. “జీవన్నవనీతమౌ తెనుగు పాలసముద్రమును
పుక్కిలించిన” తిక్కన్న మీద సుబ్బారావుగారికి అభిమానము. “ఆ యగ్ని వేదికన్-
ఆ శబ్దఘోషలో -ఆ శిష్ట భాషలో - ఉడికింది ఆచిల్క మిడికింది కడునల్మ” అని
తెలుగు భాషను ఒక చిల్మగా భావించి అట్లు ఉడికిపోయిన ఆ చిలుకను తిక్కన్న
అందుకొని గారాబముగ పద్యము చెప్పినట్లు కవిగారు భావించినారు. తెలుగుపదాల
సొగసు సుబ్బారావుగారి కవిత్వము యొక్క ప్రత్యేకత. ఈ పదాలను కూర్చుటలో
వారి కలమునకు మంచి విన్నాణము కలదు. పదాల కూర్చు చెవికి ఇంపుగా
నుండవలెనని రాయప్రోలు కవీంద్రుని ఆశయము. శ్రవణ కఠోరమైన పదజాలము
వారికి ఇష్టము కాదు. శ్రవణ సౌభాగ్యము కొరకు వ్యాకరణ నియమాలను
ఉల్లంఘించిన నిదర్శనాలు, అలంకార శాస్త్ర నియమాలను పాటించని ఉదాహరణలు
కూడ కొన్ని వారి కవిత్వమునందు కన్సించుచున్నవి. భావో త్తరీయము పరచుట,
కవితకు పెండ్లి పందిళ్లు కట్టించుట, జారు చెమ్మటముత్యాల జంపుసరులు, దానిమ్మ
పువువంటి తరుణికెమ్మోవి, గుత్తపు కడియాల కరము, కడుపులో తేనెలు గల కన్నె
పువ్వు, వెన్నెలన్ పేరనిపన్నీటి పువ్వువంటి చక్కని పదజాలము వీరి కవిత్వములో
339
డా/ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
సమృద్ధము. సుబ్బారావుగారికి తమ పినతల్లిమీద మిక్కిలి భక్తి. వారిని ఉత్తేజితులను
గావించినవారిలో ఆ చల్లని తల్లికి ప్రత్యేక గౌరవస్థానము కలదు. ఉదాత్తమైన సంస్కృతి
కల ఆ సాధ్వి యొక్క ప్రభావము సుబ్బారావుగారు ఉపయోగించు పదజాలము
మీదనే కాక, వారు స్వీకరించిన కథా వస్తువుమీద మరియు వర్ణనలమీద కూడ
కన్పట్టుచున్నది.
ప్రకృత్యుపాసకులైన సుబ్బారావుగారు ప్రకృతిని వర్ణించుటలో కూడ ప్రత్యేకతను
చూపించినారు. గోరంటలు, బంతిపూలు, మల్లెపూలు, పాడియావులు వారికి
ప్రేమాస్పదములైనవి.
“పచ్చగిల్లిన వసుమతీ భాగ్యసీమ
నెల్ల యెడల కన్విందుగా నుల్లసిలుచు
పసుపు పూసిన ముత్తెదువల మొగాల
ననుకరించి గుమ్మడి పువ్వు అందమయ్యె.”
అనునది వారి ప్రకృతి వర్ణనా శక్తికి మచ్చు తునక, ప్రకృతిలోని ఒకానొక
సంఘటనను తిలకించి అందుండి ఒక ఉదాత్తమైన భావమును ప్రతిపాదించు నేర్పు
సుబ్బారావు గారి ప్రకృతి వర్ణనలో మరొక ప్రత్యేకతగా కన్పించుచున్ఫది.
“పూల బిడ్డల బ్రీతి నుయ్యాల లూపు
పవను డెరుగడు తొడిమలు వదలు ననుచు
తలపులకు విరుద్ధము లగు ఫలితములకు
బాధ్యులెవ్వరొ, పుణ్య పాపమ్ము లేవా”
అని కొద్దిమాటలలో గొప్ప అర్ధమును వివరించు ఈ పద్యము ఇట్టి వర్ణనల
కొక మంచి నిదర్శనము.
సుబ్బారావుగారు శృంగారమును ఒహు సుకుమారముగ చిత్రించినారు.
“హేమ పాత్రల చందన మెండి పోయె
ద్వారములు మోయు చున్నవి, హారములను
సానలందింకె స్నాన కషాయ గంధ
మబల! యెవని కోసము సగమయి తపింతు?”
340
వ్యాస మంజూష
“చెక్కు చెదరని పాపట చిక్కువడియె
వేణి బంధము శిథిలమై పిరుదు లొరసె
కరగి చెరగిన తిలక రేఖలను తుడువ
వతివ! యెవడాహరించె నీ యాగ్టహృదిని”
“పాలుపొంగిన గతిపొంగు ప్రణయ రక్తి
నాపుకొనలేని పడుచు ప్రాయంబు వగల
నమ్మి ఎవనికి నీ మనమమ్మికొంటి
వువిద! యీ మేఘమాస నవోదయముల?”
అనునది ఆంధ్ర వాజ్మయ మందలి విరహవర్ణనలలో విశిష్టమైనది; బహు
మనోహరమైనది.
సుబ్బారావుగారి కవిత్వములో ' తెలుగుదనము మూర్తీభవించినది. భారత
సంస్కృతి యందలి ఉదాత్తత ఈయన రచనా ప్రవాహమున అంతర్వాహినిగ నున్నది.
అభినవాంధ్ర కవిత్వమునకు మార్గదర్శకులైన సుబ్బారావుగారి రచనల యొక్క
ప్రభావము తరువాత నవ్య కవుల మీద స్పష్టముగా కన్పించుచున్నది. రవీంద్రుని
సాన్నిధ్యము, గోపాలకృష్ణుని సాహచర్యము, లక్ష్మణరావు సహవాసము ముప్పిరి గొని
సుబ్బారావుగారి సారస్వత వ్యక్తిత్వమునకు ఒక ప్రత్యేక శోభను సమకూర్చినది.
అక్కడక్కడ, ముఖ్యముగా స్వప్నకుమారమున గూఢత గోచరించుచున్నది.
భావగాంభీర్యముతో పాటు, భాషా సౌకుమార్యము వీరి కవిత్వములో సరసముగా
సమ్మేళనమైనది.
341
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
దే ష్టశాస్తి
వులపవల్లి కృష్ణశాస్త్రి
ఆధునికాంధ్ర కవులలో కృష్ణశాస్రిగారి దొక విశిష్టమగు స్థానము. నవ్య
కవిత్వముతో పరిచయము గల వారందరికి కృష్ణశా స్రిగారన్నంతనే కొన్ని ప్రత్యేకమైన
భావాలు కలుగుచుండును. ఎందరి మధ్య అయిన ఆసీనుడై యున్నప్పటికిని, తుమ్మెదల
వంటి నల్లని శిరోజములతో చిరునవ్వు పెదవులమీద చిందులాడుచు, పడుచుదనము
ప్రతిబింబించు సుందర వదనముతో, మల్లెపూవు వంటి తెల్లని షర్టు ధోవతులతో
ఒప్పారు ఆయన మూర్తిని జూచి ఆయనతో పరిచయము కలవారందరు, ఆయనను
వెంటనే పోల్చుకొనవచ్చును. ఆయనతో పరిచయము లేక కేవలము ఆయన
కవిత్వమును మాత్రమే రుచిజూచినవారు ఆయనను మొదటిసారి కలుసుకొన్నప్పుడు
ఈయనయేనా కృష్ణశాస్రిగారని ఆశ్చర్యపడుట గూడ జరుగుచుండును. కవిత్వములో
కనుపించు దుఃఖభారము యొక్క ఛాయలు ఆయన మూర్తిలో యెక్కడను కనుపించక
పోవుటయే యీ ఆశ్చర్యమునకు కారణము. ఆయన మూర్తి ఆపాద మస్తకము ఆయన
సౌందర్య ప్రీతిని వ్యక్తీకరించుచుండును. ఆయన సంభాషణ ఆయన యొక్క ప్రేమార్ద
హృదయమును ప్రతిబింబించుచుండును.
కృష్ణశాస్త్రి గారిది విద్వత్కుటుంబము. వీరి పితృ పితామహలు విద్వత్సకాండులైన
కవీశ్వరులు. కృష్ణశాస్త్రిగారి జనకులు పీఠికాపుర ఆస్థానమునందు పూజ్యతను పొందిన
మహా పండితులు; కవులు. కావుననే కాబోలు కృష్ణశాస్త్రి గారు తమ ఖండ కావ్యములో
కలికిపాటల కోయిల కొలము మాది అని పరిచయము గావించుకొనినారు.
నంన్కృతాంథధ్ర భాషల యందలి పాండిత్యమునకు ఆటవ టన
విద్వత్ముటుంబమున జన్మించిన కృష్ణశాస్రిగారికి ఆంగ్లభాషతో గాఢమైన పరిచయము
కలిగినది. బహుశః వారి కుటుంబములో ఆంగ్ల భాషయందు పట్టభద్రులైన వారిలో
కృష్ణశాస్రిగారే మొదటివారేమో? ఆంగ్ల సాహిత్యమును బాగుగా ఆకళించుకొనిన
కృష్ణశాస్రిగారిని షెల్లీ ప్రభృతుల రచనలు ఎక్కువగా ఆకర్షించినవి. షెల్లీ (ప్రభావము
వీరికవిత్వము మీద ప్రస్ఫుటముగా కన్పట్టు చున్నది. ఆంగ్లభాషా పారంగతులైన
స్వర్గీయ రఘుపతి వెంకటరత్నం నాయుడుగారిని తమ గురువుగా కృష్ణశాస్త్రిగారు
భావించుకొనినారు. తమ గురుదేవుని (బ్రహ్మర్షియని కూడ కృష్ణశాస్రిగారు భావించి
గౌరవించినారు. నాయుడుగారు తమ శిష్యునికి ఆంగ్ల సారస్వతామృతము తోపాటు
(బ్రహ్మసమాజమతమును కూడ ప్రసాదించినారు.
342
వ్యాస మంజూష
“ఈ జడ జీవితమ్ము బలికించితి, వీయఘ
పంకమందు నంభోజము మొల్వ జేసితి
వపూర్వము నీదయ, యీ నిశీధి నీరాజన
మెత్తినావు, విపులమ్మగు నీయెద నిండెనే
శరద్రాజిత చంద్రకాంతు, లమృతమ్ములు,
స్వర్గ లతాంత వాసనల్!”
అని తమ గురుదేవులను వారు ప్రస్తుతించినారు.
వీరేశలింగంగారి సంఘ సంస్మరణోద్యమ ప్రభావము గూడ వీరిపై కలదని
తోచుచున్నది. సంఘ సంస్కరణోద్యమము, వ్యావహారిక భాషలను రెండు ఆదర్భాలతో
సారస్వత జైత్రయాత్ర గావించిన గురజాడ మహాకవి కృష్ణశాస్రిగారిని ప్రభావితులను
కావించినారు. నవ్యకవులందరు కృష్ణశాస్రిగారికి ఆప్తులు. వారందరికి కృష్ణశాస్త్రిగారు
'ప్రేమాస్పదులు. సాహితీ సమితి కవులు పరస్పరము వరుసలతో పిలుచుకొనుట
వాడుక. కృష్ణశాస్త్రిగారు చాలామందికి తమ్ముని వరుస. కొందరికి మరది వరుస.
సభాపతి శివశంకర స్వాములకు కృష్ణశాస్త్రిగారు ప్రేమాస్పదుడైన తమ్ముడు. కృష్ణపక్షానికి
శివశంకరస్వాముల వారే పీఠికను వ్రాసినారు. ఈ విధముగ సమకాలిక రాజకీయ,
సాంఘిక, సారస్వత, సాంస్కృతిక ఉద్యమాల (ప్రభావము కృష్ణశాస్త్రి గారి మీద
కన్పట్టుచున్నది. కృష్ణశాస్త్రిగారు మంచి వక్త. సంభాషణా చతురులు, శ్రావ్యముగా
పద్యము చదువగల సమర్థులు. కృష్ణశాస్త్రిగారి పద్య పఠనమునకు ఎంతమంది గల
సభనైనను ఆకర్షించగల శక్తి గలదు. ఆరోజులలో కృష్ణశాస్త్రిగారు అనేక వేదికల
నుండి కమ్మగా పద్యాలను చదివి ఎందరినో ఆంధ్రకవిత్వమువైపు మరలించినారు”.
ఆనాటి యువకులనేకులు కృష్ణశాస్రిగారిచే ప్రభావితులైనారు. ఇది కృష్ణశాస్రిగారిని
గురించి ప్రత్యేకముగా చెప్పవలసిన విశేషము.
తెలుగు కవిత్వములో ఒక విధమైన తిరుగుబాటును కృష్ణశాస్త్రిగారు లేవదీసినారు.
అసలు తమ పుస్తకానికి కృష్ణపక్షమని పేరు పెట్టుటలోనే ఈ తిరుగుబాటు యొక్క
స్వరూపము గోచరించుచున్నది. సమకాలిక విద్వాంసులు కొందరు కృష్ణపక్షముతో
విప్లవమును పసికట్టి, పత్రికలలో విమర్శనలను పుంఖాను పుంఖముగా విరజిమ్మినారు.
“నేటి కాలపు కవిత్వము”లో కృష్ణపక్షము తీవ్ర విమర్శనలకు గురియైనది.
కృష్ణపక్షమునకు సమాధానముగా శుక్ల్షపక్షము అను గ్రంథము వెలువడినది. మొత్తము
343
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
మీద ఎవరు ఏమి ఉలికిపడినప్పటికి ఆధునికాంధ్ర సాహిత్యములో కృష్ణపక్షము
ఒక నూతన అధ్యాయమును ప్రారంభింపజేసినది. తెలుగుదేశములో కృష్ణశాస్రిగారి
అనుయాయులు కూడ చాలమంది బయలుదేరిరి.
కృష్ణశాస్త్రిగారు స్వేచ్భాప్రియులు. ఎటువంటి శృంఖలములుకూడ ఆయనకు
ఇష్టము కావు. కృష్ణపక్షములోని “స్వేచ్భాగానము” అను శీర్షిక ఇందుకు మంచి
నిదర్శనము. “నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు... నా ఇచ్చయేగాక నాకేటి వెపు”
అని కృష్ణశాస్త్రిగారు ఉద్దాటించినారు.
“నావలెనె యాతడున్మత్త భావశాలి
ఆగి కోలేడు రేగు నూహల నొకింత
ఇంత చిరుగేతి యెదని వేగిరించు నేని
పాడుకొనును, తాండవ నృత్యమాడుకొనును”
అని యొకచోట కృష్ణశాస్త్రిగారు తెలిపినారు. ఇందులో నుండి కవిగారి
స్వానుభవము తొంగి చూచుచున్నది. కృష్ణశాస్త్రిగారు తమ రచనలో శబ్దప్రయోగము
నందు ప్రత్యేకతను చూపియున్నారు. “రురులు”, “విహంగములు”, “మేఘములు”,
“రుంరూప్రభంజనములు”, “తారకలు”, “మిణుగురులు” మొదలైన ప్రత్యేక సామగ్రి
కృష్ణశాస్త్రి గారి రచనలో అగుపించుచుండును. సంస్కృత సమాసాలను మరియు
తెలుగు పదములను, ఉపయోగించుటలో కూడ వీరి ప్రత్యేకత గోచరించుచుండును.
పద ప్రయోగము నందు వీరి స్వేచ్భాప్రియత్వము ప్రతిబింబించుచున్న నిదర్శనములు
కలవు. కొన్ని చోటులలో శబ్దస్వరూపము, వ్యాకరణమును, ఛందస్సును కూడ
పాటించని నిదర్శనాలు కలవు. కొత్త ఛందస్సులను గ్రహించుటలో పూర్వ ఛందస్సులను
విశ్చంఖలముగా నడిపించుటలో కృష్ణశాస్త్రిగారు ప్రత్యేకతను చూపించియున్నారు.
ప్రేమ, దుఃఖము కృష్ణశాస్త్రిగారి కవిత్వములో ప్రధానముగా కన్పించుచున్నవి. కరుణకు,
భక్తికి కూడ కృష్ణశాస్రిగారి కవిత్వములో స్థానము కలదు. ప్రవాసము, ఊర్వశితో
పాటు కృష్ణశాస్త్రి గారు మరి కొన్ని ఖండకావ్యములను రచించియున్నారు. వీరి
రచనలలో పల్లకి అను ఖండకావ్యము మిక్కిలి మధురమైనది.
ప్రాణ సఖుడె నాకోసమై పంపినాడు
344
పల్లకీ అన హృదయమ్ము జల్లుమనియె
వీడని వియోగమున వేగు మోడుమేను
తలిరు తోరణమై సుమదామ మాయె
ఓ యనగ నోహో యన బోయవాండ్రు
తోట పొలిమేర కాలువ తొనకె నిదుర
ఓ యనగ నోహో యన బోయవాండ్రు
దారిబడి నిల్చిచూచి రూరూరు నాడు
ప్రణయ వల్లకి పల్లకీ
ప్రసవభర వసంత వల్లిక పల్లకీ
చక్ర చాప వక్రరేఖ పల్లకీ
మధు స్వప్నశాఖ పల్లకీ.
అని చదువునప్పుడు పాఠకులు స్వయముగా పూల పల్లకిలో ఊరేగుచుందురు.
వారి రచనలలో భావము ఉత్కటముగా హృదయమునుండి దూసుకుని వచ్చును.
కృష్ణశాస్త్రిగారి రచనలను పరిశీలించినపుడు పరిమాణములో వారి సాహిత్యము
కొద్దిదనియే చెప్పవచ్చును. మూడు నాలుగు దశాబ్దాల వయసు కలిగిన కృష్ణశాస్రిగారి
కలము నుండి రెండు మూడు చిన్న సంపుటాలకన్న ఎక్కువ సారస్వతము
వెలువడలేదు. ఇది ఆంధ్ర పాఠక లోకమునకు ఆశాభంగము కలిగించు సంగతి.
కృష్ణశాస్రిగారి సమకాలికులలో బహు గ్రంథకర్తలైన ప్రతిభావంతులు అనేకులుకలరు.
కొన్ని సంవత్సరాల నుండి కృష్ణశాస్త్రిగారి కొత్త రచనలను చవిచూచు భాగ్యము
పాఠకులకు కలుగలేదు. ఒకనాడు సాహితీ గగనమున ముఖ్య తారగా ప్రకాశించిన
కృష్ణశాస్త్రి గారు దీర్ధమౌనము దాల్చినారు. ఈ మౌనమునువారు విడనాడి సాహితీ
రంగమున పునఃప్రవేశము గావించి ఆంధ్ర శారదను అమూల్యాభరణములతో
అలంకరించ వలెనని ఆంధ్ర పాఠక లోకము ఆకాంక్షించుచున్నది.
345
భక్తి తత్స కవులు - సామాజిక భూమిక
(తొలిముద్రణ : 1981)
భక్తి తత్స కవులు - సామాజిక భూమిక
తెలుగు సాహిత్యంపై మరోచూపు' ప్రసరించిన తర్వాత “సారస్వత వేదిక
నిర్వాహకుల మనస్సులలో కొన్ని ఆలోచనలు తల ఎత్తినవి. తెలుగు సాహిత్య చరిత్రలో
స్థానం పొందని సాహిత్యాన్ని గూర్చి, విశేషించి కవితనుగూర్చి మాట్లాడుకుంటే
బాగుంటుందనే ఆలోచన సహజంగా కలిగింది. ఆ ఆలోచనకు అనుగుణంగానే
1981-1982 కార్యక్రమాన్ని రూపొందించడం జరిగినది. తెలుగులో తొలి సమాజ
కవుల రచనలను యీ సంవత్సరం స్మరించుకోవడం సముచితం అని అనుకున్నాము.
భక్తీ, తత్త్వము యీ సమాజ కవుల రచనలలో ప్రముఖంగా కనిపిస్తున్నవి. ఈ
రచనలను గురించి పండితులు అంతగా పట్టించుకున్నట్లు లేదు. కవులుగా వారికి
సాహిత్య చరిత్రలో తగు స్థానం లభించినట్లు లేదు. అందుచేత వీరిని యీ వేదికమీద
స్మరించుకోవడం గడచిన రెండు సంవత్సరాల వేదిక కార్యక్రమాల సహజ
పరిణామమేనని చెప్పవచ్చును. నిస్సందేహంగా వీరందరిని “సమాజ కవులుగా
పేర్కొనవచ్చును. సమాకాలీన పరిస్థితులు, సమాజం వీరి రచనలలో ప్రతిబింబిస్తున్నవి.
“నిరుపహతిస్థలంబు, రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చు క
ప్పురవిడె, మాత్మ కింపయిన భోజన, ముయ్యెలమంచ మొప్పు త
ప్పరయురసజ్ఞు, లాహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్
దొరికినంగాక యూరక కృతుల్ రచియింపు మనంగ శక్యమే”
అన్న వేవియు కాంక్షించని కవులు వీరు.
ఈ సంవత్సర కార్యక్రమంలో నేటిది మొదటి ఉపన్యాసం. 'భక్తితత్త్వ కవులు
- సామాజిక భూమికి అన్నది యీనాటి ప్రసంగం యొక్క శీర్షిక. రాబోవు నెలలలో
జరుగబోయే ఉపన్యాస పరంపరకు నేటి ప్రసంగ మొక తొలిపలుకు వంటిది. ఈ
తొలిపలుకు రచించమని మిత్రులు రంగనాథాచారిగారు కోరినారు. కష్టపడి చదువుకొని
డాక్టరేటు పట్టం పొందిన విద్వాంసులు రంగనాథాచారిగారు. బహు గ్రంథావలోకనం,
అనేక విషయాలను గూర్చిన పరిజ్ఞానం, స్వతంత్రమైన ఆలోచన, నిరంతర పరిశోధనా
349
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
వ్యాసంగం, వక్షృత్త్వశక్తి, రచనాశక్తి కలిగిన రంగనాథాచారిగారు కవిత్వము రాసినట్లు
కానరాదు. భావుకత ఉన్నా భావోద్రేకం ఆయనలో లేదనుకుంటాను. అయితే
ఉపన్యాసం నన్ను చేయమని కోరినప్పుడు ఆయన కొంత భావో ద్రేకానికి
లోనయినారని తోచినది. మిత్రులు చెప్పిన మాటను కాదనలేకపోవడం నాకున్న
దౌర్చల్యాలలో ఒకటి. అందుచేత నా సామర్థ్యాన్ని గురించి ఆలోచించక యీ భారాన్ని
నెత్తిన పెట్టుకోవడం జరిగింది. అయితే ఆధారాంశాలను సేకరించడంలో
రంగనాథాచారిగారి తోడ్చాటు పూర్తిగా లభించినది. అందుచేత బరువు మోసినది
ఆయన. గౌరవము దక్కినది నాకు అన్న రహస్యం మీకు చెప్పవలసి ఉంటుంది.
మన ఆధునికాంధ్ర కవివర్యుడు ఎన్నడో రాసిన ఒక పద్యంలో 'తెలుగు కన్నియ
ముంగురులు పాయలు పాయలుగా విడిపోయిన వన్నాడు. ఆయన ఏ అభిప్రాయంతో
యీ మాట అన్నప్పటికిని తెలుగు సాహిత్యమేకాదు, సమస్త భారతీయ సాహిత్యం
పాయలుగా విడిపోయినది. నాటి నుండి యిటీవలి వరకు రెండు పాయలను మనం
స్పష్టంగా పోల్చుకోవచ్చును. పాలకులు, వారి ఆశ్రయంతో గ్రాసవాసోదైన్యంలేక
సుఖజీవనం గడిపిన విద్వాంసులు సృజించిన సాహిత్యం ఒక పాయ. పాలకులతోనూ,
పండితులతోనూ, వారి ఆదరణతోనూ, అనుగ్రహంతోనూ సంబంధం పెట్టుకొనక,
అప్పుడప్పుడు వారి ఆగ్రహానికి కూడా గురియై, సహజ ప్రతిభ కలిగిన రసార్ద
హృదయులు సృజించిన సాహిత్యం మరొక పాయ. మొదటి పాయ పాలకుల
సాహిత్యమంటే, రెండవ పాయ ప్రజల సాహిత్యమని చెప్పవచ్చును. ఈ విభజన
సాహిత్య రంగంలోనే కాదు, యితర కళా రంగాలలో కూడా మనకు స్పష్టంగా
కనిపిస్తున్నది. ఇది ఒక్క తెలుగు దేశంలోనేకాదు, భారతదేశంలోని అన్ని
ప్రాంతాలలోనూ గోచరిస్తున్నది.
లిపులు భిన్నమైనప్పటికిని భారతీయ సాహిత్యమంతా ఒకటేనన్న సూక్తి
సుప్రసిద్ధమైనది. స్థూల దృష్టితో పరిశీలించినా యీ సూక్తిలోని సత్యం స్పష్టం కాగలదు.
తమిళం వంటి సారస్వతానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికిని, ఒకటి రెండు శతాబ్దాల
వ్యత్యాసంతో భారతీయ భాషా సాహిత్యం; రామాయణ భారతాలు, ఫారసీ అరబ్బీలు,
ఆపైన ఇంగ్లీషు, ఇటీవల (ఫ్రెంచ్ రష్యన్ మొదలైన భాషలు భారతీయ సాహిత్యాన్ని
ప్రభావితం చేసినవి. అదేమి చిత్రమోకాని ఆనాడు శాక్య రాజ్యానికి వారసుడు
కావలసిన గౌతముడు రాజ్యాన్ని విడిచి సమాజ శ్రేయస్సు కొరకు ఆత్మార్పణం
గావించడానికి కారణభూతాలైన రోగగ్రస్త దరిద్ర దృశ్యాలు భారతదేశంలో ఏ
350
భక్తి తత్త్వ కవులు - సామాజిక భూమిక
పట్టణానికి, ఏ పల్లెకు వెళ్ళినప్పటికిని మనకు వీధివీధిని వాడవాడలో యీనాడూ
కనిపిస్తూనే ఉన్నవి. గడచిన కొన్ని శతాబ్దాలలో, దశాబ్దాలలో కొన్ని దేశాలు యీ
దృశ్యాలు గోచరించని సమాన సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నవి. సత్వర భవిష్యత్తులో
భారతదేశానికి యిటువంటి అదృష్టం పట్టునా అన్న ప్రశ్న ఉత్పన్నమౌతున్నది.
“అవియున్ గుండెలు జాతికై నం గనుమన్నా! విశ్వదైన్యమ్ము, చా
లవు నీర్వెట్టంగ వేయికన్నులు, భుజాలక్షల్ వలెన్ బాపకూ
పవిపన్నాత్ముల నుద్ధరింప, వెతంబాపన్, సేదంబోకార్ప, మై
నివురన్, బాప్పజలమ్ముం బోందుడుపం దండ్రీ! లెమ్ము సబ్ఞుండవై'
అన్న కవి మాటల వెనక మన చరిత్ర, మన సమాజం తొంగిచూస్తున్నది.
అక్షరాస్యత, సుఖజీవనం కొద్దిమందికే లభించిన సదుపాయం కాగా - అత్యధిక
సంఖ్యాకులు గ్రాసవాసో దైన్యానికి గురియైన సమాజంలో సాహిత్యం, కళలు, కవిత్వం
రెండవ పాయగా ప్రవర్థమానమైనది. దీని వెనుక ఉన్న చరిత్ర మత, సాంఘిక,
రాజకీయ పరిస్థితులను మనం గుర్తించవలసి ఉంటుంది.
ఆదిమ కాలంనుండియే ప్రపంచంలో కవిత్వం యితర కళలతోపాటు
ఆవిర్భవించినది. పూర్వకాలంలో, లిపికూడా బాగా పరిణతి చెందని కాలంలో మన
కళలు, సాహిత్యం సామూహికంగాను నోటి మాటగాను, పాటగాను ముందడుగు
వేసినవి. అనాదినుండి చరిత్ర, మతం, విశ్వాసాలు మొదలైనవన్నీ సాహిత్యంలో
ప్రతిబింబితమైనవి. అందుచేత మానవ సమాజంయొక్క ప్రగతితోపాటు సాహిత్యం
ముందడుగు వేసినది. పూర్వకాలంలో కవిత, పాట, నృత్యం అన్నింటిని జనులు
గుంపులుగా రూపొందించి ఆనందించిరి. తీరిక వేళలలో ప్రజలు ఆటపాటలతో
కాలక్షేపం చేస్తూ గొంతెత్తి పాడిన పాటలలో కవిత్వం పుష్కలంగా కనిపిస్తున్నది.
మన సమాజం శతాబ్దాలనుండి, సహస్రాబ్దాల నుండి రెండుగా చీలిపోయిన
సత్యం ఎవరూ కాదనడానికి వీలులేదు. చెమటోడ్చి కష్టించి పనిచేసే వర్గం ఒకటి,
హాయిగా సుఖజీవనం గడిపే అల్బసంఖ్యాకవర్గం మరొకటి. వ్యాకరణం, అలంకారం
ఛందస్సులపై ఆధారపడ్డ సాహిత్యాన్ని యీ అల్పసంఖ్యాకవర్గం సృష్టించగా, తమ
దైనందిన జీవితంయొక్క అనుభవంపై ఆధారపడి తమ నాల్మలమీద నాట్యమాడే
శబ్దజాలాన్ని ఉపయోగించి అత్యధిక సంఖ్యాకులు ఆటల్లో పాటల్లో తమ హృదయాలను
ప్రతిబింబింప జేసినారు. ఈ ప్రతిబింబమే ప్రజల సాహిత్యంగా జానపద, నృత్య,
కళారీతులుగా ప్రవర్ధమానమైనది.
351
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
కడుమదేశాల చరిత్ర అట్లుంచి భారతదేశ చరిత్రను పరిశీలించితే సమాజంలోని
రెండు వర్గాలు ప్రాచీనకాలం నుండియే గోచరిస్తున్నవి. క్రీస్తుశకం ప్రారంభం నుండియే
సమాజంలో యిరువర్గాలు మనకు గోచరిస్తున్నవి. ఒకవైపున -రాజులు, మహారాజులు,
చక్రవర్తులు వారి కొలువులో వారితో సమానమైన రాజభోగాలు అనుభవించిన కవులు,
విద్వాంసులు, గౌతమ బుద్దుని కదలించిన దృశ్యాలను ఏమాత్రమూ గమనించని
సాహిత్యం, అందులో శృంగారం మేరమీరి పాండిత్య శౌండీర్యం కలిగిన సాహిత్యం,
ఒకటి రూపొందగా - మరొకవైపున సాధారణ జనులు తమ భాషలలో పాడుకున్న
పాటలు జానపద సాహిత్యంగా రూపొందింది. ప్రాచీన కాలంలో సంస్కృతంలో
మన సాహిత్య రచన జరిగినది. అది చదువుకున్న వారిమటుకే పరిమితమైనది.
ఈనాడుగూడా అక్షరాస్యుల సంఖ్య నూటికి ముప్పయి మించని మన దేశంలో ఆనాటి
నిరక్షరాస్యతను సులభంగా ఊహించవచ్చును. అక్షరాస్యులుకాని యీ జనసముదాయం
తమ తమ భాషల్లో పాటలు పాడుకునేది.
భారతదేశంలో అనేక మత, సాంఘిక ఉద్యమాలు వచ్చినవి. జైనులు, బౌద్ధులు
తొలి ఉద్యమాలకు నాయకులు; నాటి మత సాంఘిక వ్యవస్థపైన బౌద్ధ జైనాలు
తిరుగుబాటు చేసినవి. వారు తమ అభిప్రాయాలను జనసామాన్యంలో ప్రచారం
చేయడానికి పాలి, ప్రాకృత భాషలలో రచనలు గావించినారు. తరువాత వచ్చిన
భక్తి ఉద్యమ నాయకులుగూడా సంస్కృతంలోగాక జనుల భాషలలో తమ ఆశయాలకు
అనుగుణమైన సాహిత్యాన్ని నిర్మించినారు. ఈ విధంగా సంస్కృతం ఉన్నత వర్గాల
భాషకాగా, దేశీయ భాషలు జనసామాన్యం యొక్క భాషలుగా సాహిత్య రంగంలో
ముందడుగు వేసినవి.
నన్నయకు ముందునుండియే తెలుగుభాష రెండు పాయలుగా చీలినట్లు
కనిపిస్తున్నది. మొదటిది పండితులు ఉపయోగించిన కావ్యభాషకాగా, రెండవది
జన సామాన్యం పాడుకున్న పాటలకు ఆటపట్టెన వ్యవహారభాష యైనది. పండితులు
కావ్య భాషలలో సంస్కృత వృత్తాలను, వ్యాకరణ సూత్రాలను, అలంకారశాస్త్ర
ఆదేశాలను పాటించగా అన్నమయ్య మొదలైనవారు సాధారణ జనులకు
అందుబాటులో ఉండేరీతిగా తమ రచనలను కొనసాగించినారు. ఈ సందర్భంలో
ఆధునిక కవి ఒకరు తెనుగును చిల్మతో పోలుస్తూ రాసిన గేయపంక్తి ఒకటి నాకు
జ్ఞప్తికి వస్తున్నది.
352
భక్తీ తత్త్వ కవులు - సామాజిక భూమిక
పుట్టింది ఒక చిల్క
పొలము పచ్చల బైట -
పొరలు పాకల నాట -
అల్లారు ముద్దుగా - అందాల హద్దుగా.... పుట్టింది ఒక చిల్క
పెరిగింది ఆ చిల్క
పిండివెన్నెల సీమ -
పిల్ల తెమ్మెర లోన
పూబొత్తికలలోన - పోకిళ్లు కలలీన
త్రావింది ఆ చిల్క
తళుకు తీవెల రాలు -
తరిపి రంగుల పాలు -
పక్షాలు పచ్చగా - పలువన్నె లెచ్చగా
చవిజూచె నా చిల్క
చల్ల వెన్నెల రేల -
చందమామల మోల -
పండుటాకుల జున్ను - వెండిగిన్నెల వెన్న
ఆడింది ఆ చిల్క
అలరు మావుల నీడ -
ఆడు బిడ్డలతోడ -
ఆబాల గోపాల - మానందమున సోల
పలికింది ఆ చిల్క
తెలుగు మీటి మరంద
మలుగు వాజి - నమంద
సౌందర్య మూరగా - సారస్య ధారగా
నేర్చింది ఆ చిల్క
నిండు కమ్మదనాలు
పండ్ల పక్వరసాలు
పొంగారు పదములన్ - బంగారు ఫణతులన్
353
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
వినిపించె నా చిల్క
తెనుగు వాకిండ్లలో -
పెనుగు పూచెండ్లలో -
మిసలాడు మవ్వాల - అసియాడు అందాల
పాడితే ఆ చిల్క
పారవశ్యము పొంగు
భావదాస్యము క్రుంగు -
తెగిపోవు వీణియల్ - దిగివచ్చు వాణియున్
విన్నారు జనులెల్ల
విన్నారు పండితుల్
విన్నారు పాఠకుల్
భూచక్ర ముల్మగా - ఆ చిల్క పల్మగా
బ్రహ్మాండ మయినట్టి
భాష్యాలు తుదిముట్ట -
పఠియించె నొక భట్టు
పాండిత్యమున వచో - భాండంబు బరువెక్క
ఆ చిల్క నుడికార
మావేశ మెగబోయు -
ఆలించి వలవేయు
పరవశంబున జిక్కి - పరతంత్రతనె యెక్కె
తెలుపారె తూర్చెల్ల
తెనుగు కుంకుమ తీగ -
లనుగు కొమ్మలు సాగె -
ఎలుగెత్తె నా చిల్క - అలవాటు మైకుల్క
ఆ యగ్ని వేదికన్
ఆ శబ్ద ఘోషలో
ఆ శిష్ట భాషలో
ఉడికింది ఆ చిల్క - మిడికింది కడు నల్క
354
భక్తి తత్త్వ కవులు - సామాజిక భూమిక
'మ్రాగన్ను పెట్టింది
మధుర కంఠము మూసి -
మనసు ముచ్చట రోసి -
గాసిల్లి గాసిల్లి - ఆసించె తొలి యిల్లై
భారతారణ్యాన
పడిపోయెనా భట్టు -
విడిపోయి వాకట్టు -
ఇదె సందనుచు చిల్క - యెగిరి పోయింది.
ఈ గేయంలో సంస్కృత భాషా ప్రభావం వలన తెలుగుభాష ఏ విధంగా
ఉక్కిరి బిక్కిరి అయినదో వెల్లడి అవుతున్నది. సంస్కృత భాషా ప్రభావం ఒక్కతెలుగు
మీదనే కాదు, యితర దేశ భాషల మీద కూడా అత్యధికంగా పడినది. తెలుగులోను,
దేశభాషలలోను ప్రావీణ్యం కావలెనంటే సంస్కృతంలో పాండిత్యం తప్పని సరియైన
పరిస్థితి కలిగినది. అందుచేత జనసామాన్యం యొక్క సాహిత్యం మరొక పాయగా
రూపొందక తప్పలేదు. i
సంస్కృతంతోపాటు, రామాయణ, భారత, భాగవతాలు భారతీయ సాహిత్యాన్ని
ప్రభావితం చేసినవి. రామాయణ, భారత, భాగవతాలు విశ్వజనీనములై సామాజికంగా
ఉన్నత ఆశయాలు కలిగిన గొప్ప రచనలు. కాని యితర కావ్యాలను గురించి యీ
మాట చెప్పడానికి వీలులేదు. సంస్కృత భాషా ప్రభావానికి లోనైన యితర కావ్యాలు
భారతదేశంలోని అన్ని భాషలలోను కొద్దిమందికి మాత్రమే పఠనయోగ్యములైనవి.
చదువురాని జనసామాన్యం రామాయణ, భారత, భాగవత ప్రభావానికి లోనైనప్పటికిని
యితర కావ్యాల ప్రభావానికి లోనుకాలేదు. తెలుగులో రాజులు, జమీందారుల
పోషణలో సుఖజీవనమేగాక విలాస జీవనం గడిపిన కవులు వ్రాసిన కావ్యాలు
జనసామాన్యానికి ఏమాత్రం ఉత్తేజాన్ని కలిగించలేక పోయినవి. రామాయణ, భారత,
భాగవత కథలువిన్న జనసముదాయం ఉత్తేజం పొంది యిందులోని కథలను
యితివృత్తాలను కొన్నింటిని మార్చి హాయిగా తమ అభిరుచులకు అనుగుణంగా
పాడుకున్నారు. ఊర్మిళాదేవి నిద్ర, లక్ష్మణదేవర నవ్వు కుశలవ కుచ్చల కథ, సులోచన
కథ, ధర్మరాజు జూదం మొదలైనవి యిందుకు నిదర్శనం.
355
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
జైనము, బౌద్ధము ఆనాటి నమాజ వ్యవస్థపై తిరుగుబాటుచేనిన
ఉద్యమాలన్నమాట అందరికి తెలిసినదే. ముఖ్యంగా కులవ్యవస్థపైన, సమాజంలోని
వ్యత్యాసాలపైన జైన, బౌద్ధాలు ధ్వజమెత్తినవి. కొంతకాలం జైన, బౌద్దాలు బాగా
వ్యాప్తిచెందినప్పటికిని క్రమక్రమంగా వాని ప్రభావం కూడా సన్నగిల్లినది. ద్వైత,
అద్వైత, విశిష్టా ద్వైతాలు వీనిని ఎదుర్మొన్నటువంటి ఉద్యమాలు. ఈ ఉద్యమాల
ఆవిర్భావం, వ్యాప్తి, ఉన్నతి, క్షీణదశల వివరాలు యేమైనప్పటికిని ఎన్నడో ప్రారంభమై
క్రమక్రమంగా బలపడి బాగా వేళ్లు పాతుకుపోయిన కులవ్యవస్థ యీనాటికిని మన
సమాజంలో సుస్థిరంగా నిలిచి ఉన్నది.
నేటి రాజకీయాలలో ముఖ్యంగా ప్రజాస్వామిక సామ్యవాద సరళి సమాజ
వ్యవస్థలో కూడా, యీ కులప్రాతిపదిక ఎంత ప్రబలమైన శక్తిగా ఉన్నదో అందరి
అనుభవానికి వచ్చిన వాస్తవం. కులముపైన, యితర సాంఘిక దురాచారాలపైన
తిరుగుబాటు ఉద్యమాలు కొన్ని, జైన, బౌద్ధాలు బలహీనమైన తర్వాత కూడా వచ్చినవి.
ఈ తిరుగుబాటుల ఆధారంగా కొంత సాహిత్యం ఆవిర్భవించి ప్రజలలో వ్యాప్తి
చెందినది. విశిష్టా ద్వైతాన్ని బాగా ప్రచారం చేసిన రామానుజుడు కుల వ్యవస్థను
నిరాకరించి హరిజనులకు సమాజంలో సమాన ప్రతిపత్తి కలిగించిన సంఘ సంస్కర్త.
సంఘ సంస్కర్తలలో యీయన అగ్రణ్యుడని చెప్పితే అతిశయోక్తి కాజాలదు. శైవం
కూడా యిదేవిధంగా కులవ్యవస్థను నిరాకరించినది. ఈ ఉద్యమాలన్నీ భారతదేశ
మంతటా వ్యాపించి జనులలో బాగా ప్రచారానికి వచ్చి ప్రజాసాహిత్య నిర్మాణాన్ని
ప్రోత్సహించినవి. భక్తి ఉద్యమాలు మధ్యయుగంలో సమాజంలోని పేదవర్గాలను,
కింది కులాలను ప్రభావితం చేసినవి. సాంఘిక ఆచారాలకు, కర్మకాండలకు ప్రాధాన్యం
యీయని యీ భక్తి ఉద్యమాలు, సమాజంలో సమానత్వాన్ని ప్రతిపాదించి పుట్టుకతో
ఎవరికీ ఆధిక్యత రాదనీ, లేదనీ, ఉద్దాటించి మతంపేరిట ఆచరణలోనికి వచ్చిన
దురాచారాలను, మౌధ్యాలను తొలగించవలెనని ప్రచారం చేసినవి. భగవంతుని ఎదుట
మానవులందరు సమానమని, భక్తి అందరికి సమానమని యీ ఉద్యమాలు
ఉద్దాటించినవి. హరిజనులు కూడా యీ ఉద్యమాలలో పాల్గొన్నారు. స్రీలు కూడా
పాల్గొన్నారు. ఆండాళు, అక్కమహాదేవి, మీరా యిటువంటి గ్రీలలో ముఖ్యమైనవారు.
ఈ అభిప్రాయాలు, యీ ఉద్యమాలు అన్ని ప్రాంతాలలో వచ్చి అన్ని దేశభాషలలో
జనసాహిత్యాన్ని సృజించినవి. ఈ విధంగా రెండవ పాయయైన ప్రజల సాహిత్యం
ఆవిర్భవించి వ్యాపించి వర్ధిల్లినది.
356
భక్తి తత్త్వ కవులు - సామాజిక భూమిక
భారతదేశ చరిత్ర పరిశీలించినప్పుడు గుప్త సామ్రాజ్యం అంతరించిన తర్వా
తరాజకీయపరిస్థితులు కూడ దేశభాషలలో సాహిత్యం రెండు పాయలుగా చీలిపోయి
వ్యాపించడానికి కారణాలను వివరిస్తున్నది. ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం లేకపోవడం,
సకల భారతస్థాయిలో కేంద్ర ప్రభుత్వం సమాజ శ్రేయస్సును గురించి ఆలోచించి
ప్రజల అభ్యుదయానికి కావలసిన పనులు చేయకపోవడం, మనకు భారతదేశ చరిత్ర
తెలుపుతున్న సత్యం. భారతదేశంలో ఎన్నో సామ్రాజ్యాలు వచ్చినవి. కొంతకాలం
దేశాన్ని పాలించినవి. మహ్మదీయులు, మొగలులు దండయాత్రలు గావించి సుస్థిర
ప్రభుత్వాలను ఏర్పాటుచేని దేశాన్ని వరిపాలించినారు. కాని ఆసేతు
హిమాచలపర్యంతమైన యీ దేశంలో, వివిధ భాషలు మాట్లాడుతున్న ప్రజలు కల
యీ దేశంలో ఆర్థికమైన యిబ్బందులకులోనై అత్యధిక సంఖ్యాకులు కనీస సౌకర్యాలకు
నోచుకోని యీ దేశంలో, సాంఘికంగా అనేక దురాచారాలకు, మూఢ విశ్వాసాలకు
గురియైన జనసముదాయంకల యీ దేశంలో, ఆర్థికంగా, సాంఘికంగా అత్యధిక
సంఖ్యాకుల, అత్యధిక శ్రేయస్సును లక్ష్యంగా పెట్టుకొని 'సర్వేజనా స్సుఖినో భవంతు”
అన్న ఆదర్శానికి అనుగుణంగా పరిపాలనను సమర్ధవంతంగా నిర్వహించిన రాజకీయ,
పరిపాలక వ్యవస్థలేక పోయినది. కేంద్ర ప్రభుత్వాలు కొన్ని నూర్ల సంవత్సరాలు
పరిపాలించినప్పటికిని వెనుకబడిన ప్రజల (శ్రేయస్సు గురించి ఆలోచించిన
ఉదాహరణలు ఎన్ని అన్న ప్రశ్నకు ప్రత్యుత్తరము చెప్పడము కష్టమే! తత్ఫలితంగా
చిన్న చిన్న రాజ్యాలు, చిన్న చిన్న ప్రాంతీయ పరిపాలక వ్యవస్థలు, నాయకులు
దేశపరిపాలనను నిర్వహించడం జరిగింది. వీరిమధ్య కలహాలు, యుద్దాలు చెలరేగినవి.
సాధారణ ప్రజలను గూర్చి పట్టించుకున్నవారు లేకపోవడం వల్ల గౌతమబుద్దుని
నాటి దృశ్యాలే యీ నాటికి దేశంలో సర్వత్రా కనిపిస్తున్నవి. మతము పేరిట అనేక
దురాచారాలు ప్రబలి, ఆరోగ్యకరమైన సంఘజీవనానికి ప్రతిబంధకములైనవి.
సాహిత్యము, కళలు రెండుపాయలుగా విడిపోవడం అనివార్యమైనది.
దేశంలో పైన పేర్కొన్న పరిస్థితులు వ్యాపించియుండగా సాధారణ జనులు
వివిధ వృత్తులను తమ జీవనాధారంగా చేసుకున్నారు. వీరిలో స్వతంత్ర భావాలు
వ్యాపిస్తూ ఉండేవి. ఇటువంటి స్వతంత్రభావాలు తిరుగుబాటు ఉద్యమాలకు దోహదం
చేసినవి. ఈ స్వతంత్రభావాలకు భక్తి ఉద్యమం కూడా ఆలంబనమైనది. మహ్మదీయ
రాజులకాలంలో కొందజు మహ్మదీయ మతం స్వీకరించినప్పటికిని ఆర్థికంగా వారి
357
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
పరిస్థితులు కూడా మెరుగుపడలేదు. హిందూసమాజంలోని ఆర్థిక అసమానతలు
వారినికూడ పీల్చి పిప్పినిచేసినవి. అందుచేత యీ భక్తి ఉద్యమాలు కింది
కులాలవారిని, మహ్మదీయ మతంలో చేరినవారిని కూడా ఆకర్షించినవి. కులభేదాలు,
మతభేదాలు కూడదన్న భావాలతో భక్తి ఉద్యమం వివిధ రూపాలలో దేశమంతటా
ప్రచారం పొందినది, తెలుగుదేశంలో అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మం, సిద్దప్ప
మొదలైన కవులు యిటువంటి భావాలను ప్రచారం చేసినారు.
బౌద్ధం క్షీణదశకు చేరినతర్వాత శంకరుడు, కుమారిలభట్టు బౌద్ధాన్ని దెబ్బగొట్టి
అద్వైతమతాన్ని ప్రచారం చేసినారు. అయితే వీరిది జ్ఞానప్రధానమైన మార్గం.
అందుచేత చదువుకున్న కొంతమందినే ఆకర్షించినది. తర్వాత నాధ సంప్రదాయం
దేశంలో మొదలై ప్రజలను తమవైపు అభిముఖులను చేసుకున్నది. ముఖ్యంగా
మహారాష్ట్ర ప్రాంతంలో యీ సంప్రదాయం బాగా వ్యాపించినది. అందుకు కారణం
యీ సంప్రదాయం కర్మకాండలను, మూఢాచారాలను, కుల వ్యవన్గను
వ్యతిరేకించడమేనని చెప్పవచ్చును. క్రమక్రమంగా శైవ, వైష్ణవాలు, సూఫీమతం
మొదలైన ఉద్యమాలు బయలుదేరి ప్రజలను తమవైపు అభిముఖులను చేసుకున్నవి.
దక్షణాదిలో వైష్ణవమతం భక్తిమార్గాన్ని బాగా ప్రచారం చేసింది. సంత్ భక్తిమార్గంలో
కులభేదాలేకాక హిందూ, ముస్లిం భేదాలు కూడా లేవని బోధించడం జరిగింది. ఈ
విధంగా సంత్ మార్గం, నాధ మార్గం, శైవ, వైష్ణవాలు దేశమంతటా వ్యాపించి
జనసామాన్యాన్ని బాగా ఆకర్షించినవి. ఇవన్ని కూడా ఉన్నతవర్గాల సంస్కృతి
పైనవచ్చిన తిరుగుబాటు ఉద్యమాలే అని చెప్పవచ్చును. ఈ ఉద్యమాల ప్రభావం
సాహిత్యం పైనకూడా స్పష్టంగా కనిపిస్తున్నది. సామాజికంగా, విడివిడిగా ఉండిన
జనులకు యీ ఉద్యమాలన్ని దగ్గరగా వచ్చినవి. వారు కొంత సంఘటితం కావడానికి
కూడా యీ ఉద్యమాలు తోడ్చడినవి. తమతమ వృత్తులను అనుసరిస్తూ కుటుంబ
జీవనానికి దూరంకాకుండా యీ ఉద్యమాల ద్వారా ముఖ్యంగా భక్తి ఉద్యమాల
ద్వారా సమాజానికి దారి చూపించినారు. కబీరు, తుకారాం, రైదాస్, వీరబ్రహ్మం,
సిద్దప్ప కుల నిరసనతోపాటు హిందూ, ముస్లింల సమైక్యత కూడా యీ భక్తిమార్గంలో
మనకు కనిపిస్తున్నది. ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలను వ్యతిరేకించడమే యిందుకు
కారణమని మనం అనుకోవచ్చును. కులభేదాలు పోవలెనని, మిధ్యాడంబరాలు
కూడదని కబీరు ఎలుగెత్తి చాటినాడు. హిందూ, ముస్లింల సమైక్యతను బోధించినాడు.
358
భక్తి తత్త్వ కవులు - సామాజిక భూమిక
కర్మకాండలను, మూఢవిశ్వాసాలను ఖండించవలెనని బసవేశ్వరుడు నొక్కి చెప్పినాడు.
సామాజిక దృక్పథం, సంఘసంస్కరణ దృక్పథం భక్తిమార్గంలోను, విశేషించి పైన
పేర్కొన్న ఉద్యమ నాయకుల సుభాషితాలలోను స్పష్టంగా కనిపిస్తున్నవి. చిత్ర మేమనగా
ఉదారమైన భావాలు ఎన్ని ప్రకటించినను వీరిలో కొందరు స్త్రీలను గర్హించినారు.
ఇది శోచనీయం. కబీరు, వేమన, వీరబ్రహ్మం వంటివారి రచనలలో యిందుకు
ఉదాహరణలు మనకు కనిపిస్తున్నవి.
భారతదేశమంతటా పైన పేర్కొన్నటువంటి ఉద్యమాలు కొనసాగినవి. ఆ
ఉద్యమాలను ప్రచారంచేసే రచనలు వచ్చినవి. ఆ రచనలు జనసముదాయాన్ని
ఆకర్షించినవి. ఆ రచనలన్నీ జనసముదాయానికి అందుబాటులో ఉండే భాషలోనే
వచ్చినవి. చాలమటుకు యీ రచనలన్నీ వాడుకభాషలో పాటలరూపంలో ఉన్నవి.
సూటిగా హృదయాలకు హత్తుకొనిపోయే శైలీ, పాడుకొనుటకు ఆనువుగా ఉండే
రితి వీనిలో కనిపిస్తున్నవి. అలంకారాలు, వ్యాకరణాలు, శబ్దచిత్రాలు మొదలైనవి
యీ శ్రేణి కవులకు పరిచితాలుకావు. భాష ఏవిధంగా ఉంటేయేమి? భావం ముఖ్యమని
యీ శ్రేణికి చెందిన కవి ఒకరు ఉద్దాటించినాడు.
దేశంలోని అన్ని భాషాప్రాంతాలలో యిటువంటి ఉద్యమాలు కొంచెం
వెనుకాముందు తలెత్తి వర్ధిల్లినవి. తమిళ ప్రాంతంలో నాయనారులు, ఆళ్వారులు
భక్తి ఉద్యమాన్ని ప్రచారంచేయగా కర్ణాటకంలో బసవేశ్వరుడు తన అభిప్రాయాలను
ప్రచారం చేసినాడు. మహారాష్ట్రలో నాధ సంప్రదాయం వ్యాపించినది. కర్మ కాండలను
వర్ణ వ్యవస్థను యీ సంప్రదాయం వ్యతిరేకించినది. సూఫీమతం నిరాకార ఈశ్వరుని
'ప్రేమస్వరూపాన్ని ప్రణయతత్వాన్ని ప్రబోధించినది. ఈ వరుసలోనే సంత్ భక్తి మార్గం
కూడా వచ్చినది. ఇందులో కర్మకాండం ధిక్కారం, భక్తి, సూఫీ ప్రణయతత్వం మొదలైన
అంశాలతోపాటు బౌద్ధ, జైనాల ప్రభావం కూడా గోచరిస్తున్నది. సంత్ కవుల రచనలు
అనేకం గురు గ్రంథ్ సాహెబ్‌లో చేరినవి. నానక్ సిఖ్ మతస్థాపన గావించినాడు.
మహారాష్ట్ర నుండి పంజాబు వరకు భక్తి ఉద్యమాలు వ్యాపించినవి. అస్సాం,
ఒరియాలలో రాధా మాధవ ప్రణయతత్వం ప్రధానమైన, వైష్ణవ భక్తి వ్యాపించినది.
ఒకసారి యీ ఉద్యమాలను, ఉద్యమాల నాయకులను పరిశీలించితే యిందులో
అనేక కులాలకు, వర్గాలకు సంబంధించిన వారున్నట్లు స్పష్టమౌతున్నది.
సంప్రదాయంపై తిరుగుబాటు, కులాల వర్గాల నిరసన వీరందరి బోధనలలో
359
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
సామాన్యధర్మంగా కనిపిస్తున్నది. బసవని వచనాలలో సర్వసమానత్వ భావన మనకు
స్పష్టంగా కనిపిస్తున్నది. మహ్మదీయ మతానికి చెందినవారు కూడా యిందులో
కనిపిస్తున్నారు. మీరాబాయి రాజకుటుంబానికి చెందినది; మాణిక్య వాచకర్ మధుర,
తమిళ రాజ్యంలో మంత్రిగా ఉండెను; కృష్ణమాచార్యులు, అన్నమాచార్యులు
అగ్రవర్ణాలకు చెందినవారు; నామదేవుది దర్జీవృత్తి, తుకారాం దుకాణదారు;
గుజరాతులోని ఆఖో కంసాలివాడు, సాధన కటికవాడు; దాదు దూదేకులవాడు;
సేన మంగలివాడు; రైదాస్ చెప్పులు కుట్టేవాడు. కబీరు నేతవృత్తి నవలంబించిన
మహమ్మదీయుడు. రామానంద్ వంటి అగ్రవర్థానికి చెందిన వేదాంతి కబీరును
గుర్తించినాడు. ఈ విధంగా వివిధ వృత్తులవారు, వివిధ మతాలవారు యీ
ఉద్యమాలను దేశంలోని అన్ని ప్రాంతాలలో స్థాపించి ప్రచారంచేసి మానవునికి-
మానవునికి మధ్య అడ్డుగోడలు ఉండకూడదని, హెచ్చుతగ్గులు ఉండకూడదని
ఉద్దాటించినారు.
తెలుగులో యీ విధమైన సామాజిక భూమికతో వ్రాసిన కవులు చాల మంది
ఉన్నారు. వారి రచనలు కొన్ని శతాబ్దాల నుండి ప్రచారంలో ఉన్నవి. భక్తి, నీతి,
తత్వం, సంఘవిమర్శ, తిరుగుబాటు ధోరణి యిందులో కనిపిస్తున్నవి. మన
సాహిత్యచరిత్రలో వీరి ప్రస్తావనలేదు. ఎవరో ఒకరి ప్రస్తావన ఉన్నప్పటికిని వారిని
గురించి చెప్పినది మిక్కిలి తక్కువ వారి రచనలకు తగిన విలువ కట్టడం జరుగలేదు.
“వేమన్న కవికాడు” అన్న పండితులు కూడా కొంతమంది ఉండినారు. తెలుగుభాషను
సంపన్నం చేసిన తాళ్లపాక కవులకు, కళలను, విద్యలను పోషించిన చక్రవర్తులుగా
మన కవులచేత పొగడ్తలండిన రాజుల యాదరణ లభించినట్లు కనిపించదు.
ఆశ్రయించడంలో నేర్పు, పొగడ్తలు చేయడంలో ప్రావీణ్యం కలిగి, రాజుగారి ఉంపుడు
కత్తెలపైన కూడా పద్యాలు, కావ్యాలు రాయడానికి సందేహించని శుష్మపండితులు,
స్తోత్ర విద్యలో ఆరితేరిన ప్రవీణులు మాత్రమే ప్రాధాన్యం వహించే వ్యవస్థలో
సమాజాన్ని గూర్చి ఆలోచించి జనుల దగ్గరకువచ్చిన కవులకు పరిపాలకుల
గుర్తింపురాలేదు. మనదేశ పరిస్థితులు తెలిసినవారెవరూ యిందుకు ఆశ్చర్యపడవలసిన
పనిలేదు. తెలుగులో యిటువంటి కవులు ఎవరు? వీరు వెల్లడిచేసిన అభిప్రాయాలు
ఏమి? అన్న ప్రశ్నలు సహజంగా ఉత్పన్నమౌతున్నవి. ఈ ప్రశ్నలకు సమాధానంగా
యీ ప్రసంగాన్ని ముగించడానికి ముందు నాలుగు మాటలు చెప్పవలసి ఉన్నది.
360
భక్తి తత్త్వ కవులు - సామాజిక భూమిక
“సింహగిరి వచనాలు” రాసి, తెలుగులో వచనకవితకు మార్గదర్శకుడైన
కృష్ణమాచార్యుడు పద్నాల్లవ శతాబ్దంలో భక్తి మార్గాన్ని ప్రబోధించినాడు. ఆయన
రచనలలో భక్తిగల వారందరూ సమానులే అన్న అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తున్నది.
చూడండి -
దేవా, విష్ణుభక్తిలేని విద్వాంసునికంటె హరికీర్తనము సేయునతడే
కులజుండు. శ్వపచుండైన నేమి? ఏ వర్గంబైన నేమి? ద్విజునికంటె
నతడె కులజుండు. సంధ్యా-వందనాది-నిత్యకర్మానుష్టానంబులు
దప్పక నడిపిన నేమి? సకల ధర్మంబులు సేసిన నేమి? మా సింహగిరి
నరహరిదాసులకు దాసులైనంగాని లేదుగతి! స్వామీ! సింహగిరినరహరీ
నమో నమో దయానిధీ!
అన్న కృష్ణమాచార్యుని వచనం పదమూడు, పద్నాల్లవ శతాబ్దాలలోనే అనగా,
కాకతీయులు తెలుగుదేశాన్ని పరిపాలించిన కాలంలోనే, తిక్కన జైన, బౌద్దులను
వాదంలో ఓడించి, హరిహర అద్వైతాన్ని ప్రతిపాదించిన కాలంలోనే, మానవునికి,
మానవునికి మధ్యభేదాలు ఉండకూడదనే అభిప్రాయాలు ప్రకటితమైనవని మనం
గమనించవలసి ఉంటుంది.
తెలుగులో తాళ్లపాక కవులది ప్రత్యేకమైన స్థానం. వారు విజయనగర రాజులకు
సమకాలికులు. డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులవారి అభిప్రాయం ప్రకారం
“తెలుగు పదములను జోడించుటలో తిక్కనకు కుడిచేయి అన్నమయ్య. ఆయన చేతిలో
భాషమైనంవలె వంగును. అన్నమయ్యలో కవిత్వమును వెదుకుట సముద్రమునకు
ఏతమెత్తుట”
రాళ్లపల్లి అనంత కృష్ణశర్మగారు అన్నమయ్య కవిత్వాన్ని ప్రశంసిస్తూ-
“అసాధారణ భావన స్వతంత్రమధుర ధార భావములలోని అసందిగ్ధమైన ఆర్జవము,
విషయ వైవిధ్యము, అన్నమయ్య కవితలోని ప్రధానగుణములు” అని అన్నారు. సంగీత
సాహిత్యములలో పెన్నిధి అయిన అన్నమయ్య- ఎలమి హరిదాసు లేజాతియెననేమి?
తలమేల? కులమేల? తపమె కారణము అన్నాడు. అంతేకాదు -
“నిండార రాజు నిద్రించు - నిద్రయు నొకటే
అండనే బంటునిద్ర - అదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు - మెట్టుభూమి యొకటే
చండాలు డుండేటి - సరిభూమి యొకటే”
అని కూడా అన్నాడు.
361
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
ఇటువంటి అభిప్రాయాలుకల అన్నమయ్య సంకీర్తనలను మరికొన్ని
చూపించవచ్చును. ఆనాటి దేశపరిస్థితులలో అన్నమయ్య వంటివారు చేసిన
సంఘవిమర్శయిది.
ఇక వేమన్నను గురించి తెలయనివారు తెలుగుదేశంలోలేరు. నాటి సంఘంలో
వ్యాపించియున్న దురాచారాలను ఎలుగెత్తి ఖండించిన వేమన, తెలుగు కవులలో
అన్ని విధాల విశిష్టమైన వ్యక్తి.
చూడండి -
“మాల మాలగాడు, మహిమీదనే ప్రొద్దు
మాట తిరుగువాడె మాలగాక,
వాని మాల యన్నవాడెపో పెనుమాల
విశ్వదాభిరామ వినురవేమ”
అన్న వేమన పద్యం, గురుజాడ అప్పారావు
“మంచి అన్నది మాలయైతే
మాల నేనౌదును”
అన్న ముత్యాల సరానికి ప్రేరణ అని చెప్పవచ్చును.
మరొక పద్యం చూడండి -
“ఆత్మ శుద్ధిలేని యాచారమదియేల
భాండ శుద్ధిలేని పాకమేల
చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా!
విశ్వదాభిరామ వినురవేమ”
అన్నమాట ఆనాటి సాంఘిక పరిస్థితిగూర్చిన విమర్శయే కదా!
వీరివలెనే తెలుగుదేశంలో వీరబ్రహ్మం, సిద్దప్ప మొదలైన కవులు, యింకా
యితర తత్వకవులు ఆనాటి సాంఘిక పరిస్థితులను నిశితంగా విమర్శించి సమాజంలో
ఉన్న వ్యత్యాసాలను వ్యతిరేకించి, సమస్త మానవుల సమానత్వాన్ని ప్రతిపాదించినారు.
జనసముదానికి అర్థమయ్యే భాషలో వీరు తమ రచనలను కొనసాగించినారు. ఇందులో
చక్కని తెలుగు నుడికారాన్ని చూడవచ్చును. వీరి రచనలు సాధారణ ప్రజలు పాడుకొని
ఉత్తేజం పొందుతుంటారు.
362
భక్తి తత్త్వ కవులు - సామాజిక భూమిక
1981-1982 “సారస్వత వేదిక' ప్రతి నెల జరిగే ఉపన్యాసాలలో 'తెలుగులో
భక్తి, తత్త్వ కవులను గురించి విడివిడిగా వివరాలను తెలిపి, వారి సాహిత్యాన్ని
సమీక్షించడం జరుగగలదు. ఈ కవులందరు సాహిత్యచరిత్రలో స్థానం పొందనివారు.
రాజకీయాధికారం, చేజిక్కించుకొని జనులమీద ఆధిపత్యం వహించిన రాజులు,
జమీందారులు, మంత్రులు, పురోహితులు మొదలైన అగ్రవర్ణాల గుర్తింపుకు రానివారు
వీరు. కర్మ కాండలను, సాంఘిక దురాచారాలను కులవ్యవస్థను, వర్ణాశ్రమ ధర్మాన్ని
వ్యతిరేకించిన వీరి సాహిత్యం జనులలో బాగా వ్యాప్తిజెంది, వారిని ప్రబోధించి
సంఘటి తపరచినది. స్వతంత్రభావాలు కలిగిన యీ కవులు జాతికి వెలుగుబాట
చూపించినారు.
వేయి సంవత్సరాలకు పైగా భారతదేశంలో భిన్న ప్రాంతాలలో రచనలు గావించిన
యీ సమాజకవులు ప్రజల మధ్య జీవించినారు; ప్రజల కష్టనుఖాలలో
పాలుపంచుకున్నారు; ప్రజలనాల్క నాల్మలమీద ఆడే భాషలో ప్రజలలో జాగృతిని
కల్గించడానికి, సమాజ సంక్షేమం సాధించడానికీ మానవ శ్రేయస్సు కొరకూ రచనలు
గావించినారు. జీవిక కొరకు ఏదో ఒక వృత్తిని అవలంబించి ఎవరిపని వారు
చేసుకుంటూ, పాలకులమీద కవితలు అల్లి, సులభంగా ద్రవ్యార్దనచేసి విలాస జీవనం
గడుపుకునే కోరికలు యేమాత్రంలేక రచనారంగంలో ముందడుగు వేసినారు.
లోకహితార్థము కవితలు అల్లినారు; మన అలంకారికులు కావ్యం విశ్వశ్రేయస్మరము
కావలెనని అన్నారు. ఈ కవుల రచనలు నూటికి నూరుపాళ్లు విశ్వశ్రేయస్మరాలు.
తమకు కనిపించిన దృశ్యాలచే (ప్రేరితులై, అజ్ఞానము, పేదరికములలో
మునిగితేలుతున్న తోటి సోదరుల ఉన్నతికొరకు కవిత్వాన్ని రాసిన యీ కవులు
సమస్త ప్రపంచాన్ని తమకుటుంబముగా భావించిన ఉదారచరిత్రులు.
గురజాడ అప్పారావుగారు -
“మతం వేరైతేను యేమోయ్?
మనసు లొకటై మనుసులుంటే
జాతమన్నది లేచి పెరిగీ
లోకమున రాణించునోయ్!”
363
దా దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
'చెట్టపట్టాల్ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్,
అన్నదమ్ములవలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయ్'.
అన్నారు.
ఇందుకు అనుగుణంగా వీరి కవిత కొనసాగి దేశీయుల అభిమానాన్ని
చూరగొన్నది.
“ఆకులందున అణగి మణగీ
కవిత కోవిల పలుకవలెనోయ్,
పలుకులను విని, దేశమం దభి
మానములు మొలకెత్తవలెనోయ్”.
364
మన కళా సంపద - సాహిత్యము
8.
9.
విషయసూచిక
మన కళా సంపద - సాహిత్యము ..................... 367
జానపద నృత్య సంగీతాలు..............౨౨. 378
ప్రపంచ. దృకృథము ఎ మం అంట 377
మానవ స్వత్వాలు - లోక శ్రేయస్సు .............౨౨౨ 379
తెలుగుసీమలోని రైతు - సాంస్కృతిక జీవితము.......... 384
గ్రామాలలోని వేడుకలు - క్రీడా వినోదాలు .............. 389
గురుదేవుడు రవీంద్రుడు..........440000000000000040 396
OOH: ties 399
కీ.శే. జార్జి బెర్నార్డుషా.........ంంంల 404
10. అమరజీవి మౌలానా సాహెబ్..................4- 406
మన కళా సంపద - సాహిత్యము
భారతదేశానికి మహోజ్వలమైన కళాసంపద కలదు. ఈ కళాసంపద ఈనాటిది
కాదు. దానికి అనేక సహసస్రాబ్దాల వయస్సు కలదు. ప్రపంచములోని అనేక దేశాలు,
అత్యధిక భాగము, విజ్ఞాన జగతిలో అడుగు పెట్టకముందు ప్రపంచ నాగరికత
శైశవదశలో నున్నప్పుదే, భారతదేశము నందు కళలు, శిల్పము, విజ్ఞానము,
సాహిత్యము జగజ్జేగీయమానముగా అభివృద్ధిచెంది, మానవ సభ్యతకు, సంస్కృతికి
శాశ్వతమైన పెన్నిధిగా ప్రకాశించినవి. ఈ కళాసంపదలో సాహిత్యమునకు విశిష్ట
స్థానము కలదు. భారతీయ సాహిత్యము ప్రపంచ వాజ్మయమునకు తలమానికమై,
సత్యమై, శివమై, సుందరమై ప్రకాశించుచున్నది.
భారతదేశము బహు భాషలకు పుట్టినిల్లు. ఈ భాషలన్నింటికిని ఉదాత్తమైన
వాజ్మయము కలదు. భారతదేశములోని భాషలు ఒక మహావృక్షము యొక్క
శాఖోపశాఖలని చెప్పవచ్చును. సనాతనమైన యీ వృక్షపు కొమ్మలు నేటికిని పూలతో,
పండ్లతో కనుల పండువు గావించుచున్నవి. “జనని సమస్త భాషలకు సంస్కృత
భాష” యని ఆర్యోక్తి. స్టూలదృష్టికి విభిన్నముగా కన్పట్టు యీ భాషల యందు, యీ
వాజ్బయములందు కొంచెము పరిశీలించినచో యేకత్వము స్పష్టముగా గోచరించు
చున్నది. భారత జాతీయత మరియు సంస్కృత భాష యీ భిన్న వాజ్బయముల
యేకత్వమునకు మూలప్రాతిపదికలు; అదియే మన సాహిత్య సంపద ప్రత్యేక
ఉత్కృష్టత. మన దేశములోని వివిధ సారస్వతములను ఒకచోట కూర్చినచో అది
యొక మంచి ముత్యాలహారముగా శోభిల్లగలదు. ఈ ముత్యాలహారమును కూర్చే
సూత్రమే భారత జాతీయత, భారతీయ సంస్కృతి; సంస్కృత భాష, సంస్కృత
మహాసముద్రము నుండి మనదేశ భాషలలో ప్రతియొక భాషయు కొద్దియో గొప్పయో
జలమును కొని తెచ్చుకొనుట జరిగినది. మన దేశీయ భాషల సాహిత్య వికాసము
యీ సత్యమును బుజువు చేయుచున్నది.
సంస్కృత, ప్రాకృత, దేశీయ భాషా వాజ్మయముల సంపదను గూర్చి
ప్రస్తావించుటకు ముందు మన భిన్న భాషా వాజ్మయాల ఆదర్శమును గూర్చి రెండు
మాటలు చెప్పుట అత్యవసరము. ఈ ఆదర్శము దేశములోని అన్ని భాషలకును
సమానవైనదని నిస్సందేహముగా చెప్పవచ్చును. ఈ ఆదర్శమును గూర్చి మన
367
డా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
దేశములో చర్చలు బహుళముగా జరిగినవి. ఆలంకారికులు వివిధ సిద్ధాంతములను
ప్రతిపాదించి యున్నారు. భరత, భామహ, దండి, వామన, ఆనందవర్ధన,
అభినవగుప్త, కుంతక, లొల్లట, ముమ్మట, శంకుక, మహిమభట్ట, హేమచంద్ర,
భోగనాథ, విద్యానాథ, సర్వజ్ఞ సింగన, అప్పయదీక్షిత, జగన్నాథాదులు సాహిత్య
శాస్త్రమును మధించి, ఉద్దంథములను రచించి, సిద్ధాంత ప్రతిపాదనము గావించి
యున్నారు. ఈ గ్రంథాలను, ఈ సిద్ధాంతాలను, ఈ చర్చలను పరిశీలించినప్పుడు
విశ్వశ్రేయస్సు మన వాజ్మయముల పరమ లక్ష్యమని స్పష్టము కాగలదు.
జగత్మల్యాణమను మహోన్నతాదర్శముచే ప్రభావితులైన మహనీయులు మన వాజ్మయ
ప్రష్టలు. బుషి కానివాడు కావ్యము వ్రాయజాలడని మనవారు ఉద్దాటించినారు.
మన సాహిత్యసంపద ఉదాత్తతకు ఈ ఉద్దాటన మంచి నిదర్శనము.
సకల భాషలకు జనని యైన సంస్కృత భాషా మహాసముద్రము మిక్కిలి
అగాధమైనది. అందలి వాజ్మయము మహోన్నతమైనది. మన వేదములు, పురాణములు
విజ్ఞాన భాండారములు, సాహిత్యనిక్షేపములు. వ్యాస వాల్మీకులు ఆచంద్ర తారార్మము
ప్రపంచ వాజ్మయమునకు నాయకమణులైన కవీంద్రులు, బుషీంద్రులు. కాళిదాసాదుల
రచనలు విశ్వసాహిత్యము నందు అగ్రస్థానము నలంకరించుకున్న మన సాహిత్య
సంపద - సంస్కృతములో లేని వాజ్మయ విశేషము లేదు. మన దేశీయ వాజ్మయము
లన్నింటి మీద సంస్కృతము తన ముద్ర వేసినది.
భారత వాజ్మియరంగమున ప్రాకృత భాష మహావీర గౌతమ బుద్భుల కాలమున
ప్రవేశించినది. మొట్టమొదట ఈ భాషకు అర్థమాగధి యని పేరు. ఈ భాషయే
మానవుల మూల భాషయని బౌద్ధులు అభిప్రాయపడుచున్నారు. బౌద్ధ వాజ్మయానికి
ఈ ప్రాకృత భాష ఆలవాలమైనది. బుద్ధుని వచనాల రచన ఈ భాషలోనే జరిగినది.
దమ్మపదము ప్రాకృత భాషా గ్రంథము. గౌతమ బుద్దుని వచనాలను క్రోడీకరించిన
(గంథజాలము భాషకు పాళీ యను పేరు తరువాత కలిగినదని కొందరి అభిప్రాయమై
యున్నది. పాళీ ప్రత్యేక భాష కాదని కొందరి అభిప్రాయము. ఈ పాళీ భాషయను
పేరు ఏడవ శతాబ్దము తరువాత కలిగినట్లు చెప్పబడుచున్నది. పాళీ సాహిత్యము
మన దేశ సాహిత్య సంపదలో ప్రత్యేకముగా పేర్మొనదగినది.
మన దేశీయ భాషలు కూడ అనేక శతాబ్దాల వయసు కలిగి, అపారమైన
ఉత్తమ వాజ్మయమునకు ఆటపట్టులుగా నున్నవి. ఉత్తర దేశమున హిందీ, మైధిలీ,
368
మన కళా సంవద - సాపొత్యము
బీహారి భాషలు ముఖ్యమైనవి. ఈ భాషలలో వాజ్బయము పన్నెండవ శతాబ్దములో
ప్రారంభమైనది. అనగా కొన్ని దక్షిణ దేశ భాషలు వీని కన్న ప్రాచీనమైన వన్నమాట.
మహమ్మదీయ పరిపాలన వలన, ఈ భాషల వాజ్మయములకు పార్సీభాషతో
సంబంధము కలిగి తత్ర్రభావము వీనిపైన కనపడుచున్నది. ఇటువంటి ప్రభావము
కొంచెము ముందుగనో, వెనుకగనో, మన దేశీయ భాషల యందన్నింటి మీద
కనపడుచున్నది. పార్సీ, అరబ్బీ శబ్దజాలము కొంత ఈ భాషలలో ప్రవేశించినది.
ఉత్తర దేశమున పై భాషలకు పార్సీ సంపర్మమువలన, హిందీ భాష
ఉద్భవించినది. ఈనాడు మనదేశములో అత్యధిక సంఖ్యాకులు అర్థము చేసికొనగలిగిన
భాష హిందీ భాషయే. ఇందుకు చారిత్రక కారణాలు కలవు. హిందీ భాషలో మంచి
వాజ్మయము కలదు. నానక్, కబీర్, తులసీదాసుల నామములు యావద్భారతానికి
వరిచితమైనవి. ఈ కవీశ్వరులు వ్రానిన వాజ్మయము హిందీ భాషకు
అమూల్యాలంకారమైన సాహిత్య సంపద. హిందీ భాషలో మహమ్మద్ జై సీ అను
విద్వాంసుడు వ్రాసిన పద్మావతి యను కావ్యము సుప్రసిద్ధమైనది. హిందీకి ఉర్దూ
భాష తోడబుట్టువు. 17 మరియు 18 శతాబ్దాలలో బహమనీ రాజులు ఆదరణతో
ఈ ఉర్దూ భాష అభివృద్ధి పొందినది. తరువాత ఈ భాష మన దేశములో వ్యాప్తి
చెందినది. ఢిల్లీ, లక్నో లాహోర్, హైద్రాబాదు నగరాలు ఉర్దూ భాషాభివృద్ధికి ముఖ్య
కేంద్రములైనవి.
మన దేశ సాహిత్యమున వంగ వాబజ్మయము ప్రత్యేకమైనది. ఈ వాజ్మయము
పదునొకండవ శతాబ్దమున బౌద్ధుల నుండి ప్రారంభమైనట్లు కొందరి ఊహ. వంగ
భాషలో పదునొకండు నుండి పదునెనిమిదవ శతాబ్దము వరకు అనగా ఏడునూర్ల
సంవత్సరాల కాలమున బౌద్ధ, శాక్తేయ, వైష్ణవ మత గ్రంథాలు కొన్ని వచ్చినవి. ఈ
కాలమున మన దేశ మందలి వాజ్మయ సంపద మీద మతము ప్రభావము
సర్వసాధారణముగా కన్పట్టుచున్నది. పదునెనిమిదవ శతాబ్దము తరువాత వం
వాజ్మయమున నవీన యుగము ప్రారంభమైనది. రామమోహనరాయ్, బంకించంద్ర
ఛటర్జీ, ద్విజేంద్రలాల్‌రాయ్, మైకేల్ మధుసూదనదత్తు, రవీంద్రనాథ టాగోర్,
శరశ్చంద్రచటర్జీ మొదలైన రచయితలు వంగ సాహిత్యమున క్రొత్త రీతులను ప్రవేశపెట్టి
ఆధునిక యుగమునకు మార్గదర్శకులైనారు.
369
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
గుజరాతీ భాషలో మనకు గ్రంథ రచన పదునైదవ శతాబ్దము నుండి
కనుపించుచున్నది. వల్లభాచార్యుల వైష్ణవము ప్రభాము గుజరాతీ వాజ్బ్యయము మీద
కలదు. కీర్తన సాహిత్యము మీద ఈ విధమైన ప్రభావము స్పష్టముగా కనుపించుచున్నది.
గుజరాతీ సాహిత్యమును అభివృద్ధిగావించిన వారిలో జైనులకు, పారసీకులకు ముఖ్య
స్థానము కలదు. శ్రీ కె.యం.మున్నీ ప్రభృతులు నవీన గుజరాతీ వాబ్మయమున
'పేర్మొనదగినవారు.
అస్సామీ భాషలో మొట్టమొదటి గ్రంథము బురాంజి. ఇది చారిత్రక గ్రంథము.
అస్సామీలో శాక్తేయ, వైష్ణవ, బౌద్ధ మతస్థులు వాజ్మయ నిర్మాణము కావించిరి. ఆధునిక
అస్సామీ వాజ్బయము మీద వంగ వాజ్మయ ప్రభావము కనుపించుచున్నది.
మహారాష్ట్ర భాషలో వాజ్మయము పన్నెండవ శతాబ్దము నుండి కనుపించు
చున్నది. విజ్ఞానేశ్వరీయ గ్రంథకర్తయైన విజ్ఞానేశ్వరాది మహానుభావ పంథా,
అనుయాయులు మహారాష్ట్రములో తొలి గ్రంథ రచన గావించిరి. ఈ భాషలో మోడీ
లిపిని వాడుకలోనికి తీసికొని వచ్చిన విద్వాంసుడు హేమాద్రిపండితుడు. ఈ భాషలో
భక్తి పంథా అనుయాయులైన నామదేవ్, తుకారమ్, రామదాస్ రచనలు తరువాత
వెలసినవి. ఈ ముగ్గురి నామములు సకల భారతమునకు పరిచితములు. మహారాష్ట్ర
సామ్రాజ్య విస్తరణ మహారాష్ట్ర వాజ్మయములో నూతన మార్గాలను ప్రోత్సహించినది.
ఈ నూతన మార్గాలలో బఖేదులు, చరిత్రలు, పేర్మొనదగినవి. ఈ వాజ్మయమున
ఆధునిక యుగము 19వ శతాబ్దమున ఆరంభమైనది. బాలగంగాధరతిలక్, కేల్మార్,
సవర్మర్ మొదలైన విజ్ఞానులు ఆధునిక వాబ్బయమును అభివృద్ధి గావించి మహారాష్ట్ర
సరస్వతిని నూతన ఆభరణాలతో అలంకరించిరి.
దాక్షిణాత్య భాషలలో తమిళము చాల ప్రాచీనమైనది. ఈ భాషలో వాజ్బ్యయము
రెండవ శతాబ్దముననే ప్రారంభమైనది. ఈ భాషలో పేర్కొనదగిన ఆది గ్రంథాలు
మణిమేఖల, శిలప్పదిగారము మొదలైనవి. ఈ గ్రంథనామములు సంస్కృత భాషా
ప్రభావమును సూచించుచున్నవి. తొల్మాప్పియమ్ (తొలి కావ్యము) తమిళ భాషలో
ప్రసిద్ధమైన ఆది గ్రంథాలలో నొకటి. తమిళ వాజ్ఞయమునందు ఆరవ శతాబ్దమున
శైవ, వైష్ణవ భక్తుల రచనలు విరివిగా కనుపించుచున్నవి. పన్నెండవ శతాబ్దమున
కంబరామాయణ రచన జరిగినది. ఇది సకల భారత ప్రసిద్ధి పొందిన గ్రంథము.
370
మన కళా సంవద - సాహిత్యము
పదునారవ శతాబ్దమున జెనూట్ ఫాదరీలు క్రైస్తవ మత ప్రచార గ్రంథాలను రచించిరి.
భారతదేశమునందలి ఇతర వాజ్మియములలో వలె తమిళ సారస్వతమున గూడ
నూతన యుగము ప్రారంభమైనది. ఈ యుగమున తమిళ సాహిత్య రంగమున
దేదీష్యమానముగా ప్రకాశించు తార సుబ్రహ్మణ్య భారతి.
క్రీ.శ. అయిదు, ఆరు శతాబ్దాలలో శాసనాల యందు ప్రాచీన కన్నడము
మొట్టమొదటిసారి కనపడుచున్నది. కన్నడములోని మొట్టమొదటి గ్రంథము 9వ
శతాబ్దమునందల కవి రాజమార్గము. ఇది లక్షణ గ్రంథము. అందుచేత కర్ణాటక
భాషలో ఇంతకుముందు లక్షణ గ్రంథాలు రచింపబడెనని నిస్సందేహముగా
చెప్పవచ్చును. ఈ వాజ్మయాభివృద్ధికి పని చేసినవారిలో జైనులు ప్రథములు.
నృపతుంగుడు జైనుడు. కర్ణాటక సాహిత్యమున రత్నృత్రయ మని ప్రసిద్ధిగాంచిన
పంప, పొన్న రన్నలు జైన వాజ్మయ నిర్మాతలు. 11వ శతాబ్దమున రుద్రాభట్,
దేవకవి మొదలైన (బ్రాహ్మణ కవులు, పన్నెండవ శతాబ్దమున బసవేశ్వరుడు, చెన్న
బసవడు, అక్కమహాదేవి మొలైన వీరశైవ కవులు రచనలను గావించిరి. పదమూడవ
శతాబ్దిమున వైష్ణవ మత ప్రభావము ఈ సాహిత్యాభివృద్ధి మీద కనుపించుచున్నది.
విజయనగర రాజుల కాలమున కర్ణాటక సాహిత్యమునకు గొప్ప పోషణ లభించినది.
కన్నడ భారతమున యుద్ధపంచకము తరువాత భాగాలు తిమ్మజ్ఞ కవి పూర్తి గావించి,
శ్రీకృష్ణరాయలకు అంకితము గావించినాడు.
ఇతర దేశీయ భాషల వలె ఆధునిక యుగమున కర్ణాటక భాషలో వివిధ
వాజ్మయ వీధులందు నవ్య రచనలు జరిగినవి. ఈ యుగారంభకుడు కన్నడ
పితామహుడు ఆలూరు వెంకట్రాయుడు.
తెలుగు భాష అతి తీయనిది. పాశ్చాత్యులచేత ప్రాచ్య ఇటాలియన్ అని
ప్రశంసించబడి ప్రసిద్ధి చెందినది. దేశ భాష లందు తెలుగు లెస్స అని కృష్ణరాయలు
ప్రశంసించినాడు. ఆంధ్రభాషలో ఏడవ శతాబ్దము నండలి మాలెపాడు, విప్పర్ల
శాసనాదుల యందు పూర్తి తెలుగు రచన కనుపించుచున్నది. రేనాటి చోళుల
శాసనాలలోని తెలుగు వచనము విశిష్టమైనది. తరువాత వేంగీ చాళుక్యులు ఆంధ్ర
భాషాభివృద్ధికి కృషి చేసిరి.
371
దా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
పదునొకండవ శతాబ్దమున నన్నయార్యుడు భారత రచనకు శ్రీకారము చుట్టి
మూడు పర్వాలు ముగించెను. పన్నెండవ శతాబ్దమున ప్రతాపరుద్రుని కాలమున
శైవ, వైష్ణవ వాజ్మయములు వ్యాప్తి నొందినవి. బసవపురాణ, రంగనాథ
రామాయణాదులు ఈ తరగతిలో చేరినవి. పదమూడవ శతాబ్దమున కవిబ్రహ్మ యైన
తిక్కన శైవ, వైష్ణవాలను సమన్వయము గావించి అద్వైతము ప్రతిపాదించి తెలుగు
భారతమును పూర్తి చేసెను. తరువాత నాచన సోముని హరివంశము వచ్చినది.
ఇమ్మడి దేవరాయలు, మరియు రెడ్డి రాజులు కాలమున ఎజ్జిన, శ్రీనాథ, బమ్మెర
పోతనలు ఆంధ్ర సరస్వతికి అమూల్యా లంకారాలను సమకూర్చిరి. తరువాత శ్రీ
వీరేశలింగం పంతులు గారు ఆంధ్ర సాహితీ పునరుద్ధరణ ప్రభావులైనారు. ఈ
విధముగా తెలుగు సారస్వత వ్యాప్తి జరిగినది.
మళయాళ వాజ్మయమునకు 15వ శతాబ్దము తరువాత రూపురేఖలు
దిద్దబడినవి. అనగా కొంచెము ఆలస్యముగా యీ భాషలో వాజ్మయ నిర్మాణము
ప్రారంభమైనదన్నమాట. ఆధునిక మళయాళ సారస్వతమును ప్రకాశింప జేసిన
మహాకవి వల్లత్తోల్ సకల భారతము నందు కీర్తి గాంచిన సారస్వత వేత్త.
ఈ విధముగా మన దేశము నందు వివిధ భాషలలో వాజ్మయము వ్యాప్తి
నొందినది. ఈ వాజ్మయమంతయును సకల భారత దేశ సాహిత్య సంపద.
372
మన కళా నంవద - సాపొత్యము
జానపద నృత్య సంగీతాలు
పుస్తకాలు చదివి సంపాదించిన విజ్ఞానము లేక ఆధునిక నాగరికతలతో
సంపర్మము లేక పల్లెపట్టులలో నివసించే ప్రజానీకాన్ని మనము జానపదులని పిలువ
వచ్చును. ఈ జానపదుల జీవితాన్ని కొంచెము పరిశీలిస్తే అందులో సారస్వతానికి,
కళలకు, విశేషించి నృత్యానికి, సంగీతానికి సముచిత ప్రాధాన్యము కలదని వెల్లడి
యౌతుంది. పాటలు, గేయాలు, కథలు మొదలైన అపారమైన సారస్వతము వీరి
నాలుకల మీద నాట్యమాడే దృశ్యాలను ఎన్నింటినైనా మనము పల్లెటూళ్ళలో పరికించ
వచ్చును. కాని యీ శతాబ్దంలో కొన్నాళ్ళ నుంచి అనేక కారణాల వల్ల ప్రజాసారస్వత
మని చెప్పదగిన ఈ పాటలు, గేయాలు జానపదుల పలుకబళ్ళలో (ప్రాధాన్యాన్ని
కోల్పోతున్నట్లు కనిపిస్తున్నది.
జానపదుల సారస్వతములోనే కాక వారి నృత్య సంగీతాలలో కూడ ప్రత్యేకత,
విశిష్టత కనిపిస్తున్నవి. అలంకార శాస్త్రాలు, లక్షణ గ్రంథాలు నిర్ణయించిన
ప్రమాణాలకు పట్టుపడనివారి సాహిత్యమువలెనే వారి నృత్య సంగీతాలు గూడ
లాక్షణిక గ్రంథాలకు అతీతమై యున్నవి. భరతుడు తన నాట్యశాస్త్రములో యీ
జానపదుల నృత్యాన్ని గూర్చి కొంత ప్రస్తావించినప్పటి కిని, తరువాత ఆలంకారికులు
వాని ఉనికినే గమనించినట్లు కానరాదు. జానపదులు సారస్వతములో మనదేశ
సంస్కృతి ప్రతిబింబించినట్లే వారి నృత్య సంగీతాలలో గూడ మన దేశీయ
సంప్రదాయాలు ప్రతిఫలించుచున్నవి. జానపదుల రుచులను, అభిరుచులను
తెలియజేసే అద్దము వంటివి యీ నృత్య సంగీతాలని నిస్సందేహంగా చెప్పవచ్చును.
సారంగపాణి పదాలవంటివి జానపద వాజ్మయానికి, నృత్యసంగీతాలకు గూడ
ఆటపట్టులై ఉన్నవి. జానపద వాజ్మయంలో వలెనే, నృత్య సంగీతాలలో కూడా
భారత భాగవత రామాయణాల ప్రభావము ప్రముఖంగా కనుపిస్తుంది. పురాణ
గాథల పరిచయము అడుగడుగునా తొంగి చూస్తుంటుంది.
తెలుగు సీమలో యక్షగానాలు క్రమక్రమంగా నాటకాలుగా పరిణమించి
వ్యాప్తిలోకి వచ్చినవి. ఈ యక్షగానాలను మొట్టమొదలు జనులు వీధులలో వేషాలు
గట్టి వినిపించేవారు. కేవలము వినిపించడమే కాదు పాడుతూ ఆడేవారని కూడ
373
డా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
తెలుస్తున్నది. ఈ విధంగా జానపదుల నృత్యసంగీతాలే యీ యక్షగానాలకు
జన్మస్థానాలని తోస్తున్నది. పగటివేషాలలో, తోలుబొమ్మలలో, యక్షగానాలలో నాటకాల
క్రమ పరిణామము మనకు కనుపిస్తున్నది.
కురువంజి అనే నృత్య సంప్రదాయాన్ని జానపద నృత్య మనే చెప్పవచ్చును.
కురువలు అనే ఆటవికజాతివారు తిరుపతి, శ్రీశైలము మొదలైన పుణ్యక్షేత్రాలలో
యాత్రికుల వినోదము కోసము నృత్యము చేస్తుండేవారు. జానపదులు వర్ధిల్లడేసిన
యీ నృత్యానికి మొదలు కురవంజులనే పేరు కలిగింది. గ్రామ ప్రాంతాలలో ఇటీవల
వరకు కథలు చెప్పించే అలవాటు ఉండేది. ఈ కథలలో బొబ్బిలి కథ, బాలనాగమ్మ
కథ మొదలైనవి సుప్రసిద్ధాలు. రసాత్మకాలైన యీ కథలను చెప్పే సందర్భంలో
జానపద నృత్య సంగీతాలకు ప్రత్యేక ప్రాధాన్యము ఉంటుంది. పల్లెటూళ్ళలో
కోలాటము, చెమ్మచెక్కలు మొదలైనవి బాలికలకు అత్యంత ప్రియమైన ఆటలు. ఈ
ఆటలలో భజనకీర్తనలు పాడుతూ-
“గొల్లవారి వాడలకు కృష్ణమూర్తీ నీవు
యేమి పనుల కొచ్చినావు కృష్ణమూర్తీ
పాలకొరకు వచ్చినానే గొల్లభామా మంచి
పాలుబోసి నన్ను బంపు గొల్లభామా”
అని నృత్యము చేస్తున్న దృశ్యము మిక్కిలి మనోహరమైంది. ఇదే విధంగా ఒప్పులకుప్పా,
ఒయారి భామా మొదలైన ఆటలలో జానపద నృత్యం ప్రతిబింబిస్తుంది. వెన్నెల
రాత్రులలో కామునిపున్నమకు ముందు పల్లెటూళ్ళలో యువతీయువకులు వేసే
కోలాటాలు నృత్య సంగీతాలకు ఆటపట్టులు.
జానపదులు సంగీత ప్రియులు. తోటలలో, పొలాలలో, చెలకలలో, మంచెల
మీద కూర్చుండి రాగమాలపించే రైతు సాయంకాలము గోధూళి సమయాన ఇంటికి
పశువులను తీసికొని పోతూ పాట పాదే యువకుడూ, పొలములో విత్తనాలు వేస్తూ,
కలుపుదీస్తూ, కోతలు కోస్తూ, ఇండ్లలో పిండి విసురుతూ, వడ్లు దంచుతూ, రకరకాల
పాటలు పాడే ఆడపడుచులూ జానపదుల జీవితంలో సంగీతము యేవిధంగా
చొచ్చుకొని పోయిందో బుజువు చేస్తున్నారు. పండుగ పబ్బాలలో వరసగల వారితో
పరిహాసాలు ఆడే వేళలో, మంగళహారతులు యిచ్చే సమయాలలో, తొట్లెలో పసిపాపలను
374
మన కళా నంవద - సాపొత్యము
ఊపుతూ నిద్రబుచ్చే సందర్భాలలో హృదయాలు కదలి శ్రావ్యంగా ఆలపించే పాటలు
జానపదుల సంగీతంలో ముఖ్యభాగం కాక యింకేమి!? జానపదుల సంగీతాన్ని దేశీ
సంగీతమని చెప్పడం కలదు. ఈ దేశీ సంగీతము జనసామాన్యానికి మిక్కిలి
హృదయంగమైనది. గుణములో ఉత్తమ్రేణికి చెందిన జానపదుల పాటలలో వైవిధ్యము
చాల యెక్కువగానే కనిపిస్తున్నది. జీవితంలో అనేక సన్నివేశాలను యీ పాటలు
చిత్రించుచున్నవి. ఈ పాటలను, పదాలు, మంగళహారతులు, పాటలు అని మనము
స్ఫూలముగా విభజించవచ్చును. పదాలలో ప్రభాతపదాలు, వెన్నెలపదాలు,
కోకిలపదాలు, చిలుకపదాలు, గొబ్బిపదాలు మొదలైనవానిని లెక్కించవచ్చును.
పాటలలో లాలిపాటలు, జోలపాటలు, ఏలపాటలు, దరువులు, సుద్దులు, అప్పగింత
పాటలు మొదలైనవానిని చేర్చవచ్చును; గొల్లసుద్దులు ప్రఖ్యాతి గాంచిన పాటలు.
ఈ విధంగా ఇవన్నీ జానపదుల సరస జీవితానికి చాలమంచి ప్రతిబింబాలు.
తోలుబొమ్మలాటలు, భాగవతాలు, జానపదులు ప్రేమతో పోషించి, వర్ధిల్లజేసిన కళా
సంప్రదాయాలు.
ఈ పాటలు పాడే పద్ధతి గూడ (ప్రత్యేకమైంది. జానపదుల సంగీతానికి
శాన్రీయమైన నియమాలు కల్పించడం కష్టసాధ్యము. వీనికి రాగతాళాలను
నిర్ణయించడం మిక్కిలి ప్రయాసతో కూడుకొని సంగీత శాస్త్రంలో నిష్టాతులైన
ప్రజ్ఞావంతులు చేయవలసిన పని. బొబ్బిలికథ, పల్నాటివీరుల కథలను చెప్పడంలో
వివిధ ప్రాంతాలలో, వివిధ సంగీత రీతులను అనుసరిస్తుంటారు. వీనిని బాగుగా
పరిశీలించవలసి ఉన్నది.
ఈ జానపద సంగీతాన్ని నృత్యాన్ని తమ సొమ్ముగా చేసికొనిన తెగలవారు
తెలుగుసీమలో కొందరు కలరు. కాని క్రమక్రమంగా వీరి సంఖ్య తగ్గిపోతున్నది. ఈ
విధంగా ఈ పాటలు పాడేవారికి తగిన ప్రోత్సాహమూ, పోషణా లేకపోయినందువలన
కాబోలు, భిక్షాటనము చేయవలసిన దుస్థితికి వీరు గురియౌతున్నారు. వీరికి బిచ్చము
గూడ తగినంత దొరకని దుస్థితి మిక్కిలి దుస్సహమైనది. దేశద్రిమ్మరులై, ఊరూరు
తిరుగుచూ, జీవనోపాధిని కల్పించుకుంటున్న వీరిని ఆశ్రయించి వున్న సంగీత
నృత్యాలు నశించిపోకుండా కాపాడవలసిన అవసరము ఎంతో ఉన్నది. బాలసంతులు,
బుడబుడకలవారు, జంగములు, దాసరులు, భాగవతులు, పిచ్చుక గుంటులు,
వీరముష్టులు మొదలైన యీ తెగలవారు యీనాడు చాల తక్కువగా కనుపిస్తున్నారన్న
375
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
విచారకరమైన సత్యాన్ని మనము గమనించవలసి ఉన్నది. ఈ తెగలలో అజ్ఞాతవాసము
జేస్తున్న సాహిత్యాన్ని, సంగీత నృత్యాలను సకాలములో కాపాడకపోతే, కొంత కాలము
తరువాత అదృశ్యం కాగల ప్రమాదము గోచరిస్తున్నది.
ఈ జానపదులు సంగీత నృత్యాలలో ఉపయోగించే సాధనాలు, వాద్యాలు
కొన్ని ప్రత్యేకమైనవి ఉన్నవి. వీరి ఉపయోగం కూడా ఈరోజు చాలా తక్కువగా
కనిపిస్తున్నది. గజ్జెలు కట్టుకొని నృత్యము చేయడం, కొమ్ము ఊదడం, పిల్లనగ్రోవి
పాడడం, నాగస్వరము వాయించడం మొదలైనవి జానపదుల ప్రత్యేకతలు. చిరుతలు
చేతులలో నుంచుకొని, తాంబూర పట్టుకొని, ఇంటింటికి వచ్చే హరిదాసు, యీనాడు
పల్లెటూళ్లలో చాల తక్కువగా కనిపిస్తుంటాడు. అందెలు, తాళాలు, కొమ్ము, జమిడికలు,
గజ్జెలు, కోలలు మొదలైన సాధనాలు జానపదుల నృత్య సంగీతాలలో కనుపిస్తుంటవి.
లంబాడీలు, కోయలు మొదలైనవారిలో ప్రత్యేకమైన నృత్యసంగీతాలు గోచరిస్తున్నవి.
ఈ విధంగా జానపదులు ప్రత్యేక సారస్వతము, సంగీత నృత్యాలు,
తత్సంబంధమైన సంప్రదాయాలు అపారంగా ఉన్నవి. వీనిని సాధించేవారు కూడ
ఒక ప్రత్యేక తెగలకు, కులాలకు చెందినవారై ఉన్నారు. ఈ సాధనలో రకరకాల
వాద్యాలను ఉపయోగించడం గమనింపవలసి ఉన్నది.
చదువు సంధ్యలు రాకపోయినంత మాత్రాన వ్రాతకోతలు తెలియనంత
మాత్రాన, ఆధునిక అభిరుచులను కలిగిలేనంత మాత్రాన, నేటి నాగరికతా
ప్రభావానికి లోనుగాకపోయినంత మాత్రాన, జానపదుల జీవితాలు రసహీనమై,
శుష్మమైనవి కావు. ఉన్నత విద్యావంతుల హృదయాలవలెనే జానపదుల హృదయాలు
గూడ, వివిధ సన్నివేశాలలో రసార్ధములు కావడం జరుగుతుండును. ఈ విధంగా
జరిగినప్పుడు మెరుపును చూచి పింఛము విప్పే నెమలి వలె, మామిడి చివుళ్లు తిని
మత్తిల్లి పాడే కోకిల వలె, సంగీత నృత్యాలతో వారి జీవితాలు ఉప్పొంగు చుండును.
కళా సౌందర్యానికి ఆటపట్టయిన సందర్భాలు జానపదుల జీవితాలలో పుష్కలంగా
ఉన్నవి. దానిని చక్కగా ఆకళించుకొని, అందులో ఉత్తమ కళా సంప్రదాయాలను
చిరస్థాయిగా చేయవలసిన కర్తవ్యాన్ని మనము మరచిపోగూడదు.
376
మన కళా నంవద - సాపొత్వము
ప్రపంచ దృక్పథము
వ్రవంచ దృక్పథము కలిగి యుండుట అనగా ప్రంచములోని
మనుషులందరును, వారు యే దేశములో నివనించినను, యే మతము
నవలంబించినను, యే జాతికి చెందినను, యే రంగు కలిగినను, ఒకే కుటుంబము
లోని వారను భావము కలిగి యుండుట. నిజముగా యీ భావన చాల ఉత్తమమైన
ఆశయము. లోక కల్యాణము కొరకు ప్రపంచ పౌరు లందరును యీ ఆశయము
కలిగి యుండవలెను.
ఈ రోజులలో ప్రపంచములోని వివిధ దేశాలు ఒకదానికి మరొకటి మిక్కిలి
దగ్గరగా వచ్చినవి. కాలము, దూరము అను రెండు ప్రతిబంధకాలను మానవుడు
అధిగమించగలుగుచున్నాడు. కొద్ది కాలములో యెక్కువ దూరము ప్రయాణము
చేయగల విమానాలు మనకు ఉన్నవి. టెలిఫోను యంత్రాలు, దూరదర్శిని యంత్రాలు
వివిధ దేశాల ప్రజలను చాల దగ్గరికి తీసికొనివచ్చుచున్నవి. కాని మానసికముగా
మాత్రము ప్రపంచ మానవులందరును ఒక్కటే యను భావము తగినంతగా వ్యాప్తి
పొందుట లేదు. మా దేశము గొప్పది, మా జాతి గొప్పది, మా మతము గొప్పది,
యితరులు తక్కువవారు, అను భావాలు తొలగిపోవు వరకు ప్రపంచ దృక్పథము
కలుగ జాలదు.
ప్రంచములో యీనాడు అనేక మతములు గలవు. కొంచెము పరిశీలించినచో
అన్ని మతాల యందును ప్రపంచ దృక్పథము కనిపించుచున్నది. మానవాళి యేక
కుటుంబానికి చెందినదను భావము భారతీయ వేదాంతము నందు స్పష్టముగా
కనిపించుచున్నది. శాంతిని, (ప్రేమను బోధించిన బౌద్ధమతము యేక ప్రపంచ
దృక్పథమును ప్రతిపాదించుచున్నది. కావుననే భారతదేశములో ఉద్భవించిన
బౌద్ధమతము దేశ దేశాలకు వ్యాపించి, ప్రపంచములోని అత్యధిక జనుల చేత
అవలంబించబడుచున్నది. బౌద్ధమతమున దేశము, జాతి అను సంకుచిత
దురభిమానాలు లేవు. అశోకచక్రవర్తి బౌద్ధమతమును జగత్తునందంతటను ప్రచారము
చేయించెను. ప్రపంచములోని మానవులందరును సోదరులను భావమును ఇస్లాం
మతము బోధించు చున్నది. ఇదే విధముగా దేవుని రాజ్యములో యెటువంటి విభేదాలు
లేవని క్రీస్తుమతము నొక్కి చెప్పుచున్నది.
377
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
ఆధునిక కాలమున ప్రపంచమునకు యీ విధమైన ప్రేమ సందేశములు
యిచ్చిన మహనీయులలో రవీంద్రనాథ టాగూరును మొట్టమొదట లెక్కింపవలసి
యుండును. ఆయన ప్రపంచ పౌరుడు. ఆయనది యేక ప్రపంచ దృక్పథము. మానవుల
మధ్య కులము, జాతి, దేశము, రంగు అను అడ్డుగోడలు ఉండరాదనియు, అటువంటి
గోడలను నిర్మూలించవలెననియు రవీంద్రుడు ఉపన్యాసాల యందును, రచనల
యందును తెలిపియున్నాడు. భారతజాతిపిత గాంధీజి సత్యము, అహింస యను
గొప్ప ఆదర్శములను ప్రచారము చేసి ప్రపంచమునకు ఒక దివ్య సందేశమును
యిచ్చినాడు. మన ప్రియనాయకుడు, ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ
రవీంద్రునికి, గాంధీజీకి మిక్కిలి సన్నిహితుడైన త్యాగమూర్తి. ఈ యిద్దరి పెద్దల చేత
ప్రభావితుడైన జవహర్లాల్ నెహ్రూ తన విదేశాంగ విధానమునకు ప్రపంచ
దృక్పథమును ముఖ్య ప్రాతిపదికగా చేసినాడు. జవహర్లాల్ నెహ్రూ పంచశీల
సిద్ధాంతమును యీనాడు ప్రపంచములోని అత్యధిక దేశాలు ఒప్పుకొనినవి. ఇది
ప్రపంచ దృక్పథమునకు గొప్ప విజయమని నిస్సందేహముగా చెప్పవచ్చును.
ఇది అణుబాంబుల యుగము. కొన్ని క్షణాలలో అనేక లక్షల మంది ప్రజలను
యెంత దూరముగా నున్నప్పటికిని నాశనము చేయగల ఆయుధాలు మనకు
దొరుకుచున్నవి. ఈ అణు ఆయుధాలు ప్రపంచమునకు రాగల ముప్పును
సూచించుచున్నవి. ఈ ముప్పు నివారించుటకు జవహర్లాల్ నెహ్రూ పంచశీల
సిద్ధాంతము ఒక్కటే శరణ్యము. అణు ఆయుధాల మారణశక్తిని గమనించినప్పుడు
ప్రపంచ దృక్పథము యొక్క ఆవశ్యకత వెల్లడి యగుచున్నది.
ఐక్యరాజ్య సమితి ప్రపంచ దృక్పథమును వ్యాప్తి చేయుట కొరకు కృషి
చేయుచున్నది. ఐక్యరాజ్య సమితిలో ఒకటి రెండు తప్ప ప్రపంచములోని ముఖ్య
దేశాలు అన్నియును సభ్యత్వము కలిగి యున్నవి. యుద్ధము యొక్క అవసరములేక,
ఐక్యరాజ్య సమితి యిప్పటివరకు కొన్ని సమస్యలను పరిష్కరించినది. ఇది మన
భవిష్యత్తుకు ఆశాజనకమైన సూచన. (ప్రపంచములో యుద్ధాలను పూర్తిగా
నివారించవలెను. దేశాల మధ్య, జాతుల మధ్య సమస్యలు శాంతియుతముగ
పరిష్కారము కావలెను. ఇందు కొరకు ఐక్యరాజ్య సమితి కృషి ఫలించి యేనాటికైనను
సమస్త ప్రపంచానికి యేకైక ప్రభుత్వము యేర్చడవలసిన ఆవశ్యకత కలదు. ఇట్లు
జరుగుట కొరకు ప్రపంచ దృక్పథము ప్రధాన ప్రాతిపదిక కావలెను.
378
మన కళా నంవద - సాపొత్యము
మానవ స్వత్వాలు - లోక శ్రేయస్సు
ఎల్ల లోకము ఒక్కయిల్లు కావలెనని, వర్ణభేదము లెల్ల కల్ల కావలెనని స్వర్గీయ
గురజాడ అప్పారాయ కవీంద్రుడు కలలు గాంచినాడు; జాతి భేదములన్న గొలుసులు
జారిపోవలెనని ఆశించినాడు. ఈ విధముగా కలలు గాంచినవారు, ఆశలు
పొందినవారు అన్ని దేశాలలోను, అన్ని కాలాలలోను కనుపించుచున్నారు. ఈ స్వప్నాలు
సత్యము కావలెననినచో, యీ ఆశలు ఫలించవలెననినచో, మానవునికి మానవునికి
మధ్య అడ్డుగోడలు అదృశ్యము కావలసిన అవసరము కలదు. ఒక మానవుడు
మరొక మానవుని, రంగు, జాతి, దేశము, ప్రాంతము, మతము, కులము మొదలైన
విచక్షణలను పాటించక సాటి మానవునిగా గుర్తించి వ్యవహరించవలసి యుండును.
లోకకల్యాణానికి ఇది ప్రధాన ప్రాతిపదిక. అనగా మానవ స్వత్వాల పరిరక్షణ మీద
లోక గ్రేయస్సు ఆధారపడి ఉన్నది.
మానవ చరిత్రవైపు ఒకసారి మన దృష్టిని ప్రసరించినచో, మానవస్వత్వాలను
కాపాడి ప్రపంచ కల్యాణానికి రాచబాటను వేయుటకు ప్రయత్నాలు జరిగిన
సంఘటనలు కొన్ని మనకు కనిపించుచున్నవి. కారుమబ్బుల మధ్య తళుక్కుమను
మెరపుతీగల వంటివి యీ సంఘటనలు.
1943ప సంవత్సరమున డిసెంబరు నెల 10వ తేదినాడు ప్యారిస్ నగరములో
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశము జరిగినది. ఈ సమావేశములో
లోకగ్రేయస్సును దృష్టిలో నుంచుకొని, అందుకు అనుగుణముగా మానవ స్వత్వాల
ఉద్దాటన జరిగినది. ఒక ప్రపంచ వేదిక నుండి ఇటువంటి అసందిగ్ధ ప్రకటన
జరుగుటకు ఇదియే తొలిసారి. ఇంతకు పూర్వము ఇటువంటి ప్రయత్నాలను ప్రవక్తలు
కొందరు గావించినప్పటికి, రాజకీయమైన ప్రపంచ వేదిక నుండి, మానవుని
హక్కులను గూర్చి స్పష్టమైన (ప్రకటన ్రప్రథమముగా యీసారియే జరిగినదని
చెప్పినచో, సత్యానికి తలవంపులు కలుగ జాలవు.
ఈ సందర్భమున యీ ప్రకటన జరుగడానికి కారణాలను గూడ మనము
తెలిసుకొనవలసి యున్నది. ఒక మానవుడు మరొక తోటి మానవుని తనతో
సమానునిగా చూడక, తనకన్న తక్కువవానిగా భావించి, కొన్ని సందర్భాలలో
379
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
జంతువుకన్న హీనముగా చూచిన, చూచుచున్న నిదర్శనాలు మనకు అన్ని దేశాలలోను
కనుపించుచున్నవి. వర్ణము, వర్గము, కులము, మతము అను విభేదాలు యీ కొద్ది,
గొప్ప విచక్షణ భావాలకు కారణభూతమైనవి. మన దేశములో నిన్నటి వరకు
అస్పృశ్యత పాటించబడి, హరిజనులను అంటరానివారిగా జూచిన సంగతి అందరికి
తెలిసియే యున్నది. స్వతంత్ర భారత రాజ్యాంగము యీ అంటరానితనమును
నిషేధించినది. దక్షిణాఫ్రికాలో భారతీయులు మన దేశములోని అస్పృశ్యుల వలె
చూడబడుట, యీ విషయమై గాంధీజీ వంటి వారు నిర్వహించిన పోరాటాలు,
తరువాత ఐక్యరాజ్య సమితి నుండి చేసిన తీర్మానాలు, ఇంతవరకును, వాని వలన
సత్‌ఫలితాలు కలుగకపోవుట ప్రపంచ పరిస్థితులు తెలిసినవారందరు బాగుగా
గమనించిన సత్యమే. అమెరికాలోని నీగ్రోలు సమాజములో మిక్కిలి హీనముగా
చూడబడుచున్నారు. నీగ్రో విద్యార్థులు తెల్లవారు పఠించు పాఠశాలలకు వచ్చుట
తమకు అవమానకరముగా శ్వేతముఖులు భావించుచున్నారు. ఐక్యరాజ్య సమితి
స్థాపక సభ్యత్వము కలిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలలోనే ఇటువంటి భావాలు
కనుపించుచున్నవి. ఈ మధ్య అమెరికా సుప్రీంకోర్టు ఇటువంటి విచక్షణ నిషేధించుచు
తీర్చు నిచ్చినది. ఈ తీర్పు అమలుకు సైనికులు వచ్చి బలప్రయోగము చేయవలసిన
పరిస్థితి సంభవించినది. ఇంగ్లండులో కొన్ని నెలల క్రింద నల్లవారు వీధులలో
తిరిగినప్పుడు తెల్లవారు చేసిన అత్యాచారాలను గూర్చి పత్రికా పాఠకులందరు చదివియే
యున్నారు. ఈవిధముగా ప్రపంచములోని దేశాలలో వివిధ కారణాలను నెపముగా
పెట్టి ఒక మానవునితో మరొక మానవుడు అతి నీచముగా వ్యవహరించిన
సంఘటనలు కనుపించుచున్నవి. ఈ విచక్షణను తొలగించవలసిన అవసరము కలదు.
ఐక్యరాజ్యసమితి గావించిన మానవహక్కుల ప్రకటన యొక్క ఉద్దేశము ఇదియే.
ఈ ప్రకటనలో మానవ హక్కులను గూర్చి ఉల్లేఖించిన అంశాలను యీ
సందర్భమున తెలుసుకొనవలసి యున్నది. ఈ అంశాల పరమలక్ష్యము మానవుని
ప్రాథమిక స్వత్వాల ఉద్దాటనమై యున్నది. మానవలోక మంతయును ఏ కుటుంబమని
ఇందులో స్పష్టము చేయబడినది. అందుచేత మానవులందరును, సమాన హక్కులు
కలిగి యుండవలెననియు, స్వాతంత్ర్యము, న్యాయము, శాంతి ప్రపంచములో
వర్ధిల్లుటకు యీ హక్కులను కాపాడుట మిక్కిలి అవసరమైనదనియు ఐక్యరాజ్య
సమితి ఉద్భాటించిన హక్కుల ఉపోద్దాతములో తెలియజేయబడినది. ఈ
ఉపోద్దాతములో మానవుని హక్కులను నిర్లక్ష్యము చేసి, అవమానపరచినందు
380
మన కళా నంవద - సాపొతృ్యము
వలనను, ఇందుకొరకు గావించిన పాపకృత్యముల వలనను మానవత్వము పట్ల
మహాపరాధము చేయ బడినదనియు, అందుచేత యీ అత్యాచారాలను, అమానుష
కృత్యాలను నిరోధించవలెననినచో, సమస్త ప్రపంచములో సకల దేశాల యందు
యీ హక్కులను కాపాడవలసి యుండుననియు ఇందులో నొక్కి చెప్పబడినది.
ఈ విధమైన ఉదాత్త ఆశయాలతో నిర్వచించిన యీ హక్కుల స్వరూపమును
గూర్చి గూడ కొంత తెలియజేయవలసిన ఆవశ్యకత కలదు. మానవులందరును
జన్మతఃస్వతంత్రులనియు, వారికి సంక్రమించు హక్కులలో యెటువంటి విచక్షణ
లేదనియు, మానవులు పరస్పరము సోదర భావముతో మెలగవలెననియు, ఇందులోని
మొదటి సూత్రము తెలుపుచున్నది. ఈ సూత్రముల ప్రకారము, వర్ణము, జాతి,
లింగము, భాష మతము, రాజకీయాభిప్రాయాలు, జన్మము, ఆస్తి మొదలైనవాని
వలన మానవుల మధ్య విభేదాలు కల్పించి హెచ్చు తగ్గులు పాటించుట ధర్మము
కాజాలదు. ప్రతి మానవునికి స్వేచ్చాయుత జీవితమును గడపుటకు భద్రత కలిగి
యుండుటకు సమాన హక్కులు కలవు. ఒకరిని బానిసగా చేసికొనుట సమంజసము
కాదు. బానిసతనమును, బానిస వ్యాపారమును సంపూర్ణముగా రద్దు చేయవలెను.
ఏ మానవునిపట్ల గూడ అమానుషముగా, క్రూరముగా వ్యవహరించగూడదు. ఏ
దేశములోనైనను, యే మానవునినైనను చట్టరీత్యా ఒక వ్యక్తిగా పరిగణించవలసి
యుండును. చట్టము మరియు శాసనము మానవుల మధ్య విచక్షణను పాటించరాదు.
చట్టరీత్యా లభించు రక్షణలు సర్వమానవులకు సమానముగా లభించవలెను. ఏ
మానవుని గూడ నిరంకుశముగా నిర్బంధించుటగాని, ప్రవాసము పంపించుటగాని
న్యాయము కాదు. ఒక మానవుని హక్కులను, బాధ్యతలను నిర్ణయించునప్పుడు
గాని, క్రిమినల్ ఆరోపణలను చేయునపుడు గాని, స్వతంత్రమైన, నిష్పక్షపాతమైన
విచారణ అవకాశము లభింపజేయవలెను.
ఒక వ్యక్తి కుటుంబము, ఇల్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు మొదలైన ఆంతరంగిక
వ్యవహారాలలో ఇతరులు యెటువంటి జోక్యము మరియు (ప్రతిబంధకము కలిగించ
గూడదు. ఒక వ్యక్తి యొక్క గౌరవమునకు, కీర్తికి హాని కలిగించరాదు. ఇటువంటి
ప్రతిబంధకము మరియు హాని కలిగినప్పుడు చట్టము రక్షణనీయవలసి యుండును.
స్వదేశములో ఒకచోటి నుండి మరొక చోటికి వెళ్లుటకు ప్రతివ్యక్తికి సమాన
స్వాతంత్ర్యము లభించవలెను. స్వదేశమును విడిచి వెళ్లుటకు, స్వదేశమునకు తిరిగి
381
డా/ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
వచ్చుటకు, ప్రతి వ్యక్తికిని సమాన స్వాతంత్ర్యము లభించవలెను. స్వదేశములో
అత్యాచారమునకు గురియెనప్పుడు విదేశాలలో ఆశ్రయము పొందు హక్కు ప్రతి
మానవునికి కలదు. స్త్రీ పురుషు లందరికినీ వివాహ వ్యవహారాలలో సంపూర్ణ స్వేచ్చ
మరియు సమాన హక్కులు లభించవలెను. ఇందుకు జాతి, మత, వర్ణ విభేదాలు
'ప్రతిబంధకము కారాదు. వైవాహిక జీవితమును గడుపునప్పుడును, యే
సందర్భములోనైన వివాహ విచ్చేదము గావించుకొనవలసి వచ్చినప్పుడును, సమాన
హక్కులను స్తీ పురుషులు కలిగి యుండవలెను. శాంతియుత సమావేశ స్వాతంత్ర్యము
ప్రతివారును కలిగి యుండవలెను. ఏ సంఘములోను సభ్యత్వము విషయమై
నిర్బంధము విధించగూడదు. ఉద్యోగాలలో ప్రవేశమునకు సమానమైన హక్కులను
పౌరులు కలిగి యుండవలెను. ఒక దేశము యొక్క ప్రభుత్వము ఆ దేశీయులైన
పౌరుల అభిమతము ప్రకారము జరుగవలెను. ఈ అభిమతము నిర్ణీతమైన గడువును
అనుసరించి జరుగు ఎన్నిక ద్వారా వెల్లడి కావలెను. ఎన్నికలలో పాల్గొను అవకాశము
ప్రతి వయోజనునికి లభించవలెను. ఎన్నిక రహస్య పద్ధతి జరుగుట అభిలషణీయము.
ఎన్నికలు స్వేచాయుతముగా జరుగవలెను. ఎన్నికలలో పౌరులకు సమానహక్కులు
లభించవలెను. ప్రతి వ్యక్తికిని తన వృత్తిని, ఉద్యోగమును నిర్ణయించుకొను స్వేచ్చ,
నిరుద్యోగము నుండి రక్షణ, సమానమైన పనికి సమానమైన వేతనము అవసరమైన
విశ్రాంతి, ఆరోగ్య సదుపాయము, అనుగుణమైన జీవన ప్రమాణము, తన యొక్కయు,
తన కుటుంబమ యొక్కయు క్షేమమునకు సంపూర్ణ సౌకర్యాలు లభించవలెను. ప్రతి
వ్యక్తికిని విద్యాభ్యాసమునకు సమాన సౌకర్యాలు లభించవలెను. కనీసము ప్రాథమిక
విద్య మట్టుకైనను ఉచితముగా లభింప జేయవలెను.
ఈ విధముగా నిర్వచించిన హక్కుల సూత్రాలలో బాధ్యతలను గూర్చి కూడ
ప్రస్తావించుట జరిగినది. హక్కులను, బాధ్యతలను విడదీయుటకు వీలులేదు. ఇవి
పరస్పరము ఆధారపడి యున్నవి. అందుచేత మానవుడు తన వ్యక్తిత్వము స్వేచ్చగాను,
సంపూర్ణముగాను వికసింప జేసికొనుటకు అనుగుణముగా, సమాజములో తాను
నిర్వహించవలసిన బాధ్యతలను గూర్చి యీ సూత్రాలలో హెచ్చరిక చేయబడినది.
ఈ విధముగా తన హక్కులను సాధించుకొనునప్పుడు, ఇతరుల హక్కులను
కాపాడవలసిన బాధ్యత కూడ ప్రతి వ్యక్తిమీద కలదని యీ సందర్భమున స్పష్టము
చేయబడినది. భారతములో చెప్పిన ప్రకారము “ఒరులేయని యొనరించిన నరవర!
382
మన కళా నంవద - సాపొత్యము
యప్రియము తన మనంబున కగు, దానొరులకు నవి 'సేయకునికి, పరాయణము
పరమధర్మ పదముల కెల్లన్” అను సూత్రమునకు అనుగుణమైన వ్యక్తుల బాధ్యతలను
గూర్చి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటనలో ఉద్దాటించబడినది.
క్లుప్తముగా యీ హక్కుల సారాంశమును మనము తెలుసుకొనినాము. నిజానికి
ఇందులో తెలియజేసిన సంగతులు మిక్కిలి ఉదాత్తమైనవి. మానవకోటి క్షేమమునకు
ప్రపంచ శ్రేయస్సుకు మిక్కిలి ఉపయుక్తమైనవి. కాని యీ సందర్భమున ఒక
ముఖ్యమైన సంగతిని గమనించవలసి యున్నది. ఐక్యరాజ్య సమితి ఇంత స్పష్టముగా
యీ హక్కులను వివరించిన తరువాత గూడ వీనిని అమలు చేయని దేశాలు యీనాడు
ప్రపంచములో కనిపించుచున్నవి. ఇందుకు దక్షిణాఫ్రికాలోని భారతీయులు
అనుభవించుచున్న ఇక్కట్టులు మన యందరికి తెలిసిన ఉదాహరణము.
ఈ సందర్భములో ఒక ప్రతిబంధకము కనుపించుచున్నది. ఒక దేశము యొక్క
ఆంతరంగిక వ్యవహారాలతో ఐక్యరాజ్యసమితి జోక్యము కలిగించుకొనగూడదను
సంప్రదాయమొకటి కలదు. ఈ సంప్రదాయమును నెపముగా పెట్టుకొని
ఐక్యరాజ్యసమితి నిర్వచించిన యీ హక్కులను, యీ హక్కుల విషయమై
ఐక్యరాజ్యసమితి గావించిన తీర్మానాలను యీనాడు ప్రపంచములోని కొన్ని రాజ్యాలు
ఉల్లంఘించుచున్నవి. ఈ ఉల్లంఘనను నివారించనంతవరకు యీ హక్కులను
అమలుచేయుట సాధ్యము కాజాలదు.
ఈ హక్కులను నిర్భంధముగా విధించుటకు తగిన బలము మరియు శక్తి
ఐక్యరాజ్యసమితికి లేకపోవుట ఒక లోపముగా తోచుచున్నది. అందుచేత
ప్రపంచములో యీ విషయమై బలమైన అభిప్రాయము యేర్చడవలసిన అవసరము
కలదు. ఇందుకొరకు తగిన ప్రచారము మరియు ప్రబోధము జరుగవలెను. ప్రపంచ
ప్రజలందరును యీ హక్కులను ఏక కంఠముగా ఆమోదించి బలపరచినప్పుడు, ఏ
శక్తి గూడ దీనికి అడ్డము రాజాలదు.
383
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
తెలుగుసీమలోని రైతు - సాంస్కృతిక జీవితము
తెలుగుసీమలోని పల్లెపట్టులు అందాల దీవులు. భారతావనిలోని అన్ని ప్రాంతాల
వలెనే తెలుగుసీమ జనాభాలోని మిక్కిలి యెక్కువ భాగము గ్రామ ప్రాంతాలలో
నివసిస్తున్నది. ఈ పల్లెటూరి ప్రజలలో నూటికి తొంబది వంతులకు పైగా
ప్రత్యక్షముగనో, పరోక్షముగనో వ్యవసాయము మీద ఆధారపడి వున్నారు. అందుచేత
తెలుగుసీమకు రైతు ఆయువు పట్టని నిస్సందేహంగా చెప్పవచ్చును.
తెలుగు దేశములోని రైతు జీవితము విశిష్టమైనది సంవత్సరం పొడుగునా,
పన్నెండు నెలలు, మూడు నూర్ల అరువది రోజులు, రైతు గడియారమువలె పని
చేస్తుంటాడు. ప్రొద్దున మేల్మొన్నప్పటి నుంచి రాత్రి నిద్రపోయేవరకు రైతు కార్యక్రమము
నిర్ణీతమై ఉంటుంది. ఈ విధముగా క్రమశిక్షణతో కష్టపడి పని జేసే రైతు జీవితంలోకి
కొంచెం తొంగి చూస్తే అందులో కళాసౌందర్యానికి ఆటపట్లయిన ఘట్టాలు గోచరం
కాగలవు. ఈ ఘట్టాలు రైతు సాంస్కృతిక జీవితానికి ప్రతిబింబాలు. మతము, కళ
రెండూ రైతు సాంస్కృతిక జీవితానికి ప్రధాన ప్రాతిపదికలు.
రైతు జీవితము శుష్మమైనది కాదు; అది రసహీనము కాదు. హృదయాన్ని
కదలించే సంఘటనలు, మనస్సును ఆకర్షించే దృశ్యాలు ఆధునిక నాగరికత చేత
కలుషితము కాని ఉదాత్త భారతీయ సంస్కృతి రైతు జీవితములో అడుగడుగునా
చూడవచ్చును. నూటికి పన్నెండు కన్న మించని అక్షరాస్యులు మాత్రమే వున్న మన
దేశములో రైతులు వ్రాయను, చదవను, నేర్చినవారు కాదని ప్రత్యేకముగా చెప్పవలసిన
పని లేదు. కాని ఒకసారి యే పల్లెటూరికైనా వెళ్ళి మనము కొందరు రైతులతో
సంభాషిస్తే, మన భారతీయ పురాణాలను గూర్చి రైతుకు తగినంత విజ్ఞానము వున్నట్లు
స్పష్టంగా గ్రహించవచ్చును. రామాయణ భారతాలు రైతుకు బాగా పరిచితమైనవి;
శ్రుతిపాండిత్య ఫలితమైన విజ్ఞానము రైతుకు తగినంత వున్నది. పశువుల వ్యాధులకు
చికిత్స రైతు విజ్ఞానములో ఒక ముఖ్యమైన భాగము. పాము కాటుకు, తేలు కుట్టుకు
చేయవలసిన చికిత్సలో రైతు మంచి నేర్చరి.
మన రైతు విజ్ఞానములో, సంస్కృతిలో ఒక ముఖ్య భాగము పరంపరా గతముగా
అతనికి సంక్రమించినటువంటిది. తరతరాల నుండి వచ్చిన సంప్రదాయాల, ఆచారాల
384
మన కళా సంవద - సాపొత్యము
ప్రభావము తాతముత్తాతల నుండి, అమ్మమ్మ నాయనమ్మల నుండి నేర్చుకొనిన
సంగతులు తెలుగుసీమలోని రైతు సాంస్కృ తిక జీవితానికి ప్రత్యేకతలు. మనదేశములో
మొట్టమొదటిసారి 1952 సంవత్సరంలో వయోజన వోటింగ్ పద్ధతిపైన జరిగిన
సాధారణ యెన్నికలను జూచి, పాశ్చాత్యదేశాలలో కొందరు, “ఇంత పెద్ద దేశములో,
ఇన్ని కోట్ల సంఖ్యలో మొట్టమొదటిసారి ప్రజలువోటు వేసినప్పటికినీ, యే విధమైన
రక్తపాతము జరుగలేదే” యని ఆశ్చర్యపడిన వారికి సమాధానము చెపుతూ, శ్రీ
సి.పి.రామస్వామి అయ్యర్‌గారు “ఇది మా దేశములోని పల్లెపట్టుల యందు నివసిస్తున్న
రైతు జీవితపు ఉదాత్త సంస్కృతికి నిదర్శనమని చెప్పి ఉండిరి. మంచిచెడ్డల విచక్షణలో
నేర్పు, ఓర్పు, పరమత సహనము, రైతుకు ఉగ్గుపాలతో అలవడినటువంటి మంచి
గుణాలు. ఈ సద్గుణాలే రైతు సాంస్కృతిక జీవితానికి శోభను చేకూరుస్తున్నవి.
రైతు ఈ సాంస్కృతిక జీవితములో మతానికి ప్రత్యేక ప్రాధాన్యత వున్నది.
మన రైతులో మత విశ్వాసము ప్రగాఢంగా కనుపిస్తుంటుంది. దైవభక్తి, పాపభీతి
రైతులో మిక్కుటము. రైతు ఇంటిలో యే శుభకార్యము జరిగినా ఇలవేలుపు పూజతో
అది ప్రారంభము కావలసి వుంటుంది. మత విశ్వాసము రైతు నిత్య జీవితములో
అడుగడుగునా గోచరిస్తుంటుంది. బొట్టూ, జుట్టూ రెండూ రైతుకు అనివార్యమైన
బాహ్యలక్షణాలు. పంచాంగములో రైతుకు పరిపూర్ణమైన నమ్మకము వున్నది. కొత్త
బట్టలు కట్టుకొసడానికి మంచిదినము కావాలె, ప్రయాణానికి మంచిరోజు కావాలె,
క్షౌరానికి మంచిదినము కావాలె. దుర్ముహూర్తమూ, వర్ణ్యమూ రైతు బాగా పాటించే
సంగతులు. ఈ సందర్భాలలో రైతు మంచిపనిని దేనినీ చేయడానికి ఇష్టపడడు.
పున్నమ అమావాస్యలు, గ్రహణాలు రైతుకు సుపరిచితమైన సందర్భాలు.
సాంస్కృతిక జీవితములో గమనించదగిన విశేషాలలో వేషభాషలు
ప్రధానమైనవి. మన పల్లెటూరి రైతు వేష, భాషలలో ప్రత్యేకత ఉంటుంది. పల్లెటూరి
సామెతలు, లోకోక్తులు మనకు తెలియని చక్కని తెలుగు మాటలు ఎన్నింటినో రైతు
సంభాషణలో మనము బాగా పోల్చుకోవచ్చును. తెలుగుదేశములోని రైతును
తలుచుకోగానే, అతని కోరమీసాలు మన యెదుట ప్రత్యక్షమౌతవి; అతని
దండకడియాలు మనకు కనుపిస్తవి; అతని చెవుల పోగులు, (వ్రేలి ఉంగరాలు మన
కండ్ల ముందు గోచరిస్తవి. అతని తలపాగా మనకు జ్ఞప్తికి వస్తుంది. ఆ తలపాగా
385
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
చుట్టే పద్ధతిలో రైతు జూపించిన నేర్పు మనము చక్కగా పరిశీలించవచ్చును. రైతు
కట్టే ధోవతులు, ఆ ధోవతుల అంచులు, రంగులు, రైతు అభిరుచికి మంచి నిదర్శనాలు.
కోడికూత రైతును ప్రొద్దున్నే మేలుకొలిపే అలారం గడియారం. కోడి, కుంపటి
ఈ రెండూ రైతుల యిండ్లలో మనకు ప్రత్యేకంగా కనపడుతుంటవి. కోడికూతతో
లేచే రైతు ప్రతిరోజు తన దైనందిన కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించుకుంటాడు.
సోమరితనము అనే మాట రైతు నిఘంటువులో లేదు. వాతావరణాన్ని బాగా గమనించి,
కాలమూ, సమయమూ నిర్ణయించుకొని తన పనులు నెరవేర్చుకోవడం రైతుకు
అలవాటు. ఇందుకు కార్తులు రైతుకు మార్గదర్శకంగా ఉంటవి. రోహిణీకార్తెలో వర్షాలు
పడి చెరువులు నిండితే అది ఆ సంవత్సరము రైతు అదృష్టానికి మంచి సూచన.
తరువాత ప్రతి కార్తెను గమనిస్తూ ఉండే రైతు యే కార్తెలో దుక్కి దున్నవలెనో, యే
కార్తెలో విత్తనాలు వేయవలెనో, యే కార్తెలో నారు పోయవలెనో, వరికి యే కార్తె
అనుకూలమో, మొక్కజొన్నకు యే కార్తె మంచిదో తెలుసుకొని వ్యవసాయ
కార్యకలాపాలు దిద్దుకొనడంలో మంచి ప్రవీణుడు. ఈ ప్రావీణ్యమే రైతు ఈ
వ్యవసాయములో సాధించగల విజయానికి ముఖ్య కారణము. వ్యవసాయాన్ని కళగా,
శాస్త్రంగా ఆరాధించే రైతు దేశ శ్రేయస్సుకు వెన్నెముక.
తెలుగుసీమలో దేవాలయము లేని ఊరు లేదు. హనుమదాలయము,
శివాలయము, రామాలయము మొదలైన దేవాలయాలు రైతు సాంస్కృతిక జీవితానికి
మార్గదర్శకాలు. ఈ దేవాలయాల నిర్వహణకు రైతు ముఖ్య పోషకుడు. పంటలు
పండిన తరువాత కళ్ళము మీదనే తన వంతు భాగమును రైతు దేవాలయానికి
సమర్చించడము, గ్రామీణ జీవనముతో పరిచయము ఉన్నవారందరికీ తెలిసిన సంగతే.
ప్రతి రైతు కుటుంబానికి ఒక ఇలవేలుపు అనివార్యంగా ఉండడం ప్రతివారికి తెలిసిన
సత్యమే. ఈ ఇలవేలుపుకు ముడుపులు, మొక్కుబడులు చెల్లించడం తరచుగా
జరుగుతుంటుంది. పౌరాణిక దేవతలతోపాటు శాక్తేయమైన దేవతలను గూడ
ఆరాధించడం రైతు జీవితంలో మనకు కనుపిస్తుంది. ఈ దేవతలకు కోళ్ళను, గొట్టెలను
బలి యాయడం, కనకదుర్గ, కాళి, ఎల్లమ్మ, మరిడమ్మ మొదలైన పేర్లతో యీ శక్తి
పూజ చేయడం పల్లెటూళ్ళలోని రైతులకు పరిపాటి. ప్రతి సంవత్సరము యీ
దేవాలయాల ఉత్సవాలు, దేవతల జాతరలు జరుగుతుంటవి. వీటన్నిటికి రైతు
386
మన కళా నంవద - సాపొత్యము
సహాయము, ప్రోత్సాహము పూర్తిగా లభిస్తవి. తెలుగుసీమలో కొన్ని జాతరలు చాల
ప్రసిద్ధమైనవి. కొత్త కొండకొరివి, అయ్యనవోలు మొదలైన చోట్లలో ప్రతి సంవత్సరము
జరిగే జాతరలకు రైతు బండి కట్టుకొని, ఆ బండిని చక్కగా అలంకరించుకొని
కుటుంబంతోపాటు తీర్ధము పోవడం జరుగుతూ ఉంటుంది.
రైతుకు పండుగలను చేసుకోవడంలో చాల ప్రీతి. కొన్ని పండుగలు ప్రత్యేకంగా
రైతుకు సంబంధించినవే. ఏరువాక పున్నమ ఇందులో మొట్టమొదలు చెప్పదగింది.
ఈ పండుగనాడు రైతులు ఎడ్లను పూజిస్తారు. ఆనాడు ఎద్దులను కట్టివేసి కొట్టాన్ని
అలికి, శుభ్రపరచి, ఎద్దులను కడిగి, కొమ్ములకు రంగులు వేసి ఒంటిమీద చిత్ర
విచిత్రమైన ముద్రలు వేసి, గజ్జెలు, గంటలు కట్టి కనులపండువుగా అలంకరించి
ఊరేగుట ముఖ్య కార్యక్రమము. ఉగాదినాడు రైతులు సాయంకాలము దేవాలయములో
సమావేశమై, ఆ సంవత్సరము కాలమాన పరిస్థితులను, తమ అదృష్టాలను
తెలుసుకోవడం జరుగును. దసరా నాడు జమ్మిని తీసికొనుటకు వెళ్లే రైతుల
సమూహము, యీ సంవత్సరములో మనకు కనుల గట్టినట్లుండే మరొక దృశ్యము.
శ్రీరామనవమినాడు బండ్లు కట్టుకొని ఊరేగుట కూడ ఇటువంటి దృశ్యమే. దీపావళి
మొదలైన పండుగలను రైతులు అత్యంత ఉత్సాహముతో జరుపుకుంటారు. సంక్రాంతి
అచ్చంగా రైతుల పండుగే. సంక్రాంతి పండుగ సమయానికి పల్లెటూళ్ళ సౌందర్యము
ప్రత్యేకంగా చూడతగింది. కందిచేలతో, బంతిపూలతో, దోసపండ్లతో శోభించే ప్రకృతి
మధ్య అప్పటివరకే పంట చాలమట్టుకు చేతికి అందిన రైతు తన కుటుంబంతోపాటు
సంతోషముతో, సంతృప్తితో ఉంటాడు.
రైతులకు ప్రత్యేకమైన వినోదాలు ఉన్నవి. తోలుబొమ్మలాటలు, వీధి నాటకాలు,
యీ వినోదాలలో చాల ముఖ్యమైనవి. తీరిక దినాలలో రాత్రంతా తోలుబొమ్మలాటలను
చూస్తూ ఆనందించే రైతులు యీ ఆటగాళ్ళను చాలకాలము నుండి పోషిస్తూ
వచ్చినారు. ఇదే విధంగా తీరిక సమయాలలో పగటిపూట కథలు చెప్పించుకొని,
విని ఆనందించడం సుప్రసిద్ధమైన సంగతి. ఈ కథల్లో బాలనాగమ్మ, బొబ్బిలికథ
మొదలైనవి పేర్కొనదగినవి. పురాణ కాలక్షేపాలకు హాజరు కావడం రైతు సరదాలలో
వొకటి. వర్షాలు సకాలంలో పడకపోతే, విరాటపర్వము పురాణము చెప్పిస్తే వానలు
కురియగలవని రైతు విశ్వాసము. ఈ విధంగా విరాటపర్వము పురాణం చెప్పించడం
387
దా దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
పల్లెటూళ్ళలో జరుగుతుంటుంది. సంక్రాంతి పండుగ సమయాలలో కోడిపందెములు
తెలుగు దేశములో సుప్రసిద్ధమైనవి. ఈ మధ్య యీ కోడి పందెములు వేయు ఆచారము
కొంత అంతరించినట్లు కనపడుతున్నది.
రైతుకు ప్రత్యేకమైన వినోదాలు, విలాసాలతోపాటు ఆటలు, పాటలు కూడా
ఎన్నో ఉన్నవి. పులిజూదము పల్లెటూళ్ళలోని రైతు కుటుంబాలు మక్కువతో ఆదరించే
ఆట పాచికల ఆట, చదరంగము, పచ్చీసు మొదలైన ఆటలు కూడ రైతుకు
ప్రియమైనవి. హాయిగా పాడుకోవడం రైతు మనస్సుకు ఉల్లాసము కలిగించే మధుర
సన్నివేశము. సాయంకాలము పూట పశువులను తోలుకొని ఇంటికి వెళ్ళే సందర్భాలలో
పాటలు పాడుకునే రైతులు మనకు పల్లెటూళ్ళలో కనుపిస్తారు. వడిగల యెద్దులు
కట్టుకొని బండిని వేగముగా తోలుకొని పోయేటప్పుడు ఆనందముతో పాడుకునే
రైతులు మనకు పల్లెటూళ్ళలో కనుపించుతారు. సుందరమైన ప్రేయసులను
జూచినప్పుడు, హృదయము ఉప్పొంగగా, ప్రేమగీతాలు ఆలపించే రసికులు మనకు
రైతుల్లో కనుపిస్తారు. మంచె మీద గూర్చుండి వడిసెలను రువ్వుతూ పాటపాడే ఆర్ధ
హృదయులను మనము రైతుల్లో చూడవచ్చును. కోతల సమయాలలో, కలుపుదీసే
సమయాలలో, పొలాలలో వినిపించే రాగాలు రైతుకు గానము మీద గల అభిమానానికి
తార్మాణములు.
ఈ విధంగా తెలుగు సీమలో రైతు జీవితాన్ని పరిశీలించినప్పుడు అందులో
ఒక ప్రత్యేక సంస్కృతీ వైభవము మనకు గోచరిస్తుంది. ఈ సంస్కృతి
బహుముఖమైనది. ఈ సంస్కృతిలో విజ్ఞానము, వినోదమూ రెండూ సమ్మిళితమై
ఉన్నవి. చెమటయోద్చి, కష్టపడి పనిజేసి, దేశ సంపదను అభివృద్ధి చేయడానికి
కృషి జేసే రైతు కుటుంబాల కష్టసుఖాలు, ఒడుదొడుకులు, ఆర్థిక సామాజిక జీవనము
ఈ సంస్కృతిలో మనకు కనుపించుతవి.
388
మన కళా నంవద - సాపొత్యము
గ్రామాలలోని వేడుకలు - క్రీడా వినోదాలు
గౌతమీ కృష్ణవేణులకు ఆవాసమై పాడిపంటలకు నిలయమైన తెలుగుసీమ
లోని పల్లెపట్టులలో కళాసౌందర్యము అడుగడుగున గోచరిస్తున్నది. తెలుగువారి భాష
యెంత మధురమైనదో, వారి సామాజిక జీవనమంత సుందరమైనదని చెప్పితే
అతిశయోక్తి ఆవంతయును గాదు. భారతదేశ మంతటిలో నున్నట్లే తెలుగుసీమలో
గూడ నూటికి తొంబదిపాళ్ల జనులు పల్లెటూళ్లలో నివసిస్తున్నారు. ఈ పల్లెటూళ్లలో
తరతరాల నుండి వ్యాప్తిలో నున్న వేడుకలు, క్రీడావినోదాలు యెన్నియో కలవు. ఈ
క్రీడావినోదాలలో తెలుగువారి సుకుమార అభిరుచి ప్రతిబింబిస్తున్నది. (శతాబ్దాల
నుండి జనులకు ఆదరణీయములైన యీ వేడుకలు, క్రీడావినోదాలు యీనాడు
తమ ప్రాధాన్యమును కొంత కోలుపోతున్నవి.)
స్రీలకు, పురుషులకు, బాలబాలికలకు (ప్రత్యేకంగా కొన్ని వినోదాలు,
ఆటపాటలు ఉన్నవి. వీనితోపాటు స్త్రీ పురుషులకు సమానముగా ఆదరణీయములైన
వినోదాలు, క్రీడలు కూడ కొన్ని కలవు. ఈ క్రీడలలోను, ఈ వినోదాలలోను తెలుగు
ప్రజల స్వభావ గుణమైన సౌందర్యరక్తి మనకు స్పష్టంగా కనుపిస్తుంది. ఇందులో
కొన్ని విశ్రాంతి దొరికినప్పుడు, ఆటవిడుపు కొరకు ఉద్దేశించిన క్రీడావినోదాలు;
మరికొన్ని పండుగపబ్బాలలో సర్వజనులు సమానముగా ప్రోత్సహించి, ఆనందించే
వినోదాలు; ఇంకొక కొన్ని పెండ్లిండ్లు మొదలైన శుభకార్యాల సందర్భాలలో నిర్వహించే
వేడుకలు. కొన్ని క్రీడలు, వినోదాలు శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో
నుండునవి. వేరొక కొన్ని కొన్ని క్రీడలు సార్వజనికమైనవి. అన్ని తరగతుల ప్రజలకు
అందుబాటులో నుండునవి. ఈ విధంగా జనుల ఆర్థిక స్థితిని అనుసరించి, వయసును
అనుసరించి, విజ్ఞానమును అనుసరించి మనోరంజనము గావించు క్రీడలు,
వినోదాలు తెలుగుసీమలో పుష్కలంగా వున్నవి.
ఈ వినోదాలలోను, వేడుకలలోను, పాటలను మొట్టమొదలు పేర్కొనవలసి
ఉంటుంది. పొలములో కలుపు దీసే పడుచులు, ఎద్దులను గాసే బాలకులు,
సంపన్నుల ఇండ్లలో కావలసినంత తీరికవున్న స్త్రీలు, బాలికలు, ఈ పాటలను
389
దా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
పాడుతూ ఉంటారు. పూర్వకాలంలో తుమ్మెదపదాలు, పర్వతపదాలు, శంకరపదాలు,
నివాళిపదాలు మనదేశములో అధికవ్యాప్తిలో వున్నట్లు తెలుస్తున్నది. కాని యీనాడు
యీ పాటలు యించుమించుగా నశించినవనే చెప్పవలసి వున్నది. సేద్యము చేస్తూ
కూలీలు పాడే జాజర పాటలు యీనాటికిని కొన్ని ప్రాంతాలలో విశేష వ్యాప్తిలో
వున్నవి. మన హైద్రాబాదు నగరానికి నూరుమైళ్లలో నున్న వరంగల్ జిల్లా మానుకోట
తాలూకాలో యీ పాటలను రైతు యువకులు మక్కువతో యీనాటే కీ
పాడుకుంటున్నారు. ప్రత్యేకంగా స్రీలు పాడుకొనే పాటలు గూడ యెన్నో వున్నవి.
ఇందులో పెండ్లి పాటలు, కూతురుని అత్తమామలకు అప్పగించే సందర్భంలో పాడే
అప్పగింత పాటలు, మంగళహారతులు, ముఖ్యంగా 'పేర్కొనదగి వున్నవి.
తెల్లవారకముందే లేచి, మేలుకొలుపులు ఆలపించే అలవాటు యీనాటికిని మన
పల్లెటూళ్లలోని పూర్వపద్ధతి కుటుంబాలలో కనుపిస్తున్నది. పసిపిల్లలను ఉయ్యాలలో
నిద్రబుచ్చుట కొరకుపాడే జోలపాటలను, మన దేశంలో విననివారు వుండరని
చెప్పవచ్చును. ఈ విధంగా వివిధములైన పాటలు, వివిధ సందర్భాలలో మన
పల్లెటూళ్లలో వీనులకు విందు జేస్తుంటవి.
ఆటలకూ, పాటలకు వీడరాని చుట్టరికమున్నది. తెలుగు పల్లెలలో రకరకాలైన
ఆటలను మనము చూడవచ్చును. ఈ ఆటలు, మనస్సుకు ఉల్లాసము కలిగించే
వేడుకలు. ఇందులో సమస్త జనులను ఆకర్షించే తోలుబొమ్మలాట సుప్రసిద్ధమైనది.
ఈ తోలుబొమ్మలాట తెనుగువారి (ప్రత్యేకత. వారు అనేక సంవత్సరాల నుండి
ఉపాసించిన కళ. ఒక సన్నని బట్టను తెరగా గట్టి ఆ తెర వెనుక పెద్ద దివిటీలు
వెలిగింతురు. తెర వెనుక తోలుబొమ్మల కాళ్లకూ, చేతులకూ దారాలు గట్టి బొమ్మలను
నిలబెట్టి దారాలను లాగుతూ, దివిటీల వెలుగులో వానిని ఆడింతురు. ఈ ఆటను
ఆడించే నిపుణులైనవారు కొందరు మన పల్లెటూళ్లలో తిరుగుతూ ఉంటారు. ఈ
తోలుబొమ్మలాటలు యెక్కువగా రామాయణ, భారత కథలకు సంబంధించినవి.
నిజానికి రామాయణమూ, భారతమూ మన దేశీయులలో ప్రతి రక్త కణమునందును
జీర్ణించిన కథలు. ఈ తోలుబొమ్మలాటలు ఉపయోగించే హాస్యము అప్పుడప్పుడు
కొంత హద్దు మీరుతూ, కొంత అసభ్యంగా ఉండే ఘట్టాలు గూడ మనకు
కనిపించును.
390
మన కళా సంపద - సాహపొత్యము
ఈ తోలుబొమ్మలాటల వలెనే బహుళ ప్రచారము పొందినవి యక్షగానాలు
అనే వీధి నాటకాలు. ఈ నాటకాలను ఆడేవారిని జక్కులు అని పిలుస్తుంటారు.
భాగవతములోని కృష్ణలీలలు మొదలైన వానిని ఆడేవారిని భాగోతులని గూడ
పిలుస్తుంటారు. కొన్ని సంవత్సరాల క్రిందటి వరకు మన పల్లెటూళ్లలో, యీ భాగోతుల
ఆటలు విరివిగా జరుగుతూ ఉండేవి. ఎన్నో నూర్ల సంవత్సరాల నించి యక్షగానాలు,
తోలు బొమ్మలాటలతోపాటు, భాగోతాలు మన పల్లెటూళ్ల ప్రజలను రంజింప జేస్తున్న
వినోదాలు, వేడుకలు. ఇవన్నీ తెలుగువారి కళాభిరుచికి మంచి నిదర్శనాలు.
భజనమండలులను స్థాపించి, వారానికొకసారి (యే శనివారమునాటి సాయంత్రమో)
ప్రజలొకచోట సమావేశమై భజనలు గావించుట మన పల్లెటూళ్లలోని వినోదాలలో
ఒక ప్రత్యేకమైన వినోదము. ఇతరులు ఆడుతుండగా చూచి వినోదించే ఆటపాటలలో
చేరే వినోదాలు బొబ్బిలి కథ, బాలనాగమ్మ కథ మొదలైనవి. ఈ కథలను చెప్పేవారు
గంటలతరబడి, ఒక్కొక్కసారి ప్రొద్దంతా, పల్లెటూరి ప్రజలను ఆకర్షించి వినోదింప
జేస్తుంటారు. కాని యీనాటి మారిన పరిస్థితులలో వీటన్నింటికి వ్యాప్తి తగ్గిపోతున్నది.
ఈ కథలను జెప్పేవారి నేర్పు చాలగొప్పది; వినేవారి రక్తము ఉడుకెత్తునట్లుగా
వీరగాథలను వీరు చెప్పుచుందురు.
స్వయంగా పాల్గొని ఆనందించే ఆటలు పాటలు, మన పల్లెటూళ్లలో చాలా
కనుపిస్తున్నవి. రంకురాట్నము యీ విధమైన వేడుకలలో ఒకటి. జనులు యీ
రంకురాట్నము యెక్కి గిర్రున తిరుగుట అందరికీ బాగా తెలిసిన వినోదమే.
హైద్రాబాదు నగరంలో ప్రతి సంవత్సరము జరిగే అఖిల భారత ప్రదర్శనపు ఆవరణ
లోపల యీ వినోదాన్ని చూడవచ్చును. మన పల్లెటూళ్లకు ప్రత్యేకమైనది గిల్లీదండ
అనే ఆట. ఈ ఆట చాల పురాతనమైనది. తెలంగాణపు పల్లెటూళ్లలో దీనిని చిర్రగోనె
అని కూడ అంటారు. మన కవులు వ్రాసిన పుస్తకాలలో యీ ఆట మనోహరంగా
వర్ణింపబడింది. పల్నాటి వీరచరిత్రలో బాలచంద్రుడు యీ ఆట ఆడినట్లు
పేర్కొనబడింది. భారతంలో కౌరవపాండవులు యీ ఆటను ఆడినారంటే, యిది
యెంత పురాతనమైనదో తెలుస్తుంది. ఒక చిన్న కర్రముక్కను పెద్దకర్రతో కొట్టుతూ,
యీ ఆటను ఆడుతుంటారు. ఈ ఆటను క్రికెట్టుతో పోల్చవచ్చును. కొందరు దీనిని
స్వదేశీ క్రికెటు అని మెచ్చుకోవడం కలదు. కోడి పందెములు తెలుగు దేశీయులు
391
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
ప్రత్యేకంగా కొన్ని సంవత్సరాల క్రిందటివరకు అభిమానించిన ఆట. ముఖ్యంగా
సంక్రాంతి సందర్భములో, యీ ఆటను అత్యంత ఆసక్తితో ఆడేవారు. ఈ ఆట
గూడ పలనాటి వీరచరిత్రలో చక్కగా వర్ణింపబడింది. బొంగరాల ఆట మన
(గ్రామాలలో మిక్కిలి ప్రచారములో నున్న క్రీడ. పిల్లలకు యీ ఆటలో మిక్కిలి ఆసక్తి.
ఇవన్నీ గృహాల వెలుపల బహిరంగ ప్రదేశాలలో ఆడే ఆటలు. ఈ ఆటలు జరుగుతూ
వుంటే జనులు యెంతో ఉత్సాహంతో వీనిని తిలకించుతుంటారు.
ఈ ఆటలతోపాటు కాలక్షేపము కొరకు యిండ్లలో కూర్చుండి ఆడే ఆటలు
ప్రత్యేకమైనవి కొన్ని వున్నవి. ఈ ఆటలలో చదరంగము మిక్కిలి ముఖ్యమైనదే కాక
చాల ప్రసిద్ధి చెందినది. అసలు యీ ఆట మొట్టమొదలు మనదేశములోనే
ప్రారంభమైనదని కొందరు చెప్పుతుంటారు. ఏమైనప్పటికీ యీ ఆటకు మన
పల్లెటూళ్ళలోని కుటుంబాలలో మంచి ప్రచారము వున్నది. ఈ ఆట ఆడటంలో
కొందరు సాటి లేని నైపుణ్యము కలిగి వుంటారు. చదరంగము వంటి ఆట యింకొకటి
పులిజూదము. ఈ పులిజూదము మూడురకాలుగా వున్నది. ఒక పటము మీద
చిన్నరాళ్లనో లేక చింతగింజలనో తీసికొని, కొన్నింటిని పులులుగాను, మరికొన్నింటిని
మేకలుగాను భావించి, ఆడే ఆట యిది. పుళ్ళ సంఖ్య మూడింటికన్న మించదు.
మేకల సంఖ్య పదహారింటి వరకు వుంటుంది. ఒకరు పులులను తీసికొని యింకొకరు
మేకలను తీసికొని యీ ఆటను ఆదుచుందురు. ఇప్పుడు ప్రచారము తగ్గిపోయినా,
యిటీవల వరకు, మన పల్లెటూళ్ళలోని ఉన్నత కుటుంబాలలో విశేష ఆసక్తితో
ఆడిన ఆట పాచికల ఆట. దీనికి అక్షక్రీడ అని మరొక పేరు వున్నది. ఈ ఆట
గూడ తరతరాల నుండి మనదేశములోని ప్రజలను ఆకర్షించినది. మన ప్రబంధాలలో
యీ ఆటను రమణీయంగా మన కవులు వర్ణించినారు. రుక్మిణీ కృష్ణులు యీ
ఆటను ఆడినట్లు ఉత్తర హరివంశములో మనోహరముగా వర్ణింపబడినది. ఈ తరగతికి
చెందిన యింకొక ఆట పచ్చీసు. ఈ ఆటలో స్త్రీలకు ఆసక్తి ఎక్కువ. రంగుగుడ్డతో
అందముగా పచ్చీసును కట్టించి, దానిమీద పూసలతో యిండ్లను యేర్పాటు చేసి,
గవ్వలను వేస్తూ ఈ ఆటను ఆడే దృశ్యము పల్లెటూళ్లలో యే మాత్రముక కొద్ది
పరిచయము కలిగిన వారికైనా బాగా పరిచితమైనదే. ఈ ఆటలు మన గ్రామీణ
సంస్కృతి యొక్క శోభకు మంచి ప్రతిబింబాలు.
392
మన కళా నంవద - సాహిత్యము
జనులను వినోదింప జేయడానికి ప్రత్యేకంగా ఉద్దేశించిన వేడుకలు యింకా
యెన్నో మన పల్లెటూళ్ళలో చూడవచ్చును. వినోదాలే వృత్తిగా కలిగినవారు గూడ
కొందరున్నారు. మారిన ప్రస్తుత పరిస్థితులలో ప్రోత్సాహము లేనందువలన జీవనోపాధి
కొరకు వీరు యితర వృత్తులను అవలంబించడం చేత వీరి సంఖ్య తగ్గిపోతున్నది.
బొబ్బిలి, బాలనాగమ్మ కథలు చెప్పేవారిని గూర్చి యింతకుముందే ప్రస్తావించినాను.
గంగిరెద్దులను అలంకరించి, యిల్లిల్లు తిరిగేవారు యీ శ్రేణికి చెందినవారే.
పగటివేషాలను వేసి ప్రజలను వినోదింప జేసేవారు మనకు కనుపిస్తుంటారు. వీరిని
పగటివేషాలవారనీ, బహురూపులవారనీ పిలుస్తుంటారు. విప్రవినోదులనేవారు గారడీ
విద్యలో ప్రవీణులు. వీరు అనేక ఇంద్రజాల (ప్రదర్శనలు చేస్తుంటారు. వీరందరూ
జనుల పోషణ మీద ఆధారపడి యీ పనులను వృత్తిగా తీసికొని, అందులో గొప్ప
నైపుణ్యం సంపాదించినటువంటివారు.
పల్లెటూళ్ళలో ఉయ్యాల లూగుట బాలబాలికలే గాక పెద్దలు గూడ మిక్కిలి
మక్కువ జూపించే క్రీడ. ఏదోవిధమైన ఉయ్యాలను మనము అనేక గృహాలలో
చూడవచ్చును. ఈ మధ్య యితర క్రీడల వలెనే సన్నగిల్లిపోతున్నపటికినీ గుర్రపు
స్వారీ, మన గ్రామాలలో బాగుగా అభిమానించిన క్రీడ. మల్లయుద్దాలు, కుస్తీలు
మొదలైనవి తరతరాల నుండి మనవారు అభిమానించి, ప్రోత్సహించిన క్రీడలు.
తెలుగుదేశంలోని జమీందార్లు యిందులో ప్రవీణులైనవారిని తమ ఆస్థానాల లోనికి
చేరదీసి వారిని పోషించిరి. దసరా పండుగ సందర్భాలలో ప్రజల సమక్షాన యీ
మల్లయుద్ధ ప్రదర్శనాలు, కుస్తీలు జరిపించి, వారిని బహూకరించే ఆచారము,
యిటీవలి వరకు మన పల్లెటూళ్ళలో వుండేది. కత్తిసాము, కట్టెసాములలో ప్రవీణులైన
వారిని మన పల్లెటూళ్ళలో చూడవచ్చును.
కొన్ని వేడుకలు, వినోదాలు, క్రీడలు ప్రత్యేకమైన సందర్భాలలో జరుగుతుంటవి.
దసరా పండుగకు ముందు, తొమ్మిది దినాలు బాణసంచాలను కాల్చడం జనుపకట్టలను
కాల్చడం యీ తరగతికి చెందిన వినోదము. పిల్లలు యీ తొమ్మిది రోజులు ప్రతిరోజూ
యీ వేడుకను జరుపుకుంటూ ఆనందిస్తారు. హోళీ పండుగ సందర్భంలో ఒకరిమీద
మరొకరు రంగులు చల్లుకోవడం కూడ యిటువంటి వేడుకలే. ఏరువాకపున్నమ
అనగా జ్యేష్టపున్నమ రైతులకు మిక్కిలి సంతోషకరమైన పబ్బము. ఆనాడు వారు
తమ యెడ్లను కడిగి, వాటిని రంగురంగులతో అలంకరించి, తమ నాగళ్ళమీద
393
డా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
ఎర్రమన్నుతోను, సున్నముతోను పట్టెలను వేసి, ఆ నాగళ్ళను భుజాలమీద వేసుకొని,
యెడ్లతోపాటు ఊరేగి పొలాలకు వెళ్ళి దుక్కి దున్ని ఆ సంవత్సరపు వ్యవసాయపు
పనులను అత్యంత ఉత్సాహముతో ప్రారంభోత్సవము గావించుచుందురు.
శ్రీరామనవమినాడు బండ్లను గట్టుకొని ఊరేగుట పల్లెటూళ్ళలో మనము గమనించే
మరొక వేడుక. సంక్రాంతికి తీర్థాలకు వెళ్ళే ఆచారము తెలంగాణపు పల్లెటూళ్ళలో
ప్రజలకు మిక్కిలి ప్రేమపాత్రమైన వేడుక. బండ్లను గట్టుకొని తమతమ కుటుంబాలతో
సంక్రాంతి నుండి శివరాత్రి మధ్య జరిగే ఈ జాతరలలో వీరు పాల్గొంటారు. ఇటువంటి
జాతరలలో ప్రసిద్ధమైనవి కొరివిజాతర, ఐనవోలుజాతర, మేడారము జాతర
మొదలైనవి. ఈ జాతరలలో అసంఖ్యాకముగా జనులు పాల్గొంటారు. దేవాలయాలలో
సీతాకల్యాణము మొదలైన ఉత్సవాలు జరిపించడం పల్లెటూరు ప్రజలకు
అభిమానాస్పదమైన వేడుక. శక్తిపూజలు, పల్లెటూరి ప్రజానీకములో చాల ప్రచారంలో
వున్నవి. దుర్గ, కాళి, ఎల్లమ్మ మొదలైన దేవతలకు మేకపోతులను, దున్నపోతులను
బలి యిచ్చే వేడుక చాల ప్రసిద్ధమైనది.
ఈ విధంగా అన్ని తరగతుల వారికి అభిమానాస్పదమైన వేడుకలు, వినోదాలు
మన పల్లెటూళ్ళలో పుష్కలముగా వున్నవి. కొన్ని వినోదాలు, క్రీడలు స్త్రీలకు మాత్రమే
ప్రత్యేకమైనవి. ఇందులో కోలాటము ముఖ్యంగా పేర్మొనదగినది. కాముని పున్నమ్మకు
ముందు వెన్నెల రాత్రులలో యువతులు ఈ కోలాటము వేసే పద్ధతి తెలంగాణపు
పల్లెటూళ్ళలో బాగా ప్రచారంలో వున్నది. పురుషులు గూడ కోలాటము వేయడం, ఆ
సందర్భాలలో పాటలు పాడడం కొన్ని ప్రాంతాలలో కనుపిస్తుంది. అందుచేత దీనిని
స్త్రీ పురుషులకు సమాన ఆదరణీయమైన క్రీడ యని కూడ చెప్పవచ్చును.
ప్రత్యేకంగా బాలికలు అభిమానించే ఆట చెమ్మచెక్క ఆట తెలుగుసీమలో యే
పల్లెటూరికి వెళ్లినా చూడవచ్చును. అచ్చనగండ్ల ఆట మన పల్లెటూళ్ల బాలికలు
అభిమానించే మరొక రమ్యమైన క్రీడ. గచ్చకాయలను ఎగురవేస్తూ, ఆడపిల్లలు
యీ ఆటను ఆడే దృశ్యము మిక్కిలి సుందరమైనది. ఓమనగుంటల ఆట బాలికలకు,
యువతులకు అభిమానాస్పదమైన క్రీడ. ఒక కట్టె దిమ్మెలో పద్నాలుగు గుంటలు
జెక్కించి వాటిలో చింతగింజలు పోసి యీ ఆటను ఆడుతుంటారు. ఈ విధమైన
కట్టె దిమ్మెలు పల్లెటూళ్లకు వెళ్లి చూస్తే అనేక కుటుంబాలలో కనుపిస్తుంటవి.
గుజ్జనగూళ్ళ ఆట గూడ బాలికలకు ప్రత్యేకమైనది. రుక్మిణీదేవి చిన్నప్పుడు యీ
394
మన కళా సంపద - సాపొత్యము
ఆటను ఆడినట్లు భాగవతంలో పోతనగారు తెలిపినారు. బొమ్మరిండ్లలో గూర్చుండి
బాలికలు గురుగులలో రకరకాల వంటలు వండి వడ్డించునట్లుగా వినోదించే యీ
ఆట ఆడపిల్లలకు మిక్కిలి ప్రియమైనది. గీరన గింజల ఆట బాలికలు అభిమానించే
మరొక క్రీడా విశేషము. ముగ్గులు వేయడం పల్లెటూరి బాలికలకు, యువతులకు
మిక్కిలి ఆహ్లాదకరమైన వేడుక. రకరకాల ముగ్గులను వేయడంలో నైపుణ్యము ప్రదర్శించే
స్త్రీలు మన పల్లెటూళ్ల యందు, పుష్కలముగా కనుపిస్తుంటారు. ఈ ముగ్గులు తెలుగు
పడతుల సౌందర్యరక్తికీ, కళాభిరుచికీ మేలి ఉదాహరణలు. ఈనాడు యెక్కువగా
వ్యాప్తిలో లేకపోయినా చిలుకలను పెంచి వానికి బుద్దులు చెప్పి వినోదించుట
తెలుగుసీమలోని పల్లెటూళ్ళ యందలి సంపన్న గృహాలలోని సుందరాంగుల వేడుకలలో
బహు రమ్యమైనది.
బతకమ్మ పండుగ, బొడ్డెమ్మ పండుగ స్రీలకు ఆనందరకమైన క్రీడలు, వేడుకలు.
ఈ రెండింటిలోను వారు గౌరీదేవిని పూజించు చుందురు. మహాలయామవాస్యకు
ముందుగా బొడ్జెమ్మలను, అమావాస్యనాటి నుండి బతకమ్మను ఆడుట పల్లెటూళ్లలో
ఆచారంగా వున్నది. బొడ్డెమ్మను ఒక పీటమీద మన్నుతో నిర్మించుదురు. బతకమ్మను,
తంగేడుపూవులతో, గుమ్మడి పూవులతో, గోరంట పూవులతో సుందరముగా
పేర్చుతారు. సాయంకాలపు పూట బొడ్జెమ్మకు, బతకమ్మకు చుట్టు బాలికలు,
యువతులు, ముత్తైదువలు చేరి పాటలు పాడుతూ వినోదిస్తుంటారు.
ఈ విధంగా మన పల్లెటూళ్ళ జీవితాన్ని పరిశీలించితే క్రీడలకు, వినోదాలకు
మనవారు యెంత ముఖ్యమైన స్థానాన్ని యిచ్చినారో వెల్లడి కాగలదు. క్రీడాభిరామమైన
పల్లెటూరి జీవితములోని ఉత్తమ సంస్కృతిని యీ క్రీడలు, వేడుకలు, వినోదాలు
మనకు వెల్లడి జేస్తున్నవి. మారిన పరిస్థితులలో యీ వేడుకలు, క్రీడలు ప్రాధాన్యాన్ని
కోలుపోతున్నవి. వీటిని సముచితంగా ప్రోత్సహించి, ఆదరించి గ్రామీణ జీవితపు
సంస్కృతిని కాపాడవలసిన ఆవశ్యకత యీనాడు యెంతో వున్నదని నిస్సందేహంగా
చెప్పవచ్చును.
395
దా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
గురుదేవుడు రవీంద్రుడు
భారతీయులు సర్వదా సంస్మరించదగిన మహనీయులలో గురుదేవుడు
రవీంద్రుడు ప్రథమ గణ్యుడు. భారత జాతీయ గీతమును రచించిన మహాకవి ఆయన.
అందుచేత ప్రతి స్వాతంత్ర్యోత్సవ సందర్భమున, (ప్రతి జాతీయ మహా పర్వమున
ఆయనను స్మరించుటలో విశిష్టత కలదు.
రవీంద్రుడు సాహితీ ప్రపంచమున, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప రచయిత.
అంతేకాదు, ఆయన మన దేశ సమస్యల యందు ప్రత్యేక శ్రద్ధను తీసికొనిన
త్యాగమూర్తి. ఇల్లు గూలిపోవునపుడు వీణను చేతబట్టుకొను ప్రబుద్ధుడు రవీంద్రుడు
కాడు. మన దేశనాయకులనేకులకు పూజ్యుడు రవీంద్రుడు. జాతిపితయైన గాంధీ
మహాత్ముడు ఆయనను గురుదేవుడని సంబోధించెడి వాడు.
మన దేశ రాజకీయ సమస్యలను గూర్చి రవీంద్రుడు సర్వదా ఆలోచించెడి
వాడు. 1919 సంవత్సరమునకు ముందు ఇంగ్లీషు వారు ఆయనకు సర్ బిరుదము
నిచ్చి యుండిరి. ఆనాడు మన దేశములో గొప్పవారికి చాలమందికి యిటువంటి
బిరుదులు ఇంగ్లీషు ప్రభుత్వము యిచ్చి యుండెను. 1919 సంవత్సరములో
అమృతసర్ పట్టణమున బ్రిటిషు ప్రభుత్వము జనసమూహముపైన తుపాకులను
గాల్చినపుడు అందుకు నిరసనగా రవీంద్రుడు తన సర్ బిరుదమును త్యజించెను.
ఆనాడు మనదేశమున సర్ బిరుదాంకితులైన గొప్పవారు మరికొందరు ఉండిరి.
కాని ఇట్టి త్యాగమును, ధైర్యమును, సాహసమును ప్రదర్శించినవారు రవీంద్రుదే.
ఆనాడు రవీంద్రుడు ఇండియా వైస్రాయికి వ్రాసిన లేఖ ప్రపంచములోని లేఖా
సాహిత్యములో మహోజ్వలమైనది. జపాను దేశము యొక్క సామ్రజ్యకత్వమును
నిరసించుచు జపాను కవీంద్రునికి రవీంద్రుడు వ్రాసిన యుత్తరము మరొక
మహోజ్వలమైన లేఖ. బహుశః 1940 వ సంవత్సరములో కాబోలు భారత జాతీయ
నాయకులను బ్రిటిషు ప్రభుత్వము చెరసాలలో నుంచినపుడు మిస్.రాత్‌బోన్ అను
పాశ్చాత్య యువతి భారత నాయకులను దూషించుచు ఒక ప్రకటన చేసి యుండెను.
ఆ ప్రకటనకు రవీంద్రుడిచ్చిన సమాధానము ఆయనకు మన స్వాతంత్రోద్యమము
యందుగల గాఢమైన సానుభూతి, మరియు జాతీయ నాయకులందు గల ఆపార
గౌరవమును వెల్లడి చేయుచున్నవి.
396
మన కళా నంవద - సాపొత్యము
రవీంద్రుడు మరియు గాంధీ మహాత్ముడు పరస్పరము పూజ్య భావము
కలిగియుండిరి. వారికి ఒకసారి మాత్రమే అభిప్రాయ భేదము కలిగినది. విదేశ
వస్తు బహిష్మరణమును చేయవలెనని గాంధీ మహాత్ముడు ప్రబోధించి స్వదేశ ఉద్యమ
ప్రచారము గావించినపుడు రవీంద్రుడు ఈ ఉద్యమము యొక్క యోగ్యతను
సందేహించుచు గాంధీ మహాత్మునికి ఒక ఉత్తరము వ్రాసెను. దానిని లేఖ యనుటకన్న
సాహిత్య ఖండమని చెప్పుట సమంజసము. దీనికి సమాధానముగా గాంధీ మహాత్ముడు
వ్రాసిన ప్రత్యుత్తరము భావ గాంభీర్యము నందును, భాషా సౌందర్యము నందును
రవీంద్రుని రచనకు యే మాత్రము తీసిపోని రమణీయమైన ఖండ కావ్యమని
చెప్పవచ్చును. రవీంద్రుడు రాజకీయ నాయకుడుగా, గాంధీ ఒక మహాకవిగా యీ
ఉత్తర ప్రత్యుత్తరాలలో ప్రత్యక్షమగుచున్నారు. ఇది యే వారి ప్రణయ కలహములలో
మొదటిది, మరియు చివరిది. తరువాత వారికి అభిప్రాయభేదాలెన్నడును కలుగలేదు.
గాంధీ మహాత్ముని ఇష్టమునకు వ్యతిరేకముగా సుభాష్ చంద్రబోసు కాంగ్రెస్ అధ్యక్ష
పదవికి పోటీ చేసినపుడు కొందరు సుభాష్ చంద్రబోసు పక్షము వహించవలసిందని
రవీంద్రుని కోరిరి. కాని ఆయన అందుకు సమ్మతించలేదు. మహాత్మునికి వ్యతిరేకముగా
ఆయన ముందుకు రాలేదు.
జవహర్‌లాల్ నెహ్రూ యందు రవీంద్రుడు (ప్రేమ, అభిమానము, వాత్సల్యము
కలిగియుండెను. జవహర్‌లాల్ నెహ్రూకు మొదటి నుండియు రవీంద్రుని యందు
భక్తి. రవీంద్రుని ఉన్నతాదర్శముల చేత జవహర్‌లాల్ ప్రభావితుడైన నిదర్శనాలు
కలవు. భారత జాతీయ కాంగ్రెస్ యొక్కయు, మరియు స్వతంత్ర భారతము యొక్కము
విదేశాంగ విధానము రూపొంద జేసిన రాజకీయవేత్త శ్రీ జవహర్. శ్రీ జవహర్
విదేశాంగ విధానము మీద రవీంద్రుని ఉన్నతాదర్శాల ప్రభావము కనబడుచున్నది.
రవీంద్రుడు జాతి విచక్షణా విధానమునకు వ్యతిరేకి. సామ్రాజ్య తత్వము నకు
ప్రతికూలుడు. మానవత్వము నందు విశ్వాసము కలిగిన మహనీయుడు. యుద్ధాలను,
ఆయుధాలను ప్రతిఘటించిన శాంతిప్రియుడు. జగత్మల్యాణమునకై పరితపించిన
బుషీశ్వరుడు. రవీంద్రుడు ప్రపంచమునకు (ప్రేమ సందేశము నిచ్చిన మహానుభావుడు.
ఒక జాతి మరొక జాతిమీద అధికారము వహించు జాతీయా హంకారమును, ఒక
మానవుడు మరొక మానవుడిని బానిసగా జూచు మనస్తత్వమును రవీంద్రుడు సర్వదా
వ్యతిరేకించి యుండెను. ఈనాడు జవహర్లాల్ దివ్యవాణివలె, ఆనాడు రవీంద్రుని
397
దా దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
దివ్యవాణి సకల ప్రపంచమునకు శాంతి సందేశము నిచ్చునదిగా నుండెను. తన
యీ అభిప్రాయాలను రవీంద్రుడు ఉపన్యాసములందును, రచనల యందును
పలుమారు ప్రకటించి యుండెను. స్వతంత్ర భారతదేశము యొక్క ఆదర్శములు
కూడ యిట్లే ఉండవలెనని ఆయన కలలు గనుచుండెను. రవీంద్రుని ఆదర్శాలు,
స్వప్నాలు జవహర్‌లాల్ నెహ్రూ విదేశాంగ విధానములో ప్రతిబింబితమైనవి. ఇది
రవీంద్రుని విశిష్టత. కావుననే రవీంద్రుడు సకల భారత నాయకులకు గురుదేవుడైనాడు.
ఆధునిక కాలములో భారతదేశము యొక్క ఆత్మకు చిహ్నములని చెప్పదగినవారు
ముగ్గురు. ఒకరు గాంధీ మహాత్ముడు. రెండవ వారు రవీంద్రుడు. మూడవ వారు
జవహర్‌లాల్ నెహ్రూ. గాంధీ మహాత్ముడు సత్యమునకు ప్రతినిధి. రవీంద్రుడు
సౌందర్యమునకు ప్రతినిధి. జవహర్‌లాల్ శివమునకు అనగా మంగళమునకు, శాంతికి
ప్రతినిధి. సత్యము, సౌందర్యము, శివము భారతదేశ సంస్కృతికి మూలకందములు.
భారతదేశము యొక్క ఆత్మకు చిహ్నములు. వీనికి ప్రతినిధులైన యీ ముగ్గురు
మహనీయుల వ్యక్తిత్వాల సమన్వయమే భారతదేశము యొక్క ఆత్మ.
రవీంద్రుడు పరమపదించినప్పుడు ఆయనకు శ్రద్ధాంజలి నర్చించుచు చేసిన
ప్రకటనలో డాక్టర్ రాధాకృష్ణన్ రవీంద్రుడు వ్యాస, వాల్మీకుల తరగతికి చెందినవారని
చెప్పిరి. నిజమే; వ్యాస వాల్మీకుల వలె రవీంద్రుడు మహర్షియైన కవీంద్రుడు. జాతీయ
గీతమును పఠించు ప్రతి సందర్భమునను రవీంద్రుని సుందర గంభీర ఆకారము
మన కనుల యెదుట సాక్షాత్మరించుచు శాంతి సందేశము నిచ్చుచుండును.
శూరుల జన్మము, సురల జన్మము, యేరుల జన్మము తెలుసుకొనుట కష్టమని
ఒకానొక కవి సూక్తి. అదే విధముగా బుషీశ్వరుల జన్మమే కాక మృత్యువు గూడ
సాధారణులకు తెలుసుకొనుట కష్టమైన కార్యము. రవీంద్రుడు తన మరణమునకు
కొన్ని దినములకు ముందు మృత్యువును గూర్చిన ఒక రచన గావించెను. బహుశా
అదియే ఆయన తుది రచన. తన మరణమునకు కొద్ది రోజులు ముందు మృత్యువును
గూర్చి రచన గావించిన రవీంద్రుడు బహుశా త్వరలో తనకు స్వర్గలోకము నుండి
రానున్న ఆహ్వానమును ఊహించుకొనెనేమో!
398
మన కళా నంవద - సాహిత్యము
లాలాలజపత్‌రాయ్
భారతదేశ స్వాతంత్ర్యము నాలుగైదు తరాలకు చెందిన మహనీయులు,
త్యాగమూర్తులు చేసిన అపార కృషి ఫలితము. ఒక్కమారు యీనాడు, యీ కృషిని
సమీక్షించుకొన్నప్పుడు ఇందులో కొన్ని దశలను స్థూలముగా మనము నిర్ణయించ
వచ్చును. ఈ దశలో ఒక్కొక్కదానికి ఒక్కొక్కరు నాయకత్వము వహించినప్పటికిని,
మేథాశక్తిలోను, త్యాగ సంపదలోను ఆ నాయకునికి తీసిపోనటువంటి నాయకమణులు
ప్రతిదశలోను కనుపించుచున్నారు. ఈ నాయక శ్రేణిలో లాలాలజపత్‌రాయ్ విశిష్ట
వ్యక్తిత్వము కలిగిన మహనీయుడు.
కాంగ్రెస్ స్థాపన తరువాత మొదటి దశకు నాయకత్వము వహించిన
త్యాగమూర్తి దాదాభాయి నౌరోజి. మొదటిదశ నౌరోజి యుగమైనచో, రెండవదశ
లోకమాన్యుని యుగము; మూడవదశ గాంధీజీ యుగము; నాలుగవ దశ జవహర్లాల్
యుగము. కాంగ్రెస్ చరిత్రను మనము యీ నాలుగు యుగాలుగా విభజించవచ్చును.
దాదాభాయి ప్రభృతులు గావించిన ప్రబోధము దేశములో మంచి జాతీయ
వాతావరణము కలిగించినది; ఈ వాతావరణములో లోకమాన్యుడు స్వరాజ్యము
నా జన్మహక్కని ఉద్దాటించినాడు. లోకమాన్యుని పిలుపు నందుకొని గాంధీజీ భారత
జాతీయ కాంగ్రెస్‌కు స్పష్టమైన రూపురేఖలు దిద్ది, తదాశయములను అసందిగ్ధముగా
ఉద్దాటింప జేసినాడు. గాంధీజీ మార్గదర్శకత్వమున సత్యాహింసల ద్వారా పూర్ణ
స్వరాజ్యము సాధింపవలెనని నిర్ణయించుకొనిన కాంగ్రెస్ జవహర్లాల్ నేతృత్వము,
పార్లమెంటరీ ప్రజాస్వామికము, లోకశ్రేయస్సుకు అనుగుణమైన విదేశాంగ విధానము,
సామ్యవాదము అను ఆశయాలను నిర్వచించి, వాని సాధన కొరకు కృషి చేయవలెనని
తీర్మానించినది. ఈ నాలుగు దశలలో రెండవ దశయైన లోకమాన్యుని యుగానికి
చెందిన పురుష సింహము పాంచాలకేసరి లాలాలపజత్‌రాయ్.
లోకమాన్యుని యుగమున ఆసేతుహిమాచల పర్యంతమైన భారతదేశము
నందంతటను ముగ్గురి నామములు ప్రతిధ్వనించినవి. లాల్, బాల్, పాల్ అనునవియే
ఈ మూడు నామములు. లాల్ అనగా లాలాలజపత్‌రాయ్, బాల్ అనగా బాల
399
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
గంగాధరతిలక్, పాల్ అనగా బిపిన్‌చంద్రపాల్. (త్రిమూర్తులవలె ఆనాడు భారత
జాతీయ రంగమున ఈ ముగ్గురు శోభిల్లిన సంఘటన యీ నాటికిని ఆ రోజులు
చూచిన వృద్ధమూర్తులు మహోత్సాహముతో జ్ఞప్తి చేసికొనుచుందురు.
లాలాజి పాంచాలకేసరి యని ప్రసిద్ధి గాంచినాడు. ఈ బిరుదు సర్వవిధాల
ఆయనకు సార్థకమైనది. ఆయన ఆకారము, విజ్ఞానము, పరాక్రమము ఆయనకునాటి
నాయకమణులలో సింహమను పేరును సంపాదించినవి. లాలాజి తన రాజకీయ
అభిప్రాయాలను యెన్నడు దాచుకొనలేదు. సింహము వలె యెలుగెత్తి ఈ అభిప్రాయా
లను చాటుటకు ఆయన వెనుదీయలేదు. సహజముగా ఆనాటి ఆంగ్ల ప్రభుత్వానికి
కంటకప్రాయమైనదిది. కావున, నిరంతరము గూడచారుల బాధను ఆయన యెదుర్మొన
వలసి వచ్చుచెండెను. ఈ బాధ సహింపరానిదిగా విజృంభించినప్పుడు లాలాజి
అమెరికాకు కొంతకాలము ప్రవాసము వెళ్ళుటగూడ జరిగినది. అమెరికాలో గూడ
లాలాజీ నిరంతరము భారత స్వాతంత్ర్యమును గూర్చి కలలు గాంచుచు కొంత కృషి
గావించినారు.
కాంగ్రెస్ చరిత్రను అవలోకించినప్పుడు అధ్యక్ష పీఠము నలంకరించిన
మహనీయులలో కొందరికి యీ గౌరవము చాలా తొందరగా లభించినదనియు,
మరికొందరికి యీ గౌరవము చాల ఆలస్యముగా లభించినదనియు వెల్లడి
యగుచున్నది. సర్వవిధములైన అర్హతలను, హక్కులను కలిగి యుండియు కొన్ని
కారణాల వలన కాంగ్రెస్ అధ్యక్ష పీఠము నలంకరింపజాలని నిదర్శనాలు గూడ
మనకు గోచరించుచున్నవి. ఈ నిదర్శనాలలో లోకమాన్య బాలగంగాధర తిలక్ గారి
పేరు ప్రత్యేకముగా చెప్పవలసి యున్నది. కాకలు దీరిన కాంగ్రెస్‌వాదియెనప్పటి కిని,
లాలాలజపత్‌రాయ్‌కు కాంగ్రెస్ అధ్యక్షపదవి నలంకరించు గౌరవము 1920 వ
సంవత్సరము వరకు లభించలేదు. అంతకుముందు రెండు మూడు పర్యాయములు
కాంగ్రెస్ అధ్యక్షపదవికి పాంచాల కేసరి పేరు ప్రతిపాదించబడినప్పటికిని,
లోకమాన్యుడు ఇందుకొరకు కృషి గావించినప్పటికిని లాలాజికి యీ గౌరవము
లభించలేదు. 1920 వ సంవత్సరమున లాలాజి ప్రథమ పర్యాయము జాతీయ
కాంగ్రెస్ అధ్యక్షలుగా ఎన్నికయైనారు.
400
మన కళా నంవద - సాపొత్యము
లాలాజి తమ రాజకీయ జీవిత ప్రారంభములో అతివాదులుగా (ప్రఖ్యాతి
గాంచినప్పటికిని చివరిదశలో వీరి అభిప్రాయాలయందు కొంత మార్చు
గోచరించినది. చివరి దశలో లాలాజి శాసన సభలలో కాంగ్రెస్‌వాదుల ప్రవేశానికి
సుముఖుడుగా నుండిరి. ఇది రాజకీయ వర్గాలలో అసంతృప్తికి కారణభూతమైనది.
లాలాజి నాయకత్వమునకు వ్యతిరేకముగా స్వరాష్ట్రమైన పంజాబులోనే ఉడుకు రక్తము
గల యువకులు తిరుగుబాటు చేసినట్లు కాంగ్రెస్ చరిత్రలో మనకు తెలియుచున్నది.
లాలాజి తన రాజకీయ జీవితములో తీవ్రమైన వ్యతిరేకతను కూడ యెదుర్మొనవలసి
వచ్చినది. పాంచాల రాష్ట్ర స్థాయిలోనేకాక, అఖిల భారత స్థాయిలో గూడ సింహము
వలె విక్రమించిన లాలాలజపత్‌రాయ్ స్వరాష్ట్రములో ప్రబల ప్రతిపక్షము యొక్క
ప్రతిఘటనను రుచి జూచినారు. లాలాజి తన జీవితములో బలవంతులైన
మిత్రులనేగాక, బలపంతులైన శత్రువులను కూడ కలిగియుండిరి. ప్రపంచములో
శక్తివంతులైన మహాపురుషుల జీవితాలన్నింటియందున ఈ సత్యము గోచరించు
చున్నది.
లాలాజి గొప్ప విద్వాంసుడు. నిజానికి ఆనాటి తరము రాజకీయ నాయకుల
ప్రత్యేకతలలో ఇది యొకటి. అది అతిరథమహారథుల యుగము. శారీరకముగానేకాక,
మానసికముగాను వామనమూర్తులైనవారి యుగము కాదది. లోకమాన్యుని వంటి
విజ్ఞానమూర్తికి సర్వవిధాల యోగ్యుడైన అంతరంగమిత్రుడు లాలాలజపత్‌రాయ్.
సంస్కృతము, ఉర్టూ భాషల యందు లాలాలజపత్‌రాయ్ కూలంకషమైన పాండిత్యము
కలిగియుండిరి. రుచులయందు, అభిరుచులయందు లాలాలజపత్‌రాయ్‌కు
లోకమాన్యునికి మధ్య కొన్ని పోలికలు కనిపించుచున్నవి. ఉభయులు ప్రాచ్య
విజ్ఞానమునందు, సంస్కృత భాష యందును అపారమైన ఆసక్తితో పాటు గాఢమైన
ప్రవేశము కలిగి యుండిరి.
ఆనాటి కాంగ్రెస్ నాయకులనేకుల వలె లాలాలజపత్‌రాయ్ మంచి వక్తయై
యుండిరి. నిద్రాణమైన జాతిని మేలుకొలుపుటకు స్వాతంత్ర్య ప్రబోధము గావించి,
చైతన్యము కలుగజేయుటకు, వక్తృత్వశక్తి మరియు రచనాశక్తి అత్యంత ఉపయుక్తమైన
సాధనములు. లాలాలజపత్‌రాయ్ ఈ రెండు సాధనములను మిక్కిలి ప్రావీణ్యముతో
ఉపయోగించిరి. ఉర్దూ భాషలో లజపత్‌రాయ్ ఉత్కృష్టమైన వక్తగా ప్రఖ్యాతిగాంచిరి.
401
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
ఉర్దూ సంస్కృతాలతో పాటు లాలాలజపత్‌రాయ్ ఆంగ్లభాష యందు చక్కని
వైదుష్యము సంపాదించియుండిరి. ఆంగ్లభాషలో వారు కొన్ని ఉద్దంధములను
రచించినారు. ఈ సందర్భమున వానిలో రెండింటిని గూర్చి ప్రత్యేకముగా పేర్మొనవలసి
యున్నది. ఈ రెండింటిలో మొదటిది. “ది కాజెస్ ఆఫ్ ఇండియన్ రివోల్డ ఈ
(గ్రంథములో భారతీయులు తిరుగుబాటు చేయుటకు గల కారణాలు, భారత స్వాతంత్ర్య
ఆవశ్యకతను వారు చక్కగా వివరించినారు. రెండవ [గ్రంథము “అన్‌యాఫీ ఇండియా”
దురదృష్టవంతమైన భారతదేశము. ఆ రోజులలో అమెరికా దేశీయురాలైన మిస్
మేయో కొందరి ప్రోత్సాహము వలన భారతదేశమును గూర్చి ఒక గ్రంథము
వ్రాసినది. ఈ గ్రంథములో భారతీయులను గూర్చి, భారతదేశమును గూర్చి చాల
అసభ్యంగాను, అవమానకరముగాను చిత్రించుట జరిగినది. అతిశయోక్తులతో,
అశ్లీలములతో, అసత్యాలతో నిండిన యీ గ్రంథము సమస్త భారతదేశానికి ఏవగింపు
కలుగజేసినది. శమము, దమము, నిగ్రహము కలిగిన గాంధీ మహాత్ముని యంతరాత్మ
యీ గ్రంథమును గూర్చి వ్యాఖ్యానించుచు ఇది మురికి కూపాలను మాత్రమే
పరిశీలించిన మ్యునిసిపల్ అధికారి నివేదిక యని తెలిపినారు. దీనికి సమాధానముగా
భారతీయులు కొందరు ప్రత్యేక (గ్రంథాలను వ్రాసియున్నారు. ఇందులో
లాలాలజపత్‌రాయ్ గారి గ్రంథము అగ్రగణ్యమైనది. ఈ గ్రంథములో మిస్ మేయో
ఆరోపణలు, అసత్యాలు ఖండించి భారతదేశ స్వరూపమును వెల్లడి చేయుట జరిగినది.
ఇంచుమించుగా వేయి పుటలు కలిగిన పెద్ద గ్రంథమిది.
లాలాలజపత్‌రాయ్ వ్యక్తిత్వము బహుముఖమైనది. ఆయన భావాలలో
అతివాదము కనిపించినప్పటి కిని ఇంగ్లీషు ప్రభుత్వము ఆయనను సర్వదా
అనుమానించినప్పటి కిని ఆయన ప్రభుత్వముతో సహాయనిరాకరణము చేయవలెనను
విధానమును యెన్నడు గూడ నూటికి నూరుపాళ్ళు బలపరచలేదు. నిజానికి ఆయనను
సహాయనిరాకరణ విధానానికి వ్యతిరేకి యని చెప్పినప్పటికిని అతిశయోక్తి కాజాలదు.
1920 వ సంవత్సరమున నాగపురమున జరిగిన కాంగ్రెస్ మహాసభలో గాంధీజీ
చేత ప్రభావితుడై, మోతిలాల్ నెహ్రూ ప్రతిపాదించిన సహాయ నిరాకరణ తీర్మానమును
ఆయన బలపరచి యుండెను. ఈ కాంగ్రెస్ సమావేశము తరువాత గాంధీయుగము
402
మన కళా సంపద - సాపొత్యము
ప్రారంభమై గాంధీ రాజకీయాలు దేశములో వ్యాప్తి నొందగా, లాలాజి కొంత వెనుకపడి
పోయెనని చెప్పవలసి యున్నది. లాలాజి కొంతకాలము భారత శాసనసభలో పని
జేసెను. కాని మోతిలాల్ నెహ్రూతో అభిప్రాయభేదము కలిగి, స్వరాజ్యవాదులు
శాసనసభ నుండి నిష్రమించుట హిందువులకు ప్రయోజనకారి కాదని గట్టిగా
విశ్వసించి, కాంగ్రెస్ శాసనసభా పక్షము నుండి రాజీనామా యిచ్చి యుండెను.
స్వామి శ్రద్ధానందునితో సమకాలికుడైన లాలాజి పాంచాల రాష్ట్రమున
సర్వవిధాల స్వామీజీతో సమానస్థానము నాక్రమించెను. సంఘసంస్కర్త, మరియు
విద్యా సంస్మరణకారియెన లాలాజి దయానంద ఆంగ్లోవేద కళాశాల అభివృద్ధికి
ముఖ్య కారణభూతుడైనాడు.
లాలాజి ఆర్య సంస్కృతి యందు అపారమైన ఆదరాభిమానాలు కలిగిన
విద్వాంసుడు. భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనము కావలెనని గాఢముగా
వాంఛించి కృషి చేసిన మనీషి పాంచాల రాష్ట్రములో ఆర్య సమాజానికి లజపత్‌రాయ్
పెట్టనికోటగా నుండిరి. ఆర్య సంస్కృతి ప్రచారము కొరకు, ప్రబోధము కొరకు,
వారు తమ వాక్కును, కలమును వినియోగించి యుండిరి.
మహనీయులనేకులకు తుది దశలో కష్టాలు తప్పలేదు. లాలాజి జీవితము
గూడ ఇందుకు అపవాదము కాజాలదు. చివరి రోజులలో లాలాజి జీవితము
సుఖవంతముగా గడచినట్లు కనిపించదు. మహాత్ములైనవారి నిర్యాణము కూడ
విషాదాంతమైన సంఘటనలు ప్రపంచ చరిత్రలో కనిపించుచున్నవి. ఇటువంటి
మహనీయుల శ్రేణిలో లాలాజిని గూడ చేర్చవచ్చును. సంకుచిత దృష్టి మరియు
దురభిమానాలు కలిగిన విద్వేషమునకు ప్రతినిధియెన ఒక ఘాతుకుని లారీదెబ్బ
లాలాజీ మరణమునకు కారణభూతమైనది. ఆ లారఠీదెబ్బ తినే రోగగ్రస్తుడై కొద్ది
రోజులలో లాలాజి పరలోకగతులైనారు. తన యావజ్జీవితమును భారతమాత సేవ
కొరకు అర్చించిన లాలాలజపత్‌రాయ్ నిష్కళంకమైన జాతీయవాది; గొప్ప
విద్వాంసుడు; మంచి రచయిత; వక్త; త్యాగమూర్తి; ధన్యజీవి. ఈనాటి తరమునకు
సర్వవిధాల మార్గదర్శకమైనది లాలాలజపత్‌రాయ్ జీవితము.
403
దా దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
కీ.శే. జార్జి బెర్బార్డుషా
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆంగ్ల రచయిత జార్జి బెర్నార్డుషా కొంతకాలము
నుండి అస్వస్థతతో నున్న సంగతి పత్రికా పాఠక ప్రపంచమునకు తెలిసియే యుండెను.
కాని త్వరలోనే ఆయన సంపూర్ణముగా ఆరోగ్యము పొందగలడని ఆశించుచుండగా
అకస్మాత్తుగా ఆయన మరణవార్త తెలిసినది. గండము గడచి బయటపడినచో తాను
అమరుడను కాగలనని బెర్నార్డుషా అంతకుముందే తెలిపి యుండెను. ఈ మాటల
వలన ఆయనగూడ తన అవసానమును శంకించినట్లే స్పష్టము కాగలదు.
షా ఐర్లండు దేశీయుడు. కాని ఆయన మరణము ఇంగ్లండు దేశమునే కాక
సమస్త ప్రపంచమును గూడ దుఃఖ సముద్రములో ముంచినది.
ఈనాటి ప్రపంచ మహా రచయితలలో బెర్నార్డు షా కు సమున్నత స్థానము
కలదు. నాటక రచయితగా ఆయన జగత్ర్రసిద్ధి గాంచి షేక్సియర్‌తో సమానమైన
రచయితగా ఆయన మెప్పులొందినాడు. షా అనేక నాటకములను రచించెను. తన
నాటకములన్నింటిలో జోన్ ఆఫ్ ఆర్క్ ఉత్కృష్టమైనదని ఆయన అభిప్రాయమై
యుండెను. ఇటీవల ఆయన ఈ అభిప్రాయమును తెలుపుచు జోన్ ఆప్ ఆర్మ్‌ను
తాను వ్రాయలేదనియు, జోన్ ఆఫ్ ఆర్క్ వ్రాసినదనియు తెలిపిరి. షా రచనలలో
వ్యంగ్యము, అధిక్షేపము సమృద్ధిగా కనబడుచుండును. ఎనిమిదవ ఎడ్వర్డు తాను
కోరిన స్త్రీని వివాహము చేసికొనుటకై స్వతంత్రము లేకపోయినందున రాజ్య
పరిత్యాగము చేసినప్పుడు ఆ సంఘటనమునకు కారణభూతుడైన బాల్ట్విన్ ప్రధాని
మొదలైనవారి శీలమును ఆయన ఒక నాటకములో చక్కగా చిత్రించి యుండెను.
షా ఒక నాటక రచయితయే కాదు. అనేక ఇతర విషయాలను గూర్చి కూడ
ఆయన విలువగల గ్రంథములను వ్రాసి యున్నారు. అర్థశాస్త్ర రాజకీయ శాస్త్రములు
షాకు అభిమానాస్పదమైన విషయములు. ఈ విషయములను గూర్చి ఆయన
గ్రంథములను గూడ రచించిరి. షా గొప్ప విజ్ఞాని, ఫిలాసఫర్.
మన తెలుగు కవీశ్వరులలో నొకరు యెంత బాగుగ రచించినప్పటికిని
సమకాలికు లెన్నటికిని మెచ్చరని తన విచారమును, ఆక్రోషమును ప్రకటించెను.
సాధారణముగా, అందు ముఖ్యముగా ప్రాచ్యఖండమునందు సమకాలికులు మెప్పు
పొందుట మిక్కిలి కష్టమైన పని. అయితే యీనాడు పరిస్థితులు కొంచెము మారినవి.
404
మన కళా నంవద - సాపొత్యము
ప్రతిభకు ప్రణమిల్లుట మనవారు మెల్లమెల్లగా నేర్చుకొనుచున్నారు. సమకాలికుల
ఆదరము పొందిన రచయితలు కూడ కనబడుచున్నారు. అయితే బెర్నార్డు షా వలె
సమస్త ప్రపంచములోని సమకాలికుల యొక్క గౌరవాదరములు పొందిన రచయిత
మరొక్కరు కానిపించరని చెప్పవచ్చును. తన జీవిత కాలములోనే ఆయన
పూర్వకవులతో సమానమైన గౌరవాదరములు పొంద గలిగెను.
షా మంచి వక్త, సంభాషణా చతురుడు, ఛలోక్తి నిపుణుడు. ఏ విషయము
గూర్చియైనను ప్రశ్నించినప్పుడు వెంటనే యే మాత్రము తడుము కొనక
చమత్మానముగా సమాధానము జెప్పుటలో షా అద్వితీయమైన నేర్పు గలిగి యుండెను.
ఈయన ఛలోక్తులు ప్రపంచ ప్రఖ్యాతి పొందినవి. ఈ విధముగా తన ఛలోక్తుల చేత
సమస్త జగత్తును ఆకర్షించిన ఆధునిక రచయిత మరొక్కరు లేరని చెప్పిన అతిశయోక్తి
కాజాలదు. షా ఛలోక్తులలో, సమాధానములలో ఆయన ప్రత్యేక వ్యక్తిత్వము ప్రతిబింబ
మగుచుండును.
షా శాకాహారి, సామ్యవాది. సామ్యవాదమును గూర్చి ఆయన యొక గ్రంథమును
గూడ రచించెను. పుస్తక సమీక్ష సంగీత విమర్శలలో ఆయన ప్రత్యేకమైన నేర్చు
గలిగియుండెను. 1925 సంవత్సరములో ఆయన సాహిత్యమునకు నోబుల్
బహుమానము పొంది యుండెను. మరణించు వరకు ఆయన వయస్సు 94
సంవత్సరాలు.
షా తీవ్రమైన రాజకీయ అభిప్రాయము కలిగియుండెను. నిర్భయముగా
విమర్శించుటలో షాను మొదలు చెప్పి తరువాత ఇతరులను చెప్పవలెను. కొరియా
యుద్ధమును గూర్చి అభిప్రాయమును తెలుపుమని కోరగా “ఈ విషయమై నా
అభిప్రాయముతో పనియేమి? ఏది యెట్లున్నను నేను విధిగా పన్ను చెల్లించుచున్నాను
కదా” అని ఆయన తెలిపి యుండెను. ప్రపంచ రాజకీయవేత్తలందరిలో నెహ్రూ,
స్టాలిన్‌ల మీద షా కు విశేష గౌరవాదరములుండెను. ఆనాటి అంతర్జాతీయ రాజకీయ
సంఘర్షణలో ప్రపంచము యొక్క ఆశలన్నియు వారిద్దరి మీదనే ఆధారపడి యున్నవని
ఆయన తెలిపి యుండెను.
94 సంవత్సరాల వృద్ధ దశయందు షా అస్తమించెను. ఆర మగ్గిన పండు
రాలి పోయినది. జీర్ణమైన శరీరము నుండి ఆత్మ యెగిరి పోయినది.
405
డా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
అమరజీవి మౌలానా సాహెబ్
మౌలానా సాహెబ్ పరలోకగతులైనారను వార్త సమస్త భారతదేశమును శోక
సముద్రములో ముంచినది. కనులు మూసికొనినంతనే రాజరీవి ఉట్టిపడు ఆ
విగ్రహము, పాదుషాలను స్మరింపజేయు ఆ గంభీరమూర్తి మన మనోదర్పణములందు
ప్రతిబింబించుచున్నది. ఈ రాజరీవి, యీ గాంభీర్యము ఆయన బాహ్యస్వరూపముననే
కాక ఆంతరంగిక స్వరూపమునకు విలక్షణమైన ప్రత్యేకత యని చెప్పవచ్చును.
శక్తివంతమైన ఆయన లేఖినీ విన్యాసము నందు, వచోవిలాసము నందు యీ రెండు
గుణములు విశిష్టముగా కనుపించుచుండును. దూషణ భూషణములకు
రాగద్వేషములకు అతీతముగా కర్తవ్య నిర్వహణము గావించిన ఉదారచరితుడు
మౌలానా సాహెబ్.
చండశాసనుడైన మౌలానా దయార్ధహృదయుడు. ఒక్కొక్కసారి ఆయన మాటలు
దారుణాఖండల శస్తతుల్యములైనప్పటికిని హృదయము మాత్రము నవ్యనవనీత
సమానము. ఇస్లాం మత సంస్కృతులను గూర్చి మౌలానా సాహెబ్‌ది తుదిమాట.
సకల ప్రపంచములోని అరబ్బీ, పార్సీ విద్వాంసులయందు ఆయనది అగ్రస్థానము.
పదునాలుగు సంవత్సరాల చిరుత ప్రాయముననే భారతదేశములో లభించగల అరబ్బీ
వాబ్మయమున పారంగతుడైన మౌలానా ఈజిప్టు వెళ్ళి అల్‌అజ్జర్ విశ్వ విద్యాలయమున
విద్యాభ్యాసమును రెండు సంవత్సరాలలో ముగించిన కుశాగ్రబుద్ధి. తరువాత కొన్ని
అయిరోపా భాషలను కూడా నేర్చుకొని విశ్వసంస్కృతిని సంపూర్ణముగా
ఆకళించుకొనినారు.
ఉర్దూ వాజ్మియమున రచయితగా మౌలానా సాహెబ్‌కు మహోన్నత స్థానము
కలదు. ఖురాన్‌కు ఆయన వ్రాసిన భాష్యము, తజ్మిరా అను గ్రంథ రూపమున
ఆయన ప్రకటించిన రచనలు సర్వదా నిలిచి యుండగలవు. మౌలానా శైలి, ఆయన
వ్యక్తిత్వమువలె ప్రత్యేకమైనది. కలకత్తా నుండి 'ఆల్‌హిలాల్ వారపత్రికను ప్రకటించి
ఖిలాఫత్ ఉద్యమానికి, భారత జాతీయోద్యమానికి, హిందూ ముస్లిం ఐక్యతకు
పట్టుగొమ్మగా నిలిచిన మౌలానా, తరువాత భారత జాతీయ కాంగ్రెసుకు ముమ్మారు
మూర్భాభిషక్తులై దేశ స్వాతంత్రోద్యమానికి విజయవంతముగా నాయకత్వము
406
మన కళా సంపద - సాపొత్యము
వహించినాడు. జాన్ గంథర్ మౌలానా సాహెబ్‌ను భారత జాతీయ కాంగ్రెస్ మేధానిధిగా
ప్రకటించినారు. మౌలానా సంపాదకీయాలు, తెలుగువారికి మట్నూరి కృష్ణారావుగారి
సంపాదకీయాలను జ్ఞప్తికి తెచ్చుచుండును. క్రిప్సురాయబార తరుణమున ఇంగ్లండు
మంత్రివర్గ ప్రతినిధులతో సంప్రదింపుల సందర్భమున మౌలానా ప్రదర్శించిన రాజనీతి
కౌశలము నిరుపమానమైనది. అత్యంత కఠినమైన అగ్నిపరీక్షలలో అమోఘ
విజయాలను సాధించిన నిష్మళంక జాతీయవాది మౌలానా సాహెబ్.
మౌలానా లోని రాజరీవి, గాంభీర్యములు మోతీలాల్‌ను జ్ఞప్తి చేయుచుండును.
త్యాగము, జెదార్యము చిత్తరంజనదాస్‌ను తలపింపజేయును; ప్రాచ్య విజ్ఞానము;
పారమార్ధిక చింతనము లోకమాన్యుని స్మరింపజేయును; మేరు సమాన ధైర్యము,
పట్టుదలతో కూడిన సాహసము సర్దార్ పటేల్‌ను స్మృతికి తెచ్చుచున్నవి. కేసరి
యను బిరుదము, లజపత్‌రాయ్ యందువలె, మౌలానా యందు కూడ సంపూర్ణముగా
సార్థకము. జవహర్లాల్ యందువలె మౌలానాలో సాహిత్య విజ్ఞానముల సరస
సమన్వయము గోచరించుచుండును. ఈ మహనీయు లందరివలె, మౌలానా గూడ
జాతిపిత గాంధీమహాత్మునిచే ప్రభావితులైన శేముషీ సింధువు, త్యాగమూర్తి.
ఆజన్మాంతము మౌలానా వ్యక్తిత్వము నందువలె, అవసాన సమయమున గూడ
ఒక విలక్షణమైన ప్రత్యేకత గోచరించుచున్నది. గీతా శ్లోకములను పఠించుచు
పరమపదించిన లోకమాన్యునివలె, వైద్యుల పరిచర్యలను, జెషధాలను నిషేధించి
“నన్ను అల్లాకు వదిలివేయుమ”ని చెప్పుచు, పరమేశ్వర ధ్యానమున లగ్నమైన
హృదయముతో మౌలానా సాహెబ్ పరలోకగతుడైనాడు. దైన్యములేని జీవనము
గడిపిన మౌలానా ఆయాసము లేని మరణమునే పొందినారని చెప్పవచ్చును.
“బలమునీవ నాకు, భక్తుండ నీయెడ; ఆలుబిడ్డలేని యట్టివాడ; కావు నన్ను అధిక,
కారుణ్యమున; ఇమ్మనుజ్ఞకమలదజుమనోజ్ఞనయన” యని యోగీశ్వరేశ్వరుడైన
శ్రీకృష్ణమూర్తిని స్మరించి కనులు మూసికొనిన భీష్ముని నిర్యాణమును మౌలానా
అవసానము జ్ఞప్తికి తెచ్చుచున్నది.
407
హైదరాబాదులో
స్వాతంత్ర్యోద్యమము
(ఒక సమీక్ష
హైదరాబాద్‌లో స్వాతంత్ర్యోద్యమము
ఒక సమీక్ష
క్రీస్తుశకము 1800 ప్రాంతము వరకు భారతదేశములో ఇంగ్లీషు సామ్రాజ్యము
స్థిరత్వము పొందినదని చెప్పవచ్చును. 1800 సంవత్సరమున అప్పటి గవర్నర్ జనరల్
స్వదేశ సంస్థానాధీశ్వరులతో చేసికొనిన ఒడంబడిక ప్రకారము నైజాం బ్రిటిష్ వారికి
సామంతుడయ్యెను.
భారత దేశములో బ్రిటిష్ వారి పరిపాలనను స్వదేశ సంస్థానాధీశ్వరులు
మొదలైనవారు శిరసావహించి నప్పటికిని ప్రజలలో వారియెడల సానుభూతి
లేకపోవుటయేకాక వారిని తొలగించవలెనని తీవ్రమైన ఆకాంక్ష ప్రబలియుండెనని
మన దేశములోని స్వాతంత్ర్యోద్యమము స్పష్టీకరించుచున్నది. ప్రజల ఆమోదము
బ్రిటిష్‌వారికి ఎన్నడును లభించి యుండలేదు. ఈ విషయమై మన పాఠశాలలలో
విద్యార్థులకు బోధించు చరిత్రల యందు వివరాలు శూన్యము. ఎందుకనగా అవి
పాశ్చాత్య చరిత్రకారులచే రచింపబడిన గ్రంథాలు. ఈ నాడు మన చరిత్రను సరిగా
వివరించుటకు ప్రయత్నాలు జరుగుచున్నవి. ఈ ప్రయత్నాల ఫలితముగా అనేక
ముఖ్యవిషయాలు తెలియగలవు.
ముఖ్యముగా బ్రిటిష్‌వారిని తొలగించుటకై మన దేశమునందలి అన్ని రాష్ట్రాలలో
విప్లవ ఉద్యమాలు బయలుదేరిన సంగతి చాల ప్రధానమైనది. ఈ విప్లవోద్యమాల
చరిత్ర రక్తాంకితమై, మహోజ్వలమై, దేశభక్తి పూరితమై, త్యాగశోభితమై, ఉదాత్తమై,
విలసిల్లుచున్నది. అన్ని రాష్ట్రాలలో వలెనే హైద్రాబాదు రాష్ట్రములో బ్రిటిష్‌పరిపాలనకు
వ్యతిరేకముగా విప్లవాలు బయలుదేరినవి.
1803 సంవత్సరమున ఇంగ్లీషువారికిని మహారాష్ట్రలకును యుద్ధము
జరిగినది. ఇప్పటివలెనే నైజాం ఇంగ్లీషువారికి సామంతుడై యుండెను. అప్పుడు
మహిపత్ రాయ్ అను ప్రముఖుడు నైజాం ఏలుబడిక్రింద బీరారు రాష్ట్రమునకు
గవర్నర్‌గా నుండెను. ఇప్పటికిని ఈయన వంశమువారు హైద్రాబాదులో ప్రముఖులై
యున్నారు. అప్పుడు నైజాం మహారాష్టులకు వ్యతిరేకముగా ఇంగ్లీషువారి పక్షమున
వెళ్లి పోరాడవలసినదని రాజా మహిపత్ రాయను ఆజ్ఞాపించెను. కాని ఆయన
411
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
ఉద్దేశపూర్వకముగా సహకరించలేదు. దానిమీద నైజాంకు ఆయన ప్రధానులకు
మహిపత్ రాయ్ పైన ఆగ్రహము కలిగినది. అప్పుడు నైజాంకు మీర్ ఆలం ప్రధాన
మంత్రిగా నుండెను. ఇంగ్లీషు రెసిడెంటు మరియు నైజాం ప్రధాని మీర్ ఆలం
ఉభయులు మహిపత్ రాయ్ నడవడికి కోపించి, మహిపత్ రాయ్‌ను 1804లో
ఉద్యోగము నుండి తొలగించిరి. అప్పుడు ఆయన షోలాపూర్ వెళ్ళి తిరుగుబాటు
గావించెను. అందుచేత మహిపత్ రాయ్‌ను అణచివేయుటకై 1806వ సంవత్సరమున
నైజాం సైన్యాలు పంపబడెను. కాని ఈ సైన్యాలను మహిపత్ రాయ్ ఓడించి
తరిమివేసెను. తరువాత ఇంగ్లీషువారి సైన్యాలు వెళ్ళి మహిపత్ రాయ్‌ను ఓడించెను.
ఈ ఓటమి ఫలితముగా మహిపత్ రాయ్ ఇందూరుకు హోల్మారును ఆశ్రయించు
నిమిత్తము పలాయనమై వెళ్ళెను. మార్గమధ్యమున మిక్కిలి దీనపరిస్థితిలో మహిపత్
రాయ్ మరణించెను. ఇది హైద్రాబాదు రాష్ట్రములో ఇంగ్లీషు పరిపాలనను
ప్రతిఘటించిన మొట్టమొదటి సంఘటన.
1808 సంవత్సరమున బొలారంలోని బ్రిటిష్ సైన్యాలను ఇంగ్లీషువారికి
వ్యతిరేకముగా తమవైపు త్రిప్పుకొనుటకు కొందరు హైద్రాబాదు జాగీర్జార్లు
ప్రయత్నించిరి. అందుకు వారు హైద్రాబాదు ప్రభుత్వముచేత శిక్షింపబడిరి. ఇట్లు
శిక్షింపబడిన వారిలో నూరుల్ ఉమ్రా మరియు రావు రంభా నింబాల్మర్ అను
ఇరువురు జాగీర్జారులు ముఖ్యులు. వీరిని ఉభయులను తమ జాగీరు గ్రామాలకు
వెళ్ళి, అక్కడినుండి కదలవద్దని అప్పటి ప్రభుత్వము ఆజ్ఞాపించెను.
1817 సంవత్సరమున మూడవ మహారాష్ట్ర యుద్ధము జరిగినది. ఇది భారతదేశ
చరిత్రలో చెప్పదగిన యుద్ధము. ఈ యుద్ధములో బ్రిటిష్ వారికి సహాయముగా
పోరాడ వలసినదని నైజాం ఆదేశింపబడెను. అందుచేత నైజాం సైన్యాలు యుద్దానికి
పంపబడెను. కాని నైజాం సైన్యములోని కొందరు రోహిలాలు మహారాష్టులకు
వ్యతిరేకముగా పోరాడుటకు నిరాకరించిరి. అప్పుడు వారు ఉద్యోగాల నుండి నైజాం
చేత తొలగింపబడిరి. ఆ విధముగా తొలగింపబడిన రోమిలాలకు సర్దార్ ఖాన్
కోటేజాయి అను ముఖ్యుడు నాయకత్వము వహించి పూనాకు వెళ్ళి పేష్వాలతో
కలిసి, బ్రిటిష్ వారికి వ్యతిరేకముగా పోరాడుచు యుద్ధరంగమున మరణించెను.
ఆయన మరణానికి హైద్రాబాదు నగరములోని ముషీరాబాదు చెంచల్‌గూడ
ప్రాంతాలలోని ప్రతి రోహిలా కుటుంబము శోకించినట్లు ఆధారములు కలవు.
412
హైదరాబాదులో స్వాతంత్రోద్యమము
1839 నంవత్సరమున ఉత్తర భారతమున వవోబీ ఉద్యమము
ప్రారంభమయ్యెను. ఇది బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకముగా ప్రారంభింపబడిన
ఉద్యమము. ఈ ఉద్యమ నాయకులలో ఒకరైన మౌల్వీ సలీం హైద్రాబాదు నగరానికి
వచ్చి, ఇక్కడి బ్రిటిష్‌వారికి వ్యతిరేకముగా ఒక విప్లవోద్యమము సాగించెను. అప్పుడు
హైదరాబాదుకు నిజాంగా నుండిన నాసిరుద్దాలాను సింహాసనమునుండి దింపివేసి,
ఆయన సోదరుడైన ముబారిజుద్దాలాకు రాజ్యము అప్పగించి, బొలారంలోని
సైన్యమును తమ ఆధీనము చేసుకొనవలెనని ఈ విప్లవ కారులు ఉద్దేశించిరి.
ఇందుకొరకై వారు కర్నూలు నవాబుతో గూడ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిరి. కర్నూలు
నవాబు ఒక లక్ష రూపాయల ఆయుధసామగ్రిని సేకరించిపెట్టెను. బ్రిటిష్
పరిపాలనకు ఎదురుతిరిగి, బ్రిటిష్‌వారిని హత్యచేయుటకు ఈ విప్లవకారులు యేర్పాటు
చేసుకొనిరి. కాని ఈ యేర్చాటుల రహస్యాలు బయల్బడి ముబారిజుద్దౌలా మరియు
ఆయన అనుయాయులు నిర్భంధింపబడిరి. కర్నూలు నవాబుతో ఈ సందర్భమున
రెండురోజులు యుద్ధముకూడ జరిగినది. యుద్ధములో కర్నూలు నవాబు ఓడింపబడి,
కర్నూలు నగరము స్వాధీనము చేసుకోబడెను. అప్పుడు కర్నూలు నవాబుగానుండిన
గులాం రసూల్‌ఖాన్, యుద్ధములో ఓడింపబడిన తరువాత మద్రాస్ పంపివేయబడగా
మార్గ మధ్యమున హత్య గావింపబడెను. హైద్రాబాదులో ఇంగ్లీషు మరియు నైజాం
అధికారులతో కూడిన ఒక కమీషన్ నెలకొల్పబడి, ముబారిజుద్దాలా మరియు ఆయన
అనుయాయుల నేరమును విచారణ గావించెను. ఈ విచారణ ఫలితముగా మౌల్వీ
సలీం మరియు ఆయన అనుచరులకు 18 సంవత్సరాల కఠిన శిక్ష విధింపబడెను.
రాజ వంశీకుడైన ' ముబారిజుద్దౌాలా గోలకొండలో బంధింపబడెను. ఆయన ఈ
బంధనులోనే 1854 సంవత్సరమున మరణించెను.
రోహిలాల వీరోచిత పోరాటం
1856 సంవత్సరమున జెరంగాబాదులోని అరబ్బులు తిరుగుబాటు లేవదీసిరి.
ఈ తిరుగుబాటులో బ్రిటిష్‌వారు ప్రాణాలను కోలుపోయిరి. చాల కష్టముమీద ఈ
తిరుగుబాటు అణచివేయబడెను. 1857 సంవత్సరమున ఉత్తరదేశములో ప్రజలు
తిరుగుబాటుచేసిరనువార్త తెలియగానే హైద్రాబాదులో కూడ తీవ్రమైన అలజడి
చెలరేగెను. జెరంగాబాదులోని దేశీయ సైన్యము ఎదురుతిరిగెను. తరువాత ఇది
43
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
అణచివేయబడి తొమ్మిది మందికి ఉరిశిక్ష యాయబడెను. ఇందులో కొంతమంది
దేశీయ సైనికులు జెరంగాబాదు సైన్యమునుండి తప్పించుకొని హైద్రాబాదుకు వచ్చిరి.
అప్పుడు హైద్రాబాదుకు దివానుగా (ప్రధానమంత్రి) నుండిన మొదటి సాలార్జంగ్
వీరిని బంధించి, ఇంగ్లీషువారి ప్రతినిధియైన రెసిడెంటుకు అప్పగించెను. హైద్రాబాదు
పట్టణములోకూడ 1857 సంవత్సరమున తీవ్రమైన అలజడి చెలరేగెను. ఇంగ్లీషువారి
పైన తిరుగుబాటు చేయవలసినదని ప్రజలను కోరుచు కరపత్రాలు పంచిపెట్టబడెను.
కాగితాలు గోడలమీద అంటివేయబడెను. అప్పటి దివాన్ సాలార్జంగ్ గట్టి రక్షణ
యేర్చాటులు గావించెను. కాని 1857 సంవత్సరమున 17వ జులైనాడు
బేగంబజారులోని నూర్ల కొద్ది రోహిలాలు తుర్రెబాజ్‌ఖాన్ మరియు మౌల్వి అల్లావుద్దీన్
అనువారి నాయకత్వమున రెసిడెంటుమీద దాడిచేసిరి. అప్పుడు సుమారు రెండు
గంటలసేపు కాల్పులు జరిగినవి. ఇరువదియైదు మంది చనిపోయిన తరువాత
రోహిలాలు తిరోగమించిరి. తుర్రెబాజ్‌ఖాన్ అరెస్టు చేయబడెను. తప్పించుకొని పోవు
ప్రయత్నము చేయగా ఆయనను పోలీసులు తూపురాన్ గ్రామము వద్ద కాల్చిచంపిరి.
మౌల్వీ అల్లావుద్దీన్ కూడ అరెస్టు చేయబడి, అండమాన్ దీవులకు యావజ్జీవ
ద్వీపాంతారవాస శిక్ష మీద పంపబడెను. అక్కడ ఆయన 1884 సంవత్సరమున
మరణించెను. రాష్ట్రములోని ఇతర ప్రాంతాలలోకూడ అలజడులు చెలరేగెను.
రాయెరాయాన్ నంస్థానోద్యోగియైన సోనాజిపంత్ 1857 జనవరి నెలలో
ఉత్తరదేశములోని నానా సాహెబ్ పేష్వాకొక లేఖ వ్రాసెను. అందులో దక్షిణదేశములొ
తిరుగుబాటుకు తగిన ఏర్పాటులు చేయవలెననికోరెను.
పట్వారీ సాహసం
బీదర్ జిల్లాలోని నర్ధేడ్ అను గ్రామముయొక్క పట్వారీయెన రంగారావు ద్వారా
యీ లేఖ నానాసాహెబ్‌కు పంపబడెను. అప్పుడు నానాసాహెబ్ కాన్పూరు సమీపము
నందలి బేతూరులో నుండెను. అక్కడ ఆయన ఈ ఉత్తరము అందుకొని తిరిగి అదే
రంగారావు ద్వారా హైద్రాబాదులోని ముఖ్యులైన సోనాజిపంత్, గులాబ్‌ఖాన్
(రోహిలాముఖ్యుడు) సష్టరుద్దాలా (రావు రంభా నింబాల్మన్ ఆశ్రితుడు) మొదలైనవారికి
ఉత్తరాలు వ్రాసెను. రంగారావు దక్కన్‌కు తిరిగివచ్చి నాందేడు జిల్లా దేగ్లూరు
తాలూకాలోని కౌలాస్ రాజా అయిన రాజా దీప్‌సింగ్‌ను కలునుకొనెను.
414
హైదరాబాదులో స్వాతంత్రోద్యమము
సస్థరుద్దౌలాకూడ నానా సాహెబ్‌తో సహకరించగలవని వాగ్దానము చేయుచు వ్రాసెను.
రాజా దీప్‌సింగ్ 800 సైనికులను సిద్ధముచేసుకొని బ్రిటిష్ వారిని హతమార్చి
నాగపూరుకు వెళ్లవలెనని నిశ్చయించుకొనెను. అయితే యీ ప్రయత్నాలు
తెలుసుకోబడి రాజా దీప్‌సింగ్, సస్టరుద్దాలా, రంగారావులు అరెస్టు చేయబడిరి.
సోనాజి 1851 ఫిబ్రవరి నెలలో మరణించెను. కడమవారు విచారణ చేయబడిరి.
రాజా దీప్‌సింగ్ జాగీరును ప్రభుత్వము స్వాధీనము చేసుకొని, ఆయనను మూడు
సంవత్సరాలు నిర్భంధించెను. సష్టరుద్దౌలా స్థిర చరాస్తులు జప్తీ చేయబడి, యావజ్జీవ
నిర్బంధశిక్ష విధింపబడెను. రంగారావు ప్రత్యేకముగా బ్రిటిష్ వారిచే అల్వాల్‌లో
విచారణ చేయబడి, మరణశిక్షకు గురి చేయబడెను.
అజంతా పట్టణంలో యుద్ధం
1858లో పూజావూరుకు చెందిన గోవిందరావు దేశపాండే జెరంగాబాదులో
2,000 భిల్లులతో కూడిన సైన్యము సమకూర్చుకొని, బ్రిటిష్‌వారి తిరుగుబాటు
చేసెను. క్యాప్టెన్ పెడ్లర్ నాయకత్వమున ఇంగ్లీషు సైన్యానికి ఈ భిల్లు సైన్యానికి
మధ్యసంకుల సమరము జరిగెను. ఈ యుద్ధములో 40 మంది భిల్లులు మరణించిరి.
చాలామంది నిర్బంధింపబడిరి. గోవిందరావు పరిస్థితియేమైనదో తెలుపు వివరాలు
దొరకలేదు. నానా సాహెబ్ పేష్వా యొక్క సేనానాయకుడైన తాంతియా తోపి రోహిలా
సైన్యముతో అజంతా పట్టణములో ప్రవేశించి, పట్టణమును స్వాధీనము చేసుకొని
కొన్నిరోజులు తనస్వాధీనమున నుంచుకొనెను. తరువాత ఘోర యుద్ధము జరిగివారు
బ్రిటిష్ సైన్యముచే ఓడింపబడిరి. రోహిలాలు అనేకులు బస్మత్ తాలూకాకు వెళ్లిపోయిరి.
పర్భనిజిల్లా బస్మత్ తాలూకాలోని జెలా జాగీర్జార్ అయిన పీర్ణాదా ఈ రోహిలాలను
కలుసుకొనెను.. అప్పుడు వారందరు ట్రిటిష్‌వారితో పోరాడిరి. చాలామంది
ఇంగ్లీషువారు యీ యుద్ధమున హతమార్చబడిన తరువాత, యీ సైన్యము
అణచివేయబడి, రోహిలాలు నామన శేషులు గావింపబడి, జాగీర్జారు పీర్ణాదా
బంధింపబడి, యావజ్జీవ నిర్బంధశిక్ష అనుభవించెను. 1858 సంవత్సరము ఫిబ్రవరి
నెలలో గుల్బర్గా జిల్లాలోని షోలాపూర్ రాజు అయిన వేంకటప్పనాయక్ బ్రిటిష్ వారి
మీద తిరుగుబాటు చేసెను. తీవ్ర సంఘర్షణ తరువాత, ఆయన ఓడింపబడి
నిర్భంధింపబడి మద్రాసుకు పంపివేయ బడుచుండగా మార్గమధ్యమున హైద్రాబాదు
పట్టణ సమీపమునందు అంబర్ పేట వద్ద ఆయన ఆత్మహత్య గావించుకొనెను.
415
డా॥ దేవులపల్లి రామానుజరావు (గ్రంథావళి
తెలంగాణా జిల్లాలలో ఉద్యమాలు
1858 జూన్ రాయచూర్‌లో భీమ్‌రావు దేశాయి అను వీరుడు ఒక సైన్యము
సమకూర్చుకొని కొపల్ కోటను స్వాధీనము చేసుకొనెను. తరువాత ఇంగ్లీషు సైన్యాలు
వచ్చి ఆయనమీద దాడిచేసెను. యుద్ధములో భీమ్‌రావు దేశాయి మరియు
నూటయేబదిమంది సైనికులు మరణించిరి. మిగిలిన వారు నిర్బంధింపబడి
మరణశిక్షకు గురియెరి.
ఆరోజులలో నానాసాహెబ్ పేష్వా మరియు తాంతియ తోపీల వార్తాహరులు,
గూఢచారులు చాలమంది హైద్రాబాదు రాష్ట్రములో సంచరించిరి. ఇంతకుముందు
రంగారావు పట్వారిని గూర్చి ప్రస్తావించినాము. ఇంకొక బ్రాహ్మణుడు తాంతియాతోపీ
వద్ద నుండి షోలాపూర్ రాజాకు సందేశము తీసికొని పోవుచుండగా, గుర్తింపబడి,
నిర్బంధింపబడి, మరణ శిక్షకు పాత్రుడయ్యెను. నానాసాహెబ్ పేష్వా బంధువైన
రావుసాహెబ్ సైన్యమును సమకూర్చుకొనుటకు దక్కన్‌కు వచ్చెను. నిర్మల్ జాగీర్జార్
అయిన వెంకట్రావుకు ఆయన కొన్నాళ్లు అతిథిగా నుండెను. తరువాత ఆయన
హైద్రాబాదుకు వచ్చెను. కాని ఒక ఇంగ్లీషవాడు ఆయనను వెంటాడగా తప్పించుకొని
పోయెను. తరువాత ఈ రావుసాహెబ్ పేష్వా ఆగ్రా వద్ద నిర్బంధింపబడి, మరణశిక్షకు
గురియయ్యెను. రావుసాహెబ్ పేష్వాకు ఆతిథ్యమిచ్చిన నేరమునకై, వేంకట్రావు
జాగీరును ప్రభుత్వము స్వాధీనము చేసుకొనెను.
గోండుల తిరుగుబాటు
ఆదిలాబాదు జిల్లాలోని గోండులుకూడ ఇంగ్లీషువారికి ఎదురు తిరిగిరి. వారి
నాయకుడు రాంజీ గోండు. ఉట్నూరు తాలూకాలో గోండులకు, ఇంగ్లీషువారికి
మధ్య యుద్ధము జరిగి గోండులు పరాజితులైరి. రాంజీగోండు నిర్బంధితుడై నిర్మల్‌కు
తీసికొని రాబడి, అక్కడ ఒక చెట్టుకు ఉరి వేయబడి చంపబడెను. ఈ నాటికిని ఆ
చెట్టు నిర్మల్‌లో నున్నది. దానిని రాంజీగోండు చెట్లు అని చెప్పెదరు.
1848 సంవత్సరమున ఇంగ్లీషువారు సతారా సంస్థానమును స్వాధీనము
గావించుకొనిరి. తరువాత 1858-1867 సంవత్సరాల మధ్య చాలమంది సతారా
ప్రజలు హైద్రాబాదుకు వచ్చి బెరంగాబాదు, బీదర్, బీడ్ జిల్లాలలో అలజడుల చెలరేగ
జేసిరి. 1867 సంవత్సరములో జంగ్ బహద్దర్ అను పేరుగల రాంరావు అనుయోధుడు
416
హైదరాబాదులో స్వాతంత్రోద్యమము
కొన్ని నూర్ల మందితో కూడిన సైన్యమును సిద్ధము చేసుకొని, అష్టీవర్దగల గడీని
స్వాధీనము చేసుకొని, తన జండాను ప్రతిష్థించెను. తిరిగి సతారా జిల్లాను బ్రిటిష్‌వారి
నుండి తీసికొని, స్వాధీనము చేసుకొనుట తన ఉద్దేశమని ఆయన వెల్లడిచేసెను.
తరువాత 1867లో రాంరావు నిర్బంధింపబడి, అండమాను దీవులకు పంపబడి
యావజ్జీవ ద్వీపాంతరశిక్ష విధింపబడెను. ఈ వివరాల వలన కొన్ని సంగతులు
స్పష్టమగుచున్నవి.
1. అన్ని జిల్లాలలో స్వాతంత్ర్యోద్యమము వ్యాప్తి జెంది అభివృద్ధి చెందెను.
ఇంగ్లీషు ప్రభుత్వమునకు వ్యతిరేకముగా తిరుగుబాటులు చెలరేగినవి.
2. నూర్లమంది చంపబడిరి.
3. వేలకొద్ది మంది నిర్బంధములో నుంచబడిరి.
4. డజనుల మంది అండమాన్‌దీవులకు పంపబడిరి.
5. లక్షల రూపాయాల ఆస్తి జప్తు చేసుకొనబడెను.
ఇందువలన సాలార్జంగు చేసిన ఏర్పాటులవలన హైద్రాబాదులో ఎటువంటి
అల్లరులు చెలరేగలేదను సంగతి సత్యము కాదని స్పష్టమగుచున్నది. 1857
సంవత్సరము తరువాత నైజాం రాజభవనపు ప్రాంగణములో అప్పుడు ఇంగ్లండు
ప్రభుత్వ ప్రతినిధిగా నుండిన రెసిడెంటు డేవిడ్‌సన్‌ను హత్య చేయుటకు ప్రయత్నము
జరిగియుండెను. 1860వ సంవత్సరము తరువాత ఇంగ్లీషువారిని పారద్రోలుటకు
మరికొన్ని ప్రయత్నాలు జరిగినవి. మహబూబునగరము జిల్లాలో పండుగ శాయన్న
అను యోధుడు తెల్లదొరను చంపాలె అను నినాదము లేవదీసి తిరుగుబాటు
చేసియుండెను. తరువాత యితనిని పట్టుకొని మరణశిక్ష విధించుట జరిగినది. ఈ
పండుగశాయన్నను గూర్చిన వివరాలు ఇంకను తెలిసికొనవలసి యున్నవి. ఇంకను
తెలంగాణా జిల్లాలలో ఇటువంటి వీరకృత్యములు చాలా జరిగి యున్నవి.
బీడ్ జిల్లాలో
1895వ సంవత్సరమున జవ్వాద్ హుసేన్ అను వ్యక్తిని అప్పటి రెసిడెంటును
హత్య చేయుటకు ప్రయత్నించిన నేరముపై హైద్రాబాదు నుండి వెలుపలకు
పంపివేయుట జరిగినది. 1897లో పూనాలో కర్నల్ రేగాండును హత్య చేయ
417
దా దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
ప్రయత్నించెనను నేరారోపణలో చిక్కుకొనిన ఛాపేకర్ కొంతకాలము హైద్రాబాదుకు
వచ్చి దాగుకొని రాయచూరు జిల్లా గంగావతి తాలూకాలో అరెస్టు చేయబడుట
జరిగినది. 1879లో వాసుదేవ్ బల్వంతఫడ్‌కే అను గొప్ప మహారాష్ట్ర విప్లవవీరుడు
గుల్బర్లా జిల్లాలోని గాన్గాపూరులో అరెస్టు చేయబడెను. 1899లో బాబాసాహెబ్
అను విప్లవవీరుడు బీడ్‌జిల్లాలో గొప్ప తిరుగుబాటు లేవదీసెను. అప్పటి యింగ్లీషు
సైన్యమునకు, ఈయన సైన్యమునకు మధ్య సంకుల సమరము జరగెను. 1899
ఏప్రిల్ నెల 14వ తేదీనాడు బాబా సైనికులు చాలా మంది చంపబడి బాబా పారిపోవుట
జరిగినది. తరువాత అతనిని గూర్చిన వివరాలు తెలియవు.
స్వదేశీ ఉద్యమం ప్రారంభం
1900ల తరువాత స్వదేశీ ఉద్యమము ప్రారంభమైనది. బెంగాలు, మహారాష్ట్ర
ప్రాంతాల ఉద్యమాల ప్రభావము హైద్రాబాదులో కూడ కనబడుచున్నది.
హైద్రాబాదులో విచారణ చేయబడినవారు, వెలుపలికి పంపబడినవారు, వెలుపలికి
వెళ్లిపోయినవారు చాలామంది కలరు. న్వదేశీ ఉద్యమముతో బాటు
విప్లవోద్యమముగూడ నడిచినది. ఉస్మానాబాదు జిల్లాలోని జౌసా గ్రామములో విష్ణుపింగ్లై
అను మహారాష్ట్ర వీరుడు కొన్ని సంవత్సరాలు నివసించెను. ఇండియా వైస్రాయి
హార్టింజ్ పైన బాంబు వేసిన నేరములో చిక్కుకొన్న సేనాపతి బాపట్ కొన్ని
సంవత్సరాలు జెరంగాబాద్‌లో దాగుకొనెను. 1909వ సంవత్సరములో నాసిక్ జిల్లా
కలెక్టరైన మిస్టర్ జాక్‌సన్‌ను హత్యచేసిన విద్యార్థి దళ నాయకుడు అనంతకావేరే
కొంతకాలము జెరంగాబాదులో గడిపెను. ఈదళము వారింకను కొందరు సజీవులై
యున్నారు. 1933లో కాకినాడ బాంబుకేసుతో సంబంధము కలిగిన భయంకరాచారి
హైద్రాబాదుకు వచ్చి యిక్కడ ఆయుధ సామగ్రిని తీసుకొని తిరిగి వెళ్లు సందర్భమున
పట్టుబడెను.
ఈవిధమైన విప్లవ ఉద్యమాలతోపాటు మొదటి ప్రపంచ యుద్ధము తరువాత
ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక జిల్లాలలో చట్టబద్దమైన శాంతియుత ఉద్యమాలు
బయలుదేరినవి. ఈ ఉద్యమాలను స్థాపించి పోషించినవారిలో కేశవరావుకోరట్‌కర్,
నామన్‌నాయక్, మాడపాటి హనుమంతరావుగార్లను 'పేర్మొనవలసియున్నది. ఈ
418
హైదరాబాదులో స్వాతంత్రోద్యమము
విధమైన ఉద్యమాలలో ఆంధ్ర, మహారాష్ట్ర కర్ణాటక మహాసభలతోపాటు హైద్రాబాదు
రాజకీయ మహాసభను కూడ పేర్కొన వలసియున్నది. వీనిలో యితరులకు
మార్గదర్శకమైనది ఆంధ్ర మహాసభయని మనము గమనించవలసియున్నది.
రాఘవేంద్రరావుశర్మ, తారానాథ్ మొదలైనవారు ఈ కాలము నందలి రాజకీయ
బాధితులు. ఖిలాపత్ ఉద్యమములలో చాలమంది ముస్లింలు పాల్గొనిరి. హైద్రాబాదు
కాంగ్రెస్ వారిలో మొట్టమొదటి వారిలో నొకడు ముల్లా అబ్బుల్ ఖయూం. ఈయన
కుమారుడే ముల్లా అబ్బుల్ బాసిత్. మన జాతీయోద్యమమున అగ్రశ్రేణి నలంకరించి
సకల భారత, కాదు, సకల ప్రపంచ ప్రఖ్యాతివహించిన విదుషీమణి, వీర నారీమణి,
త్యాగమూర్తియెన సరోజినీదేవి హైద్రాబాదు వాస్తవ్యురాలు, ఆంధ్రుల యింటికోడలు.
419
డా దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
హైద్రాబాదు ప్రజల స్వాతంత్ర్యోద్యమము
కొన్ని ఉజ్వల ఘట్టములు
'్రీ। ఈ! 1800 సంవత్సరమున నైజామ్ ట్రిటిష్‌వారికి సామంతుడై ఒడంబడికను
కుదుర్చుకొనినందువలన ఆయన పరిపాలిత ప్రాంతము రక్షిత ప్రాంతమయ్యెను.
ఈ ఒడంబడిక ప్రకారము. ఇంగ్లీషు వారికి యుద్ధకాలమునందు సహాయము
చేయవలసిన బాధ్యత నైజాముకు కలిగెను. కాని, కొంతకాలమువరకు నైజాము
సహాయము బ్రిటిష్‌వారికి సంతృప్తికరముగ నుండలేదు. మహారాష్టులతో బ్రిటిష్‌వారికి
కలిగిన యుద్ధములలో నైజాము సైనికులు సక్రమముగా సహకరించలేరని బ్రిటిష్
వారికి ఆగ్రహముకలిగెను. ఇంతకుముందు నిజాము (ఫ్రెంచివారి మిత్రుడుగా
నుండినందున నైజాము సైన్యమునకు కొంత (ఫ్రెంచి పక్షపాత ముండినట్లు
అనుమానించబడెను. (ఫ్రెంచి వారితో సైన్యసంబంధము వదలిపోయిన తర్వాత కూడ,
కొంత మంది (ఫ్రెంచివారు నైజాము సైన్యములో పని చేయుచుండిరి. ఈనాటికిని
నల్లగొండకు వెళ్లు త్రోవలో దిల్సుఖ్‌నగర్ వద్ద ఫ్రెంచివారి గోరీలు కనబడును.
హైద్రాబాదులోని త్రూప్ బజారు ప్రెంచి సైన్యముల యునికివలన ట్రూప్ బజారని
పేరందెను. (ఫ్రెంచివారి ప్రభావము ఇప్పటికిని హైదరాబాదులోని ఆనాటి
భవనములమీద కనబడును. ఇప్పటి ఘోషామహల్ హైస్కూలులోనికి వెళ్ళి చూచినచో
ఫ్రెంచివారి ప్రభావము గోచరించును. బహుశ ఈ (ఫ్రెంచి వారితో కలిగిన గాఢ
సంబంధము వలననే కాబోలు చాలా కాలమువరకు నైజాము సైన్యమునకు
బ్రిటిష్‌వారితో ఆప్తత కుదుజలేదు. నిజామ్ సైనికులు బ్రిటిష్ వ్యతిరేకులని భావము
బ్రిటిష్‌వారికి గలిగెను. తర్వాత ఢ్యూల్ ఆఫ్ వెల్లింగ్టన్ అను కీర్తిగాంచిన ఆర్ధర్
వెల్లస్లీ అపుడు హైద్రాబాదు సైనికోద్యోగిగా యుండెను. ఆయన నిజాము సైనికుల
యొక్క బ్రిటిష్ వ్యతిరేకతను గూర్చి తీవ్రముగా ఆక్షేపించెను. దానిపైన అపుడు
గవర్నర్ జనరల్‌గా నుండిన వెల్లస్లీ నిజాము యొక్క జెదాసీన్యమునకు, నిర్లక్ష్యతకు,
మైత్రీలోపమునకు గట్టిగా మందలించెను. అంతియేగాక నైజాము సైన్యము
కట్టుదిట్టము చేయుట కొరకు ఆయన సూచించెను. 1812లో అప్పుడు హైద్రాబాదులో
రెసిడెంటుగా నున్న ఆంగ్రమహాశయుడు కొంతమంది యూరోపియన్ సైనికులను
420
హైదరాబాదులో స్వాతంత్ర్యోద్యమము
నైజాము సైన్యములోనికి దిగుమతి గావించి, నైజాము సైన్యమును సంస్కరించు
కార్యము నారంభించెను. ఈ విధముగా సంస్మరించబడిన సైన్యమే హైద్రాబాదు
కంటింజెంట్. ఈ సైన్యమే హైద్రాబాదు రాష్ట్రములోని తిరుగుబాట్లను అణచివేయుటకు
నలుబది వత్సరముల వరకుపయోగించెను. ఈ సైన్యమునకు ముఖ్య కేంద్రము
బొలారమై యుండెను. దీనికి శాఖలు మఖ్ర్లల్, లింగ్స్‌గూర్, మోమినాబాద్,
జెరంగాబాద్, వరంగల్ నగరములలో ఉండెను.
సుమారు నలుబది సంవత్సరాలు అనగా హైద్రాబాదు రాష్ట్రానికి సాలార్‌జంగ్
దివానగునంతవరకు అప్పటి హైదరాబాదు ప్రభుత్వము సక్రమ పరిపాలన మరియు
సత్పరిపాలనను గూర్చి తగిన శ్రద్ధ గైకొనినట్లు కానరాదు. అపుడు దివాన్‌గా నుండిన
చందూలాల్‌కు, ఇంగ్లీషువారి అనుగ్రహమును సంపాదించుటే ప్రధాన లక్ష్యమయి
యుండెను. ప్రజలను గూర్చి గాని, పరిపాలనను గూర్చిగాని ఆయన తగిన శ్రద్ధ
తీసికొనలేదు. 1800 నుండి 1850 వరకు హైదరాబాదు రాష్ట్ర పరిస్థితు లీవిధముగా
నుండెను. నిజానికి ఆ కాలమున ఇంగ్లీషువారిచే శిక్షిత మయిన సైన్యమే
లేకపోయినచో హైద్రాబాదులో చెలరేగిన తిరుగుబాటులను, స్వాతం శ్రోద్యమాలను
అణచ వీలులేక పోయెడిది. ఈ విధముగ తిరుగుబాటుల నణచి నిజాము అస్తిత్వమును
నిలబెట్టిన ఇంగ్లీషువారు యిక్కడి పరిపాలనను సవరించుట తమ కర్తవ్యమని భావించి
అందుకొరకై నిజాముకు సలహాల నియ్యవలసియుండెను. కాని వారట్లు చేయలేదు.
1820 సంవత్సరములో ఒక్కసారి మాత్రము సర్‌చార్లెన్ మెట్మాఫ్ సర్వే మరియు
సెటిల్మెంట్ శాఖలలో (బందోబస్తు) ఇంగ్లీషువారిని నియమించవలసినదని
చందూలాల్‌ను కోరెను. కాని ఈ కోరిక అప్పుడు దివానుగానుండిన చందూలాల్‌కు
రుచింపలేదు. అప్పుడు గవర్నరు జనరల్‌గా లార్డు హేస్టింగ్స్ వుండెను. మార్చిన్
ఆఫ్ హేస్టింగ్స్‌కు, మెట్మాఫ్‌కు మధ్య మంచి సంబంధములు లేకపోయినందున
చందూలాల్ కొక మంచి నెపము దొరికెను. అందుకొరకు చందూలాలు ఇంగ్లీషువారు
తమ అంతరంగిక వ్యవహారములలో జోక్యము కలుగజేసి కొనవలదని గవర్నర్
జనరల్ కసమ్మతి తెలిపెను. అందుచేత మెట్మాఫ్ ప్రారంభించిన యూరోపియను
యుద్యోగుల నియామక మను ఉద్యమం కొన్ని సంవత్సరాలలోనే అంతమొందెను.
తర్వాత దినదినము పరిపాలనము చెడిపోజొచ్చెను. ఇట్టి పరిస్థితులలో ప్రజలకు
తిరుగుబాటొక్కటే మార్గాంతరముగా నుండెను. అందుచేత ఈ కాలమందు
421
డా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
తిరుగుబాటులు అన్ని జిల్లాలలో వ్యాపించెను. ఈ తిరుగుబాటులకు ముఖ్య కారణము
దుష్పరిపాలనము. తిరుగుబాటుల నణచుటకు నిజామునకు సహాయముచేసిన
ఇంగ్లీషువారు రాష్ట్రములో సత్సరిపాలనను ప్రవేశపెట్టుటకు శ్రద్ధవహించకపోయిరి.
బహుశః పరిపాలన దినదినము చెడిపోయి పరిస్థితి అధ్వాన్నమయినచో రాష్ట్ర
పరిపాలనను పూర్తిగా తమ చేతిలోనికి తీసుకొనుటకు తగిన అవకాశము లభించునని
ఇంగ్లీషువారు భావించియుండిరి. ఎందుకనగా తర్వాత పరిపాలనా లోపమును
కారణముగా పురస్కరించుకొని, రాష్ట్రములోని సారవంత ప్రాంతములయిన బీదరు
మొదలయిన వానిని నిజామునుండి ఇంగ్లీషువారు తమ స్వాధీనములోనికి తీసుకొనిరి.
అందుచేతనే హైద్రాబాదు పరిపాలనము యొక సంస్కరణను గూర్చి శ్రద్ధ
వహించకపోవుట వలన ఇంగ్లీషు వారుద్దేశాలను అనుమానింపవలసివచ్చుచున్నది.
1817-1857 వరకు హైద్రాబాదు చరిత్ర ప్రజల తిరుగుబాటులయొక్క
చరిత్రయని చెప్పవచ్చును. ఈ తిరుగుబాటులకు కారణము దుష్పరిపాలన యనియే
చాలమంది గ్రంథకర్తలు అభిప్రాయపడినారు.
ప్రభుత్వముపై ప్రజలు చేసిన యీ తిరుగుబాటులలో కొన్ని ముఖ్యమైన వాని
వివరాలు యీ క్రిందివిధముగా నున్నవి.
నాందేడ్ జిల్లాలోని నాయక్ తిరుగుబాటు: -
నాందేడ్, పర్శినీ, బీదర్ జిల్లాలలో గంగానదీ తీరమున హట్‌కర్లను ఒక తెగవారు
నివసించుచుండిరి. ఈ తెగవారి నాయకులు సుమారు 20 సంవత్సరాల కాలము
క్రీ1శ॥ 1819వ సంవత్సరము వరకు నిరంతరము వరుసగా తిరుగుబాటులు
చేయుచునే యుండిరి. వీరి నాయకుడు నౌసాది నాందేడ్‌కు 20 మయిళ్ళ దూరమున
నున్న నావాదుర్గమున కధిపతిగా నుండెను. 1819వ సంవత్సరమున బ్రిటిష్ వారి
నాయకత్వమున హైద్రాబాద్ సైన్యాలు ఈదుర్గమును ముట్టడించి 24 రోజులు
యుద్ధముగావించి, తుట్టతుదకు బహుకష్టముమీద అతి ప్రయాసతో ఈ కోటను
స్వాధీనము చేసుకొనిరి. ఈ కోటలో 588 మంది యుండిరి. అందులో 438 మంది
యుద్దములో చంపబడిరి. 80 మంది తీవ్రముగా గాయపడిరి. 20 మంది మాత్రమే
సజీవులుగానుండిరి. బ్రిటిష్‌వారి సైన్యమునకు కూడ చాల నష్టములు కలిగెను.
తరువాత హట్మర్ల స్వాధీనముననున్న మరికొన్ని కోటలుకూడ పట్టుకొనబడి వారి
తిరుగుబాట్లు అణచివేయబడెను. (2) 1818వ సంవత్సరమున జులై నెలలో బీడ్
422
హైదరాబాదులో స్వాతంత్ర్యోద్యమము
జిల్లాలో ధర్మాజ్ ప్రతాపరావు యను వీరుడు బ్రిటిష్‌వారికి వ్యతిరేకముగా తిరుగుబాటు
చేసెను. ఆయన కోట 'దివి; బ్రిటిష్‌వారి సైన్యాలు దివి మీద దాడిచేసి తీవ్ర ప్రతిఘటన
తరువాత దానిని పట్టుకొనెను. (3) 1818వ సంవత్సరము మే నెలలో రాయచూర్
జిల్లాలో వీరప్ప యను యోధుడు తిరుగుబాటు గావించి “కొప్పల్” మరియు “బహద్దుర్
బండ” అను కోటలను స్వాధీనము చేసుకొనెను. తరువాత అప్పుడు లెఫ్టినెంట్ కర్నల్
ప్రేజర్ నాయకత్వమున హైద్రాబాదు సైన్యములు, ఈ కోటలను స్వాధీనము గావించు
కొనెను. (4) 1822వ సంవత్సరములో ఆదిలాబాదు జిల్లాలోని మాహూర్‌లో మరొక
తిరుగుబాటు చెలరేగగా కమాండర్ గొర్దన్ నాయకత్వమున కొంత సైన్యము వెళ్ళి
దానిని అణచి వేసెను. (5) 1820వ సంవత్సరమున బీదర్ జిల్లాలోని ఉదీర్‌లో
దేశ్‌ముఖ్ శివలింగయ్య తిరుగుబాటు గావించి కొన్ని కోటలను ఆక్రమించుకొనెను.
అప్పుడు హైద్రాబాదు సైన్యము దాడిచేయగా శివలింగయ్య తప్పించుకొని పోయెను.
కాని ఉద్దీర్, జల్మోడ్, బత్తీదామ్, సులాలికోటలు బ్రిటిష్ వారి స్వాధీనమయ్యెను.
తిరుగుబాటు అణచివేయబడెను. 1821వ సంవత్సరమున బీదర్ జిల్లాలోని క్రిష్టాపూర్
ప్రాంతమున తిర్మల్‌రావు తిరుగుబాటు గావించెను. (6) 1821లో నిజామాబాదులోని
సిర్ణపల్లిలో, భవానిపేటలో, కామారెడ్డి వద్ద బీబీపేటలో తిరుగుబాటుకు లక్ష్మణరెడ్డి
నాయకత్వము వహించెను. ఈ తిరుగుబాటులన్ని తరువాత అణచివేయబడినవి.
ఇంచుమించుగ ఈ కాలముననే మంతెన తాలూకాలోని “మహదేవ్‌పూర్”లో ఒక
తిరుగుబాటు చెలరేగెను. (7) భిల్లుల తిరుగుబాటులు ఈ కాలమున చాల జరిగినవి.
1818 మరియు 1822 సంవత్సరములందు రెండుసారులు భిల్లులు జెరంగాబాదులో
తిరుగుబాటు గావించిరి. ఈ తిరుగుబాటులు 1860వ సంవత్సరము వరకు
సాగుచునేయుండెను. 1859వ సంవత్సరము అహమ్మద్ నగరములో భాగోజీనాయక్
మరియు జెరంగాబాదులో గోవిందరావు కాశీరాజ్ మరియు షాబాజీ నాయక్
అనువారలు భిల్లుల తిరుగుబాటులకు నాయకత్వము వహించిరి.
1841వ సంవత్సరమున రాయచూర్ జిల్లాలో తిరుగుబాటు చెలరేగెను. ఈ
తిరుగుబాట్లకు కోవ్రో అను అరబ్బుతో పాటు నరసింగరావను యోధుడు
నాయకత్వము వహించి, దేవ్ దుర్గ్ వద్ద సైన్యమును సమీకరించుకొనిరి. వీరు
అనగొందివద్ద గొప్ప యుద్ధముచేసి బీజపూర్ జిల్లాలో ప్రవేశించి బాదామి” అను
దుర్గమును పట్టుకొనిరి. తరువాత ఈ కోటలను హైద్రాబాద్ సైన్యము తమ స్వాధీనము
423
దా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
గావించుకొని కోహ్రా, నర్సింగరావులను బంధితులుగావించెను. 1831లో
మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తి యందు లక్ష్మయ్య అను యోధుడు తిరుగుబాటు
గావించెను. 1860లో అదిలాబాదు జిల్లాలోని నిర్మల్‌లో రామాగోండ్ అను వీరుడు
తిరుగుబాటు చేసెను. భద్రాచలము జమీందారు కూడ ఈ కాలముననే యొక
తిరుగుబాటుకు నాయకత్వము వహించెను. ఇది క్లుప్తముగా కొన్ని ముఖ్యమైన
తిరుగుబాట్ల చరిత్ర. గమనించదగిన విశేష మేమనగా ఈ తిరుగుబాట్లకు
రోహిలాలుగాని, అరబ్బులుగాని నాయకత్వము వహించలేదు. వీనికి జిల్లాలలో
స్థానికులైన వీరులే నాయకత్వము వహించిరి. నలుబది సంవత్సరాలవరకు నిరంతరము
కొనసాగిన యీ తిరుగుబాట్లను అణచివేయుట ఇంగ్లీషువారిచే శిక్షితమైన నైజాము
సైన్యమునకు ఒకపెద్ద సమస్యగానుండెను. బహుకష్టముతో ఈ తిరుగుబాట్లు
అణచివేయబడెను. 1857వ సంవత్సరము తరువాత ప్రభుత్వ విధానమున కొంత
మార్చు వచ్చెను. పరిపాలనా విధానమును బాగు చేసి ప్రభుత్వమును సమర్థవంతముగా
నిర్వహించనిచో రాష్ట్రమునకు భద్రతలేదను సత్యము తుట్టతుదకు హైద్రాబాదు
ప్రభుత్వము గ్రహించక తప్పలేదు. ఇదంతయు హైద్రాబాదు ప్రజలయొక్క
స్వాతంత్రోద్యమ చరిత్రయందలి ఉజ్వలమైన భాగము. విదేశ పరిపాలనమును,
ప్రజల శ్రేయస్సును అభిలషించని ప్రభుత్వమును ప్రజలు ఎన్నడూ సహించలేరని
యీ స్వాతంత్రోద్యమ చరిత్ర నిర్వహించుచున్నది.
19వ శతాబ్దమున
హైద్రాబాదులో పత్రికా స్వాతంత్ర్యము
పోలీసుచర్యకు పూర్వము హైద్రాబాదు రాష్ట్రమున పత్రికలు కఠిన నిర్బంధములకు
గురియైన సంగతి సుప్రసిద్ధము. నిజానికి హైద్రాబాదు ప్రజల పోరాటము ప్రాథమిక
స్వత్వముల సాధనకొరకు జరిగిన పోరాటమే. గడచిన శతాబ్బమున హైద్రాబాదు
ప్రజలయొక్క స్వాతంత్ర్య సమర వృత్తాంతమును పరిశీలించినపుడు నిర్భయముగా
ప్రజల పక్షము వహించిన పత్రికల యొక్క బాధలు మనకు ప్రస్ఫుటముగా
కనబడుచున్నవి. 19వ శతాబ్దమున హైద్రాబాదు రాష్ట్రమున ప్రజల భాషలలో నడిపిన
పత్రికలు లేకుండెను. ఒకటి రెండు ఇంగ్లీషు పత్రికలు, కొన్ని ఉర్దూ పత్రికలు
424
హైదరాబాదులో స్వాతంత్రోద్యమము
మాత్రము ఉండెను. ఆ పత్రికలకు గూడ ప్రజలపక్షము వహించి ప్రభుత్వమును
విమర్శించు అవకాశము నిరాకరింపబడెను. ఈ సందర్భమున దొరికిన కొన్ని
వివరాలు గమనించ దగియున్నవి.
హైద్రాబాదు రాష్ట్రమున 1891వ సంవత్సరమున అస్మాన్‌జా ముఖ్య
మంత్రిగానుండెను. ఆయన పరిపాలనలో పత్రికా స్వాతంత్యముమీద మొదటిసారి
తీవ్రమైన దాడి జరిగినది. ఈ సంవత్సరమున అప్పుడు హోమ్ సెక్రటరీగా నుండిన
ఫతేనవాబ్‌జంగ్ బహద్దూర్ సంతకముతో పోలీస్ కమీషనర్‌కు ఒకనోటీసు జారీ
చేయబడినది. ఆ నోటీసు ప్రకారము (1) “అప్పరుల్ అబ్బార్” అను ఒక పత్రిక
నుండి ప్రభుత్వ అనుమతి కొరకై విజ్ఞప్తి చేయవలసినదని కోరబడినది. అప్పటి
వరకు పత్రికలు నడుపుటకు ప్రభుత్వము అనుమతి అవసరము లేకుండెను. అంతేగాక
అప్పటి 18 నెలలకుముందే ఆ పత్రిక యొక్క ప్రకటన ఆగియుండెను. అయినను
పునఃప్రకటనకొరకు ప్రభుత్వము యొక్క ఆజ్ఞ తీసుకొనవలసినదని యీ పత్రిక
ఆదేశించబడినది. (2) పత్రికలు ప్రభుత్వమునకు ఒక “ఎకరార్ నామా” కూడ
వ్రాసి యాయవలసినదని ప్రభుత్వము ఆజ్ఞాపించినది. “దక్కన్‌పంచ్” మరియు
“హైద్రాబాదు గెజెటొలు ఈ విధమైన “ఎకరార్‌నామా”లు దాఖలు చేయవలయునని
కోరబడినది. (3) “ఎకరార్‌నామా”లో ఉల్లేఖించబడిన షరతుల నుల్లంఘించుటకు
వీలులేదు. ఇట్లు ఉల్లంఘించిన పత్రికలను గూర్చి పోలీస్ కమిషనర్ వెంటనే
ప్రభుత్వమునకు రిపోర్టు చేయవలెను. అత్యవసరమని తోచినప్పుడు ఏ పత్రికైనను
ఆపివేయుటకు పోలీస్ కమిషనర్‌కు ఆజ్ఞ ఈయబడెను. ఈవిధముగ పత్రికా
స్వాతంత్ర్యము పోలీసువారి అదుపు ఆజ్ఞలకు పరిమితము చేయబడినది.
పత్రికల నేడిపించిన ఏడు షరతులు
ఈ ఎకరార్ నామాలోని ఏడుషరతులను పరిశీలించినప్పుడు ప్రభుత్వము
మరియు పోలీసుల చేతులలో పత్రికలు ఉండవలెనను ఉద్దేశము వెనుకనుండి తొంగి
చూచుచున్నది. ఈ షరతుల ప్రకారము (1) బ్రిటిష్ ప్రభుత్వమునకు వ్యతిరేకముగా
యేమియు వ్రాయరాదట. (2) నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకముగా అసలే
వ్రాయగూడదు. (3) బ్రిటిష్ ఇండియాలో కాని, హైద్రాబాదునందు కాని ప్రజలలో
425
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
అభిప్రాయ బేదాలు, మత సంఘర్షణలు, వర్గ సంఘర్షణలకు దారితీయు వ్రాతలు
బ్రాయరాదు. ఈ వ్రాతల ధోరణిని నిర్ణయించువారు పోలీసు అధికారులే. (4) ఎవరికిని
భయము, బెదిరింపు, విచారము కలిగించు వ్రాతలు వ్రాయకూడదు. (5)
ప్రభుత్వోద్యోగులను బెదిరించు వ్రాతలు వ్రాయగూడదు. వారి నడవడిని గూర్చి
వ్యాఖ్యానించు వ్రాతలు వ్రాయరాదు. (6) ఆకాశరామన్న ఉత్తరాలు ప్రకటించగూడదు.
విలేఖరి పేరులేని వ్రాతలు ప్రకటించగూడదు. (7) ప్రజలకు ప్రభుత్వము మీదగాని,
ప్రభుత్వ ఉద్యోగుల మీదగాని చెడ్డ అభిప్రాయము కలిగించు వ్రాతలు వ్రాయగూడదు.
ఇటువంటి హిరణ్యాక్ష వరములు ఇంకెన్నియో పత్రికల నుండి కోరబడెను. ఈ
షరతుల నుల్లంఘించినచో పత్రికల నాపుటకు ప్రభుత్వమునకు అధికారము కలదు.
పత్రికలను ఆపుటవలన కలుగు నష్టమునకు ప్రభుత్వము బాధ్యత వహించదు. ఇన్ని
వరాలను అంగీకరించి నడిపిన పత్రికలు ప్రజలకు ప్రాతినిధ్యము వహించుట కెట్టి
అవకాశము లేదు. ఈ షరతుల ప్రకారము నడిపిన పత్రికలు ప్రభుత్వముయొక్క
గెజెట్లుగనో లేక సమాచార శాఖవారు ప్రకటించు సమాచార వాజ్మ్యయముగనో
తయారుగుట స్పష్టము.
ఇంతకుముందు అనగా 1891కి ముందు పత్రికలను నడుపుటకు ప్రభుత్వం
నుండి అనుమతి తీసుకొనవలెనను నిర్భంధము లేకుండెను. ఈ సమయముననే
బ్రిటిష్ ఇండియాలో గవర్నర్ జనరల్‌గారు ఈ విధమైన ఒక ఉత్తరువును జారీచేసినట్లు
తెలియుచున్నది. ఆ ఉత్తర్వుయొక్క పుత్రికయే హైద్రాబాదు హోమ్ సెక్రటరీగారి
యాజ్ఞయని చెప్పబడుచున్నది. పోలీసు చర్యకు పూర్వము ప్రజలమీద విశ్చంఖలముగా
పూంఖాను పుంఖముగా ప్రయోగింపబడిన, గస్తీనిషాన్ 53, అను వాగ్బంధన
శాసనము పైన పేర్కొనిన ఉత్తర్వుయొక్క సంతానమే.
సాహసోపేత ధిక్కారము
ఆరోజులలో కొన్ని పత్రికలు ధైర్యముగా యీ షరతుల అమలుకు
వ్యతిరేకించినవి. 1891వ సంవత్సరము జూన్ 11వ తేదీనాడు “దక్కన్ టైమ్స్”
అను పత్రికలో ప్రభుత్వమువారు కోరిన “ఎకరార్ నామా” యొక్క అనువాదము
ప్రకటింపబడినది. ప్రభుత్వము ఇటువంటి షరతుల విధించుట చాలా అన్యాయమని,
426
హైదరాబాదులో స్వాతంత్రోద్యమము
ఇది దురాక్రమణ అనియు ప్రజాస్వామిక వ్యతిరేక చర్య యనియు ఈ పత్రికలో
తీవ్రముగా నిరసించబడినది. ఆకాలమున హైద్రాబాదులో “క్షీకతుల్ ఇస్లాం” అను
ఒక వత్రికయుండెను. ఈ పత్రికానంపాదకుడు 'వోజీకర్తాన్'. ఈయన
నిర్భయస్వభావుడు, మరియు ప్రజాస్వామిక వాదియెయుండెను. అందుచేత యా
ఎకరార్ నామాకు వ్యతిరేకముగా ప్రభుత్వముతో పోరాడెను. ఆ పోరాటము
చరిత్రాత్మకమైనది; ఉజ్వల మైనది. ఈ సందర్భమున ఆయన వ్రాసిన వ్రాతలు
ఆంధ్రీకరించి ప్రకటించినచో ఆనాడు ప్రజల హృదయాలలో యెటువంటి అగ్ని
రగులు కొనియుండెడిదో స్పష్టము కాగలదు. 1891 జూన్ 14వ తేదీనాటి “షాకతుల్
ఇస్లాం” అనుబంధములో ప్రజల నుద్దేశించి ఒక బహిరంగ లేఖ ప్రకటించబడెను.
ఈ లేఖలో మొత్తము భారతదేశమునందు ఒక్క హైద్రాబాదు రాష్ట్రములోనే
మధ్యకాలము యొక్క రాజరికము చలాయించ బడుచుండెననియు, ప్రభుత్వోద్యోగులు,
స్వార్థపరులు, లంచగొండులు, అధికార దుర్వినియోగము చేయువారై యున్నారనియు
వారి మనస్తత్వమే యీ ఎకరార్ నామాలో ప్రతిబింబించుచున్నదనియు ప్రజలు
తమ అభిప్రాయలను యీ విషయమై స్వేచ్చగా ప్రకటించవలెననియు, వానిని తమ
పత్రికకు పంపించవలెననియు ఉద్దాటించబడినది. ఈ సందర్భములో పోలీసు
కమీషనరుకు సంపాదకుడు ట్రాసిన ఉత్తరము గూడ చాల గొప్పది. ఈ ఉత్తరములో
ఎకరార్ నామాయొక్క నియమము తీవ్రముగా నిరసించబడినది. ప్రభుత్వముయొక్క
ఉద్దేశ్యము గట్టిగా ప్రశ్నించబడినది. ఈ సందర్భమున ప్రభుత్వము అనుసరించదలచిన
విధానమేమిటో తెలుపవలసినదనికూడ యిందులో ్రశ్నించబడినది. 'షాకతుల్
ఇస్లాం” యొక్క 14వ జూన్ 1891 నాటి 35వ సంచికలో హోం సెక్రటరీగారి యీ
ఉత్తర్వులను గూర్చి సంపాదకీయముగా తీవ్ర విమర్శచేయుట జరిగినది. ఈ
సంపాదకీయములో మిక్కిలి కఠినమైన పదజాలము ఉపయోగించబడినది.
లంచగొండితనము, అధికార దుర్వినియోగము, నిరంకుశత్వము, స్వార్థపరత్వము
మొదలైనవానికి అలవాటుపడిన ప్రభుత్వోద్యోగుల యొక్క దుశ్చర్యలే యీ ఉత్తర్వు
రూపము పొందినవని యిందులో ఉద్దాటించబడినది. ఇది అనాగరిక చర్యయని
తెలుపబడినది. ఈ ఉత్తర్వులకు హంతక కాండయని ఈ సంపాదకీయములో
నామకరణము చేయబడినది. నకల భారతమందలి వశ్రికా చరిత్రలో
427
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
యింతనిర్భయముగా వ్రాసిన సంపాదకీయాలు మిక్కిలి తక్కువ. పత్రికా సంపాదకులు
మరియు స్వాతంత్ర్య ప్రియులందరు ఈ సంపాదకీయము పఠించవలసియున్నది.
దీనిని ఆంధ్రీకరించి ప్రకటించుటగూడ అవసరము. తరువాత కొన్ని రోజులకు
“జైనొద్దీన్” అను పోలీసు మొహత్మీమ్ సంతకముతో వెంటనే ఎకరార్ నామా
యీయవలసినదని సంపాదకునికి నోటీసు అందజేయబడినది. సంపాదకుడు యీ
“ఎకరార్ నామా” షరతుల గురించి వ్యాఖ్యానించుచు వాడినపదాలు గమనించదగినవి.
'నాజాయజ్ 'నాలాయఖ్ 'బుష్వత్ ఖోర్' “బద్మాష్ మొదలైన పదాలు ఇందులో
ఉపయోగించబడినవి. తరువాత రెండు వారాలకు అప్పుడు హోమ్ సెక్రటరీగా నున్న
ఫతే నవాజ్ జంగ్ సంతకముతో జారీ చేయబడిన ఉత్తర్వు ననుసరించి యీ పత్రిక
ఆపుజేయబడెను. ఈ వుత్తర్వులో అప్పటి ముఖ్యమంత్రియైన నవాబ్ ఆస్మాన్ జా
బహద్దుర్ గారి దృష్టికి 'షౌ కతుల్ ఇస్లాం' యొక్క 35వ సంచికలోని సంపాదకీయము
తీసుకొనిరాబడినదని అందులో ఉపయోగింపబడిన పదజాలము కఠినముగాను,
అసభ్యముగా నున్నదనియు చేయబడిన ఆరోపణలు నిరాధారమైనవనియు తెలుపుచు
పత్రికను వెంటనే ఆపివేయవలసినదని ఉత్తరువు పంపబడెను. ముద్రణాలయము
మాత్రము యజమానికీయవలసినదని ఆజ్ఞాపింపబడెను. అయితే ఒక షరతు
విధింపబడినది. ఆ షరతు ప్రకారము ముద్రణాలయము ప్రభుత్వమునకు
వ్యతిరేకముగా ఏ రాజకీయ ప్రయోజనాలకు వినియోగించనని యజమాని ఒక
“ఎకరార్ నామా దాఖలు చేయవలెను. ఈ విధముగా 'షొకతుల్ ఇస్లాం” పత్రిక
ఆపివేయబడినది. ఇది హైద్రాబాదు వాగ్సంధన శాసన పిశాచ తాండవము యొక్క
అనేక నిదర్శనాలలో ఒక్కటి మాత్రమే. హైద్రాబాదు స్వాతంత్ర్య చరిత్రలో యిటువంటి
ఉజ్జ్వల ఉదాహరణ లింకెన్నియో కలవు.
ఇరువదవ శతాబ్దిమున పత్రికలు గురియైన నిర్బంధముల చరిత్ర ఇటీవలిది;
అదియొక ప్రత్యేక ప్రకరణము.
428
మనదేశం - తెలుగుసీమ
ఆరవ ముద్రణ
(తొలిముద్రణ : 1980)
429
జన్మ భూమి
ఏ దేశమేగినా యెందుకాలిడినా
ఏ పీఠమెక్కినా, యెవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమిభారతిని
నిలుపరా, నీ జాతి నిండు గర్వమ్ము
లేదురా యిటువంటి భూదేవియెందు
లేరురా మనవంటి పౌరులింకెందు
ఏ పూర్వపుణ్యమో ఏ యోగబలమో
జనియించినాడవీ స్వర్గఖండమున
నిను మోచె నీ తల్లి కనకగర్భమున
- రాయప్రోలు
430
మనదేశము
మన దేశం భారతదేశం. దీనికే “ఇండియా” అని కూడా పేరు. ఈ పేరు మన
దేశానికి ఇంగ్లీషు వారివలన కలిగింది.
ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నవి. అమెరికా, ఇంగ్లండు, చైనా, రష్యా మొదలైన
దేశాల పేర్లు మీరు విని ఉంటారు. ఈ దేశాలలో కొన్ని చిన్నవి, మరికొన్ని పెద్దవి.
మన దేశం పెద్ద దేశాలలో ఒకటి. ఈ దేశంలో ఏభై కోట్లకు పైగా ప్రజలు
నివసిస్తున్నారు. మొత్తం ప్రపంచంలో మనం అయిదవ వంతు ఉన్నాము. కాబట్టి
మన దేశం (ప్రపంచంలోని పెద్ద దేశాలలో లెక్క పెట్టదగినది. మన పొరుగుననే
చైనా ఉన్నది. అది ప్రపంచంలో అన్ని దేశాల కంటే పెద్దది.
మన దేశానికి ఉత్తరపు దిక్కులో మంచుకొండలు ఉన్నవి. వీటినే హిమాలయ
పర్వతాలు అంటారు. ఇవి మన దేశానికి పెట్టని కోట. పగవారిభయంలేకుండా
ఇవి మన దేశాన్ని కాపాడుతున్నవి. ఈ పర్వతాలు ప్రపంచంలో అన్ని పర్వతాలకంటే
ఎత్తెనవి. హిమాలయ పర్వతం కూతురైన పార్వతిని శివుడు పెండ్లిచేసుకొని అక్కడే
కాపురం ఉన్నాడని పురాణాలు చెప్పుతున్నవి. కైలాసం యిక్కడనే ఉన్నది. మానస
సరోవరం యిక్కడనే ఉన్నది. ఈ సరోవరంలో తెల్లని హంసలు ఉండునని మన
కవులు చెప్పగా మీరు విని ఉంటారు. మన దేశానికి మరి మూడు వైపుల సముద్రం
ఉన్నది. కాబట్టీ ఈవైపుల నుంచి కూడా పగవారి భయం తక్కువగానే ఉంటుంది.
మన దేశానికి రెండువైపుల పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు ఉన్నవి. ఒకప్పుడు యీ
రెండు దేశాలు భారత దేశంలో భాగాలుగానే ఉండినవి.
భౌగోళిక స్వరూపం
మన దేశాన్ని మనం నాలుగు ప్రాంతాలుగా విభజింపవచ్చును. 1. హిమాలయ
పర్వత ప్రాంతం. 2. గంగా సింధు మైదానం. 3. దక్షిణ పీఠభూమి. 4. తీరమైదానాలు.
431
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
1. హిమాలయ పర్వత ప్రాంతం :
ఇది ఉత్తరంలో ఉన్న మంచుకొండ ప్రాంతం. ఈ మంచుకొండలలోని ఎవరెస్టు
శిఖరం ప్రపంచంలో అన్నిటికన్న ఎత్తైనది. ఈ కొండల మీద మంచు యెప్పుడు
కరిగిపోదు. ఈ కొండలలో ఖైబర్, బోలన్, కుట్టాం, గోమాల్ కనుములు ఉన్నవి.
పూర్వ కాలంలో శత్రురాజులు కొందరు ఈ కనుమల నుండి మన దేశానికి దండెత్తి
వచ్చినారు.
2. గంగా సింధు మైదానం :
హిమాలయ పర్వతాలకు క్రిందుగా ఈ మైదానం ఉన్నది. గంగా, సింధు,
బ్రహ్మపుత్రా నదులు ఈ మైదానంలో ప్రవహిస్తున్నవి. ఈ మైదానం చాలా
సారవంతమైనది. ఇక్కడ పంటలు బాగా పండుతవి. ఈ మైదానంలో ఒక్క కొండ
గూడా లేదు.
3. దక్షిణ పీఠభూమి :
ఇది యీ మైదానం కింద ఉన్న భూమి. ఇది ఎత్తెన ప్రదేశం. వింధ్యపర్వతాలు
యీ పీఠభూమికి ఉత్తరాన ఉన్నవి. హిమాలయ పర్వతాల తరువాత వింధ్యపర్వతాలు
మన దేశంలో చెప్పదగినవి. వింధ్యను గూర్చి ఒక చిత్రమైన కథ ఉన్నది. సూర్యుడు
హిమాలయపర్వతాలలోని మేరుపర్వతం చుట్టూ తిరుగుతుంటాడని మనవారు
చెప్పుతుంటారు. ఒకసారి మేరు పర్వతంతో పోటీపడి వింధ్య పర్వతం బాగా ఎత్తుగా
పెరిగినదట. అప్పుడు భూలోకంలో కొంత భాగం సూర్యుడు కనబడక చీకటి
కలిగినదట. ప్రజలు వెలుతురు కొరకు అగస్త్య మహర్షిని శరణుజొచ్చినారట. అప్పుడు
అగస్యుడు కాశీనుండి బయలుదేరి వింధ్య పర్వతం దగ్గరకు రాగా, అగస్త్యుడు తన
గురువైనందున వింధ్య పర్వతం వంగి మొక్కినదట. అగస్త్యుడు వింధ్యపర్వతంతో
“తిరిగి నేను వచ్చే వరకు ఇట్లే వంగి ఉండవలసిన”దని చెప్పిపోయినాడట. నాటి
నుంచి నేటివరకు అగస్యుడు రానే లేదట. వింధ్య పర్వతం వంగి అట్లానే వున్నది.
వింధ్య పర్వతం కింద ఉన్న ప్రజలకు చీకటి బాధపోయినది. దక్షిణ పీఠభూమికి
రెండు వైపులా తూర్పు కనుమలు, పడమటి కనుమలు అనే కొండలు ఉన్నవి. ఈ
ప్రదేశంలో తపతి, నర్మద అనే నదులు ప్రవహిస్తున్నవి.
432
మనదేశం - తెలుగునీమ
4. తీరమైదానాలు :
వింధ్య పర్వతాలకు దక్షిణంలో పడమటి కనుమలకు మధ్య తూర్పు కనుమలకు
మధ్య యీ తీర మైదానాలు ఉన్నవి. పడమటి కనుమలను అనుకొని ఉన్న
తీరమైదానాల కన్న తూర్పు కనుమలను అనుకొని ఉన్న తీర మైదానాలు
వెడల్పయినవి. కృష్ణా, గోదావరి, తుంగభద్రా నదులు యీ ప్రదేశంలో ప్రవహిస్తున్నవి.
మనం నివసించే ప్రాంతం తెలుగుసీమ. తెలుగుసీమ కృష్ణా గోదావరి నదులు
ప్రవహించే భూమి.
నదులు
మన దేశం ఉత్తరపుదిక్కున గంగా, యమునా, సరస్వతి, సింధు, బ్రహ్మపుత్రలు
ప్రవహిస్తున్నవి. వీటిలో గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు హిమాలయ పర్వతాలలో
పుట్టి ప్రవహిస్తున్నవి. గంగానదిని మన దేశీయులు చాలా పవిత్రమైన నదిగా భావిస్తారు.
పూర్వకాలంలో భగీరథుడు అనే రాజు తపస్సు చేసి, ఆకాశంలో ఉన్న గంగను
భూలోకానికి తీసుకొని వచ్చినాడని ఒక కథ కలదు. భగీరథుడు తీసుకొని
వచ్చినందువలన గంగకు భాగీరథి అని పేరు కూడ వచ్చినదట. గంగా, యమునా,
సరస్వతీ నదులు కలిసే చోటును త్రివేణీ సంగమమని అంటారు. ఇదే ప్రయాగ.
ఇక్కడ పన్నెండు సంవత్సరాలకొకసారి ప్రసిద్ది చెందిన కుంభమేళ జరుగుతుంది.
మనదేశం మధ్య ప్రాంతంలో తపతి, నర్మద, మహానది అనే నదులున్నవి. దక్షిణ
దేశంలో గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరి నదులున్నవి. ఈ నదులను మనవారు
చాలా పవిత్రమైనవిగా భావిస్తారు.
రాజులు - చక్రవర్తులు
పూర్వం మన దేశాన్ని భరతుడు అనే గొప్ప రాజు పరిపాలించినాడు. ఆయన
దేశ ప్రజలని చాలా ప్రేమతో పరిపాలించినాడు. ఆయన వలన మన దేశానికి
భారతదేశం అని పేరు వచ్చినది. పాండవుల కథను మీరు వినే ఉంటారు. ఈ
పాండవులు భరతుని వంశానికి చెందినవారే.
ఈ పాండవులేకాక యింకా ఎందరో గొప్ప రాజులు మన దేశంలో పుట్టినారు.
మీరు రామాయణ, భారత కథలను, అనేక పురాణ కథలను వినే ఉంటారు,
శ్రీరాముడు, లక్ష్మణుడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు మొదలైనవారి
433
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
పేర్లు కూడ మీకు బాగా తెలిసే ఉన్నవి. మాంధాత, హరిశ్చంద్రుడు, నలుడు,
పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు మొదలైనవారు మన దేశపు గొప్ప చక్రవర్తులు.
అశోకుడు, చంద్రగుప్తుడు, పృథ్వీరాజు, ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి, రాణా
ప్రతాపసింహుడు, శివాజీ, శ్రీకృష్ణదేవరాయలు, రూన్సీ లక్ష్మీబాయి మొదలైన వీరులు
మన దేశంలో జన్మించినారు.
కవులు
మన దేశపు నాగరికత ప్రపంచంలో ప్రాచీనమైన నాగరికతలలో ఒకటి.
హరప్పా, మొహెంజదారో నాగరికత మన దేశపు ప్రాచీన నాగరికతకు గుర్తులు. ఈ
ప్రాంతంలోనే ప్రపంచంలో అతి ప్రాచీన సాహిత్యమైన బుగ్వేద రచన జరిగింది.
చాలామంది మహర్షుల రచనల సంకలనమే బుగ్వేదం బుగ్వేదంతోపాటు
యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం కూడా చాలా ప్రాచీనమైనవి. సంస్కృతంలో
ఆదికవి వాల్మీకి. ఆయన రామాయణాన్ని రచించినాడు. వ్యానుడు
మహాభారతంతోపాటు మహా భాగవతం మొదలైన పద్దెనిమిది పురాణాలనుకూడ
వ్రాసినాడని ప్రసిద్ధి. మహాకవిగా ప్రసిద్ధి పొందిన కాళిదాసు గొప్ప కావ్యాలను,
నాటకాలను రచించినాడు. “అభిజ్ఞాన శాకున్తలము' ఈయన వ్రాసిన నాటకాలలో
గొప్పది. దీనిని బట్టే కాళిదాసుకు తూర్పు షేక్స్‌పియర్ అని కీర్తి వచ్చింది. భాసుడు,
భవభూతి, శూద్రకుడు, బాణుడు, విశాఖదత్తుడు, దండి, భారవి, మాఘుడు, శ్రీహర్షుడు
మన దేశంలో జన్మించిన గొప్ప కవులు. వీరు సంస్కృతంలో చాలా నాటకాలను,
కావ్యాలను రచించినారు.
మతాలు
మన దేశంలో అనేక మతాలు ఉన్నవి. వేదాలకు సంబంధించిన మతానికి
వైదికమతమని పేరు. ఇది ప్రాచీనమైన మతం. మేధావులు కొందరు మరికొన్ని
మతాలను ప్రారంభించినారు. బుద్దుడు ఒక రాజు. ఆయన తన రాజ్యాన్ని వదలిపెట్టీ,
అడవులకు వెళ్ళి తపస్సు చేసి బౌద్ధమతాన్ని స్థాపించినాడు. ఈ బౌద్ధ మతాన్ని
అనుసరించేవారు వైనా, జపాన్, బర్మా, శ్రీలంక మొదలైన అనేక దేశాలలో ఉన్నారు.
అమరావతి, తక్షశిల, నలంద మొదలైన చోట్లలో బుద్ధుని శిష్యులు విద్యాలయాలను
స్థాపించి, ఆరామాలను కట్టించి చక్కగా నడిపినారు. సుమారు వేయి సంవత్సరాల
434
మనదేశం - తెలుగునీమ
కింద ఫాహియన్, హ్యూన్‌త్సాంగ్ అనే చైనా యాత్రికులు మన దేశంలోని బౌద్ధ
క్షేత్రాలన్నిటినీ చూచి, మన దేశపు నాగరికతను ఎంతో కొనియాడినారు. బౌద్ధ
విద్యాలయాలు ప్రపంచంలో గొప్ప కీర్తిగాంచి, యితర దేశీయుల మెప్పును పొందినవి.
జైన మతమును స్థాపించిన మహావీరుడు కూడ ఒక రాజవంశానికి చెందినవాడే.
ఈయన కూడా గౌతమ బుద్దునీవలెనే రాజ్యాన్ని వదలిపెట్టి అడవులకు వెళ్ళి జైన
మతాన్ని స్థాపించినాడు. తరువాత మన దేశంలో ఎందరో మతకర్తలు జన్మించినారు.
వీరిలో ముఖ్యంగా చెప్పదగినవారు- శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు,
మధ్వాచార్యుడు, వీరి మతాలు వైదిక ధర్మాన్ని అనుసరించేవి. ఈ మతాలన్నిటికి
కలిసి హిందూ మతమని పేరు కలిగినది. గురు గోవిందసింగ్ పంజాబులో సిక్కు
మతాన్ని స్థాపించినాడు. మన దేశంలో పుట్టిన యీ మతాలే కాకుండా మహ్మదీయ
మతాన్ని, క్రైస్తవ మతాన్ని అనుసరించే వారు కూడ మన దేశంలో చాలామంది
ఉన్నారు.
పుణ్యక్షేత్రాలు
మన దేశంలో గొప్ప క్షేత్రాలు చాలా ఉన్నవి. జనులువాటిని పవిత్రస్థలాలుగా
భావిస్తారు. ఈ పుణ్యక్షేత్రాలలో బుద్ధగయ, కాశీ, పూరి, జగన్నాధం, తిరుపతి, మధుర,
కంచి, రామేశ్వరం, భద్రాచలం మొదలైనవి ముఖ్యమైనవి. కాశీ గంగానదీతీరంలో
ఉన్నది. దీనికే బనారస్ అని కూడా పేరు. దక్షిణదేశంలో రామేశ్వరం కూడ గొప్ప
యాత్రాస్థలం పూర్వం శ్రీరాముడు అడవులకు వెళ్ళినపుడు యా రామేశ్వరంలో
లింగాన్ని ప్రతిష్టించినాడట. తిరుపతి వేంకటేశ్వరుడు మన దేశంలో చాలామందికి
ఇలవేలుపు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మరొక
గొప్ప పుణ్య క్షేత్రం భద్రాచలం. భద్రాచలం దగ్గర కూడ శ్రీరామచంద్రుడు కొంతకాలం
నివసించినాడట. గోలకొండను తానీషా అనే రాజు పాలించిన కాలంలో కంచర్ల
గోపన అనే రామభక్తుడు సర్మారు వారి సొమ్ముతో భద్రాచలంలో రామాలయాన్ని
కట్టించినాడట. ఈయనకే రామదాసు అని పేరు. రామదాసు గోలకొండ రాజుల
కింద తహసీలుదారుగా ఉండేవాడట. అప్పుడు గోలకొండ రాజ్యానికి మంత్రులుగా
ఉన్న అక్కన్న మాదన్నలకు రామదాసు దగ్గరిచుట్టమట. రామదాసు గొప్ప రామభక్తుడు.
రాముని మీద భక్తితో, రైతుల నుండి వసూలు చేసిన సర్కారు సొమ్ము ఆరు లక్షలతో
రామాలయాన్ని కట్టించినాడు. అందువలన గోలకొండ తానీషా రామదాసును
435
డా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
చెరసాలలో పెట్టించినాడు. రామదాసు శ్రీరాముని వేడుకొనగా శ్రీరాముడు
మారువేషంతో గోలకొండ రాజు దగ్గరకు వచ్చి డబ్బు చెల్లించి రామదాసును
విడిపించినాడట.
మన దేశంలో రామదాసు వంటి భక్తులు ఇంకా కొందరున్నారు. తులసీదాసు
యిటువంటి భక్తుడే. ఆయన హిందీలో రామాయణాన్ని వ్రాసినాడు. తెలుగులో
భాగవతము వ్రాసిన పోతన, కీర్తనలను వ్రాసిన త్యాగరాజు రామభక్తులే. కబీరు,
మీరాబాయి మొదలైనవారు కూడ గొప్ప భక్తులు.
చూడదగిన ప్రదేశాలు
మన దేశంలో చూడవలసిన ప్రదేశాలు చాల ఉన్నవి. ఆగ్రా ఇటువంటి
చోటులలో ఒకటి. ఆగ్రాలోని తాజ్‌మహలును షాజహాన్ అను మొగల్ రాజు తన
భార్య పేరుతో కట్టించినాడు. ఇది చక్కని పాలరాతి భవనం. ప్రపంచంలోని ఏడు
వింతలలో యిది ఒకటి. ఢిల్లీలోని కుతుబ్‌మీనార్ మన దేశంలోని గొప్ప కట్టడాలలో
ఒకటి. ఇది చాలా ఎత్తైనది. ఇంతటి ఎత్తైన కట్టడాలు ప్రపంచంలో చాలా తక్కువ
అని అంటారు. మహారాష్ట్రలోని జెరంగాబాదు జిల్లాలో అజంతా, ఎల్లోరా గుహలు
చిత్రకళకు, శిల్పకళకు ప్రసిద్ధి చెందినవి. వరంగలులోని వేయిస్తంభాల గుడి, ఓరుగల్లు
కోట, వరంగలు జిల్లాలోని రామప్ప గుడి, గుంటూరు జిల్లాలోని అమరావతి, కర్ణాటక
రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలోని హంపీ, విజయనగరాలు దర్శనీయ స్థలాలలో
ముఖ్యమైనవి. వరంగలులోని వేయిస్తంభాల గుడిని కాకతీయరాజులు కట్టించినారు.
హంపీని విజయనగర రాజులు కట్టించినారు.
నగరాలు
మన దేశంలో గొప్ప నగరాలలో కలకత్తా ముఖ్యంగా పేర్మొనదగినది. ఇది
బెంగాల్ ప్రదేశ్‌కు ముఖ్య పట్టణం. భారత దేశంలోని పట్టణాలలో ఇది పెద్దది. ఇది
హుగ్లీనది మీద ఉన్న రేవు పట్టణం. ఇటువంటి రేవు పట్టణమే బొంబాయి.
ప్రపంచంలో గొప్ప పట్టణాలలో బొంబాయి కూడ ఒకటి. ఇది మన దేశానికి
సింహద్వారం వలె ఉన్నది. ఇది వ్యాపారానికి గొప్ప కేంద్రం. కలకత్తా, బొంబాయిల
తరువాత చెప్పుకోదగ్గ రేవుపట్టణం మద్రాసు. దీనికే చెన్నపట్టణమని పేరు. తరువాత
చెప్పుకోవలసినది ఢిల్లీ. దీనికి పూర్వము హస్తినాపురమని పేరు. పాండవులకు యిది
436
మనదేశం - తెలుగునీమ
రాజధాని. తరువాత చాలమంది రాజులకు కూడా యిది రాజధానిగా ఉండినది.
ఇప్పుడు కూడ మన దేశానికి ఢిల్లీయే రాజధాని. తెలుగు దేశానికి రాజధాని అయిన
హైదరాబాదు మన దేశంలోని గొప్ప నగరాలలో ఒకటి. బెంగుళూరు, కాన్పూర్,
అహమ్మదాబాద్, ఆలహాబాద్, భువనేశ్వర్ మన దేశంలోని పెద్ద నగరాలలో కొన్ని
పరిశ్రమలు - గనులు
మన దేశంలో అనేకమైన పరిశ్రమలు ఉన్నవి. ఉక్కు ఇనుము పరిశ్రమలుగా
ఉన్నవి. జెంషెడ్పూరు, తాతానగర్, భిలాయ మొదలైన కర్మాగారాలు ఉక్కు పరిశ్రమలకు
సంబంధించినవి. వస్త్ర పరిశ్రమ మన దేశంలో చెప్పుకొనదగిన పరిశ్రమలలో ఒకటి.
దేశ రక్షణకు కావలసిన ఆయుధాలను తయారు చేసుకొనే కర్మాగారాలు కూడ మన
దేశంలో చాలా ఉన్నవి. ఈ విషయంలో మన దేశం స్వయంసమృద్ధిని సాధించినదని
చెప్పవచ్చును. ఇవికాక చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు మన దేశంలో చాలా
వున్నవి. పారిశ్రామికంగా మన దేశం ముందడుగు వేస్తున్నది. కర్ణాటక రాష్ట్రంలోని
కోలారు జిల్లాలో బంగారు గనులున్నవి. తిరువాన్‌కూర్ ప్రాంతంలో రబ్బరు పరిశ్రమ
ఉన్నది. కొబ్బరి తోటలకు కేరళ ప్రాంతం ప్రసిద్ధి చెందినది. మన రాష్ట్రమైన
ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గుగనులు చాలా ఉన్నవి. ఇక్కడ దొరికే బొగ్గు దేశంలో అవసరాలను
చాలా వరకు తీరుస్తున్నది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోను, ఆదిలాబాదు జిల్లాలోను
యీ గనులు ఉన్నవి. మ్యాంగనీసు, అభ్రకం మనదేశంలో లభించే ముఖ్య ఖనిజాలు.
కాళ్ళీరులో కుంకుమపువ్వు ప్రధానంగా లభిస్తుంది.
పాడిపంటలు
మన దేశంలో పాడిపంటలకు లోటులేదు. దట్టమయిన అడవులు, సారవంతమైన
భూములు, వ్యవసాయానికి అవసరమైన పశువులు, నదులు, చెరువులు మనదేశంలో
చాల ఉన్నవి. వరి, గోధుమలు, పత్తి, నువ్వులు, వేరుసెనగ, జొన్న మొక్కజొన్న,
కందులు, ఆముదాలు, చెజకు మనదేశంలో బాగా పండుతవి. దేశపు ఆహార
పంటలలో వరి ముఖ్యమైనది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, అస్సామ్,
ఒరిస్సా రాష్ట్రాలలో వరి ముఖ్యమైన పంట. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాలలో
గోధుమ విరివిగా పండుతుంది. మన దేశంలో పశు సంపదకు కూడ కొరత లేదు.
ఆవులు, బట్టెలు యితర దేశాల కంటె అధిక సంఖ్యలో మన దేశమందున్నవి. కాని,
437
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
సరాసరి జనుల వినియోగానికి దొరికే పాడి మాత్రం కొంత తక్కువగానే ఉన్నది.
మనది ప్రధానంగా వ్యవసాయ దేశం. నూటకి డెబ్బైమంది రైతులు. వీరు పల్లెలలో
నివసిస్తారు. మన దేశంలో నగరాలు, పట్టణాల సంఖ్యకన్న పల్లెల సంఖ్య ఎక్కువ.
పంటపొలాలకు నీటి సరఫరా కొరకు యీ మధ్య చాలా నదుల మీద డామ్‌లు
కట్టించినారు. భాక్రా నంగల్ డామ్. నాగార్జున సాగర్, తుంగభద్రా డామ్, గోదావరి
బ్యారేజ్, కృష్ణా బ్యారేజి, కోయనా ప్రాజెక్టు మన దేశంలోని పెద్ద డామ్‌లలో
పేర్కొనదగ్గవి. విద్యుచ్చక్తి (ఎలక్ట్రిసిటి)ని తయారు చేయటానికి కూడా అనేక నదీ
ప్రాజెక్టులు ఉన్నవి. పరిశ్రమలకు, వ్యవసాయానికి కూడా విద్యుచ్చక్తి అవసరం
ఎంతో ఉన్నది.
జాతి నిర్మాతలు
మన దేశంలో ప్రాచీనకాలం నుండి నేటివరకు ఎందరో మహానుభావులు
పుట్టి, మన దేశాన్ని అభివృద్ధి చేసినారు. ఆధునిక కాలంలో భారతజాతిని
ఉజ్జీవింపజేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు. ముప్పయి అయిదు సంవత్సరాల
క్రిందట మన దేశం విదేశీయులైన ఆంగ్లేయుల పరిపాలనలో ఉండినది. దాదాభాయి
నౌరోజి, బాలగంగాధర్ తిలక్, మహాత్మాగాంధి వంటి నాయకులు ఉద్యమాలు నడిపి
మన దేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించినారు. జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్
వల్లభాయి పటేల్ స్వాతంత్ర్యానికి ముందు తరువాత కూడ మన దేశ స్వాతంత్ర్యానికి,
అభివృద్ధికి ఎంతో కృషి చేసినారు. సుభాష్‌చంద్రబోస్ మన దేశ స్వాతంత్ర్యం కొరకు
వీరోచితంగా పోరాడినాడు. రాజా రామ్‌మోహనరాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్,
కందుకూరి వీరేశలింగం ప్రజలలో మూఢనమ్మకాలను తొలగించి సమాజం అభివృద్ధికి
తోడ్చదినారు. జగదీశ్ చంద్రబోస్ గొప్ప విజ్ఞానవేత్త. చెట్లకు కూడ ప్రాణం ఉన్నదని
మొదట ఆయన కనుగొన్నాడు. సి.వి.రామన్ నోబుల్ బహుమతి పొంది మన దేశానికి
కీర్తి తెచ్చిన శాస్త్రవేత్త. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఇంజనీరు.
చాలా డామ్‌లు, ఆనకట్టలు నిర్మించడానికి విశ్వేశ్వరయ్య తోడ్చడినారు. రవీంద్రనాధ్
టాగోర్ 'విశ్వకవి'గా ప్రఖ్యాతిగాంచి, సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందినాడు.
దేశ స్వాతంత్రయోధురాలైన శ్రీమతి సరోజినీ నాయుడు ఇంగ్లీషులో గొప్ప కవయిత్రి
అయి 'భారత కోకిల'గా ప్రసిద్ధిగాంచినది. మన జాతికే తంద్రి వంటివాడుగా అందరిచే
గుర్తింపబడినవాడు మహాత్మాగాంధి.
438
మనదేశం - తెలుగునీమ
మన దేశం - భాషలు - ఆంధ్రప్రదేశ్
మన దేశంలో హిందీ, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, మరాఠి,
బెంగాలీ, గుజరాతీ, ఒరియా, పంజాబీ మొదలైన ఎన్నో భాషలు మాట్లాడేవారున్నారు.
వీరిలో ఒక్కొక్క భాషలో మాట్లాడేవారు దేశంలోని ఒక్కొక్క ప్రదేశ్‌లో నివసిస్తున్నారు.
భారతదేశంలో అనేక ప్రదేశ్‌లున్నవి. తెలుగు మాట్లాడేవారు నివసించే ప్రదేశ్‌కు
ఆంధ్రప్రదేశ్ అని పేరు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని పెద్ద ్రదేశ్‌లలో ఒకటి.
తెలుగు మాట్లాడేవారు సుమారు నాలుగుకోట్లకుపైగా ఉన్నారు. హిందీని వదలి
పెట్టితే భారతదేశంలో అందరికన్న తెలుగు మాట్లాడేవారి సంఖ్య ఎక్కువ. తెలుగు
భాషను ఆంధ్ర భాష అని, తెలుగు మాట్లాడేవారిని ఆంధ్రులని కూడా అంటారు.
తెలుగు రాజులు
తెలుగువారిది ప్రాచీనమైన జాతి. వేదాలలో రామాయణ, మహాభారతాలలో
ఆంధ్రుల ప్రసక్తి ఉన్నది. రెండువేల సంవత్సరాలకుముందు తెలుగువారు
భారతదేశంలో గొప్పబలము, సంపద కలిగి ఉండినారని మెగస్తనీసు అను గ్రీకు
చరిత్రకారుడు వ్రాసినాడు. అనగా తెలుగు వారికి రెండు వేల సంవత్సరాలకు పైగా
చరిత్ర ఉన్నది. తెలుగుదేశాన్ని పరిపాలించిన రాజవంశాలలో శాతవాహనులు,
ఇక్ష్వాకులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు,
గోలుకొండ కుతుబ్ షాహీలు, తంజావూరు నాయకరాజులు ముఖ్యులు. చాళుక్యుల
కాలం నుండి తెలుగు భాషకు రాజపోషణ లభించినది. తెలుగుదేశాన్ని మొత్తంగా
పరిపాలించిన తొలి తెలుగు చక్రవర్తులు కాకతీయులు. ఈ రాజు లందరూ
తెలుగుదేశాన్ని అభివృద్ధికి తెచ్చినారు. పెద్దపెద్ద చెరువులు కట్టించి వ్యవసాయమును
అభివృద్ధి చేసినారు. వీరు వేయించిన చెరువులు నేటికిని ఉపయోగములో ఉన్నవి.
తెలంగాణాలోని పాకాల, ధర్మసాగరం, లక్నవరం, రామప్ప చెరువులు వీటిలో
ఎన్నదగినవి. పాకాల చెరువు కింద పండిన ధాన్యమును ఇతర దేశాలకు కూడా
ఎగుమతి చేసేవారట. రాయలసీమలోని బుక్కపట్టణం, ధర్మవరం చెరువులు కూడా
ఎన్నదగినవి.
439
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
ఆటపాటలు
తెలుగుదేశం పూర్వకాలం నుండి ఆటలకు, పాటలకు ఆటపట్టు. వీటిలో
తోలుబొమ్మలాటలు, హరికథలు, పగటి వేషాలు, కూచిపూడి నాట్యం మొదలైనవి
చెప్పుకొనదగినవి. పులిజూదం, చదరంగం, సొగటాలు, వామన గుంటలు, పచ్చీసు
మొదలైన ఆటలు తెలుగు పల్లెలలో ఇంటింటా కనిపిస్తవి. పల్లెలలో మొగ పిల్లలు
చిజ్జగోనె లేక గోటిబిళ్ళ అనే ఆటను ఆడతారు. కోళ్ళ పందాలు, గుర్రపు పందాలు
తెలుగు దేశంలో అభిమానంతో ఆడే ఆటలు.
పుణ్యస్థలాలు = మతాలు
తెలుగుదేశంలో ప్రసిద్ధమైన పుణ్యస్థలాలు చాలా ఉన్నవి. తిరుపతిలోని
వేంకటేశ్వర దేవాలయం వీటిలో ముఖ్యమైనది. ఇక్కడికి భారతదేశంలో అన్నివైపుల
నుంచి ప్రజలు వస్తారు. పూర్వం శ్రీరాముడు అరణ్యవాసం చేసినప్పుడు భద్రాచలం
దగ్గణ కొంతకాలం సీతమ్మతో, లక్ష్మణునితో కలసి ఉండినాడట. కర్నూలు జిల్లాలోని
శ్రీశైలం తెలుగు దేశంలోని మరొక ప్రసిద్ధ పుణ్యస్థలం, మంగళగిరి, యాదగిరి,
వేములవాడ, కాళహస్తి, సింహాచలం, అన్నవరం మొదలైన పుణ్యక్షేత్రాలెన్నో తెలుగు
దేశంలో ఉన్నవి. నల్లగొండ జిల్లాలోని కొలనుపాకలోని జైనదేవాలయం ప్రసిద్ధి
చెందినది. ఇందలి విగ్రహం నవరత్నాలలోని మరకత మణితో చేయబడినది. కృష్ణా
జిల్లాలోని అమరావతిలో బౌద్ధులు గొప్ప విశ్వవిద్యాలయము స్థాపించి నడిపిరి. ఇక్కడికి
ఆ రోజులలో యెంతో దూరమునుండి విద్వాంసులు వచ్చెడివారు. గుంటూరు జిల్లాలోని
ధాన్య కటకములోను, నాగార్జున కొండలోను గొప్ప విశ్వవిద్యాలయాలు ఉండెను.
చైనా మొదలైన దేశాల నుండి యిక్కడికి బౌద్ధ పండితులు వచ్చేవారు. ఈ ప్రాంతాలలో
బౌద్ధ స్తూపాలు, ఆలయాలు ఉన్నవి. హ్యుయన్‌త్సాంగ్ అమరావతికి వచ్చి, అక్కడ
పుస్తకాలను చదువుకొని వెళ్ళినాడు. వీరశైవం కూడా ఆంధ్రప్రదేశంలో బాగా
వ్యాపించినది. పాల్కురికి సోమనాథుడు యీ మతాన్ని వ్యాప్తి చేసినవారిలో ముఖ్యుడు.
విజయనగరం రాజుల కాలములో వైష్ణవ మతము తెలుగుసీమలో ప్రకాశించి వ్యాప్తి
చెందినది.
440
మనదేశం - తెలుగునీమ
పాడిపంటలు
తెలుగు సీమ పాడిపంటలకు ప్రసిద్ధి చెందినది ఆంధ్రదేశం అన్నపూర్ణ అని
పేరుగాంచినది. గోదావరి, కృష్ణ, తుంగభద్రా, మంజీర వంటి జీవనదులు తెలుగు
దేశంలో ప్రవహిస్తున్నవి. నూరు సంవత్సరాలకు పూర్వం ఈ నదులకు కట్టిన
ఆనకట్టల వలన తెలుగుదేశంలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందినది. నదుల
నీటిని వ్యర్థంగా పోనీయక ఆనకట్టలు కట్టి నిలువచేసి, వ్యవసాయానికి
ఉపయోగపడునట్లు చేసే నిర్మాణాలను ప్రాజెక్టు లంటారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు
భారతదేశంలోని గొప్ప ప్రాజెక్టులలో ఒకటి. పెన్నా మునియేరు, నాగావళి, వంశధార
మొదలైన ప్రాజెక్టులు తెలుగు దేశంలో ఉన్నవి. నిజాంసాగర్, ఉస్మాన్‌సాగర్, దిండి,
పోచారం, వైరా, రాజోలిబండ ప్రాజెక్టులు కూడ ఎన్నదగినవి. గోదావరికి
సంబంధించిన పోచంపాడు ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టులలో చెప్పదగినది. విద్యుచ్చక్తి
కొరకు కట్టిన శ్రీశైలం ప్రాజెక్టు కూడ పెద్ద ప్రాజెక్టులలో మరొకటి. పై ప్రాజెక్టుల
వలన తెలుగుదేశంలో ధాన్యసమృద్ధికి లోటులేదు. వరి తెలుగు దేశంలో ముఖ్యమైన
పంట. జొన్నలు, సజ్జలు, పత్తి, వేరుసెనగలు, ఆముదాలు, కందులు, సెనగలు,
'పెసలు, చెరుకు మొదలైనవి కూడ తెలుగుదేశంలో పండుతవి. గుంటూరులో పండే
పొగాకు మొత్తం భారతదేశంలోనే మేలైనదిగా ప్రసిద్ధి పొందినది. నిమ్మ, మామిడి,
నారింజ, అరటి తోటలు తెలుగుదేశంలో విస్తారంగా ఉన్నవి, పాడికి కూడ తెలుగు
దేశంలో కొదువలేదు. ఆవులు, బజ్జెలు, మేకలు మనకు పుష్కలంగా ఉన్నవి. ఒంగోలు
పశువుల భారత దేశంలోనే ప్రసిద్ధి చెందినవి. కోళ్ళ 'పెంపకం కూడా తెలుగు దేశంలో
ఎక్కువగా ఉన్నది.
ప్రకృతి సంపద
తెలుగు దేశంలో దట్టమైన అడవులున్నవి. ఈ అడవుల ఉనికి వానలకు మంచిది.
తెలంగాణాలోని అదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగరం జిల్లాలలో దట్టమైన
అడవులున్నవి. మన దేశంలోను తెలుగుసీమలోను వన్యమృగ సంపద తగినంత
ఉన్నది బొగ్గు గనులను గూర్చి యింతకుముందు తెలుపనైనది. రైళ్ళను నడపడానికి
బొగ్గు చాలా అవసరం. రాగి, పింగాణి, సీసం, వెండి, సున్నపురాయి, మాంగనీసు,
అభ్రకం, గంధకం మొదలైన ఖనిజాలు ఆంధ్రదేశంలో ఉన్నవి. తెలుగుదేశంలో
వజ్రాలు కూడ లభిస్తవి. రాయలసీమ వజ్రాలకు ప్రసిద్ధి. అందుకే దీనికి రత్నాల
సీమ అని పేరు.
441
దా॥ దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
పరిశ్రమలు
తెలుగు దేశంలో చాలా ముఖ్యమైన పరిశ్రమలున్నవి. నిజామాబాద్ జిల్లా
బోధన్‌లోని చక్కెర ఫ్యాక్టరీ; సిర్పూరు, రాజమండ్రిలలోని కాగితపు ఫ్యాక్టరీలు;
విజయవాడ వద్ద గల సిమెంట్ ఫ్యాక్టరీలు; వరంగల్, హైదరాబాద్‌లోని బట్టల మిల్లులు
ఇందులో ముఖ్యమైనవి. హైదరాబాదు నగరం చుట్టూ చాలా పరిశ్రమలు ఏర్పడినవి.
రామచంద్రపురంలోని భారత హెవీ ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్
ఇండియా, బెషధాల ఫ్యాక్టరీలు, ట్రాక్టర్లను తయారుచేసే ఫ్యాక్టరీలు వీటిలో
ముఖ్యమైనవి. వేలమంది కార్మికులు యీ పరిశ్రమలలో పనిచేస్తున్నారు. ఇవిగాక
సిగరెట్లు, రేడియోలు, టెలివిజన్లు, సబ్బులు, అగ్గిపెట్టెలు మొదలైన తయారుచేసే
పరిశ్రమలు కూడా ఉన్నవి. వీటితో పాటు కుటీర పరిశ్రమలు కూడా ఉన్నవి.
అద్దకం, లేసు, అల్లికపట్టు, పీచు, దువ్వెనలు, బీడీలు, తాటిబెల్లం మొదలైన
పరిశ్రమలెన్నో చాలా మందికి వృత్తిగా ఉన్నవి. కర్నూలు ప్రాంతంలో జంపుఖానాల
పరిశ్రమ దేశ ప్రసిద్ధిని పొందినది.
సాహిత్యం
తెలుగు సాహిత్యానికి వెయ్యి సంవత్సరాలకు మించిన చరిత్ర ఉన్నది. తెలుగులో
నన్నయ ఆదికవి. ఆయన మహాభారతంలో రెండున్నర పర్వాలను రచించినాడు.
కడమ పదిహేను పర్వాలను తిక్కన రచించినాడు. ఎజ్బన మూడవ పర్వమైన
అరణ్యపర్వాన్ని పూర్తి చేసినాడు. ఈ ముగ్గురికి కవిత్రయమని పేరు. పాల్కురికి
సోమన దేశీయమైన మార్గంలో రచనలు చేసి శైవమతాన్ని ప్రచారం చేసినాడు.
శ్రీనాథుడు అనేక కావ్యాలు వ్రాసిన మహాకవి. పోతన నిరాడంబర జీవితాన్ని గడిపిన
కవి, భక్తుడు. ఈయన వ్రాసిన భాగవతము ప్రజలలో విరివిగా ప్రచారాన్ని పొందినది.
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులుఉండేవారు. అల్లసాని పెద్దన, నంది
తిమ్మన, ధూర్జటి, పింగళి సూరన, తెనాలి రామకృష్ణుడు, రామరాజ భూషణుడు
వీరిలో ముఖ్యులు. చేమకూర వెంకటకవి ప్రబంధ కవులలో చెప్పుకోదగినవాడు.
తాళ్ళపాక అన్నమాచార్యులు, త్యాగరాజు, క్షేత్రయ్య, రామదాసు తెలుగులో కీర్తనలను,
పదాలను రచించినారు. బద్దెన సుమతీ శతకాన్ని, వేమన వేమన శతకాన్ని రచించిరి.
గురజాడ అప్పారావు ఆధునిక కవిత్వానికి వైతాళికుడు. “దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్” అని ఆయన ప్రబోధించినాడు. ఆధునిక కాలంలో ఎందరో
కవులు, రచయితలు కవితలను, నవలలను, కథానికలను రచిస్తున్నారు.
442
మనదేశం - తెలుగునీమ
మహాపురుషులు - వీరులు - మంత్రులు
తెలుగుసీమలో గొప్పవారు చాలామంది జన్మించిరి. హాలుడు అనే రాజు ప్రాకృత
భాషలో మంచి కవిత్వము వ్రాసెను. నాగార్జునుడు గొప్ప విజ్ఞాని బౌద్ధమతము వ్యాప్తి
చేసినవారిలో ముఖ్యుడు. వల్లభాచార్యుడు తెలుగు సీమలో జన్మించిన మత గురువు.
అన్నంభట్టు తర్క శాస్త్రములో గొప్ప పండితుడు. బసవరాజు ఆయుర్వేద వైద్యంలో
మిక్కిలి నైపుణ్యం సంపాదించి, బసవరాజీయమను గొప్ప (గ్రంథము వ్రాసెను.
త్యాగరాజు మంచి కీర్తనలు వ్రాసిన గొప్ప భక్తుడు; సంగీతపరుడు. ఆయన కీర్తనలు
తెలుగు దేశంలోనేకాక పొరుగు ప్రాంతాలైన తమిళ, కన్నడ ప్రదేశాలలో కూడ
గానము చేయబడుతూ అఖిలభారతంలో ప్రశస్తి పొందినవి. మల్లినాథుడు సాటి
లేని మహా పండితుడు; అనేక కావ్యాలకు వ్యాఖ్యానాలు వ్రాసినాడు. జగన్నాథ
పండితుడు సంస్కృత భాషలో గొప్ప విద్వాంసుడు. అలంకార శాస్త్రంలో గొప్ప
గ్రంథాన్ని వ్రాసినాడు. ఈయన షాజహాన్ పెద్ద కొడుకైన దారాకు స్నేహితుడు.
విజయనగర రాజ్యాన్ని స్థాపించిన మాధవ విద్యారణ్యులు తెలుగుదేశపు మేధావులలో
లెక్కపెట్టదగినవాడు.
తెలుగుదేశములో గొప్ప వీరులు చాలామంది జన్మించిరి. తెలుగుసీమ
మొదటినుండి వీరులకు, శూరులకు జన్మస్థానము. యుద్ధం నుండి పారిపోవడం
పెద్ద కళంకమని తెలుగువారి అభిప్రాయం. పూర్వం ఖడ్గ తిక్కన అనే వీరుడు ఉండెను.
ఆయన ఒకనాడు యుద్ధం నుండి పారివచ్చెనట. అప్పుడు ఆయన తల్లీ, భార్యా
ఆయనను యెగతాళి చేసి, యుద్ధములో పారిపోయినవారు ఆడవారితో సమానమని
చెప్పగా, తిరిగి వెంటనే ఆయన యుద్ధభూమికిపోయి యుద్ధం చేస్తూ మరణించెను.
గొప్ప వీరులతోపాటు తెలివితేటలుగల మంత్రులు కూడ తెలుగుదేశంలో
జన్మించిరి. అక్కన్న మాదన్నలు గోలకొండ రాజ్యానికి పెట్టని కోటలు. ప్రభుత్వాన్ని
నడిపిన బుద్ధిశాలురు. శివదేవయ్య కాకతీయ రాజ్యంలో ముఖ్యమంత్రిగా ఉండిన
ప్రజ్ఞావంతుడు. కృష్ణదేవరాయలకు ప్రధానమంత్రిగా ఉండిన తిమ్మరుసు గొప్ప ప్రతిభ,
తెలివితేటలు కలిగిన మహామంత్రి. నెల్లూరులోని మనుమసిద్ధి రాజుకు మంత్రిగా
ఉండిన తిక్కన ప్రజ్ఞాశాలురైన మంత్రులలో చెప్పదగినవాడు.
ఆధునిక కాలంలో తెలుగుజాతిని ఉద్ధరించిన మహాపురుషులు ఎందరో
జన్మించారు. వీరిలో చాలామంది మొత్తం దేశంలో పేరు ప్రఖ్యాతులు గడించినారు.
443
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
తెలుగువారిలో మూఢనమ్మకాలను పోగొట్టి, స్రీలకు కూడ పురుషులతో సమానమైన
స్థానం ఇవ్వవలెనని కందుకూరి వీరేశలింగం పోరాడినాడు. ఆయన గొప్ప సంఘ
సంస్కర్త, తెలుగుజాతి యుగపురుషుడు. ఈయన పేరు తెలుగు దేశ చరిత్రలో బంగారు
అక్షరాలతో వ్రాయతగినది. ఆధునిక తెలుగు సాహిత్యానికి కూడ ఈయన మూల
పురుషుడు. తెలుగు భాషను అభివృద్ధిపరచి, తెలుగుజాతి పురోభివృద్ధికి కారణమైన
వారిలో కొమర్రాజు లక్ష్మణరావు, గిడుగు రామమూర్తి, చిలకమర్తి లక్ష్మీనరసింహం,
పానుగంటి లక్ష్మీ నరసింహారావుగార్లు ముఖ్యులు. కాశీనాథుని నాగేశ్వరరావు
పంతులుగారు 'ఆంధ్ర పత్రికను స్థాపించి తెలుగు దేశానికి, తెలుగు భాషకు ఎంతో
సేవ చేసినారు. బీదలకు సహాయం చేసిన దాత నాగేశ్వరరావుగారు. గాంధీ మహాత్ముడు
ఆయన జెదార్యానికి మెచ్చి ఆయనకు “విశ్వదాత” బిరుదు యిచ్చినాడు.
మన స్వాతంత్ర్య పోరాటంలో గొప్ప త్యాగం చేసి, జీవితాన్ని దేశానికి అంకితం
చేసిన దేశభక్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు. డాక్టరు పట్టాభి సీతారామయ్యగారు
తెలుగు దేశపు నాయకులలో పెద్దలు; ఆంధ్రమేధావులలో ముఖ్యులు. ఆంధ్ర పితామహ
మాడపాటి హనుమంతరావు పంతులుగారు తెలంగాణ ప్రాంతానికి ఎంతో సేవ
చేసినారు. దాక్టరు సర్వేపల్లి రాధాకృష్ణ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తత్వవేత్త, విజ్ఞాని,
మేధావి. వారు మన సంస్కృతిని, వేదాంతాన్ని గురించి ఇంగ్లీషులో అనేక గ్రంథాలను
రచించినారు. ఆయన భారతదేశానికి రాష్ట్రపతిగా ఉండినాడు. జిడ్డు కృష్ణమూర్తి
ఆధునిక కాలంలో తత్త్వవేత్తగా కీర్తిని పొందినాడు.
ఇతర రంగాలలో కూడ తెలుగువారు చాలా ప్రసిద్ధి గాంచినారు. కోడి
రామమూర్తి గొప్ప బలశాలిగా పేరు పొందినాడు. శ్రీ నగేష్ భారత సేనాధ్యక్షుడుగా
పనిచేసినాడు. కటారి రామదాసు నౌకాదళంలో అత్యున్నత ఉద్యోగిగా పనిచేసినాడు.
క్రికెట్టులో ప్రపంచమంతటా కీర్తి గడించినవాడు సి.కె.నాయుడు. కట్టమంచి
రామలింగారెడ్డిగొప్ప విద్యావేత్త. ఫిడేలు వాయించటంలో ద్వారం వెంకటస్వామి
నాయుడుగారితో సమానమైనవారు భారత దేశంలో లేరు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య
ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఇంజనీయర్. ఆధునిక కాలంలో దామెర్ల రామారావుగారు
చిత్రకారులుగా ప్రఖ్యాతి గాంచినారు.
444
మనదేశం - తెలుగునీమ
మన దేశ స్వాతంత్ర్యము
ఇంత గొప్ప చరిత్ర, సంస్కృతి కలిగిన భారతదేశం సుమారు నూటయాభై
సంవత్సరాల ఇంగ్లీషు వారి యేలుబడి (క్రింద నలిగిపోయి, 1947 సంవత్సరం
ఆగస్టు 15వ తేదీనాడు స్వాతంత్ర్యము పొందినది. తరువాత తన రాజ్యాంగాన్ని
తానే సిద్ధం చేసుకొని, ప్రజాస్వామిక రిపబ్లిక్‌గా అవతరించి, సామ్యవాద సమాజ
స్థాపన ధ్యేయంగా పురోగమిస్తున్నది. మన దేశంలోని రాష్ట్రాలు స్వాతంత్ర్య ప్రాప్తి
తరువాత భాషారాష్ట్రాలుగా ఏర్పాటుచేయబడినవి. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు యీ విధంగా
జరిగినది.
గడచిన ముప్ఫై సంవత్సరాలకు పైగా భారతదేశం అఇన్న రంగాలలో ప్రగతి
సాధిస్తూ ముందడుగు వేస్తున్నది. విద్య, విజ్ఞానము, కళలు, ఆరోగ్యము, పాడిపంటలు,
వ్యవసాయము, నీటి పారుదల, పరిశ్రమలు, వాణిజ్యము మొదలైన అన్ని రంగాలలో
అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తూ పంచవర్ష ప్రణాళికల ద్వారా
వురోగమిన్తున్నది. దారిద్ర్యాన్ని, అనారోగ్యాన్ని, అజ్ఞానాన్ని నిర్మూలించి,
కులమతరహితమైన సమసమాజము స్థాపించవలెననే ఆదర్శంతో మన దేశంలో
కృషి జరుగుచున్నది. ఇదంతా ఒక ప్రత్యేక చరిత్రకు ఆధార సామగ్రి కాగలిగిన
కృషి,
తెలుగు భాష
తెలుగు భాష ఉచ్చారణకు అనుకూలమైనది. తెలుగు లిపి సమగ్రమైనది,
సుందరమైనది.
తెలుగు భాష తీయని భాష యూరప్‌లోని భాషలలో ఇటాలియన్ భాష మిక్కిలి
తీయనిది. యూరప్ ఖండంలో ఇటాలియన్ భాష ఎంత తీయనిదో, ఆసియా
ఖండంలో తెలుగు భాష అంత తీయనిదని విదేశీయులు ప్రశంసించినారు. తెలుగు
భాష తీపికి త్యాగరాజ కీర్తనలు ఒక నిదర్శనం. ఇంగ్లీషు అధికారులైన సి.పి. బ్రౌన్,
విలియం బ్రౌన్, కర్నల్ మెకంజి మొదలైనవారు తెలుగు భాష అభివృద్ధికి తోడ్చడినారు.
తెలుగు దేశానికి గొప్ప చరిత్ర, విజ్ఞానం ఉన్నవి. దాని గొప్పతనాన్ని నిలబెట్టటానికి
భావి పౌరులైన బబాల బాలికలు కృషి చేయవలెను.
వుల
445
భార స్పాతీంత్ర్యానిరీ ఫొరం
తెలుగులో పత్రికా రచనే
ప్రారంభ వికాసాలు - సంప్రదాయాలు
బొంబాయిలో ఏర్పాటు చేసిన
శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు స్మారకోపన్యాస పాఠము
రచనాకాలం : 08.12.1979
భారత స్వాతంత్రానికి పూర్వం
తెలుగులో పత్రికా రచన
ప్రారంభ వికాసాలు - సంప్రదాయాలు
అంతర్జాతీయ తెలుగు సంస్థ పక్షాన ఆధునిక యుగంలో భారతదేశాన్ని,
తెలుగుసీమను వివిధ రంగాలలో జాగృ్భతము గావించిన వైతాళికుల స్మారక సభలను
ఢిల్లీ, కలకత్తా, మదరాసు, బొంబాయి మొదలయిన నగరాలలో ఏర్పాటు చేయవలెనని
చేసిన నిర్ణయం ప్రకారం ఈరోజు మన మందరం ఇక్కడ సమావేశమైనాము. ఈ
నిర్ణయం సర్వవిధాల సమంజసమైనది. బొంబాయి నగరంలో ఈనాడు జరుగుతున్న
సభ స్వర్గీయ, దేశోద్ధారక, విశ్వదాత, కళాప్రపూర్ణ కాశీనాథుని నాగేశ్వరరావు
పంతులుగారి స్మారకసభ. ఈ శతాబ్దంలో తెలుగు దేశాన్ని మేలుకొల్చిన
మహనీయులలో వీరేశలింగం పంతులుగారి ప్రక్క నిలిచే వ్యక్తి నాగేశ్వరరావుగారు.
వాస్తవానికి నేటి తెలుగు సీమకు సూర్యచంద్రుల వంటివారు ఈ ఉభయులు.
నాగేశ్వరరావుగారు మనదేశ స్వరాజ్య సంపాదనకు కృషి చేసిన స్వాతంత్ర్య వీరుడు.
విదేశ ప్రభుత్వాన్ని ధిక్కరించి, చెరసాలకు వెళ్ళి, లాఠీ దెబ్బలకుగురియి దేశ స్వాతంత్ర్య
సమరంలో పాల్గొని, గాంధీ మహాత్మునికి అనుచరుడుగా ఉండిన త్యాగమూర్తి
నాగేశ్వరరావు. లక్షలు సంపాదించి, లక్షలు ఖర్చుచేసి ప్రజలకు ఉపయోగకరమైన
కార్యక్రమాలకు అన్నింటికి ఒక జెదార్యాన్ని విస్తరించిన మహనీయ మూర్తి
నాగేశ్వరరావు. తెలుగు భాషా సంస్కృతులకు ఆ రోజులలో వెన్నెముకగా నిలిచిన
ఉదారచరితుడు నాగేశ్వరరావు. ఆ రోజులలో ఆయన సహాయము పొందని మంచిపని
యేమీ లేదు. అందుచేతనే ఆయనను ప్రజలు దేశోద్ధారకుడని పిలిచినారు. గాంధీ
మహాత్ముడు ఆయనను విశ్వదాతయని ప్రశంసించినాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం
ఆయనను కళాప్రపూర్ణునిగా సత్మరించినది.
అటువంటి నవ్యాంధ్ర నిర్మాతకు బొంబాయి పట్టణముతోగల సంబంధం కూడ
సర్వదా చరిత్రలో నిలిచిపోయే సత్యం. ఎందుకనగా ఆయన తొమ్మిదవ ఆగస్ట్ 1908
నాడు వారపత్రికగా ప్రారంభించి, నిర్వహించిన ఆంధ్రపత్రిక జన్మస్థానము బొంబాయి
నగరమే. కావున ఆయనను సంస్కరించే ఈ సభ బొంబాయిలో జరగడం. ఈ సభలో
449
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
తెలుగు పత్రికా రచన - దాని వికాసము, అది పాటించిన ఉన్నత సంప్రదాయాలను
గూర్చి నాలుగు మాటలు చెప్పుకోవడం సందర్భ శుద్ధీ, జెచిత్యమూ, శోభస్మరమూ.
ఈ నాలుగు మాటలు చెప్పమని నన్ను ఆహ్వానించడంలో తెలుగు సంస్థ ఉద్దేశ్యమేమిటో
నాకు తెలియదు. కాని, నా శక్తి సామర్థ్యాల పరిమితులు నాకు బాగా తెలిసిన
సత్యమే. అయినప్పటికిని ఆ మహనీయ మూర్తిని సంస్మరించే అవకాశాన్ని
పోగొట్టుకోవడం ఇష్టంలేక, సుమారు పదహారు సంవత్సరాలపాటు తెలుగు
దినపత్రికయైన 'గోలకొండితో నాకు ఉండిన సన్నిహిత సంబంధాన్ని దృష్టిలో
పెట్టుకొని, కొంతకాలం సాహిత్య మాసపత్రికగా “శోభను నడిపిన సంఘటనను
సంస్కరించి, సుమారు తొమ్మిది, పది సంవత్సరాల బాలకునిగా వరంగల్ నగరంలో
నాగేశ్వరరావుగారిని ఒక సమావేశంలో చూసిన దృశ్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని, ఈ
సాహసానికి నేను పూనుకున్నాను. నా యీ కార్య నిర్వహణములోని లోటుపాట్లకు
అంతర్జాతీయ సంస్థ బాధ్యత వహించవలసి ఉంటుంది.
తెలుగు ప్రజల సామాజిక, సాంస్కృతిక రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేసిన
తెలుగు పత్రికలకు, పత్రికా రచనకు ఒక నూరు సంవత్సరాల పైబడిన ఉజ్వలమైన
చరిత్ర ఉన్నదని చెప్పవలెను. ఈ నూరు సంవత్సరాలకు పైబడిన కాలంలో
తెలుగుపత్రికలు నిర్వహించిన పాత్ర మహోదాత్తమైనది. దేశాన్నీ ప్రజలనూ మేలుకొల్చి
ముందుకు నడిపించిన ఉద్యమాలకు తెలుగు పత్రికలు వెన్నెముకగా ఉండినవి.
ఒకమారు ప్రారంభదశను పరిశీలించినప్పుడు భారత దేశంలోని అన్ని భాషలలోవలెనే
తెలుగులో కూడా పత్రికలను స్థాపించి నిర్వహించిన గౌరవం క్రైస్తవ మిషనరీలకే
యీయవలసి ఉన్నది. అయితే క్రైస్తవ మిషనరీల మత ప్రచారాన్ని అరికట్టి, భారతీయ
సంస్కృతిని ప్రబోధించవలెననే ఉద్దేశ్యము కూడా మరొకవైపు దేశ భాషలలో పత్రికలను
స్థాపించి నిర్వహించడానికి కారణభూతమైనది. ఇతర భాషలలోవలెనే తెలుగులో
కూడా అచ్చు యంత్రశాలల అవతరణ పత్రికా రచనను ప్రోత్సహించినది. ఈ అచ్చు
యంత్రశాలలను కూడా మొదటిసారిగా స్థాపించి నడిపినవారు క్రైస్తవ మిషనరీలే.
అందుచేత ముద్రణాలయాల స్థావన వత్రికల నిర్వవాణకు ముఖ్య
ప్రోత్సాహకారణమైనది. ఈ విషయంలో పరిశోధన చేసిన విద్వాంసుల అభిప్రాయం
ప్రకారం 1746-47 ప్రాంతాలలో తెలుగు ముద్రణా కార్యక్రమము ప్రారంభమైనదని
చెప్పవలెను. అయితే యీ అచ్చు తెలుగు లిపిలోనా లేక ఇంగ్లీషు లిపిలోనూ అనే
ప్రశ్నకు సరియైన సమాధానము లేదు.
450
భారత స్వాతంత్ర్యానికి పూర్వం తెలుగులో వత్రికా రచన
తెలుగులో మొట్టమొదట అచ్చువేసిన పుస్తకం బైబిల్ అని అభిజ్ఞుల అభిప్రాయం.
మరికొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం తెలుగులో ముద్రణ 1806లో
ప్రారంభమైనప్పటికిని 1830 వరకు ఎక్కువగా అభివృద్ధి పొందలేదు. 1838లో
“సత్యదూతి” అనే ఒక తెలుగు పత్రికను బళ్ళారి నుండి (క్రైస్తవ మిషనరీలు
ప్రకటించినట్లు ఒక అభిప్రాయము కలదు. ఈ సంవత్సరాల నిర్ణయం ఏమైనప్పటికిని
1830 తరువాత తెలుగులో ముద్రణ కార్యకలాపాలు ముందంజ వేసి పత్రికల
అవతరణను ప్రోత్సహించినవి. మొట్టమొదటి దశలో దేశ భాషలలో పత్రికా రచనను
అప్పటి ప్రభుత్వాలు ఎక్కువగా హర్షించినట్లు కనబడదు. ప్రజలలో జాతీయ భావాలు,
స్వాతంత్ర్య కాంక్షలు పత్రికలవలన వ్యాప్తి చెందగలవనే ఉద్దేశంతో దేశభాషల పత్రికల
పట్ల ప్రభుత్వము చూపవలసినంత సానుభూతి చూపలేదని కూడా చెప్పడానికి
మనముందు ప్రబలమైన ఆధారాలున్నవి. ఒకమారు వెనుదిరిగి చూస్తే క్రైస్తవ
మిషనరీల ప్రచారం, ఆ ప్రచారాన్ని ఎదుర్మొనవలెననే సమకాలిక విద్వాంసుల
పట్టుదలా, కృషీ విదేశ పరిపాలన పట్ల ప్రాతికూల్యం, స్వరాజ్యాన్ని సాధించవలెననే
కోరిక, సమాజం అభివృద్ధి చెందవలెననే ఆశయం మన పత్రికల ఆవిర్భావ
వికాసాలకు దోహదం చేసినవి. మహావి శ్రీశ్రీ “ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది
గర్వకారణం” అన్నాడు కాని, భారత స్వాతంత్ర్యానికి పూర్వం దేశ భాషల పత్రికల
చరిత్ర మాత్రం నిస్సందేహంగా మనకు గర్వకారణమని చెప్పవలెను. కందుకూరి
వీరేశలింగం పంతులుపంటి సంఘసంస్కర్త, గాడిచర్ల హరి సర్వోత్తమరావు వంటి
స్వాతంత్ర్య యోధుడు, కాశీనాథుని నాగేశ్వరరావు వంటి దేశనాయకుడు, ముట్టూరు
కృష్ణారావు వంటి మేధావి తెలుగులో పత్రికారచనను ప్రారంభించి, ప్రోత్సహించినారనీ,
వారు తెలుగు పత్రికారచనకు ప్రారంభకులనీ చెప్పితే మన పత్రికల ఉన్నత
సంప్రదాయాలకు ఉత్తమ ఉదాహరణ కాగలదు.
అన్ని భాషలలోవలెనే తెలుగులో కూడా ముద్రణ సౌకర్యాల విస్తరణలో పత్రికల
ప్రారంభ వికాసాలు ముడిపడి ఉన్నవి. తెలుగులో ముద్రణ సౌకర్యాలు 18వ శతాబ్దం
చివరి భాగంలోను, 19వ శతాబ్దం తొలిభాగంలోను ప్రారంభమై వ్యాప్తి పొందినవి.
1801వ సంవత్సరం వరకు తెలుగులో చాలా పుస్తకాలు ప్రచురితమైనట్లు, తెలుగులో
ఒక వ్యాకరణం కూడా ప్రకటితమైనట్లు మనకు తెలుస్తున్నది. ఉద్దేశ్యమేమైనప్పటికిని
ఈ కృషికి ప్రారంభకులు క్రైస్తవ మిషనరీలే.. ఈ (ప్రసంగంలో మనము
451
దా దేవులవల్లి రామానుజరావు (గ్రంథావళి
ప్రస్తావించవలసిన అంశము తెలుగు పత్రికలు, వాని ప్రారంభ వికాసాలను గూర్చియే.
అందుచేత ముద్రణ సౌకర్యాలు, పుస్తక ప్రకటనమును గూర్చి చెప్పిన మాటలు
ప్రస్తావికమైనవి మాత్రమే. తెలుగులో అచ్చు అయిన పుస్తకాలను చూచి, పత్రికలు
కూడా నడుపవలెననే కోరిక సహజంగా ఆనాటి విద్యాధికులలో ఉత్పన్నమైనది.
1832వ సంవత్సరంలో మదరాసులోని కొందరు ప్రముఖులు తెలుగు, మలయాళ
భాషలలో 'మదరాసు క్రానికల్ అనే పేరుతో ఒక పత్రికను స్థాపించడానికి ప్రభుత్వాన్ని
అనుమతి కోరినట్లు మనకు తెలుస్తున్నది. కాని ఈ అనుమతి దొరికినట్లు మనకు
కానరాదు. బహుశా అప్పటి ప్రభుత్వం దేశ భాషలలో పత్రికలు ప్రకటితమైతే, అవి
ప్రజలలో జాతీయ భావాలను వ్యాప్తి చేయడానికి ఉపయోగపడగలవని భావించినట్లు
తోస్తున్నది. అంతేకాదు; సైనికులలో కూడా తిరుగుబాటు భావాలు ఈ పత్రికలవల్ల
కలుగవచ్చునని అప్పటి ప్రభుత్వం భావించినట్లు కూడా నిదర్శనాలు మనకు
కనిపిస్తున్నవి.
1838వ సంవత్సరములో తెలుగులో “వృత్తాంతిని” అనే వారపత్రిక మొదటి
పత్రికగా ప్రకటితమైనట్లు సుప్రసిద్ధ పండితులు, పరిశోధకులు శ్రీ ఆరుద్రగారు
తెలుపుతున్నారు. మండిగల వెంకటరాయశాస్తి అనే విద్వాంసుడు ఈ పత్రికకు
సంపాదకుడుగా ఉండినట్లు, ఆయన బహుశ కడప జిల్లా వాడైనట్లు, ఈ పత్రికలో
ఉన్నత శ్రేణి వ్యాసాలు ప్రకటితమైనట్లు శ్రీ ఆరుద్రగారు ఒక వ్యాసంలో తెలిపినారు.
అప్పటివరకు ఇంగ్లీషు పరిపాలన మనదేశంలో కొంత స్థిరమైనది. అందుచేత ఇంగ్లండు
రాజుల జీవితాన్ని గూర్చి ఈ పత్రికలో అప్పుడప్పుడు కొన్ని విషయాలు వెల్లడి చేసినట్లు
తెలుస్తున్నది. అంతేగాక, ఆనాటి విద్వాంసులు ఈ పత్రికలో చారిత్రక విషయాలను
గూర్చి వ్రాసినట్లు కూడా తెలుస్తున్నది. ఈ పత్రికకు వ్రాసిన విద్వాంసులలో 'బేతపూడి
సుందరరావు” ఆ రోజులలో సుప్రసిద్ధులైన తెలుగు పండితులు. ఈయన ఆ కాలంలో
'ఫోర్ట్‌సెంటు జార్డ్ కళాశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసినారు. ఆనాటి సాంఘిక
దురాచారాలను గూర్చి కూడా ఈ పత్రికలో తీవ్రమైన విమర్శలు జరిగినట్లు
తెలుస్తున్నది. ఇటువంటి విమర్శలకు పాత్రమైన దురాచారాలలో పెండ్లిండ్లలో జరిగే
దుచారాలను గూర్చి కూడా ఈ పత్రికలో తీవ్రమైన విమర్శలు జరిగినట్లు తెలుస్తున్నది.
ఇటువంటి విమర్శలకు పాత్రమైన దురాచారాలలో. పెండ్లిండ్లలో జరిగే దుబారా
ఖర్చు, బోగము మేళాలు మొదలయినవి ముఖ్యమైనవి. అందుచేత ఈ పత్రిక ప్రజలలో
452
భారత స్వాతంత్ర్యానికి పూర్వం తెలుగులో వత్రికా రచన
కొంత ప్రచారము పొందినది. ఈ ప్రచారము ప్రభుత్వానికి ఆందోళన కలిగించినట్లు
కూడా తెలుస్తున్నది. అప్పుడే తెలుగు నేర్చుకొన్న ఇంగ్లీషు ఉద్యోగులు కూడా ఈ
పత్రికా పాఠకులలో ముఖ్యులుగా ఉండిరి. ఒకానొక ఇంగ్లీషు ఉద్యోగి ఈ పత్రికల్లో
ప్రచురితమైన వార్తలను, వ్యాఖ్యానాలను గూర్చి ప్రస్తావిస్తూ గవర్నర్ గారిచ్చిన
విందులను గూర్చి, రాణుల, రాణుల అంతఃపురాలను గూర్చి ఈ పత్రికలో సమాచారం
ప్రకటితమైనట్లు తెలియజేసినారు. తెలుగుభాషకు మహోపకారం చేసిన సి.పి. బ్రౌన్‌గారు
సేకరించిన తెలుగు గ్రంథాల వ్రాత ప్రతులను గూర్చి కూడా ఈ పత్రికలో సమీక్షలు
జరిగినట్లు మనకు తెలుస్తున్నది. ఏమైనప్పటికిని ఈ పత్రిక కొన్ని సంవత్సరాలు
నడిచి 1841లో ఆగిపోయినది.
ఈ వృత్తాంతిని తరువాత తెలుగులో ప్రకటితమైన మరొక వారపత్రిక 'వర్తమాన
తరంగిణి” 1842వ సంవత్సరములో ప్రారంభమైనట్లు తెలుస్తున్నది. ఆశ్చర్యమేమనగా
ఈ పత్రిక సంపాదకుడు తెలుగు తెలియని సయ్యద్ రహమతుల్లా అనే ముస్లిం
పౌరుడు. ఆయన మదరాను నగరంలోని మౌంట్‌రోడ్డుమీద ఉన్న తన
ముద్రణాలయంలో ఈ పత్రికను అచ్చు వేసినాడు. ఈ పత్రిక ప్రకటించడానికి
కారణాలను తెలుపుతూ 'వృత్తాంతిని” ఆగిపోయినందువలన మరొక తెలుగు పత్రిక
అవనరమైనదని ఆయన పేర్కొన్నాడు. “మేము ఎక్కువ నంవన్నులము
కాకపోయినప్పటికిని, తెలుగులో తగినంత వైదుష్యము లేకపోయినప్పటికిని,
హిందువులతో స్నేహ సహకారాలు వృద్ధి పొందించుకోవడానికి ప్రజలలో ప్రచారం
కలిగించుకోవడానికి, తెలుగు టైపులను, పరికరాలను సేకరించుకొని కొన్ని నూర్ల
రూపాయలను ఖర్చు చేయడానికి సిద్ధమైనామని” ఆయన తెలిపినాడు. ఆయన
అనుకున్నట్లుగానే తెలుగు మాట్లాడే హిందువులలో ఈ పత్రికకు బాగా ప్రచారం
వచ్చింది. పువ్వాడ వెంకటరావు అనే విద్వాంసుడు ఈ పత్రికకు పది సంవత్సరములకు
పైగా సంపాదకుడుగా పనిచేసినాడు. ఆయనకు ముందు వెలువడిన 5, 6 సంచికలకు
సంపాదకులెవరో తెలియదు. తన మొదటి సంపాదకీయంలో తాము ఈ పత్రిక
మతసంబంధమైన వివాదాలకుగానీ, విమర్శలకుగానీ, విద్వేష ప్రచారానికి గాని చోటు
ఈయదని, దుష్టమైన విషయాలను గూర్చి ప్రస్తావించదని ఈ సంపాదకుడు తెలిపినాడు.
ఆయన ఈ పత్రికను సులభమైన, సరళమైన భాషలో నడిపినట్లు, ఆయన
వాక్యరచనమీద ఇంగ్లీషు భాషాప్రభావం గోచరించినట్లు, ఆ కాలంలోని ఇంగ్లీషు
453
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
పత్రికల ఒరవడిలోనే ఈ పత్రిక కూడా నడచినట్లు పరిశోధకులు అభిప్రాయపడినారు.
వృత్తాంతిని పత్రికను ఆదరించిన వారందరు కూడా ఈ “వర్తమాన తరంగిణిని
ఆదరించినట్లు తెలుస్తున్నది. ఈ పత్రికలో వ్రాసినవారు “జనమనోరంజకుడు,
లోకోపకారి, న్యాయవాది, సకలజన సమ్మతుడు, వికటసంకటకవి” అనే ప్రచ్చన్న
నామాలతో వ్రాసినట్లు తెలుస్తున్నది. ఈ పత్రికను గూర్చిన మరికొన్ని వివరాలు
గమనించదగినవి. ఈ పత్రిక 1/8 డెమ్మీ సైజులో, 12 పేజీలతో, పేజీకి రెండు
కాలములతో, కొన్నినాళ్ళు బుధ వారాలలో, మరికొన్నినాళ్ళు గురువారాలలో
ప్రకటితమైనది. ఈ పత్రికలో ప్రకటన ఛార్జీలు ఒక కాలానికి మూడణాలు. ఆనాటి
ప్రభుత్వ గెజెట్‌లో ప్రకటితమైన ముఖ్య విషయములన్నీ ఈ పత్రికలో చేరుస్తుండేవారు.
పదిమంది చందాదారులను చేర్చిన వారికి ఒక పత్రిక ఉచితంగా లభించేది. ఆనాటి
సాంఘిక దురాచారాలు ఇంగ్లీషు ఉద్యోగులు చేసిన అవినీతికరమైన హద్దుమీరిన
చర్యలు, సివిలియన్ ఉద్యోగులు సాహిత్యానికి, కళలకు ఇచ్చిన ప్రోత్సాహం, మిషనరీలు
(క్రైస్తవ మతానికి పరివర్తనం చేయడంలో అవలంబించిన మార్గాలు, విద్యాసంస్థల
వ్యవహారాలు, సమస్యాపూరణలవంటి సాహిత్య విషయాలు, ఈ “వర్తమాన
తరంగిణి'లో ప్రముఖంగా కనిపించేవి. ప్రకటనలలో కూడా సాహిత్యానికి, చరిత్రకు
సంబంధించిన ప్రభావం గోచరించేది.
1851వ సంవత్సరము జులై నెలలో ఈ పత్రికలో ప్రకటితమైన ఒక వ్యాసాన్ని
గూర్చి ప్రస్తావిస్తూ సి.పి.బ్రౌన్ “ఈ వ్యాసంలోని కొన్ని సంగతులు హిందువులలో
వివేకవంతమైన ప్రస్తుత ప్రభుత్వాన్ని గూర్చి వ్యాపించియున్న అపోహలకు, భ్రమలకు
తార్మాణమని, ఇందులో కృత్రిమమైన శైలి ఉపయోగించినారని, వ్యవహారంలో లేని
పదజాలాన్ని, వర్ణక్రమాన్ని ఉపయోగించినారని” తన లేఖలలో ఒకచోట వ్రాసినాడు.
“వర్తమాన తరంగిణి సంపాదకుడైన పువ్వాడ వెంకటరావుగారికి, సి.పి. బ్రౌన్‌కు మధ్య
కొన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచినట్లు కూడా మనముందు ఉదాహరణలున్నవి. ఈ
పత్రిక 1852 వరకు బాగా నడిచినట్లు తెలుస్తున్నది. కాని 1852 తరువాత ఈ
పత్రిక ఎంత కాలం నడిచిందో తెలియదు.
ఈ విధంగా మదరాసులో “వర్తమాన తరంగిణి'గా బాగా ప్రచారంలోకి
వస్తుండగా మచిలీపట్టణం నుండి 1848వ సంవత్సరంలో 'హితవాది” అనే తెలుగు
సచిత్ర మాస పత్రిక ప్రారంభమైనది. ఈ పత్రికా సంపాదకుడు ఎడ్మండ్ షార్కె
454
భారత స్వాతంత్ర్యానికి పూర్వం తెలుగులో పత్రికా రచన
ఆయన ఆంగ్లో ఇండియన్, మచిలీపట్టణంలోనే జన్మించెను. ఈ పట్టణంలోనే క్రైస్తవ
మిషనరీగా ఆయన పనిచేసినాడు. అప్పటివరకు మచిలీపట్టణంలో అచ్చు సౌకర్యాలు
లేనందున ఈ పత్రికను మదరాసులోనే అచ్చు వేసినారు. షార్మె స్వయంగా రచయిత.
హిందూస్త్రీల స్థితిగతులను అభివృద్ధిచేసే ఆశయంతో కొన్ని కథలు వ్రాసినాడు.
మరికొన్ని పుస్తకాలను ఇంగ్లీషు నుండి తెనిగించినాడు. 'హితవాది' పత్రిక కాపీలు
కొన్ని ఈనాటికీ లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఆ
రోజులలో ముద్రణ సౌకర్యాలు మదరాసులో కాక మరి రెండుచోట్ల మాత్రమే ఉండేవి.
ఒకటి బళ్ళారి, మరొకటి విశాఖపట్టణం. 1835వ సంవత్సరం ప్రాంతంలో బళ్ళారిలో
మొట్టమొదటి తెలుగుపత్రిక 'సత్యదూత' అనే పేరుతో వెలువడినట్లు ఒక అభిప్రాయం
కలదు. తరువాత ఇదే పేరుతో మదరాసునుండి క్రిశ్చియన్ లిటరరీ సొసైటీవారు
1888 నుండి ఒక పత్రికను నడిపినట్లు తెలుస్తున్నది. ఏమైనప్పటికిని ఆ రోజులలో
తెలుగుపత్రికలకు ప్రధాన కేంద్రము మదరాసు నగరమే. 1836వ సంవత్సరములోనే
మదరాసులో 20 ముద్రణాలయాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇవన్నీ వ్యాపారపద్ధతిలో
నడిపిన ముద్రణాలయాలు. తెలుగు భాషలో వ్యాకరణ, ఛంద శ్చాస్తాలు, వాచకాలు,
నిఘంటువులు, కథలు మొదలయిన అనేక గ్రంథాలు ఈ అచ్చు శాలలలో
ముద్రించినవే. పురాణం హయగ్రీవ శాస్త్రిగారి తండ్రియైన పురాణం నారాయణ
శాస్రిగారు మదరాసులో మొట్టమొదట తెలుగు ముద్రణాలయాన్ని స్థాపించినట్లు
తెలుస్తున్నది. పూదూరు శ్రీసీతారామశాస్తిగారు రచించిన “పెద్దబాలశిక్ష 1847లో
ఈ ముద్రణాలయంలోనే ప్రచురితమైనది. వావిళ్ళ రామస్వామి శాస్తులుగారు కూడా
ఇదేకాలంలో తెలుగు పుస్తకాల ప్రచురణ కార్యక్రమాలను చేపట్టి ఒక అచ్చుశాలను
క్రమక్రమంగా స్థాపించినారు. వావిళ్ళ రామస్వామి శా(స్తులవారు తెలుగు
భాషావికాసానికి చేసిన కృషి సుప్రసిద్ధమైనది. తరువాత చిన్నయసూరి 1853వ
సంవత్సరములో ఒక తెలుగు ముద్రణాలయాన్ని ప్రారంభించి నిర్వహించినట్లు
తెలుస్తున్నది. కొక్కొండ వెంకటరత్నం పంతులుగారు కూడా మదరాసులో తెలుగు
ముద్రణాలయాన్ని “సంజీవనీ ముద్రాక్షరశాల” అనే పేరుతో స్థాపించి నిర్వహించినారు.
వావిళ్ళ రామశాస్తులు గారి అల్లుడు చదలవాడ సుందర రామశాస్తిగారు ఈ కాలంలోనే
మరొక ముద్రణాలయాన్ని స్థాపించి నిర్వహించినారు.
ఈ విధంగా ముద్రణాలయాలు పెట్టిన చాలామంది తెలుగు పత్రికలను కూడా
నడిపినారు. ఆ రోజులలో తెలుగు ముద్రణశాలను పెట్టవలెనంటె రెండు వేల
455
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
రూపాయలు ఖర్చు చేయవలసి వచ్చేది. ఆనాటి పరిస్థితులలో ఇది చాలా గొప్ప
మొత్తమే. ఆనాటి పండితులు నడిపిన తెలుగు పత్రికలలో చాలామట్టుకు గ్రాంథిక
భాషనే ఉపయోగించేవారు. సరళమైన భాషను పత్రికలలో ఉపయోగించవలెననే
ఉద్దేశ్యం కలిగినవారు వీరేశలింగం పంతులుగారే. ఆయన 1874లో “వివేక వర్ధని”
అనే మాసపత్రికను ప్రారంభించి అనేక సంవత్సరాలు నడిపిరి. నిజానికి ఆధునిక
వద్ధతిలో నడిచిన మొట్టమొదటి పత్రిక “వివేక వర్ధని” అనే చెప్పవలెను.
వివేకవర్ధనితోపాటు “హాస్యసంజీవని, సతీ హితబోధిని, సత్య సంవర్థిని” అను
పత్రికలను గూడా వీరేశలింగంగారు నడిపినారు. ఇవన్నీ స్పష్టమైన ఆదర్శాలతో,
సులభశైలిలో సమకాలిక సమాజాన్ని గూర్చి చేసిన వ్యాఖ్యలతో నడిచినవి. ఈ పత్రికల
నిర్వహణలో వీరేశలింగంగారు అనేక కష్టాలను ఎదుర్కొన్నట్లు తమ స్వీయచరిత్రలో
వ్రాసినారు. అందుచేత ఆధునిక పత్రికా రచనకు కూదా వీరేశలింగంగారు జనకులని
చెప్పితే అతిశయోక్తి కాదు.
19వ శతాబ్దం రెండవ భాగంలో అనగా, 1850-1900 మధ్యన క్రమక్రమంగా
పత్రికల సంఖ్య అభివృద్ధి చెందింది. క్రైస్తవ మిషనరీలతో పాటు సంస్కృతాంధ్రాలలో
గట్టి పాండిత్యం గల విద్వాంసులు ముద్రణాలయాలను నడుపడానికి, పత్రికలను
నిర్వహించడానికి ముందుకు వచ్చినారు. వర్తమాన తరంగిణిని గూర్చి ఇంతకు
ముందు విపులంగా తెలిపినాను. 'సంవాద కౌముది” ఒకటి ఈ కాలంలో నడిచినట్లు
బ్రౌన్‌గారు తమ నిఘంటువులో కౌముది అనే పదానికి అర్థం ఇచ్చే సందర్భంలో
తెలిపినారు. 1862వ (ప్రాంతంలో క్రైస్తవ మిషనరీలు 'దినవర్తమాని” అనే
వారపత్రికను కూడా కొంత కాలం మదరాసు నుండి నడిపినారు. ఈ పత్రికలో
వ్యావహారిక భాషలోనే వార్తలు ప్రకటించినారు. ముదలి త్యాగయ్య అనే పండితుడు
1863లో 'యక్షిణి' అనే పత్రికను బళ్ళారిలో స్థాపించి నడిపినాడు. 1864-67
మధ్యన 'సుజన రంజని” అనే పత్రికను వి.కృష్ణమాచార్యులు, బి.సీతారామాచార్యులు,
కె.సుబ్బరాయలునాయుడు సంయుక్త సంపాదకత్వంలో నడిపినారు. ఈ ముగ్గురులోని
సీతారామాచార్యుల వారు తరువాత శబ్ద రత్నాకరానికి గ్రంథకర్తయెన బహుజనవల్లి
సీతారామాచార్యులే. ఈ సుజన రంజని పత్రికలో చిన్నయ సూరిగారి కొన్ని వ్యాసాలు
ప్రకటితమైనవి. “తత్వబోధిని” అనే పత్రిక 1864-70 మధ్యన (బ్రహ్మసమాజ
ఆదర్భాలతో ప్రకటితమైనది. 1870లో గోదావరి మండల విద్యాప్రబోధిని అనే
456
భారత స్వాతంత్ర్యానికి పూర్వం తెలుగులో పత్రికా రచన
పత్రిక రాజమండ్రి నుండి ప్రకటితమైనది. ఈ పత్రికకు వీరేశలింగం గారు కూడా
వ్రాస్తుందేవారు. 1871వ ప్రాంతంలో కొక్కొండ వెంకట రత్నం పంతులుగారు
“ఆంధ్రభాషా సంజీవని” అనే పత్రికను ప్రారంభించిరి. ఈ పత్రికలో శుద్ద గ్రాంథిక
భాషనే ఉపయోగించినారు. ఇంగ్లీషులోని సాంకేతిక పదాలకు సమానార్థకాలు
కఠినమైన పదాలుగా ఈ పత్రికలో ఉపయోగించబడినవి. సాహిత్య విషయాలకే
కాక సాంఘిక విషయాలకు కూడ ఈ పత్రిక ప్రాధాన్యమిచ్చేది. పుస్తకాల సమీక్షలు
కూడా ఈ పత్రికలో ప్రకటితమైనవి. అప్పుడప్పుడు ప్రత్యేక సందర్భాలలో విశేష
సంచికలను కూడ ఈ పత్రిక ప్రకటించినది. మొదట్లో వీరేశలింగం పంతులుగారు
ఈ పత్రిక నిర్వహణతో సహకరించి, ఈ పత్రికను ప్రశంసించి కొన్ని వ్యాసాలను
వ్రాసిరి. తరువాత వారి ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినవి. వితంతు వివాహం,
స్రీ విద్య, సంఘ సంస్మరణ మొదలయిన వానిమీద కలిగిన అభిప్రాయ భేదాలతోపాటు
సాహిత్య విషయాలలో కూడా అభిప్రాయ భేదాలు వీరిద్దరి మధ్య కలిగినవి.
1872లో ఉమారంగ నాయకులు నాయుడు అనేవారు తాము కొంత కాలము
నుండి నిర్వహిస్తున్న జైనసమాజం అనే సంస్థ పక్షాన “పురుషార్థ ప్రదాయని” అనే
పత్రికను మచిలీపట్టణం నుండి ప్రారంభించిరి. ఈ పత్రికలో వార్తలకు, వ్యాఖ్యలకు,
సాహిత్యానికి, జానపద వాజ్మియానికి, చేతి పరిశ్రమలకు, దేశ చరిత్రకు, జీవిత
చరిత్రకు, న్యాయశాస్త్రమునకు, సైన్సుకు ఇంకా అనేక విషయాలకు
ప్రాధాన్యమీయబడినది. గొప్ప ఆదర్భాలతో అనేక విషయాలకు ప్రాధాన్యమిస్తూ ఈ
పత్రిక నడిచినది. నంవునంన్మరణకు, అవినీతి నిర్మూలనకు ఈ వత్రిక
ప్రాధాన్యమిచ్చేది. క్రైస్తవుల మతపరివర్తన కార్యక్రమాలను ఈ పత్రిక వ్యతిరేకించినది.
దాదాభాయి నౌరోజీ గారివంటి నాయకుల ఉపన్యాసాలను ఈ పత్రిక ప్రచురించి
జాతీయ భావాల ప్రచారానికి తోడ్పడింది. వీరేశలింగం పంతులుగారు అప్పుడప్పుడు
ఈ పత్రికకు వ్రాస్తుండేవారు. వివేకవర్ధనిని గూర్చి ఇంతకుముందు ప్రస్తావించినాను.
వీరేశలింగం గారి సంఘ సంస్మరణ ఉద్యమానికి వివేకవర్ధని పెట్టని కోటగా ఉండేది.
సాంఘిక దురాచారాలను, అవినీతిని విమర్శించి ఈ పత్రిక దేశంలో ఒక జాగ్భతిని
కలిగించినది. ఈ పత్రిక సుమారు 16 సంవత్సరాలు నడిచినది. “సత్యసంవర్ధని,
సత్యవాదిని” అనే మరో రెండు పత్రికలను కూడా వీరేశలింగం పంతులుగారు 1891-
1905 సంవత్సరాల మధ్య నడిపినారు. 1885లో ఎ.సి. పార్థసారధి నాయుడుగారు
457
దా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
“ఆంధ్ర ప్రకాశిక అనే పత్రికను ప్రారంభించినారు. అప్పటి ప్రభుత్వ విధానాలను,
పరిపాలన లోని లోపాలను, అవినీతిని ఈ పత్రిక ప్రజల ముందు పెట్టి వాని
నిర్మూలనకు కృషి చేసినది. ఈ పత్రికా సంపాదకులు లోకమాన్య బాలగంగాధర
తిలక్‌గారి అనుయాయులు. 45 సంవత్సరాలు నడిచిన ఈ పత్రిక ప్రజలలో మంచి
వ్యాప్తి పొంది, స్వరాజ్య ఉద్యమాన్ని స్వాతంత్ర్య పోరాటాన్ని బలపరిచినది. శఈశిలేఖ”
అనే పత్రికను గట్టుపల్లి శేషాచార్యులుగారు 1894లో వారపత్రికగా ప్రారంభించి
తరువాత ద్వైవారపత్రికగా నడిపిరి. 1896లో దేవగుప్తం శేషాచలపతిగారు
బెజవాడనుండి 'దేశాభిమాని” అనే పత్రికను ప్రారంభించిరి. ఈ విధంగా ఇన్ని
పత్రికలు 19వ శతాబ్దంలో బయలుదేరి తెలుగులో పత్రికారచనకు బలమైన పునాదులు
నిర్మించి, ఉత్తమ సంప్రదాయాలను నెలకొల్సినవి. భాషకు, దేశానికి, ప్రజలకు
సేవ చేయవలెననే మహోన్నత లక్ష్యాలతో ఈ పత్రికలు నడిచినవి. సంఘ సంస్మరణ
ఉద్యమాన్ని ఈ పత్రికలు బలపరిచినవి. ఈ పత్రిక సంపాదకులలో చాలామంది
గొప్ప విద్వాంసులు, బహుగ్రంథ రచయితలు. జాతీయ భావాలు ప్రజలలో
వ్యాపింపజేసి దేశాన్ని జాగృతం చేయడానికి ఈ పత్రికలు మార్గదర్శకమైన కృషి
చేసినవి. ఈ విధంగా 19వ శతాబ్దంలో పత్రికారచన సాగినది. ఇది మహోజ్వలమైన
అధ్యాయము.
20వ శతాబ్దం ఆరంభంలో తెలుగు పత్రికా రచన రంగంలో క్రొత్త మలుపు
తిరిగింది. 19వ శతాబ్దం చివరలో దేశంలో జాతీయ భావాలు బాగా ప్రబలినవి.
ప్రజలలో సాంఘిక చైతన్యము, రాజకీయ చైతన్యము వ్యాప్తి చెందినవి. విదేశ
ప్రభుత్వాన్ని తొలగించి స్వరాజ్యం సాధించవలెననే గాఢమైన కాంక్ష దేశంలో సర్వత్రా
కనిపించింది. భారతజాతీయ కాంగ్రెస్ ఉద్యమం ఆసేతు హిమాచలం విజృంభించింది.
దాదాభాయి నౌరోజి, బాలగంగాధరతిలక్, గాంధీమహాత్ముడు మొదలయిన నాయకుల
ప్రబోధము పల్లె పల్లెలకు ప్రాకిపోయినది. ఇంగ్లీషు భాషను చదువుకున్న విద్యాధికుల
సంఖ్య పెరిగినది. వ్యావహారిక భాషలో రచనలు చేయవలెననే ఉద్యమం
కొనసాగినది. సామ్యవాద భావాలు తలయెత్తి యువకులను ఆకర్షింపసాగినవి.
సామాజికంగా సమాజంలో స్తీ పురుషులు సమానులనే భావం ప్రబలసాగింది. ఈ
పరిస్థితులన్నీ 20వ శతాబ్దంలో పత్రికా రచనను ప్రోత్సహించినవి. అంతకుముందు
చిన్న అచ్చు శాలలు, అవీ కొన్ని పట్టణాలలోన మాత్రమే ఉండినవి. 20వ శతాబ్దం
458
భారత స్వాతంత్ర్యానికి వూర్వం తెలుగులో వత్రికా రచన
ప్రారంభం నుంచి అచ్చుశాలలు అన్ని పట్టణాలలో అవతరించి పెద్దయెత్తున ముద్రణ
కార్యక్రమాల నిర్వహణ ప్రారంభమైనది. సాంఘిక భాషా రంగాలకు మాత్రమే
పరిమితమైన పత్రికలు, రాజకీయరంగానికి కూడ విస్తరించి ముందడుగు వేసినవి.
ఇటువంటి పరిస్థితులలో 1902వ సంవత్సరాన కృష్ణాడిస్టిక్ట్ అసోసియేషన్
పక్షాన మచిలీపట్టణంలో కృష్ణాపత్రిక ప్రారంభమైనది. ఆనాటి దేశ నాయకులలో
ప్రముఖులు, న్యాయవాద శిరోమణులు అయిన దేశభక్త కొండా వెంకటప్పయ్య గారు,
దాసు నారాయణరావుగారు అనే మిత్రునితో కలసి ఈ పత్రికకు సంపాదకులుగా
ఉండిరి. ఈ పత్రిక వందేమాతరం ఉద్యమాన్ని బలపరచినది; రైతుల హక్కుల
కొరకు పోరాడినది; ప్రభుత్వంలోని అవినీతిని ప్రజలకు తెలియజేసి తీవ్రంగా
విమర్శించినది. 1907వ సంవత్సరంలో కొండా వెంకటప్పయ్యగారు న్యాయవాద
వృత్తి అవలంబించడానికి గుంటూరు వెళ్లిపోయి నందున ముట్టూరి కృష్ణారావుగారు
ఈ పత్రికకు సంపాదకులైరి. తెలుగు పత్రికా రచనారంగంలో ఇదొక చరిత్రాత్మకమైన
ఘట్టం. ముట్టూరి కృష్ణారావు గారు తెలుగు పత్రికా సంపాదకులలో సర్వవిధాల
అగ్రగణ్యుడు. ఆయన గొప్ప విద్వాంసుడు, సాహిత్య విమర్శకుడు, కళోపాసకుడు,
వేదాంతి, విజ్ఞాని, మేధావి. అన్నిటికన్న మిన్నగా దేశభక్తుడు. కొన్నిసార్లు కత్తికన్నా
పదునుగా ఉండిన ఆయన కలం జాతీయోద్యమాన్ని, స్వాతంత్ర్య భావాలు సకలాంధ్ర
దేశాన్ని ఉత్తేజ పరిచినవి. తత్ఫలితంగా ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసిన
సంఘటనలు కూడా ఉన్నవి. యువకులకు, రచయితలకు, కళోపాసకులకు కృష్ణాపత్రిక
నూతనోత్సాహాన్ని కలగజేసింది. ఎందరో దేశనాయకులను కృష్ణా పత్రిక సృజించినది.
కృష్ణాపత్రిక అవతరణతో పత్రికారంగంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన నూతన
అధ్యాయం ప్రారంభమైనది.
ఈ సందర్భంలో మరి ఇద్దరు మహా పురుషులను గూర్చి కూడా ప్రస్తావించవలసి
ఉన్నది. 1908వ సంవత్సరంలో బెజవాడ నుండి “స్వరాజ్య” పత్రికను ప్రారంభించి
నడిపిన గాడిచర్ల హరి సర్వోత్తమ రావుగారు ఈ ఇద్దరిలో ఒకరు. సర్వోత్తమరావుగారు
సార్థక నామధేయులు. గొప్ప విజ్ఞాని, మహా విద్వాంసుడు, నిష్కళంక దేశభక్తుడు,
గ్రంథాలయోద్యమ పితామహుడు. మొట్టమొదటి సారి తెలుగుదేశంలో స్వరాజ్యం
కొరకు జైలుకు వెళ్ళిన గౌరవం హరి సర్వోత్తమరావుగారికే దక్కుతున్నది. విద్యార్థి
దశలోనే వందేమాతరం ఉద్యమంలో పాల్గొనినందున రాజద్రోహ నేరం ఆయనపై
459
దా దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
ఆరోపించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను నిర్బంధంలో పెట్టినది. రెండవ
వ్యక్తి ఈనాడు మనము సంస్మరిస్తున్న దేశోద్దారక, విశ్వదాత, కళాప్రపూర్ణ కాశీనాథుని
నాగేశ్వరరావుగారు. ఆ మహనీయుని గూర్చి నేను ఈ ప్రసంగ ప్రారంభంలో కొన్ని
మాటలు చెప్పినాను. తిరిగి ఒకమాటలో చెప్పవలెనన్నచో ఆధునిక ఆంధ్ర నిర్మాతలలో
వీరేశలింగం ప్రక్కన ఉండవలసిన మహాపురుషుడు ఆయన. ఆయన సంపాదకత్వంలో
నేటి 'ఆంధ్ర పత్రిక వారపత్రికగా 1908 ఆగస్ట్ 9వ తేదీనాడు బొంబాయి పట్టణం
నుండి వెలువడినది. తరువాత 1914 ఏప్రిల్ ఒకటవ తేదీనాడు ఆంధ్ర పత్రికను
మదరాసుకు తరలించి క్రమక్రమముగా దీనిని దినపత్రికగా రూపొందించినారు.
సూర్యుని రశ్శివలె ఆంధ్రపత్రిక తెలుగు మాట్లాడే ప్రతి పల్లెకు వెలుతురు
నిచ్చినది. అనేక రచయితలకు, పండితులకు ఆంధ్రపత్రికను నాగేశ్వరరావుగారు
ఉచితంగా పంపినారు. ఆంధ్రపత్రిక పక్షాన సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక,
కళాసాహిత్య రంగాలకు సంబంధించిన ఉత్తమ వ్యాసాలతో సర్వాంగ సుందరంగా
సంవత్సరాది సంచికల ప్రకటనను కూడా నాగేశ్వరరావుగారు ప్రారంభించిరి. నాటికి
నేటికి ఆంధ్రపత్రిక నిరంతరాయంగా నడుస్తున్నదంటే దానికి కారణం
నాగేశ్వరరావుగారి చేతిచలువ, అమృత హృదయమే అని చెప్పవలెను. గాడిచర్ల
హరిసర్వోత్తమరావుగారు ఆంధ్రపత్రికకు సంపాదకులుగా కొంత కాలం పని చేసినారని
ఈ సందర్భంలో ప్రత్యేకంగా చెప్పవలెను. 1923లో నాగేశ్వరరావుగారు “భారతిని
మాసపత్రికగా ప్రారంభించి ఇందులో సాహిత్యానికి, కళలకు, సంస్కృతికి
ప్రాధాన్యమిచ్చి ఎందరో రచయితలను, పండితులను ప్రోత్సహించిరి. భారతి తెలుగు
సాహిత్యానికి యిప్పటివరకు చేసిన, ఈనాటికి చేస్తున్న సేవ నిరుపమానమైనది,
చరిత్రాత్మకమైనది. 1922లో 'శారది అనే మాసపత్రికను మచిలీపట్టణం నుండి
కౌతా శ్రీరామశాస్రిగారు కొంతకాలం అత్యుత్తమంగా నడిపిరి. కాని ఆర్థిక
ఇబ్బందులవల్ల అది కొన్ని సంవత్సరాలలోనే ఆగిపోయినది. 1909-24 మధ్యన
తెలుగుదేశంలో దినపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలు పుంఖానుపుంఖంగా
వెలువడినవి. 'సమదర్శిని' అనే పత్రిక కొంత కాలం వారపత్రికగాను, దినపత్రికగాను
మొదలు పింజల సుబ్రహ్మణ్యశెట్టి, తరువాత గూడవల్లి రామ(బ్రహ్మంగార్ల
సంపాదకత్వంలో వెలువడినది. గూడవల్లి రామబ్రహ్మంగారు “ప్రజామిత్ర అనే
వారపత్రికను కూడా కొంతకాలం నడిపినారు. ఆయన తెలుగు పత్రికా రచయితలలో
460
భారత స్వాతంత్ర్యానికి పూర్వం తెలుగులో వత్రికా రచన
ప్రముఖులు. మాలపల్లి, రైతుబిడ్డ అనే సినిమాలను తీసిన కళోపాసకుడు. సాహిత్యము,
సంస్కృతి, రాజకీయాలు, సంఘ సంస్మరణ, మతం, వ్యాపారము మొదలయిన
సమస్త విషయాలకు సంబంధించినవి ఈ పత్రికలు. మన మిత్రులు, సుప్రసిద్ధులైన
వావిలాల గోపాల కృష్ణయ్యగారు 1930వ సంవత్సరమున భారతికి ఒక వ్యాసం
వ్రాస్తూ తెలుగు పత్రికల సంఖ్యను గూర్చి కొన్ని అంకెలు సిద్ధము చేసినారు. అంకెల
ప్రకారం 1875-1926 సంవత్సరాల మధ్య 516 పత్రికలు వెలువడినవని
తెలిపినారు. కాని ఇందులో చాలా పత్రికలు ఏ కారణం వల్లనో ఎక్కువకాలం
నిలువలేదు. 1940లో వేసిన అంచనా ప్రకారం ఆ సంవత్సరంలో 184 పత్రికలే
మిగిలినవని తెలుస్తున్నది.
1938వ సంవత్సరంలో రామనాథ్ గోయంకా అనే పెట్టుబడిదారు మదరాసులో
“ఆంధ్రప్రభ దినపత్రికను స్థాపించినాడు. దానికి మొదట్లో భాసా సుబ్బారావుగారి
వంటి ఆదర్శజీవి, ఉత్తమ పత్రికా రచయిత సంపాదకులుగా పనిజేసినారు. తరువాత
ఆ పత్రికకు న్యాయపతి నారాయణమూర్తి గారు సంపాదకులుగా ఉండిరి. 1942లో
నార్ల వెంకటేశ్వరరావుగారు ఆ పత్రిక సంపాదకత్వ బాధ్యతలను స్వీకరించి 'ప్రభిను
అత్యుత్తమ స్థాయిలో తీర్చిదిద్దినారు. తెలుగు వత్రికారంగంలో నార్ల
వెంకటేశ్వరరావుగారిది అద్వితీయమైన స్థానం. ఆయన శైలి విశిష్టమైనది.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1959లో నార్ల వెంకటేశ్వరరావుగారు
ఆంధ్రప్రభ అధిపతులతో అభిప్రాయ భేదాలు కలిగినందువలన సంబంధాలు తెగతెంపు
చేసుకొని ఆంధ్రజ్యోతి” అను దినపత్రికను విజయవాడలో స్టాపించిరి.
ఇప్పటివరకు ప్రస్తావించిన పత్రికలు చాలాభాగం మదరాసు నుండి, మరికొన్ని
మచిలీపట్టణం, విజయవాడ మొదలయిన ఆంధ్ర జిల్లాలనుండి వెలువడినవి.
రాయలసీమలోని బళ్ళారి తెలుగు సాహిత్యానికి, సంస్కృతికి చిరకాలం నుండి ముఖ్య
కేంద్రముగా నుండినది. అక్కడనుండి 1835వ సంవత్సరములో 'సత్యదూత' అనే
పత్రికను క్రైస్తవ మిషనరీలు నడిపినారని ఇంతకు ముందే చెప్పినాను. దాని తరువాత
1840లో “వృత్తాంతిని” వత్రిక వెలువడినది. ఇంతకు ముందే మనము
ప్రశంసించుకొన్న గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు రాయలసీమ వారే. ఆయన
కొంతకాలం అనంతపూరు జిల్లాలోని తాడిపర్తి నుండి 'మాతృసేవి అనే పత్రికను
నడిపినారు. ఇది రాయలసీమలోని స్వాతం త్రోద్యమానికి బలమైన చేయూత నిచ్చినది.
461
దా/ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
పప్పూరి రామాచార్యులు గారు భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న దేశభక్తుడు.
ఆయన అనంతపూరు నుండి “హాస్య మంజూష” అనే పత్రికను ప్రారంభించి
కొంతకాలము నడిపినారు. 1930వ సంవత్సరంలో ఆచార్యులుగారు “శ్రీసాధన”
పత్రికను స్థాపించి చాలా కాలము నడిపినారు. ఈ పత్రిక భారత స్వాతంత్రోద్యమాన్ని
బలపరిచినది. ఆచార్యులుగారు మరొక మిత్రునితో కలిసి కొంతకాలము “పినాకిని”
అనే పత్రికను కూడా నడిపినారు. రామాచార్యులుగారి సమకాలికుడు కల్లూరి
సుబ్బారావుగారు కూడా 1920లో ఒక రాజకీయ పత్రికను నడిపినట్లు తెలుస్తున్నది.
వనం శంకరం శర్మగారు నడిపిన “ఇంద్రావతి” ఆ రోజులలో ప్రభుత్వానికి పక్కలో
బల్లెంగా ఉండెను. తరువాత ఆయనే 'హితవాది” అనే పత్రికను నడిపినాడు. మూల
నారాయణస్వామిగారు 'విజయవాణి' అనే పత్రికను అనంతపురం నుండి నడిపినారు.
అవధానం కృష్ణమునిగారు కడప నుండి “బ్రహ్మనందిని” అనే పత్రికను నడిపినారు.
ఇందులో ప్రసిద్ధకవులు దుర్భా రాజశేఖర శతావధాని వంటివారు వ్రాస్తుండేవారు.
1940లో శ్రీ యన్. శంభురెడ్డి గారు కడప నుండి “ఆజాద్ హిందు” అనే పత్రికను
నడిపినారు. ‘దివ్య జీవనం, స్నేహజీవనంి” అనే పత్రికలు మదనపల్లినుండి
వెలువడినవి. ప్రస్తుత రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డిగారు 1940లో “ఆకాశవాణి”
అనే రహస్య పత్రికను నడిపినట్లు తెలుస్తున్నది. రాయలసీమ పత్రికా రచయితతలో
“వాహిని” పత్రికను కొంతకాలము నడిపిన పి, తిమ్మారెడ్డిగారితోపాటు, ఎ.యస్.రామన్
గారిని, విద్వాన్ విశ్వంగారిని, తిరుమల రామచంద్రగారిని, క.సభాగారిని
పేర్కొనవలెను. వీరందరు జాతీయోద్యమాన్ని బలపరిచినవారే. రామాచార్యులుగారు
తెలుగు వచన రచయితలలో గణనీయుడు. ఇంకా రాయలసీమలో అనేక పత్రికలు-
అనంతపురము, కడప, కర్నూలు, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల నుండి వెలువడినవి.
1833 ప్రాంతంలో ప్రారంభమైన తెలుగు పత్రికా జీవితంలో మొదటి
అధ్యాయము 1900 వరకు పూర్తియెనది. ఆరుద్రగారు సేకరించిన సమాచారం
ప్రకారం మొదటి భాగంలో సుమారు 60 పత్రికలకు పైగా ప్రారంభమై నడిచినవి.
రెండవ అధ్యాయమైన 1900 నుండి 47 మధ్యకాలంలో ఈ పత్రికల సంఖ్య ఎన్నో
రెట్లు పెరిగినది.
మాసపత్రికలు, దినపత్రికలు, వారపత్రికలు పుష్కలంగా వెలువడినవి. ఈ
కాలంలో ఒక కోటి తెలుగు మాట్లాడే ప్రజలు నివసిస్తున్న తెలంగాణా ప్రాంతం
462
భారత స్వాతంత్రానికి పూర్వం తెలుగులో వత్రికా రచన
భిన్న పరిపాలనలో 1951 వరకు ఉండెను. ఇంతకు పూర్వం నేను ప్రస్తావించిన
పత్రికలన్నీ రెండు కోట్లకు పైగా తెలుగు ప్రజలు నివసిస్తూ ఉండిన మదరాసు
రాష్ట్రానికి సంబంధించినవి. మదరాసు రాష్ట్రం ప్రత్యక్షంగా ఇంగ్రీషు పరిపాలన క్రింద
ఉండినది. కాని తెలంగాణ ప్రాంతం అప్పుడు, ఇంగ్లీషువారికి పరమ విధేయుడై,
సామంతుడైన నిజాం రాజు క్రింద ఉండెను. మన ఆస్థానకవి వర్ణించినట్లుగా ఆ
నిజాము నిజంగా ప్రజలకు జన్మజన్మాల బూజు. సాంఘిక, సాహిత్య విషయాలను
గూర్చి వ్రాసిన పత్రికలను బ్రిటిష్ ప్రభుత్వం నిరోధించలేదు. కాని నైజాంరాజు ఈ
మాత్రం స్వేచ్చ కూడ తెలంగాణ ప్రజలకు ఈయలేదు. అందుచేత నిజాం
పరిపాలితమైన తెలంగాణాలో ప్రజలలో చైతన్యం కొంత ఆలస్యంగా వచ్చినది. ఇక్కడి
పత్రికా రచన ఇరువయ్యో శతాబ్దంలోనే ప్రారంభమైనదని చెప్పవలెను. క్రైస్తవ
మిషనరీల పత్రికలు తెలంగాణాలో వెలువడలేదు. అచ్చు యంత్రాలు కూడా కొంత
ఆలస్యంగానే వచ్చినవి. వనపర్తి, గద్వాల సంస్థానాలలో ముద్రణశాలలు స్థాపితమై
విస్మృత రాజకవులవంటి కొన్ని అముద్రిత గ్రంథాల అచ్చు జరిగినది. నిజానికి ఈ
ప్రాంతంలోని మొట్ట మొదటి తెలుగు పత్రిక 'హితబోధిని'. శ్రీనివాస శర్మగారి
సంపాదకత్వంలో 1913లో వెలువడినది. కాని ఈ పత్రిక సుమారు ఒక సంవత్సరం
మాత్రమే జీవించినది. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రంలోని తెలంగాణా ప్రజలకు
ఏ విధమైన ప్రాథమిక స్వత్వాలు లేకుండెను. పత్రికలు స్థాపించి నడుపడానికి
కావలసిన స్వేచ్భాయుత వాతావరణం లేకుండెను. ఇటువంటి పరిస్థితులలో 1920వ
సంవత్సరమున రెండు పత్రికలు వెలువడినవి. ఒకటి వరంగల్ జిల్లా మానుకోట
తాలూక ఇనుగుర్తి గ్రామము నుండి వెలువడిన తెనుగు పత్రిక. రెండవది నల్లగొండ
నుండి వెలువడిన “నీలగిరి పత్రిక. తెనుగు పత్రికకు సంపాదకులు ఒద్దిరాజు
సీతారామచంద్రరావు, రాఘవ రంగారావు సోదరులు. ఉభయులు సంస్కృతాంధ్ర
భాషలలోనే కాక ఉరు, ఇంగ్లీషు, ఫారసి భాషలలో కూడ ప్రవీణులు. ఈ పత్రికను
వీరు సుమారు అయిదు సంవత్సరాలు నడిపినారు. నల్లగొండ నుండి వెలువడిన
“నీలగిరి పత్రికకు షబ్బవీస్ నరసింహారావుగారు సంపాదకులు. తెలంగాణను జాగృతం
చేయడానికి వెలువడిన మొట్టమొదటి పత్రికలు ఈ రెండు. తెలంగాణా నుండి
వెలువడిన పత్రికలలో 'గోలకొండి నిస్సందేహంగా ప్రముఖమైనది. సురవరం
ప్రతాపరెడ్డిగారు 1925వ సంవత్సరంలో గోలకొండను ద్వైవార పత్రికగా స్థాపించి
463
దా॥ దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి
1947 వరకు నిర్వహించినారు. గోలకొండ తెలంగాణ ప్రజలను మేలుకొలిపిన
మహా సంస్థ. ఆంధ్రోద్యమానికి, జాతీయోద్యమానికి ఆయువు పట్టుగా ఉండినది
ఈ పత్రిక. ప్రజోపయోగకరమైన ఉద్యమాలను అన్నింటిని సమర్థించిన గౌరవం
గోలకొండ పత్రికకు చెందుతున్నది. బి.ఏ., బి. యల్. పట్టభద్రులై న్యాయవాద వృత్తిని
అవలంబింవక, ప్రభుత్వ ఉద్యోగాన్ని కాంక్షించక, తెలంగాణా ప్రజల
సర్వతోముఖాభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని, సాంఘిక, సాంస్కృతిక రాజకీయ
రంగాలలో జాగృతిని కలిగించిన సువరం ప్రతాపరెడ్డిగారు, తెలుగుపత్రికా
సంపాదకులలో సర్వదా సంస్మరణీయులైన గాడిచర్ల హరి సర్వోత్తమరావు, కాశీనాథుని
నాగేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావుగార్ల ప్రక్క నిలువదగినవాడు. తెలంగాణ నుండి
వెలువడిన సాహిత్య మాసపత్రిక 'సుజాత' మాడపాటి హనుమంతరావు, సురవరం
ప్రతాపరెడ్డిగార్ల ప్రోత్సాహంతో శ్రీ పి.యన్.శర్మగారు సుజాత పత్రికను 1927లో
స్థాపించి కొన్ని సంవత్సరాలు నడిపినారు. 1936 తరువాత తెలంగాణాలో చాలా
పత్రికలు వచ్చినవి. దీనబంధు, దక్కన్‌కేసరి, తెలుగుతల్లి, విభూతి, దివ్యవాణి, తరుణ
ఇందులో పేర్మొనదగినవి. తెలుగుతల్లి పత్రికకు రాచమళ్ళ సత్యవతీదేవి అనే
విదుషీమణి దేశసేవిక సంపాదకురాలుగా పని చేసినది.
భాగ్యరెడ్డిగారు అనే హరిజన నాయకుడు 'భాగ్యనగర్' అనే వారపత్రికను
హైదరాబాదులో సుమారు 15 సంవత్సరాలు నడిపినారు. 1938లో అప్పటి
హైదరాబాదు రాష్ట్రంలో ప్రాథమిక స్వత్వాల కొరకు పోరాటం జరిగినది. ఆ కాలంలో
ఈ పోరాటాన్ని సమర్ధిస్తూ హైదరాబాదులో పత్రికలను స్వతంత్రంగా నడిపే
అవకాశాలు లేనందున శ్రీ బి.యన్. శర్మగారు విజయవాడకు వెళ్ళి అక్కడ నుండి
“ఆంధ్రవాణి'ని నిర్వహించినారు. కమ్యూనిస్టు భావాలను ప్రచారం చేస్తూ “ఆంధ్రకేసరి”
అనే పత్రిక కొంతకాలం నడిచినది. 1943-44లలో 'తెలంగాణ” అనే దినపత్రిక
వెలువడికొన్ని సంవత్సరాలు నడిచినది. ఈ పత్రిక జాతీయోద్యమాన్ని సమర్థించినది.
ఈ కాలంలోనే అడవి బాపిరాజుగారు సంపాదకులుగా 'మీజాన్' అనే తెలుగు
దినపత్రిక ఒక ముస్లిం పెట్టుబడిదారు ఆధిపత్యంలో నిర్వహించబడినది. కాని ఈ
పత్రిక ప్రజల ఆశయాలకు దూరంగా ఉండినది. 1946లో “శోభ అనే సాహిత్య
మాస పత్రికను ప్రారంభించి, కొంత కాలం వరంగల్ నుండి నడిపే అవకాశం
ఈనాటి ఉపన్యాసకునికి లభించినది.
464
భారత స్వాతంత్ర్యానికి వూర్వం తెలుగులో వత్రికా రచన
1938లో ప్రారంభమైన (ప్రాథమిక హక్కుల పోరాటం క్రమక్రమంగా బలపడి
స్టేట్‌కాంగ్రెస్ అవతరించి ప్రజలలో జాతీయ భావాలు ఉప్పొంగినవి. 1947లో
బ్రిటిష్‌వారు మన దేశం నుండి వెళ్ళిపోయి స్వరాజ్య స్థాపన జరిగినది. అయితే
నిజాం రాజు భారత యూనియన్‌లో చేరడానికి నిరాకరించి, దమననీతిని
అవలంబించి ప్రజల ఉద్యమాలను అణచివేయడానికి ప్రభుత్వ బలాలనేగాక రజాకార్లు
అనే ప్రైవేటు సాయుధదళాన్ని కూడా ప్రోత్సహించడం జరిగింది. ఈ పరిస్థితులలో
1947 ప్రారంభంలో గోలకొండ పత్రిక దినపత్రికగా అవతరించినది. అప్పటినుండి
పోలీస్ చర్య జరిగేవరకు సురవరం ప్రతాపరెడ్డిగారు దానికి సంపాదకులుగా ఉండిరి.
అప్పుడే నిజాం కళాశాల నుండి యం.ఏ. పట్టము పొందిన యన్. నరోత్తమరెడ్డిగారు
దీనికి మేనేజింగ్ ఎడిటర్‌గాను, ఆ కాలంలోనే యం.ఏ.పట్టము పొందిన వనపర్తి
సంస్థానాధీశ్వరులు రాజా రామేశ్వరరావుగారు ఈ పత్రిక డైరెక్టర్ బోర్డుకు
అధ్యక్షులుగాను ముందుకు వచ్చి దినపత్రిక నిర్వహణ బాధ్యతను స్వీకరించినారు.
ఈ దినపత్రిక సంపాదక బాధ్యత నిర్వహణలో ఈనాటి ఉపన్యాసకుడు కూడా
పాల్గొనినాడు. గోలకొండ దినపత్రిక భారత జాతీయోద్యమాన్ని, హైదరాబాదు ప్రజల
విమోచనోద్యమాన్ని బలపరిచి 1966 వరకు నడిచినది. 1948 సెప్టెంబర్‌లో
పోలీస్‌చర్య జరిగిన తరువాత తెలంగాణానుండి చాలా పత్రికలు వెలువడినవి.
దేశ స్వాతంత్రోద్యమ ప్రభావం, జాతీయ భావాల ప్రచారం తెలుగు పత్రికల
మీద బాగా పడింది. హరి సర్వోత్తమ రావుగారి స్వరాజ్య పత్రికను గురించి, ఆంధ్ర
కృష్ణాపత్రికలను గురించి మనము మాట్లాడుకొన్నాము. 1920-21వ ప్రాంతంలో
ప్రసిద్ధ సోషలిస్టు నాయకులైన మద్దూరి అన్నపూర్ణయ్య గారు కాంగ్రెస్ అనే పేరుతో
ఒక వారపత్రికను రాజమండ్రి నుండి సత్యాగ్రాహి అనే పేరుతో ఆత్మకూరి
గోవిందాచార్యుల గారు ఏలూరు నుంచి నడిపిరి. ఈ రెండు పత్రికల పైన ప్రభుత్వం
ఆంక్షలు విధించి సంపాదకులను సకల బాధలు పెట్టినది. ఈ పత్రికా సంపాదకులు
ఉభయులు స్వరాజ్య సాధన కొరకు సత్యాగ్రహం చేసి చెరసాలకు వెళ్ళి అనేక బాధలు
అనుభవించిన త్యాగమూర్తులు. జన్మభూమి, వీరభారత్ అనే మరికొన్ని పత్రికలు
ఈ శ్రేణిలో చేరినవే. తెలుగు సాహిత్య పత్రికలు ఎన్నో వెలువడినవి. 'వృత్తాంతిని,
వర్తమాన తరంగిణి, హితవాది, సుజనరంజని, యక్షిణి, ఆంధ్రభాషా సంజీవని,
పురుషార్థ ప్రదాయని, వివేవర్భని” మొదలయిన వాటిని గూర్చి ఇదివరకే
465
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
ప్రస్తావించినాను. ఈ శ్రేణిలో చేరినవే (ప్రబంధ కల్పవల్లి, ఆముద్రిత గ్రంథ చింతామణి,
చింతామణి, విజయవాణి, రత్నాకరము, సరస్వతి, మంజువాణి, వాగ్వల్లి, కళావతి,
ఉదయని, జయంతి, సఖి, ఆంధ్రి, కల్పలత, మనోరమ, అభినవ సరస్వతి, ఆంధ్ర
సాహిత్య పరిషత్ పత్రిక, త్రిలింగ, గ్రంథాలయ సర్వస్వము, ప్రబుద్ధాంధ్ర, సాహితి,
ప్రతిభ, కిన్నెర, పరిశోధన, విభూతి, సుజాత, శోభ మొదలయినవి. ఈ పత్రికలలో
అముద్రిత గ్రంథాలు ప్రకటితమైనవి. సాహిత్యపరమైన రచనలు ప్రకటితమైనవి.
పండితులు, కవులు ఈ పత్రికలలో తమ రచనలను ప్రచురించినారు. సాహిత్యపరమైన
పత్రికలు ఆంధ్ర భాషావికాసానికి చేసినటువంటి సేవ చరిత్రాత్మకమైనది,
అమోఘమైనది.
తెలుగులో హాస్య పత్రికలు కొన్ని వెలువడినవి. చిలకమర్తి లక్ష్మీ నరసింహంగారు
నడిపిన 'దేశమాతిలో ఆయన ప్రహసనాలు ప్రకటితమైనవి. 'నవ్వుల తోటి అనే
పత్రిక కొంతకాలం వెలువడినది. 'వినోదిని, చిత్రగుప్త, ఢంకా, ఆనందవాణి, జ్వాల,
జ్యోతి” మొదలైన వారపత్రికలను ఈ సందర్భంలో పేర్కొనవలెను. ప్రత్యేకంగా పిల్లల
కొరకు “బాలి అనే పత్రిక 1944లో ప్రారంభమైనది. ఈ సందర్భంలో స్త్రీల కొరకు
వెలువడిన కొన్ని పత్రికలను గూర్చి ప్రస్తావించవలెను. 1893లో 'జనానా' పత్రిక
రాజమండ్రి నుండి వెలువడి మొదలు మల్లాది వెంకటరత్నంగారు సంపాదకులుగాను,
తరువాత రాయసం వెంకట శివుడుగారు సంపాదకులుగాను 1900 వరకు
కొనసాగినారు. మొసలి కంటి రామబాయమ్మ గారు సంపాదకురాలుగా 'హిందూ
సుందరి” రాజమండ్రి నుండి 1908 నుండి 1920 వరకు నడిచినది. వింజమూరి
వెంకట రత్నమ్మ గారి సంపాదకత్వంలో 1914లో 'అనసూయ' అనే పత్రిక కాకినాడలో
ప్రారంభమై కొంతకాలము నడచినది. పులుగుర్తి లక్ష్మీనరసమ్మగారి సంపాదకత్వాన
“సావిత్రి” అనే పత్రిక 1910-1918 వరకు నడిచినది. ఇవన్నీ స్త్రీల సమస్యలకు
ప్రాధాన్యమిచ్చిన పత్రికలు. కె.యన్.కేసరిగారి ఆధ్వర్యంలో “గృహలక్ష్మి” 1928లో
ప్రారంభమై 1960 వరకు నడిచినది. (స్త్రీల రచనలను ఈ పత్రిక ప్రోత్సహించినది.
1944లో శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌గారి ఆధ్వర్యంలో “ఆంధ్ర మహిళ
ప్రారంభమైనది. ఫిలిం పత్రికలు తెలుగులో అవతరించినవి.
ఈ ప్రసంగంలో నేను పేర్కొనిన పత్రికలు కొన్ని మాత్రమే. పేర్కొనక విడిచిన
పత్రికలు ఎన్నో ఉన్నవి. ఈ స్వల్ప వ్యవధిలో పత్రికలన్నింటిని పేరు పేరుతో
466
భారత స్వాతంత్ర్యానికి వూర్వం తెలుగులో వత్రికా రచన
పేర్కొనడం సాధ్యమైన పనికాదు. ప్రతి పత్రికను గూర్చి ప్రస్తావించడానికి ఇంతకన్నా
విశాలమైన పరిధి అవసరం. మన దేశానికి స్వాతంత్ర్యం రాక పూర్వం వెలువడిన
పత్రికా వాజ్మయానికి సుమారు 110 సంవత్సరాల వయసు ఉన్నది. ఉజ్వలమైన
చరిత్ర ఉన్నది. త్యాగశోభితమైన ఉదాత్త సంప్రదాయాలు ఉన్నవి. ఈ ఉపన్యాసంలో
నేను పేర్మొన్నట్లు ఈ 110 సంవత్సరాలను రెండు భాగాలుగా విభజింపవచ్చును.
మొదటిది - గత శతాబ్దం వరకు, రెండవది - ఈ శతాబ్దాది నుండి స్వాతంత్ర్య
ప్రాప్తి వరకు. ఈ రెండు దశలలోను వెలువడిన వత్రికలను స్ఫూలంగా
పరిశీలించినప్పటికిని ఇందులో మనజాతి జీవనము సమగ్రంగా ప్రతిబింబితమైనదని
నిస్సందేహంగా చెప్పవచ్చును. విదేశ పరిపాలన నుండి విముక్తి పొంది స్వరాజ్యాన్ని
సాధించడానికి చేసిన కృషి పూర్తిగా యీ పత్రికలలో మనము చూడవచ్చును. 100
సంవత్సరాలకు పైబడిన మన సాంఘిక, రాజకీయ, ఆర్థిక జీవనాన్ని యీ పత్రికలు
పూర్తిగా వివరిస్తున్నవి. జాతీయ జీవనానికి సంబంధించిన ఏ అంశమును కూడా
యీ పత్రికలు విస్మరించలేదు. ప్రజల మనోరథాలను, ఆశయాలను, విశ్వాసాలను,
దౌర్చల్యాలను, కష్టసుఖాలను, సాధక బాధకాలను, పోరాటాలను, సంఘర్షణలను
ఒక్కటేమిటి అన్నింటిని యీ పత్రికలు చిత్రిస్తున్నవి. అన్ని రంగాలలో జరిగిన
వికాసానికి యీ పత్రికలు దర్పణములుగా ఉన్నవి. వాస్తవానికి యీ 110
సంవత్సరాలలో మన దేశాన్ని ప్రజల జీవితాన్ని ఒకసారి సినిమా చూసినట్లు
చూడవలెనంటే అందుకు సాధనమొక్కటే. అదే మన పత్రికలు. తెలుగు పత్రికలను
గూర్చి చెప్పిన మాటలన్నీ ఇంచుమించుగా ఇతర భాషల పత్రికలను గూర్చి కూడా
చెప్పవచ్చును.
తెలుగువారు ఇతర భాషలలోకూడ పత్రికలను నడిపినారు. ముఖ్యంగా ఇంగ్లీషు,
ఉర్దూ భాషలలోని పత్రికలను నడిపిన తెలుగువారిని మనము పేర్కొనవచ్చును.
తెలుగు పత్రికలు ఏ ఆశయాలకు ప్రాతినిధ్యం వహించినవో, తెలుగు సంపాదకులు
నడిపిన ఇంగ్లీషు, ఉర్దూ పత్రికలు కూడా ఆ ఆశయాలకే ప్రాతినిధ్యం వహించినవి.
ఈ 110 సంవత్సరాల కాలం దేశంలో చరిత్ర నిర్మాణం జరిగినకాలం; చీకటి
నుండి వెలుగులోకి అడుగు పెట్టిన కాలం; అవసరమైన సమయాలలో ధైర్య
సాహసాలతో ఎటువంటి ఆపదలనైన ఎదుర్మొని ముందడుగు వేయడానికి జంకని
కాలం; ఉన్నతమైన ఆశయాలతో జాతిని మేలుకొలిపిన కాలం; భవిష్యత్తును గూర్చి
467
డా॥ దేవులవల్లి రామానుజరావు గ్రంథావళి
కలలుగన్న కాలం. ఈ దృశ్యాలన్నీ మన పత్రికలలో ప్రతిబింబిస్తున్నవే. ఆ కాలాన్ని
ఈ కాలాన్ని - ఆనాటి పత్రికలను, ఈనాటి పత్రికలనుపోల్చి పరిశీలించి
సమీక్షించడం అసందర్భం, అనవసరం కాజాలదు. అయితే ఇది ప్రస్తుతాంశము
కాదు.
ఈ నూటపది సంవత్సరాల పత్రికలను గురించి ఆలోచించినప్పుడు వివిధ
దృక్కోణాలనుంచి ఈ పత్రికల చరిత్రను, ప్రారంభ వికాసాలను సమీక్షించడం
అవసరమని తోస్తున్నది. యం.ఏ. పట్టభద్రులైన యువకులు కొన్ని పరిశోధన వ్యాసాలు
వ్రాయడానికి కావలసినంత సామగ్రి పుష్కలంగా యీ పత్రికలలో లభ్యమౌతున్నది.
468
అ9౦పషరాల నమిలి లిగా
. యాఖై సంవత్సరాల జ్ఞాపకాలు డా.దే.రామానుజరావు
. మా వూరు మాట్లాడింది
. పరిణతవాణి (ఏడవ సంపుటి)
. తెలంగాణ చరిత్ర
= సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
. తెలుగు జానపద సాహిత్యము - స్త్రీల గేయములలో సంప్రదాయము
. ఆంధ్ర మహాభారతోపన్యాసములు
. తెలుగు వాగ్గేయకారులు - అన్నమయ్య విలక్షణ వ్యక్తిత్వం
. తెనుగు సాహితి
| స్త్రీల రామాయణపు పాటలు
స
. పరిణతవాణి - 1,2,3,4,5,6 సంపుటాలు (రూ. 36, 45,60, 65, 60, 150)
. ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు
. ఇరివెంటి వ్యాసాలు గ్గ
. శాలివాహన గాథా సప్తశతీసారము
. రాయప్రోలు రచనలు - తత్వవివేచన
. తెలుగు సాహిత్యోద్ధారకులు
. మల్లికా గుచ్చము
. మన జాతినిర్మాతలు
. సుమతి, వేమనే, కృష్ణ శతకాలు
. ఆంధ్ర సారస్వత పరిషత్తు స్వర్ణోత్సవ సంచిక
. ఆంధ్ర సారస్వత పరిషత్తు వజ్రోత్సవ సంచిక
. తెలంగాణలో జాతీయోద్యమాలు
. నా సాహిత్యోపన్యాసములు .
. గౌతమబుద్దుడు - జవహర్‌లాల్ నెహ్రూ
. విమర్శకవతీంసులు
. మన దేశం - తెలుగుసీమ
. మన నదులు - కృష్ణా గోదావరులు
. మధురభక్తి - ముగ్గభిక్తి
. ప్రాచీన కవిత
- ప్రసంగ వ్యాసాలు
. నా రేడియో ప్రసంగాలు
_ సాహిత్యానువాదం : సమాలోచనం
. శివరాత్రే మాహాత్మ్యము
. ఆంధ్ర వాజ్మయ చరిత్ర
. సాహిత్య సోపానములు
. మన హాస్యము
. తెలుగు భాషా సాహిత్య వైశిష్ట్యం
. వ్యాస గుళుచ్చం (1, 2 భాగాలు)
- తెలంగాణలో తెలుగు సాహిత్య వికాసం
తెలంగాణ సారస్వత పరిషత్తు కొన్ని ప్రచురణలు
కదనంలోనూ, కథనంలోనూ మేమే...
డా దేవులపల్లి రామానుజరావు
దా॥ దేవులపల్లి రామానుజరావు (గ్రంథావళి
తెలంగాణ వైతాళికులు డా॥ దేవులపల్లి రామానుజరావు శతజయంతి ప్రత్యేక సంచిక
శేషాద్రి రమణ కవుల పరిశోధన వ్యాసమంజరి
తెలుగు పత్రికలు, ప్రసార మాధ్యమాల భాషా స్వరూపం
తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర
తెలంగాణ గిరిజన భాషా సాహిత్యాలు (వ్యాస సంకలనం)
బంజారాల వివాహ ఆచార పద్ధతులు
మీక్షణం
సంస్కృత పాఠవల్లరి
భారతీయ వాస్తు శిల్ప విజ్ఞానం
కర క కక కక కకక కటక కక కళకి కకక కళకి కకక కకక థకక కక కకక క కిక కకక కక కకక కకక
150/-
100/-
300/-
200/-
200/-
100/-
150/-
200/-
60/-
100/-
40/-
125/-
100/-
70/-